'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. తనయుడికి టాలీవుడ్ ప్రిన్స్ విషెస్ | Tollywood Hero Mahesh Babu Special Wishes To His Son Gautam | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. కుమారుడికి మహేశ్ బాబు స్పెషల్ విషెస్

Aug 31 2025 9:51 AM | Updated on Aug 31 2025 11:25 AM

Tollywood Hero Mahesh Babu Special Wishes To His Son Gautam

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రోజు 20 వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చారు. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్‌.. ఎప్పటికీ ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ గౌతమ్‌లో చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ తనయుడిపై ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు సైతం గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మహేశ్ తన ట్వీట్లో రాస్తూ.. '19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్... ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా యాక్షన్ అడ్వెంచరస్చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్షూటింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుంది. మూవీ కోసం మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement