ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్‌తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
పుష్ప కా బాప్ అంటూ..
ఈ పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్‌ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది.
దంగల్ రికార్డ్‌పై గురి..
అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..
పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు.
Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF
— Allu Arjun (@alluarjun) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment