Naresh
-
అందు కోసమే బచ్చలమల్లి మూవీ తీశా: డైరెక్టర్ సుబ్బు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ..'బచ్చలమల్లి క్యారెక్టర్ పేరు నిజమే. కథ మాత్రం నేనే రాసుకున్నా. నా లైఫ్‌లో మా అమ్మ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఈ చిత్రం కూడా మా అమ్మకు రాసిన క్షమాపణ లేఖ. నేను చేసిన తప్పు వల్ల చాలా బాధపడ్డా. నాలాగా ఇంకొకరు బాధ పడొద్దనే ఈ సినిమా ఉద్దేశం. తర్వాత అయినా అమ్మకు చెప్తా. నీ కోసం బచ్చలమల్లి సినిమా తీశానని' అంటూ డైరెక్టర్ మాట్లాడారు.(ఇది చదవండి: బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్)ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బచ్చలమల్లి ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నరేశ్, అమృత అయ్యర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు హీరో, హీరోయిన్ సైకిల్‌పై వచ్చి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. -
వాహ్.. వ్యాక్స్ మినియేచర్
ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్‌ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ట్‌లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్ చేస్తూ సెలిబ్రిటీస్ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి.. తన ఆర్ట్ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్బీలో ఉంటాను. స్కూలింగ్ సమయంలో పెయింటింగ్‌లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్‌ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టాను. సోషల్‌మీడియాతోనే గుర్తింపు.. నేను చేసిన డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్ వచ్చేవి.. నా ఆర్ట్స్‌కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్స్‌ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో నా ఆర్ట్‌కి సోషల్‌మీడియా చాలా హైప్ వచి్చంది. చిత్ర అఫీషియల్ టీం ఆ పెయింటింగ్‌ని తమ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్లో కొత్త కాన్సెప్ట్స్‌ని చేయడం మొదలుపెట్టాను.డిజిటల్ ఆర్ట్స్.. సోషల్ మీడియా, డిజిటలైజేషన్ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్ ఆర్ట్స్‌నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్‌ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్‌కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్ బొమ్మల్లా కార్టూన్ ఫార్మాట్లో ఫినిషింగ్‌తో డిజిటల్ వ్యాక్స్ పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
‘మన్యం ధీరుడు’ వచ్చేస్తున్నాడు!
నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన తాజా చిత్రం మన్యం ధీరుడు’. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాడు. ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేస్తున్నారట. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారట. (చదవండి: తెలుగు ప్రేక్షకులకు ఇన్నాళ్లకు కాస్త గౌరవం)మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. పవన్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్
తెలుగు సీనియర్ నటుడు నరేశ్ పేరు చెప్పగానే పవిత్ర లోకేశ్ గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నుంచి ఈమెతోనే కలిసుంటున్నాడు. ఈ విషయమై నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి అప్పట్లో బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం జరిగింది. ఇదంతా మీకే తెలిసే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 15 చిత్రాలు రిలీజ్)'సుందరకాండ' అనే సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. దీని తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒకరు పెళ్లి చేసుకుంటే బెటరా? పెళ్లి చేసుకోకపోతే బెటరా అని నరేశ్‌ని అడగ్గా.. 'ఇప్పుడున్న జనరేషన్ ఏమో అసలు పెళ్లి వద్దు అంటున్నారు. మా జనరేషన్ ఏమో ఇంకోటి కావాలని అంటున్నారు' అని నవ్వుతూ సమాధానం చెప్పేశారు.నరేశ్ తన మూడో భార్య రమ్య రఘపతికి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. నటి పవిత్రతో కలిసి ఉంటున్నారని టాక్. ఈ క్రమంలోనే నరేశ్-పవిత్ర లోకేశ్ జంటగా గతేడాది 'మళ్లీ పెళ్లి' అనే సినిమా కూడా రావడం విశేషం. అలాంటిది ఇప్పుడు నరేశ్.. ప్రస్తుత యువత పెళ్లి ఆలోచనపై అలా సెటైర్ వేసేశారు.(ఇదీ చదవండి: ఈ వయసులో మూడో పెళ్లి కష్టమేమో! కానీ..: ఆమిర్ ఖాన్) -
యాభై వసంతాల వేడుక
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేశ్ విజయకృష్ణ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో విజయకృష్ణ మందిర్–ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ పార్క్ గతం, భవిష్యత్ తరానికి మధ్య అద్భుతమైన వారధి’’ అన్నారు. ‘‘చిత్ర పరిశ్రమ కోసం కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా స్ఫూర్తి వనం రూపొందించాం’’ అని నరేశ్ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నరే‹శ్ విజయకృష్ణ, పవిత్రా లోకేశ్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, ఖుష్బూ తదితరులు సత్కరించారు. న్యాయమూర్తి ఎన్. మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, నటులు సాయి దుర్గా తేజ్, మనోజ్ మంచు, అలీ, దర్శకులు మారుతి, అనుదీప్, సతీష్ వేగేశ్న, సంగీత దర్శకుడు కోటి, నిర్మాతలు శరత్ మరార్, రాధామోహన్తో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
‘కలి’ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది: నాగ్ అశ్విన్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.ఇక టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
బుల్లితెర జంట చందు- పవిత్ర మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే భార్యాభర్తలుగా తమను పరిచయం చేసుకుందామనుకున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించగా తర్వాత ఐదు రోజులకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎవరి జీవితం వాళ్లది!'ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పదిమంది వచ్చి పైకి లేపేవాళ్లు. మేమున్నామంటూ సపోర్ట్ చేసేవాళ్లు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాం. అమ్మానాన్న పిల్లలు.. ఇదే కుటుంబం! ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి ఆశయాలు వాళ్లవి.. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు. ఒంటరితనంసంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అసలేం కోల్పోతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరైపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. నా విషయమే తీసుకుంటే అమ్మ చనిపోయాక కృష్ణగారు, నేను ఎంతగానో బాధపడ్డాం. మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం. ఆ బలం వేరురోజూ ఉదయాన్నే ఆయనను పలకరించేవాడిని. మహేశ్‌బాబు కూడా మేము వచ్చి చూసెళ్తాం.. అని ధైర్యం చెప్పేవాడు. పది మంది నాకున్నారు అన్న బలం వేరు! ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కనుండాలి. ఈరోజుల్లో అది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వాలు లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి' అని నరేశ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా -
అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి
కరీంనగర్ రూరల్: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్... కొడుకు ఆర్యన్(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది. అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్‌తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్‌తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
మహేష్ బాబు గురించి చెప్తూ లైవ్ లో ఏడ్చేసిన నరేష్
-
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్‌కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్‌పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్‌తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్‌రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్‌లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది: నరేశ్ వీకే
‘‘మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను’’ అని నటుడు డా. నరేశ్ వీకే అన్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు (జనవరి 20) నరేశ్ పుట్టినరోజు. (చదవండి: ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల) ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శుక్రవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ (1972)తో బాలనటుడిగా అడుగుపెట్టాను. మా అమ్మ విజయ నిర్మల, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు వంటి మహనీయులతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. రాజకీయాలు, ఆ తర్వాత సమాజ సేవ వల్ల దాదాపు పదేళ్లు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బిజీగా ఉన్నాను. నాకు నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. నంది అవార్డులని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ఇవ్వడం లేదు.. మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా అబ్బాయి నవీన్‌కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను. మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ని మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నాం’’ అన్నారు. -
కామెడీ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
లేదంటే మాటొచ్చేత్తది!
అంజిగా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇందులోని కీలకమైన అంజి పాత్రను ‘అల్లరి’ నరేశ్ చేస్తున్నారు. శుక్రవారం ‘అల్లరి’ నరేశ్ పాత్ర అంజిని గురించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘మా అల్లరి అంజిగాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది’’ అంటూ ‘అంజి’ గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు నాగార్జున. ‘‘చేసేయ్.. చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది’’ అనే డైలాగ్ చెప్పారు ‘అల్లరి’ నరేశ్. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!
తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాల్లో కావొచ్చు, షోల్లో కావొచ్చు తమదైన హాస్యంతో నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన నరేశ్.. అదేనండి పొట్టి నరేశ్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) ఇంతకీ ఎవరామె? టీవీ షోలతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నరేశ్.. పలు కార్యక్రమాల్లో తనదైన మార్క్ హాస్యంతో నవ్విస్తున్నాడు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ అది ఇతడికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేమలో ఉన్న విషయాన్ని యాంకర్ రష్మీతో చెప్పుకొచ్చాడు. అలానే అమ్మాయిని స్వయంగా స్టేజీపై తీసుకొచ్చాడు. ఆమె తమ ప్రేమ గురించి బయటపెట్టింది. గత రెండేళ్లుగా ఎక్స్‌ప్రెస్ చేయలేనంత ప్రేమని నరేశ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. అలానే నరేశ్ తన ప్రేయసిని స్టేజీపైకి తీసుకురావడం పక్కనబెడితే.. ప్రపోజ్ చేసి, చేతిపై ముద్దు కూడా పెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒరిజినల్ అనే ఫీల్ రాలేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసి చూసి ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. అయినా కూడా షో నిర్వహకులు ఇలానే చేయడంపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) -
నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు
సీనియర్ నటుడు నరేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా నరేశ్‌ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్‌కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్‌కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
Martin Luther King Movie Review:‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ
టైటిల్:మార్టిన్ లూథర్ కింగ్ నటీనటులు:సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా దర్శకత్వం:పూజ కొల్లూరు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా సంగీతం:స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ:దీపక్ యరగెరా విడుదల తేది: అక్టోబర్ 27, 2023 ‘మార్టిన్ లూథర్ కింగ్’ కథేంటంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రమిది. పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు..రోడ్లు సరిగా ఉండదు. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు). అతనొక అనాథ. ఊర్లో ఉన్న ఓ పెద్ద చెట్టుకింద చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అతనికి తోడుగా మరో అనాథ బాటా ఉంటాడు. వీరిద్దరికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు.ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్టాఫీస్ ఉద్యోగిణి వసంత(శరణ్య) స్మైల్ పెరుని మార్టిన్ లూథర్ కింగ్‌గా మార్చి ఓటర్ కార్డుతో పాటు పోస్టాఫీస్‌లో ఖాతాని తెరిపిస్తుంది. అతని ఓటే కీలకం కావడంతో.. ఒకవైపు జగ్గు, మరోవైపు లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. వాస్తవానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి తెలుగు రీమేక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్ సెటైరికల్‌గానే సాగుతుంది. పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క సీన్‌తోనే జగ్గు, లోకి పాత్రల స్వభావంతో పాటు కథకు కీలకమైన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకురాలు. పోస్టాఫీస్ ఉద్యోగి వసంత పాత్రతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. స్మైల్‌కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టే క్రమంలో సాగే సన్నివేశాలు.. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి దుస్థితిని చూపిస్తాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాల పేర్లతో ప్రజలను ఎలా విడదీస్తారనేది చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది. అయితే ద్వితియార్థం మాత్రం మొత్తం సీరియస్ సైడ్ తీసుకుంటుంది. ‘మండేలా’ లో వర్కౌట్ అయిన ఎమోషనల్ ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా నరేశ్ పాత్ర కొన్ని చోట్ల చేసే కామెడీ కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. అలాగే కింగ్ ఓటు కోసం జగ్గు, లోకి ఇద్దరు పడే తంటాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించినట్టే రొటీన్‌గా ఉంటుంది. స్క్రిప్టుని మరింత బలంగా రాసుకొని, ఎమోషన్స్‌పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఇప్పటివరకు సంపూర్షేష్ బాబు అంటే మనకు కామెడీ హీరోగానే తెలుసు. అతను చేసిన స్పూఫ్ కామెడీని బాగా ఎంజాయ్ చేశాం. కానీ అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. టైటిల్ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. తెరపై కొత్త సంపూని చూస్తాం. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రెసెడెంట్ పదవి పోటీదారులు జగ్గుగా వీకే నరేష్.. లోకిగా వెంకట్ మహా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్ బాటా పాత్రను పోషించిన చిన్నోడి నటన బాగుంది.పోస్టాఫీసు ఉద్యోగి వసంత పాత్రకి శరణ్య న్యాయం చేసింది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్ చేసేలా ఉంటాయి. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్‌గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
జయసుధ కొంగు పట్టుకొని వెళ్ళే వాడిని
-
మా అమ్మ కోరిక అది: నటుడు నరేష్
-
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్‌లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
నరేశ్ అంటే ఎవరు అన్నారు
సంపూర్ణేష్ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదించడంతో పాటు క్రియేటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.