
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇటీవల చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని బన్నీ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే కొద్ది రోజులుగా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన కామెంట్స్‌తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పాడు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది. తాజాగా బన్నీ.. పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనైనా ఈ ఫ్యాన్స్ వార్‌కు తెరపడుతుందేమో వేచి చూడాల్సిందే.
బన్నీపై నోరు పారేసుకున్న జనసేన నేతలు..
బన్నీ చేసిన కామెంట్స్‌పై ఏపీకి చెందిన కొందరు జనసేన నేతలు నోరు పారేసుకున్నారు. నీ సినిమాలు ఏపీలో ఎలా ఆడతాయో చూస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. దీంతో తనను నమ్మినవారి కోసం ఎక్కడి వరకైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
ఫుష్ప-2 మూవీతో బిజీ..
ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశలో ఉంది. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. నెల రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024