విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్‌ | Actress Vijaya Nirmala Property Whose Owner | Sakshi
Sakshi News home page

విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్‌

Published Tue, Aug 29 2023 8:10 PM | Last Updated on Wed, Aug 30 2023 11:18 AM

Actress Vijaya Nirmala Property Whose Owner - Sakshi

చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు.  2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్‌ స్పందించాడు. నరేష్‌ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్‌ అనే సంగతి తెలిసిందే.

'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్‌) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్‌.. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని  నేను కూడా అనుకున్నాను.

అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్‌ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్‌వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది.' అని నవీన్‌ తెలిపాడు.

తేజ నరేశ్‌ రెండో భార్య కుమారుడు కాగా రణ్‌వీర్‌ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్‌లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్‌ పాపులర్‌ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్‌ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్‌ షిఫ్ట్‌ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్‌ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్‌ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తం‍డ్రి నరేశ్‌ అంటే ఎంతో గౌరవం అని నవీన్‌ తెలిపాడు.

(ఇదీ చదవండి; డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement