మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్‌ | Kajal Aggarwal Interesting Comments On Her Husband Gautam Kitchlu | Sakshi
Sakshi News home page

Kajal Agarwal : మా ఆయనకు ఆ హీరోయిన్లు అంటే చాలా ఇష్టం

Jun 5 2024 3:28 PM | Updated on Jun 6 2024 11:40 AM

Kajal Aggarwal Interesting Comments On Her Husband Gautam Kitchlu

కాజల్‌ అగర్వాల్‌..ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్‌ అందుకొని.. స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు లాంటి స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసు​కొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్‌ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్‌. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్‌ తనను బాగా సపోర్ట్‌ చేస్తాడని,  ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. 

సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్‌ చెప్పుకొచ్చింది. కాజల్‌ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘సత్యభామ’ జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement