హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వరనేది పచ్చి నిజం. కానీ ఇప్పడు వారు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. కాగా సినిమా సినిమాకు మన హీరోయిన్లు క్రేజ్ పెరిగిపోతోంది. లేడి ఒరియంటెడ్ పాత్రలకు సైతం సై అంటూ హీరోలకు పోటీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో వారి రెమ్మునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండ వారి పారితోషికం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత్రను బట్టి ఆ సినిమా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్ల నుంచి లక్షల వరకు పారితోషికంగా అందుకుంటున్న సౌత్ హీరోయిన్లు ఎవరూ, ఎవరెంత డిమాండ్ చేస్తున్నారు. వారి రెమ్మునరేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.
నయనతార: ఒక్కో సినిమాకు ఇప్పటికీ రూ.4 కోట్ల వరకు తీసుకుంటుంది నయన్. ఇప్పటికీ అదే రేంజ్ మెయింటేన్ చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్‌లో కథానాయికగా చేస్తున్న నయన్ ఈ మూవీకి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి.
పూజా హెగ్డే: వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ లెగ్ అనిపించుకుంటుంది. దీంతో ఆమెను హీరోయిన్‌గా మాత్రమే కాకుండా... ఇతర చిత్రాల ఈవెంట్స్‌కు కూడా ముఖ్య అతిథిగా స్వాగతం ఇస్తున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటిస్లూ పూజ రెమ్యునరేషన్‌ను కూడా భారీగా డిమాండ్ చేస్తుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్యలో అడుగుతుందని, ఇక మూవీ ఈవెంట్స్‌కు లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
సమంత: పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే యశోద సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అనుష్క శెట్టి: అరుంధతి మూవీ రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న స్వీటీ.. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇటిటీవల కమిటైన యూవీ క్రియేషన్స్ సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం.
రష్మిక మందన్న: ఒక్కో సినిమాకు ఇప్పుడు 2.25 కోట్ల నుంచి రూ. 3 కోట్లవరకు తీసుకుంటుంది రష్మిక. హిందీలో అయితే అంతకంటే ఎక్కువగానే అందుకుంటుందని అంచనా.
కీర్తి సురేశ్: సినిమాల విజయాలు, వైఫల్యాలతో సంబంధం లేకుండ కీర్తి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట.
సాయి పల్లవి: సైలెంట్‌గా సంచలనాలు సృష్టించడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా. ఈ ముద్దుగుమ్మ కూడా ఒక్కో సినిమాకు సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు అందుకుంటుంది.
కాజల్ అగర్వాల్: ఎంతమంది కొత్తవాళ్లు వచ్చిన కాజల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కాజల్ రూ. 3 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంది.
తమన్నా: ఒకప్పుడు కోట్లలో పారితోషికం తీసుకునే తమన్నా.. కాస్తా తన క్రేజ్ తగ్గడంతో రూ. కోటి నుంచి కోటిన్నరకుపైగా డిమాండ్ చేస్తుందట. స్పెషల్ సాంగ్ అరకోటి నుంచి కోటి వరకు అందుకుంటుంది. టీవీ షోలకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ మిల్కీ బ్యూటీ.
రాశీ ఖన్నా: జై లవకుశ వంటి సినిమాలలో నటించిన తర్వాత కూడా రాశీ ఖన్నా రేంజ్ పెరగలేదు. దీంతో ఇప్పుడు సినిమాకు రూ. 60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అంచనా.
రకుల్ ప్రీత్ సింగ్: మొన్నటి వరకు కోటికి తగ్గని రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు సినిమాకు 70 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment