Malli Pelli 'Ra Ra Hussooru Nattho' Lyrical Song Out Now - Sakshi
Sakshi News home page

Malli Pelli: నరేష్‌, పవిత్రా లోకేశ్‌ల 'మళ్లీ పెళ్లి' రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Fri, May 5 2023 5:35 PM | Last Updated on Fri, May 5 2023 5:40 PM

Malli Pelli Lyrical Ra Ra Hussooru Song Out Now - Sakshi

సీనియర్‌ నటుడు నరేష్‌-పవిత్రా లోకేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించారు.

నరేష్‌, పవిత్రా లోకేశ్‌ల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి  ‘రా రా హుజూర్‌ నాతో’.. అనే రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అనన్య నాగళ్ల, శరత్‌బాబు, వనితా శరత్‌కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement