నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్‌షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్‌గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్‌డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
(ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు)
కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు, భాషా ఇన్‌స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్‌డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు.
(ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి)
కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్‌డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment