krishna
-
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్‌బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్‌గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్‌పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్‌స్టేషన్‌లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్‌లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్‌గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
‘అయ్యా బోండా ఉమా.. మా పొట్టలు కొట్టొద్దయ్యా’
సాక్షి, విజయవాడ: ఉపాధికి కేరాఫ్‌గా అడ్రస్‌గా విరాజిల్లుతున్న బెజవాడ బిసెంట్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (బోండా ఉమ) అనుచరులు గుండా గిరి చేస్తున్నారు. చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. బీసెంట్ రోడ్డు మధ్యలో బోండా ఉమా అనుచరులు 12 తోపుడు బండ్లు ఏర్పాటు చేశారు.తోపుడు బండ్లకు పోలీసుల్ని బందోబస్తు పెట్టారు.అయితే, బోండా ఉమ అనుచరుల తోపుడు బండ్ల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని బీసెంట్ రోడ్డులోని హాకర్స్ వాపోతున్నారు. సేవ్ బీసెంట్ రోడ్డు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన షాపుల యజమానులు తమ నిరసనలు తెలుపుతున్నారు. బోండా ఉమా అనుచరులు ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బోండా ఉమా పది మంది అనుచరుల కోసం 300 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. బీసెంట్ రోడ్డు యూనియన్ నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తామని బెదిరిస్తున్నారుపోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి మా పై కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. టీడీపీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆ యాడ్‌తో టుక్ టుక్ ఆలోచన వచ్చింది: సి.సుప్రీత్ కృష్ణ
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ(Supreet Krishna) చెప్పారు.హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు.పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు. -
CM Revanth Reddy: తెలంగాణకు నీటి వాటాపై కేంద్ర మంత్రులతో భేటీ
-
AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఏపీలో మూడు స్థానిలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ మరో గంటలో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్..ఇప్పటికే 80శాతం పైగా పోలింగ్ నమోదు.. విశాఖ: కొనసాగుతున్న ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం నమోదుడబ్బులు పంచుతున్న కూటమి నేతలుకాకినాడ..పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకి నోటుఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపగలే డబ్బులు పంచుతున్న కూటమి నేతలుపిఠాపురంలో బరితెగించిన కూటమి నేతలుకూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌కి ఓటు వేస్తే మూడు వేలు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలుమున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు రూ.3 వేలు పంచుతున్న వైనంఓటుకి మూడు వేలు పంచుతున్నా చర్యలు తీసుకోని అధికారులువిశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్..ఆరు జిల్లాల్లో 12 గంటల వరకు 57.71% పోలింగ్ నమోదు..కృష్ణాజిల్లా..ఎమ్మెల్సీ ఎన్నికల పోల్ పెర్సెంటేజ్.....మధ్యాహ్నం 12.00గంటల వరకు..మొత్తం ఓటర్లు: 63,114పోలైన ఓట్లు :19,306పురుషులు: 11,330స్త్రీలు :7,976ఓటింగ్ శాతం: 30.59%. విశాఖ..ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్ హాజరవుతున్న ఉపాధ్యాయులు..విశాఖ జిల్లాలో మొదటి నాలుగు గంటల్లో 44.4 శాతం పోలింగ్ నమోదు..టీడీపీ నేతల బరితెగింపు..కృష్ణాజిల్లా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల ప్రలోభాలుపోలింగ్ కేంద్రాల వద్దే బరితెగిస్తున్న టీడీపీ నేతలుఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ నేతలుపెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలుఓటు వేసేందుకు వెళ్తున్న గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తున్న అధికార పార్టీ నేతలుపోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హల్చల్..కృష్ణాజిల్లా..గుడివాడలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు హల్చల్.నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రమైన ఎస్పీఎస్ స్కూల్ ప్రధాన గేటు ముందు తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు.ఓటు వేసేందుకు వెళుతున్న పట్టభద్రులకు.. కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాము, నేతలు.టీడీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు.గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సీపీఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి.నిబంధన ప్రకారంగా నిర్దేశించిన దూరంలో ఉండాలంటూ టీడీపీ నేతలకు సూచించిన ఆర్డీఓ బాల సుబ్రమణ్యం.ఆర్డీవో వెళ్లిన తర్వాత తిరిగి గేటు వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు.విశాఖ.. 10 గంటల వరకు 21.66 శాతం పోలింగ్ నమోదు..విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ..పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు క్యూ కడుతున్న టీచర్స్...కొనసాగుతున్న 144 సెక్షన్పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్..ఉత్తరాంధ్ర జిల్లాలలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...మొత్తం ఓటర్లు 22,493 మంది...బరిలో 10 మంది అభ్యర్థులు...ఇప్పటివరకు 6% పోలింగ్ నమోదయింది...ఇప్పటి వరకు సమస్యత్మీక ప్రాంతాలు ఏవి గుర్తించలేదుసాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది...90 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నాం.. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.👉పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ 👉ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.👉ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు.👉ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
నాడు వైఎస్సార్, జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. -
నాయనమ్మ కళ్లలోఆనందం చూడాలని
సూర్యాపేటటౌన్ : ‘తన మనవరాలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ తట్టుకోలేకపోయింది. భార్గవి భర్తను ఎలాగైనా అంతమొందించాలని తన ఇద్దరు మనవళ్లను రెచ్చగొట్టింది’అని పోలీసులు చెప్పారు. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆ వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ స్నేహితులు. కృష్ణ తరచు నవీన్ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో నవీన్ చెల్లెలు అయిన భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి పెళ్లికి భార్గవి కుటుంబసభ్యులు అంగీకరించలేదు.భార్గవి, కృష్ణ గత ఏడాది ఆగస్టు 7న నార్కట్‌పల్లి మండలంలోని గోపాలాయిపల్లి గుట్టపై వివాహం చేసుకోగా, భార్గవి తల్లిదండ్రులు సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు కృష్ణ, భార్గవికి కౌన్సిలింగ్ ఇవ్వగా, తాము మేజర్లమని, ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కృష్ణ, భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టారు. మహేశ్‌తో కృష్ణ హత్యకు పన్నాగం వడ్లకొండ కృష్ణ, సూర్యాపేటకు చెందిన బైరు మహేశ్ స్నేహితులు. దీంతో భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీలు బైరు మహేశ్ దగ్గరకు వెళ్లారు. కృష్ణను చంపేయాలని, నువ్వే నమ్మించి ఎక్కడికైనా తీసుకురావాలని మహేశ్‌ను కోరారు. అందుకు మహేశ్ ఒప్పుకున్నాడు. కృష్ణ హత్యకు మూడుసార్లు స్కెచ్ వేయగా అది ఫెయిలైంది. ఆ తర్వాత మహేశ్, నవీన్, వంశీలు ఇటీవల కలుసుకొని.. ఈసారి ఎలాగైనా కృష్ణను చంపాలని నిర్ణయించుకున్నారు.వారి ప్లాన్‌లో భాగంగా ఈ నెల 26న ఆదివారం.. ఇద్దరం కలిసి తమ పొలం దగ్గరకు వెళ్దామని మహేశ్ చెప్పగా కృష్ణ అంగీకరించాడు. పథకం ప్రకారం మహేశ్ వెంటనే నవీన్‌కు ఫోన్ చేసి తాము వస్తున్నం.. అలర్ట్‌గా ఉండమని చెప్పాడు. కృష్ణ స్కూటీపై ఇద్దరూ పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. అయితే, తనకు మూత్రం వస్తుందని చెప్పి మహేశ్ కొద్ది దూరం వెళ్లి నవీన్‌కు ఫోన్ చేసి, తాను కృష్ణ మెడ అందుకోగానే మీరు రావాలని నవీన్, వంశీకి చెప్పాడు. ఇంటికి వెళ్దామని కృష్ణ స్కూటీని స్టార్ట్ చేయగా, మహేశ్ స్కూటీ వెనకాల ఎక్కి కూర్చున్నాడు. కృష్ణ స్కూటీని కదిలిస్తుండగా మహేశ్.. కృష్ణ మెడ చుట్టూ చేయి వేసి గొంతు నొక్కిపట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంప్లచెట్లలో దాక్కున్న నవీన్, వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణను హత్య చేశారు. మనవళ్లను రెచ్చగొట్టి... భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొడుతూ పరోక్షంగా కృష్ణ హత్యకు ప్రేరేపించింది. కృష్ణను హత్యచేసిన తర్వాత మొదట శవాన్ని నాయనమ్మకు చూపించాలని నవీన్ అనుకున్నాడు. తన ఎర్టీగా కారు డిక్కీలో కృష్ణ శవాన్ని వేసుకొని ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మ వద్దకు వెళ్లి చూపించాడు. అక్కడి నుంచి నవీన్ నల్లగొండలోని తన స్నేహితుడు సాయిచరణ్ వద్దకు వెళ్లి కారులో ఉన్న కృష్ణ మృతదేహాన్ని చూపించగా వెంటనే చరణ్ భయంతో కారు దిగి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెర్వుకట్ట చివరలో మూసీ కెనాల్ పక్కన కృష్ణ శవాన్ని పడేశారు. కృష్ణ స్కూటీని కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టారు. అక్కడి నుంచి పాత సూర్యాపేటకు వెళ్లి కోట్ల బుచ్చమ్మ ఉన్న ఇంట్లో పడుకున్నారు. మృతుడి తండ్రి డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరిపి మొత్తం ఆరుగురు నిందితులపై అట్రాసిటీ కేసు, హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై గతంలో పలు కేసులు నిందితులైన ఏ1 నవీన్‌పై గతంలో నాలుగు కేసులు, ఏ2 బైరు మహేశ్‌పై రౌడీషీట్‌తోపాటు తొమ్మిది కేసులు ఉన్నాయి. ఏ3 అయిన నవీన్ తండ్రి కోట్ల సైదులుపై ఒక కేసు ఉండగా ఏ4 కోట్ల వంశీపై మూడు కేసులు ఉన్నాయి. ఏ5 కోట్ల బుచ్చమ్మపై రెండు కేసులు ఉన్నాయి. ఏ6 సాయిచరణ్‌పై ఒక కేసు ఉంది. హత్యకు గురైన కృష్ణ అలియాస్ మాల బంటిపై మూడు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
సాక్షి, హైదరాబాద్: వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి.. కొబ్బరికాయ ముడుపు కడితే వీసాలు ప్రసాదించేది మరో చెట్టు.. చేతులెత్తి మొక్కితే మొండి రోగాలను కూడా నయం చేస్తుందని భక్తులు నమ్మేది ఇంకో చెట్టు.. దోపిడీ దొంగల్ని పట్టించిన మరొక చెట్టు.. ఇలా రాష్ట్రంలో దేనికవే ప్రత్యేకమైన 9 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వట’ ఫౌండేషన్.. ఆయా వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దేశంలోని పురాతన చెట్ల చరిత్రను డాక్యుమెంట్ చేయాలనే లక్ష్యంతో ‘వట’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 27 వేల కి.మీ. ప్రయాణించారు. అతి పురాతన చెట్లను గుర్తించి, వాటిని గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 వృక్షాలను మ్యాపింగ్ చేశారు. మనుగడ కోల్పోయే దశలో ఉన్న వృక్షాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంస్థలు దత్తత తీసుకోవాలని కోరారు.తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..దొంగల్ని పట్టించిన బావోబాబ్..హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో 600 ఏళ్ల నాటి పురాతన బావోబాబ్ చెట్టు ఉంది. గోల్కొండ కోట గోడను ఆనుకొని ఉన్న ఈ వృక్షపు కాండం ఒక రహస్య గది మాదిరిగా ఉంటుంది. ఇందులో 20 మంది దాక్కునేంత కుహరం ఉంది. దీంతో దొంగలు పగటి పూట ఈ రహస్య గదిలో దాక్కొని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరోజు దొంగలు వంట చేస్తుండగా చెట్టు వెనక నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని సైనికులకు తెలపడంతోదొంగల గుట్టురట్టయింది.వరదల నుంచి కాపాడిన చింత..ఉస్మానియా ఆసుపత్రిలో చింత చెట్టు ఉంది. 1908, సెప్టెంబర్ 28న మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దాదాపు 30 వేల మంది మరణించారు. ఆ సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు 150 మంది ప్రజలు ఈ చింత చెట్టు ఎక్కి రెండు రోజుల పాటు కొమ్మలపైనే ఉన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ చెట్టు కిందే ఆసుపత్రి సిబ్బందిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చెట్టుకు రాఖీ..నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని చీమ చింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుంచి ఏటా జూన్ 28న విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టకు రాఖీ కడుతూ పండగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.వేయి ఉరుల మర్రి నిర్మల్‌లోని వేయి ఉరుల మర్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు నాయకత్వంలో స్వయంపాలన ప్రకటించుకున్న గిరిజనులను బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేశారు. రామ్‌జీ గోండును, అతని వేయి మంది సైన్యాన్ని పట్టుకొని ఈ మర్రి చెట్టుకు1860 ఏప్రిల్ 9న అందరినీ ఒకేసారి ఉరి తీసినట్లు జాన పధ కథల్లో చెబుతుంటారు. అందుకే ఈ చెట్టును ‘వెయ్యి ఉరుల మర్రి’గా పిలుస్తుంటారు. అయితే కాలక్రమేణా ఈ వృక్షం నరికివేతకు గురి కావడంతో ఇక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.రోగాలు మాన్పించే వృక్షం..చేవెళ్లలోని దామరిగిద్దలోఉన్న చింత చెట్టు 600 ఏళ్ల నాటిది.ఈ పురాతన చింత చెట్టుకు ఒక బొరియఉంటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలుఈ బొరియ గుండా వెళితే రోగం నయమవుతుందని గ్రామస్తుల విశ్వాసం.పర్యాటక పిల్లలమర్రి..మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి సుమారు 800 ఏళ్ల నాటి భారీ వృక్షం. ఒకప్పుడు 4 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ, ఆక్రమణ కారణంగా ప్రస్తుతం 2.5 ఎకరాలకు పరిమితమైపోయింది. ఈ చెట్టును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతానికే పిల్లల మర్రి అనే పేరు వచ్చింది. వేల కొద్ది మర్రి ఊడల కారణంగా ప్రధాన కాండం ఏదో స్పష్టంగా గుర్తించలేం.వీసాలు ప్రసాదించే మర్రి హిమాయత్‌సాగర్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం ఎలాగైతే వీసా గాడ్‌కు పేరు గాంచిందో.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని మర్రి చెట్టు కూడా వీసాల చెట్టుగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు ఎరుపు లేదా తెలుపు రంగు గుడ్డలో కొబ్బరికాయ కట్టి ఈ చెట్టుకు ముడుపు కడితే వీసా వస్తుందని స్థానికుల విశ్వాసం. అయితే వడగళ్ల వర్షం కారణంగా ఈ భారీ వృక్షం నెలకొరిగింది. చుట్టుపక్కల నివాసితులకు ముప్పుగా మారడంతో గ్రామస్తులు వృక్షంలోని ఎక్కువ భాగాన్ని నరికివేశారు. కేవలం 15 అడుగుల వరకు విస్తరించి ఉన్న భారీ కాండం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. జహీరాబాద్‌లోని గొట్టిగారిపల్లి గ్రామంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టు, నిజామాబాద్‌లోని ఆర్గుల్ గ్రామంలోనిఒక కొండపై ఉన్న మూడు పురాతన చింత చెట్లు కూడావందల ఏళ్ల నాటి వృక్షాలే. చారిత్రక గుర్తింపుతో ఆయావృక్షాలు పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. -
నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ?
ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళాకు లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో పటిష్టమైన భద్రత అవవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూపీ సర్కారు మహాకుంభమేళా భద్రతా బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించింది. ఈయన గతంలోనూ పలుమార్లు వార్తల ప్రధానాంశాల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకే ఈ కీలక భాధ్యతలు ఎందుకు అప్పగించారు?ఐపీఎస్ వైభవ్ కృష్ణ(IPS Vaibhav Krishna).. ఈయన అజంగఢ్ డీఐజీ. ఇప్పుడు ఇతనిని ప్రభుత్వం మహాకుంభ్ డీఐజీగా నియమించింది. uppolice.gov.in వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైభవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నివాసి. ఆయన 1983 డిసెంబర్ 12న జన్మించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైభవ్‌కృష్ణ 2021, డిసెంబర్ 20న పోలీసుశాఖలో ప్రవేశించారు.వైభవ్ కృష్ణ మొదటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. 12వ తరగతి తర్వాత ఐఐటీలో అడ్మిషన్ దక్కించుకున్నారు. ఐఐటీ రూర్కీ(IIT Roorkee)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2009లో తొలిసారిగా యూపీఎస్సీ పరీక్షకు హాజరై 86వ ర్యాంక్ సాధించారు. ఈ నేపధ్యంలోనే వైభవ్‌కృష్ణ యూపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.ఐపీఎస్ వైభవ్ కృష్ణ తన ఉద్యోగ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2020 జనవరి 9న నోయిడాలో ఎస్ఎస్పీగా ఉన్నప్పుడు వైభవ్ కృష్ణ ఒక కేసులో సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత 2021, మార్చి 5న తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. మూడు నెలల తరువాత ఆయనకు లక్నోలోని పోలీస్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ(Police Training and Security) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.అనంతరం 2012 జూన్‌లో ఐపీఎస్ వైభవ్ కృష్ణ అజంగఢ్ జోన్ డీఐజీగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన బల్లియాలో రైడ్ నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు 18 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇటీవల యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఐపీఎస్ వైభవ్ కృష్ణకు మహాకుంభమేళా బాధ్యతలు అప్పగించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే.. -
కూటమి కక్ష సాధింపు.. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు!
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..
మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది. అలాగే కర్నాల్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. భక్తురాలిగా మార్పు ఎలా అంటే..2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. (చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!) -
అవంతిలాంటి నేతలు ఎంతమంది పార్టీని వీడినా నష్టం లేదు: ఆల్ఫా కృష్ణ
-
అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యతనీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం -
విద్యుత్ షాక్‌కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
తుంగభద్రలో ఏటా 699.34 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీకర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.అధ్యయనంలో వెల్లడైన అంశాలివి⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.⇒ సబ్ బేసిన్లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి. ⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది. ⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
దుర్గ గుడిలో కాదంబరీ జత్వానికి రాచ మర్యాదలు
సాక్షి,విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో కాందాంబరి జత్వానికి రాచమర్యాదలు చేశారు ఆలయ అధికారులు. చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వానీ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు. ఎమ్మెల్యే,ఎంపీ కాకపోయినా దగ్గరుండి వీఐపీ దర్శనం చేయించారు. పోలీసులపై కేసుపెట్టిన జత్వానీకి పోలీసుల సాయంతో దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ దర్శన సమయం ముగిసినా..వీఐపీ దర్శనం కల్పించారు. చీటింగ్ కేసు నిందితురాలికి వీఐపీ దర్శనం కల్పించిన పోలీసులు,ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో భక్తుల అసహనంమరోవైపు ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలు కావడంతో భారీగా మొత్తంలో సిఫార్సు లెటర్స్ భక్తులు భారీగా క్యూకట్టారు. దీంతో క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రూ.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లోనే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. రూ.500 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారంటూ క్యూలైన్లలోని భక్తులు పోలీసులు,అధికారులతో వాగ్వాదానికి దిగారు. రూ.500 రూపాయలు ఎందుకు పెట్టారంటూ మండిపడుతున్నారు. -
గంగ కంటే కృష్ణ మిన్న
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే. కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.గోదావరి బేసిన్లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. -
కమెడియన్ గౌతం రాజు తనయుడు హీరోగా కొత్త మూవీ
టాలీవుడ్లో కొంతకాలంగా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ కమెడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈయన కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇది కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే అతడు ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టు సమాచారం. ఇదే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో నాలుగైదు చిత్రాలున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని టాక్! -
ప్రేమలో పడ్డాక...
నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
Krishna Floods: వరదల నుంచి కోట వంటి రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. మోయగలిగినన్ని సామాన్లు సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపే‹Ùగుప్తానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి.వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిరి్మంచారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కలి్పంచడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. -
Hyderabad: భార్య చూస్తుండగా భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం
మేడ్చల్: మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ (42) తన భార్య కవిత (37), కుమార్తెలు వర్షిత (12), వరిణి (8)లతో కలిసి అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్ –మనోహరాబాద్ రూట్లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండటంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెళ్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటల సమయంలో చేరుకున్నారు. భార్య, పిల్లలను స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్లాట్ ఫాంపై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్ చివరిలో ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద కూతురు, కవితకూడా ట్రాక్‌పై దిగి కృష్ణ పనిచేస్తున్నవైపు నడుస్తున్నారు. 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్‌కు చేరింది. అక్కడ స్టాప్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతు రును పట్టుకుని ట్రాక్‌కు ప్లాట్ ఫాంకు మధ్యలో గోడవైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురును రైలు ఢీకొట్టింది. కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లను కూడా రైలు వేగంగా ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు. ట్రాక్‌పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్టేషన్లో ఉన్న వారు కవిత చిరునామా తెలుసుకుని బంధువు లకు, అపార్ట్మెంట్ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు
‘ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా.. మన మాతృభూమిని మరవకూడదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. జన్మభూమికి సేవ చేసేందుకు ముందుకు రావాలి. ముఖ్యంగా విద్యా రంగంలో చేసే సేవ.. భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళమిచ్చాను. అదే విధంగా పాఠశాల స్థాయిలోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను’ అని అంటున్నారు.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త డాక్టర్ కృష్ణ చివుకుల. ఇంత భారీ విరాళంతో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..ఎంతో కొంత తిరిగివ్వాలి.. మనం పుట్టి పెరిగి, మన అభివృద్ధికి పునాది వేసిన మాతృభూమికి.. ఎంతో కొంత తిరిగివ్వాలి అనేది నా ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తు తరాలు ఎదిగే అవకాశం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో నేను ఐఐటీ మద్రాస్‌కు విరాళమిచ్చాను. 74 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాను.మా సంస్థ నంబర్‌వన్ పరిశ్రమగా ముందుకెళుతోంది. ఆదాయం విషయంలో ఆందోళన లేదు. అందుకే.. నేను చదివిన ఐఐటీ మద్రాస్‌కు, అక్కడి విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడేలా విరాళమిచ్చాను.విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే దేశాభివృద్ధికి తోడ్పడినట్టే.. విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే.. భవిష్యత్తులో అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందనేది నా నమ్మకం. ఎందరో విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులతో.. ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఇలాంటి వారికి తోడ్పడితే ఉన్నత విద్యావంతులుగా రూపొందుతారు. తద్వారా నిపుణులైన మానవ వనరుల కొరత కూడా తీరుతుంది. ఇది సంస్థల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఇతర పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని ఆశిస్తున్నాను.స్వదేశంలో చదువులకే ప్రాధాన్యమివ్వాలి.. ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు.. విదేశీ విద్య కోసం యూఎస్, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి స్వదేశంలో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలనేది నా అభిప్రాయం. 1.3 బిలియన్ జనాభా ఉన్న మన దేశంలో 10 లేదా 11 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్లినా.. ఆందోళన చెందక్కర్లేదు. అయితే వారు తమ చదువు పూర్తయ్యాక మన దేశానికి తిరిగొచ్చి సేవలు అందించాలి. మేం చదువుకునే రోజుల్లో ఇన్ని మంచి విద్యా సంస్థలు లేవు కాబట్టే నేను అమెరికా వెళ్లాను. పెట్టుబడిదారులు ముందుకు రావాలి.. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకెళుతోంది. అమెరికా ఆర్థిక పురోగతి మందగమనంలో ఉంటే.. మన ఆర్థిక పురోగతి దినదిన ప్రవర్థమానమవుతోంది. ఇదే చక్కని సమయంగా భావించి పెట్టుబడిదారులు ముందుకు రావాలి. మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి, ఉద్యోగ కల్పన, దేశ అభివృద్ధికి సహకరించాలి.ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి.. యువతలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్నారు. ఇందుకోసం పరిశోధనలపై దృష్టి పెడుతున్నారు. అయితే.. వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే వ్యాపార ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి. కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా.. సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఆలోచనలు చేయాలి.ఆత్మవిశ్వాసంతో కదలాలి.. యువత ముఖ్యంగా.. జెన్–జెడ్ వారు ఏ పని తలపెట్టినా, ఎందులో అడుగుపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. తమపై తాము నమ్మకంతో వ్యవహరించాలి. చేయగలమా? లేదా? అనే మీమాంసతో ఉంటే అడుగులు ముందుకు పడవు. ఇది అంతిమంగా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో అడుగులు వేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.కష్టపడటమే.. విజయానికి సూత్రం.. నేటి తరం విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుతాయని గుర్తించాలి. చదువుకునే సమయంలోనే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు పొందేలా కృషి చేయాలి. సర్టిఫికెట్ల కోసం కాకుండా.. శ్రేష్టత కోసం చదవడం ముఖ్యమని గుర్తించాలి.కృష్ణ చివుకుల గురించి..ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. విద్యాభ్యాసం విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఐఐటీ బాంబే నుంచి బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్), ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. తుమకూరు యూని వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. 1976లో అమెరికాలోని హాఫ్మన్ ఇండస్ట్రీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1990లో న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. 1997లో.. ఇండో– యూఎస్ ఎంఐఎం టెక్నాలజీ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. దీన్ని మెటల్ ఇంజక్షన్ మోడలింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు.దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు..ఇప్పుడు మన విద్యా రంగం ఉన్నతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఐటీలు, ఎన్ఐటీలతోపాటు మరెన్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.వీటిని మరింత అభివృద్ధి చేస్తే.. మరింత నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి.మంచి వేతనాలు అందించాలివిదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న విషయం.. వారికి భవిష్యత్తులో లభించే వేతనాలు. మన దేశంలో చదువుకున్నవారికి కూడా మంచి వేతనాలు అందించేలా పారిశ్రామికవేత్తలు, సంస్థలు అడుగులు వేయాలి. నైపుణ్యాలకు అనుగుణంగా ఆకర్షణీయ వేతనాలివ్వాలి. ప్రతిభావంతులను నియమించుకుంటే సంస్థలను వృద్ధి బాటలో నడిపించొచ్చు. ఇది కార్యరూపం దాల్చితే యువత దేశంలోనే చదువుకునేందుకు ముందుకొస్తారు. -
బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల.. ఐఐటీ మద్రాసుకు 220 కోట్ల భారీ విరాళ ప్రకటన!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్'ను నెలకొల్పారు.మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.దాతృత్వంలో మేటి..కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డు అందజేశాయి.బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. -
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
నేడో రేపో ఆల్మట్టి గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద తీవ్రత మళ్లీ పుంజుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం నాటికి 45 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా, నిల్వలు 95.22 టీఎంసీలకు చేరుకున్నాయి. జల విద్యుదుత్పత్తి ద్వారా ఆల్మట్టి నుంచి 9,730 క్యూసెక్కులను దిగువన నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.వర్షాలు, వరదలు కొనసాగితే ఒకటీ రెండురోజుల్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేసే అవకాశముంది. దీనికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.72 టీఎంసీలున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ గేట్లను ఎత్తే అవకాశముంది.దీంతో తెలంగాణలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. ఎందుకంటే జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర బేసిన్లోనూ వర్షాలుకృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లోనూ వర్షా లు కురుస్తుడడంతో తుంగభద్రకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర æద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరతాయి. -
'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?
బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' ప్రభంజనం మొదలైంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ కాలంలో మహాభారతాన్ని సినిమాల్లో చూపించారు. ఇన్నాళ్లకు మళ్లీ 'కల్కి'లో దీనికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. 3 గంటల సినిమాలో దాదాపు అరగంట పాటు మహాభారత సన్నివేశాల్ని చూపించారు. అయితే అశ్వద్ధామ, అర్జునుడు, కర్ణుడు.. ఇలా ఆయా పాత్రలతో పాటే కృష్ణుడి పాత్ర కూడా చూపించారు. కానీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇంతకీ ఆ నటుడెవరు? ఇలా ఎందుకు చేశారో తెలుసా?'కల్కి' మూవీలో మహాభారతం సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. టైటిల్స్ పడుతున్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం, అశ్వద్ధామకి కృష్ణుడు శాపం ఇవ్వడం లాంటి సీన్స్ చూపించి నేరుగా కథలోకి వెళ్లిపోయారు. మళ్లీ కీలకమైన క్లైమాక్స్‌లో క్రేజీ ట్విస్ట్ రివీల్ చేసి మెంటలెక్కించారు. అయితే అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అతడి రథసారధిగా కృష్ణుడికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. కానీ కృష్ణ పరమాత్మ ముఖాన్ని నీడలా చూపించారు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)'కల్కి'లో కృష్ణుడి పాత్ర చేసింది తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్. గతంలో వచ్చిన 'ఆకాశమే హద్దురా' మూవీలో సూర్యకి ఫ్రెండ్‌గా ఇతడు నటించాడు. స్వతహాగా నటుడు, నిర్మాత, దర్శకుడు, మ్యూజీషియన్ అయిన ఇతడికి 'కల్కి'లో కృష్ణుడి పాత్ర దక్కడం అదృష్టమనే చెప్పాలి. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలోనూ చెప్పుకొచ్చాడు. దీన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చాడు. ఈ పాత్రకు ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తెలుగులో డబ్బింగ్ చెప్పాడు.ఇకపోతే 'కల్కి' నిర్మాత అశ్వనీదత్.. స్వర్గీయ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఆయనతో తొలి సినిమా తీశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫొటోలోనూ ఎన్టీఆర్ కృష్ణుడి రూమపే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఆయన్ని తప్పితే మరొకరిని ఊహించుకోలేం. బహుశా అందుకేనేమో 'కల్కి'లో ముఖం చూపించకుండా మేనేజ్ చేసి ఉంటారు!(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)Ashwathama attacking krishna.. Krishna punching ashwathama.. Pure cinema😭😭 E scene vachaka literally goosebumps vachayi ikkadanunchi mahabharat okkate chupinchina question cheyakunta chusevadni.. Aa music aa aura.. Big screen pyna mahabharatam🙏pic.twitter.com/BsWYIPtn5i— Dagads (@Dagads_) June 27, 2024 -
కృష్ణ జయంతి.. మిస్ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్ అవుతున్నా..హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్ వివి వినాయక్.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024 -
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్‌లోని మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను కనుగొంది’ అన్నారు.ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖడాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది. -
టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
సాక్షి, కృష్ణా: ఏపీలో ఎన్నికల సందర్భంగా పచ్చ బ్యాచ్ రెచ్చిపోయింది. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై భౌతిక దాడులకు దిగారు. కాగా, ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు ఏడుకొండలు అరాచకం సృష్టించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిందన్న కారణంగా వేముల సంధ్యా రాణి అనే ఓటర్ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో సంధ్యా రాణి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న పిన్నమనేని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యా రాణిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ పరామర్శించారు. ఆమెను కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఆ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
నాన్నను అలా చూడటం ఇప్పటికీ గుర్తుంది: మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 1974లో రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై మే 1వ తేదీ నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. నాన్న నటించిన చిత్రంపై ప్రశంసలు కురిపించారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' నాన్నగారిని తెరపై గంభీరమైన లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చూసినా మొదటిసారి చూసినట్లే ఉంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం, తెలుగు సినిమాపై నా ప్రభావాన్ని గుర్తుచేసుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఈ ఏడాది గుంటూరు కారంతో అభిమానులను అలరించిన మహేశ్‌బాబు.. నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. #50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️ pic.twitter.com/CdhAfSr0OI— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2024 -
అల్లూరికి అర్ధ శతాబ్దం
‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్ వాహినీ స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్ ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు. అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్ హిట్. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా, ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’ తీయను’’ అన్నారు ఎన్టీఆర్.మహారథి చేతికి స్క్రిప్ట్ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్‌మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. -
లోక్‌సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీళ్లే
-
Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్
కుప్పంకు కృష్ణా జలాలు అందాయి. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ... సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగం మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేవుడి దయతో ప్రజలందరిక చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకొంటున్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకొంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజునేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆ నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా. కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. మీరందరూ చూశారు. కొత్త కాదు. 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు. 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు. ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు గానీ వీరికి మంచి నీళ్లు ఎలా అందించాలి, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబు. కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు ఇచ్చి పనులు జరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నా.. మీరందరూ నావాళ్లే. బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం. ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇదీ కాదా? అని అడుతున్నా. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా 1400 కోట్లు. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది. మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరికది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూల్లో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా ఇచ్చే పెన్షన్ నే తీసుకుంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థే లేదు. అరకొర పెన్షన్ రూ.1000 కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు. మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30 వేల మందికి ఇస్తుంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 45374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు హయాంలో 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా 507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు. ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి. వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేస్తే, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్లు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు 172 కోట్లు ఇచ్చాం. మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో 30 కోట్లు. దీని వల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59662 మంది అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో చదివించే తల్లులు 35951 మందిని ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. బాబు హయాంలో కుప్పంలో ఇళ్లు మంజూరు చేసింది పేదలకు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45-60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19921 మందికి మంచి జరిగిస్తూ వారి కుటుంబాల ఖాతాల్లోకి పంపింది 85 కోట్లు. వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే. ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో 7002 మందికి అందించిన సాయం 28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17552 మందికి మంచి జరిగిస్తూ 64 కోట్లు నేరుగా ఇచ్చాం. పేదవాడి కోసం, పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు. అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు. మనందరి ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్ష్ మెంట్ ఇస్తూ 12093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది. ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి. బాబు ఎలాంటి వాడో తెలుసుకున్న చంద్రగిరి ప్రజలు.. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం. ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా. భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా. ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా. 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?: సీఎం జగన్
Live Updates 12:30PM, Feb 26th, 2024 సీఎం జగన్ ప్రసంగించడానికి వచ్చిన సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ దద్దరిల్లిన సభా ప్రాంగణం సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాను కేవలం అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు? ప్రజలనె మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు మీ బిడ్డను గెలిపిస్తేనే పేదవారికి మంచి జరుగుతుంది కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా? కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమం కుప్పంలో జరుపుకుంటున్నాం ఒక పండుగ వాతావారణంలో జరుపుకుంటున్నాం కొండలు,గుట్టలు దాటుకుని, ఏ రకంగా 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించింది. ఎక్కడ కుప్పం.. ఎక్కడ శ్రీశైలం 672 కి.మీ దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి, ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించడం కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజే 2022, సెప్టెంబర్ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభకు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే .. ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసింది కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా, మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేయడానికి మరో రెండు రిజర్వాయులు ప్రారంభించడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అందుకు సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడు. అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించేలా ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్.. వెల్లూరు సీఎంసీ మెడికల్ కాలేజ్ దాన్ని అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు ఈ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టును ముందుకు వెళ్లకుండా చేస్తే.. దాన్ని పునః ప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది రూ. 14 వందల కోట్లు. రూ. 14 వందల కోట్లును ఈ కుప్పం నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం ఇక్కడున్న ప్రతీ ఒక్కరికి చెబుతున్నా మీరు బ్యాంకులకు వెళ్లండి.. చంద్రబాబు పాలనకు సంబంధింది ఐదేళ్లు స్టేట్మెంట్, మీ బిడ్డ జగన్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోండి బాబుగారి పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని చూసుకోమని అడుగుతున్నా అదే మీ బిడ్డ ప్రభుత్వ పాలనలో మీకు జమ అయిన నగదును కూడా ఆ స్టేట్మెంట్లో చూసుకోమని చెబుతున్నా.. మరి ఎవరిది మనసున్న పాలన.. ఎవరిది పేదల ప్రభుత్వమన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం కులం, మతం, ప్రాంతం,పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించాం కుప్పంలో 44,888 మహిళలకు రూ. 172 కోట్లు ఇచ్చాం పెన్షన్ల కోసం క్యూలెన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం ప్రతినెలా ఇంటికే వచ్చివలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచి 45,374 మందికి ఈ కుప్పం నియోజకవర్గంలో అందిస్తున్నాం కుప్పంలో 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్సన్ ఇచ్చారు.. అది కూడా వెయ్యి రూపాయలే. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 1400 వలంటీర్లతో సేవలు అందిస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం కుప్పంలో 44, 640 రైతులకు రూ. 214 కోట్లు రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26వేల కోట్లు అందించాం కుప్పంలో 35951 మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి ఇచ్చాం కుప్పంలో 15, 727 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చాం ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని చెప్పడానికి గర్విస్తున్నా వైఎస్సార్ చేయూత ద్వారా 19, 921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం కుప్పంలో 108 వాహనాలు అందించాం కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17552 మందికి ఆరోగ్య సేవలు అందించాం ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం 12:10PM, Feb 26th, 2024 వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్ ఆ తర్వాత సీఎం జగన్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 12:02PM, Feb 26th, 2024 కుప్పం శాంతిపురం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ 11:22AM, Feb 26th, 2024 హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు కృష్ణమ్మ స్వర్శతో పరవశించిపోతున్న కుప్పం 11:18AM, Feb 26th, 2024 కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ 11:01AM, Feb 26th, 2024 కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 10:04AM, Feb 26th, 2024 ► కాసేపట్లో కుప్పానికి సీఎం జగన్ ►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ 9:21AM, Feb 26th, 2024 ►కుప్పం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ►కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్న ముఖ్యమంత్రి జగన్ ►కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ►కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ►ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. -
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని, అధికారాన్ని గుంజుకోవడాన్ని ఏమంటారు? మోసం.. ద్రోహం.. వంచన అనే కదా! నోట్ల కట్టలతో దొంగ ఓట్లతో మూడు దశాబ్దాలుగా నెగ్గుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా ఖజానాను దోచేసిన మనిషిని నమ్మక ద్రోహి అనే కదా అంటారు! రాజకీయ అరంగేట్రంలోనే చంద్రబాబు ఫోర్ ట్వంటీ వేషాలు వేయడంతో సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి ప్రజలు తరిమికొట్టారు. గత్యంతరం లేక వలస వెళ్లిన కుప్పంలోనూ ఆయన అవే వేషాలు వేశారు! ఏడుసార్లు తనను గెలిపించిన కుప్పాన్ని తన కమీషన్ల కోసం తాకట్టు పెట్టి.. నీళ్లివ్వకుండా ఎండగట్టారు! సాక్షి, అమరావతి: కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలించి సాగు, తాగునీరు అందిస్తానని నమ్మబలికిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆ ముసుగులో ఖజానాను దోచేసి పనులు చేయలేక చేతులెత్తేసి నయవంచనకు పాల్పడ్డారు! తన కమీషన్ల కోసం సొంత నియోజకవర్గం కుప్పంను తాకట్టుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు. బాబు ఇలా మోసం చేస్తే, 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మేలు చేస్తున్నారు. పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇప్పటికే రామకుప్పం మండలం వరకూ కృష్ణా జలాలను తరలించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులు నింపి సమృద్ధిగా సాగు, తాగునీరు అందించనున్నారు. పురిటిగడ్డకు ద్రోహం సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రబాబు నాడు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడి చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ దెబ్బకు 1985 ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పంచన చేరి 1989లో తమిళనాడు, కర్ణాటక, రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి గూండాయిజం, నోట్ల కట్టలు, దొంగ ఓట్లతో నెగ్గుకొస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం లో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీరు అందిస్తానని చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంపాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు (పంప్ హౌస్‌లు) దశల్లో ఎత్తిపోసి 123.641 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని నమ్మించారు. అంచనాల్లోనే రూ.120 కోట్ల లూటీ! కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కి.మీ. పొడవున తవ్వేందుకు 98,85,140 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 3,84,457 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టిపనికి రూ.89, క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనికి రూ.3 వేలు చొప్పున వ్యయం అవుతుంది. ఈ లెక్కన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు ఖర్చు అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. 2015–16 ధరల ప్రకారం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.293.11 కోట్ల వ్యయం అవుతుంది. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015 మేలో అంచనాలు రూపొందించారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే టెండర్ల దశలోనే రూ.120 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. కడప టీడీపీ అధ్యక్షుడికి కానుక.. అంచనా వ్యయం పెంచేసిన పనులను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఆ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.413 కోట్లు అంచనా విలువగా నిర్ణయించి 2015 ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు పెట్టారు. టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక(ఎక్సెస్) ధరకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే షెడ్యూలు (సింగిల్ బిడ్) దాఖలైతే ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలి. కానీ చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్కే ఇన్ఫ్రాకు 4 శాతం అధిక ధరకు రూ.430.26 కోట్లకు పనులు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.43 కోట్లు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి వాటిని బాబు జేబులో వేసేశారు. సీఎం రమేష్ పేచీతో చెరిసగం.. శ్రీనివాసరెడ్డికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చుతూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కట్టబెట్టడంపై అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేచీ పెట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ఒత్తిడి చేయడంతో దిగివచ్చి న చంద్రబాబు చీకటి పంచాయితీ చేశారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు 50 శాతం పనులు, మిగతా 50 శాతం పనులు సీఎం రమే‹Ùకు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్కు సబ్ కాంట్రాక్టు కింద ఇవ్వాలని ఆదేశించారు. ప్రధాన కాంట్రాక్టర్‌పై వేటు.. ‘సబ్’కే మొత్తం చెరి సగం పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్ క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీ లబ్ధి పొందుతూ వచ్చారు. వారి వద్ద నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకుంటూ వచ్చారని టీడీపీ నేతలే అప్పట్లో ఆరోపించారు. తనతోపాటు శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున లబ్ధి పొందుతుండటాన్ని సహించలేని సీఎం రమేష్ మొత్తం పనులను తనకే కట్టబెట్టాలని మరోసారి పేచీకి దిగారు. దీంతో పనులన్నీ రిత్విక్ ప్రాజెక్టŠస్కే కట్టబెట్టాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డిపై వేటు వేసి సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్ ప్రాజెక్టŠస్కే మొత్తం పనులు అప్పగించేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. సీఎం జగన్ అధికారం చేపట్టాక ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కుప్పంను మున్సిపాల్టీని చేశారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. మున్సిపాల్టీతోపాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ యుద్ధప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేయించారు. ఇప్పటికే కుప్పం బ్రాంచ్ కెనాల్ 74 కి.మీ. వరకూ అంటే రామకుప్పం మండలం మనేంద్రం గ్రామం వరకూ కెనాల్ నీటిని తరలించారు. చెరువులను నింపి సాగు, తాగునీరు అందించనున్నారు. రూ.460.88 కోట్లు నీళ్ల పాలు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. నాసిరకమైన పైపులు వేయడం వల్ల వర్షపునీటికే పగిలిపోయాయి. దీన్ని బట్టి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో సీఎం రమేశ్ తో కలిసి చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో విశదం చేసుకోవచ్చు. వరుసగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా అందించకుండా చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు. పాలార్‌కు మోకాలడ్డు కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా కుప్పం మండలం గణేశపురం వద్ద పాలారు నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.55 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ పనులను 2005లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రిజర్వాయర్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల మందికి తాగునీరు అందించేలా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఉనికి లేకుండా పోతుందని ఆందోళన చెందిన చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. పాలారు రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, దాని నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వంతో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. పాలార్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అప్పట్లో ఆ పనులు ఆగిపోయాయి. -
ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సీతాఫలం, రామా ఫలం గురించి విన్నాం కానీ ఇదేంటి కృష్ణఫలం?. ఔనండి! మీరు విన్నది నిజమే. మనకు నిజంగానే దీని గురించి పెద్దగా తెలియదు గానీ దీని వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఇది ఉష్ణమండల పండు, ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్ ఆకారంలో ఉంటుంది. దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ'సీగా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా ఊదా లేదా తిక్ మెరూన్ కలర్లో లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు ఇది శక్తిమంతమైన ఫైబర్ మూలం. పిసిటానాల్' అనే సమ్మేళనం మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగూ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుంది ఈ పండులో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. అందువల్ల దీని తీసుకుంటే అంధత్వం రాదు. పైగా కంటి పనితీరు మెరుగుపడుతుంది. అంతేగాదు బరువును తగ్గించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. నిజానికి, కృష్ణఫలం సారం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పెరిగిన శరీర బరువు, కొవ్వు పదార్ధం , గ్లూకోస్ టాలరెన్స్ ద్వారా ఈ లక్షణాలు సులభంగా మెరుగుపడతాయి. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఇందులో కేన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. (చదవండి: మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!) -
కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణమ్మ జలాలు
-
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గర్వపడేలా ‘కృష్ణ విజయం’
సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం". అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలి, సూర్య, గీతా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నిర్మాతలు ఎస్.వి.శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ పాల్గొని, చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి ముందు "కృష్ణ విజయం" చిత్రాన్ని కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కు ప్రదర్శించారు. ఈ సందర్భంగా "గుంటూరు కారం" సాధిస్తున్న సంచలన విజయాన్ని పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్ననలు అందుకుంటున్న మధుసూదన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ ఫ్యాన్స్ అంతా గర్వపడేలా "కృష్ణ విజయం" చిత్రాన్ని తీర్చి దిద్దిన మధుసూదన్ అభినందనీయులని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణను దర్శకత్వం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా చిత్ర దర్శకుడు మధుసూదన్ పేర్కొన్నారు. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్ని పాటలు భాస్కరభట్ల రాశారని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తామని మధుసూదన్ తెలిపారు. -
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చివరి మూవీ రిలీజ్‌కి రెడీ
సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' సినిమాతో మహేశ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే టాక్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి.. ఓ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. మహేశ్ సినిమాపై వస్తున్న మిక్స్డ్ టాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) "గుంటూరు కారం" సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణ ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్‌లోనూ ఉందని చెప్పారు. కానీ ఫ్యాన్స్‌తోపాటు అందరూ ఆస్వాదిస్తున్న 'గుంటూరు కారం' గురించి ఘోరంగా మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ గతేడాది మరణించారు. కాకపోతే ఆయన నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం" ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇందులోనే 'గుంటూరు కారం' ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేశారు. మధుసూదన్ హవల్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ జరుగుతోంది. ఈ మూవీలో నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?) -
Jaya Krishna Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు (ఫోటోలు)
-
ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే ఏపీకి రుణాలు: దువ్వూరి కృష్ణ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. కాగా, దువ్వూరి కృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేపదే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తే వారు నమ్ముతారని భావిస్తున్నారు. జర్నలిస్టులు కూడా విలువలు పాటించకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు రూ. 1,18,050 కోట్లు కాగా, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2.71 లక్షల కోట్లకి అప్పు చేర్చింది. ఇక, 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.4కోట్లకు చేరుకున్నాయి. టీడీపీ హయాంలో ప్రతీ ఏటా 20 శాతం అప్పు పెరగగా.. ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42 శాతం మాత్రమే. ఏపీ రుణాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నాం. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవే. విద్యుత్ డిస్కంల అప్పు విభజనకి ముందు రూ.2893 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.21,541కోట్లకి పెరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ అప్పులు రూ.11,602 కోట్లకు అప్పులు తగ్గాయి. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు విభజన నాటికి 32,596.27 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.91,137కోట్లకి పెరిగాయి. ఇక, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,09,094 కోట్లకి మాత్రమే పెరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్ధల అప్పులు గత ప్రభుత్వంలో 30.74 శాతం పెరిగితే ఈ ప్రభుత్వంలో 5.79 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా చట్ట విరుద్దంగా అప్పులు ఎలా చేయగలుగుతాం. కేంద్ర పరిమితులకి లోబడే అప్పులు. అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులు సైతం అప్పులు ఇస్తాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.1,53,346 కోట్ల అప్పులు 2019 నాటికి రూ.4,12,288 కోట్లకి పెరిగాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.2,58,941 కోట్లు అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదు. ఈనాడు పత్రిక రాసే వార్తల్లో నిజం లేదు. -
కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలని సూచించారు. బందరు అభివృద్ధి రవీంద్ర చేసిందేమిటో తాను చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్ విసిరారు. కాగా, పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడమనే ఒక శాపం ఇచ్చాడు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు. మదర్సా స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. మీ హయాంలో పోర్ట్ కట్టకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్. పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్ కాలేజ్ నీ హయంలో అంటున్నావ్. ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్. నువ్వు కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా?. ఇస్తే చూపించు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పేర్ని నాని చలవే. ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్‌ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం. కానీ, నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి. నేను నా కొడుకుని క్రొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి?. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. -
సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
Krishna 1st Death Anniversary: నేడు కృష్ణ తొలి వర్ధంతి (ఫోటోలు)
-
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
నేడు కృష్ణ తొలి వర్ధంతి.. మరో సాయానికి శ్రీకారం చుట్టిన నమ్రత
ఆంధ్రా జేమ్స్‌బాండ్, లెజెండరీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వీడి ఏడాది గడిచిపోయింది. నేడు ఆయన తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన వారసుడిగా ప్రిన్స్ మహేశ్ బాబు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఘట్టమనేని అనే పేరుకు గౌరవాన్ని తీసుకొచ్చారు. వారి కుటుంబంలో కృష్ణ గారి నుంచి మహేశ్, సితార,నమ్రత,గౌతమ్ అందరిలో ఒక పాయింట్ కామన్‌గా కనిపిస్తుంది. అదేమిటంటే..? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. పేదల భవిష్యత్ కోసం తమ వంతు సాయం చేయడం ఇవన్నీ ఘట్టమనేని కుటుంబంలో కనిపిస్తాయి. కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా తాజాగా నమ్రత మరో బృహత్కార్యాన్ని తలపెట్టారు. పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు వారు ముందుకొచ్చారు. ఇప్పటికే ఘట్టమనేని వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో పేదల కోసం ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇలాంటి లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో నిర్వహిస్తున్నారు. సుమారు 3వేలకు పైగా చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇలా ప్రకటించారు. మామయ్య గారి పేరుతో వారికి సాయం: నమ్రత మామయ్య గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశాం. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్ తీసుకుంటుంది. వారు ఎంత వరకు చుదువుకున్నా.. అందుకు అయ్యే పూర్తి ఖర్చులు మేమే చూసుకుంటాం. ప్రస్తుతం నలుగురు విద్యార్థులను సెలక్ట్ చేశాం. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం.' నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేం. మాకు చేతనైనంత వరకు పేద విద్యార్ధులను చదవించి వారి అందమైన భవిష్యత్‌కు దారి చూపించాలనేది మా లక్ష్యం.' అని నమ్రత తెలిపారు. ఘట్టమనేని ఫ్యామిలీలో సాయం చేయడం, సాటి వ్యక్తిని ఆదుకోవడం ఈనాటిది కాదు. గతంలో తన సినిమాలతో నష్టపోయిన నిర్మాతలకు కృష్ణ గారు మరో సినిమా ఛాన్స్ ఇచ్చేవారు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఆయన నటించేవారు. ప్రస్తుతం ఆయన వారసుడు కూడా మరో అడుగు ముందుకేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో గొప్ప పనులు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరినో ఆదుకున్నారు. తండ్రిని చూసి ఎన్నో మంచి గుణాలను మహేశ్ బాబు కూడా అలవరుచుకున్నారు. మహేశ్‌ను చూసి సితార,గౌతమ్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలు, పేద పిల్లలను ఆదుకోవడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగానే తాజాగా స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని నమ్రత ప్రకటించారు. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
విజయవాడలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటుచేసిన నటశేఖరుడి విగ్రహాన్ని అభిమానుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్,విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. ఆయన ప్రిన్స్ మహేశ్ బాబు- కృష్ణ అభిమానుల ఆహ్వానం మేరకు కమల్ హాసన్ అక్కడకు హాజరయ్యారు. గత రెండురోజులుగా ఇండియన్-2 చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతుంది. సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కమల్ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారికి కృష్ణ కుటుంబ సభ్యులు తరపున దేవినేని ఆవినాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో కృష్ణ -మహేశ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్. అయన నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటు ప్రజలకు సేవ చేస్తూ.. కృష్ణ గారి గౌరవాన్ని నిలబెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజల తరపునే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున కమల్ హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!
ఇటీవలే మంత్ ఆఫ్ మధు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ బర్త్ డే జరుకుంటున్న మంజుల తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది తండ్రితో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ..' ప్రతి పుట్టిన రోజుకు మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. తొలిసారి ఆయన లేకుండా నా బర్త్ డే జరుగుతోంది. ఈ ఫోటోల్లోని క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నాన్నతో ఉన్న ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి.' అంటూ ఎమోషనలైంది. ఈ ఫోటోల్లో కృష్ణతో పాటు మహేశ్ బాబు, నమ్రత, ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు. కాగా.. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేశ్ బ్రదర్ రమేష్ బాబు, ఇందిరమ్మ కూడా గతేడాదిలోనే కన్నుమూశారు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
ఓ ఆత్మ ప్రతీకారం
వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం. ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ విన్, కెమెరా: నగేశ్. -
Krishna Rama Movie Actors Photos: ‘కృష్ణారామా’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మనోరంజన్ కాదు.. పబ్ రంజన్..ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు
‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ (గోపరాజు రమణ). ‘బీర్ ఓకే’ (కిరణ్ అబ్బవరం) అనే సంభాషణలతో మొదలవుతుంది ‘రూల్స్ రంజన్’ ట్రైలర్. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా ఆఫీస్‌లో వీకెండ్స్ వస్తే నన్ను ఏమంటారో తెలుసా.. మనోరంజన్ కాదు.. పబ్ రంజన్ అంటారు (కిరణ్ అబ్బవరం), ‘ఈ రూల్స్ రంజన్ పంబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్, సహనిర్మాత: రింకు కుక్రెజ. -
సినిమా ఇండస్ట్రీలో ఈ గురుశిష్యుల బంధం గురించి తెలుసా?
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురుపూజోత్సవం సందర్భంగా వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. తన డైరెక్షన్‌తో పాటు రైటింగ్స్‌తో టాలీవుడ్లో ఓ మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుక్కూ లాగానే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నారు.తొలి సినిమాలతోనే బ్లాక్బస్టర్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు. ► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్‌కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. ► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు ► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. ► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ► ఇండస్ట్రీలో స్టార్ రైటర్‌గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేస్తున్నారు. ఆర్జీవీ ఫ్యాక్టరీలో ఎందరో... ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సంగీత ప్రపంచంలో సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్,మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్‌జై శంకర్లు కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు. సూపర్ స్టార్ కృష్ణకు గురువు ఎవరంటే... కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు. కమల్ హాసన్‌కు వారిద్దరూ గురువులే అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్ - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్‌హాసన్.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్ కూడా కమల్‌కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి- విశ్వనాథ్‌ల గురు శిష్యుల బంధం తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కోసం వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఎవరంటే?) -
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
అపర భగీరథుడు
సాక్షి, అమరావతి: దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్‌తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. -
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) -
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన మహిళా డైరెక్టర్.. ఆమె ఇంటిని చూశారా?
విజయనిర్మల ఈ పేరు తెలుగువారి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతలా తన పేరు తెలుగు సినీ పరిశ్రమలో లిఖించుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై మెరిశారు. తన ఏడో ఏటనే మత్స్యరేఖ అనే సినిమా ద్వారా బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 42 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. కృష్ణతో వివాహం ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం కాగా.. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టమని.. అందుకే కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారని తెలిపింది. అంతకుముందే విజయ నిర్మలకు కేఎస్ మూర్తితో వివాహం జరిగింది. వీరికి నరేశ్ సంతానం. ఆమె జూన్ 27న 2019లో కన్నుమూశారు. కాగా.. గతేడాది నవంబర్‌లో కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఎటు చూసిన అవార్డులే అయితే హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని మీరెప్పుడైనా చూశారా? హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో దాదాపు 12 ఏకరాల్లో ఆమె ఇంటిని నిర్మించారు. అప్పట్లోనే డైరెక్టర్‌గా తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. అంతలా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఆమె ఇల్లు కూడా అవార్డులతో నిండిపోయింది. ఆమె అక్కడే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఉండేవారు. ఈ ఇంట్లో ప్రస్తుతం నరేశ్, ఆయన కుమారుడు నవీన్ ఉంటున్నారు. ఆమె ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే గార్డెన్తో అన్ని రకాల వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించారు. అంతే కాకుండా ఆమెకు గిన్నిస్ అవార్డ్ వచ్చిన విషయాన్ని శిలాఫలకం తయారు చేయించారు. -
స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతా వృక్షం.. రాత్రయితే అంతులేని అందాల విందు!
స్వర్గం ఎంత అందంగా ఉంటుందో మనం అనేక కథల రూపంలో వినేవుంటాం. స్వర్గం నుంచి దిగివచ్చే అప్సరసలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారని కొందరు అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా స్వర్గం నుంచి దిగివచ్చిన వృక్షం గురించి విన్నారా? అవును.. ఇప్పుడు మనం స్వర్గపు వృక్షం అంటే పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి. యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు.ఈ తరహా పారిజాత వృక్షం భారతదేశంలోని కింతూర్ గ్రామంలో మాత్రమే కనిపించడం విశేషం. ఇది కూడా చదవండి: తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి.. -
తల్లి కర్మకాండలకు వెళ్లొస్తూ..
చెన్నూరు: తల్లి కర్మకాండలకు వెళ్లి తిరిగి వస్తూ కొడుకు, అతని కుమారుడు, అత్త దుర్మరణం చెందగా, భార్య, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే కొండేటి కృష్ణ(48) తన తల్లి కర్మకాండల నిమిత్తం భార్య విజయరాణి, కుమార్తె నిహారిక, కుమారుడు రిషి(15), అత్త అన్నే పద్మావతితో కలిసి తిరుపతి వెళ్లారు. కర్మకాండల కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపానికి రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, పద్మావతి, రిషి అక్కడికక్కడే మృతి చెందగా, విజయరాణి, నిహారికలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం -
మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!
'పోకిరి'తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి.. 'భరత్ అనే నేను' మూవీతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి.. 'సర్కారు వారి పాట'తో ఓపెనింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించి.. తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడు. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు. అతడే ప్రిన్స్ మహేశ్ బాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలే ఈ స్టోరీ. తెలియకుండానే సినిమాల్లోకి మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్ నటించి, మెప్పించారు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్!?) చదువుకు బ్రేక్ స్కూల్ హాలీడేస్ రాగానే షూటింగ్స్‌లో మహేశ్ పాల్గొనేవాడు. అలా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం సినిమాలు చేశాడు. తర్వాత మహేశ్ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. పదో తరగతిలో అనుకునన్ని మార్కులు రాకపోవటంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ రాలేదు. కనీసం డిగ్రీలో అయినా అక్కడ సీటు సంపాదించాలని ఇంటర్లో కష్టపడి చదివి ఆపై మంచి మార్కులు సాధించి అనుకున్నట్లే లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ సీటు సాధించాడు. అక్కడ చదువుతున్న టైంలో మళ్లీ సినిమాలవైపు మనసు లాగింది. ఇంకేముంది ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పడం. దానికి కృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. అప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు. వాటికి మాత్రం నో తెలుగులో ఇప్పటివరకూ ఒక్క రీమేక్ సినిమాలో నటించని హీరో మహేశ్. బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా 'తెలుగు' చిత్రాల్లోనే నటిస్తానని వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. మహేశ్‌లో నిర్మాత కూడా ఉన్నాడు. అడివి శేష్ తో 'మేజర్' సినిమా తీసి, హిట్ కొట్టాడు. మహేశ్‌కు చాలా ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. గతంలో ఓసారి ఇదే చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలనే కోరిక ఉందని అన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు. (ఇదీ చదవండి: మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!) తండ్రిని మించినోడు కొన్ని విషయాల్లో తండ్రి సూపర్ స్టార్ కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. కృష్ణ కెరీర్లో 350కి పైగా సినిమాల్లో నటించినా ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు రాలేదు. మహేశ్ మాత్రం కేవలం 27 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్నాడు. 'రాజకుమారుడు'తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్.. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు. కృష్ణ నట జీవితంలో మొత్తం 350పైగా చిత్రాల్లో కేవలం రెండు జూబ్లీస్ ఉన్నాయి. అవి పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. మహేశ్ కెరీర్లో నాలుగు చిత్రాలు డైరెక్ట్‌గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు. ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35MMలో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ఆ తరువాత కూడా మహేశ్‌కు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారువారిపాట వంటి సూపర్ హిట్స్ దక్కాయి. తొలిసారిగా కొన్న ఫోన్ మహేశ్‌కు ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టమట. కానీ సోషల్ మీడియాకు ఆయన దూరంగానే ఉంటారు. తొలిసారిగా ఆయన ఎంతో ఇష్టంగా నోకియా క్లాసికల్ మోడల్ (కీ ప్యాడ్) కొన్నారు. ఇప్పటికీ ఆయన తరచూ ఫోన్లను మారుస్తూ ఉంటారు. ముఖ్యంగా తన తండ్రి కృష్ణతో మాత్రమే సెల్ఫీ దిగేందుకు ప్రిన్స్ ఇష్టపడతారు. స్వతహాగా దాతృత్వం చాటుకోవడంలో మహేశ్ 'శ్రీమంతుడు'. తండ్రిపై ప్రేమతో కృష్ణ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణలో కూడా సిద్ధాపురం గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్ని ఆయన భారీగా అభివృద్ధి చేశారు. అలాంటి మహేశ్‌బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ 'హ్యాపీబర్త్‌డే ప్రిన్స్ మహేశ్'..! (ఇదీ చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) -
రాబరీ నేపథ్యంలో జీరో బడ్జెట్ మూవీ
కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1134’. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో రాంధుని క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు నందు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నేను, శరత్ చంద్ర ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కులదైవం వంటి వారు. వాళ్లే జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. ఇప్పుడు శరత్ తీసిన జీరో బడ్జెట్ సినిమా ‘1134’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభకోణాలను ఈ మూవీలో చూపించాను’’ అన్నారు శరత్ చంద్ర తడిమేటి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మురళి కార్తికేయ, కెమెరా: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి. -
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
ఇంకా మొదలుకాని వరదలు.. జలాశయాలు వెలవెల
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మొత్తం 386.8 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 285.21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆల్మట్టి డ్యాంలో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 91.35 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు డ్యాంకు గత మంగళవారం నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం 19,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో డ్యాంలోకి వచ్చి చేరుతోంది. రోజుకు 1.66 టీఎంసీల వరద ఆల్మట్టిలో చేరుతుండగా, మరో 108 టీఎంసీల వరద వచ్చిచేరితేనే డ్యాం నిండనుంది. ఇక నారాయణపూర్ జలాశయంలో 17 టీఎంసీలు, తుంగభద్ర డ్యాంలో 6.89 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. జూరాలకు ఇంకా మొదలుకాని ఇన్‌ఫ్లో నారాయణపూర్, జూరాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదు. శ్రీశైలంకు 126 క్యూసెక్కుల నామమాత్రపు వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు రానుంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడం, ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ డ్యాంలు ఇప్పట్లో నిండే సూచనలు కనపడటం లేదు. ప్రాణహితకి స్వల్పంగా పెరిగిన వరద.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాణహిత నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రస్తుతం 1,23,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,19,878 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి వస్తున్న 83,945 క్యూసెక్కులను వచ్చినట్టు కిందికి పంపిస్తున్నారు. -
రిటైర్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం
-
IRS అధికారి ఇంట చోరీ కేసులో కొత్త కోణం.. ఎస్ఐ కృష్ణ స్కెచే ఇది..
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతం కేసులో ఎస్ఐ కృష్ణనే సూత్రదారిగా పోలీసు అధికారులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి రూ.100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇక, ఈ కేసులో సురేందర్‌ను విచారించడంతో వెలుగులోకి ఎస్ఐ కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 30న శామ్యూల్‌కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. ఇక, ఈ డాక్యుమెంట్లను కృష్ణకు అందించాడు సురేందర్. కాగా, సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు.. సురేందర్ చోరీ చేసన సొమ్ముతో గోవా వెళ్లి క్యాసినో ఆడినట్టు తెలిపాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు చెప్పాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎస్ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. ఎస్ఐ కృష్ణా, సురేందర్‌ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కృష్ణ నటించిన ఆఖరి చిత్రం.. 16 సంవత్సరాల తర్వాత రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆఖరి చిత్రం `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం`. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మధుసూదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు మాట్లాడుతూ.. 'గత నాలుగు రోజులుగా కృష్ణగారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కృష్ణ గారు చాలా గ్లామర్‌గా ఉన్నారు, ఎనర్జిటిక్‌గా నటించారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... 'దర్శకుడు మధుసూదన్ నాకు మంచి మిత్రుడు. కన్నడలో ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం` ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా, కలర్ ఫుల్ గా ఉంది. ఇటీవల `మోసగాళ్లకు మోసగాళ్లు ` చిత్రం రీ-రిలీజ్ అవగా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ చిత్రం కూడా అదే విధంగా ఆడాలని కోరుకుంటున్నా`` అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు మాట్లాడుతూ... 'మే 31 అంటే కృష్ణ గారి అభిమానులకు పెద్ద పండగే. అంతటా ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారు లేకుండా జరుగుతోన్న మొదటి పుట్టిన రోజు ఇది. ఆయన గురించి నేను `దేవుడులాంటి మనిషి` పుస్తకం రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఒక రోజు పిలిచి రీ ప్రింట్ చేయమన్నారు. వేసే లోపే దురదృష్టవ శాత్తూ ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కొన్ని మార్పులు చేర్పులతో ఆ పుస్తకాన్ని త్వరలో తీసుకొస్తున్నా' అన్నారు దర్శకుడు హెచ్ మధుసూదన్ మాట్లాడుతూ... 'డైరెక్టర్ గా నా తొలి సినిమా వంశం. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఈ క్రమంలో శ్రీపాద్ హంచాటే గారు పిలిచి కృష్ణ గారితో సినిమా చేద్దామన్నారు. సంతోషంతో ఓకే చేశాను. 2007లో సినిమా పూర్తయింది. విడుదల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా రిలీజ్ కాలేదు. ఈ లోపు నేను కన్నడలో చాలా పిక్చర్స్ డైరెక్ట్ చేశాను. కానీ కృష్ణ గారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలనుకున్నా. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మార్చి నేనే విడుదల చేస్తున్నా. ఈ నెలలోనే విడుదల చేస్తా. కృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అన్నారు. -
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. -
బందరు పోర్టుకు శంకుస్థాపనపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం (బందరు) పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంకుస్థాపన చేశామని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంఖుస్థాపన చేశాం. 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహ… pic.twitter.com/qLCV0k6Oxp — YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మిస్తున్నామని అన్నారు. కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్టును జాతీయ రహదారి-216కి, అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైనుకి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. కాగా, మచిలీపట్నం ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం సీం జగన్ తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. చదవండి: ఆయన కోరుకున్న అమరావతి అలాంటిది మరి!.. బాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన -
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..) -
టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..
సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ విధులకు ఆటకం కలిగించడం , అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై గౌతమ్ కుమార్ వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 341, 285, 290, 506, R/w 34 కింద వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. -
నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు. హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది. యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు. -
రైతుకు సాయంగా..
ప్రాజెక్టు పేరు: నేల తేమ–నీటి పారుదల రూపకర్త: బి. శిరీష, జెడ్పీహెచ్ఎస్, నిడమానూరు ఈ ప్రాజెక్టు వ్యవసాయంలో సహాయం చేస్తుంది. పంటలకు నీటి తడులు వేసేందుకు దోహదం చేస్తుంది. మట్టి సెన్సార్ ద్వారా నేల ఎండిపోయినప్పుడు అది స్వయంచాలకంగా పంటలకు నీరు పోస్తుంది. రైతులకు డబ్బు, శక్తి, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. -
చంద్రబాబు హయాంలో కన్నా ఇప్పుడు చేసిన అప్పు తక్కువే: దువ్వూరి కృష్ణ
-
త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు..
కృష్ణా: మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వేలో భాగంగా దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల దక్షిణ మధ్య రైల్వేలైన్ పనులు పూర్తి కావడంతో ఇటు తెలంగాణ ప్రజలతో పాటు కర్నాటక, గోవా రాష్ట్రాల మధ్య రాకపోకలకు, వర్తక, వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మొట్టమొదట 2017లో దేవరకద్ర నుంచి జక్లేర్ గ్రామం వరకు 28.3 కిలోమీటర్లు రూ.943 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. తర్వాత జక్లేర్ నుంచి మక్తల్ వరకు 11.5 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులను 2020లో, ఆ తర్వాత మక్తల్ నుంచి మాగనూర్ వరకు ఉన్న 13.3 కిలోమీటర్లను 2022 మార్చిలో, మాగనూర్ నుంచి కృష్ణా వరకు ఉన్న 12.7 కిలోమీటర్లను 2023లో పూర్తి చేశారు. ఈనెల 6న సికింద్రాబాద్, గుంతకల్ డీఆర్ఎంలతో పాటు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ప్రణవ్ సక్సేనా ఆధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తి కావడంతో ఇక మీదట అన్నిరకాల రైళ్లు నడిపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ధారించారు. గతంలో 6గంటలపాటు ప్రయాణించి హైదరాబాద్ చేరేవారు, ప్రస్తుతం 3గంటల్లోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది. త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు.. కాచిగూడ నుంచి కృష్ణా వరకు రైలును త్వరలోనే ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కర్నాటకలోని రాయచూర్, బళ్లారి, గుంతకల్, హుబ్లి, గోవాకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా, ప్రజా రవాణాలకు ఈ దారి ఎంతో ఉపయోగంగా మారనుంది. నిత్యం వందల సంఖ్యలో రాయచూర్ నుంచి హైదరాబాద్ వరకు వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణా వాహనాలు రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు రైల్వేలైన్ అందుబాటులోకి రావడం ఎంతో తోడ్పడనుంది. ఇక్కడి రైతులు పండించే ధాన్యం, కూరగాయలు, పండ్లు అటు హైదరాబాద్, ఇటు కర్నాటకలోని రాయచూర్‌కు తరలించేందుకు వీలు కలుగనుంది. అభివృద్ధికి తోడ్పాడు.. మునీరాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడంతో మక్తల్ నియోజకవర్గం అన్ని రకాలుగా వేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా తక్కువ సమయంలో గమ్యం చేరుకునేందుకు వీలు కలుగుతోంది. మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నా హయాంలో పూర్తికావడం ఆనందంగా ఉంది. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్‌ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్‌లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్‌చరిత మానస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం. దానికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు.మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్ ఎమోషనల్ అయ్యారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. -
ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలి : సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 5వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభిమానులకు కోసం పాసులు పంపిణీ చేయడంతో పాటు 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కృష్ణ కుటుంబసభ్యులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు స్టేజ్ పేనే బోరున ఏడ్చేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. ఈనెల 15న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూపర్ స్టార్‌కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబసభ్యులకే కాదు, అభిమానులకు సైతం తీరని శోకాన్ని మిగిల్చింది. -
సూపర్ స్టార్ కృష్ణ పేరుతో అవార్డు
‘‘సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ ప్రదానం చేస్తాం’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (మా ఏపీ)’ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా – ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రజా బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’కు జ్యూరీ ఎంపిక చేస్తుంది. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్‌బాబుతో చర్చించిన అనంతరం తెలియజేస్తాం’’ అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు దూరంగా ఉన్న నాగార్జున.. కారణమిదేనా?
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. కృష్ణ ఇక లేరనే వార్త తెలియగానే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని చివరిసారి చూసి ఆయనకు నివాళులు అర్పించారు. వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల దగ్గర్నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే నాగార్జున మాత్రం చివరి చూపుకు హాజరుకాకపోవడంపై పెద్ద చర్చే నడిచింది. కృష్ణ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నాగార్జున.. అంత్యక్రియలకు వెళ్లవడపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సందేహాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ తెరదించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాగార్జున హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గతంలో ఈవీవీ, దాసరి వంటి ప్రముఖులు కన్నుమూసినప్పుడు కూడా నాగార్జున అక్కడికి వెళ్లలేదు.సాధారణంగా మనకు దగ్గరివారిని కోల్పోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు. ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారిని అలా నిర్జీవంగా చూడలేరు. అందుకే నాగార్జున కూడా పలు సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరు కాకపోయినా ఆ తర్వాత వెంటనే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కారణంగానే కృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు నాగార్జున వెళ్లి ఉండకపోవచ్చు' అంటూ పేర్కొన్నారు. -
కృష్ణ-మహేష్ బాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్
-
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడానికి కారణమిదే!
సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలోకి నెట్టివేసింది. వెండితెరపై 350కు పైగా సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆ నటశేఖరుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఆయనకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి సొంతంగా వారి ప్రైవేట్ స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
కృష్ణ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న ఆ హీరోని ఆదుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ సాహసాల హీరో మాత్రమే కాదు.. మంచి మనుసున్న వ్యక్తి కూడా. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆయన నుంచి సహాయాన్ని పొందినవారిలో సీనియర్ హీరో హరనాథ్ కూడా ఉన్నారు. కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానోక సమయంలో హరనాథ్ మద్యానికి బానిస అయ్యాడట. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అవకాశాలు తగ్గాయట. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ దీంతో హరనాథ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇక దిక్కతోచని స్థితిలో హరనాథ్ కృష్ణను కలుసుకోవడానికి పద్మాలయ స్టుడియోస్కి వెళ్లారట. ఆయన వచ్చిన విషయాన్ని సిబ్బంది కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఆయనే స్వయంగా కిందికి వెళ్లి హారనాథ్ను లోపలికి తీసుకువెళ్లి మాట్లాడారట. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారట. అంతేకాదు కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచుకున్నారట. ఈ క్రమంలో ఆయనకు ధైర్యం చెప్పి.. పెద్ద మొత్తంలో డబ్బును ఆయన చేతిలో పెట్టారట కృష్ణ. అలా తన కోస్టార్‌ను కష్టాల్లో ఆదుకుని ఆయన మంచి మనసు చాటుకున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. -
సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ఈ రికార్డులు టచ్ చేయడం అసాధ్యం..
-
Super Star Krishna: వైజాగ్ అందుకే ఆయనకు ప్రత్యేకం..
సాహసానికి ఊపిరి ఆగిపోయింది. తూటాల్లా డైలాగ్స్ పేల్చిన కంఠం మూగబోయింది. నింగిలోకి మరో ధ్రువతార చేరింది. సినీ ప్రయోగశాల.. తెలుగు సినీ పరిశ్రమస్థాయిని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన మహర్షి సూపర్‌స్టార్ కృష్ణ.. ఉమ్మడి విశాఖ జిల్లాతో ఎన్నో జ్ఞాపకాలను పెనవేసుకున్నారు. ఆయన సినీ జీవితంలో 350కు పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు చింతపల్లి ప్రాంతంలో చిత్రీకరించారు. విశాఖ– భీమిలి బీచ్‌రోడ్డు, యారాడ బీచ్‌లో చాలా సినిమాలు షూటింగ్‌లు జరుపుకున్నాయి. మనిషిగా బతకడం అంటే.. మన చుట్టూ ఉన్న నలుగురిని బతికించడం అని నమ్మిన సూపర్‌స్టార్‌కు ఉమ్మడి జిల్లాలో చాలా అభిమాన సంఘాలున్నాయి. సాహసమే ఊపిరిగా.. సాయమే శ్వాసగా సాగిన ఆయన జీవన ప్రయాణం.. ఎందరికో ఆదర్శప్రాయం.. జోహర్ ఘట్టమనేని శివరామకృష్ణ. విశాఖపట్నం: సూపర్‌స్టార్ కృష్ణకు విశాఖ సాగరతీరంతో ఎక్కువ అనుబంధం ఉంది. వాస్తవానికి ఆయన సినిమాలు ఎక్కువ శాతం చెన్నై, బెంగుళూర్ తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తీయాలి అంటే విశాఖ వైపే మక్కువ చూపేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సూపర్‌స్టార్ కృష్ణ జ్ఞాపకాలు తీరంలో పదిలంగా ఉన్నాయి. 1961–62 ప్రాంతంలో భీమిలిలో కులగోత్రాలు సినిమాలో షూటింగ్ జరిగింది. కృష్ణకు నటుడిగా ఇది రెండవ సినిమా. ఇందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. 1975లో ప్రకారావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చీకటి వెలుగులులో ఓ సన్నివేశాన్ని ఇప్పటి పార్క్ హోటల్ సమీపంలో చిత్రీకరించారు. 1983లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడివి సింహాలు సినిమా షూటింగ్ రుషికొండ, రామకృష్ణ బీచ్‌లో జరిగింది. 1984లో విజయనిర్మల దర్శకత్వంలో రక్త సంబంధం సినిమాలో ఓ సన్నివేశాన్ని యారాడ కొండపై చిత్రీకరించారు. 1993లో పచ్చని సంసారం చిత్రం అర్ధశత దినోత్సవం విశాఖలో జరిగింది. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు మన్యంలో నిర్మించగా, 1995లో కృష్ణ నటించిన 300వ సినిమా తెలుగువీర లేవరా సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల్లో చిత్రీకరించారు. బీచ్‌రోడ్‌లో ఎన్కౌంటర్, యారాడ కొండపై కృష్ణ, మహేష్ నటించిన వంశీ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లను షూట్ చేశారు. ఎస్ నేనంటే నేను సినిమా రుషికొండ, ఆర్.కె.బీచ్ తదితర ప్రాంతాలు, జగదాంబ సెంటర్లో చిత్రీకరణ జరుపుకుంది. విశాఖలో రాజేశ్వరి థియేటర్లో కంచుకాగడా సినిమా విడుదల సమయంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. విశా ఖతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలనే ఆకాంక్షతో.. పద్మాలయ ఫిల్మ్ స్టూడియో ను విశాఖలో నిర్మించాలని ఉందని పలుమార్లు కృష్ణ మీడియాకు చెప్పారు. నటశేఖరుడికి కళాప్రపూర్ణ ప్రదానం ఏయూక్యాంపస్: సినీ నటుడు కృష్ణకు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణను ప్రదానం చేసింది. ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి ఏయూ ఉపకులపతిగా పనిచేసిన కాలంలో కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 75వ స్నాతకోత్సవంలో ఆయనను కళాప్రపూర్ణతో సత్కరించింది. ఏయూలోని సీఆర్‌రెడ్డి కాన్వొకేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనిర్మలతో కలసి కృష్ణ పాల్గొన్నారు. కాగా.. కృష్ణ మృతి పట్ల ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు. మన్యం గుండెల్లో సూపర్‌స్టార్ సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే అందరికీ సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలను చింతపల్లి ప్రాంతంలోనే చిత్రీకరించారు. 1973–74లో దాదాపు ఏడు నెలలపాటు చిత్ర యూనిట్ చింతపల్లిలో ఉంది. తెలుగు వీరలేవరా, జయం మనదే వంటి సినిమాలను అరకులోయలో, పాడిపంటల సినిమాలో ఒక పాటను సీలేరు, గుంటవాడ డ్యామ్, సప్పర్ల రెయిన్‌గేజ్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. 18న ఏయూలో సంతాప సభ మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సెమినార్ హాల్లో ఈ నెల 18న సూపర్‌స్టార్ కృష్ణ సంతాపసభ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని.. ఆయన నటించిన ఈనాడు చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు. పార్క్ హోటల్లోనే బస బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సూపర్‌స్టార్ కృష్ణ విశాఖపట్నంనకు వచ్చిన ప్రతీసారి బీచ్‌రోడ్డులోని పార్క్ హోటల్లో బస చేసేవారట. కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన అడవి సింహాలు చిత్రం షూటింగ్ సాగరతీరంలో జరిగింది. ఆ చిత్రంలోని ఓ పాటను గ్యాస్ బెలూన్లతో చిత్రీకరిస్తున్నప్పుడు.. అవి పేలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారి్మకుడు మృతి చెందగా.. కృష్ణకు ప్రమాదం తప్పింది. ఓ సందర్భంలో గురజాడ కళాక్షేత్రంలో కృష్ణను టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. సూపర్ మెమొరీ స్టార్ సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న మెమొరీ పవర్ మరే నటుడికీ లేదు. రెండు పేజీల డైలాగ్ అయినా సునాయాసంగా సింగిల్ టేక్‌లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమే. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరి నటులను సమానంగా చూడగలిగే మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో చంద్రవంశం, గూఢాచారి 117, ఆయుధం వంటి సినిమాల్లో నటించాను. మంచి నటుడిని కోల్పోయాం. – ప్రసన్న కుమార్, సీనియర్ నటుడు, వైజాగ్ ప్రొడ్యూసర్ల హీరో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లకు నష్టం, కష్టం లేకుండా చూసుకునే ఏకైక నటుడు సూపర్‌స్టార్ కృష్ణ. సినిమా నిర్మించేప్పుడు నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేసే మహా మనిíÙ. ఆయనతో చల్ మోహన్‌రంగ సినిమాకు నేను సహ నిర్మాతగా వ్యవహరించాను. అప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనివి. –పురిపండ వెంకట రమణ శర్మ, నిర్మాత చిన్న నటులకు ప్రోత్సాహం సూపర్‌స్టార్ కృష్ణతో పని చేసిన జూనియర్ ఆరి్టస్ట్ను నేను. అల్లూరి సీతారామరాజు సినిమాలో గిరిజనుడి వేషధారణలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. – బొబ్బాది అప్పారావు, జూనియర్ ఆర్టిస్ట్, వైజాగ్ -
సినీ సాహసి.. ఘట్టమనేని
సినీ సాహసి ఘట్టమనేని కృష్ణ.. అద్వీతీయ నటనతో 350కి పైగా చిత్రాలు చేసిన నటుడు. ఇన్ని చిత్రాలు చేసిన హీరో మరొకరు తెలుగు సినీ పరిశ్రమలోనే లేరు. కృష్ణ సినీ కళామతల్లి ఒడిలో ఎదిగింది చెన్నైలోనే. ఈయన కోడంబాక్కం ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఆయన ఎదుగుదల, వెలుగుకు చెన్నైనే చిరునామా. కృష్ణ సాహసాలు చేసింది. సూపర్ స్టార్ అయ్యింది ఇక్కడే. పద్మాలయ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించింది, నిర్మాతగా మారింది, దర్శకుడిగా అవతారం ఎత్తింది చెన్నపురిలోనే. ఇక్కడ సూపర్‌స్టార్ కృష్ణ సంబంధించిన మధుర స్మతులు ఎన్నో ఎన్నెన్నో. లెజెండరీ హీరో కృష్ణ ని్రష్కమణతో టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కొత్తదనాన్ని పరిచయం చేసిన నటుడు: సీఎం తెలుగు సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్త తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కృష్ణ కుమారుడు నటుడు మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటుడు రజినీకాంత్ స్పందిస్తూ, తాను ఎప్పటికీ అభిమానించే నటుడు కృష్ణ అని, ఆయనతో కలిసి మూడు హిట్ చిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పేర్కొంటూ గొప్ప కీర్తిని సంపాదించుకున్న సేవాతత్పరుడు, గట్స్ ఉన్న మనిషి, వివాదరహితుడు, గౌరవ ప్రదమైన వ్యక్తి అయిన కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ ఆయన వద్ద 22 చిత్రాలకు తాను కో– డైరక్టర్‌గా పని చేసి ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేశారు. హాస్య నటుడు సెంథిల్ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. విశ్వనటుడు కమలహాసన్ పేర్కొంటూ, తెలుగు సినీ వినీలాకాశంలో ఉన్నతస్థాయికి ఎదిగిన నటుడు కృష్ణ అని వ్యాఖ్యానించారు. ఏడాది వ్యావధిలో తల్లి, సోదరుడు, తండ్రిని వరుసగా కోల్పోయిన నటుడు మహే‹Ùబాబు కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ పేర్కొంటూ.. కృష్ణ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల తరపున ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
కృష్ణం వందే సినీ జగద్గురుం
అఖిలాంధ్ర ప్రేక్షకుల ‘తేనె మనసులు’ను రంజింపజేసిన బుర్రిపాలెం బుల్లోడు ఇక లేరు. ‘కన్నెమనసులు’ దోచిన ఉమ్మడి గుంటూరు జిల్లా అందగాడు తెరమరుగయ్యారు. తెలుగు సినీ జగత్తులో ‘ఏకలవ్యు’డై అంచెలంచెలుగా ఎదిగి ‘నంబర్‌వన్’ స్థాయికి చేరిన ఘట్టమనేని ఘట్టం పరిసమాప్తమైంది. ప్రేక్షకుల హృదయ ‘సింహాసనం’పై చెరగని ముద్రవేసిన ‘మహామనిషి’ అమరుడై కళామ తల్లికి కడుపుకోత మిగిల్చారు. చరిత్రను తిరగరాసే సాహసాలకు ఎప్పుడూ ‘ముందడుగు’ వేసే ‘అసాధ్యుడు’ ‘ఈనాడు’ కానరాని లోకాలకు చేరారనే వార్త సగటు ప్రేక్షకుడి గుండెలను పిండేసింది. అఖిలాంధ్రలో ‘ప్రజారాజ్యం’ కోసం ‘అగ్నిపర్వతమై’ జ్వలించి ‘శంఖారావం’ పూరించిన అభినవ ‘అల్లూరి సీతారామ రాజు’ నటశేఖర సూపర్‌స్టార్ కృష్ణ రగిలించిన విషాదాగి్నతో స్వగ్రామం బుర్రిపాలెంతోపాటు ఉమ్మడి జిల్లా శోకసముద్రంలో మునిగింది. మహానటునితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతోంది. ఊరికి మొనగాడు కృష్ణ సొంతూరు బుర్రిపాలెం వాసులకు కొండంత అండగా ఉండేవారు. ఊరికోసం ఆయన చాలా చేశారు. అందరికీ ఆప్తుడిగా నిలిచారు. అవకాశం ఉన్నపుడల్లా ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటికి ఎవరు ఎప్పుడెళ్లినా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. భోజనం పెట్టి మరీ పంపేవారు. తమవాడు... ఆతీ్మయుడు అనుకున్న గొప్ప మనిషి.. ఇక లేడు.. అనుకుంటేనే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. – ఇదీ బుర్రిపాలెం వాసుల అంతరంగం కఠోర శ్రమ.. సినీ రంగంలో నిలదొక్కుకునేందుకు కఠోరంగా శ్రమించారు కృష్ణ. రోజుకు రెండు, మూడు షిఫ్టులు పనిచేశారు. ఏడాదికి డజను సినిమాల్లో నటించారు. 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజయ్యాయి. రకరకాల జోనర్లలో సినిమాలు తీశారు. మొత్తం 350 సినిమాల్లో నటించిన కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. భారతప్రభుత్వం ఆయన్ను ‘పద్మ భూషణ్’తో గౌరవించింది. తెనాలి: సూపర్ స్టార్ కృష్ణ అస్తమయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా దిగ్భ్రమకు గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మననం చేసుకుంది. ఆయన ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసింది మొదలు కలత చెందింది. మరణ వార్త తెలిశాక కన్నీరుమున్నీరైంది. కడసారి చూపుకోసం ఇప్పటికే అధిక సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఇదీ కుటుంబ ప్రస్థానం సూపర్‌స్టార్ కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఆయన తల్లిండ్రులు నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి. రైతు కుటుంబం. వీరరాఘవయ్య చౌదరికి వ్యక్తిగతంగా నెమ్మదస్తుడని పేరు. ఆయన భార్య నాగరత్నమ్మ ధైర్యశాలి. అనుకున్నది సాధించాలన్న వ్యక్తిత్వం ఆమెది. అదే లక్షణం కృష్ణకూ వచ్చిందని బంధువులు చెబుతుంటారు. 1943 మే 5న జన్మించారు కృష్ణ. ఆయనకు ఇద్దరు సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఇద్దరు సోదరీమణులు. బిడ్డల చదువు కోసమని కృష్ణ తల్లిదండ్రులు తెనాలికి మకాం మార్చారు. ఇక్కడి తాలూకా హైసూ్కలులో చదువుకున్న కృష్ణ అనంతరం కాలేజి చదువుల కోసం ఏలూరు వెళ్లారు. మకాం తెనాలికి మార్చకముందు స్నేహితులు కృష్ణబాబు, వెంకటప్పయ్యతో కలిసి రోజూ సైకిల్‌పై తెనాలి వచ్చి తాలూకా హైసూ్కలులో కృష్ణ చదువుకున్నారు. ప్రస్తుతం కడియాల వెంకటరమణ హాస్పిటల్ ఉన్న వీధిలో ఉండే ములుకుట్ల లక్ష్మీనారాయణ మాస్టారు ఇంటికి వచ్చి కృష్ణ ట్యూషన్ చెప్పించుకున్నారట. బీఎస్సీ పూర్తి చేసిన అనంతరం కృష్ణ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినీరంగం వైపు తొలి అడుగులిలా.. మద్రాస్ వెళ్లి తెనాలికి చెందిన నటులు జగ్గయ్య, గుమ్మడి, సినీ నిర్మాత చక్రపాణిని కృష్ణ కలిశారు. వారి సూచనపై తిరిగొచ్చారు. గరికపాటి రాజారావు సహకారంతో ప్రజానాట్యమండలి నాటకాల్లో నటించారు. అందం, ఆకర్షణ కలిగిన కృష్ణను అచిరకాలంలోనే సినిమా అవకాశం వరించింది. దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘తేనె మనసులు’ సినిమాతో హీరో అయ్యారు. ఆ సినిమా కోసమని కృష్ణకు కొద్దిరోజులు శిక్షణనిచ్చారు ప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్.ఆ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడు. బుర్రిపాలెంను మరవని సూపర్‌స్టార్ జన్మస్థలి బుర్రిపాలెంను కృష్ణ మరువలేదు. తొలి చిత్రం తేనెమనసులు విడుదల రోజున సినిమాను స్థానిక రాజ్యం థియేటరులో బంధుమిత్రులతో కలిసి వీక్షించారు. చిన్ననాటి స్నేహితులనూ విస్మరించేవారు కాదు. తన సినిమాలు రిలీజైన మరుసటిరోజు బుర్రిపాలెం వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారు. ఎప్పుడు వచ్చినా విజయనిర్మలతో సహా వచ్చేవారు. నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో స్వామి దర్శనం చేసుకునేవారు. గ్రామంలో బీఈడీ కాలేజీ శంకుస్థాపనకు, ఇంటర్నేషనల్ స్కూలు ప్రారంభానికి వచ్చారు. నాగరత్నమ్మ గ్రామ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. హైసూ్కలు అభివృద్ధికి కృషిచేశారు. దీనికి ఘట్టమనేని నాగరత్నమ్మ వీరరాఘవయ్య స్కూలు అని నామకరణం చేశారు. స్వగ్రామంలో షూటింగులు కృష్ణ స్వగ్రామంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ‘మీనా’ సినిమా షూటింగ్ జరిపారు. తన మేనమామ నర్రావుల సుబ్బయ్య∙మండువా ఇంటిలో చిత్రీకరించారు. పాడిపంటలు సినిమాలో ఎడ్ల జత కూడా బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ధర్మయ్య, శివరామయ్యలవే. చిడతలు, పట్టీలు లేకుండా కాడిని వాటికవే వేసుకునే ఆ ఎడ్ల జతకు అప్పట్లో యమా క్రేజ్. ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, పచ్చని సంసారం సినిమాల్లో కొన్ని భాగాలను, ‘ఈనాడు’ సినిమాలో ఒక పాటలో కొంత ఇక్కడ తీశారు. వివాహ జీవితం కృష్ణ సతీమణి ఇందిరాదేవి. 1965లో వీరికి వివాహమైంది. భార్య స్వగ్రామం తెనాలి దగ్గర్లోని కంచర్లపాలెం. వీరికి రమేష్‌బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. సహచరి విజయనిర్మలతో కలిసి 40 సినిమాల్లో నటించారు కృష్ణ. పద్మాలయా బ్యానర్‌పై 16 సినిమాలు తీశారు. రాజీవ్‌గాంధీ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ 1989లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. చివరిసారిగా 2016లో శ్రీశ్రీ సినిమాలో మరోసారి నటించారు. ఆయన కుమారుడు రమేష్ బాబు, భార్య ఇందిరాదేవి ఆరునెలల వ్యవధిలో మరణించటంతో కృష్ణ కుంగిపోయారు. అనారోగ్యానికి తోడు.. ఆప్తులను కోల్పోయిన దిగులు.. ఆయన్ను మరణానికి చేరువచేసిందనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి హీరో కృష్ణకు తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి ఉండేది. సినిమా విజయంపై ముందుగా తెనాలి ప్రేక్షకుల అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకునేవారు. 1991–92లో ‘పచ్చని సంసారం’ సినిమా షూటింగ్ బుర్రిపాలెంలో తీస్తున్నారు. ఒకరోజు కృష్ణ విలేకరుల సమావేశం పెట్టారు. ఆయన వేసిన తొలి ప్రశ్న ‘బృందావనం’ సినిమా ఎలా ఉంది? అని.. ఆ సినిమా అప్పటికి కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. తెనాలి పల్స్ తెలుసుకోవటానికి ఆయన అలా అడిగారు. క్రేజీ స్టార్డమ్ ∙జ్యోతిచిత్ర సినీ పత్రిక నిర్వహించిన బ్యాలెట్లో వరుసగా అయిదేళ్లు కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎంపికయ్యారంటే ఆయన స్టారడమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అమ్మంటే ఎనలేని అనురాగం సూపర్ స్టార్ కృష్ణకు తల్లి నాగరత్నమ్మ అంటే ఎంతో అపేక్ష. హెసూ్కలు విద్యను తెనాలిలో పూర్తిచేశాక కాలేజి చదువుల కోసం బుర్రిపాలెంలోని పొలాన్ని అమ్మి కృష్ణను ఏలూరుకు పంపారామె. కొడుకు ఇంజినీరు కావాలని ఆమె కలలు కనేది. కృష్ణకేమో సినిమాల్లో నటించాలని ఉండేది. బీఎస్సీ పూర్తయ్యాక ‘నేను ఇంజినీరు అవను.. సినిమాల్లోకి వెళతాను’ అనగానే ‘అలాగే నువ్వు తప్పకుండా హీరో అవుతావు’ అని ఆశీర్వదించి పంపారట ఆమె. అనుకున్నట్టే కొడుకు హీరో కావటంతో ఎంతో పొంగిపోయారు ఆమె. ‘ఉన్న ఊళ్లో పొలం అమ్ముకున్నాం.. ఎప్పుడైనా బుర్రిపాలెంలో పొలం కొనాలి’ అన్న అమ్మ కోరిక ప్రకారం కృష్ణ ఊళ్లో పొలం కొన్నారు. బుర్రిపాలెం వచ్చినపుడు ఇక్కడ ఉండేందుకని పాత ఇంటిని రీమోడల్ చేయించారామే. అంతేకాదు. తన పేరుమీద ఏదైనా సినిమా తీయమని అమ్మ కోరిన ప్రకారం ఆమె పేరిట ‘రత్నా మూవీస్’ పతాకంతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోదరుల సహకారంతో ‘ప్రజారాజ్యం’ తీశారు కృష్ణ. తన ముగ్గురు కొడుకుల పేరు మీద ఒక సినిమా తీయాలనీ సంకలి్పంచారామె. ఆమె కోరిక తీర్చాలనే తపనతో కృష్ణ, తన ఇద్దరు కొడుకులు రమేష్, మహేశ్‌బాబుతో కలిసి అన్నదమ్ములుగా నటిస్తూ ‘ముగ్గురు కొడుకులు’ సినిమా తీసి అమ్మ కోరిక నెరవేర్చారు. ఆ సినిమా కూడా విజయం సాధించటం తనకెంతో సంతోషమని కృష్ణ చెప్పేవారు. -
సూపర్ స్టార్ కృష్ణ చివరి ఇంటర్వ్యూ ..
-
చుక్కల తోటలో ఎక్కడున్నావో ..!
-
మిస్ యూ.. సూపర్‌స్టార్
-
సూపర్ స్టార్ కృష్ణ మృతి: రేపు షూటింగ్స్ బంద్!
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ తెలుగు చిత్రపరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. కాగా ఘట్టమనేని కృష్ణ 1943లో మే 31 జన్మించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం ఆయన స్వస్థలం. 1965వ సంవత్సరంలో “తేనె మనసులు” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు కృష్ణ. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు 350 సినిమాలలో హీరోగా నటించారు. ఈస్ట్‌మన్‌కలర్, 70MM, DTS సౌండ్, సినిమా స్కోప్లను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పద్మాలయా స్టూడియోస్, పద్మాలయా ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి అన్ని భారతీయ భాషలలో అనేక చిత్రాలను నిర్మించారు. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో “పద్మభూషణ్”, 1974లో ఉత్తమ నటుడిగా “అల్లూరి సీతారామరాజు” సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. అలాగే 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ - సౌత్‌తో పాటు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1989లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: కృష్ణ నటించిన ఆఖరి చిత్రం ఏంటో తెలుసా? -
కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: ఘట్టమనేని కృష్ణ గొప్ప నటుడే కాక ఉన్నత వ్యక్తిత్వం, విలువలు ఉన్న మనిషి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అలాగే ఉండేవారని తెలిపారు. ఈ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన బిఎస్సీ చదువుకున్నారు. 1989 ప్రాంతంలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన పని చేసిన రెండేళ్లలోపు కాలంలోనే ముంపు బాధిత రైతులకు ఎంతో సహాయం చేశారు. చెరకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు కృషి చేశారు. అలాగే పశ్చిమ, కృష్ణా డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు ప్రత్యేకత, అక్కడి ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు తెలియజేబుతూ "కొల్లేటి కాపురం" అనే సినిమా తీశారు. అలాగే మన జిల్లావాసి అయిన స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" సినిమా తీయడం ద్వారా ఆయన గొప్పదనాన్ని ఆంధ్రదేశానికి చాటి చెప్పడమే కాకుండా కృష్ణ తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన రాజకీయలలో క్రియాశీలక పాత్ర పోషించకపోయినా అమరులైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రాజీవ్ గాంధీకి ఈయన ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృష్ణ గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన కృష్ణ గారు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన తనయులు మహేష్ బాబుకి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (కృష్ణ పార్థివదేహం వద్ద బోరున విలపించిన మోహన్ బాబు) -
అదే సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి సినిమా!
ఆకాశంలో ఒక తార అంటూ సినీ ప్రియులను ఓ ఊపు ఊపిన నటుడు కృష్ణ అందరినీ విషాదంలో ముంచుతూ నేడు నింగికేగాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోవడం ఘట్టమనేని కుటుంబానికే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు భారంగా మారింది. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి ఔరా అనిపించారాయన. ఒక్క హీరోగానే 350 సినిమాలు చేశారు. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన రికార్డు కూడా కృష్ణ పేరు మీదే ఉంది. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్ మూవీస్ చేశారు. మరి ఆయన నటించిన చివరి చిత్రం ఏంటో తెలుసా? శ్రీశ్రీ.. ముప్పలనేని దర్శకత్వంలో వచ్చిన శ్రీశ్రీ సినిమా 2016లో విడుదలైంది. ఇందులో విజయ నిర్మల, నరేశ్, సాయికుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ నటించారు. ఆ తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు కృష్ణ. శ్రీశ్రీ చిత్రానికి ముందు సుకుమారుడు సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అదే ఏడాది శ్రీకాంత్, ఛార్మి కాంబినేషన్లో వచ్చిన సేవకుడు సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించారు. చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమైన మహేశ్‌బాబు బాగా కావాల్సినవాళ్లంతా దూరమైపోతున్నారు: మహేశ్‌బాబు -
బాగా కావాల్సిన వాళ్లంతా దూరమైపోతున్నారు.. మహేశ్ వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే తల్లి, సోదరుడిని పోగొట్టుకున్న మహేశ్‌కు తాజాగా తండ్రి కూడా దూరమయ్యాడు. గతకొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేశ్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. (చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు) నాన్న అంటే మహేశ్‌కు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ‘నాన్న నాకు దేవుడితో సమానం’ అని చాలా సందర్భాల్లో మహేశ్ చెప్పాడు. ఇప్పుడా దేవుడే లేడననే విషయాన్ని మహేశ్ తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహేశ్‌ను అలా చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.ధైర్యంగా ఉండాలంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోదరుడు రమేశ్‌బాబు మరణించిన సమయంలో మహేశ్ ఓ కార్యక్రమంలో పాల్గొని స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడాడు.‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు’ అంటూ అభిమానులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Mahesh True Fans 🔔 (@mahesh_truefans) -
బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ►రేపు ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించనున్నారు. ఇవాళ రాత్రికి నానాక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. ►కృష్ణ ఆత్మకు నివాళులర్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో రానా, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో అక్కినేని అఖిల్, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి ఏపీ సీఎం జగన్ రేపు నివాళులర్పించనున్నారు. బుధవారం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసిన మోహన్‌బాబు బోరున విలపించారు. బాధను ఆపులోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. ఈ బాధాకర సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ కుడా ఉన్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నానాక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహానికి చేరుకున్న కేసీఆర్ మహేశ్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉన్నారు. ► సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ► కృష్ణ పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి ,ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, నాగచైతన్య తదితరులు నివాళులర్పించారు. . అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ►తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశాడు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో వెంకటేశ్, దర్శఖులు బోయపాటి, రాఘవేంద్రరావుతో పాటు పలువురు సీనీ ప్రముఖులు నివాళులర్పించారు.దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను కలిచి వేస్తోంది. ► రేపు మహా ప్రస్థానం లో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు సిని రాజకీయ ప్రముఖుల సందర్శన తర్వాత కృష్ణ గారి పార్ధివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర , సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. ► సూపర్‌స్టార్ కృష్ణ మరణం పట్ల పశ్చిమగోదావరి జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) జిల్లా వ్యాప్తంగా థియేటర్స్‌లో ఉదయం ఆటను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ తెలిపారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడతాయని తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. -
ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం: ఘట్టమనేని కుటుంబం
సూపర్ స్టార్ కృష్ణ(79) మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై ఘట్టమనేని కుటుంబం స్పందించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘కృష్ణ నిజజీవితంలోనూ సూపర్ స్టారే. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కృష్ణగారి మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆయన ఎంతోమందికి ఆదర్శం’ అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేకోవడం విచారకరం. జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే మహేశ్ తల్లి, కృష్ణ సతీమణి.. ఇందిరాదేవి సెప్టెంబర్ 28న దూరం కావడం.. తల్లి మరణించిన రెండు నెలలలోపే తండ్రి కృష్ణ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చదవండి: అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ -
సూపర్ స్టార్ మృతి.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. -
కృష్ణ చనిపోయారని బాధపడకండి, ఇప్పటికే ఆయన స్వర్గంలో..: వర్మ ట్వీట్
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి మాటలకు అందని విషాదం అంటూ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు. No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing 💐💐💐 https://t.co/md0sOArEeG via @YouTube — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022 -
కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. వైద్యనీతి పాటించి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనఃశాంతిగా వెళ్లిపోయేలా చేశామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. (చదవండి: రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణ.. ఎన్టీఆర్‌కు ధీటుగా ప్రచారం!) ‘గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం కృష్ణ ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాం. మొదటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ కూడా చేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి ట్రీట్మెంట్ అందించినా ఫలితం ఉండదని నిర్ధారణకు వచ్చాం. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొన్ని గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ విషయంలో మేం వైద్యనీతి పాటించాం. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం. కృష్ణ భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించాం’ అని డాక్టర్ గురు తెలిపారు. -
రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణ.. ఎన్టీఆర్‌కు ధీటుగా ప్రచారం!
సూపర్ స్టార్ కృష్ణ(79) మరణం అభిమానులకు, సినీ, రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిత్రపరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు సాధించిన కృష్ణ.. రాజకీయాల్లోనూ రాణించాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్నేహంతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ.. ఎన్టీఆర్‌ని ధీటుగా ఎదుర్కొన్నాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి ప్రభంజనం కొనసాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎంపీగా ఉన్నసమయంలో పార్లమెంట్ కమిటీల్లో చురుకుగా పాల్గొన్నారు. కన్సల్టెటివ్ కమిటిలోను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో కూడా విశేష సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, డైరెక్టర్ గొపిచంద్ మలినేని, హీరో నాని, నటుడు పవన్ కల్యాణ్ ఇతర నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/B0FI5lAEYf — Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022 ఆయన కోలుకుని వస్తారనుకున్నా: పవన్ కల్యాణ్ కృష్ణ మృతిపై నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటులు కృష్ణ గారు. ఆయన మరణించారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ అలాగే నందమూరి హీరో బాలకృష్ణ కూడా కృష్ణ మృతిపై స్పందించారు. ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు. A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ మృతి సీనియర్ హీరో, నటుడు సాయి కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల చేస్తూ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ‘ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశీలి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి, జనం మనిషి, అందరు నచ్చే మేచ్చే మహా మనిషి, ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణగారు. కృష్ణగారి కథ ఒక చరిత్ర.. ఆ కథ ఈ రోజుతో ఆగింది. కానీ.. చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో ఎప్పుడు వెండితెరపై నిలిచే ఉంటుంది. మన గుండెలో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సూపర్ స్టార్’ అని సాయి కుమార్ నివాళులు అర్పించారు. Heart broken by the demise of Krishna garu. His contribution to the Telugu cinema industry cannot be described in words . A true Superstar by all means . My deepest condolences to his family , well wishers & fans. May his beautiful soul rest in peace. #SuperStarKrishna garu pic.twitter.com/eFhvkTa6Rm — Allu Arjun (@alluarjun) November 15, 2022 Deeply pained to hear about Krishna garu's passing. A Superstar in every right, he stood tall and commanded attention on screen like no other. We will sorely miss him. Rest in peace, Sir. Sending love, light and strength to Mahesh and the family in this time of grief. pic.twitter.com/o3492JJEQX — Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2022 Our prayers and respects to Krishna garu, sending lots of love and strength to @urstrulymahesh and family. It’s been a tough year for you brother.. We are with you! — Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2022 SUPER STAR KRISHNA ⭐️ End of an era. My deepest condolences to @urstrulyMahesh sir,family and Krishna Gaaru’s extended family which includes you,me and every telugu cinema fan. 💔 — Nani (@NameisNani) November 15, 2022 Devastated on hearing the news of our Super Star Krishna Garu's Demise.. May his soul rest in peace. 🙏 Telugu Cinema lost a LEGEND 💔 My Deepest condolences to @urstrulyMahesh garu, family, fans and loved ones. pic.twitter.com/W6KKdtoQfH — Gopichandh Malineni (@megopichand) November 15, 2022 కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever. — Jr NTR (@tarak9999) November 15, 2022 Extremely saddened at the loss of #Superstarkrishna garu. can't imagine how tough this could be. Wishing all the strength to @urstrulymahesh anna and the family. May your soul RIP & you'll always be alive in our hearts sir. om shanti 🙏 pic.twitter.com/QoaBdFrSSI — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2022 Deeply saddened on the passing of #KrishnaGaru a man who made a great mark as a #SuperStarKrishna . May his soul #RIPKrishnaGaru . My condolences to @urstrulyMahesh and family in these trying times🙏🙏🙏 pic.twitter.com/SZKWLoaHYF — Radikaa Sarathkumar (@realradikaa) November 15, 2022 This is Heart Breaking. Our SUPERSTAR KRISHNA Garu is no more. Legend 🙏🏽 Icon and Inspiration for Generations …. We will all Miss You sir . Praying for strength to the family @ManjulaOfficial , @urstrulyMahesh sir. May god be with you in this Testing time. pic.twitter.com/gm9OlQQYsL — Nikhil Siddhartha (@actor_Nikhil) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. Super Star Forever. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 15, 2022 Such a devastating loss to the entire film industry, What a Legend he was. I had the pleasure of working with him and a total privilege to know him personally. Rest in peace #SuperStarKrishna garu! Heartfelt condolences to Mahesh & family in this hour of grief. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) November 15, 2022 తెలుగు సినిమా చరిత్రలో మరో గొప్ప అధ్యాయం ముగిసింది... సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను 🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 15, 2022 Rest of peace dear ‘THE SUPERSTAR’ Krishna garu. Deep condolences to the entire family, All the Fans. It’s a huge loss. Love you Krishna garu. You will be greatly missed. pic.twitter.com/wp3RkPJNsu — Sunil (@Mee_Sunil) November 15, 2022 Shocking & Heartbreaking to hear abt d news of Super Star Sri.Krishna Garu🙏🏻 1 of d Biggest LEGENDS & PILLARS of our Cinema🙏🏻 The Most Humble Human Being.. May his soul rest in peace.. May God give Strength to dear @urstrulyMahesh sir & his Family🙏 pic.twitter.com/WVwvuUWKpS — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 15, 2022 The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh — Rajinikanth (@rajinikanth) November 15, 2022 Deeply in grief on hearing that our only super star #Krishna garu is no more... yet he is with us. — Jaggu Bhai (@IamJagguBhai) November 15, 2022 కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది... నా అభిమాన హీరో ఇక లేరు .. Rest in peace Super Star 🙏 pic.twitter.com/qWprJp3Pfi — KONA VENKAT (@konavenkat99) November 15, 2022 Saddened and shocked to know about the sudden demise of Daring and Dashing hero Legendry actor #SuperStarKrishna garu May his soul rest in peace. my deepest condolences and strength to @urstrulyMahesh garu & the entire family pic.twitter.com/uWLZUku8vf — Director Maruthi (@DirectorMaruthi) November 15, 2022 My heartfelt condolences to @urstrulyMahesh garu and the whole family. #RIPSuperStarKrishnaGaru 🙏 You will live forever in our memories pic.twitter.com/GG71Da2bae — Samantha (@Samanthaprabhu2) November 15, 2022 It's shocking to hear about the demise of #SuperStarKrishna garu 😞 God is being too ruthless with #MaheshBabu garu this year. Brother, mother & now the legend 🙏🏼 Deepest condolences to entire family. #RestInPeaceKrishnaGaru pic.twitter.com/jbBKfM52bH — Jani Master (@AlwaysJani) November 15, 2022 Deeply saddened to hear legendary actor Superstar #Krishna Garu is no more 💔 Prayers & strengths to @urstrulymahesh garu and family.#RIPKrishnaGaru #RIPSuperstarKrishna pic.twitter.com/ngJ3tDSw2B — Simran (@SimranbaggaOffc) November 15, 2022 Deepest condolences @urstrulyMahesh family, friends and fans #RIPKrishnaGaru https://t.co/5n8C0kDgJE — venkat prabhu (@vp_offl) November 15, 2022 What a tragic year it’s been. My deepest condolences to @urstrulyMahesh garu & family. TFI wouldn’t have been what it is today if not for your contribution SUPERSTAR.Thank you! Om Shanthi 🙏#RAPO pic.twitter.com/C2bjrQoceD — RAm POthineni (@ramsayz) November 15, 2022 #SuperStarKrishna garu one of the legendary actors of the telugu film industry is no more. Deeply saddened to hear about the demise. My heartfelt condolences to @urstrulyMahesh and the entire family. Superstar Krishna lives on. OM Shanthi🙏 pic.twitter.com/kcV9wwqubM — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) November 15, 2022 Dear @urstrulyMahesh, Krishna Garu entertained audiences worldwide for so many years & he will stay in our hearts forever. He was a super star who lived a complete life. Pls stay strong brother. It has been a very difficult year. My prayers and thoughts with you.#RIPKrishnaGaru — Karthi (@Karthi_Offl) November 15, 2022 An icon of Telugu cinema Krishna gaaru is no more, an era ends with his demise. I wish to share the grief of brother @urstrulyMahesh who has to bear this third emotional trauma of losing a mother, brother and now his father. My deepest condolence dear Mahesh gaaru. — Kamal Haasan (@ikamalhaasan) November 15, 2022 Deeply saddened to hear the demise of Legendary Superstar Krishna garu 💔 His contribution to Indian cinema will be remembered forever 🙏 My deepest condolences to @urstrulyMahesh garu , family and fans 🙏 Om Shanti 😢💐 pic.twitter.com/HmpPmV3dmc — Anushka Shetty (@MsAnushkaShetty) November 15, 2022 -
అవయవాలు పని చేయడం మానేశాయి: వైద్యులు
-
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Krishna: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!
సూపర్‌స్టార్ కృష్ణ(79) ఇకలేరు. తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు..కోట్లాది మంది ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. చిత్రపరిశ్రమలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావడం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు.మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. 40– 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. ఈ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి అందరిని అబ్బురపరచారు. 350 పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన హీరోగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన రికార్డులను మరే హీరో సాధించలేడనడం అతిశయోక్తి కాదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి
గూఢచారి, కౌబాయ్.. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలతో పాటు సామాజిక-పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు రంజింప చేశారు పద్మభూషణ, నటశేఖర కృష్ణ. సినీ సాహసాలకు ఆయన కేరాఫ్. నటనలో మాత్రమే కాదు ఫిల్మ్ మేకింగ్‌లోనూ ఆయనొక ప్రయోగశాల. నిర్మాతగా, దర్శకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును దక్కించుకున్న వ్యక్తి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త తరహా సాంకేతికతల హంగులను అందించిన వ్యక్తి. తక్కువ టైంలోనే ఆనాటి అగ్రహీరోల సరసన నిలిచారాయన. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడికి సాక్షి అందిస్తున్న నివాళి.. పాత తరంలో మాస్ హీరో ట్యాగ్‌ను, అత్యంత వేగంగా అందుకున్న నటశేఖరుడు.. ఆపై వరుస హిట్లతో సూపర్ స్టార్‌గానూ ఎదిగారు. ఒకానొక టైంలో ఏడాది కాలంలో 17 సినిమాలు తీసుకుంటూ.. దర్శకనిర్మాతల పాలిట కల్పతరువుగా మారారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ. వాళ్ల అగ్రసంతానం కృష్ణ. చదువుకొనే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తితో అటువైపు మళ్లారు. ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. డిగ్రీలో చేరాక.. పూర్తిగా సినిమాలవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరంభంలో.. ‘‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’’ వంటి చిత్రాలలో చిన్న రోల్స్‌లో కనిపించారు. ఆపై ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో కొత్తవాళ్లతో తెరకెక్కించిన తేనెమనసులులో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే హ్యాండ్సమ్ హీరోగా ఆయనకు ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు హీరోయిజం బేస్డ్ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా ఫ్యామిలీ&లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఉండమ్మ బొట్టు పెడతా, మంచి కుటుంబం, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెళ్లు, పండంటి కాపురం లాంటివెన్నో. తెలుగు సినిమాకు కొత్త నీరు ► కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం అయ్యింది. ► గూడుపుఠాణి.. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా. ► తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం.. భలే దొంగలు. ► తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా.. సింహాసనం. ► సింహాసనం.. స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. ► అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఫ్రెండ్లీ స్టార్‌గా ఉంటూనే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. ముక్కుసూటితనం ఉన్న వ్యక్తిగా పేరొందారు కృష్ణ. అదే సమయంలో స్టార్ హీరో ట్యాగ్‌కు చేరువవుతున్న సమయంలోనూ ఆయన ఇతర స్టార్ల చిత్రాల్లో నటించుకుంటూ పోయారు. తన తోటి హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితరుల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ► అగ్రహీరోలతో పోటీ పడుతూనే ఆయన కొన్ని సాహసోపేతమైన చిత్రాలు తీశారు. కురుక్షేత్రం, దేవదాసు.. అందుకు ఉదాహరణలు. ► స్టార్ ద్వయం ఎన్టీఆర్-ఏన్నార్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఏమాత్రం తీసిపోని స్టార్డమ్ తొలినాళ్లలోనే సొంతం. లేడీఫాలోయింగ్ మాత్రమే కాదు.. మేల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఆయనకు. ఆయన్ని చూసేందుకు చెన్నైకి రైళ్లలో, బస్సుల్లో అభిమానులు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు. ఏకంగా రికార్డు స్థాయిలో 2,500 అభిమాన సంఘాలు కృష్ణ పేరిట ఉండేవి. ► సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఆయన నటించిన 30 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యాయి. 1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా.. వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణదే రికార్డు. ► ఆ తర్వాతి తరంలోనూ ఆయన కీలక పాత్రలు పోషించిన చిత్రాలు వచ్చాయి. నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, కోలీవుడ్ నటుడు విక్రమ్‌లతో పాటు తన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాల్లోనూ ఆయన నటించి, మెప్పించారు. ► కొమియో పాత్రల్లో పలు చిత్రాల పాటల్లోనూ ఆయన కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో ఆయన గెస్ట్ సాంగ్‌లో కనిపించారు. యమలీలలోని జుంబారే సాంగ్.. ఓ ఊపు ఊపింది కూడా. ► ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దారిలోనే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ అవసరమని ‘పద్మాలయా’ స్టూడియోను నెలకొల్పారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘అగ్నిపరీక్ష’. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. కేఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చిన ఆ చిత్రం ఓ కల్ట్క్లాసిక్గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ► పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు లాంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించారు. ► 1964-95 మధ్య ఏడాదికి పదేసి చిత్రాల్లో కనిపించారు ఆయన. ఒకానొక టైంలో రోజుల్లో గంటల తరబడి విరామం లేకుండా షూటింగ్లలో పాల్గొన్నారు. ► అల్లూరి సీతారామరాజు.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్గా తెరకెక్కింది. అయితే ఆ చిత్ర భారీ విజయం తర్వాత వరుసగా ఆయనకు 14 ఫ్లాపులు వచ్చిపడ్డాయి. ఆపై పాడి పంటలు చిత్రంలో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ► ముందగుడు, కిరాయి కోటిగాడు, అగ్నిపర్వతం, అడవి సింహాలు, ప్రజారాజ్యం, ఖైదీ రుద్రయ్య ఆయన్ని టాప్ పొటిషన్ను తీసుకెళ్లాయి. సింహాసనం ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది. మాయదారి మల్లిగాడు, ఇంద్రధనుస్సు, అన్నదమ్ముల సవాల్, ఊరికి మొనగాడు లాంటి మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ► 1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు. ► 1990 నుంచి మూడేళ్లపాటు ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 1994లో వచ్చిన పచ్చని సంసారం, వారసుడు చిత్రాలు ఆయన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాయి. ఆపై నెంబర్ వన్, అమ్మ దొంగా చిత్రాలు ఆయనకు సూపర్‌సక్సెస్ అందించాయి. ► ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా ‘తెలుగువీర లేవరా’ తీశారు. ► మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి. ► కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆపై ఆమె డైరెక్షన్‌లోనూ 40 దాకా సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు. ► కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తొలి 70 ఎంఎం సినిమాగా అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలీవుడ్లో డినో మోరియా, బిపాసా బసు లీడ్రోల్లో ఇష్క్ హై తుమ్సే(2004) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. తెలుగు సంపంగి చిత్రానికి రీమేక్ ఇది. రాజకీయాల్లోనూ.. ► రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం.. ఒక హాట్ టాపిక్‌గా మారింది. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. ► ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కృష్ణ.. చిత్రపరిశ్రమలో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం నుంచి 2009లో పద్మభూషణ్ గౌరవాన్ని సైతం అందుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రానికి గానూ నంది అవార్డు(1974), ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(2003), ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు(1997) సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌ను అంతే ఓపెన్‌గా అంగీకరించేవారు ఆయన. సాహసోపేతమైన వైఖరితో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్లేవారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి, నిర్మాతలకు నష్టం కలగకుండా చిత్రాలు చేయాలని తపించేవారు. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్‌గా వెలుగొందారు. -
ఒకే ఏడాదిలో మూడు విషాదాలు.. తీవ్ర దుఃఖంలో మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ ఏడాదిలో మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరిలో మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి ఇందిరాదేవి దూరం అయింది. సెప్టెంబర్ 28న కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి మరణించింది. కన్న తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడే మరచిపోతున్న తరుణంలో కన్న తండ్రి కన్నుమూయడం.. మహేశ్‌ని మరింత విషాదంలోకి నెట్టింది. -
విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇటీవల లెజెండరి నటులు కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని మరవకముందే కృష్ణ మృతి చెందడంతో ఇటూ సినీ పరిశ్రమ, అటూ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జన్మించాడు. 1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవల మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా ఈ మధ్యనే మృతి చెందారు. తేనె మనసులతో మొదలుపెట్టి.. డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది. గూఢచారి 116 సక్సెస్‌తో.. 20 సినిమాల్లో ఛాన్స్ రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్‌బాండ్ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడా ఇదే. ఏడాదిలో 18 సినిమాలు.. 70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. కొత్త సాంకేతికతను పరిచయం చేసి.. నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్ అండ్ డాషింగ్’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. ►1965లో కృష్ణ తొలిచిత్రం తేనె మనసులు విడుదల ►తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ ►హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ ►సింహాసనం సినిమాతో మెగాఫోన్ ►తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ ►అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి ►హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ►పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం ►విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్ -
‘కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఆందోళన అవసరం లేదు’
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేశ్ సోమవారం ఉదయం స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోటిన్ చెకప్‌లో భాగంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు నరేశ్ పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సీనియర్ నటులు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా కొంతకాలంగా కృష్ణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్స్‌రే నుంచి సీటీ స్కాన్ దాకా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కడుపునొప్పి ఇలా వ్యాధి ఏదైనా నిర్ధారించేది రేడియాలజిస్టులే. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల వరకూ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకం. ఎక్స్‌రే నుంచి డిజిటల్ ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఆ్రల్టాసౌండ్ స్కాన్ ఇలా అనేక ఇమేజింగ్ పరికరాలు నేడు వైద్య రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవంబరు 8న ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... రక్తనాళాల్లో పూడికలనూ... ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆస్పత్రిలో అడ్మిషన్ అవసరం లేకుండానే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ(సీటీ)స్కాన్ అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయక సింగిల్ స్కాన్‌తో ప్రారంభమై డ్యూయల్, 4, 6, 8, 16 స్లయిస్ నుంచి నేడు 256, 320 స్లయిస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. సంపూర్ణ దేహానికి వర్తించేలా నాన్ ఇన్వేసిన్ యాంటియోగ్రఫీ 3డీ సీటీ వంటివి వేగం, నాణ్యత, వైవిధ్యం విషయంలో ఎన్నో రకాలుగా వ్యాధి నిర్ధారణకు దోహదపడుతున్నాయి. గుండె, కిడ్నీ, మెదడు, లివర్ వ్యాధులతో పాటు, రక్తనాళాల్లోని లోపాలను గుర్తించే అత్యాధునిక సీటీ స్కాన్లు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. జీజీహెచ్‌లో సమగ్ర రేడియాలజీ సేవలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సమగ్ర రేడియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్ఐ, రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, పది ఆల్ట్రాసౌండ్ యూనిట్లు ఉన్నాయి. అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే రోగుల వ్యాధి నిర్ధారణకు అవసరమైన స్కానింగ్‌లు చేస్తూ రిపోర్టులు అందిస్తున్నారు. ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇలా 10 మంది రేడియాలజిస్టులు ఇక్కడ పనిచే స్తున్నారు. కణజాలాల తేడాలను గుర్తించే ఎంఆర్ఐ శరీరంలోని అంతర్గత తేడాలను గుర్తించడంలో ఎంఆర్ఐ(మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్) ఎంతగానో దోహదపడుతుంది. సూక్ష్మమైన లోపాలను సైతం ఈ స్కానింగ్‌లో గుర్తించగలుగుతున్నారు. వెన్నుపూస, అబ్డామిన్, మెదడు వంటి అనేక లోపాలను గుర్తించడంలో ఎంఆర్ఐ స్కాన్ కీలకంగా మారింది. ఈ స్కానింగ్ పరికరం 0.2 టెస్లాతో ప్రారంభమై ప్రస్తుతం 1.5 టెస్లా అందుబాటులోకి వచ్చింది. దీని స్కానింగ్ ఇమేజీలు వ్యాధి నిర్ధారణలో కీలకంగా ఉన్నాయి. ఆ్రల్టాసౌండ్తో విప్లవాత్మక మార్పులు మహిళల్లో పెనుముప్పుగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఆ్రల్టాసౌండ్ కీలకభూమిక పోషిస్తుంది. సూక్ష్మదశలో గుర్తించే ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీలు, పిత్తాశయంలో రాళ్లు గుర్తించడం, 24 గంటల కడుపునొప్పి, లివర్ పనితీరు ఇలా ఎన్నో రకాల వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నారు. రోగి ప్రమాదం నుంచి బయట పడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. -
శభాష్ చందన!
మచిలీపట్నం టౌన్: ఆమె నిండు గర్భిణి. పేరు జోగి చందన. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని రెండో డివిజన్ సీ–5 వలంటీర్‌గా పనిచేస్తోంది. నవంబర్ 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె సోమవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించి 1.14 గంటలకు పూర్తి చేసింది. తన పరిధిలోని 90 మందికి పింఛన్ అందజేసింది. -
ఏపీ: ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్స్ పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అరవై రోజులు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను కాస్త.. 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను పది విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
కృష్ణమ్మ ఉగ్రరూపం..ఈ సీజన్లో ఇది రెండో గరిష్ట వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్టు/మాచర్ల: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,95,652 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో పదిగేట్లను 15 అడుగులు ఎత్తి 3,77,160 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,534 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడ్ హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, విద్యుత్కేంద్రాల నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,25,400 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో స్పిల్‌వే 20 గేట్లు, విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి పెరుగుతున్న వరద పులిచింతల ప్రాజెక్టులోకి 3,90,904 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వరద నియంత్రణలో భాగంగా పులిచింతల ప్రాజెక్టును కొంతభాగం ఖాళీ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 4,34,066 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,96,561 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తూ 2.90 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల నుంచి భారీగా విడుదల చేసిన వరదలో 4 లక్షల నుంచి 4.30 లక్షల క్యూసెక్కులు శనివారం ప్రకాశం బ్యారేజ్‌కి చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన వరదను వచ్చినట్లు 1.84 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి తుంగభద్ర, వేదవతి, బీమా, హంద్రీ వరద తోడవనుండటంతో శనివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది. అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ దాకా.. కర్ణాటక, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నాలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో అప్పర్ పెన్నార్ నుంచి ప్రాజెక్టు నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు అన్నింటి గేట్లను ఎత్తేశారు. అనంతపురం జిల్లాలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి 32 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో వైఎస్సార్ జిల్లాలోని గండికోట, మైలవరం జలాశయాల్లోకి వరద ఉద్ధృతి పెరిగింది. గండికోట, మైలవరం నిండుకుండలను తలపిస్తున్నాయి. మైలవరం జలాశయం నుంచి 41,392 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో సోమశిలలోకి వరద ఉద్ధృతి పెరిగింది. సోమశిలలోకి 31,260 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ 68.39 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్‌వే, విద్యుత్కేంద్రం ద్వారా 27,998 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు సంగం బ్యారేజ్ మీదుగా నెల్లూరు బ్యారేజ్‌కు చేరుతున్నాయి. నెల్లూరు బ్యారేజ్‌లో మిగులుగా ఉన్న 16 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
మహేశ్‌బాబును అలా ఎన్నడూ చూడలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్లేషకుడిగా మారిన విషయం తెలిసిందే! ఏదైనా సినిమాను తీసుకుని అందులో తప్పొప్పులను చర్చిస్తూ ఆ లోపాలను సవరిస్తున్నాడు. ఈ మధ్యే వారియర్ సినిమాలోని ప్లస్ మైనస్‌ల గురించి వీడియో చేసిన ఆయన తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఇందిరా దేవిని పోగొట్టుకుని మహేశ్ ఫ్యామిలీ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆమె సంస్మరణ సభకు పరుచూరి గోపాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో మహేశ్, కృష్ణల పరిస్థితి చూసి విలవిల్లాడిపోయానన్నాడు పరుచూరి. 'ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు తెలియజేశాను. కృష్ణ, మహేశ్‌బాబు, రమేశ్ బాబు, హనుమంతురావు, ఆది శేషగిరిరావు గారితో.. వీరందరితో కుటుంబంలో కుటుంబంలా కలిసిపోయాం. నేను అమెరికా నుంచి వచ్చేలోగా మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారని తెలిసింది. ఏకాదశి నాడు వారిని కలిశాను. అప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేశ్‌బాబును అంత డల్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి, దేవత. ఆమె ఎక్కువ మాట్లాడరు, కేవలం చిన్న చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె మరణించాక కృష్ణగారి ముఖం చూసి ఎంతో ఆవేదన చెందాను. సామాన్యంగా అలాంటి సందర్భాల్లో మనం తల్లడిల్లిపోతాం. కానీ సాహసమే ఆయన ఊపిరి అన్నట్లుగా గుండెనిబ్బరం చేసుకుని కూర్చున్నారు. మహేశ్‌బాబును చిరునవ్వు లేకుండా అలా దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు ఉండేది. అలాంటిది ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేశ్ పెదాలపై చిరునవ్వు మాయమైంది. మహేశ్‌బాబు కాశీకి కూడా వెళ్లి వచ్చాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్ ప్రముఖ బుల్లితెర నటికి క్యాన్సర్? -
ఇందిరా దేవి పార్థీవదేహానికి కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతున్నట్లు వెల్లడించాయి. ఆయన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత మిషన్ సాయంతో కాస్త హాయిగా శ్వాస తీసుకుంటున్నారని, త్వరితగతిన పూర్తిగా కోలుకుంటారని తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ దగ్గరుండి మరీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
వినియోగదారులకు షాక్.. విజయ పాల ధరలు పెంపు!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్(విజయ పాలు) పాలు లీటర్‌కు రూ.2 పెరగనున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని విజయ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం విజయ లోఫాట్(డీటీఎం) అర లీటర్ ప్యాకెట్ రూ.25 ఉండగా, సోమవారం నుంచి రూ.26 కు విక్రయించనున్నారు. విజయ ఎకానమి(టీఎం) అరలీటర్ ప్యాకెట్ రూ.27 నుంచి రూ.28కు పెరిగింది. విజయ స్పెషల్(ఫుల్ క్రీమ్) పాలు అర లీటర్ రూ.33 నుంచి రూ.34కు పెరిగింది. ఇక కృష్ణా మిల్క్ యూనియన్ అత్యధికంగా విక్రయించే విజయ గోల్డ్ ప్రస్తుతం రూ.34 ఉండగా, రూ.35కు పెరగనుంది. నెల వారీ పాల కార్డు కొనుగోలు చేసిన వినియోగదారులకు అక్టోబర్ 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని యాజమాన్యం పేర్కొంది. -
ప్రేమా లేదు.. పెళ్లి లేదూ.. భర్త చనిపోతే ఆస్తి కోసం చేరదీశాడంతే!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ఓ మహిళ భర్త కరోనాతో గత ఏడాది మృతి చెందారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పేరిట రూ.1.20 కోట్ల ఆస్తి ఉంది. ఆ వితంతువును ఓ కానిస్టేబుల్ నమ్మించాడు. అతనికి అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వితంతు మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు. అనధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమె ఆస్తిని కాజేసేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన మహిళ భర్త గతేడాది కరోనాతో మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. కూచిపూడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న దేవేంద్రకు కొద్ది నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు ఓ గుడిలో దండలు మార్చుకొని అనధికారికంగా వివాహం చేసుకున్నారు. రామలింగేశ్వరనగర్లో ఆ మహిళకు రూ.1.20 కోట్ల విలువు చేసే ఇల్లు ఉంది. ఆమెకు తెలియకుండా ఆ ఇంటిని కానిస్టేబుల్ బేరానికి పెట్టాడు. కొనేందుకు వచ్చిన వారి నుంచి రూ.40 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం ఆ మహిళకు ఆలస్యంగా తెలిసింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని దేవేంద్రపై వత్తిడి చేసింది. అయితే అతను పట్టించుకోకపోవడంతో పటమట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ జాన్‌బాషా తెలిపారు. -
అప్పుడు అందరం బాగుంటాం
కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించిన చిత్రం ‘నేచర్’. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన అలీ మాట్లాడుతూ – ‘‘నాకు ఇళయరాజాగారి పాటలంటే ఇష్టం. ఈ పాట ఆయన పాటలను గుర్తు చేసింది. యం.ఎల్. రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘నేచర్’ టైటిల్ బాగుంది. ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ’’ అన్నారు అశ్విన్ కామరాజు. ‘‘ఈ సినిమాకు పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు ఎమ్ఎల్ రాజా. ‘‘సుధాకర్, రవి టీచర్స్. ఈ సినిమాకి ఇద్దరూ చక్కటి కథను రెడీ చేశారు’’ అన్నారు గౌతమ్ రాజు. -
ఆకట్టుకుంటున్న ‘నా మాటే వినవా’ టీజర్
కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా శివానీ ఆర్ట్స్, పీఎస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నా మాటే వినవా. శ్రీనివాస్ యాదవ్, పి వినయ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన కిరణ్ చేత్వాణి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్లు మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ‘పెళ్లి తరువాత బేదాభిప్రాయాలతో విడిపోవడం కన్నా.. పెళ్లికి ముందు మనం ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం మంచిదని నా ఆలోచన’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. మనిద్దరం ఒకే రూంలో ఉంటున్నామని హీరోయిన్ అనడం..కానీ మనం వయసులో ఉన్నాం.. కొంచెం కష్టమంటూ హీరో కొంటెగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో సాయి కుమార్ చెప్పిన ‘ఆధునికత మంచిదే కానీ నాగరికతను మరిచిపోకూడదు.. వాయిస్ నాది చాయిస్ మీది’ డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్‌ను తెలియజేస్తోంది. రొమాన్స్, యాక్షన్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాలను అలరించేలా మా చిత్రం ఉటుందని మేకర్స్ తెలిపారు. మహవీర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కృష్ణతో పెళ్లికి విజయ నిర్మల ఆయన కుటుంబాన్ని ఎలా ఒప్పించిందంటే?
ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల కొన్నేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానమిచ్చారు. 'మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టం. కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారు. తర్వాత వాళ్లు మా ఇంట్లోనే ఉన్నారు. షూటింగ్‌కు వెళ్లేముందు కూడా అత్తామామలకు వంట చేసి పెట్టి వెళ్లేదాన్ని. వాళ్లకు నా చేతి వంట అంటే ఎంతో ఇష్టం. మా అత్త చనిపోయే ముందు నా చేతి బెండకాయ కూర, రసం ఉంటే తింటానన్నారు. అదే ఆమె చివరిసారిగా తినడం. కృష్ణగారితో మూడు కాంబినేషన్స్ అయ్యాక ఆయనను డైరెక్ట్ చేస్తానన్నాను. కానీ ఆయన ఆర్టిస్ట్‌గా 100 సినిమాలు పూర్తి చేయు, తర్వాత నాకు నచ్చింది చేయమన్నారు. సరేనని మలయాళం, తెలుగు, తమిళం సినిమాలు చేసుకుంటూ పోయాను. అలా నేను కొచ్చిలో ఉన్నా కూడా కృష్ణగారు నాకోసం కారు తీసుకుని వచ్చేవారు. దాదాపు 80 సినిమాలు పూర్తయ్యాక డైరెక్టర్‌గా అవతారమెత్తాను. మొదట మలయాళంలో ఓ మూవీ డైరెక్ట్ చేశా. తర్వాత తెలుగులో మీనా నవల ఆధారంగా కృష్ణగారితో సినిమా తీశాను. అది చాలా సక్సెస్ అయింది' అని చెప్పుకొచ్చారు విజయ నిర్మల. చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి -
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు!
‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్‌తో ‘కృష్ణమ్మ’ టీజర్ విడుదల అయింది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ తేజ్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. -
బస్సులో మహిళ హల్చల్.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
సాక్షి, విజయవాడ: నగరంలో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్‌కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల ప్రకారం.. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం, బస్సులో డ్రైవర్‌ను ఎడాపెడా చితకబాదింది. కాగా, ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: అబద్దాలకు లిమిట్ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్ -
PMGKY: బాధ్యతగా ఆహార భద్రత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 3,06,878 మంది కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యాన్ని అందించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్ షాపులలో ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తారు. ఎన్ఎఫ్ఎస్ఏ లబి్ధదారులకు వలంటీర్ల ద్వారా పంపిణీకి సంబంధించిన కూపన్లు రెండు రోజుల ముందే వారి ఇంటి వద్దనే అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. కూపన్లు తీసుకొన్న లబి్ధదారులు వారు కూపన్లలో చూపిన దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యథావిధిగా రాష్ట్రం బియ్యం.. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సార్టెక్స్ బియ్యాన్ని యథావిధిగా ఉమ్మడి జిల్లాలోని కార్డుదారులకు 710 ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగనుంది. కార్డుదారుని ఇంటి వద్దకే వెళ్లి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గ్యాస్ సిలెండర్ల విక్రయాలకు.. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ షాపుల్లో 5కేజీల గ్యాస్ సిలెండర్లను అందుబాటులోకి ఉంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జాయింట్ కల్టెకర్ నుపూర్ అజయ్ కుమార్ గ్యాస్ కంపెనీలు, రేషన్‌షాపు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలి్పంచారు. ఈ మేరకు వారితో ఎంఓయూ చేసుకున్నారు. ఒక్కో రేషన్ షాపులో 20 సిలెండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. 5 కేజీల గ్యాస్ సిలెండర్ రిజి్రస్టేషన్ చార్జీ రూ. 1,803గా నిర్ణయించారు. ఇందులో రూ.640విలువైన గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అయి పోయిన వెంటనే, రేషన్‌షాపు వద్దకు వెళ్లి ఖాళీ సిలెండర్, ఇచ్చి నిండు సిలెండర్ తీసుకోవచ్చు. బియ్యం పంపిణీకి ఏర్పాట్లు.. జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన కార్డులకు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతినెలా చేస్తున్న బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే వెళ్లి అందిస్తాం. త్వరలో రేషన్ షాపుల్లో 5కేజీల సిలెండర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. – శ్రీవాస్ నుపూర్, జేసీ, ఎన్టీఆర్ జిల్లా -
బొంకులు అంతకు మించే
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం దుష్ప్రచారానికి పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఈనాడుతో పాటు చంద్రబాబు బృందం ఊహాజనిత లెక్కలతో రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులంటూ లేని అప్పులను కూడా జత చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తమకు పుట్టగతులుండవని గ్రహించి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు శ్రీలంకకు, మన రాష్ట్రానికి పోలికే ఉండదన్నారు. ఈ వాస్తవాలు తెలిసి కూడా సంక్షేమం ఆగిపోవాలని, అప్పులు పుట్టకూడదనే దురుద్దేశంతో ఈనాడు ప్రచురిస్తున్న కథనాలను చంద్రబాబు బృందం వల్లె వేస్తోందన్నారు. గురువారం సచివాలయంలో సజ్జల, దువ్వూరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ఈనాడు కాకి లెక్కలు.. సీఎం జగన్ చెప్పిన వాటితోపాటు చెప్పని హామీలను కూడా అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనతో ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంతో దిక్కుతోచక ఈనాడు, బాబు గ్యాంగ్ అప్పులపై తరచూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సజ్జల విమర్శించారు. ‘రాష్ట్రానికి దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అప్పు ఉందని రాశారు. ఇంకా నయం.. ఏ రూ.20 లక్షల కోట్ల అప్పు ఉందనో రాయలేదు. ఈనాడు బాధ్యతా రాహిత్యానికి ఇది పరాకాష్ట’ అని పేర్కొన్నారు. ‘ఎన్టీ రామారావు అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత చంద్రబాబుకు సీఎం పదవి దక్కడానికి తానే కారణం, రాజకీయంగా శాసించగలనని భావించే రామోజీరావు ఈరోజుకూ అదే పరిస్థితి ఉందనే భ్రమల్లో ఉన్నారు. రోజూ రాసిందే రాస్తున్నారు. అది తీసుకుని చంద్రబాబు, ఆయన బృందం మాట్లాడుతుంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. జవాబుదారీతనం లేకుండా కాకి లెక్కలతో కథనాలు అచ్చు వేస్తున్నారు’ అని మండిపడ్డారు. అప్పులు పుట్టకూడదని, సంక్షేమం – అభివృద్ధి పథకాలు ఆగిపోవాలనే దురుద్దేశంతో ఉన్నారని దుయ్యబట్టారు. ఈనాడుతో పాటు బాబు గ్యాంగ్ సంక్షేమానికి వ్యతిరేకమని, పేదలు ఆర్థికంగా ఎదగడం వారికి నచ్చదని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రానికి, పేదలకు నష్టం చేయాలనే కుట్రలో భాగంగానే అప్పులపై తప్పుడు లెక్కలతో కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పారు. సీఎం కుర్చీ నుంచి జగన్‌ని దించేసి బాబును కూర్చోబెట్టి దోచుకుని పంచుకోవాలనే ఆరాటం ఈనాడు రాతలు, దుష్టచుతుష్టయంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వారి గొయ్యి వారే.. ప్రభుత్వంపై బురద జల్లాలనే టీడీపీ ఎంపీ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబుతో వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లయిందని చెప్పారు. కోవిడ్‌తో ఆదాయం తగ్గి వ్యయం బాగా పెరిగినప్పటికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తూ రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారన్నారు. కోవిడ్ లేకపోతే మరింత మెరుగ్గా పరిస్థితులుండేవన్నారు. పోలవరంలో గోదావరి వరదను మళ్లించడానికి స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా? అని ప్రశ్నించారు. బాబు నిర్వాకం వల్లే పోలవరంలో ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. గతంలో కన్నా మెరుగ్గా వరద బాధితులకు సాయమందిస్తోందన్నారు. వరద ప్రాంతాల్లో విజయ సంకేతాలా? చంద్రబాబు వరదపీడిత ప్రాంతాల్లో పరామర్శ పేరుతో రోడ్‌షో చేస్తున్నారని సజ్జల విమర్శించారు. తాను అధికారంలో ఉంటే తుపాన్ కంటే ముందుగా వచ్చే వాడినన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అంత వయసు వచ్చింది.. ఎక్కడికి వెళ్లామనే కనీస స్పృహ కూడా లేకుండా వరదపీడిత ప్రాంతాల్లో విజయ సంకేతాలు చూపుతూ రోడ్‌షో చేస్తున్నారు. బొకేలు స్వీకరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. శ్రీలంకతో పోల్చడం అవివేకం: దువ్వూరి కృష్ణ శ్రీలంక అప్పులతో రాష్ట్రాన్ని పోల్చడం అవివేకానికి నిదర్శనమని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. దేశానికి ఉండే ద్రవ్య బాధ్యతలకు రాష్ట్రాలకు ఉండే ద్రవ్య బాధ్యతలకు తేడా తెలుసుకోకుండా కధనాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. బడ్జెట్ డాక్యుమెంట్లతో పాటు కాగ్ నివేదికల్లో అప్పులపై వాస్తవ గణాంకాలున్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే అవాస్తవ లెక్కలతో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ కారణంగా దేశంతో పాటు ప్రపంచమంతా ఆదాయం తగ్గిపోయి అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయని, అయినప్పటికీ పరిమితికి లోబడే రాష్ట్రం అప్పులు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎంతో మెరుగ్గా.. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జీఎస్డీపీలో అప్పులు మూడు శాతంలోపే ఉండాల్సినా ఏ ఏడాది కూడా ఆ మేరకు లేవని దువ్వూరి కృష్ణ గుర్తు చేశారు. కేంద్రంతోనూ, గత టీడీపీ సర్కారుతోనూ పోల్చి చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ముగిసిన ఆర్థిక ఏడాదికి గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్డీపీలో అప్పులు కేవలం 2.09 శాతానికే పరిమితం చేశామని వివరించారు. టీడీపీ హయాంలో అప్పులు 143.25 శాతం మేర పెరగ్గా ఇప్పుడు మూడేళ్లలో 52.36 శాతమే పెరిగాయని తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు మొత్తం రూ.1,34,584 కోట్లు కాగా 2019 మే నాటికి రూ.3,27,372 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. అంటే ఏటా దాదాపు 19.46 శాతం అప్పులు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో ఏటా కేవలం 15.77% చొప్పున మాత్రమే పెరిగాయని చెప్పారు. బాబు బకాయిలు బారెడు విభజన నాటికి 2014లో విద్యుత్ రంగ అప్పులు రూ.29,703 కోట్లు కాగా 2019 నాటికి ఏకంగా రూ.68,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచిందని దువ్వూరి తెలిపారు. ‘అంటే అప్పులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు 2014లో రూ.2,893 కోట్లు ఉండగా టీడీపీ హయాంలో ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగాయి. గత సర్కారు దిగిపోతూ పెట్టిన ఇతర బకాయిలు దాదాపు రూ.39 వేల కోట్లున్నాయి. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో మైనస్ 3 శాతమే వచ్చాయి. ఆ తర్వాత కోవిడ్ పరిస్థితులను అస్తవ్యస్తం చేసింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా తగ్గింది’ అని దువ్వూరి పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, అసత్యాలు.. ‘పబ్లిక్ డొమెయిన్‌లో అన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే రూ.3.81 లక్షల కోట్లు కూడా లేవు. కానీ పత్రికలో మాత్రం రూ.4.13 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు కథనాలు రాస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు చేసిన వాస్తవ అప్పులు కేవలం రూ.1.17 లక్షల కోట్లు కాగా అవి రూ.1.38 లక్షల కోట్లు అని రాస్తున్నారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేలా ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్యాలు ప్రచారం చేయడం మంచిది కాదు’ అని దువ్వూరి సూచించారు. -
సూపర్‌స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ సీఎం జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి: (గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్) సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2022 -
అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ
Special Interview With My Super Star Nanna Promo: సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టిన తొలి హీరో. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ప్రస్తుతం ఆయన వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు. కనీసం బయట కాలు కూడా పెట్టకుండ ఇంటికే పరిమితం అయ్యారు. చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే తప్పా ఆయన మీడియా ముందుకు రారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో కృష్ణ బర్త్‌డే రానుంది. మే 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. కాగా మంజులకు సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పెషల్ ఇంటర్య్వూ విత్ మై సూపర్‌స్టార్ నాన్న పేరుతో తండ్రిని ఇంటర్య్వూ చేసింది. తాజాగా ఈ స్పెషల్ ఇంటర్య్వూకు సంబంధించిన ప్రోమోను ఆమె రిలీజ్ చేసింది. ఇందులో మంజుల.. కృష్ణ హీరో ఎలా అయ్యారు, ఆయన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, మహేశ్‌ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికర విషయాలపై తండ్రితో చర్చించింది. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో మహేశ్‌ను చిన్నప్పడే సూపర్ స్టార్ చేశారు.. ఇది ప్లాన్డ్గా జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అని అడగ్గా.. ఇది అనుకొకుండ జరిగిందని ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఓ రోజు షూటింగ్ చూస్తానని స్టూడియోకు వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి చూస్తు అలా నిలబడ్డాడు. దగ్గరి పిలిచి ఒకసారి యాక్ట్ చేయమని అడిగితే లేదు నేను చేయను చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు’ అంటూ కృష్ణ చెబుతూ మురిసిపోయారు. అనంతరం మహేశ్‌తో కలిసి పోకిరి,దూకుడు చూశానని, అవి రెండు సినిమాలు లాండ్ మార్క్ అయ్యాయని’ కృష్ణ అన్నారు. ఇలా తనయుడు మహేశ్ బాబు గురించి, తన గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలపై చర్చించిన కృష్ణ పూర్తి ఇంటర్య్వూ చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. -
అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ
ప్రముఖ దివంగత నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు మొదటి వర్థంతి(మే21) సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ ఆయనను స్మరించుకున్నాడు. బీఏ రాజు తన అభిమాని అని.. ఆయనను తాను మద్రాసు తీసుకెళ్లాలని గుర్తు చేసుకున్నారు. ‘బీ ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్స్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ వన్ పత్రికగా తీర్చిదిద్దాడు. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా సూపర్ హిట్ పత్రికను డెవలప్ చేశాడు . తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం’ అని కృష్ణ అన్నారు. -
రెండేళ్ల తర్వాత సొంతూరికి.. కాటేసిన రోడ్డు ప్రమాదం!
సాక్షి, చివ్వెంల (సూర్యాపేట): కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయిన ఆ కుటుంబం రెండేళ్ల తర్వాత.. రెక్కలు కట్టుకుని వాలిపోయింది. కానీ, ఊహించని పరిణామం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది. జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమాంబరధర్, రజిత దంపతులు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి కుమార్తె భవాగ్న, కుమారుడు పల్విత్ ఉన్నారు. రజిత ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, హేమాంబరధర్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆడిలైడ్‌లో ఇల్లు కోనుగోలు చేశారు. కరోనాతో ఇంతకాలం ఆ కుటుంబం భారత్‌కు రాలేకపోయింది. తిరిగి ఆంక్షలు ఎత్తివేత, విమాన ప్రయాణాల పునరుద్ధరణతో తిరిగి వచ్చింది. స్వగ్రామానికి వెళ్తూ.. హేమాంబరధర్ కుటుంబ సభ్యులు ఈ నెల 25న హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో ఒకరోజు ఉండి, 26న రాత్రి పది గంటల సమయంలో తమ గ్రామానికి చెందిన తిరుపతిరావు కారు కిరాయికి మాట్లాడుకుని రెడ్డిగూడెం బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమల్గిరి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టడంతో హేమంబరధర్(47) అక్కడికక్కడే మతిచెందగా, రజిత సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. వారి పిల్లలు భవాగ్న, పల్విత్, డ్రైవర్ తిరుమలరావు తీవ్రంగా గాయపడ్డారు. వారు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేశ్ తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ భార్యకు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్ బాబు మాత్రం మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతోనే మహేశ్ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్ -
ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్
Murali Mohan Interesting Comments On Krishna: సూపర్ స్టార్ కృష్ణపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. కాగా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిచన ఆయన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇంటర్లో క్లాస్‌మెట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్లమంటూ ఆసక్తికర విషయం చెప్పారు. చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్ అలాగే ‘ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం. అయితే కాలేజీ మొత్తంలో కృష్ణ చాలా అందగాడు. అందరు ఆయన వెంట పడేవారు. ఇంటర్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన తేనె మనసులు మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం మీ అందరికి తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం తాను కూడా కొద్ది రోజుల్లోనే సినిమాల్లోకి వచ్చానని, హీరోగా కొన్ని సినిమాలు చేశానన్నారు. ఆ తర్వాత నటుడి నుంచి నిర్మాతగా మారానంటూ వారసుడి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి చెప్పారు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘కృష్ణ-నాగార్జున కాంబినేషన్లో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున ఓ సీన్లో తండ్రి కృష్ణను నిలదీస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్ణణ తారాస్థాయికి చేరుతుంది. ఇందులో కృష్ణను నాగార్జున ఎదురించడం, నువ్వెంత అంటూ ఆయనతో అమర్యాదగా వ్యవహరిస్తాడు. అది చూసిన కృష్ణ ఫ్యాన్స్ మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నన్ను కొట్టడానికి వచ్చారు’ అని అన్నారు. అంతేకాదు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడని, ఇది ఆయనను అగౌరవ పరచడమే అంటూ తనతో ఘర్షణ పడ్డారన్నారు. ఆ సీన్‌ని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే సీన్ మార్చమంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారని ఆయన అన్నారు. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ‘‘అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి. పర్సనల్‌గా తీసుకోవద్దు’ అని నేను నచ్చచెప్పినా వినలేదు. దీన్ని బట్టి అప్పడు నాకు అర్థమైంది ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇక కృష్ణ గారు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిర్మాతల హీరో అని అనొచ్చు. ఒక నిర్మాత సినిమా ప్లాప్‌తో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. తనతో సినిమా చేస్తానని చెప్పేవారు. నిర్మాతలు డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగులో మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కృష్ణ, శోభన్ బాబు వంటివారు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
అయ్యో పాపం.. నీళ్లు అనుకొని యాసిడ్ తాగిన యువకుడు
సాక్షి, కృష్ణా జిల్లా: ఓ డిగ్రీ విద్యార్థి మంచినీళ్లని అనుకుని ఫ్రిజ్‌లో ఉన్న యాసిడ్ తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చిచిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విజయవాడరూరల్ మండలం ఎనికేపాడులో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నాగాయలంకలో కోసూరి రామాంజనేయులు, రామతులసి దంపతులు నివసిస్తున్నారు. వారి కుమారులు చైతన్య, సతీష్. రామాంజనేయులు నాగాయలంక పంచాయతీ కార్యాలయం పక్కన బడ్డీకొట్టులో చెప్పుల షాపు నిర్వహిస్తూ కుమారులను చదివిస్తున్నారు. విజయవాడ లయోల కళాశాల ఏవియేషన్ విభాగంలో చైతన్య డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్షిప్ నిమిత్తం తోటి విద్యార్థులతో కలిసి కేసరపల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడేందుకు చైతన్య ఎనికేపాడు వచ్చాడు. ఆట ముగిశాక దాహం తీర్చుకునేందుకు సమీపంలోని ఓ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్‌కు వెళ్లాడు. మంచినీళ్ల బాటిల్ కావాలని అడిగారు. దుకాణం యజమాని ఫ్రిజ్‌లో ఉన్న బాటిల్ తీసుకోవాలని సూచించాడు. అయితే ఆ ఫ్రిజ్‌లో పొర పాటున యాసిడ్ బాటిల్ కూడా ఉంది. కూలింగ్‌తో ఉన్న ఆ యాసిడ్ బాటిల్‌ను వాటర్‌బాటిల్ అనుకుని చైతన్య దానిని తీసుకుని తాగాడు. వెంటనే నురగలు కక్కుకుంటూ వాంతి చేసుకోవడంతో స్నేహితులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన చైతన్య ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న విజయవాడ పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్! న్యాయం కోసం తల్లిదండ్రుల వినతి మరి కొన్ని నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేసి తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు దుకాణదారుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువుతో పోరాడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని రామతులసి, రామాంజనేయులు దంపతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చుచేసి వైద్యం చేయించామని పేర్కొన్నారు. యాసిడ్ తాగడంతో లోపల అవయవాలు దెబ్బతిన్నాయని, శస్త్ర చికిత్స చేయాల్సివస్తే రూ.లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెబుతున్నారని వివరించారు. అయితే తమకు అంత ఖర్చు భరించే పరిస్థితి లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఏపీలో త్వరలోనే ఆన్లైన్లో సినిమా టికెట్లు
-
ఏపీ: అతిత్వరలోనే ఆన్లైన్లో సినిమా టికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో అతిత్వరలోనే పూర్తిగా ఆన్లైన్ సినిమా టిక్కెట్ల పొందే వెసులుబాటును ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది ప్రభుత్వం. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టికెట్ రేట్ల నియంత్రణతో పాటు క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పడడంతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుంది. -
ఫోర్త్వేవ్కి భయపడాల్సిన అవసరం లేదు: కృష్ణ ఎల్ల
న్యూఢిల్లీ: భారత్‌లో మూడు వేవ్‌లుగా విజృంభించిన కరోనా వైరస్.. ఐదు లక్షల మందికి పైగా బలి తీసుకుంది. అంతకు మించి లాక్డౌన్, ఇతర పరిస్థితుల్లో లెక్కలేనన్ని కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసేసింది. ప్రస్తుతం కరోనా పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తపడుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. అయితే ఫోర్త్ వేవ్‌కి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల. ఢిల్లీలో పోలియోపై ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదన్న ఆయన.. కరోనా విజృంభించినా బెదిరిపోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో లాక్డౌన్ల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడిన కృష్ణ ఎల్ల.. కరోనా విజృంభించిన తట్టుకునే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. అంతేకాదు వ్యాక్సినేషన్లో భాగంగా.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉండొచ్చని చెప్తున్నారాయన. ఫోర్త్ వేవ్ ప్రభావం అంతగా ఏమీ ఉండనిచెప్పిన ఆయన.. ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మూడో డోసు(బూస్టర్ డోసు) వ్యాక్సిన్ వేసుకోవడమే కాకుండా మాస్కులు కొనసాగించడం, శానిటైజర్ వాడడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు ఆయన. -
నూజివీడులో పొలిటికల్ హీట్..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని నూజివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేత ముద్రబోయిన సవాల్‌ను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు స్వీకరించారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. సవాల్ ప్రకారం.. ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు నూజివీడుకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నూజివీడు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తెలిపారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గానికి టీడీపీ చేసిందేమీలేదని అన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ముద్రబోయిన మమ్మల్ని విమర్శిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని మండిపడ్డారు. -
అది ఎప్పుడూ మిస్ చేసుకోం.. ప్రేమిస్తూనే ఉంటాం : నమ్రత ఎమోషల్ పోస్ట్
Superstar Krishna Best Moments With His Grandchildren: సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హీరో అయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్ చెబుతుంటాడు. అప్పట్లో కృష్ణ ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షూటింగ్ లేకుండా ఖాలీగా ఉంటే.. ఆ సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయిస్తాడు. అలాగే వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతుంటుందట. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)