gautam
-
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు ఇదే లాస్ట్ సిరీస్ అవుతుందా?
-
మహేశ్ బాబు కుమారుడి బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నమ్రత
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ బర్త్ డే వేడులకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీ గౌతమ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గౌతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. ప్రస్తుతం మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించునున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. ఈ మూవీ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
లండన్‌లో మహేష్ ఫ్యామిలీ మేజికల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్
కాజల్ అగర్వాల్..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేలో మహేశ్ ఫ్యామిలీ ఫోటోలు
-
మహేశ్ బాబు క్రేజీ లుక్.. కొడుకు వల్ల బయటపడింది!
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్‌లో కనిపించాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చాడు. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు. అదే టైంలో రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే లుక్ విషయంలో బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మహేశ్ లేటెస్ట్ క్రేజీ మాస్ లుక్ బయటపడింది. అది కూడా కొడుకు గౌతమ్ వల్లే. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్)మహేశ్ బాబు కొడుకు గౌతమ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలా అని ఇదేదో డిగ్రీనో ఇంజినీరింగో కాదు ఇంటర్మీడియట్ అనమాట. ఈ క్రమంలోనే మహేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గర్వంతో పొంగిపోతున్నానని, జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని, కలల్ని అందుకునేందుకు పరుగెత్తాలని, తండ్రికి చాలా గర్వపడుతున్నాని మహేశ్ రాసుకొచ్చాడు.అయితే ఎన్నడూ లేని విధంగా మహేశ్ గడ్డం, ఒత్తయిన జుట్టుతో కనిపించాడు. బహుశా ఇది రాజమౌళి సినిమా కోసమే మేకోవర్ అయ్యిండొచ్చు. ఇలా ఇప్పుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వల్ల బయటపడింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఈ పిక్ వైరల్ చేస్తున్నారు. మహేశ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!
బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు. ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు. బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?
‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నటి.. శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా చాన్స్‌లు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పడు తన ఫ్యాషన్ స్టయిల్ ఫొటోలు, పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ ఆకర్షణకు మెరుగులు దిద్దుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఇంద్ శ్రీ హైదరాబాద్ నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఇంద్ శ్రీ .. 2012లో తన పేరుతోనే ఓ బోటిక్ ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ అదితి ధరించిన ఇంద్ శ్రీ కాస్ట్యూమ్ డిజైన్ ధర రూ. రూ. 11,500 హౌస్ ఆఫ్ క్వాడ్ర హై క్వాలిటీ, లేటెస్ట్ వజ్రాభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఇదొకటి! ధరలు ఇటు సామాన్యులూ కొనేలా అటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. (చదవండి: ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!) -
ఉద్యోగకల్పనలో బీజేపీ మాటలు ఉత్తవే..
కరీంనగర్ కల్చరల్: కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాంజీ గౌతమ్ విమర్శించారు. ఉద్యోగాలకల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీ కులగణన చేసి, బీసీల రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేవలం సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం లేదా ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఇక్కడి పేదలు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరని పేర్కొన్నారు. అంబేడ్కర్, పూలేæ, సాహు మహరాజ్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని గుర్తు చేశారు. -
రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్
-
బైక్‌పై.. కాలినడకన కలెక్టర్ తనిఖీలు
రఘునాథపాలెం: అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయకుండా క్షేత్రస్థాయిలో పనులెలా జరుగుతున్నాయో పరిశీలించారు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్. రఘునాథపాలెం మండలం పంగిడి రెవెన్యూ పరిధిలో పోడు భూముల సర్వే పనులను మంగళవారం డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, భూముల వద్దకు వెళ్లేందుకు సరైన మార్గంలేకపోవడంతో ఆయన ద్విచక్రవాహనం నడుపుతూ బురద దారిలో మూడున్నర కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. ఆతర్వాత ముందుకెళ్లడానికి సాధ్యం కాకపోవడంతో మరో మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గుట్టలపై భూముల సర్వేను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. -
ఆప్ హోదాలో కాదు.... వ్యక్తిగతంగా పాల్గొన్నా!
న్యూఢిల్లీ: మతమార్పిడి వివాదం ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ వివాదం మరింత వివాదాస్పదంగా అవుతుందన్న భయంతోనే గౌతమ్ చేత బలవంతంగా రాజీనామ చేయించారంటూ విమర్మలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ వివరణ ఇస్తూ తాను ఎవరి బలవంతంతోనూ రాజీనామ చేయలేదని, తన ఇష్ట ప్రకారమే రాజీనామ చేశానని చెప్పారు. ఈ మేరకు రాజేంద్ర గౌతమ్ అక్టోబర్ 5న వేలాది మంది బౌద్ధమతంలోకి మారుతున్న కార్యక్రమంలో తాను విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులను పూజించను అని చెబుతూ ప్రమాణం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ వీడియో ఆధారంగా బీజేపీ ఆప్‌పై పలు ఆరోపణలు చేసింది. మతమార్పిడి పేరుతో హిందూ దేవుళ్లును దూషించారంటూ విమర్శలు చేసింది. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌కి ఈ వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. పైగా బీజేపీ ఈ వీడియోనే లక్ష్యంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని హింది వ్యతిరేకిగా చిత్రీకరించడం మొదలు పెట్టింది. దీంతో గౌతమ్ ఈ కార్యక్రమం గురించి అసలు అరవింద్ కేజ్రీవాల్‌కు అసలు తెలియదని. ఇది సామాజిక మత సంబంధ కార్యక్రమమని అన్నారు. అలాగే బీఆర్ అంబేద్కర్ దేశానికి 22 వాగ్దానాలు ఇచ్చారని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందని, ఇలా 1956 నుంచి జరుగుతుందని అందులో అలా చెప్పడం సాధారణమని వివరణ ఇచ్చారు. అయినా బీజేపీ దేశంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలలు గురించి మాట్లాడటం మాని ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడటం బాధకరమని ఆవేదనగా అన్నారు. అదీగా ఈ గుజరాత్ ఎన్నికల సమయంలో బీజీపీ నాయకులు ఆప్ గురించి చెడుగా ప్రచారం చేయడమే గాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన హిందూ వ్యతిరేకి అని పోస్టర్లు కూడా పెట్టారని అన్నారు. అసలు ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, తాను ఈ కార్యక్రమంలో ఆప్ మంత్రిగా కాకుండా వ్యక్తిగత హోదాలో పాల్గొన్నానని చెప్పారు. ఇందులోకి తమ నాయకుడిని, పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ గౌతమ్ ఆక్రోశించారు. (చదవండి: మాకు సీక్రెట్‌గా సపోర్ట్ ఇవ్వండి.. బీజేపీ నేతలకు ఆఫర్ ఇచ్చిన కేజ్రీవాల్!) -
గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నా యంగ్ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు అవసరమయినా నీ వెన్నంటే ఉంటా! లవ్ యూ మై సన్.. నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. Happy 16 my young man!! You make me proud each day and I can't wait to see you grow into your best self!! All my love and blessings as you journey through this new phase! Remember.. I'm always there when you need me! Love you my son.. more than you can imagine 🤗🤗❤️ pic.twitter.com/rmIm1qkkUB — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2022 ఇదిలా ఉంటే, మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. చదవండి: (Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..) -
ఒంటరితనం భయంకరం అంటున్న బ్రహ్మానందం తనయుడు
ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. సుబ్బు చెరుకూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం (మార్చి 2) గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ‘ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా’ అనే డైలాగ్‌తో గౌతమ్ లుక్ రివీల్ చేశారు. ‘‘ఈ చిత్రంలో గౌతమ్ మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్రలో కనిపిస్తాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
అఫీషియల్: త్వరలోనే జూనియర్ కాజల్
Kajal Aggarwal Is Pregnant: అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. కాజల్ గర్భం దాల్చిందని, దీంతో ఆమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించనుందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ. భార్య కాజల్ ఫొటోను షేర్ చేసిన ఆయన.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌లో పొందుపరిచాడు. ఇది చూసిన ఫ్యాన్స్ 'ఓ మై గాడ్.. కాజల్ త్వరలో తల్లి కాబోతుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు', 'త్వరలోనే జూనియర్ కాజల్ వచ్చేస్తుందన్నమాట' అంటూ ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కాజల్ తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమా షూటింగ్స్‌తో మరింత బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కాజల్ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) -
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం
విభిన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యస్ ఒరిజినల్స్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విశ్వ ఈ సినిమాకు ముహూర్తపు క్లాప్‌నిచ్చారు. -
ధైర్యంగా ఉండండి..
కొణిజర్ల: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, కుమారుడు, తమ్ముడిని కోల్పోయిన గన్‌మన్ కుటుంబాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తన సతీమణి గౌతమితో కలసి పరామర్శించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ కలెక్టర్ వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న జెర్రిపోతుల నాగరాజు భార్య సంధ్య, కుమారుడు మహంత్, తమ్ముడు పుల్లారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో నాగరాజు స్వగ్రామమైన కొణిజర్లకు శుక్రవారం రాత్రి భార్యతో కలసి వచ్చిన కలెక్టర్ గౌతమ్ వారి కుటుంబాన్ని ఊరడించారు. కలెక్టర్ సతీమణి గౌతమి.. నాగరాజు కుమార్తె, ఆయన తమ్ముడి కుమారుడిని ఎత్తుకుని ఊరడించడమే కాకుండా పుల్లారావు భార్యను ఓదార్చారు. పుల్లారావు భార్య పద్మను ఓదారుస్తున్న కలెక్టర్ సతీమణి గౌతమి -
గౌతమ్ బర్త్‌డే: మహేశ్, నమ్రత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్ ఘట్టమనేని 15వ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 31). ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ లిటిల్ ప్రిన్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు మహేశ్ బాబు, నమ్రత. హ్యాపీ 15 మై సన్.. నీ ఎదుగుదలను చూస్తుండడం నాకెప్పుడూ గొప్ప ఆనందం.. ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లి ప్రపంచాన్ని జయించు.. లవ్ యూ’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఇక నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా తమ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గౌతమ్ ఫోటోని షేర్ చేసింది. Happy 15 my son!! Watching you grow has been my greatest joy. Wishing you the best today and always! Go on and conquer the world 🤗🤗🤗 Love you, GG ♥️♥️♥️ pic.twitter.com/cLbfuCPvRL — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2021 ఇక గౌతమ్ విషయానికి వస్తే.. మహేశ్ హీరోగా నటించిన వన్- నేనొక్కడినే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు గౌతమ్‌కు కేవలం 8 సంవత్సరాల వయస్సు మాత్రమే. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్.. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న గౌతమ్ త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అవంత గ్రూప్ ప్రమోటర్ థాపర్ అరెస్ట్
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో అవంత గ్రూప్ ప్రమోటర్, వ్యాపారవేత్త థాపర్ అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈడీ ప్రకటన ప్రకారం 60 సంవత్సరాల థాపర్ అక్రమ ధనార్జన నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారం రాత్రి అరెస్టయ్యారు. అంతకుముందు ఢిల్లీ, ముంబైల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి పలు కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకులు రాణా కపూర్, ఆయన భార్య బిందు అక్రమ ధనార్జన కేసులో ధాపర్ ప్రమోటర్‌గా ఉన్న అవంత రియల్టీ పాత్ర కూడా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకుని ఈడీ ఈ కేసు విచారణ జరుపుతోంది. అవంత రియల్టీకి రుణ సౌలభ్యతల్లో రాయితీలు, సడలింపులు, మినహాయింపుల పొడిగింపు, అదనపు రుణ అడ్వాన్స్‌లు వంటి అంశాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ ధనార్జన, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు జరిగినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ పేర్కొంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తదితర బ్యాంకుల్లో రూ.2,435 కోట్ల మోసానికి పాల్పడినట్లు థాపర్‌సహా పలువురిపై సీబీఐ గత నెల్లో ఒక కేసులో నమోదుచేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మోసపూరిత కేసులో విచారణలో భాగంగా ఈ కేసు నమోదయ్యింది.. -
Mahesh Babu: గర్వపడే పని చేసిన గౌతమ్.. మురిసిపోతున్న నమ్రత
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గౌతమ్ ఘట్టమనేని. సినిమా కోసం మహేశ్‌బాబు ఏ రకంగా కష్టపడతాడో అందరికి తెలిసిందే. దర్శకుడు ఆశించిన ఔట్‌పుట్‌ని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాడు. అవే లక్షణాలు ఆయన తనయుడు గౌతమ్‌కి వచ్చాయి. ఏ పని అయినా మొదలుపెడితే దాంట్లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దీనికి నిదర్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మహేశ్ సతీమణి నమ్రత. గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. ఇక తమ అభిమాన హీరో కొడుకు స్విమ్మింగ్‌లో రికార్డు క్రియేట్ చేయడంతో.. మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా, గౌతమ్ ఘట్టమనేని మహేశ్ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: మహేశ్ రియలైజ్ అవుతున్నాడు.. రేర్ పిక్ షేర్ చేసిన నమ్రత -
జెట్ సెట్ గో
బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలసి మహేశ్‌బాబు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసేస్తారు. లాక్డౌన్ వల్ల షూటింగ్స్ నుంచి లాంగ్ బ్రేక్ వచ్చినా ప్రయాణాలు చేయలేకపోయారు. జర్నీలు కూడా రద్దయ్యాయి కదా. ఇప్పుడు ప్రయాణాలకు కూడా అనుమతి ఉండటంతో కుటుంబంతో కలసి మహేశ్ విదేశీ ట్రిప్ ప్లాన్ చేశారు. ‘‘కొత్త విధానానికి అలవాటుపడుతున్నాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుని, ఫ్లయిట్ జర్నీకి రెడీ అయ్యాం. జీవితం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. జెట్ సెట్ గో’’ అంటూ కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు మహేశ్‌బాబు. ఎక్కడికి వెళుతున్నదీ బయటపెట్టలేదు కానీ, ఇది పది రోజుల ట్రిప్ అని తెలిసింది. -
విహార యాత్రకు మహేష్ బాబు ఫ్యామిలీ ఫొటోలు
-
విహార యాత్రకు మహేష్ బాబు ఫ్యామిలీ
ఎంత పెద్ద హీరోలైనా రోజులు గడిచే కొద్దీ వయసు మీద పడుతూనే ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏజ్ మాత్రం రివర్స్ గేర్‌లో వెళుతుందని అనిపిస్తోంది. ఇందుకు ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోనే నిదర్శనం. కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి విమానాశ్రయంలో కనిపించిన మహేశ్.. వారికి తండ్రిలా కాకుండా సోదరుడిలా కనిపించడం విశేషం. కరోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు మహేశ్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు. అందులో భాగంగా మహేశ్ కుటుంబం అంతా ఫేస్ మాస్కులు ధరించి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. (చదవండి: పెళ్లి ఫొటో షేర్ చేసిన నమ్రత...) ఈ సందర్భంగా మహేశ్ సైతం పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే వీరు విహారానికి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. కాగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఈ సూపర్ స్టార్ కుటుంబం ఎనిమిది నెలలుగా బయట ప్రదేశాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. మరోవైపు త్వరలోనే "సర్కారు వారి పాట" సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీంతో హీరో.. ఈ చిన్న బ్రేక్‌లో పెద్ద వినోదాన్ని ప్లాన్ చేశారు. అయితే హాలీడే ట్రిప్ ముగియగానే టంచనుగా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక "సర్కారు వారి పాట" సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్ కీర్తి సురేశ్ జోడీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.(చదవండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్, సైఫ్) View this post on Instagram Getting ourselves used to the new normal!! All equipped for a safe flight. Life's back on track! Jet set go! 😎 #TravelDuringCovid #MaskOn😷 @sitaraghattamaneni @gautamghattamaneni @namratashirodkar A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Nov 7, 2020 at 11:32pm PST -
నువ్వు ఎదుగుతున్న కొద్దీ గర్వంగా ఉంది
నేడు(సోమవారం) సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినరోజు. అతను 14వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా మహేశ్ నిన్న అర్ధరాత్రి ట్విటర్ ద్వారా తనయుడికి శుభాకాంక్షలు చెప్పారు. "నువ్వు యువకుడిగా ఎదుగుతున్న కొద్దీ గర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో కలిసి చేసిన ప్రయాణం ప్రత్యేకమైనది. నీకు బెస్ట్ బర్త్‌డే విషెస్. లవ్ యూ గౌతమ్" అని రాసుకొచ్చారు. దీనికి చిన్ననాటి గౌతమ్‌ను ఎత్తుకున్న ఫొటోతో పాటు, టీనేజ్‌లో అతడిని హత్తుకున్న ఫొటోను జోడించారు. (చదవండి: అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’) Happy 14 my son!! Proud that you're growing into a fine young man! From Doraemon to apex legends, growing with you has been quite the journey♥️♥️♥️ Wishing you the best birthday ever!!🤗🤗🤗 Love you 😘 😘 #HappyBirthdayGG pic.twitter.com/grr7yQdu44 — Mahesh Babu (@urstrulyMahesh) August 30, 2020 మరోవైపు మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా తనయుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు విషెస్ తెలిపారు. "వీడు ఈ ప్రపంచంలోకి రావడం మా జీవితాలనే మార్చేసింది. తొలిసారిగా మేము తల్లిదండ్రులమయ్యామన్న అనుభూతినివ్వడమే కాక సంతోషాలను, అంతకు మించిన ప్రేమను తీసుకొచ్చాడు. ఇప్పుడు అతనికి 14 ఏళ్లు. ప్రతి సంవత్సరం అతడు మాకు ప్రేమను, ఆనందాన్ని పంచుతూనే ఉన్నాడు. తల్లిదండ్రులుగా మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాడు. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్ సన్, ఐ లవ్ యూ సో మచ్" అని ప్రేమను వ్యక్తపరిచారు. దీనికి గౌతమ్ పుట్టినప్పటి ఫొటోలను షేర్ చేశారు. (చదవండి: 'మహేష్ ఇంట్లో లేకుంటే ఎక్కడ ఉంటారో తెలుసా’) View this post on Instagram Gautam’s entry into this world made our lives change forever ♥️♥️ he brought us happiness and more love in our ‘first time parents’ lives 😘😘😘. Today he’s 14 and each year he has only added more and more of love and happiness making us happy and proud parents !! Happy birthday my darling son... I love you so so much ♥️♥️♥️ @gautamghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 30, 2020 at 11:31am PDT -
కాజల్ కల్యాణం?
ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నారు కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. ఇప్పుడు కాజల్ కల్యాణం ఖరారైనట్లు టాక్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్న కాజల్‌ని ‘వృత్తిపరంగా బాగుంది.. మరి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు?’ అని అడిగినప్పుడల్లా ‘టైమ్ వచ్చినప్పుడు’ అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చిందని తెలుస్తోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి కాజల్ ‘యస్’ చెప్పారట. గౌతమ్ అనే వ్యాపారవేత్తతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని సమాచారం. ఇరుకుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరిగిందట. గౌతమ్ బెంగళూరుకి చెందిన వ్యక్తి అని తెలిసింది. -
నవ్‌లఖాకు అరెస్టు నుంచి 4 వారాల రక్షణ
న్యూఢిల్లీ: కోరేగావ్– బీమా అల్లర్ల కేసులో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవ్‌లఖాను మరో నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవ్లఖా పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ముందస్తు బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా నవ్‌లఖాను విచారించకుండా ఏడాది నుంచి ప్రభుత్వం ఏం చేసిందని ధర్మాసనం నిలదీసింది. నవ్‌లఖాను అక్టోబర్ 15 వరకు అరెస్టు చేయరాదంటూ అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హక్కుల కార్యకర్త నవ్‌లఖాకు 2017లో జరిగిన కోరేగావ్–బీమా అల్లర్లకు, మావోయిస్టులతో సంబంధాలను రుజువు చేసేందుకు తగు ఆధారాలున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. థాపర్ తొలగింపు తీర్మానానికి మెజారిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సీజీ పవర్ తెలిపింది. తీర్మానాన్ని థాపర్ వ్యతిరేకించగా, సీఈవో.. ఎండీ కేఎన్ నీలకంఠ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు కంపెనీ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీజీ పవర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కొత్త మేనేజ్మెంట్ టీమ్‌కు అప్పగించాలని ఇన్వెస్టర్లు, రుణదాతలు డిమాండ్ చేస్తున్నట్లు వివరించాయి. వేల కోట్ల మేర తీసుకున్న రుణాలు, అనుబంధ సంస్థలకు ఇచ్చిన రుణాల మొత్తాలను తగ్గించి చూపారంటూ సీజీ పవర్ ఖాతాల దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ. 6,148 కోట్ల మేర అవకతవకల నేపథ్యంలోనే సంపూర్ణ ప్రక్షాళనలో భాగంగా తొలి చర్యగా థాపర్‌పై వేటుపడిందని పేర్కొన్నాయి. విచారణ జరుగుతున్న సందర్భంగా నీలకంఠ్‌ను సంస్థ సెలవుపై పక్కన పెట్టింది. ఆయన్ను ఇప్పటికీ కీలక బాధ్యతల్లో కొనసాగిస్తుండటంపై ఇన్వెస్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోసం జరగలేదు: థాపర్ ఆగస్టు 20న ఆర్థిక అవకతవకలు బైటపడినప్పట్నుంచీ ఇప్పటిదాకా మౌనం వహించిన థాపర్ తాజాగా పెదవి విప్పారు. ‘ఈ వ్యవహారంలో ప్రమోటరు గానీ ప్రమోటర్లకు చెందిన ఏ సంస్థ గానీ అనుచితమైన లబ్ధి పొందలేదు. ఆగస్టు 19 నాటి బోర్డు సమావేశం తర్వాత వచ్చిన వార్తలన్నీ బాధపెట్టేవిగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవనే చెప్పాలి. వాటాదారులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను. బ్యాంకు లు ఇచ్చిన రుణాలు గానీ, సీజీ నిధులు కానీ దుర్వినియోగం చేయ డం జరగలేదు. బోర్డు అనుమతులతోనే నిధులను వినియోగించడం జరిగింది. ఇంటర్–కార్పొరేట్ లావాదేవీలన్నింటికీ కూడా బోర్డు పూర్తి ఆమోదం ఉంది‘ అని ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నాటి నుంచి రూ. 4000 కోట్ల పైగా మొత్తాన్ని రుణదాతలకు తిరిగి చెల్లించిన ప్రమోటర్లకు.. ‘మోసానికి పాల్పడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. కంపెనీ చైర్మన్ హోదా నుంచి తొలగించినప్పటికీ థాపర్ బోర్డులో కొనసాగనున్నారు. స్వల్ప వాటానే ఉన్నప్పటికీ బోర్డు నుంచి కూడా తప్పించాలంటే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోవాల్సి ఉండటమే ఇందుకు కారణం. -
దేశం కోసం..!
⇔ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి ⇔ జమ్మూకశ్మీరులో సంఘటన ⇔ జలుమూరు మండలంలో విషాదం జలుమూరు: దేశ సేవలో నిమగ్నమైన ఆ యువకుడు..అదే దేశం కోసం ప్రాణాలు విడిచాడు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో తుపాకీ తూటా తగిలి నేలకొరిగాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీరులోని కూంచీ సెక్టార్లో సోమవారం ఉదయం చోటుచేసుకోగా.. జలుమూరు మండలం మాకివలస గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కోటపల్లి గౌతమ్(23) కన్నుమూశాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ మూడేళ్ల క్రితం సీఆర్పీఎఫ్లో జవాన్‌గా చేరారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని కూంచీ సెక్టార్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేయడంతో విధుల్లో ఉన్మ సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గౌతమ్ చనిపోయినట్టు సీఆర్పీఎఫ్ అధికారుల నుంచి సమాచారం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. కన్నతల్లి కన్నీరు..మున్నీరు కుమారుడు గౌతమ్ చనిపోయిన సమాచారం తెలుసుకున్న అతని తల్లి రజని కన్నీరు మున్నీరుగా విలపించినతీరు స్థానికులను కలచివేసింది. గౌతమ్ తండ్రి రాజారావు ఆరు నెలుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. గౌతమ్ సీఆర్పీఎఫ్గా శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత రెండేళ్లు జగదల్పూర్లో పనిచేశాడు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు బదిలీపై వెళ్లాడు. బదిలీకి ముందు నెల రోజలు సెలవుపై స్వగ్రామం మాకివలస వచ్చి తల్లి అక్క చెల్లుళ్లతో ఆనందంగా గడిపాడు. వారం రోజుల క్రితమే సెలవులు పూర్తి చేసుకొని వి«ధుల్లో చేరాడు. ఇంతలో ఎదురు కాల్పుల్లో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. అందరితో సరదాగా ఉండే గౌతమ్ అకాల మరణం గ్రామస్తులను సైతం కన్నీరు పెట్టించింది. మృతుడికి అక్క, చెల్లెలు ఉన్నారు. ఒక సోదరికి ఇటీవలే వివాహం జరిగింది. గ్రామానికి చేరిన మృతదేహం గౌతమ్ మృతదేహాన్ని అధికారులు సోమవారం రాత్రి పది గంటలకు మాకివలస గ్రామానికి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. మృతదేçహాన్ని చూసిన అతని తల్లి రజని, బంధువులు రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. మాకు ఎవరు దిక్కంటూ కన్నీరు పెట్టుకున్నారు. -
మా నాన్న వెరీ గుడ్
‘మా నాన్న వెరీ గుడ్’ అంటోంది నమ్రత ‘‘అమ్మా! మా నాన్న కూడా వెరీ గుడ్’’ అంటున్నారు గౌతమ్, సితార ఎవరి నాన్న వాళ్లకి వెరీ గుడ్... హ్యాపీ ఫాదర్స్ డే . ♦ మహేశ్‌బాబు ఎలాంటి ఫాదర్? నమ్రత: సేమ్ టు సేమ్... జస్ట్ లైక్ మా నాన్నలానే. ‘మీకు స్కూల్‌కి వెళ్లాలని లేదా? సర్లే వెళ్లొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా? ఆడుకోండి. నిద్ర వస్తుందా.. వెళ్లి పడుకోండి. బొమ్మలు ఏవైనా కావాలంటే వెళ్లి కొనుక్కోండి’ – ఇలా పిల్లలు ఏం అడిగినా... ‘యస్’ చెప్తాడు. మహేశ్ నోటి నుంచి ‘నో’ అనే పదమే రాదు. ♦ మీరు స్ట్రిక్ట్‌గా ఉంటారా? ఓ స్థాయి వరకు ఏం అనను. స్కూల్‌కి వెళ్లాల్సిన టైమ్‌లో ఆటలు ఆడుతుంటే... ఊరుకోను. అప్పుడప్పుడూ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. ♦ పిల్లల మార్కుల గురించి మహేశ్ పట్టించుకుంటారా? చూస్తాడు. ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాడు. కాకపోతే పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్స్‌కి వెళ్లడు. వాటికి నేను వెళతాను. తప్పకుండా రావాల్సిందే అని గౌతమ్ అడిగితే మాత్రం ఆ ఈవెంట్ మిస్ కాకుండా చూసుకుంటాడు. ♦ మీ గురించి మహేశ్ దగ్గర పిల్లలు కంప్లైంట్ చేస్తారా? అఫ్కోర్స్. రోజూ చేస్తారు. అప్పుడు ‘ఓకే.. అమ్మతో మాట్లాడతా. కూల్’ అంటాడు. ఒక్కోసారి ‘పిల్లలే కదా.. వదిలెయ్’ అని నాతో చెబుతుంటాడు. ♦ ఇప్పుడు మమ్మీ డాడీ కల్చర్ కదా. మరి మీ పిల్లలు అమ్మా, నాన్న అనే పిలుస్తారా? నేను మా నాన్నని ‘పప్పా’ (నాన్న) అని పిలిచేదాన్ని. అమ్మను ‘మా’ (అమ్మ) అనేదాన్ని. పిలుపు విషయంలో మహేశ్ చాలా పర్టిక్యులర్. అమ్మా, నాన్న అని పిలిపించు కోవాలన్నది తన డెసిషనే. అందుకే మొదట్నుంచీ మా పిల్లలకు అమ్మా, నాన్న అని పిలవడం అలవాటు చేశాం. ♦ ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం... మీ నాన్నకు మహేశ్‌బాబు ఎందుకు నచ్చారు? హ్యాండ్సమ్గా ఉంటారనా? ఆయన మనసు నచ్చిందా? మహేశ్ ఈజ్ వెరీ కైండ్ అండ్ లవింగ్ పర్సన్. చాలా మంచోడు. అమ్మానాన్నలకు మహేశ్‌లో ఆ లక్షణాలు నచ్చాయి. నేను హ్యాపీగా ఉండడం వాళ్లకు కావాలి. మహేశ్‌తో నేను హ్యాపీగా ఉన్నాను. సో, ఓకే చెప్పేశారు. అంతే తప్ప... మహేశ్ బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉంది? అతనెవరి కుమారుడు? అతని క్యాస్ట్ ఏంటి? అతనెక్కడి నుంచి వచ్చాడు? అనేవి ఆలోచించలేదు. మా అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? లేదా? అనేది మాత్రమే నాన్న ఆలోచించారు. ♦ మీ ఫాదర్, మీ హజ్బెండ్లో ఉన్న సేమ్ క్వాలిటీస్ గురించి? ఇద్దర్నీ కంపేర్ చేసి చూడలేను. కానీ, ఇద్దరిలో కొన్ని క్వాలిటీస్ కామన్‌గా ఉన్నాయి. ఇద్దరూ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. మహిళలను బాగా గౌరవిస్తారు. ఇద్దరూ వెరీ కైండ్ అండ్ గివింగ్. ♦ ఓ అమ్మాయికి నాన్న దగ్గర దొరికే సపోర్ట్ భర్త దగ్గర కూడా దొరికితే బాగుంటుంది... (మధ్యలో అందుకుంటూ)... మహేశ్ ఈజ్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. నాకే కాదు... మా పిల్లలకు, మా ఫ్యామిలీ అందరికీ మహేశ్ ఎంతో సపోర్ట్. పిల్లలకు, ఫ్యామిలీకి కొంచెం టైమ్ కూడా కేటాయించలేని భర్త అయితే... పరిస్థితి మరోలా ఉండేదేమో! మహేశ్ అలా కాదు. ఎప్పుడూ మాతోనే, మాకు అండగానే ఉంటాడు. ♦ ఏ అమ్మాయికైనా నాన్న అంటే స్పెషల్ లవ్ ఉంటుంది. తండ్రి అంత మంచి వ్యకి భర్తగా రావాలని కోరుకుంటారు.. మీరలా అనుకునేవారా? లేదండీ. నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఎందుకంటే, మనల్ని సంతోషంగా ఉంచే వ్యక్తి మన లైఫ్ పార్ట్నర్ అయితే చాలనుకునేదాన్ని. నిజంగానే నాకలాంటి వ్యక్తే దొరికాడు. భర్త అంటే పెత్తనం చేసేవాడు.. భార్య అంటే అణిగి మణిగి ఉండాలనుకునే వ్యక్తి కాదు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్విలానే ఉండాలి. వీళ్లతో మాట్లాడకూడదు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు’ అనే కండిషన్లు మహేశ్ పెట్ట లేదు. నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాల్సిన పరిస్థితి రాలేదు. ♦ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా? యాక్చువల్‌గా ఎరేంజ్డ్ మ్యారేజెస్‌కి చాలా కట్టుబాట్లు ఉంటాయి. చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. ఇతరుల కోసం ఇష్టం లేని పనులు కొన్ని చేయాలి. నేను వాటికి వ్యతిరేకిని కాదు. కానీ, ఒక భార్యాభర్త సంతోషంగా ఉండాలంటే అవి ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడాలి. ఈ మూడూ ఉంటే సరిపోతుంది. ఏ భార్యాభర్త అయినా హ్యాపీగా ఉంటారు. ♦ మీరు లవ్ మ్యారేజెస్నే సపోర్ట్ చేస్తారా? అవును. బట్, నేను ఎరేంజ్డ్ మ్యారేజ్ మంచిది కాదనడం లేదు. కాకపోతే ఎక్కువగా రాజీపడాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్స్‌లో చాలామందికి ఎరేంజ్డ్ మ్యారేజెస్ జరిగాయి. 50 శాతం మంది హ్యాపీగా ఉన్నారు. మిగతా 50 శాతం మంది రాజీలతో సాగిస్తున్నారు. లవ్ మ్యారేజెస్లో కూడా అలా ఉంటాయనుకోండి. నా విషయం గురించి మాట్లాడతాను. మనిషి ఎలాంటివాడో తెలుసుకోకుండా అతనితో మిగతా జీవితాన్ని పంచుకోవాలనుకోలేదు. మహేశ్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాకే నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇవాళ మేం హ్యాపీగా ఉన్నాం. మా అమ్మానాన్నలది ఎరేంజ్డ్ మ్యారేజే. ఆ తర్వాత వాళ్లిద్దరూ లవ్‌లో పడ్డారు. జీవితాంతం హ్యాపీగా ఉన్నారు. ♦ మీ పెళ్లికి ముందు మహేశ్‌గారు, మీరు లవ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, వాళ్ల బాధ్యతలు.. ఇదంతా ఎలా ఉంది? మా పెళ్లయి పన్నెండేళ్లు. అంతుకుముందు నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. సో.. మా బంధం మొత్తం 16 ఏళ్లు. ‘ఇట్స్ వెరీ వెరీ గుడ్’. లవర్స్‌గా ఉన్నప్పటి ఫేజ్ చాలా బాగుండేది. ఆ తర్వాత భార్యాభర్తలయ్యాం. ఆ ఫేజ్ ఎప్పుడూ సూపర్. పేరెంట్స్‌గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. 16 ఏళ్లలో వచ్చిన ఈ ఫేజ్లన్నీ స్వీట్ మెమొరీస్. ♦ మామూలుగా పెళ్లయిన ఏడేళ్లకు భార్యాభర్తల మధ్య ‘సెవన్ ఇయర్స్ ఇచ్’ స్టార్ట్ అవుతుందట.. టూ ఇంటూ సెవన్ 14 ఏళ్లు.. ఇంకా రెండేళ్లు అదనంగానే అయ్యాయి... (నవ్వుతూ). అయినా మా మధ్య ఎలాంటి ‘ఇచ్’ లేదు. ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే, రోజంతా మేం పక్క పక్కన ఉండం. మహేశ్ షూటింగ్స్‌తో బిజీగా ఉంటాడు. నాకు ఇంటి వ్యవహారాలతో సరిపోతుంది. సంవత్సరంలో మేమంతా కలిసి గడిపే రోజులను లెక్కపెడితే... ఓ మూడు నాలుగు నెలలు ఉంటామేమో. ఆ టైమ్‌ని మేం నలుగురుం చాలా హాయిగా గడుపుతాం. అందుకే అంటున్నా... ‘ఐయామ్ బ్లెస్డ్’. నాన్నకు గిఫ్ట్... సస్పెన్స్ ♦ మీ నాన్నగారు వెరీ గుడ్డా? గుడ్డా? యావరేజ్ డాడీయా? గౌతమ్: మా నాన్న వెరీ గుడ్. మా గురించి చాలా కేర్ తీసుకుంటారు. ♦ ఫాదర్స్ డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా? గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ, అదేంటో చెప్పను. సస్పెన్స్. అయితే ఐ వాంట్ టు టెల్ హిమ్ ‘హ్యాపీ ఫాదర్స్ డే’. ♦ తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీ నాన్నగారు తిడతారా? అస్సలు తిట్టరు. కూల్‌గా ఉంటారు. ♦ మీ నాన్న యాక్ట్ చేసిన వాటిలో నీకు బాగా నచ్చిన సినిమా? ‘శ్రీమంతుడు’ అంటే బాగా ఇష్టం. చాలాసార్లు చూశాను. ♦ ‘1 నేనొక్కడినే’లో మీ నాన్నతో యాక్ట్ చేసినప్పుడు ఏమనిపించింది? నాకు బాగా అనిపించింది. నాన్నతో ఇంట్లో ఉన్నా బాగుంటుంది. లొకేషన్లో ఉన్నా బాగుంటుంది. ఎక్కడున్నా బాగా అనిపిస్తుంది. ♦ మీ స్కూల్లో జరిగే ఈవెంట్స్ అన్నింటికీ మీ నాన్న హాజరవుతారా? ఇంపార్టెంట్ ఈవెంట్స్‌కి తప్పకుండా వస్తారు. ♦ నిన్ను, సితారనీ బాగా గారం చేస్తారా? చాలా చేస్తారు. ఎంత అల్లరి చేసినా తిట్టరు. మా నాన్న వెరీ వెరీ గుడ్. ♦ మరి.. అమ్మ గురించి? అమ్మ కూడా వెరీ స్వీట్. కాకపోతే సరిగ్గా చదవకపోయినా, ఎక్కువ అల్లరి చేసినా కొంచెం తిడుతుంది. ♦ సితారా... మీ నాన్న గురించి నువ్వేం చెబుతావ్? నాన్న వెరీ గుడ్. అన్నయ్య చెప్పాడు కదా. నేనూ నాన్నకి ‘హ్యాపీ ఫాదర్స్ డే’ చెబుతున్నా. నమ్రత: సితార ఇంకా చిన్న పిల్ల. క్వొశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం అంటే కష్టమే. ♦ మామూలుగా అయితే గౌతమ్కన్నా సితారే బాగా మాట్లాడుతుంది కదా.. నమ్రత: ఆ.. అవును. బిందాస్‌గా ఉంటుంది. అచ్చం నాలా. గౌతమ్ ఏమో వాళ్ల నాన్నలా కొంచెం రిజర్వ్(నవ్వేస్తూ). ♦ ఇద్దరిలో మహేశ్‌కి ఎవరు బాగా క్లోజ్? ఇద్దరూ. నేనెప్పుడూ వాళ్లతోనే ఉంటాను. మహేశ్ షూటింగ్స్‌కి వెళుతుంటాడు కదా... ఎక్కువ మిస్సవుతారు కాబట్టి, పిల్లలిద్దరికీ మనసంతా వాళ్ల నాన్న మీదే ఉంటుంది. మా నాన్న నేర్పిన విలువలే... ♦ ఫాదర్స్‌డే సందర్భంగా మీ ఫాదర్‌తో మీకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి? నమ్రత: నాన్న (నితిన్ శిరోద్కర్), నేను వెరీ వెరీ క్లోజ్. అమ్మానాన్నలకు నేను, సిస్టర్ (శిల్పా శిరోద్కర్) మాత్రమే. నేనంటే నాన్నకు చాలా ఇష్టం. మా అమ్మకు సిస్టర్ అంటే ఇష్టం. నాన్న చాలా సరదా మనిషి. ఫన్ లవింగ్ అండ్ వెరీ కైండ్! ఎప్పుడూ మమ్మల్ని చెడగొట్టేవారు. బాగా గారాబం చేసేవారు. మా అమ్మ ఏమో నాన్నపై కోప్పడేవారు. ♦ మీకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు... (ప్రశ్న మధ్యలోనే అందుకుంటూ...) ఏం లేదు. నేనే నాన్న దగ్గరకు వెళ్లి మార్కుల గురించి చెప్పేదాన్ని. ఏమీ అనేవారు కాదు. నాకు బాగా గుర్తు... 12వ తరగతిలో (ఇంటర్మీడియట్లో) మార్కులు సరిగ్గా రాలేదు. నాన్న దగ్గరకు వెళ్లి ‘సారీ’ చెప్పా. ‘నీకు పాస్ మార్కులు రాకపోతే మళ్లీ ఎగ్జామ్స్ రాయి. డోంట్ వర్రీ’ అన్నారు. నాతో నాన్న అలా ఉండేవారు. చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్... నిజంగా మేము ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మందలించేవారు. నాన్న లేని లోటు మర్చిపోయాను! ♦ మీ మామగారిలో మీ నాన్నగారిని చూసుకునేంతగా కృష్ణగారు మిమ్మల్ని చేరదీస్తారా? ఇవాళ మా నాన్నగారు లేరు. అమ్మా నాన్న చనిపోయి పదేళ్లవుతోంది. అది మాకో షాక్. మహేశ్ వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడగలిగా. తర్వాత తర్వాత మా మావయ్యగారు నాకు నాన్న లేని లోటుని తెలియనివ్వలేదు. ఇవాళ మావయ్యగారి గురించి ఎవరడిగినా ‘మా నాన్నగారి కన్నా ఎక్కువ’ అని చెబుతుంటాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎవరినైనా ఇంకొకరితో పోల్చవచ్చు. కానీ, మా మావయ్యగారిని మాత్రం ఎవరితోనూ పోల్చలేం. అసలు ఆయనలా ఎవరూ ఉండరేమో. నా దృష్టిలో మా మావయ్యగారు ఎంతో ఎత్తులో ఉంటారు. నన్ను కూతురికన్నా ఎక్కువగానే చూస్తారు. ఆ మాటకొస్తే... నాది లక్కీ లైఫ్. మా ఫాదర్ సూపర్. మా ఫాదర్ ఇన్ లా సూపర్. నా హజ్జెండ్ మహేశ్ సూపర్. మహేశ్ ఈజ్ సూపర్ ఫాదర్ ఆల్సో. ♦ మీ నాన్నగారు అలా కోప్పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? (ఆలోచిస్తూ...) ఆయనెప్పుడూ అంత సీరియస్ కాలేదు. కానీ, ఎప్పుడైనా నేను, నా సిస్టర్ మాట్లాడిన మాటలు తప్పుగా ఉంటే అప్సెట్ అయ్యేవారు. ♦ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ... అమ్మాయి హీరోయిన్ అవుతానంటే ఏ తండ్రికైనా టెన్షన్ ఉంటుంది కదా! నో... నో! ఎప్పుడూ నాన్న టెన్షన్ పడలేదు. మా నానమ్మ (మీనాక్షీ శిరోద్కర్) మరాఠీలో ప్రముఖ నటి. నాన్న సిల్వర్ స్పూన్‌తో పుట్టి పెరిగారు. ఆయనొక్కరే పిల్లాడు కావడంతో అందరూ బాగా గారాబం చేశారు. నాన్న పెరిగిందే సినిమాల్లో. ఆయనకు నటన అనేది చాలా సహజమైన విషయం. నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నాన్న పెద్దగా ఆశ్చర్యపోలేదు. టెన్షనూ పడలేదు. ♦ పోనీ... సలహాలు ఏవైనా ఇచ్చారా? ఆయన ఆలోచనలు చాలా లిబరల్గా ఉంటాయి. అదే సమయంలో... మేము అమ్మాయిల్లాగానే ఉండాలని అనుకునేవారు. ఆయనెప్పుడూ మాతో ‘‘మీరేం చేసినా... మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. విలువలతో సంప్రదాయబద్ధంగా నడుచుకోండి. శక్తిమంతమైన మహిళగా ఉండండి’’ అని చెప్పేవారు. ‘‘మన కుటుంబానికి గానీ... ముఖ్యంగా మీకు గానీ అగౌరవాన్ని తీసుకొచ్చే ఏ పనులూ చేయవద్దు. మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు గౌరవించేలా నడుచుకోండి’’ అని నాన్న చాలాసార్లు చెప్పారు. ♦ మీరిప్పుడు మంచి హోమ్ మేకర్‌గా ఉండటానికి కారణం మీ నాన్నగారు నేర్పించిన విలువలేనా? అవును. కచ్చితంగా! అమ్మానాన్నలు ఇద్దర్నుంచి నాకు ఈ లక్షణాలు వచ్చాయి. స్పష్టంగా చెప్పాలంటే... నాన్నే. ‘‘మీరేం చేయాలనుకుంటు న్నారో... అది చేయండి. బట్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ విమెన్. ఏ గుడ్ హోమ్ మేకర్’’ అని నాన్న చెప్పేవారు. నువ్వో అమ్మాయివి కనుక... ఏం చేసినా సక్సెస్‌ఫుల్‌గా చేయాలనే వారు. అప్పుడే ప్రతి ఒక్కరూ గౌరవంగా, ప్రేమగా చూస్తారని చెప్పేవారు. ♦ మీరు తెలుగింటికి కోడలిగా అడుగుపెడుతున్న టైమ్‌లో నాన్న ఏవైనా సలహాలు ఇచ్చారా? అమ్మానాన్నలకు మహేశ్ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. మహేశ్, నేనూ లవ్‌లో ఉన్నప్పుడు వాళ్లు మహేశ్‌ను కలిశారు. అప్పుడే నచ్చేశాడు. మావయ్యగారిని (కృష్ణ) కూడా కలిశారు. అమ్మానాన్నలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక్కడో విషయం చెప్పాలి. మా ఇంట్లో కులమతాల పట్టింపులు లేవు. మా అమ్మానాన్నలనే కాదు... వాళ్ల తల్లిదండ్రులకు కూడా పట్టింపులు లేవు. అంటే.. అప్పటి తరంవాళ్లు అలా ఉండటం గొప్ప విషయం. ‘‘తప్పకుండా మహారాష్ట్ర వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉండకూడదు. మన క్యాస్ట్ అయ్యుండాలి’’ వంటి సమస్యలు మా ఫ్యామిలీలో ఎప్పుడూ లేవు. నేను హ్యాపీగా ఉండాలనేది అమ్మానాన్నల అభిమతం. నా విషయంలోనే కాదు... సిస్టర్ విషయంలోనూ అంతే. ప్రతి ఒక్కరూ నేర్చుకోవల్సిన పాఠమిది. – డి.జి. భవాని -
సన్మామ
ఇదిగో సూర్యుడింకా కనపడుతూనే ఉన్నాడు. మరి అదేంటో చంద్రుడూ కనపడుతున్నాడు. సన్ వస్తే మామ కనపడకూడదు కదా! అదేనండి, చందమామ కనపడకూడదు కదా! ఎక్కడైనా సూర్యుని కాంతిలో వెలిగేవాడిని చందమామ అంటారు కానీ ఇక్కడ మామకాంతిలో వెలుగుతున్నాడు సన్! మామలాంటి సన్మామ ఇదిగో సన్మామ కథ. అంతసేపూ తన వెంటే ఉన్న గౌతమ్ ఎటువెళ్లాడా అనుకుంటూ కిచెన్‌లోంచి బయటకు వచ్చి చూసిన భాగ్యకు నోటమాట రాలేదు. గౌతమ్ తన మేనమామ హరి ఫొటోను తదేకంగా చూస్తున్నాడు. ఫొటోకు ముద్దులు పెడుతున్నాడు. పై షెల్ఫ్‌లో ఉన్న ఫొటో గౌతమ్ చేతిలోకి ఎలా వచ్చిందో ఒక్క క్షణం అర్థం కాలేదు భాగ్యకు. చెయిర్ వేసుకున్నా వీడికి షెల్ఫ్ అందదు, బహుషా షెల్ఫ్ ఎక్కి ఉంటాడు. వీడి అల్లరి ఎక్కువైంది, కిందపడితే..!’ పిలవబోయి ఆగిపోయింది. ఆ ఫొటో చూస్తూ గౌతమ్ ఏడుస్తున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన కిరణ్ ‘‘ఏమైందిరా.. ఎందుకేడుస్తున్నావ్!’’ కంగారుగా అడిగాడు.భాగ్య, కిరణ్‌ల కొడుకు గౌతమ్. ఐదేళ్ల వయసు. ఏడాదిగా స్కూల్ కెళుతున్నాడు. ‘‘ఈ రోజు నా బర్త్ డే, కొత్త డ్రెస్ లేదు. కేక్ లేదు. నన్ను మీరు అసలు పట్టించుకోవడమే లేదు. అందరికీ పార్టీ ఎలా ఇవ్వాలి’’ ఏడుపు గొంతుతో అన్నాడు గౌతమ్. ‘‘నీ బర్త్‌డేకి ఇంకా రెండు నెలల టైముందిరా, ఇప్పుడు కాదు’’ అంది భాగ్య.‘‘కాదు, ఈ రోజే నా బర్త్ డే! నువ్వు మర్చిపోయావ్! నన్ను పూర్తిగా మర్చిపోయావ్’’ వెక్కిళ్లు పెడుతూ అన్నాడు గౌతమ్.భాగ్య ఉలిక్కిపడింది. ‘ఈ రోజు తన తమ్ముడు హరి పుట్టినరోజు. వాడు చనిపోయి ఈ రోజుకు ఏడేళ్లు. మరి, వీడేంటి? తన బర్త్ డే అంటున్నాడు..’ భాగ్య కిరణ్‌వైపు అయోమయంగా చూసింది. గత జన్మ అప్పు లు ‘‘అక్కా, అక్కా లే!’’ ఆ పిలుపుతో ఆందోళనగా లేచింది భాగ్య. బెడ్‌లైట్ వెలుగులో గౌతమ్‌ను చూసిన భాగ్య ‘‘ఏంట్రా, ఏమైంది?’’ అని అడిగింది. ‘‘నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు’’ అంటున్న గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూసింది. టైమ్ అర్థరాత్రి దాటింది. తినే పడుకున్నాడు. కానీ, ఇలా... ! ఆశ్చర్యంగా గౌతమ్‌నే చూస్తూ .. లేచి Ðð ళ్లి అన్నం, కూర కలిపి ప్లేట్ చేతికిచ్చింది. అన్నం తింటున్న గౌతమ్‌ని కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది. ఏడాదిగా గౌతమ్ ప్రవర్తన అచ్చూ హరిలా ఉంటోంది. హరి గౌతమ్ రూపంలో తన కళ్ల ముందు నిలుచున్నట్టుగా ఉంది. హరికన్నా రెండేళ్లు పెద్ద తను. తమ్ముడే అయినా కొడుకులా మారాం చేసేవాడు. పెళ్లయ్యాక తనెక్కడ దూరమైపోతానో అని చదువు, ఉద్యోగం పేరుతో తన దగ్గరే ఉండేవాడు. అన్నం తినేసి పడుకున్నా అర్థరాత్రి లేచి, ఆకలేస్తోందని మళ్లీ అన్నం తినేవాడు. అందుకే వాడి కోసం ఇంకాస్త ఎక్కువ వండి ఉంచేది. ఈ మధ్య గౌతమ్ కూడా హరిలాగే అర్థరాత్రి లేస్తున్నాడు. ఆకలేస్తోంది అన్నం పెట్టు అంటున్నాడు. బర్త్ డే అంటే హరికి చాలా ఇష్టం. పండగలా జరుపుకునేవాడు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఫ్రెండ్స్‌తో టూర్ వెళుతుంటే కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పుడు గౌతమ్ హరి బర్త్ డే రోజున కొత్త డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేసి చుట్టుపక్కల వాళ్లందరికీ పంచాడు. ఎక్కడకెళ్లినా హరి ఫొటో వదలడం లేదు. ‘‘ఇది నా ఫొటో! నా దగ్గరే ఉండాలి’’ అంటున్నాడు. ‘‘నా అజాగ్రత్త వల్లే యాక్సిడెంట్ అయ్యింది’’ అని చెబుతున్నాడు. మొన్నటికి మొన్న హరి స్నేహితురాలు దారిలో కలిస్తే ఇంటికి తీసుకొచ్చింది. తామిద్దరూ మాట్లాడుతూ కూర్చుంటే గౌతమ్ ఆమెనే చూస్తూ కాసేపటి తర్వాత లోపలికెళ్లి ఏదో పుస్తకం తీసుకొచ్చాడు. ‘‘రమ్యా, ఇదిగో నీ బుక్. అప్పుడు నిన్ను అడిగి తీసుకున్నా! తిరిగి ఇవ్వలేకపోయాను. తీసుకో.. ’’ అన్నాడు. రమ్య షాకైంది. నిజమే! ఆ బుక్ ఏడేళ్ల కిందట రమ్య హరికిచ్చింది. గౌతమ్‌ని భయం భయంగా చూస్తూ వెళ్లిపోయింది. మొన్నామధ్య ఎవరికో ఫోన్ చేసి ‘నీకు ఐదు వేల రూపాయిలు ఇవ్వాలిగా! వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తికి నిజంగానే హరి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వచ్చిన అతనూ నిర్ధారణ చేశాడు. హరి చనిపోయాడని తెలుసుకొని వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ.. ‘‘నా ఫోన్ నెంబర్ మీ అబ్బాయికి ఎలా తెలుసు?’’ అన్నాడు ఆశ్చర్యంగా! జ్ఞాపకాల భారం ‘‘దీనినే పునర్జన్మ అంటారు’’ అన్న కౌన్సెలర్ మాటలకు కొయ్యబారిపోయారు భాగ్య, కిరణ్‌లు.‘‘ఏంటి డాక్టర్, చనిపోయినవారు మళ్లీ పుడతారా! అలా అయితే మా తమ్ముడే నాకు కొడుకుగా పుట్టాడా? నమ్మలేకపోతున్నాను’’ ఆందోళనగా అడిగింది భాగ్య. కిరణ్ మాట్లాడుతూ ‘‘డాక్టర్ అది నిజమే కావచ్చు. కానీ, ఆ జ్ఞాపకాల వల్ల గౌతమ్ ఇప్పుడెంతో జీవితాన్ని కోల్పోతున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటాడు. ఎవరితోనూ కలవడం లేదు. స్కూళ్లోనూ ఒంటరిగా ఉంటున్నాడు. వీడి ప్రవర్తన మాకు భయాన్ని కలిగిస్తుందిు. దీన్నుంచి బయటపడే మార్గం..’’ కిరణ్ మాటలు పూర్తి కాకుండానే ‘‘ఉంది’’ అన్నారు కౌన్సెలర్. స్మృతులను తుడిచే ఎరేజర్ థెరపీ గౌతమ్ ధ్యానప్రక్రియ ద్వారా చేతన స్థితి నుంచి అచేనత్వంలోకి.. చైతన్యం నుంచి అనంతంలోకి ప్రయాణిస్తున్నాడు. హరిగా తాను జీవించిన రోజులు ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. ‘‘అక్కా, నువ్వు చెబితే వినకుండా వెళ్లిపోయాను. ఘోరమైన నొప్పిని అనుభవించాను. నీ కోసమే మళ్ళీ వచ్చాను. నువ్వు నాకు ఎన్నో ప్రమాణాలు చేశావు నన్ను ఎప్పటికీ దూరం చేయనని. కానీ, నువ్వు నన్ను మర్చిపోయావ్! చెబితే వినలేదనేగా! నన్ను క్షమించు. నాకు ఎన్నో కలలు ఉన్నాయి. వాటిని సాధించాలని ఉంది. నాకు సాయం చేయ్!’’ అక్కతో తను చేసిన తప్పులు, తిరిగి తను నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. వింటున్న భాగ్య, కిరణ్‌లు చలించిపోయారు.. కౌన్సెలర్ సూచనలు మళ్లీ మొదలయ్యాయి. ‘‘హరీ.. నువ్విప్పుడు గౌతమ్వి. గతజన్మ జ్ఞాపకాలన్నీ ఎరేజర్‌తో తుడిచినట్టు తుడిచేయ్! ఇప్పుడు నీ మస్కిష్తం ఒక తెల్లని కాగితం. దానిపై ఈ జన్మ అనుభవాలను మాత్రమే రాసుకో...’’ అని సూచనలు ఇచ్చారు కౌన్సెలర్. అర గంట పాటు సాగిన థెరపీ గౌతమ్ నిద్రతో పూర్తయింది. మెలకువ వచ్చిన గౌతమ్ తల్లిని చూసి హత్తుకుపోయాడు. స్కూళ్లో టీచర్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి తల్లీతండ్రి చేతికిచ్చాడు గౌతమ్. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో స్కూల్ టాపర్ అని పేరుతెచ్చుకుంటున్న గౌతమ్‌ని భాగ్య దగ్గరగా తీసుకొని బుగ్గమీద ముద్దిచ్చింది. మరెప్పుడూ ఆ ఇంట్లో హరి జ్ఞాపకాలు వినిపించలేదు. కర్మభూమి కర్మసిద్ధాంతానికి పెద్ద పీట వేసే మన దేశం ప్రాచీన సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులలో ఎవరైనా మరణిస్తే వారు మన మధ్యే ఉంటారని, మనకోసం మళ్లీ వారు పుడతారని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే చనిపోయినవారికి పిండప్రదానం చేయడం, వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేయడం చూస్తుంటాం. అలాగే చనిపోయిన రోజు, పుట్టినరోజులను గుర్తుంచుకొని వారికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంటారు. – నిర్మల చిల్కమర్రి -
ఇప్పటివరకూ నెగిటివ్... ఇప్పుడు పాజిటివ్
ప్రస్తుతం సమాజంతో పాటు మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు మన దేశంలో కనుమరుగవుతాయనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, అవంతిక, సింధూర ముఖ్య తారలు. కట్ల రాజేంద్రప్రసాద్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎమ్ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఉత్కంఠగా సాగుతూనే వినోదం పంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘రెడీ రా రెడీ.. రగులుతున్న వయసే ఇదిరా’ పాట చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ నెగిటివ్ రోల్స్‌లో కనిపించిన నేను ఫస్ట్ టైమ్ ఓ బాధ్యతగల సీఐగా పాజిటివ్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు. తప్పకుండా నాకు మంచి బ్రేక్ అవుతుంది’’ అని నటుడు షఫీ అన్నారు. -
సమాజానికి సందేశం
‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి?’ అనే సందేశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, శ్వేత జంటగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఎమ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: కట్ల రాజేంద్రప్రసాద్. -
తిరుమలలో మహేశ్ ఫ్యామిలీ
వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఇష్టమైన కానుక తల నీలాలే. అందుకే ‘తల నీలాలు సమర్పిస్తాం’ అని మొక్కుకుని మరీ తిరుమల వెళ్లి, మొక్కు తీర్చుకుంటారు. మొక్కుని మాత్రం బయటికి చెప్పరు. మరి.. నమ్రతా మహేశ్ ఏం మొక్కుకున్నారో కానీ.. తిరుమలేశుడికి తల నీలాలు సమర్పించారు. కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఆమె తిరుమల వెళ్లారు. మహేశ్ కుటుంబం దేవుణ్ణి బాగా నమ్ముతుందని అర్థమవుతోంది. మొన్నటికి మొన్న వినాయక చవితిని ఘనంగా జరిపారు. గౌతమ్ స్వయంగా వెళ్లి, చెరువులో వినాయకుణ్ణి నిమజ్జనం చేశాడు. ఆ సంగతలా ఉంచితే, మహేశ్ ఫ్యామిలీతో కలసి దర్శకుడు మెహర్ రమేశ్ కూడా తిరుమల వెళ్లారని ఇక్కడున్న ఫొటో స్పష్టం చేసింది. ఈ మధ్య మహేశ్ నటించిన ఓ యాడ్‌కు దర్శకత్వం వహించిన మెహర్ రమేశే భవిషత్తులో ఆయనతో సినిమా కూడా చేస్తారేమో? -
సీపీ గౌతం సవాంగ్‌కు డీజీపీ హోదా
విజయవాడ : నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్‌కు పదోన్నతి లభించింది. ఆయనకు డీజీపీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషినల్ డీజీ కేడర్‌లో ఉన్న ఆయనను డీజీ కేడర్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జీవో జారీ చేశారు. -
జూన్‌లో సాట్టైకు సీక్వెల్ ప్రారంభం
ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ న డుస్తోందని చెప్పవచ్చు. సక్సెస్ అయిన పెద్ద చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకూ సీక్వెల్‌కు సిద్ధం అవుతున్నాయి.అలాంటి చిత్రాల కోవలో సాట్టై చేరనుంది. విద్య ప్రధానాంశంగా రూపొందిన సాట్టై చిత్రం మంచి ప్రజాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మైనా, సాట్టై, మొసకుట్టి, షావుకార్‌పేట్టై చిత్రాలను నిర్మించిన షాలోమన్ స్టూడియోస్ అధినేతలు జాన్‌మ్యాక్స్, జోన్స్ ప్రస్తుతం భరత్ హీరోగా బొట్టు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వడివుడైయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్ర నిర్మాతలు తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సాట్టైకు సీక్వెల్‌ను ప్రారంభించనున్నారు. దీనికి గౌతమ్ అనే నవ దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నారు. ఈయన ఇంతకు ముందు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఇందులో ఆడుగళం, సోల్లాదవన్ వంటి పలు చిత్రాల్లో నటించిన కిశోర్, తంబిరామయ్య ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సాట్టై-2 చిత్ర షూటింగ్‌ను జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
'ఏపీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం'
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తోందని ఏపీసీసీ నేత గౌతమ్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏపీసీసీ నేత గౌతమ్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేసిన తప్పులను టార్గెట్ చేసినప్పుడు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీని వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే చింతమనేనిని రక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారన్నారు. రెవెన్యూ ఉద్యోగులను చంద్రబాబు బెదిరించి రాజీకి వచ్చేలా చేశారని గౌతమ్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక దోపిడి జరుగుతుందనడానికి చింతమనేని ఉదంతమే నిదర్శనమన్నారు. ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించామని చంద్రబాబు చెప్పారు... కానీ ఇసుకరేవు వద్ద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి ఏం పనో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. -
సాహసం శ్వాసగా...
నటులు చాలామంది ఉంటారు. కానీ, హీరోలు మాత్రం కొందరే ఉంటారు. హీరోగా చేయడం మానేసి, సినిమాలు చేయడం కూడా దాదాపుగా విరమించుకున్న ఒక నటుణ్ణి ఇవాళ్టికీ ‘సూపర్‌స్టార్’ అని ఎవరైనా పిలుస్తారా? అభిమానులే కాదు... ఆఖరికి పరిశ్రమ వర్గీయులు సైతం ఆయనను ఇప్పటికీ హీరో కృష్ణగానే ప్రస్తావిస్తారు. బహశా, అది ఒక్క ‘సూపర్‌స్టార్’ కృష్ణకే దక్కిన భాగ్యమేమో! ఇవాళ్టికీ హీరో కృష్ణ అంటే... ప్రాణం పెట్టే అభిమానులున్నారు. మహేశ్‌బాబులో తమ ఆరాధ్య కథానాయకుణ్ణి చూసుకొనే సినీప్రియులున్నారు. అందుకే, మే 31వ తేదీన ఆయన చెన్నైలో ఉన్నా, ఊటీలో విశ్రాంతి తీసుకుంటున్నా, హైదరాబాద్‌లో ఉన్నా... ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఒక్కసారి వెనక్కి వెళితే... తెలుగు సినిమా రంగంలో తొలితరం నాగయ్య లాంటివాళ్ళ తరువాత స్టార్స్‌గా ఎదిగినవాళ్ళు - ఎన్టీఆర్, ఏయన్నార్. ఆ మహానటులు మంచి ఫామ్‌లో ఉండగానే వచ్చి, దీటుగా నిలబడి, స్టార్స్‌గా నిలదొక్కుకున్న నవతరం తారలనగానే కృష్ణ, శోభన్‌బాబులే గుర్తుకొస్తారు. ఇటు శోభన్‌బాబు తరంతోనూ, అటు నందమూరి జమానాతోనూ ఢీ అంటే ఢీ అన్న - సినీ సాహసిగా కృష్ణది ఒక చరిత్ర. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ కథలకు ‘గూఢచారి 116’ అయినా, ‘మోసగాళ్ళకు మోసగాడు’తో దేశవాళీ ‘మెకన్నాస్ గోల్డ్’ను అందించినా, ఎన్టీఆర్ చేద్దామనుకున్న అల్లూరి పాత్రను ధైర్యంగా తెరకెక్కించినా, తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’తో సంచలనం రేపినా - కృష్ణలోని ‘డేరింగ్ అండ్ డాషింగ్’ నేచరే కారణం. రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయ చిత్రాలు చేసినా, అభిమాన హీరో ఎన్టీఆర్‌నే ఢీ కొట్టినా - అనుకున్నది చేయడమే తప్ప, ఆ తరువాత ఏమవుతుందోనన్న వెరపు, వగపు ఆయనకు లేవు. ఆయన ధైర్యాన్ని ప్రేక్షకులు కూడా ఆశీర్వదించారు కాబట్టే, ‘అల్లూరి...’ లాంటివి ఆయన ఊహించినదాని కన్నా హిట్టయ్యాయి. తెలుగులో అత్యధిక (300 పైచిలుకు) చిత్రాల్లో హీరోగా నటించిన స్టార్‌కు తలమానికంగా మిగిలాయి. ‘‘వారసుడిగా మహేశ్ హీరో అయి, ‘రాజకుమారుడు’తో తొలి సక్సెస్ సాధించగానే సంతృప్తికి లోనయ్యా’’ అని పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళే ఈ ఏడుపదుల స్టార్‌కు హీరోగా ఇది స్వర్ణోత్సవ వత్సరం (‘తేనెమనసులు’ 1965). ‘‘చిన్నాచితకా పాత్రలు కాకుండా, స్థాయికి తగ్గ పాత్రలొస్తే చేస్తా’’నంటూ ఉత్సాహం చూపుతున్న కృష్ణకు ఇప్పుడు ఒకటే కోరిక... ‘‘నేను, మా అబ్బాయి మహేశ్, మనుమడు గౌతమ్ కలసి ఒక సినిమాలో చేయాలి’’. ఒకే కుటుంబంలోని మూడు తరాలూ కలసి నటించే కోరిక నెరవేరితే, అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది! -
గౌతమ్‌తో కలిసి నటించాలనుంది!
సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఈ రోజే సూపర్‌స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనె మనసులు’ విడుదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన చేసిన సినిమాలు... ప్రయోగాలు... సాహసాలు తెలుగు తెరను సుసంపన్నం చేశాయి. తన స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ కృష్ణ పత్రికల వారితో ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు. ఈ 50 ఏళ్లల్లో విజయాలూ చూశాను, అపజయాలూ చూశాను. విజయాలకు పొంగిపోలేదు... అపజయాలకు కుంగిపోలేదు. రెంటినీ సమానంగా తీసుకున్నా. పనిలోనే ఆస్వాదన పొందా. ఖాళీగా ఉండటం నాకస్సలు ఇష్టం ఉండేది కాదు. తొలి పదేళ్లల్లో రోజుకు మూడు షిఫ్టులు పని చేశా. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేశా. ఇలా చేసినా మళ్లీ ఉదయం 7 గంటలకు ఠంచనుగా షూటింగ్‌కి వెళ్లిపోయేవాణ్ణి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారునిగా, ప్రదర్శకునిగా, ఎడిటర్‌గా... ఇలా సినిమా పరిశ్రమతో నాది విడదీయలేని బంధం. అన్ని రకాల పాత్రలూ చేశాను. కానీ ‘ఛత్రపతి శివాజి’ సినిమా చేయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. అప్పటికీ ‘డాక్టర్-సినీ యాక్టర్’, ‘నంబర్‌వన్’ సినిమాల్లో శివాజీ గెటప్‌లో కొద్దిసేపు కనిపించి ముచ్చట తీర్చుకున్నా. మహేశ్ నా పేరు నిలబెట్టాడు. తనకు నేను సలహాలు ఇవ్వడం అంటూ ఉండదు. నిర్ణయాలన్నీ అతనే తీసుకుంటాడు. మహేశ్‌ని జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చూడాలని నా కోరిక.‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో పద్మాలయా బేనర్లో త్వరలో రీమేక్ చేయబోతున్నాం. మారుతి డెరైక్ట్ చేస్తాడు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని ఆ మధ్య కొన్ని సినిమాలు చేశాను. నేను అలాంటి సినిమాలు చేయడం అభిమానులకు ఇష్టం లేదు. అందుకే ఇకపై మంచి పాత్ర అయితేనే, అదీ పెద్ద సినిమా అయితేనే నటిస్తా. కథ కుదిరితే నా మనవడు గౌతమ్‌తో కలిసి నటించాలనుంది. -
నిరుద్యోగుల ప్రేమ కథ
చదువుకుని పని పాటా లేక ఊరు చుట్టూ తిరిగే కుర్రాళ్లు ఇంటికొక్కరైనా ఉంటారు. అలాంటివాళ్ల ప్రేమ పాట్లే అడంగాద పసంగ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత సెల్వనాథన్. ఈయన కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవ నటులు గౌతమ్, పావేందర్, సురేష్‌బాబు, సంతోష్, కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. సత్యశ్రీ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అదిప్ విలన్‌గాను, వర్ష సింధు, నగీనా, లక్ష్మి, కనక ప్రియ, పైల్వాన్ రంగనాథన్, సెల్వనాథన్, మాస్టర్ అరుణ్, మాస్టర్ ఆల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ తరం యువత జీవన విధానాన్ని ఆవిష్కరించే ఇతివృత్తంగా అడంగాద ససంగ చిత్రం ఉంటుందన్నారు. ప్రేమ కారణంగా కలిగే అవమానాలు, సమస్యలను కాస్త వినోదాన్ని జోడించి చూపించామన్నారు. అంతేకాకుండా ప్రేమ మాత్రమే కాకుండా యువకుల్లో మంచి మానవత్వం, ఇతరులకు సాయపడే మనస్థ్వత్వం కూడా ఉంటాయని చెప్పే చిత్రంగా ఈ అడంగాద పసంగ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు, ద్వంద్వార్థ సంభాషణలు, పొగపీల్చడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాలుండవని దర్శక, నిర్మాత వెల్లడించారు. తిరుపత్తూర్, తిరువణ్ణామలై, జోలార్‌పేట, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆల్రిన్ - మనీష్ ద్వయం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని సెన్సార్ బోర్డు సభ్యుడు, నటుడు ఎస్ వి శేఖర్‌కు అందించారు. -
గౌతమ్ స్కూలుకు వెళ్లిన మహేష్!!
మహేష్ బాబు అంటేనే మహా బిజీగా ఉండే హీరో. అసలు కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం సరిపోదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగులో తలమునకలుగా ఉన్నాడు. కానీ, అంత బిజీ షెడ్యూల్లో కూడా గత వారం తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాడు. తన కొడుకు గౌతమ్ చదువుతున్న స్కూల్లో ఓ కార్యక్రమం జరిగితే.. దానికి అందరు తల్లిదండ్రుల్లాగే తానూ వెళ్లాడు. ఉన్నట్టుండి మహేష్ బాబు తమ స్కూలుకు రావడంతో అక్కడున్న పిల్లలతో పాటు టీచర్లు, ఇతర సిబ్బంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారని సమాచారం. అదే సమయంలో, గౌతమ్ కూడా ఎప్పుడూ బయటకు రాని తన తండ్రి ఏకంగా స్కూలుకే రావడంతో చాలా సంతోషించాడట. కొరటాల శివ దర్శకత్వంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా వస్తున్న సినిమా షూటింగు కొంతవరకు పూర్తయిన తర్వాత నూతన సంవత్సర వేడుకలు చేసుకోడానికి కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్తాడని సమాచారం. -
జస్ట్ రొమాన్స్..!
చూస్తుంటే ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది. భిన్న ధుృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రంలా... హౌస్‌లో ఉన్న ఆడ- మగ ఒకరికొకరు ఠక్కున కనెక్ట్ అయిపోతున్నారు. చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. ప్రస్తుత సీజన్లో హౌస్‌లో ఉన్న గౌతమ్, దియాంద్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతున్నట్టుంది... సాన్నిహిత్యం రోజురోజుకూ పెరిగిపోతుందట. వారి ప్రేమ కామన్ హాల్... బెడ్రూమ్లు దాటి బాత్రూమ్ల వరకు పాకిందన్నది గుసగుస. వీరే కాదు... ఇలా బిగ్‌బాస్ షోతో చాలామందే ఒంటరిగా వచ్చి జంటలుగా తేలుతున్నారు. -
తల్లి సంరక్షణకు గౌతమ్
కోడెల కోడలు పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనవడు గౌతమ్‌ను అతడి తల్లి పద్మప్రియ సంరక్షణలోనే ఉంచుతూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలిసుండేందుకు పద్మప్రియ, ఆమె భర్త శివరామకృష్ణ అంగీకరించిన నేపథ్యంలో విశాఖపలో తగిన ఇల్లు చూసుకుని ఉండాలని, అధిక బరువు (ఓబేసిటీ)తో బాధపడుతున్న గౌతమ్‌కు విశాఖలోనే చిన్నపిల్లల డాక్టర్ వద్ద చికిత్స అందించాలని పేర్కొంది. గౌతమ్‌ను చూసేందుకు (పద్మప్రియ తండ్రి)ని అనుమతించాలని దంపతులకు స్పష్టం చేసింది.అతని తండ్రి శివరామకృష్ణను అత్తమామలు కాని, భార్య కాని నిరోధించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలుకు అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ‘నా కొడుకును భర్త కిడ్నాప్ చేశారు.అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించండి’ అంటూ పద్మప్రియ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. కోడెల ఇంట్లో ఉన్న గౌతమ్‌ను కోర్టు ఆదేశంతో శుక్రవారం ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ గౌతమ్‌ను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. -
నచ్చిన రంగంలోనే సక్సెస్: మహేష్‌బాబు
సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: ఎవరైనా తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకుంటే కెరీర్ పరంగా రాణించగలరని సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిప్రాయపడ్డారు. ఐడియా సెల్యూలర్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో నిర్వహించిన ‘స్టూడెంట్స్ అవార్డ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన విభిన్న అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి సినిమాలపై ఇష్టంతోనే పెరిగానని చెప్పారు. అదే విధంగా తన కుమారుడు గౌతమ్‌ని కూడా అతనికి ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇటీవల ఓ మీడియా నిర్వహించిన సర్వేలో ఆదరణ, వ్యాపార ఒప్పందాల పరంగా మహేష్‌బాబు అగ్రగామిగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించగా.. సినిమాల పరంగా హార్డ్‌వర్క్ చేయడమే తన పని అని, దానికి ప్రతిఫలంగా లభిస్తున్న అభిమానుల ఆదరణకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. ఇటీవల తన సినిమా పోస్టర్‌కు సంబంధించి తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు. తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, అవి పూర్తి కాగానే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. తాజాగా నటిస్తున్న 3 చిత్రాల విశేషాలనూ వివరించారు. -
‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’
ఎదులాపురం, న్యూస్‌లైన్ : దళితుల్ని అవమానపర్చిన రాందేవ్ బాబాను వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి మునీశ్వర్ గంగన్న, ఉపాధ్యక్షుడు గౌతం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన ఓ దొంగ బాబా అని పేర్కొన్నారు. బాబాను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు, ఆయన వ్యాపారాలు మూసి వేసే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. -
కాంగ్రెస్‌పై సీనియర్ల ఫైర్
గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వడంపై నిరసనలు కాంగ్రెస్‌కు మూకుమ్మడి రాజీనామాలు చేసిన ఎస్సీ నేతలు అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా... పార్టీనే నమ్ముకున్నాం. కష్టాకాలంలో తోడుగా ఉన్నాం. అలాంటి మమ్మల్ని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కనీసం పరిగణనలోకి తీసుకోలేదని అమలాపురంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎస్సీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం కాంగ్రెస్ టికెట్‌ను స్థానికేతరుడైన జంగా గౌతమ్‌కు ఇవ్వడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి నిరసనగా వారంతా సోమవారం కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఫ్యాక్సు ద్వారా పంపించారు. స్థానిక శ్రీదేవి రెసిడెన్సీలో సమావేశమైన కాంగ్రెస్ ఎస్సీ నాయకులు గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల సమయంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయంలో తానేమి చేయలేనని ఆయన చేతులెత్తేశారు. ఎమ్మెల్యే కన్నబాబుతో కూడా మాట్లాడారు. కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కన్నబాబు సూచించినా ఎస్సీ నాయకులు వినకుండా రాజీనామాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ గెడ్డం సురేష్‌బాబు, ఉప్పలగుప్తం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసుకపట్ల రఘుబాబు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ఈతకోట బాలాస్వామి, జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు ములపర్తి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ యార్లగడ్డ రవీంద్ర, ఐఎన్టీయూసీ జిల్లా మహిళా కన్వీనర్ కుంచే స్వర్ణలత, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పెయ్యల సంధ్య తదితరులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా స్థానిక పార్టీ నాయకులుగా అమలాపురం కాంగ్రెస్ టికెట్టు ఆశించినవారే. వీరితో పాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ ఎస్సీ నాయకులు కూడా రాజీనామాలు చేశారు. చిరంజీవి పట్టుపడితే టిక్కెట్ ఇచ్చేస్తారా కేంద్రమంత్రి చిరంజీవికి సన్నిహితుడైన జంగా గౌతమ్‌కు అమలాపురం నియోజకవర్గంతో ఏమాత్రం పరిచయం, సంబంధం లేదని ఆయనకు టిక్కెట్ ఇవ్వటం దారుణమని నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్పీ నేతలు అన్నారు. రెండు దశాబ్ధాలకు పైగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తమను ఇప్పుడు కరివేపాకులా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చే ముందు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత బాధిస్తోందని అన్నారు. చిరంజీవికి గౌతమ్‌పై అంత ప్రేమ ఉంటే వేరే నియోజకవర్గంలో టిక్కెట్ ఇవ్వాలే తప్ప పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను విస్మరించడం సరికాదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కార్యాచరణను రూపొందించి గౌతమ్‌ను ఓడించి పార్టీ పెద్దలకు బుద్ధి చెబుతామని ఇసుకపట్ల రఘుబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే గౌతమ్‌కు ఇచ్చిన టెక్కెట్‌ను ఉపసంహరించుకుని స్థానికులైన పార్టీ ఎస్సీ నాయకుల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
నాన్న జీవితం...ఓ వ్యక్తిత్వ వికాస పాఠం!
బ్రహ్మానందం మంచి లెక్చరర్... గొప్ప కమెడియన్... అంతకు మించి గ్రేట్ ఫాదర్! అవును... పిల్లల్ని ఎలా పెంచాలో బ్రహ్మానందం దగ్గర క్లాసులు తీసుకోవచ్చు. ఆయన తన కొడుకుల్ని క్లాసులు పీకకుండానే ఏ క్లాస్‌గా పెంచారు. ‘వీళ్లే నా ప్రాపర్టీ’ అని చెప్పుకుంటారు మురిపెంగా. ఆయన కొడుకులూ అంతే. నాన్నే తమకు ఇన్స్పిరేషన్ అని చెబుతారు గర్వంగా. ‘బసంతి’ సినిమాతో సక్సెస్ కొట్టి నాన్నకు మంచి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు పెద్ద కొడుకు గౌతమ్. వీళ్లిద్దరూ మాట్లాడుతుంటే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. మీరే చదవండి! నటుడు బ్రహ్మానందం గురించి ప్రపంచమందరికీ తెలుసు. తండ్రిగా బ్రహ్మానందం గురించి తెలుసుకోవాలని ఉంది... బ్రహ్మానందం: నాకు ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి గౌతమ్. వయసు 26. ‘బసంతి’ సినిమాలో హీరోగా చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉంది. చిన్నోడు సిద్దార్థ. వయసు 24. వీడు కూడా ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడే ఉద్దేశంలో ఉన్నాడు. (నవ్వుతూ) సార్... మేమడిగింది వాళ్ల బయోడేటా కాదు. వాళ్లతో మీకున్న అనుబంధం గురించి! బ్రహ్మానందం: అవునా! గౌతమ్ ఉన్నాడుగా వాడినడగండి... గౌతమ్: ఏ విషయంలోనైనా నాన్నే నాకు ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలంటే... నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు నాన్నదే ఉంటుంది. మేం ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. (నవ్వుతూ) నో దాపరికమ్స్! లెక్చరర్‌గా చేశారు కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనే థాట్స్ ఎక్కువుంటాయి అని అనుకోవచ్చా? బ్రహ్మానందం: లేదండీ, నేనందుకు పూర్తి విరుద్ధం! ఇన్నేళ్లలో పిల్లల్ని కొట్టింది ఎప్పుడూ లేదు. చాలామందికి ఈ మాట నమ్మకం కలగకపోవచ్చు. (నవ్వుతూ) అయినా ఇలా చెప్పడం వల్ల నాకేమీ ‘గొప్ప తండ్రి’ అనే సర్టిఫికెట్, మెడల్స్ ఇవ్వరుగా! గౌతమ్: నిజమే... నాన్న ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు! బ్రహ్మానందం: ఒక్క చదువు విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఎందుకంటే చదువు ఉపయోగం ఏంటో నాకు బాగా తెలుసు. క్లాసులు పీకడాల్లాంటివి ఉండేవా? బ్రహ్మానందం: ఎప్పుడూ లేదు. అయినా నేను ఇంటికి రాగానే వాళ్లు గజగజా వణికిపోవాలనే ఫీలింగ్స్ నాకస్సలు లేవు. అందరం సరదాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జోక్స్ వేసుకుంటూ భోంచేస్తాం. నా గతం గురించి, నేను పడ్డ కష్టాల గురించి, షూటింగ్లలో జరిగే సంఘటనల గురించి అప్పుడప్పుడూ చెబుతుంటాను. గౌతమ్: నాన్న ఫ్లాష్‌బ్యాక్ విన్నప్పుడల్లా కదిలిపోతుంటాను. ‘ఎన్ని కష్టాలు పడి పైకొచ్చారు నాన్న’ అని! చెప్పులు కొనమంటేనే తాతయ్య తెగ కొట్టేసేవారట. నాన్న అంచెలంచెలుగా ఎదిగిన తీరు నాకో వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది! ఆయన షూటింగ్స్‌లో బిజీ కదా.. మిస్సయిన ఫీలింగ్ ఎప్పుడైనా ఉండేదా? గౌతమ్: నేను చెన్నైలో ఫిఫ్త్ క్లాస్ వరకూ చదువుకున్నాను. నాన్న ఎక్కువగా హైదరాబాద్‌లో షూటింగ్స్‌లో ఉండేవారు. అప్పుడు మాత్రం మిస్సయిన ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటినుంచీ బెంగ లేదు. ఎందుకంటే ఆయన షూటింగ్ అవగానే మాతోనే టైమ్ స్పెండ్ చేసేవారు. బ్రహ్మానందంగారి అబ్బాయిగా కాలేజ్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మీపై ఓ స్పెషల్ అటెన్షన్ ఉండేదా? గౌతమ్: నేనెప్పుడూ అలాంటి అటెన్షన్ కోరుకోలేదు. అందరితో కలిసిపోయి ఉండటమే నాకిష్టం. అందరితో పాటే అల్లరి చేసేవాణ్ణి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకూ, షికార్లకూ వెళ్లేవాణ్ణి. నాన్న కామెడీని వాళ్లతో పాటే నేనూ ఆస్వాదించేవాణ్ణి. ఇంతకూ మీ నాన్నగారి జీవితం నుంచి మీరేం తెలుసుకున్నారు? గౌతమ్: నాన్న ఎప్పుడూ చెబుతుంటారు... ‘‘గమ్యంతో పాటు గమనాన్ని కూడా ఆస్వాదించాలని! తరచు ఇంకోమాట కూడా చెబుతుంటారు... గోల్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు... పనిచేస్తూ ఉంటే ఆటోమేటిగ్గా లక్ష్యాన్ని చేరుకుంటావు’’ అని! అది నేను పూర్తిగా ఫాలో అవుతాను. నాన్నగారి నుంచి ప్రధానంగా నేర్చుకున్న అంశం? గౌతమ్: సమయపాలన! ఎవరికైనా ఆరుగంటలకు వస్తానని చెబితే అయిదు నిమిషాలు ముందే ఉంటారు. బ్రహ్మానందం: ఇదంతా నా గొప్పతనమని అంటే మాత్రం ఒప్పుకోను. పరిస్థితులే నన్నిలా తీర్చిదిద్దాయి. ఓ పేదవిద్యార్థి స్థాయి నుంచి లెక్చరర్‌గా ఎదిగాను. ఏమాత్రం ఆలస్యంగా కాలేజీకి వెళ్లినా ఉద్యోగం తీసేస్తారనే భయం. ఆ భయం నుంచే బాధ్యత పుట్టింది. మీరంటే చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చారు. మీ పిల్లల్ని కూడా అలానే ఉండమనడం కరెక్టేనా? బ్రహ్మానందం: నేనేదీ బలవంతంగా రుద్దను. ఇలా ఉండాలి... అలా ఉండాలని రూల్స్ పెట్టను. స్వేచ్ఛ ఇస్తూనే జీవితం గురించి అవగాహన పెంచాను. నాకు నా మీదే ఎక్స్పెక్టేషన్లు లేవు, వాళ్లమీదేం ఉంటాయి? వీళ్లు సినిమా ఫీల్డ్కి రాకపోయినా, పెద్ద చదువు చదవలేకపోయినా ఎక్కడైనా, ఎలాగైనా బతికేయగలరు... ఎందుకంటే వాళ్ల దగ్గర అంత సంపద ఉంది! ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు. వ్యక్తిత్వం, మంచితనం! డబ్బు విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్ అటగా? బ్రహ్మానందం: డబ్బు లేని స్థితి ఏమిటో బాగా తెలిసినవాణ్ణి నేను. అందుకే డబ్బుని గౌరవిస్తాను. వందమందిని కూర్చోబెట్టి లిక్కర్ పార్టీ ఇచ్చేకన్నా, ఆపదలో ఉన్నవాణ్ణి ఆ డబ్బుతో ఆదుకోవడం ఉత్తమమనేది నమ్ముతాను. 26 మందికి పెళ్లిళ్లు చేశాను, బోలెడంత మందిని చదివించానని చెప్పుకోవడం నాకే ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలకు డబ్బు విలువ కచ్చితంగా తెలిసేట్టు చేయాలి. ఇది మీ డబ్బు. అవసరాలు... అత్యవసరాలు... ఆడంబరాలు ఏవో తేల్చుకుని ఏదైనా కొనుక్కోమంటాను. చైనీస్‌లో ఓ సామెత ఉంది... ఆకలితో ఉన్నవాడికి ఒక చేపనిస్తే, వాడికి ఓరోజు ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టడమే నేర్పిస్తే... జీవితకాలం అతని ఆకలి తీరుతుంది కదా! అని. సరే... మీ చిన్నబ్బాయ్ గురించి చెప్పండి! బ్రహ్మానందం: గౌతమ్ కామ్‌గా ఉంటాడు కానీ, సిద్ధుకి మాత్రం ఫుల్ కామెడీ టింజ్ ఉంది! నేనెప్పుడైనా కొంచెం కోపం మీద ఉన్నానంటే వాళ్లమ్మ దగ్గరకెళ్లి, ‘‘మీ ఆయన బీపీలో ఉన్నట్టున్నాడు; జాగ్రత్తగా చూసుకో; మేం బయటికెళ్తాం’’ అనేసి చల్లగా జారుకుంటాడు. ఏమైనా దేవుడు నాకు చాలా మంచి పిల్లలనిచ్చాడు. గౌతమ్: నాకున్న బెస్ట్ క్రిటిక్స్లో సిద్ధ్దూ ఒకడు. ఏదైనా మొహం మీదే చెప్పేస్తాడు. నాకేదైనా సజెషన్ కావాలన్నా, ఫస్ట్ వాణ్ణే అడుగుతాను. బ్రహ్మానందం: పిల్లలే నాకు పెద్ద ఎస్సెట్ అండీ! ఎంత సంపద, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, పిల్లలు సరిగ్గా లేకపోతే ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? సిద్దూ కూడా హీరోగా వస్తున్నాడట? బ్రహ్మానందం: ఏమో! లాస్ట్ ఇయర్ ఏమో ఎమ్‌టెక్ చేస్తానన్నాడు... ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ డెరైక్ట్ చేస్తానన్నాడు... ఇప్పుడేమో యాక్టింగ్ అంటున్నాడు. మీ అబ్బాయిల పేర్లు గౌతమ్, సిద్దార్థ అని పెట్టారు..? బ్రహ్మానందం: నాకు మొదటినుంచి బుద్ధిజం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే గౌతమ బుద్ధుని ఫిలాసఫీని బాగా చదివాను. ఆ ఇష్టంతోనే పేర్లు పెట్టాను. సరే గౌతమ్ లవ్‌స్టోరీ దగ్గరకు వద్దాం. ఈ విషయం చెప్పినపుడు మీరెలా రియాక్టయ్యారు? బ్రహ్మానందం: వాడు భయపడుతూ, ఇబ్బందిపడుతూ నా దగ్గరకొచ్చి ‘‘నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్నా’’ అని చెప్పాడు. ‘‘ఎవరా అమ్మాయి? తను ఎప్పటినుంచీ తెలుసు?’’ అంటూ రెండు మూడు ప్రశ్నలడిగాను. అన్నిటికీ భయంగానే సమాధానం చెప్పాడు. వాడి సమాధానాల్లో నాకు నిజాయితీ కనిపించింది. అందుకే వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. గౌతమ్: నాన్న అంత త్వరగా ఓకే చెప్తారని అస్సలు ఊహించలేదు. వెంటనే ఏడ్చేశాను. ఆ రోజు సాయంత్రమే వాళ్లని పిలిచి ముహూర్తాలు పెట్టించేశారు. బ్రహ్మానందం: పిల్లల సంతోషమే కదండీ మనకు ముఖ్యం. వాళ్లు ఏడుస్తూ ఉంటే మనం తట్టుకోగలమా? వాడికి ఆ అమ్మాయి నచ్చింది. తనతో జీవితం బావుంటుందని నమ్మాడు. నేను వాడి ప్రేమను నమ్మాను. వాడు టీనేజ్ కుర్రాడయితే, రాంగ్ డెసిషన్ అని భయపడేవాణ్ణి. వాడికి మెచ్యూర్టీ వచ్చింది. జీవితం మీద క్లారిటీ ఉంది. ఇంకెందుకు భయపడటం! మీది కూడా ప్రేమ వివాహమే కదా! బ్రహ్మానందం: పెద్దలు కుదిర్చిన, ఇష్టంతో కూడిన వివాహం మాది. మా గురువుగారికి లక్ష్మి దగ్గరి బంధువు. బ్రహ్మానందం మంచి కుర్రాడని వాళ్లే సంబంధం కుదిర్చారు. అయితే మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. గౌతమ్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని ముందే అనుకున్నారా? బ్రహ్మానందం: మనమెవరమండీ అనుకోవడానికి! ఓసారి తన ఫ్రెండ్ శర్వానంద్‌తో కలిసి వైజాగ్ వెళ్తానంటే పంపించాను. తీరా వీళ్లు వెళ్లింది సత్యానంద్‌గారి దగ్గరకు. ఆయన నాకు ఫోన్ చేసి మీ వాడిలో మంచి ఆర్టిస్టు ఉన్నాడని చెబితే, ఏ గురువైనా తన శిష్యుడి గురించి అలాగే చెబుతాడులే అనుకున్నా. తర్వాత తర్వాత వాడిలో సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నా. అయినా కెమెరా ముందుకు వెళ్లేంత వరకే నా పరపతి ఉపయోగపడుతుంది. ఒకసారి కెమెరా ముందుకు వెళ్లాక ఎవరి సత్తా వాళ్లు చూపించాల్సిందే. అక్కడ ట్యాగ్ లైన్లు పనిచేయవు. ‘బసంతి’ పై బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు? బ్రహ్మానందం: వీడు యాక్ట్ చేశాడని కాదు. కథలో ఉన్న దమ్ము అలాంటిది. డెరైక్టర్ చైతన్య బాగా డీల్ చేశాడు. మునుపు అతను తీసిన ‘బాణం’కు కూడా మంచి ప్రశంస వచ్చింది. గౌతమ్: కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పటికీ ఆ ఎగ్జైట్మెంట్ పోలేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఎదురు చూస్తున్నాను. గతంలో చేయనిది, ‘బసంతి’కి మాత్రం మీ పరపతి అంతా ఉపయోగించినట్టున్నారు..? బ్రహ్మానందం: మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను నేను. ఇంతకుముందు ఒకతను తన ఊరివాళ్లనే ఆర్టిస్టులుగా పెట్టి ఆ ఊరి గురించి సినిమా తీస్తే, అతన్ని ఎంకరేజ్ చేశాను. ‘బసంతి’ విషయానికొస్తే - ఈ సినిమా నుంచి సమాజం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ దర్శకునిపై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నేను అడగ్గానే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్, శ్రీను వైట్ల, సురేందర్‌రెడ్డి, జానీలీవర్ లాంటివాళ్లు సినిమా గురించి నాలుగు మాటలు చెప్పారు. నేను కూడా సాధారణంగా ప్రివ్యూలు చూడను. కానీ ఇది చూశాను. అసలు సినిమా చూస్తున్న ఫీలింగే కలగలేదు. అంత బాగా డెరైక్ట్ చేశాడు చైతన్య. గౌతమ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. (నవ్వుతూ) నా జీన్స్ కొంతైనా ఉంటాయి కదండీ! - పులగం చిన్నారాయణ ‘నర్తనశాల’లో ఓ చిన్న ఎక్స్ప్రెషన్తో వందపేజీల మేటర్ చెప్పిన మహానటుడు ఎస్వీరంగారావుగారు. ఆయన సినిమాలు చూడు...నటన అంటే ఏంటో తెలుస్తుంది’’ అంటూ ఉంటారు నాన్న ఎప్పుడూ! జంధ్యాలగారి దర్శకత్వంలో నాన్న నటించిన సినిమాలన్నీ ఇష్టమే. ముఖ్యంగా ‘అహ నా పెళ్లంట’! ఎప్పుడు చూసినా నవ్వు వస్తూనే ఉంటుంది. ‘మనీ’లో ఖాన్‌దాదా పాత్ర కూడా నా ఫేవరెట్! -
గౌతమ్ సక్సెస్‌ని చరణ్ సక్సెస్‌గా భావిస్తాను - చిరంజీవి
‘‘బ్రహ్మానందం నా కుటుంబంలో ఒకరు. ఆయన నాకు సోదరుడితో సమానం. వాళ్లబ్బాయి గౌతమ్ నాకు కొడుకులాంటివాడు. గౌతమ్ సక్సెస్‌ని రామ్‌చరణ్ సక్సెస్లాగానే భావిస్తాను. ‘బసంతి’ పెద్ద హిట్టు అయ్యి గౌతమ్‌కి మంచి బ్రేక్‌నివ్వాలి’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. గౌతమ్ హీరోగా ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బసంతి’. ఈ సినిమా యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిసింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘గౌతమ్ నాకు బాగా క్లోజ్. ఇద్దరం రోజూ జిమ్‌లో కలుస్తుంటాం. తనలో ఆర్టిస్టుగా మంచి పొటెన్షియాల్టీ ఉందని నమ్ముతున్నాను. ‘బసంతి’తో కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు. దర్శకుడు చైతన్య కూడా సమర్థుడు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, పాటల రచయిత కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించిన పవన్
-
‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కల్యాణ్
-
చైతన్య, గౌతమ్‌లకు బసంతితో మంచి బ్రేక్ రావాలి - పవన్‌కల్యాణ్
‘‘మొన్ననే ‘బాణం’ డీవీడీ చూశా. తెగ నచ్చేసింది. చైతన్య బాగా తీశాడు. తన రెండో సినిమా ‘బసంతి’ కూడా మంచి విజయం సాధించి, దర్శకుడు చైతన్యకు, హీరో గౌతమ్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బాణం’ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘బసంతి’. అలీషాబేగ్ కథానాయిక. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి టి.సుబ్బిరామిరెడ్డి, గౌతమ్‌లకు అందించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ-‘‘ఈ కథ చాలా రోజుల క్రితం విన్నాను. చాలా నచ్చింది. రిలీజ్‌కి ముందే పాటలు కూడా విన్నాను. అన్నీ హృదయాన్ని తాకాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలి. దర్శకునిగా చైతన్యకు ఈ సినిమా బ్రేక్ అవ్వాలి’’ అని అభిలషించారు. ‘‘మణిశర్మగారి పాటలు వింటూ పెరిగాను. హీరో అయ్యాక... ఆయనతో పనిచేసే ఛాన్స్ కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఈ సినిమాకు మణిగారిచ్చిన అయిదు పాటలూ నాకు ఫేవరెట్సే. సిన్సియారిటీ, డెడికేషన్, హార్డ్ వర్క్, సినిమా పట్ల పేషన్... ఇవన్నీ ఉన్న దర్శకుడు చైతన్య. ఈ సినిమా ద్వారా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేనిక్కడ నిలబడటానికి కారణం మా నాన్న. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాను. కారణం పవన్‌కల్యాణ్‌గారు ఈ వేడుకకు రావడమే. మా లాంటి యువహీరోలందరికీ స్ఫూర్తి ఆయన’’ అని గౌతమ్ చెప్పారు. ఇంకా బ్రహ్మానందం, జానిలీవర్, శేఖర్ కమ్ముల, మంచు విష్ణు, దేవకట్టా, భీమినేని, సునిల్, కేఎల్ దామోదరప్రసాద్, వివేక్ కూచిభోట్ల, వీరుపోట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విజయం సాధించాలని వీడియో ద్వారా చిరంజీవి ఆకాంక్షించారు. -
బసంతి కళాశాలలో ఏం జరిగింది?
‘షోలే’ సినిమాలో హీరోయిన్ హేమమాలిని పాత్ర పేరు ‘బసంతి’. ఆ సినిమా గుర్తున్నంత కాలం... ఈ బసంతి కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడీ ‘బసంతి’ టైటిల్‌తో దర్శకుడు చైతన్య దంతులూరి ఓ సినిమా చేస్తున్నారు. అయితే బసంతి అనేది ఇందులో హీరోయిన్ పేరు కాదట. ఓ కళాశాల పేరట. ఈ కాలేజీ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను మిళితం చేసి ఈ కథను అల్లుకున్నారట. ఆ కళాశాలలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమట. పసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో విద్యార్థిగా హీరోచిత పాత్ర చేస్తున్నారు. అలీషా బేగ్ నాయిక. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈ నెల 25న పాటలను విడుదల చేయబోతున్నారు. సహనిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. కృష్ణ చైతన్య, శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. -
గౌతమ్+నీలిమ=?!
నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, నువ్వులేక నేను లేను చిత్రాల్లో నటించిన బాలనటుడు అమిత్ కథానాయకునిగా మారారు. ఆయన హీరోగా ‘గౌతమ్+నీలిమ=?!’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. గుజ్జల విష్ణువర్దన్ దర్శకుడు. నిస్సార్ బాషా, బి.పి.రాజు నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వడ్డేపల్లి నరసింగరావు కెమెరా స్విచాన్ చేయగా, అస్మితాసూద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలుపెట్టి, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి చేస్తామని ఏప్రిల్‌లో ఈ ముక్కోణపు ప్రేమకథను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. 12 ఏళ్ల క్రితం బాలనటుణ్ణి అయిన తాను, హీరోగా అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అమిత్ అన్నారు. ఇంకా కథానాయక నూర్జహాన్, రచయిత సుధీర్ పొలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత షాహీ మొహిద్దీన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ కవల. -
గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు నేను లొకేషన్‌కి అందుకే వెళ్లలేదు
‘‘నా చిన్నతనంలోనే నేను పార్టీలకు దూరంగా ఉండేవాణ్ణి. ఇప్పుడూ అంతే. అంతే కానీ ‘పేజ్ త్రీ’లో కనిపించాలని, పార్టీలకు ఎటెండ్ అవ్వాలని నేనూ కోరుకోను, నమ్రతా కోరుకోదు’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌బాబు పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన ’1’ ‘నేనొక్కడినే’ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రను ఆయన తనయుడు గౌతమ్ చేశాడు. అయితే, గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు మహేష్ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదట. ఈ విషయం గురించి, ఇతర విశేషాల గురించి సదరు ఇంటర్వ్యూలో మహేష్‌బాబు మాట్లాడుతూ -‘‘నాకు చిన్నప్పట్నుంచీ ఫ్యామిలీతో ఎటాచ్మెంట్ ఎక్కువ. మా అన్నయ్య రమేష్‌బాబు నాకు బాగా క్లోజ్. మా నాన్నగారు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు అన్నయ్య నా విషయంలో బాగా కేర్ తీసుకునేవాడు. ఇక, నాన్నగారు నాకు చాలా ప్రత్యేకం. నేను చేసే ప్రతి సినిమా గురించి ఫోన్ చేసి మరీ అడుగుతుంటారు. నేనో హిట్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతిసారీ నాన్నగారి వయసు 10, 15ఏళ్లు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆయన మొహంలో ఓ మెరుపు కనిపిస్తుంది’’ అని చెప్పారు. గౌతమ్ యాక్ట్ చేయడం గురించి చెబుతూ -‘‘ ‘1’ షూటింగ్ మొదలైన మూడు నెలలకు గౌతమ్‌తో యాక్ట్ చేయిద్దామని సుకుమార్ అన్నారు. ఆ తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి సుకుమార్ రెండుమూడు రోజులు మా ఇంటికొచ్చి గౌతమ్‌తో ఆడుకున్నారు. అలా వాళ్లకి అలవాటై, షూటింగ్లో పాల్గొనడానికి గౌతమ్ ప్రిపేర్ అయ్యాడు. అలాగే, ఎంతోమంది నటీనటులకు గురువైన అరుణ బిక్షు మా గౌతమ్‌కి గురువు. ఆమె లొకేషన్లో ఉండి, మా వాడు బాగా యాక్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు లొకేషన్లో నేనుంటే వాడి కాన్సన్ట్రేషన్ నా పైనే ఉంటుందనిపించింది. అందుకే నేను వెళ్లలేదు. వాడికి స్కూల్ సెలవులప్పుడే ఈ షూటింగ్ చేశారు. ఒకవేళ మున్ముందు కూడా తను యాక్ట్ చేయాలనుకుంటే హాలిడేస్‌లో అయితే మాకు ఓకే. ఎందుకంటే, చదువు ముఖ్యం కదా. కానీ, మేం మాత్రం యాక్ట్ చేయాలని తనను ఒత్తిడి చేయం’’ అని మహేష్‌బాబు చెప్పారు. ‘1’ చిత్రం గురించి మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. సుకుమార్ ఈ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. అలాగే కష్టమైన సినిమా అని కూడా తెలుసు. సినిమా ఆలస్యం అవుతోందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఎక్కువ టైమ్ పడుతుందని ఊహించాం. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఇందులో నేను రాక్‌స్టార్‌గా చేశాను. యాక్షన్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. దెబ్బలు తగలకుండా యాక్షన్ సీక్వెన్స్ చేయాలనుకున్నాను. అందుకే ఫిట్నెస్ ట్రైనర్‌ని నియమించుకున్నాను. అథ్లెటిక్ లుక్‌లో కనిపించడం కోసమే ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని దాదాపు ఏడాదిన్నర కష్టపడి చేశాం. కొత్తరకం కాన్సెప్ట్ కాబట్టే ఇంత టైమ్ తీసుకుంది. ఇదో సవాల్‌లాంటి సినిమా. యూనిట్ మొత్తం చాలా హార్డ్‌వర్క్ చేశాం’’ అని తెలిపారు. -
ఎవరీ బసంతి?
కళాశాల నేపథ్యం, ఉగ్రవాదం ఈ రెండింటి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బసంతి’. ‘బాణం’ ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నారు. అలీషాబేగ్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చైతన్య మాట్లాడుతూ -‘‘బసంతి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. వినోదం, విలువలు రెండూ ఉన్న సినిమా ఇది. సాంకేతికంగా అందర్నీ ఆకట్టుకుంటుందీ సినిమా. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తాను విద్యార్థిగా నటిస్తున్నానని గౌతమ్ చెప్పారు. తనికెళ్ల భరణి, రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, సయాజీ షిండే, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: అనిల్ బండారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఉగ్రవాద బసంతి...
కళాశాల నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను జత చేసి ఎవ్వరూ సినిమా చేయలేదు. ‘బసంతి’ చిత్రం ఆ తరహాలోనే రూపొందుతోంది. ‘బాణం’ చిత్రంలో నక్సలిజం సమస్యని తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా తెరకెక్కించిన చైతన్య దంతులూరి ‘బసంతి’ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడు. అలీషా బేగ్ నాయిక. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘కథా కథనాలు, సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం నవ్యరీతిలో ఉంటాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌నిస్తుందని గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
బసంతి కళాశాలలో...
కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు వస్తుంది. అలాగే... కళాశాల.. విద్యార్థి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ ప్రత్యేకం. ఆ రోజులనాటి మాధుర్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బసంతి’. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ‘బాణం’ఫేం దంతలూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దంతలూరి చైతన్య మాట్లాడుతూ -‘బాణం’ కథ కంటే ముందే సిద్ధం చేసుకున్న కథ ఇది. బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివే విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. సాంకేతికంగా కూడా సినిమా బాగుంటుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, తనికెళ్ళ భరణి, సమాజీ షిండే, ఆనంద్, ధన్‌రాజ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ నాయుడు విస్సా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.