ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్ | Tollywood actor Vijaykrishna Naresh attended a event with Pavitra Lokesh | Sakshi
Sakshi News home page

Vijaykrishna Naresh: ఈవెంట్‌కు జంటగా వచ్చిన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్

Published Fri, Feb 21 2025 2:47 PM | Last Updated on Fri, Feb 21 2025 3:38 PM

Tollywood actor Vijaykrishna Naresh attended a event with Pavitra Lokesh

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా  ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు.  సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్‌ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్‌లో జంధ్యాల జీవితంపై రైటర్‌ సాయినాథ్‌ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్‌ ప్రోడక్షన్‌ థియేటర్‌నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.

అయితే తన కెరీర్‌లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా  సినిమా మ్యూజియమ్‌ అండ్‌ లైబ్రరీ అండ్‌ క్రియేటివ్‌ స్పేస్‌ ఫర్‌ యంగ్‌ పీపుల్‌ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్‌లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement