birthday
-
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఫోటోలు
-
బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్‌పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్‌తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మహేశ్‌బాబుతో చివరి సినిమా..'లండన్ బ్యూటీ' బర్త్‌డే వేడుకలు (ఫోటోలు)
-
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్‌పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
బర్త్‌డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
హీరోయిన్ శృతి హాసన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్‌లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
పుట్టిన రోజే కబళించిన మృత్యువు
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది. పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్‌కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్‌కుమార్ గురువారం హాజరయ్యాడు. మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్‌లో విమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్‌కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 8 నెలల క్రితం తండ్రి మృతి శ్రావణ్‌కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. -
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్‌గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్‌కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.1949, జనవరి 13న పంజాబ్‌లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్‌శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
పుష్ప స్టైల్లో తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్‌తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.పుష్ప కా బాప్ అంటూ..ఈ పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. దంగల్ రికార్డ్‌పై గురి..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF— Allu Arjun (@alluarjun) January 10, 2025 -
దీప్తి సునయన బర్త్‌డే స్పెషల్... (ఫోటోలు)
-
నవిష్క బర్త్‌డే.. కూతురి కోసం కల్యాణ్ దేవ్ సర్ప్రైజ్(ఫోటోలు)
-
మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్‌లోని బరోహ్ గ్రామ నివాసి.ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్‌లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు. ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక -
మహామేధావికి రెండు జననమరణాలు!
ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.బహుముఖ ప్రజ్ఞాశీలిగా..ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి న్యూటన్ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్ అందించిన ఆవిష్కరణలు కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.రెండు పుట్టినరోజులున్యూటన్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది. న్యూటన్ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.అధికారిక జన్మదినంన్యూటన్ ఇంగ్లాండ్‌లోని వూల్స్టోర్ప్లోని మనోర్ హౌస్‌లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించేవారు. ఇది యూరప్‌కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తిగురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్ సైన్స్‌లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్ ప్రపంచానికి చూపించారు. న్యూటన్‌కు కెమిస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలుజూలియన్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం న్యూటన్ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్ కన్నుమూశారు. న్యూటన్ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్‌డే (ఫోటోలు)
-
బర్త్ డే వేడుకల్లో విషాదం.. అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి
కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్‌టౌన్‌కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్‌కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఈ ఏడాది విషాదం..ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్‌ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలు..ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 🙏 pic.twitter.com/lmTH0lqiDx— Yash (@TheNameIsYash) December 30, 2024 -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి... అవమానించడంతో బాలుడి ఆత్మహత్య
బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది. సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్గంజ్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎస్హెచ్ఓ నిరాకరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్గంజ్ ఎస్హెచ్ఓ దీపక్‌కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.