టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.
పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్‌గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్‌కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు.
కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e
— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025
#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr
— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment