Samantha
-
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్‌లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
నాగచైతన్య- శోభిత పెళ్లి.. వైరల్‌గా మారిన సమంత పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది. -
సమంత ఇంట్లో తీవ్ర విషాదం
-
కుటుంబంలో విషాదం..బాధలో హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు. సోషల్‌మీడియా ద్వారా సమంత ఈ విషయాన్నితెలిపారు. మళ్లీ మిమ్మల్ని కలిసేంత వరకు.. సెలవు నాన్న అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఆమె వెళ్లడించలేదు. కానీ, అనారోగ్య సమస్యల వల్ల చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోసెఫ్ మరణించారని తెలుస్తోంది.తన తండ్రి గురించి సమంతో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. 'నా చిన్నతనంలో గుర్తింపు కోసం చాలా పోరాటం చేసేదాన్ని. అయితే, నేను ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి ఎక్కువగా అనుకునేవారు. నా కాలేజీ రోజుల్లో కూడా నన్నొక చిన్నపిల్లలా ఆయన చూసేవారు. ఈ విషయంలో మా నాన్న మాత్రమే కాదు.. చాలా మంది భారతీయ తల్లిదండ్రుల తీరు ఒకేలా ఉంటుంది. తమ పిల్లలను అలాగే చూస్తారు. అయితే, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి.'సమంత తండ్రి ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభును వివాహం చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత ఆర్థికంగా తన తండ్రికి చాలా సపోర్ట్‌గా ఉండేదని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తనకు చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ స్థోమతను గ్రహించిన ఆమె పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అయితే, మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే మొదట్లో కొందరు కుటుంబ సభ్యులు నెగెటివ్‌గా ప్రచారం చేసినా తన తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని ఆమె చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం ఇంతటి స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం తండ్రే అంటూ సమంత పలుమార్లు గుర్తుచేసుకున్న విషయం తెలిసిందే. -
పబ్‌లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
సెకండ్ హ్యాండ్ అంటున్నారు.. బాధపడుతున్న సమంత..
-
సెకండ్ హ్యాండ్.. అమ్మాయిలకే అలాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుతుస్తున్నా..ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తున్నే ఉన్నాయి. అయితే అటు చైతూ కానీ ఇటు సామ్ కానీ వాటిని పెద్దగా పటించుకోకుండా తమ పనిలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత ఇటీవల విడుదలైన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి సరదా చిట్ చాట్ నిర్వహించింది. అందులో తన మాజీ భర్త నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఖరీదైన బహుమతులు ఇచ్చాసమంతతో వరుణ్ ధావన్ ‘స్పైసీ రాపిడ్ ఫైర్’ నిర్వహించాడు. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ఈ క్రమంలో వరుణ్ అడుగుతూ.. ‘నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని అడిగాడు.వరుణ్ ప్రశ్నకు సమంత సమాధానం చెబుబూత.. ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని చెప్పింది. ‘వాటి ధర ఎంత ఉంటుంది?’అని వరుణ్ అడగ్గా.. ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్కు అక్కడితో చెక్ పెట్టింది. సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యలు 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. అమ్మాయిలకే ఎందుకలా?ఇక మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగులను తలిగిస్తుంది. ‘సెకండ్ హ్యాండ్,యూజ్డ్’ అనే ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్ చేస్తారో అర్థం కాదు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయి. నా విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవన్నీ అబద్దాలే కాబట్టి నేను స్పందించలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పారు. -
కిస్సిక్ సాంగ్‌పై సమంత రివ్యూ
ఊ అంటావా మామ.. కిస్సిక్ అంటావా మావా.. సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ! పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఐటం సాంగ్ ఏ రేంజ్లో హిట్టయిందో తెలిసిందే! ఆమె అందం, స్టెప్పులు చూసి యూత్ ఫిదా అయ్యారు. ఏ ఫంక్షన్లో అయినా ఆ పాట మార్మోగుతూనే ఉంది. అప్పుడు సమంత.. ఇప్పుడు శ్రీలీలఇక పుష్ప 2లో కూడా ఐటం సాంగ్ ఉందని, కాకపోతే ఈసారి సమంతకు బదులుగా శ్రీలీల రంగంలోకి దిగిందని ప్రచారం మొదలైనప్పటినుంచి అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అసలే యంగ్ సెన్సేషన్, అందులోనూ డ్యాన్సింగ్ క్వీన్.. ఇంకేముంది.. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు శ్రీలీల కరెక్ట్ మ్యాచ్ అనుకున్నారంతా! కిస్సిక్ పాట రిలీజ్ కాగానే ఎగబడి చూశారు. కిస్సిక్ అదిరిందన్న సామ్ఈ క్రమంలోనే పలువురూ పుష్ప 1 ఐటం సాంగే బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఫుల్ వీడియో వస్తే కానీ శ్రీలీల పర్ఫామెన్స్‌కు ఇప్పుడప్పుడే మార్కులు ఇవ్వలేమంటున్నారు. ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్ వీక్షించిన సామ్ సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చింది. శ్రీలీల చంపేసిందంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేసింది. పుష్ప 2 ఆగమనం కోసం ఎదురుచూడండి అని రాసుకొచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
వృథా ఖర్చు.. చైతూపై సమంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ పలు సందర్భాల్లో నాగచైతన్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. డిసెంబరు తొలివారం పెళ్లి జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్స్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. 'మయోసైటిస్' వ్యాధి బారిన తను పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అలా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకోవడంతో సరిపోయింది. దీంతో సినిమాలు పెద్దగా చేయలేదు. తెలుగులో చివరగా 'ఖుషి' చేసింది. ఇది వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈమె చాన్నాళ్ల క్రితం చేసిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'.. ఈ నెల ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపించాయి.ఆ సిరీస్ గురించి అందరూ చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్రమోషన్లో భాగంగా వరుణ్ ధావన్-సమంత ర్యాపిడ్ ఫైర్ ఆడిన ఓ వీడియోని అమెజాన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ గురించి పరోక్షంగా సామ్ మాట్లాడింది. 'దేనికోసమైనా ఖర్చు చేసిన డబ్బు పనికిరాకుండా పోయిందా?' అని వరుణ్ ధావన్ అడగ్గా.. 'నా ఎక్స్ (మాజీ భర్త) ఖరీదైన గిఫ్ట్స్ కోసం' అని సమంత సమాధానమిచ్చింది. సరిగ్గా చైతూ రెండో పెళ్లికి కొన్నిరోజుల ముందు సామ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం)When spies get spy-cy, it's very rapid, very fiery!🔥#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/dNXZx5D55g— prime video IN (@PrimeVideoIN) November 23, 2024 -
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్‌కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.మహేష్‌కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో చేసిన ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సామ్ ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తోంది.తను సమంతానా?ఈ వీడియోలో సామ్‌ను చూసి అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. సమంత అప్పటికంటే ఇప్పుడే యంగ్‌గా కనిపిస్తోంది.. తను సమంతే అని పోల్చుకోవడానికే చాలా కష్టంగా ఉంది.. అని నెటిజన్లు రకరకాలుగా కామంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. నిజంగా తను సమంతాయేనా? అని ప్రశ్నిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో, ముఖంలో మార్పులు సహజమే అని అభిమానులు అంటుంటే కొందరు మాత్రం తను ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. రష్మిక అనుకున్నామే!మరికొందరైతే తనను చూసి రష్మిక మందన్నా అనుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సామ్ నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 6న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. View this post on Instagram A post shared by TEA Music | The Entertainment Assignment Music (@teamusicdaily) చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి -
హల్లో హీరోయిన్ గారు.. నెక్ట్స్ ఏంటి?
‘వాట్ నెక్ట్స్’ అంటూ కొందరు స్టార్ హీరోయిన్ల అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. కారణం ఆ కథానాయికలు తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకపోవడమే. అభిమాన నాయికలు వేరే భాషల్లో సినిమాలు చేసినా తెలుగు తెరపై కనిపించక΄ోతే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. మరి... టాలీవుడ్లో కొత్త సినిమా అంగీకరించని ఆ తారల గురించి తెలుసుకుందాం. మా ఇంటి బంగారం ఏమైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. టాలీవుడ్లో మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలకి జోడీగా నటించి సందడి చేశారామె. అలాగే ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరించారీ బ్యూటీ. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రంపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఖుషి’ 2023 సెపె్టంబరు 1న విడుదలైంది. ఈ మూవీ రిలీజై ఏడాది దాటిపోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత. అయితే ‘మా ఇంటి బంగారం’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. ఈ సినిమాని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు కూడా. తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. అలాగే సమంత బర్త్ డే తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పై ఉందా? లేదా అనే సందేహం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ఏది? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే హిందీలో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ–బన్నీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సమంత. అక్కడ ఫుల్... ఇక్కడ నిల్టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోల సరసన సినిమాలు చేశారు పూజా హెగ్డే. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు పూజ. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. అయితే ‘ఆచార్య’ విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా హీరోయిన్గా మరో తెలుగు చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే. ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు చేశారామె. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. మహానటి అక్కడ బిజీ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు కీర్తీ సురేశ్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా 2016 జనవరి 1న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘నేను లోకల్ (నాని), అజ్ఞాతవాసి(పవన్ కల్యాణ్), మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే (నితిన్), గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట (మహేశ్ బాబు), దసరా (నాని), భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేశ్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ‘భోళా శంకర్’ సినిమాలో హీరో చిరంజీవికి చెల్లెలుగా నటించారు కీర్తి. ఆ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రానికి కీర్తీ సురేష్ పచ్చజెండా ఊపలేదు. అయితే ఈ గ్యాప్‌లో తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. అంతేకాదు.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో కీర్తీ సురేష్ నటించనున్న సినిమా ఏంటి? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబమ్మకి గ్యాప్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని (శ్యామ్ సింగరాయ్), నాగచైతన్య(బంగార్రాజు, కస్టడీ), రామ్ (ది వారియర్), నితిన్ (మాచర్ల నియోజక వర్గం), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి), శర్వానంద్(మనమే) వంటి యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా ఈ ఏడాది జూన్ 7న రిలీజైంది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా తెలుగులో ఇప్పటికీ మరో సినిమా కమిట్ కాలేదామె. టొవినో థామస్ హీరోగా నటించిన ‘ఏఆర్ఎమ్’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు (వా వాతియార్, లవ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ, జీనీ) వంటి చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారీ బ్యూటీ. కోలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదా? అనేది వేచి చూడాలి. నాలుగో సినిమా ఏంటి? తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ (2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారామె. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రతో ఆకట్టుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటినా ఆమె నటించనున్న మరో తెలుగు చిత్రంపై స్పష్టత లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి కమిట్ కాకపోయినా బాలీవుడ్లో మాత్రం దూసుకెళుతున్నారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మృణాళ్. అయితే రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఎల్ 25’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. మృణాళ్ ఠాకూర్ తర్వాతి తెలుగు సినిమా ఏంటి? అంటే వేచి చూడాలి. ఈ కథానాయికలే కాదు... మెహరీన్, డింపుల్ హయతి వంటి మరికొందరు హీరోయిన్లు నటించనున్న కొత్త తెలుగు సినిమాలపైనా స్పష్టత లేదు. -డేరంగుల జగన్ -
తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత
ఒకప్పటితో పోలిస్తే సినిమాలు చేయడం సమంత చాలా తగ్గించేసింది. గతేడాది వచ్చిన 'ఖుషి' మూవీలో హీరోయిన్గా చేసింది. రీసెంట్గా 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో సమంత కిస్ సీన్స్, గ్లామర్ క్లిప్స్ వైరల్ అయ్యాయి గానీ సిరీస్‌కి ఫ్లాప్ టాక్ వచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే ప్రమోషన్స్‌లో భాగంగా తల్లి కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.'సిటాడెల్'లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 'సిటాడెల్లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది. తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు'(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)'తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు. డిసెంబరు తొలివారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ) -
సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్ ట్యాంక్..
బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్, టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్ షోకి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.సమంత కోసం ఆక్సిజన్ ట్యాంక్అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్ ట్యాంక్ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.ఉన్నట్లుండి పడిపోయిందిఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను.తనొక ఇన్స్పిరేషన్అయితే రాజ్ అండ్ డీకే టెన్షన్ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.మయోసైటిస్కాగా మయోసైటిస్ వ్యాధివల్ల సిటాడెల్ సిరీస్ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.చదవండి: నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
Pushpa 2 Movie: 'పుష్ప' హంగామా.. ఈసారి హాట్ బ్యూటీస్‌తో
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్‌లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్‌ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. ఆ హీరోయిన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ రావడంతో పార్ట్-2లోనూ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.అయితే పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్దాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ తెలుస్తోంది. ఒక్క పాటకు దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. అయితే అంత భారీస్థాయిలో డిమాండ్ చేయడంతో పుష్ప-2 నిర్మాతలు తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఐటమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్ డ్యాన్స్ చూడాలనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే గతంలో సమంతకు కూడా దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో గుంటూరు కారం భామ శ్రీలీల కనిపించనున్నట్లు లేటేస్ట్ టాక్. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించిన భామ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బీజీగా ఉంది. శ్రీలీలతో డీల్ ఓకే అయితే పుష్ప-2 తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుంది. కాగా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. -
ఊ అంటావా మావా అంటున్న శ్రీ లీల.. సమంతతో కలిసి పుష్ప 2 ఐటెం సాంగ్