Pavitra Lokesh
-
ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్లో జంధ్యాల జీవితంపై రైటర్ సాయినాథ్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.అయితే తన కెరీర్లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.Visuals of Actor & MAA President @iVishnuManchu, Director @AnilRavipudi, Actor @ItsActorNaresh, and #PavitraLokesh from the Vijaya Nirmala Awards function in Hyderabad! 📸🤩#ManchuVishnu #AnilRavipudi #ShivaBalaji #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/LkIrqymsGi— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2025 -
నటుడు నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్‌గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్‌కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
నరేష్ కోసం బేబీని వెతికి మరీ తీసుకొచ్చాను..
-
పవిత్రతో నా జీవితం ఎలా ఉందంటే?: నరేశ్
తొమ్మిదో ఏట ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వీకే నరేశ్. పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే అతడు ‘ఐఎస్ సీఏహెచ్ఆర్(ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్)’ నుంచి 'సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నాడు. సగం మంది విడాకులే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి జీవిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవిత్రతో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. దీనికి నరేశ్ స్పందిస్తూ ముందుగా ఏవేవో లెక్కలు వేశాడు. 'ప్రపంచంలో దాదాపు సగం మంది విడాకులు తీసుకుంటున్నారు. 70% మంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. విడిపోయి ఎవరికి వారు సొంతంగా బతుకుతున్నారు. మంచి, చెడ్డ పక్కన పెడితే ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండాలి. ముందు సంతోషంగా లేను అలాగే తోడు లేకుండా ఉండలేమా? అంటే 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు అవసరం. ఈ సమయంలో సరైన భాగస్వామి అవసరం. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల సంతోషంగా లేను. అందుకే విడాకులు తీసుకున్నాను. నేను సెలబ్రిటీ కాబట్టి విమర్శలు, వివాదాలు వస్తాయి. అన్నింటితో పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం పవిత్రతో నేను సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: థియేటర్లో సినిమా చూసి జక్కన్న.. కీరవాణి నిద్రపోతున్నాడా? -
కెరీర్ కోల్పోయా.. డిప్రెషన్, ఆర్థిక ఇబ్బందులు.. నరేశ్ ఎమోషనల్
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నటుడు నరేశ్. దివంగత నటి, దిగ్గజ దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఇతడు తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఈయన సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు కావస్తుండగా తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని నరేశ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఐక్యరాజ్య సమతి అనుబంధ సంస్థ అయిన ఐఎస్ సీఏహెచ్ఆర్ (ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్) నుంచి ఆయన సార్ అనే బిరుదుతో పాటు డాక్టరేట్‌ను అందుకున్నాడు. నాలో స్ఫూర్తిని నింపింది.. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై ప్రసంగించినందుకుగానూ నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. అంతేకాదు ఇకపై నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్ అనే హోదా చేరుతుంది. ఈ సంతోషం నరేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అతడు తన గోల్డెన్ జూబ్లీ గురించి ఆసక్తికర పోస్ట్ వేశాడు. అలాగే తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంతగానో ఇన్స్పైర్ చేసిన పాటను షేర్ చేశాడు. ఇష్టమైనవాళ్లు వదిలేసి పోయారు.. 'నా జీవితం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఈ పాట నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. ఆ సమయంలో నేను కెరీర్ కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇష్టమైనవాళ్లు శాశ్వతంగా దూరమయ్యారు. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఓ జోకర్ నాపై పనికిరాని కేసు వేసినప్పటికీ నా తల్లి, స్నేహితుడు విజయ్ మద్వా మాత్రమే నాకు అండగా నిలబడ్డారు. సుమారు 100 కిలోల దాకా బరువు ఉండే నేను ఇప్పుడిలా మారిపోయాను. ఈ పాట నాలో స్ఫూర్తిని నింపడమే కాదు, నేను శక్తివంతంగా కమ్‌బ్యాక్ ఇచ్చేలా చేసింది. డిప్రెషన్లో అప్పుడలా.. ఇప్పుడిలా.. నేనిప్పుడు సినీప్రయాణంలో 50వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మైలురాయిని అందుకోవడంతో తోడ్పడిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రియురాలు పవిత్ర లోకేశ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన వీడియోలను సైతం సదరు పోస్ట్‌లో పొందుపరిచాడు. అలాగే 2003లో డిప్రెషన్లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాను? 2023లో గోల్డెన్ జూబ్లీ వచ్చినప్పుడు ఎలా ఉన్నానో తెలియజేస్తూ అప్పటి, ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టాడు నరేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. This one song, inspired me during the toughest period of my life, losing my career, facing financial strain, and the departure of supposed loved ones. Despite heckling from relatives and being labeled a 'fome case' and a joker, only my Mother and friend Vijay Wadhwa stood by… pic.twitter.com/GXRqneF0CS — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 29, 2023 చదవండి: సినిమాలకు హీరోయిన్ ఇలియానా గుడ్‌బై? -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్‌గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్‌ని ఓ ఈవెంట్‌కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర
తెలుగు ఇండస్ట్రీలో మిగతా కపుల్స్ సంగతేమో గానీ నరేశ్-పవిత్రా లోకేశ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నరేశ్ ఇప్పటికే పలుమార్లు పెళ్లి చేసుకుని విడిపోయాడు. పవిత్ర కూడా ఇలానే పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంది. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ మధ్య తమ జీవితం ఆధారంగా 'మళ్లీ పెళ్లి' పేరుతో ఓ సినిమా కూడా తీసిపడేశారు. అలాంటి ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత జంటగా స్టేజీపై కనిపించారు. కొత్త జంటలా సందడి చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) వినాయక చవితి సందర్భంగా ఓ ఎంటర్టైన్మెంట్ షో టెలికాస్ట్ కాబోతుంది. ఇందులోనే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా పాల్గొన్నారు. కొన్నాళ్ల ముందు నుంచి ఎక్కడైనా సరే ఇద్దరూ జంటగా కనిపిస్తున్నారు. కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఈసారి కూడా దానికి ఏ మాత్రం తక్కువ కాదు అనేలా.. స్టేజీపై 'మాస్టారూ మాస్టారూ' పాటకు డ్యాన్స్ చేయడంతోపాటు ముద్దులు కూడా పెట్టారు. అలానే నరేశ్‌ని ముద్దుగా ఏమని పిలుస్తుందో పవిత్ర బయటపెట్టింది. 'మళ్లీ పెళ్లి' ప్రమోషన్ లో భాగంగా పవిత్రని అమ్ములు అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ చెప్పాడు. పవిత్ర మాత్రం నరేశ్‌ని 'రాయ' అని ముద్దుగా పిలుస్తుందట. తాజాగా రిలీజ్ చేసిన షో ప్రోమోలో ఈ విషయాన్ని పవిత్రా లోకేశ్ బయటపెట్టింది. ఇక వీళ్లపై హైపర్ ఆది చిన్నగా పంచులు కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నరేశ్-పవిత్రా లోకేశ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) -
నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కౌంటర్!
కొన్నాళ్ల ముందు ఇండస్ట్రీలో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ల లైఫ్ ని సినిమాగా తీసి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవును మీరు ఊహించింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేశ్. 'మళ్లీ పెళ్లి' అని సినిమా వీళ్లు చేయడం మాటేమో గానీ కొన్నాళ్లపాటు తెగ ట్రెండ్ అయ్యారు. సరేలే వీళ్ల గురించి అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్ దీనికి కారణం? విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నటుడిగా ఇతడిని వంకపెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే పలు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్.. మాజీ భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉంటున్నాడు. అదే టైంలో నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి తమ బంధంపై 'మళ్లీ పెళ్లి' అనే మూవీ తీయడం.. దానిపై రమ్య రఘుపతి కోర్టుకెళ్లడం లాంటి విషయాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సరే దాని గురించి వదిలేస్తే.. వీళ్లిద్దరూ జంటగా ఓ తెలుగు ఛానెల్లో ప్రసారం కాబోతున్న వినాయక చవితి ఈవెంట్లో పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది.. నరేశ్‌పై ఫన్నీగా కౌంటర్ వేశాడు. 'నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు. పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్?' అని హైపర్ ఆది.. స్టేజీపై అందరూ చూస్తుండగానే నరేశ్‌ని అడిగేశాడు. పక్కనే పవిత్రా లోకేశ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్‌కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు. ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు. బహుశా ఫుల్ ఈవెంట్లో నరేశ్ చెప్పిన ఆన్సర్ చూపిస్తారేమో? ఏదేమైనా అలా పెళ్లిళ్ల గురించి డైరెక్ట్‌గా అడిగేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
నటి పవిత్ర లోకేష్‌కు బిగ్ షాక్...
హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీని అభ్యసించేందుకు ప్రయత్నించిన నటి పవిత్ర లోకేష్‌కు బిగ్ షాక్ ఎదురైంది. ఇటీవల జరిగిన సీఈటీ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించినా సీనియార్టీ, ఫైనల్ లిస్ట్‌లో ఆమె పేరు లేదు. దీంతో ఆమె ఆశలు ప్రస్తుతానికి నెరవేరే అవకాశాలు లేనట్లే. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్బణ్ణరై మాట్లాడుతూ నటి పవిత్ర కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు ప్రయత్నించి సీఈటీలో ఉత్తీర్ణత సాధించినా ఉత్తమ ర్యాంక్ సాధించలేక పోవడంతో ఆమెకు సీటు లభించలేదన్నారు. -
పరీక్షా ఫలితాలు విడుదల.. పవిత్రా లోకేష్ రిజల్ట్ ఏంటంటే
నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. (ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్స్టిట్యూట్తో పాటు, భాషా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. -
ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్
'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రసారం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతికి అనుమతి లేదని కూడా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ మీడియా సంస్ధతో ఆయన ఇలా మాట్లాడారు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) 'ఆమెకు (రమ్య రఘుపతి) చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వస్తున్నారు. ఇది మా కుటుంబంలోని సభ్యులకు (తల్లి వైపు) కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము కోర్టు రక్షణను కోరాము. ఇప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించకూడదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.' అని నరేష్ తెలిపారు. అంతే కాకుండా నరేష్, రమ్య ఇద్దరూ విడిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తామిద్దరం కలిసి జీవించడం లేదని కోర్టు కూడా నిర్ధారించిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమ విడాకులకు మార్గం సుగమం అయిందన్నారు. అందుకు సంబంధించి తాను ఇప్పటికే కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపిన నరేష్ ఈ తీర్పు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు) ఈ ఏడాది ప్రారంభంలో రమ్య నుంచి విడాకుల కోరుతూ కూకట్పల్లి కోర్టులో తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి తన చుట్టు ఎన్నో వివాదాలు వచ్చాయని నరేష్ ఇలా తెలిపారు. 'నేను, పవిత్ర లోకేష్‌తో కలిసి వుండటాన్ని కొంతమంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఊహాగానాలు చేస్తుంటే, నేను ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇకనుంచి అయినా నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి ఈ కేసు వల్ల విడాకుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.' అని నరేష్ అన్నారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'మళ్లీ పెళ్లి'.. ఆ లిస్ట్‌లో ట్రెండింగ్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈనెల 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్‌లోనే టాప్-2లో నిలిచింది. మొదటిస్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుండగా.. రెండోస్థానంలో నరేశ్, పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రెండ్ అవుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కని చిత్రాలకు ఓటీటీలో ఊహించని రీతిలో దూసుకెళ్తున్నాయి. (ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!) Thank you everyone 🙏#MALLIPELLI ranked #10 among @Binged_ OTT Top 10 Most watched movies this weekend🤩 ▶️ https://t.co/bfLWwB1Hdk#MalliPelliOnAha#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @ahavideoIN pic.twitter.com/0AmYZLX8Jv — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 25, 2023 -
నరేశ్‌పై 'మళ్లీపెళ్లి' ఎఫెక్ట్
నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (ఇదీ చదవండి: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్.. కారణాలు ఇవే) తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా (నేడు జూన్ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్‌కు రమ్య నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు. (ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) ఇప్పుడున్న పరిస్థితుల్లో OTT ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్‌ను రీచ్ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు. ఈ నోటీసుల వల్ల ఆమెజాన్ ప్రైమ్‌లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఓటీటీకి మళ్లీ పెళ్లి.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారు. (ఇది చదవండి: నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!) #MalliPelli streaming on @ahavideoIN from June 23rd. pic.twitter.com/UrBrXK475m — Vamsi Kaka (@vamsikaka) June 19, 2023 -
పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్.. నెటిజన్స్ ప్రశంసలు
నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్ల రిలేషన్షిప్ గురించి ఎప్పుడో అందరికి తెలుసు. కానీ ఈ మధ్య ‘మళ్ళీ పెళ్లి’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ స్టోరీ వీళ్ల పర్సనల్ లైఫ్‌కు సంబంధించింది కావడంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ని షేక్ చేసిన ఈ జంట .. ఇప్పుడు మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి చర్చ ఆగడం లేదు. ఏదో రకంగా వీరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ నరేశ్ చేసిన ఆ గొప్ప పని ఏంటంటే.. పవిత్రతో పరీక్షలు రాయించాడు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్! ) పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక. అందుకోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి బళ్ళారి వెళ్లారు. ఆమెతో పాటు నరేశ్ కూడా బళ్ళారి వెళ్లి.. పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉన్నాడట. దగ్గరుండి మరీ పరీక్ష రాయించడంతో నెటిజన్స్ నరేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు. -
శారీరకంగా పర్ఫెక్ట్.. పిల్లలను కనడంపై నరేశ్, పవిత్ర బోల్డ్ కామెంట్స్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాము ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి చెప్పడానికే ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నరేశ్, పవిత్రల రిలేషన్షిప్ మాత్రం అందరికి తెలిసిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. (చదవండి: స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ ) మాములుగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న బయటకు చెప్పాలన్నా భయపడతారు. కానీ నరేశ్, పవిత్రలు మాత్రం ప్రతీది చాలా ఓపెన్‌గా చెప్పేశారు. పెళ్లి విషయమే కాదు... పిల్లలు కనడంపై తమ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేశారు. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పారు. ‘ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం. నా దృష్టిలో బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది. కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేంది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్ చెప్పుకొచ్చాడు. -
మళ్ళీ పెళ్లి కృష్ణగారికి అంకితం
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్‌ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. -
ఆ ఓటీటీలోకే రానున్న 'మళ్లీ పెళ్లి'
సీనియర్ నటుడు నరేశ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ హీరోయిన్గా నటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్ డిసైడ్ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పవిత్ర లోకేశ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పవిత్ర లోకేశ్ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. కానీ నరేశ్‌తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని నరేశ్ బహిరంగంగా ప్రకటించాడు. ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. నరేశ్ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుందట. (చదవండి: మళ్ళీ పెళ్లి మూవీ రివ్యూ) వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్‌ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. -
Malli Pelli Review: ‘మళ్ళీ పెళ్లి’ మూవీ రివ్యూ
టైటిల్: మళ్ళీ పెళ్లి నటీనటులు: వీకే నరేశ్, పవిత్రా లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు నిర్మాణ సంస్థ: విజయకృష్ణ మూవీస్ నిర్మాత: వీకే నరేశ్ దర్శకత్వం: ఎమ్మెస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటర్: జునైద్ సిద్ధిక్యూ విడుదల తేది: మే 26, 2023 ప్రశ్న: ‘నరేశ్ గారు.. ‘మళ్ళీ పెళ్లి’ రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి తీశారా? జవాబు: ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం చెప్పాం. ప్రశ్న: ఎమ్మెస్ రాజు గారు.. ట్రైలర్ చూస్తే ఇది నరేశ్‌గారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తు చేస్తున్నాయి. ఇది నరేశ్‌గారి బయోపిక్ అనుకోవచ్చా? జవాబు: అలా ఎలా అనుకుంటారు? ఇది ట్రెండింగ్ టాపిక్. ట్రైలర్లో చూపించిన సీన్స్ నరేశ్ నిజ జీవితంలో జరిగినే అని ఎందుకు అనుకుంటారు? యూట్యూబ్‌లో వందల వీడియోలు ఉంటాయి. అలాంటివే ఇవి. ఇది సినిమా ప్రమోషన్స్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానం. టైటిల్.. ట్రైలర్.. అందులో చెప్పించిన సంభాషణలు అన్ని నరేశ్ జీవితానికి సంబధించినవే అయినప్పటికీ.. ఎక్కడా ఇది నా కథ అనిఆయన చెప్పలేదు. మరి ఇది ఎవరి కథ? నరేశ్-పవిత్రల బయోపికా? లేదా కల్పిత కథనా? ‘మళ్ళీ పెళ్లి’ కథేంటంటే.. టాలీవుడ్‌కి చెందిన సీనియర్ హీరో నరేంద్ర(వీకే నరేశ్)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేనపతి(వనితా విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారం అంటూ ఆమె.. సినిమా అంటూ నరేంద్ర ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతారు. అదే సమయంలో నరేంద్రకు కన్నడ నటి పార్వతి(పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. పార్వతికి ఇద్దరు పిల్లలు. భర్త ఫణింద్ర(అద్దూరి రవివర్మ)తో గొడవలు ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు నరేంద్రకు మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య గొడవలు ఏంటి? నటుడు, రచయిత అయిన ఫణింద్ర.. భార్య పార్వతికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? బెంగళూరు మీడియాను అడ్డుపెట్టుకొని సౌమ్య ఆడిన నాటకం ఏంటి? నరేంద్ర, పార్వతి కలిసి ఓ రోజు హోటల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మొత్తం ఐదు చాప్టర్లుగా సినిమాను తీర్చి దిద్దారు. మొదటి చాప్టర్లో నరేశ్-పవిత్రల పరిచయాన్ని .. రెండో చాప్టర్లో రమ్య రఘుపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూపించారు. ఇక మూడో చాప్టర్లో పవిత్రా లోకేష్ కెరీర్.. పెళ్లి సంఘటనలను చూపించారు.నాలుగు, ఐదు చాప్టర్లలో నరేశ్-పవిత్రలు కలిసి ఉండడం.. మూడో భార్య మీడియాకెక్కడం తదితర సంఘటనలను చూపించారు. అయితే సినిమా మొత్తం చూస్తే.. నరేశ్-పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్తలు అస్సలు మంచి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, కల్పితం ఎంతో చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని విషయాలను చాలా బోల్డ్‌గా చూపించారు ఎమ్మెస్ రాజు. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. అలాగే పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితానికి సబంధించి తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయాలను చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే.. నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన ఘటనలు.. వారి నేపథ్యం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ బెంగళూరులో రమ్య రఘుపతి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? నరేశ్-పవిత్ర హోటల్లో మీడియాకు ఎలా దొరికిపోయారు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్లకు మళ్లీ పెళ్లి నచ్చుతుంది. అయితే ఇదంతా నరేశ్-పవిత్రల వెర్షన్ మాత్రమే. మరి రమ్య రఘుపతి వెర్షన్ ఏంటి అనేది ఇలాగే సినిమాను తెరకెక్కించి చెబుతారా? లేదా ప్రెస్ మీట్లో చెబుతారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు మనం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నరేంద్ర పాత్రలో నరేశ్, పార్వతి పాత్రలో పవిత్రా లోకేశ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండించారు. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక సూపర్‌స్టార్ పాత్రలో శరత్ బాబు, నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక యంగ్ పార్వతిగా అనన్యా నాగళ్ల తెరపై చాలా అందంగా కలిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో కథలో భాగంగా వస్తుంటాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నరేశ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మళ్ళీ పెళ్లితో పెద్ద హిట్ సాధిస్తాం
‘‘పెళ్లనేది పవిత్రమైనది. దాన్ని గౌరవించాలనే కోణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాం. యువతరంతో పాటు అన్ని వయసుల వారికీ కనెక్ట్ అయ్యే కథ ఈ చిత్రంలో ఉంది. పెద్ద హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు వీకే నరేశ్. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్‌కి జోడీగా పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం వీకే నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారు (విజయ నిర్మల) తన ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి 1972లో విజయకృష్ణ మూవీస్‌ని స్థాపించారు. ఈ బేనర్ స్థాపించి 50 ఏళ్లు, నా సినీ జీవితం ప్రారంభించి కూడా యాభై ఏళ్లు. ఈ సమయంలో హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా వినోదంతో పాటు షాకింగ్‌గా ఉంటుంది.. నటుడిగా థ్రిల్‌గా ఉంది. పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా ఉండరు. ఇక సినిమాలకు వస్తే.. పది మంది హీరోలే బిజీగా ఉంటారు. నేను హీరోగా హిట్స్ ఇచ్చాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. విజయకృష్ణ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్‌ని మళ్లీ తీసుకురావడం, కృష్ణ–విజయ నిర్మలగార్ల వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వడం.. ఇవన్నీ నిర్మాతగా నాకు పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజుగారిని నమ్మాను’’ అన్నారు. -
నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్: పవిత్రా లోకేష్
‘‘వినోదం, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో రూపొందిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ చిత్రకథ సమాజానికి అద్దం పడుతుంది’’ అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. వీకే నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా పవిత్రా లోకేష్ మాట్లాడుతూ– ‘‘ఎమ్మెస్ రాజుగారు ‘మళ్ళీ పెళ్లి’లో నరేశ్‌గారు, నేను నటిస్తేనే బాగుంటుందనడంతో చేశాం. మళ్ళీ పెళ్ళి అంటే సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది. ఇదొక్కటే కాదు.. సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. మా విషయంలో (నరేశ్–పవిత్ర) కొన్ని సంఘటనలు జరిగాయి. (చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?) కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. విజయ నిర్మల, కృష్ణగార్లతో పాటు మహేశ్బాబుగారిని కూడా కలిశాను. ఆ ఫ్యామిలీ మమ్మల్ని (నరేశ్–పవిత్ర) యాక్సెప్ట్ చేసింది’’ అన్నారు. -
నాకు.. నరేశ్‌కి ఆ అదృష్టం దక్కింది
‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్‌కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్‌లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్ ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్ మాట్లాడుతూ–‘‘నా రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను. జీవితంలో ఫస్టాప్ కంటే సెకండాఫ్ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పవిత్రా లోకేశ్. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్‌లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్ కథ’’ అన్నారు ఎమ్మెస్ రాజు. -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్‌తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్‌తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్‌తో రిలేషన్‌పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే!
గతవారం లాగే ఈ వారం కూడా థియేటర్స్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలతో పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే థియేటర్స్‌లో విడుదలయ్యేవి చిన్న చిత్రాలే అయినా.. మంచి బజ్‌ని క్రియేట్ చేసుకున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని హిట్ సినిమాలో స్క్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం. మళ్లీ పెళ్లి నరేశ్ వి.కె, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మేమ్ ఫేమస్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. 2018 టొవినో థామస్, కుంచకో బోబన్, అసీఫ్ అలీ, లాల్ తన్వి రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘2018’. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ మే 26న విడుదల కాబోతుంది. మెన్ టూ నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెన్ టూ. శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. వీటితోపాటు జైత్ర, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భజాగోవింద అనే చిన్న సినిమాలు కూడా ఈ వారమే థియేర్స్‌లో సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే.. జీ5 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (మే 26) సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (మే 26) జియో తోడేలు (మే 26) అమెజాన్ ఫ్రైమ్ వీడియో సిటాడెట్ చివరి ఎపిసోడ్ మిస్సింగ్ మూవీ(మే 24) ఆహా గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ -3(మే 23) సత్తిగాడు రెండెకరాలు(మే 26) డిన్నీ +హాస్ట్‌స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్ మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ మే 26 -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్‌ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్‌బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్‌కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. -
'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నరేష్ మరియు పవిత్ర లోకేష్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!
‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి. నా కెరీర్లో ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్ విజయ కృష్ణ మూవీస్. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్ని అడిగితే.. ‘బోల్డ్ కంటెంట్.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు. -
Naresh - Pavitra: నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు అండగా ఉంటా: నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయనుండగా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నరేశ్, పవిత్రా లోకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) నరేశ్ మాట్లాడుతూ.. 'మళ్లీ పెళ్లి అనే సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించింది కాదు. సమాజంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్లే వివాహ వ్యవస్థ ప్రస్తుతం దెబ్బతింటోంది. వివాహాబంధంపై గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. సోషల్‌మీడియాలో మాపై విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే సినిమా చేశానన్నారు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్‌లో వీడియోలు షేర్ చేయవచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లై చేశా. ఆ తర్వాత మా ఇద్దరి బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని అన్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్) పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' ఓ సినిమా షూటింగ్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. ఏ విషయంలోనైనా పాజిటివ్‌గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు.' అని అన్నారు. -
త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్‌మీడియలో తెగ ట్రెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్‌పై రెచ్చిపోయిన నరేష్ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) 'కావేరి గాలిలా' అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా.. సింగర్ నరేశ్ అయ్యర్ ఆలపించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్‌బాబు, వనితా శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అయితే అదంతా అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేసినట్లు వెల్లడించారు. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో పవిత్ర లోకేశ్, నరేశ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. (ఇది చదవండి: Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!) ఈ సందర్భంగా ఓ టీవీ షోలో నరేశ్, పవిత్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. వేదికపైనే ఈ ప్రేమజంట ముద్దులతో రెచ్చిపోయారు. వీరిద్దరిని చూసిన యాంకర్ ఓ చిలిపి ప్రశ్న వేశారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: చిన్న రూమ్ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ) -
నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?
టాలీవుడ్లో నరేశ్, పవిత్ర లోకేశ్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ జంట చాలాసార్లు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ జంట గురించి రకరకాలుగా వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత నరేశ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇటీవలే మళ్లీ పెళ్లి చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నరేశ్.. పవిత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల) ప్రస్తుతం ఆయన 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన పవిత్ర లోకేశ్ గురించిన ఆసక్తికర కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో పవిత్ర భోజనం తీసుకొచ్చేదని అన్నారు. ఈ ఈవెంట్లో కొన్ని ఫోటోలు కెమెరాల్లో బంధించగా.. అదే సమయంలో కెమెరా నరేశ్ ఫోన్‌ను క్లిక్ మనిపించింది. ఆయన ఫోన్లో వాల్ పేపర్‌గా నరేశ్, పవిత్ర ఫోటో కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందోనని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. నరేశ్.. తన మూడో భార్యతో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) -
కృష్ణ,విజయనిర్మల నటించిన సినిమానే మళ్ళీ పెళ్లి..నరేష్ షాకింగ్ కామెంట్స్
-
ఇండియాలోనే నరేష్ బెస్ట్ యాక్టర్
-
డర్టీ హరి చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయా: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అమ్మకు గుడి కట్టడంతో నా పని అయిపోలేదు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే విజయకృష్ణ మూవీస్‌ను రీ లాంఛ్ చేశాను. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన డర్టీ హరి చూసి ఫ్యాన్ అయిపోయాను. మూడేళ్ల నుంచి రాజుగారితో ప్రయాణిస్తున్నాను. టీజర్, ట్రైలర్లో కంటే సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఉంది. అమ్మానాన్న కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమా టైటిల్‌నే మా సినిమాకు వాడుకున్నాం' అన్నాడు నరేశ్. నటి పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ.. 'నటీనటులను పాంపర్ చేసే దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన ఒక అన్నగా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సినిమాలో నా పాత్రకు వంద శాతం న్యాయం చేశాననుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు -
మళ్లీ పెళ్లి ట్రైలర్.. రియల్ లైఫ్ స్టోరీని దింపేశాడుగా!
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 'తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి?..' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. పార్వతి.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అని నరేశ్ అడగ్గా.. చాలా బాగా చూసుకుంటాడని బదులిచ్చింది పవిత్ర అలియాస్ పార్వతి. అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్వేంటి? సర్ అని మధ్యలో ఓ డైలాగ్ నరేశ్ మనసులోని మాటను బయటపెట్టింది. 'అసలైన సూపర్‌స్టార్ పెద్ద భార్య కొడుకే నరేంద్ర.. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి..', 'నీతో రిలేషన్ ఉందని ఒప్పుకుంటే వాళ్లడిగే మొదటి ప్రశ్న.. ఉంచుకున్నారా? అని!' అంటూ వచ్చే డైలాగులు నరేశ్ రియల్ స్టోరీని గుర్తు చేసేలా ఉన్నాయి.. అలాగే నరేశ్ తన మూడో భార్యను తన్నడం.. చివర్లో నరేశ్, పవిత్ర ఒక హోటల్ గదిలో ఉంటే అతడి మూడో భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు రెడీ అయిన సన్నివేశం చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా నరేశ్ తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
నరేష్, పవిత్రా లోకేశ్‌ల 'మళ్లీ పెళ్లి' రొమాంటిక్ సాంగ్ రిలీజ్
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నరేష్, పవిత్రా లోకేశ్‌ల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్‌బాబు, వనితా శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం 'మళ్లీ పెళ్లి.' ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తాజా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎంఎస్ సుబ్బరాజు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) కాగా.. సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గతంలోనే ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసి అందరికీ షాకిచ్చారు. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. అయితే తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?) Life Goes in a Full Circle 💞#MalliPelli Releasing in Worldwide Theaters On May 26th ❤️🔥 Lets Start the Celebrations with some crazy updates!🕺#MalliPelliOnMay26 💥@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_… pic.twitter.com/RWJaL0JWkJ — MS Raju (@MSRajuOfficial) May 3, 2023 -
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్‌పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్‌గా మారింది. అయితే ఈ టీజర్‌పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
"మళ్ళీ పెళ్లి" టీజర్ లో రచ్చ..
-
Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. అయితే అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
నరేశ్-పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ క్రేజీ అప్డేట్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. ఆ సినిమా పేరే ‘మళ్ళీ పెళ్లి’. మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ 13న ‘మళ్ళీ పెళ్లి’టీజర్ విడుదల చేయనున్నట్లు నరేశ్ ట్వీటర్ వేదికగా తెలిపాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు. జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. Experience the Magic of Love with the Teaser of #MalliPelli - Telugu ❤️🔥#MattheMaduve - Kannada ❤️🔥 RELEASING ON APRIL 13th 🫶 Directed by @MSRajuOfficial #PavitraLokesh @vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic Summer 2023 Release! pic.twitter.com/3AT2b7HQvw — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) April 8, 2023 -
ప్రజల్లోకి పవిత్ర, నరేష్ (ఫోటోలు)
-
సందడి చేసిన నరేష్, పవిత్ర లోకేష్
పశ్చిమ గోదావరి: మండలంలోని ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
నరేశ్- పవిత్ర పెళ్లి.. ఎట్టకేలకు వచ్చేసిన క్లారిటీ!
నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరలయిన సంగతి తెలిసిందే! ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్న ఫోటో కూడా తెగ చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే ప్రకటించడంతో నిజంగానే వీరి పెళ్లి అయిపోయిందనుకున్నారంతా! కానీ కొందరు మాత్రం ఇది రియల్ పెళ్లిలా లేదే? రీల్ పెళ్లిలా ఉందే! అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వారి అనుమానమే నిజమైంది. నరేశ్- పవిత్రల పెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో భాగమేనని రుజువైంది. పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు నరేశ్. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్, వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చావు దెబ్బ కొట్టావ్.. నీ పని బాగుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. A beautiful project to celebrate the glorious 50th anniversary of #VijayakrishnaMovies🤩 Here’s the 1st Look of my next #MattheMaduve ❤️ Kannada - https://t.co/6jOBbGUKSP Directed by @MSRajuOfficial Co-starring #PavitraLokesh😍 Summer 2023 Release!@VKMovies_ pic.twitter.com/pbxIgzQQZc — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 #MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 -
నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేష్‌కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్‌తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్ కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్‌కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్. ఈ విషయం నరేష్‌కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
నరేశ్- పవిత్ర పెళ్లి వీడియో.. స్పందించిన నటుడు
ఉదయం నుంచి నరేశ్- పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే తాజాగా ఆ ట్రెండింగ్ పెళ్లి వీడియోపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలు మీతో చెబుతానంటూ వివరణ ఇచ్చారు. 'ఇంటింటి రామాయణం' మూవీ సమావేశంలో పాల్గొన్న నరేశ్ 'మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. త్వరలోనే వెల్లడిస్తా.. నరేశ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నాకు రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్ కూడా ఉంది. త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి వరకు కాస్తా ఓపిక పట్టండి. ఇప్పుడు నేను మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం ప్రమోషన్స్‌పై ప్రభావం పడుతుంది. ’అని అన్నారు. అసలేం జరిగిందంటే... కాగా.. నరేశ్ తన ట్విటర్ ఖాతాలో 'ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా-నరేశ్' అని పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. సమ్మోహనం చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ - పవిత్ర ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అంతే కాకుండా కొత్త ఏడాదిలో స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియో ఆ వార్తలకు మరింత ఊతమిచ్చింది. -
రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాము ఒక్కటయ్యామంటూ ఈ రోజు(మార్చి 10న) నరేశ్ అధికారిక ప్రకటన ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరి పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వివాహ ప్రకటనలో నరేశ్ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాలో భాగంగా తీసిన వీడియో క్లిప్‌ను నరేశ్ షేర్ చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నెటిజన్లు నరేశ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరె ఎంట్రా ఇది... ఎన్ని సార్లు ఫూల్ చేస్తావంటూ నరేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర? ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ రోజు నరేశ్ ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ పెళ్లి వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ నరేశ్-పవిత్రల గురించి షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘‘పవిత్ర బంధం’ అంటూ ఈ రోజు నరేశ్ ట్విట్టర్లో షేర్ చేసిన పెళ్లి వీడియో నిజం కాదు. రెండు నెలల క్రితమే నరేష్, పవిత్రను వివాహం చేసుకున్నాడు. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఓ సినిమాలోనిది. దీనికి ఎం ఎస్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’’అని ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్ వేణు దీంతో ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజమా? అంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. దీంతో నరేశ్‌పై తమదైన స్టైల్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాగా నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. మూడవ భార్య రమ్య రఘుపతి విడాకుల వ్యవహరం ఇంకా కోర్టులోనే ఉంది. మరోవైపు పవిత్రకు కూడా ఇదివరకే రెండుసార్లు పెళ్లై విడాకులైన సంగతి తెలిసిందే. సమ్మోహనం మూవీ సమయంలో పవిత్ర-నరేశ్‌లు మధ్య పరిచయం ఏర్పడగా అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్ రిలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపై రూమర్స్ రాగా న్యూ ఇయర్ సందర్భంగా తమ రిలేషన్‌పై నరేశ్ అధికారిక ప్రకటన ఇచ్చాడు. కాగా ప్రస్తుతం నరేశ్-పవిత్రలు దుబాయ్ వెకేషన్లో ఉన్నారు. పవిత్ర బంధం అంటూ ట్విట్టర్ లో పెళ్లి వీడియో పోస్ట్ చేసిన @ItsActorNaresh రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నరేష్. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమా కి సంబంధించింది. సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఎమ్ ఎస్ రాజు https://t.co/SN8qYlpSEk — HEMA NIDADHANA (@Hema_Journo) March 10, 2023 -
Naresh-Pavitra Photos: పెళ్లి బంధంతో ఒక్కటైన నరేష్-పవిత్రా లోకేశ్? (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత దుబాయ్‌కు చెక్కేసిన నరేష్- పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్లో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’అంటూ నరేష్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నరేష్-పవిత్రా లోకేశ్‌లు తాజాగా మరోసారి పెళ్లి వీడియోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. నరేష్‌కు ఇది నాలుగో పెళ్లికాగా పవిత్రా లోకేశ్‌కు ఇది మూడో పెళ్లి. ఇక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో సందడి చేస్తున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నరేష్-పవిత్రా లోకేశ్‌ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! కనిపెట్టేసిన నెటిజన్లు
సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్‌కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్‌లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు. మరోవైపు.. సూపర్‌స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్లో పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్‌కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్-పవిత్రలు సీక్రెట్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్ కోసం పవిత్రతో రిలేషన్‌పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్.. ఇప్పుడు కూడా అదే స్టంట్ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నరేశ్‌కు పవిత్ర దగ్గరవ్వడానికి కారణం అదే: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రమ్య మాట్లాడుతూ..' నరేశ్ డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. అదే నాకు పెద్ద ఆధారం. నేను కూడా అలిగేషన్స్ వేశా. నేను ఏం అలిగేషన్స్ వేశానో ఆధారాలు ఉన్నాయి. ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసినా ఆరోపణలు నిరూపించలేకపోయారు. డివోర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడటం సరికాదు. చైల్డ్ గార్డియన్ షిప్, నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు. నాపై రకరకాలుగా కేసులు వేశారు. నేను వీటన్నింటినీ ఎదుర్కొంటున్నా. నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వయోలెన్స్. నాకు, నా కుమారుడికి మెయింటనెన్స్ కావాలని వేశా. నా మీద ఆరోపణలు చాలా వచ్చాయి. ఆస్తి కోసం ఆమె ఇలా చేస్తోంది అని అన్నారు. నాకు నా పిల్లాడి జీవితం ముఖ్యం. అందుకే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నా. ఫైనల్‌గా నాకు విడాకులు వద్దనేదే నా నిర్ణయం.' అని అన్నారు. ఇటీవల వీడియోపై ఆమె మాట్లాడుతూ..' ఒక భార్యగా ఆయన నన్ను టీజ్ చేస్తున్నారు. ఆ వీడియోను రెండుసార్లు మాత్రమే చూశా. నా బాబుకు సెక్యూరిటీ ఇవ్వడమే నా లక్ష్యం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను. నరేశ్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థిక పరమైన కారణాలే. నరేశ్‌ను ఎవరితోనైనా ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది. గతంలో కూడా ఆయనకు ఎఫైర్స్ ఉండేవి. మా అత్త నాకు సర్ది చెప్పేవారు. నరేశ్ ఎప్పటికైనా మారుతారని చెప్పేది. ఆయన ఎలాంటి వారనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇది పూర్తిగా నా సమస్య. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా. న్యాయస్థానంలోనే తేల్చుకుంటా.' అని రమ్య రఘుపతి అన్నారు. -
నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను. నరేశ్ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్- పవిత్ర లిప్‌లాక్ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్‌తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే! సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్‌డే రోజు ఇష్టమైన కేక్ తీసుకొస్తే కట్ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్‌ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య. చదవండి: నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన రమ్య -
నరేష్‌కు కలిసిరాని మూడు పెళ్లిళ్లు.. త్వరలోనే నాలుగో పెళ్లి
నటుడు నరేష్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను షేర్ చేయగా పవిత్రా-నరేష్‌ల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గతంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చాయి. మొదటగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లిచేసుకున్నాడు.వీరి కొడుకే హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి కాపురం వీరిబంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో ఆమెకు దూరంగా ఉన్న నరేష్ కొన్నాళ్లుగా పవిత్రాలోకేశ్తో సహజీవనం చేస్తున్నారు. ఇటీవలె ఓ హోటల్ రూమ్‌లో నరేష్-పవిత్రా లోకేశ్‌లను నరేష్ మూడోభార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది కూడా. సీన్‌కట్ చేస్తే.. ఇప్పుడు 62ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు నరేష్. -
పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. నరేశ్ కీలక ప్రకటన
సీనియర్ నటుడు నరేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సహచర నటి, స్నేహితురాలు పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేస్తూ..‘కొత్త ఏడాది.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశిస్సులు కావాలి. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం’అని నరేశ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గొడవ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కలిసి తిరగడం తగ్గించారు. పవిత్ర సైతం కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఎట్టకేలకు 2023లో నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే నరేశ్ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
నరేష్, పవిత్ర ఫిర్యాదు.. యూట్యూబ్ జర్నలిస్టుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్‌ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్‌లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్‌కు నోటీసులు జారీ చేసింది. -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
-
మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. పోలీసులకు పవిత్ర ఫిర్యాదు
సినీ నటి పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్ నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి, అభ్యంతరకర కామెంట్లతో వాటిని వైరల్ చేస్తున్నారని పేర్కొంది. తమ ఇద్దరినీ ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: కాంతారావుకు అమ్మాయిల పిచ్చి? స్పందించిన నటుడి కూతురు -
అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి: నరేశ్ కామెంట్స్ వైరల్
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘వికృతి’కి తెలుగు రీమేక్‌గా రూపొందించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో నిర్మించిన ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ కావడం పట్ల నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు. (చదవండి: ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ) ఈ సినిమాకు ఇంతలా పాజిటివ్ రివ్యూలు రావడం ఇటీవల కాలంలో తానెప్పుడు చూడలేదని నటుడు నరేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా బాగుందని చాలామంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇవాళ మరోసారి రుజువైందని అన్నారు. 'అందరూ బాగుండాలి.. అందులో మేము ఉండాలి' అంటూ నరేష్ కామెంట్స్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ..'ఈ సినిమాని అందరూ చూడండి. నిర్మాత అలీని, నరేశ్‌ను ఎంకరేజ్ చేయండి' అని అన్నారు. కథేంటంటే..: శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్‌కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ
టైటిల్: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నటీనటులు: అలీ, నరేశ్, పవిత్రా లోకేశ్, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ తదితరులు నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : కొనతాల మోహన్ దర్శకత్వం: శ్రీపురం కిరణ్ సంగీతం: రాకేశ్ పళిడమ్ సినిమాటోగ్రఫీ: ఎస్. మురళి మోహన్‌రెడ్డి ఎడిటర్: సెల్వకుమార్ విడుదల తేది: అక్టోబర్ 28, 2022(ఆహా) కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 28) ప్రముఖ ఓటీటీ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్‌కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేకే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శ్రీపురం కిరణ్. సోషల్ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో, దాని వల్ల కొందరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో తెరపై చక్కగా చూపించాడు. సినిమా అంతా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడి హృదయాలను హత్తుకుంటాయి. ఇది ఎమోషనల్‌గా సాగే కథ అయినప్పటికీ.. హాస్యానికి కూడా కొదవ ఉండదు. హీరో లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ చాలా నెమ్మదిగా సాగడం సినిమా స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకి థియేటర్స్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ.. ఓటీటీకి మాత్రం పక్కా సెట్ అయ్యే మూవీ. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే.. అలీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఎంత నవ్వించగలడో..అంత ఏడిపించగలడు. ఈ సినిమాలో సమీర్ పాత్రకు న్యాయం చేశాడు. సోషల్ మీడియా, సెల్ఫీల పిచ్చి ఉండే పాత్ర తనది. ఇక సినిమాకు ప్రధాన బలం నరేశ్, పవిత్రా లోకేశ్. కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. తెరపై నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ఎమోషనల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూగ వ్యక్తిగా నరేశ్ నటన అద్భుతంగా ఉంది. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది.మనో, తనికెళ్ల భరని, మౌర్యానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్ పళిదం ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫర్ మురళి మోహన్‌రెడ్డి , ఎడిటర్ సెల్వకుమార్ పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సినిమాతో అలీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాడని చెప్పొచ్చు. -
పవిత్ర- నరేశ్ బ్రేకప్.. వారి మధ్య అసలేం జరిగింది ?
కొద్ది రోజుల క్రితం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర-నరేశ్. వీరిద్దరి మధ్య సహజీవనం చేస్తున్నట్లు మొదట రూమర్లు పెద్దఎత్తున వైరలయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట ఓ హోటల్లో ఉండగా నరేశ్ మూడో భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో పవిత్ర-నరేశ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. వీరిద్దరు ఓ ఆలయంలో కనిపించడంతో అంతా నిజమే అనుకున్నారు. కాగా.. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్) తాజాగా మరో వార్త గుప్పుమంటోంది. నరేశ్- పవిత్రను కూడా దూరం పెట్టినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ జంట ఎక్కడా బయట కనిపించడం లేదు. కొందరు సన్నిహితుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అంతే కాదండోయ్ నరేశ్ మరో సీనియర్ నటితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టాక్. అందువల్లే పవిత్రకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్లో మరోసారి వీరిద్దరు తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారుతుంది. -
రెమ్యునరేషన్ పెంచేసిన పవిత్రా లోకేష్.. కాంట్రవర్సీ తర్వాత మరింత క్రేజ్
నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నరేష్‌తో పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో అటు మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ వీరిద్దరి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఒక రకంగా ఈ వివాదం ఆమెకు బాగానే క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తెలుగులో అమ్మ, వదిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటి నరేష్ వ్యవహారంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకు రోజుకు 50 నుంచి 75 వేలు తీసుకుంటున్న పవిత్రా లోకేష్ ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. అంతేకాకుండా ఆమెకు ఆఫర్స్ రావడంలో నరేష్ కూడా తన వంతు సాయం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్
బనశంకరి(కర్ణాటక): ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ చెప్పారు. నటి పవిత్ర, తెలుగు సీనియర్ నటుడు నరేష్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతుండటం, అదే సమయంలో వారిద్దరూ తరచూ జంటగా కనిపిస్తుండటం తెలిసిందే. చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది ఈ నేపథ్యంలో సుచేంద్రప్రసాద్ శనివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించామని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. -
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం
మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. చదవండి: వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్ బెల్ నొక్కింది. కానీ, నరేష్ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. -
హోటల్లో నరేశ్, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య
Actor Naresh And Pavitra Lokesh: సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్లో ప్రత్యేక్షమైంది. మైసూర్‌లోని ఓ హోటల్ ఉన్న ఈ జంటను నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..) గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు.