Nayantara
-
ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. వృత్తి పరంగానూ వ్యక్తిగతంగానూ ఈమె చూడాల్సిన ఎత్తుపల్లాలు లేవని చెప్పవచ్చు. వృత్తిపరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని లేడి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఇక వ్యక్తిగతం గాను పలుమార్లు ప్రేమలో విఫలం అయ్యారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఇప్పుడు భార్యాగానూ ఇద్దరు కవల పిల్లలకు తల్లిగానూ అందమైన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వివాదాస్పద నటి అన్నది నయనతార పేరుకు ముందు అంటి పెట్టుకునే ఉంటుంది. అయినప్పటికీ కథానాయకిగా ఇప్పటికీ బిజీ నటినే. చిత్రానికి రూ.12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి టెస్ట్. నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం టెస్ట్ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నిలబడే అవకాశం ఉంది. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్‌ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్‌ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్‌ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్‌పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్‌పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్‌పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కమర్షియల్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి ఫస్ట్ సినిమా.. నిర్మాతగా నయనతార
కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన హీరో, విలన్ అన్న తారతమ్యం లేకుండా పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్నారు. గత ఏడాదిలో 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందే విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి ఆ చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇక ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా విడుదలై 2 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రైన్, ఏస్, గాంధీ టాకీస్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా విజయ్ సేతుపతి కథానాయకుడిగా మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హరి గతంలో సూర్యతో సింగం సీక్వెల్స్ చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆపై హీరో విశాల్‌తో పూజై సినిమాతో బిగ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా నిజమైతే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార, విగ్నేష్ శివన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థలో పలు వైవిద్య భరిత సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన నయనతార విగ్నేశ్ శివన్ లు తాజాగా విజయ్ సేతుపతి హీరోగా చిత్రం చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్ చేసింది: సింగర్
నటి నయనతారకు ధన అహంకారం పెరిగిందని, సంచలన గాయని నటి సుచిత్ర పేర్కొన్నారు. ఇంతకుముందు పేరుతో పలువురు ప్రముఖ అంతరంగిక విషయాలను బయటపెట్టి కలకలం సృష్టించిన ఈమె కొద్దిగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్కు విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా నటి నయనతారపై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఇటీవల యూట్యూబ్ ఛానల్ భేటీలో పాల్గొన్నారు. దానిపై గాయని సుచిత్ర స్పందిస్తూ నటి నయనతార ఇటీవల నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్‌పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు. అయితే ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి (నటుడు ధనుష్, నయనతార) మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం నయనతారలో ఎంత అహంకారం పెరిగిన దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నటి నయనతార ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా తాను నటుడు ధనుష్ ను ఢీకొంటున్నట్లు చెప్పడంతో పాటు, జవాన్ చిత్రం తర్వాత హిందీలో మరో అవకాశం రాకపోవడంతో అక్కడ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని గాయని సుచిత్ర పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఆరో జనరేషన్ హీరోలకు కూడా ఓకే చెప్తున్నా: నయనతార
పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. పెళ్లి అయ్యి, ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయినా కథానాయకిగా తగ్గేదేలే అంటున్న నటి ఈ భామ. నాలుగు పదుల వయసులోనూ సీనియర్ హీరోల నుంచి, యూత్ హీరోల వరకూ నటిస్తూ తన ఇమేజే వేరు అంటున్నారు. ఈమె మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్దం అవుతోంది. అదేవిధంగా ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం రాక్కాయి, మన్నాంగట్టి సిన్స్ 1960, మూక్కుత్తి అమ్మన్ 2, కన్నడంలో టాక్సిక్, మలయాళంలో ఎంఎంఎంఎన్ చిత్రాలు చేస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార తాజాగా తెలుగులో నటుడు ప్రభాష్ కథానాయకుడిగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న చిత్రాల్లో యువ నటుడు కవిన్‌తో జత కడుతున్న చిత్రం ఒకటి. దీని గురించి నయనతార పేర్కొంటూ తాను తొలి జనరేషన్‌కు చెందిన నటుడు రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టిలతోనూ, రెండవ జనరేషన్‌కు చెందిన విజయ్, అజిత్లతోనూ, మూడవ జనరేషన్‌కు చెందిన సూర్య, విక్రమ్‌తోనూ, నాలుగవ జనరేషన్‌కు చెందిన ధనుష్, శింబుతోనూ అయిదవ జనరేషన్‌కు చెందిన శివకార్తికేయన్తోనూ నటించినట్లు చెప్పారు. తాజాగా ఆరో జనరేషన్‌కు చెందిన కవిన్‌తో జత కడుతున్నట్లు చెప్పారు. ఇలా ఆరు జనరేషన్స్‌కు చెందిన వారితో కథానాయకిగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇది రిమేర్కబుల్ జర్నీ అని పేర్కొన్నారు. కాగా నయనతార, నటుడు కవిన్ జంటగా నటిస్తున్న చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియో పతాకంపై ఎస్ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నటి నయనతార పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. దీంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార
కోలీవుడ్‌లో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివనన్పై ధనుష్ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్‌ను కోరింది. అయితే, తాజాగా సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్‌ను టార్గెట్ చేసే నయన్ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.కోలీవుడ్‌లో నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్‌పై నయన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్‌ను హెచ్చరిస్తూ నయన్ ఇలా పోస్ట్ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్‌ను నయన్ పంచుకుంది.సోషల్‌మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం ధనుష్‌ను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన ఫుటేజ్‌ను నయన్ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. -
చిరంజీవి, షారూఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ నయనతార లేఖ
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తన అభిమానులను పలకరించింది. అయితే, ఈ డాక్యుమెంటరీ చిత్రకరణలో తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మూడు పేజీల లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు సాయం చేసిన తెలుగు,తమిళ్,మలయాళ,హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో పాటు నిర్మాణ సంస్థల పేర్లను తెలుపుతూ లేఖ రాశారు.నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో అగ్రనటి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2022లో మామల్లపురంలో జరిగింది. ఈ సందర్భంలో నటి నయనతార వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహాన్ని కవర్ చేస్తూ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో ఆమె ఇంటర్వ్యూ, షూట్లో పాల్గొన్న దృశ్యాలు, ఆమె మేకప్‌తో సహా అనేక సన్నివేశాలు ఉన్నాయి.తన డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నో హోల్డ్-బార్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నయన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో నటించాను. అవన్నీ నాకు ప్రత్యేకమే, నా కెరీర్లో చాలా ముఖ్యమైన భాగం అయ్యాయి. ఇందులో చాలా సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాల జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని అనుకున్నాను. అందుకోసం ఆయా చిత్రాల నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు వెంటనే ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి అభ్యంతరం చేయకుండా నాకు అన్హిండెర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారందరినీ ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.' అని తెలిపింది.నయనతారకు సహకరించిన నిర్మాణ సంస్థల పేర్లతో పాటు నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్లో నటుడు షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ ఉంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్‌కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్‌పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్‌కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్‌కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్‌కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
నయనతార విశ్వరూపం మీరూ చూసేయండి
లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. తాజాగా తన నటించనున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నయన్ 'రక్కయీ' (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించింది. కథలో ఉమెన్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చేలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వర్స్‌ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. తల్లి పాత్రలో నటిస్తున్న నయన్తన కూతురు కోసం చేసే పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుందని దర్శకుడు టీజర్లోనే చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. -
నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!
అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్ సర్జరీ అవసరమే లేదని తెలిపింది. ‘ఇది నిజమైన గేమ్ ఛేంజర్. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్ ఔట్ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్. -
మూర్ఖులతో వాదించలేమంటూ నయనతార పోస్ట్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతారకు సమంత లాంటి పరిస్థితే వచ్చింది. కొద్దిరోజుల క్రితం సమంత ఒక హెల్త్ టిప్ పంచుకుంది. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని సలహా ఇచ్చింది. అప్పుడు ఆ రెమిడీని ది లివర్ డాక్ తప్పుపట్టారు. ఇప్పుడు అలాంటి వివాదమే మళ్లీ చర్చకు వచ్చింది. అదే డాక్టర్ నయనతారతో పేచీ పెట్టుకున్నాడు.తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. మందార టీతో ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ఆమె తెలిపింది. మందార టీలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, దీనిని తీసుకోవడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థను సమతౌల్యంగా ఉంచుతుందని నయన్ తెలిపింది. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుందని చెప్పింది. డయాబెటిస్ నుంచి మొటిమల వరకు ఎన్నింటినో ఈ టీ పెద్ద ఉపసమనాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొంది. ఆపై మందారం టీ ఎలా తయారు చేసుకోవాలో రెసిపీని కూడా ఆమె పంచుకుంది.నయనతార ఆరోగ్య చిట్కా గురించి డాక్టర్ లివర్ డాక్ ఫైర్ అయ్యారు. మందార టీ కాస్త టేస్టీగా ఉంటుందని చెప్పి ఆపి ఉంటే పర్వాలేదు.. కానీ, ఇలా అవగాహన లేని చిట్కాలు ఎందుకు చెబుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ప్రజారోగ్యంపై సర్జికల్ స్ట్రైక్ లాగా సెలబ్రిటీల అందరూ ఈ రకమైన ఉచిత సలహాలు ఇవ్వడాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. అందుకు కావాల్సిన చట్టాలను తీసుకురావాలని ఆయన కోరారు. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోగ్య సలహాలు ఇవ్వకూడదని అలా చేయడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.మందారం టీ మధుమేహం, రక్తపోటు, మొటిమలకు ప్రయోజనకరమైనదని, యాంటీ బాక్టీరియల్ కలిగి ఉంటుందని నయనతార చెప్పడం వల్ల వారు తమ ఆరోగ్య-నిరక్షరాస్యతను చాటుకుంటున్నారని ఆయన అన్నారు. పైన పేర్కొన్న మెడికల్ క్లెయిమ్‌లు ఎక్కడా ధృవీకరించబడలేదని ఆయన తెలిపారు.మందారం టీ గురించి ఉన్న పోస్ట్‌ను నయనతార తొలిగించింది. కానీ, అందుకు క్షమాపణ చెప్పలేదని లివర్ డాక్ కామెంట్ చేశారు. మందారం టీ గురించి నయనతార తన హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ మున్మున్ గనేరివాల్ (@munmun.ganeriwal) చెప్పినట్లుగా మాత్రమే ఆమె తెలిపింది. కానీ లివర్ డాక్ మాత్రం ఆమెపై ఫైర్ అయ్యారు.కొంత సమయంలో తర్వాత నయనతార పరోక్షంగా స్పందిస్తూ ఇన్‌స్టాలో మరో పోస్ట్ చేసింది. ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన పాపులర్ కోటేషన్‌ను తన స్టోరీలో పంచుకుంది. 'మూర్ఖులతో ఎప్పుడూ వాదించకండి, వారు మిమ్మల్ని వారి స్థాయికి లాగి, ఆపై అనుభవంతో మిమ్మల్ని కొడతారు' అని తెలిపింది. ఇదంతా డాక్టర్ లివర్ డాక్ గురించే నయనతార కామెంట్ చేసిందని తెలుస్తోంది. -
ఆ లక్కీ ఛాన్స్ ఆమెకేనా?
తమిళసినిమా: నటుడు విజయ్ చివరి చిత్రంలో నటించనున్న కథానాయకి ఎవరన్నది ఇప్పటికీ ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ ప్రస్తుతం కోర్ట్ చిత్రాన్ని పూర్తి చేశారు. వెంకట ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.కాగా తదుపరి ఒక్క చిత్రంలో నటించి విజయ్ నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అదే ఈయన 69వ చిత్రం. దీనికి హెచ్ వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇది పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే కళా చిత్రంగా ఉంటుందని, విజయ్ రాజకీయ జీవితానికి హెల్ప్ అయ్యే చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ చిత్రంలో విజయ్‌తో జతకట్టే కథానాయకి ఎవరన్న విషయంపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో నటి నయనతార మరోసారి విజయ్‌తో జత కట్టనున్నట్లు, కాదు టాలీవుడ్ యువ క్రేజీ నటి శ్రీలీల ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎవరు కాదు ఆ లక్కీ ఛాన్స్ మరోసారి సంచలన నటి సమంత కే దక్కిందన్నది సమాచారం.మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కృషి చిత్రం తర్వాత ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే మళ్లీ తన రీ ఎంట్రీ భారీగా ఉండాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. హలో ఈమె సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే ఒక మలయాళంలోనూ, ఒక హిందీ చిత్రంలోను నటించే అవకాశాలు వచ్చాయని ప్రచారం కూడా జరిగింది. కాగా విజయ్‌తో సమంత ఇప్పటికే తెరి, మెర్సల్, కత్తి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఆయనతో నాలుగో సారి జత కట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
ఆ డైరెక్టర్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన 'నయనతార'
ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా అది జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంటూ ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. అన్నింటికి మించి సినిమా విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వారందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కానీ లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. చివరకు తను నటించిన చిత్రాల కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనదు. ఒక ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్ పెట్టేస్తుంది.చిరంజీవి,షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారితో పాటు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తాజాగా ఒక డైరెక్టర్ కోసం తన రూల్‌ను బ్రేక్ చేసింది నయనతార. కానీ తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కోసం ఆమె ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విష్ణువర్ధన్ 'నేసిప్పయ' అనే సినిమా తీశారు. అందులో అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పవచ్చు. విష్ణువర్ధన్ తమిళ్లో బిల్లా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రంలో నయనతారను ఎంపిక చేయడం వల్ల ఆమె కెరియర్ మారిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత నయనతారకు భారీగా డిమాండ్ పెరిగింది. వరుసుగా సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయ్. అలా ఇప్పుడు అభిమానులు లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే రేంజ్‌కు నయనతార చేరుకుంది. ఆ అభిమానంతోనే నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నయన్ చెప్పుకొచ్చింది. -
నయనతార ప్లేస్‌లో త్రిష?
తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్జే శరవణన్‌తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది.వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
-
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్‌గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
Nayanthara Sons Uyir, Ulag 1st Birthday: నయనతార-విఘ్నేశ్ పిల్లల ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్
• నాలుగు రోజుల్లో 'జవాన్'కు రూ. 500 కోట్లు • ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు • షారుక్ తర్వాతి సినిమా ఇదే ఈ ఏడాదిలో పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్‌లను అందుకుంటూ బాలీవుడ్లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్‌తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) దీంతో బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లోనే సెప్టెంబర్ 7న జవాన్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్‌లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్‌ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. Jawan creates HISTORY. Sold a RECORD 2⃣8⃣7⃣5⃣9⃣6⃣1⃣ tickets from tracked shows alone in India on the 4th day. Biggest ever for a bollywood film. ||#ShahRukhKhan|#Nayanthara|#Jawan|| Worldwide hits ₹500 cr gross club, making Shah Rukh Khan the only actor to achieve this feat… pic.twitter.com/CHeMFO7wmS — Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023 -
‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’.‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘జవాన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. (చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్ మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జవాన్’కి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందని కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమని, షారుఖ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. Just started watching #Jawan, and I'm already hooked! The action scenes are intense, and the story is gripping. Can't wait to see how the hero saves the day. Any recommendations for similar action-packed movies? #MovieNight 🍿 — RushLabs (@RushLab) September 7, 2023 ఇప్పుడే జవాన్ చూశాను. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. కథనం ఆకట్టుకుంది. షారుఖ్ నటన అదుర్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Jawan Early Review B L O C K B U S T E R: ⭐️⭐️⭐️⭐️⭐️#Atlee has delivered a masterpiece, an exhilarating blend of emotion and mass action This year belongs to the baadhshah #ShahRukhKhan𓃵 👑 #VijaySethupathi #Nayantara & rest were great DON'T MISS IT !!#JawanReview pic.twitter.com/lKuYZ6oWGr — ConectMagnet (@ConectMagnet) September 7, 2023 ‘జవాన్ బ్లాక్ బస్టర్ హిట్. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్ మరియు మాస్ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే. విజయ్ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు. జవాన్ చూడడం మిస్ కాకండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #Atlee#OneWordReview #Jawan : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Jawan is a WINNER and more than lives up to the humongous hype… Atlee immerses us into the world of Mass pan-Indian film, delivers a KING-SIZED ENTERTAINER… Go for it. MUST WATCH. #JawanReview #ShahRukhKhan pic.twitter.com/WgtqoKFyjD — Rithik Modi (@rithiek) September 7, 2023 జవాన్ విజయం సాధించాడు. సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్డ్ ఎంటర్టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #jawanReview..!!! 1st Half ok👍 2nd Half average.. Nayanthara Entry 🔥 VJ sethupathi Acting🙏 🔥 'One word ' #Jawan film loved by Shahrukh Khan fans#JawanFirstDayFirstShow#JawanFDFS #ShahRukhKhan𓃵 #AskSRK pic.twitter.com/qC7eArxP79 — Raj (@Rajwriter7) September 7, 2023 ‘ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ యావరేజ్. నయనతార ఎంట్రీ బాగుంది. విజయ్ సేతుపతి నటన అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే...‘జవాన్’ షారుఖ్ అభిమానులను అలరిస్తుంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. The film @iamsrk starer #jawan will create a tsunami at Bharat & overseas box office 🔥🔥🔥 from its Day1, all the existing records in danger. People are going to witness what happens when the world's biggest superstar comes with mass Avtar 💥💥💥 #JawanFDFS #ShahRukhKhan𓃵 💓 — basha (@Noone47949911) September 6, 2023 My friends from New Zealand told me. It's going to be tsunami at the box office for #Jawan. #KingKhan SRK is going to rule Global Box Office. The collections will be earth shattering. 🔥🔥 — Says A man (@saysAmann) September 7, 2023 Jawan came to creat history at box office. Biggest blockbuster of bollywood industry. CRAZE for #Jawan is unmatchable. Even in early morning 🔥🔥🔥#JawanFirstDayFirstShow #JawanReview #JawanAdvanceBooking #JawanFDFS pic.twitter.com/Ta0uM5gZwv — Satya Prakash (@Satya_Prakash08) September 7, 2023 #JawanReview :⭐⭐⭐⭐#Jawan is a fascinating crime filled movie told from multiple perspectives with perfect pace & cinematography. An absolute entertainer package with action, comedy, thrill & what else.. @iamsrk @VijaySethuOffl & @Atlee_dir keep us on the edge of our seat pic.twitter.com/kBVFX3UK4B — Shams Ansari (@realshams01) September 7, 2023 #Jawan craze is like a festival 🔥 This is unbelievable and Unmatchable for other stars.#ShahRukhKhan𓀠 is ready to rule the box office and wins hearts ✅#JawanTsunamiTomorrow #JawanFirstDayFirstShow #Jawan #ShahRukhKhan𓀠 #JawanReviews #Nayanthara #ThalapathyVijay pic.twitter.com/sohSZzbeom — Jani ( Fan Account) (@filmy49515) September 7, 2023 -
క్రికెట్ మ్యాచ్‌లో 'జవాన్' ప్లాన్: అట్లీ
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్‌స్టార్ నయనతార జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, తమిళ నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్‌ఖాన్ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కరోనా కాలంలో షారూఖ్‌ఖాన్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్‌సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్, ఎడిటర్ రూపన్ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్ చిత్రం చేశామని అట్లీ చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార
-
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్‌స్క్రీన్‌పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం.. కృష్ణ-విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవిత-రాజశేఖర్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్‌కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నాగార్జున- అమల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. మహేశ్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్‌గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. నయనతార- విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022, జూన్ 7న విఘ్నేశ్‌తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్‌స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సాయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్ అలీ ఖాన్, దీపికా- రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: కోలీవుడ్ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల -
నయనతారకు చెక్ పెడుతున్న త్రీష
-
నయనతార అందగత్తె, స్వీట్ పర్సన్ : షారుక్ ఖాన్
నయనతార అందమైన నటి. ఈ మాట అన్నది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. పఠాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈయన తాజాగా జవాన్ చిత్రంతో తెరపైకి రావడానికి ముస్తాబ్ అవుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించగా నటుడు విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చదవండి: విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్ ఈ సందర్భంగా షారుక్ ఖాన్ జవాన్ చిత్ర విడుదల తేదీని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆయన ఆన్లైన్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తూ జవాన్ పక్క కమర్షియల్ అంచాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటి నయనతారతో కలిసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఆమె చాలా అందగత్తె అనీ, స్వీటీ అని పేర్కొన్నారు. నటుడు విజయశాంతి చాలా ప్రతిభావంతుడని, చాలా ఒదిగి ఉండే నటుడు అనీ, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని అన్నారు. నటుడు అఖిల్ గురించి చెప్పాలంటే ఆయన తనను రెండు విధాలుగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అట్లీ సంగీత దర్శకుడు కలిసి తనను ఈ చిత్రంలోని పాటల్లో కొన్ని పదాలను పాడించారని చెప్పారు. చదవండి: ఆ బాలీవుడ్ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్ -
ప్రభుదేవా రెండో భార్యను ఎప్పుడైనా చూశారా? తొలిసారి కెమెరా ముందుకు..
ఇండియన్ మైఖేల్ జాన్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. హీరోగా, డ్యాన్సర్, కొరియోగ్రఫర్‌గా, దర్శకుడిగా..ఇలా మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన ప్రభుదేవా పర్సనల్ లైఫ్ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భార్య ఉండగానే హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపిన ప్రభుదేవాకు ఆ బంధం కూడా చేదు ఙ్ఞాపకాన్నే మిగిల్చింది. చదవండి: 'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్ చూశారా? ఫోటో వైరల్ అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవా నయనతార కోసం కుటుంబాన్ని వదిలేశాడని, పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందంటూ ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ బహిరంగంగానే అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పటికీ సంచనలమే. కట్ చేస్తే.. చాన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత తమ దారులు వేరంటూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దీంతో నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోగా,ప్రభుదేవా 2020లో హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే ఇటీవలె ప్రభుదేవా 50వ పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ తెలియజేస్తూ తొలిసారి ఓ షోలో కనిపించింది హిమానీ సింగ్. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి 'మీరు చాలా అద్భుతమైన మనిషి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా' అంటూ భర్తను ఆకాశానికెత్తేసింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Prabhu Deva Fans (@prabhu_deva_fans) -
పెళ్లయిన,బిడ్డకు తల్లైన తగ్గేదేలే...
-
ఎట్టకేలకు కవలల పేర్లు చెప్పిన నయన్ దంపతులు
నయనతార, విఘ్నేశ్ శివన్ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం అందరికీ తెలిసిందే! ఈ కవలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ దంపతులు తమ పిల్లల ముఖాలను మాత్రం ఇంతవరకు చూపించనేలేదు. కనీసం పేర్లు కూడా వెల్లడించలేదు. ఎప్పుడెప్పుడు వారి ముఖాలు రివీల్ చేస్తారా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. సస్పెన్స్‌కు తెర దించుతూ విఘ్నేశ్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో కిటికీ దగ్గర కూర్చున్న నయన్ చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న పిల్లల పేర్లను కూడా బయటపెట్టాడు విఘ్నేశ్. 'ఉయిర్ రుద్రనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్.. ఈ ప్రపంచంలోనే ఉత్తమ తల్లి నయనతారకు సంకేతంగా ఇద్దరి పేర్లలో ఎన్ను చేర్చాం. మా పిల్లల పేర్లను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కాగా చాలాకాలం డేటింగ్లో ఉన్న నయన్, విఘ్నేశ్ 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. అక్టోబర్‌లో సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్ కవలల పిక్ షేర్ చేసిన భర్త విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార-దర్శకుడు విఘ్నేశ్ గతేడాది జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేశ్‌లు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు నెలలు తిరక్కుండానే సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఈ వ్యవహరం వివాదం మారింది. అన్ని నిబంధనల ప్రకారమే తాము సరోగసికి వెళ్లామని నయన్ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవడంతో వివాదం సద్దుమనిగింది. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ కవలలు జన్మించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారి ఫేస్ రివీల్ చేయలేదు ఈ జంట. దీంతో నయన్ పిల్లలను చూసేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త విఘ్నేశ్ తాజాగా చిన్నారుల క్యూట్ పిక్స్ షేర్ చేశాడు. ఎప్పటిలాగే వారి ముఖం కనిపించకుండ విఘ్నేశ్ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ కాగా నయన్, విఘ్నేశ్‌లు చిన్నారుల చేతులు పట్టుకుని ఉన్న ఫొటోలన పోస్ట్ చేస్తూ.. ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటనే ప్రేమ’ అంటూ విఘ్నేశ్ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. కాగా ఇటీవల ఈ స్టార్ కపుల్ తమ కవలలతో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. కాగా తమ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చంద్రముఖి 2: లారెన్స్‌తో జతకట్టనున్న నయనతార?
తమిళసినిమా: నృత్య దర్శకుడు లారెన్స్ ఇప్పుడు కథానాయకుడిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న రుద్రన్ షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు అధికారం, జిగర్ తండా-2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో నూతన చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. లారెన్స్‌కు హర్రర్ కామెడీ జానర్ లక్కీ అనే చెప్పాలి. ఇంతకుముందు ఈయన నటించిన కాంచన చిత్రం సీక్వెల్ అన్నీ ఈ జానర్లో రూపొంది విజయం సాధించిన చిత్రాలే. అదేవిధంగా శివలింగ చిత్రం, ప్రస్తుతం నటిస్తున్న చంద్రముఖి 2 చిత్రం హర్రర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రాలే. తాజాగా ఈయన అంగీకరించిన చిత్రం కూడా హర్రర్ కామెడీ కథా చిత్రమేనని సమాచారం. ఈ చిత్రాన్ని మేయాదమన్ చిత్రం ఫేమ్ రతన్‌కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో నయనతారను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సంచలన నటి హిందీలో షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న జవాన్ చిత్రం ఒక్కటే ఉంది. జయంరవి సరసన నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. లారెన్స్ జతకట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
పెళ్లి తర్వాత నయన్‌కు కలిసిరావడం లేదా?
లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెళ్లి తర్వాత కలిసిరావడం లేదని అనిపిస్తోందంటున్నారు ఆమె ఫ్యాన్స్. సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమె గతేడాది ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లు చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నయన్‌కు పెళ్లి అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోవడమే. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. ఇటీవలే బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది నయన్. హిందీలో షారూఖ్ ఖాన్‌కి జంటగా నటించిన జవాన్ చిత్రం, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకున్నాయి. వీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు తర్వాత చిత్రం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది.దీనికి కారణం కొత్త చిత్రాలేవీ చేతిలో ఏమీ లేకపోవడమే. అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించిన చిత్రాలు సైతం వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నయనతార ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి. మరో విషయం ఏంటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయడానికి అంగీకరించారని. అందుకు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు చొప్పున రెండు చిత్రాలకు రూ. 20 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. అయితే అడ్వాన్స్ తీసుకుని రెండేళ్లుగా కాలయాపన చేయడంతో వారు చిత్రాలను నిలిపివేయడమే కాకుండా.. నగదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. చదవండి: మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే! ఇదిలా ఉంటే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆయన అజిత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు వీరిద్దరి కెరీర్‌కూ పెద్ద ఎదురుదెబ్బ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉండగా.. నయన్ నటనకు స్వస్తి చెప్పారనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో నయనతారకు టైమ్ బాగాలేదా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ పాగా వేసిన సంచలన నటి మరోసారి వార్తల్లో నానుతున్నారు. నయనతార పెళ్లి అయిన తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఏమీ ఆశించిన విధంగా విజయాలు సాధించలేదు. ఇక తన భర్త విఘ్నేష్ శివన్ విషయంలో ఘోర పరాభవం జరిగింది. ఈయన నటుడు అజిత్ కథానాయకుడుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రకటన కూడా జరిగింది. ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అన్న తరుణంలో సినిమా కథ నచ్చలేదంటూ ఇటు అజిత్, అటు సంస్థ పేర్కొనడమే కాకుండా చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను తొలగించారు. ఇది దర్శకుడు విఘ్నేష్ శివన్ కంటే ఆమె భార్య, నటి నయనతారను బాగా గాయపరచిందనే ప్రచారం వైరల్ అయ్యింది. దీనికి కారణం ఈ వ్యవహారంలో ఆమె చేసిన సంధి ప్రయత్నం కూడా విఫలం కావడమే. దీంతో అజిత్‌కు బదులుగా నటుడు విజయ్ సేతుపతిని తీసుకొని విఘ్నేష్ శివన్ చిత్రం చేసేలా నయనతార చక్రం తిప్పిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా నటుడు విజయ్ సేతుపతి తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే తాజాగా ఆ చిత్ర కథ నచ్చలేదంటూ సుందర్.సి కి హ్యాండ్ ఇచ్చారు. అయితే దీని వెనుక నటి నయనతార హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అజిత్ తిరస్కరించిన కథలోనే విజయ్ సేతుపతిని నటింపజేస్తూ తన ఈగోను తృప్తి పరచుకుంటోందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, విఘ్నేష్ శివన్ కాంబోలో ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్, కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రాలు రూపొందాయి. -
అభిమానులకు షాక్.. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పనున్న నయనతార!
లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ఆరంభించిన నయన్ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. మాలీవుడ్‌లో తన ప్రస్థానం మొదలుపెట్టి తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయన్‌కి పేరుంది. అయితే ఇప్పుడు నయనతార అభిమానులకు టెన్షన్ పెట్టే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కొంతకాలం పాటు నయనతార నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నయన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. పిల్లల ఆలనా పాలనా నేపథ్యంలో నయన్ ఈ నిర్ణయం తీసుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న నయనతార కనెక్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
నయనతార నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కనెక్ట్. అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో కనిపించారు. కుటుంబ నేపథ్యంలో హర్రర్ కథాంశంతో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే తాజాగా నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 24న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానంఉదట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
మాళవిక మోహనన్‌పై నయన్ ఫ్యాన్స్ ట్రోల్స్.. దిగొచ్చిన నటి
లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అయితే నయన్‌కు ఆ బిరుదు అవసరం లేదంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యింది. గత కొన్ని రోజులుగా నయన్-మాళవిక మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ మరోసారి నయన్‌ను అవమానించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహనన్.. 'లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని,హీరోయిన్లను సూపర్ స్టార్ అంటే చాలు. లేడీ సూపర్ స్టార్ అనడం ఏంటి' అంటూ బదులిచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నయన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నయన్ స్టార్డమ్ చూసి ఓర్వలేకనే మాళవిక ఇలా ప్రతీసారి నయన్ పేరు వాడుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండటంతో దిగొచ్చిన మాళవిక మరో ట్వీట్ చేస్తూ తను చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చింది. హీరోయిన్ల విషయంలో నా అభిప్రాయన్నా చెప్పాను తప్పా ఓ హీరోయిన్ని టార్గెట్ చేస్తూ నేనలా అనలేదు. నిజానికి నయనతార అంటే నాకు ఇష్టం. ఆమెను ఎంతో గౌరవిస్తాను. సీనియర్‌గా ఆమె కెరీర్ చూసి ప్రేరణ పొందుతాను కాబట్టి దయచేసి అందరూ కాస్త శాంతించండి అంటూ మాళవిక పేర్కొంది. Dont Call As Lady Super #MalavikaMohanan pic.twitter.com/OS3wTml8j4 — chettyrajubhai (@chettyrajubhai) February 11, 2023 My comment was about a term that is used to describe female actors & not about any specific actor. I really respect & admire Nayanthara, and as a senior really look upto her incredible journey. Can people please calm down. Especially the tabloid journos. Only ♥️ to Miss N https://t.co/QyrfqOoJWU — Christy (@MalavikaM_) February 12, 2023 -
నయనతారను అవమానించిన హీరోయిన్ మాళవిక
తమిళ సినిమా: నటి నయనతార–మాళవికా మోహన్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందా అన్న సందేహం కలుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల మాళవికా మోహన్ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. నయనతార నటించి, నిర్మించిన కనెక్ట్ చిత్రం గత డిసెంబర్ 22వ తేదీ విడుదలైంది. ఆ సందర్భంలో ఆస్పత్రిలో బెడ్‌పై పడుకున్న సన్నివేశంలోనూ ఫుల్ మేకప్‌తో జుట్టు కూడా చెదరకుండా నటించినట్లు నటి నయనతార పేరు చెప్పకుండా విమర్శించారు. ఆమెకు కౌంటర్ ఇచ్చే విధంగా కనెక్ట్ చిత్రం ఆర్ట్ ఫీలింగ్ కాదని, కమర్షియల్ చిత్రం అని, అందుకే దర్శకుడు అశ్విన్ సూచన మేరకే తాను అలా నటించానని నయన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాళవిక మోహన్ మరోసారి నటి నయనతారను అవమానించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక విలేకరి లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహన్ లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని అన్నారు. హీరోయిన్లను సూపర్‌స్టార్ అంటే చాలని లేడీ సూపర్‌స్టార్ అనడం ఏంటని ప్రశ్నించారు. హిందీలో కూడా దీపికా పడుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్ వంటి సూపర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారని, వారు ఎవరు లేడీ సూపర్‌స్టార్స్ అనడం లేదని పేర్కొన్నారు. దీంతో నయనతారపై ఈ అమ్మడుకి ఎందుకంత కోపం అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ధనుష్ డైరెక్టర్‌తో నయన్ మూవీ?
తమిళ సినిమా: కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిత్రన్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు యారడీ నీ మోహిని, కుట్టి, ఉత్తమ పుత్తిరన్, మీండుమ్ ఆరు కాదల్ క్రైం, మదిల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల ధనుష్ కథానాయకుడిగా తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని తెరకెక్కించారు. నాలుగు చిత్రాలకు ధనుష్‌నే హీరో కావడం గమనార్హం. కాగా తిరుచ్చిట్రం ఫలం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ధనుష్, నిత్యామీనన్ నటన ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. కాగా దర్శకుడు మిత్రన్ జోహార్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇందులో నయనతారను కథానాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇది కథానాయకి నేపథ్యంలో సాగే కథా చిత్రమా? లేక కమర్షియల్ అంశాలతో హీరో ఓరియంటెడ్ కథా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. నయనతార ఇటీవల ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంల్లోనే నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ధనుష్ సరసన యారడీ నీ మోహిని చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. షారుక్ ఖాన్ జంటగా నటించిన హిందీ చిత్రం జవాన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
'నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు'.. నయనతార సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తొలిసారిగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయంపై నేను మాట్లాడను. మన ప్రవర్తనను బట్టి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాను. కేవలం నా టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చొంది. అయితే నయన్ చేసిన ఈ కామెంట్స్‌పై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పడం ఏంటి? మీటూ మూమెంట్స్ జరిగినప్పుడు కూడా సైలెంట్‌గా ఉంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నయనతార భర్త విగ్నేశ్ శివన్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ సినిమా: చిత్ర పరిశ్రమను విచిత్ర పరిశ్రమ అంటారు. ఇక్కడ లక్కు కిక్కు కంటే కూడా మరొకటి ఉంటుంది. అదేంటో దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేష్ శివన్‌ను చూస్తే తెలుస్తుంది. పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్ రౌడీదాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజాగా నటుడు అజిత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. అజిత్ చిత్రం తుణివు ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తదుపరి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. చిత్రం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ వైదొలిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం విగ్నేశ్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, లైకా సంస్థకు సంతృప్తినివ్వక పోవడమేనని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేయాలని సంస్థ చెప్పినా అందుకు విగ్నేష్ శివన్ నిరాకరించినట్లు టాక్. దీంతో నటి నయనతార రంగంలోకి దిగి ఇరువురి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అజిత్ కన్విన్స్ అయినా లైకా ప్రొడక్షన్స్ ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ 62వ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు మిగామన్, తడం, కలగతలైవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విజయ్ కోసం తయారు చేసిన కథను అజిత్‌తో చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. -
'కనెక్ట్' సినిమాకి ఇంటర్వెల్ ఉండదు.. కారణమిదే : డైరెక్టర్
‘‘ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూసే సినిమాలు తెరకెక్కించడానికి ఇష్టపడతాను. గతంలో నేను చేసిన సినిమాలు అలాంటివే. ఇప్పుడు చేసిన ‘కనెక్ట్’ కూడా ఆ తరహా చిత్రమే’’ అన్నారు దర్శకుడు అశ్విన్ శరవణన్. నయనతార కథానాయికగా ‘మయూరి’, తాప్సీ లీడ్ రోల్లో ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు అశ్విన్ శరవణన్. మళ్లీ నయనతార కథానాయికగా ఆయన దర్శకత్వం వహింన తాజా చిత్రం ‘కనెక్ట్’. ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ – ‘‘హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ‘కనెక్ట్’ చిత్రాన్ని రపొందించాను. లాక్డౌన్లో పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్లినవాళ్లు కుటుంబానికి దరంగా అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఓ తల్లీకతురు ఒక ఇంట్లో ఉండిపోతారు. అయితే కొన్ని రోజులకు కూతురు ప్రేతాత్మ ఆవహింనట్లు ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు కూతుర్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది? అనేది కథ. మామూలుగా హాలీవుడ్ చిత్రాలకు ఇంటర్వెల్ ఉండదు. కథ ఒక ఫ్లోలో వెళుతున్నప్పుడు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారని పెట్టరు. మా ‘కనెక్ట్’కి కూడా ఉండదు. ఈ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అదే మూడు గంటల సినిమా అయితే ఇంటర్వెల్ ఇవ్వాల్సి వచ్చేది. ఇక నయనతార మంచి నటి. ఆమె ఈ కథ విని అంతర్జాతీయ స్థాయి సినిమాగా నిర్మిస్తే బాగుంటుందనుకున్నారు. అందుకే తన భర్త విఘ్నేష్‌తో కలిసి నిర్మించారామె’’ అన్నారు. -
ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో హారర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా లాక్డౌన్ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్ ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
దెయ్యంతో నయన్‌కు సంబంధం ఏంటి? 'కనెక్ట్' స్టోరీ లైన్ ఇదే!
తమిళ సినిమా: వరుస సక్సెస్‌లు అందుకుంటున్న అగ్ర నటి నయనతార. మాయ చిత్రంతో ఈమె హర్రర్ కథా చిత్రాల ప్రస్థానం మొదలైంది. తాజాగా కనెక్ట్ చిత్రం ద్వారా ముందుకొస్తోంది. నయన్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించడం విశేషం. వినయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ.. ఇది లాక్డౌన్ కాలంలో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే హర్రర్ సన్నివేశంతో కూడిన చిత్రం కలెక్ట్ అని చెప్పారు. నయనతార ఇంట్లోకి దెయ్యం ఎలా వస్తుంది? దాంతో ఎవరు బాధింపునకు గురవుతారు? చివరికి దాన్ని ఎలా తరిమేస్తారు అన్న ఆసక్తికత విషయాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కథ విన్న తరువాత నయనతారకు నచ్చడంతో చిత్రాన్ని తామే నిర్మిస్తామని చెప్పి విఘ్నేష్ శివన్‌ను కలవమని చెప్పారన్నారు. ఆయనకీ కథ నచ్చడంతో కనెక్ట్ సెట్‌పైకి వెళ్లిందని తెలిపారు. హాలీవుడ్ చిత్రంలా కనెక్ట్ చిత్రం నిడివి 90 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. దీన్ని థీయోటర్లలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో సంప్రదిస్తున్నట్లు అశ్విన్ శరవణన్ తెలిపారు. -
ఆ హీరోతో తొలిసారి కలిసి నటించనున్న నయనతార
తమిళసినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈమె నటిగానే కాకుండా, ప్రేమలోనూ, బ్రేకప్స్‌లోనూ, సహజీవనంలోనూ, పెళ్లి విషయంలోనూ, చివరికి తల్లి కావడంలోనూ సంచలనమే. అసలు వీటన్నింటినీ గమనిస్తే.. నయనతార ముందు పుట్టి ఆ తర్వాత సంచలనం అనే పదం పుట్టిందేమో అనిపిస్తోంది. మొదట్లో గ్లామర్‌తో తన సినీ పయనాన్ని పదిలం చేసుకున్న ఈమె ఆ తర్వాత నటనతో అందలం ఎక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం లేడీ సపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లోనే నటిస్తోంది. మధ్య మధ్యలో హీరోలతోన జతకడుతూ ఆ వర్గం ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన గాడ్ ఫాదర్ ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. కాగా నయనతార సెంట్రిక్ పాత్రలో నటించిన కనెక్ట్, అలాగే జయంరవితో జత కట్టిన ఇరైవన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం తొలి బాలీవుడ్ చిత్రం జవాన్‌లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కథానాయకుడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షటింగ్ తుది దశకు చేరుకుంది. దీంతో ఈమె మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శశికాంత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు వధవన్కు జంటగా నటించడానికి నయనతార ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో నటుడు సిద్ధార్థ్ కూడా ముఖ్య పాత్రను పోషించనున్నట్లు తెలిసింది.. అయితే ఈ చిత్రానికి సంబంధింన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?
స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్‌స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
కవల పిల్లల ఇష్యూ పై స్పందించిన విగ్నేష్ శివన్
-
నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు
తమిళసినిమా: నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవలపిల్లలకు తల్లి అయిన వి షయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నటి నయనతారను వివరణ కోరుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరికి అద్దె తల్లి ద్వారా కవల పిల్లలు జన్మించారు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది -
చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం
తల్లిదండ్రులైన మరుసటి రోజే సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులకు షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన నయన్-విఘ్నేశ్‌లు ఐదు నెలల తిరక్కుండానే తల్లిదండ్రులు అయ్యారు. తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామంటూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్ ఈ సందర్భంగా వారిద్దరు చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయాడు విఘ్నేశ్. దీంతో సరోగసి(అద్దే గర్భం ద్వారా పిల్లలను కనడం) ద్వారానే నయన్-విఘ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నటి కస్తూరి సరోగసి ద్వారా నయన్ తల్లి కావడంపై పరోక్షంగా స్పందించింది. సరోగసీని దేశంలో నిషేధించారని, ఈ ఏడాది దీనిపై ఉత్తర్వులు కూడా వచ్చాయంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి? నటి కస్తూరితోపాటు చాలామంది అదే అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నయన్ దంపతులు వ్యవహరించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే.. నయన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు తల్లిదండ్రులు అయిన తీరుపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందిందించింది. ఈ మేరకు సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అంతేకాదు సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
GOD FATHER Pre Release: అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్
‘‘మీరు(అభిమానులు) నన్ను ‘గాడ్‌ఫాదర్’ అని అంటున్నారు. కానీ, ఏ గాడ్‌ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఈ స్థాయి ఇచ్చిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవి వెనకాల ఏ గాడ్‌ఫాదర్ లేరని అంటుంటారు.. కానీ నేను ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలమంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు.. నా అభిమానులే నా ‘గాడ్‌ఫాదర్స్’’ అని చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం శుభ పరిణామంగా అనిపిస్తోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయానికొస్తే.. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని నేను తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా చేయడానికి ప్రధాన కారణం రామ్‌చరణ్. దర్శకుడు మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. మాపై నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్‌ఫాదర్’ కథ వినకుండా నటించిన సల్మాన్‌ఖాన్‌గారికి థ్యాంక్స్. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడం మా విజయానికి తొలిమెట్టు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాలో భాగస్వాములవడంసంతోషం. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్‌కు అభినందనలు. మా సినిమాకి రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది.. ప్రేక్షకులను అలరిస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను సినిమా చూశాను కాబట్టే ఇంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. కానీ, ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ గౌరవిస్తాం. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్’, గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా విజయం సాధించాలి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. రెండూ ప్రేక్షకులచేత ఆదరించబడినప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయామే, వారిని అసంతృప్తికి గురిచేశామే అనే బాధ ఉంది. దానికి సమాధానం, నాకు ఊరట ఈ ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది.. ఇందుకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్‌బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. -
నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు. తాజాగా ఈ నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్‌లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ View this post on Instagram A post shared by Hanoosh🧿❤Narin🧿 (@hanaz_worldmusic) -
సరికొత్త కాన్సెఫ్ట్‌తో నయనతార కొత్త చిత్రం?
ఎకనామిక్ హిట్‌మ్యాన్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తారు అనేది చాలా మందికి తెలియని రహస్యం. ఇప్పుడు అదే థీమ్‌తో‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలో ఆయన నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కింబోతున్న విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రానికి కాజల్‌ని హీరోయిన్గా అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కాజల్ ప్లేస్‌లో నయనతారను తీసుకున్నారు. ఇప్పటికే దర్శకుడు నయన్‌కు స్టోరీ వినిపించాడట.ఆమెకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (చదవండి: నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..తిరుమలలో వివాహం!) ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ రూమర్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో ఇంతవరకు ఎవరు టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట జయశంకర్. ఎకనామిక్ హిట్‌మ్యాన్ అనే సరికొత్త కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. ఎకనామిక్ హిట్‌మ్యాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఎలా కంట్రోల్ చేస్తారు? వారు ఓ దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా నాశనం చేస్తారనే విషయాన్ని తెరపై చూపించబోతున్నాడట. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నయనతార సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. జయశంకర్ ప్రస్తుతం అనసూయతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఢిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అరి’అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సాయి కుమార్, అక్షపర్దసాని, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..తిరుమలలో వివాహం!
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. పెళ్లి బంధం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే పెళ్లి డేట్, ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. జూన్ 9న, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్, విఘ్నేశ్‌ల వివాహం జరగబోతున్నుట్ల తెలుస్తుంది. ఇందులో భాగంగానే పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకే నయన్, విఘ్నేశ్‌లు శనివారం తిరుమల వచ్చినట్లు సమాచారం. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్ కానీ, విఘ్నేశ్ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్‌కు విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్.. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా విఘ్నేశ్ దర్శకత్వం వహించిన 'కాతు వాకుల రెండు కాదల్' చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. -
షాకింగ్.. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్
Nayanthara And Vignesh Shivan Got Married?: సౌత్ లవ్‌బర్డ్స్ నయనతారా, విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ‘నానూ రౌడీదాన్’ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ లవ్‌బర్డ్స్ లాక్డౌన్లో సీక్రెట్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ రహస్యం చేసుకున్నారు కదా.. మరి పెళ్లెప్పుడు అని అడగ్గా లాక్డౌన్ అనంతరం ఘనంగా చేసుకోవాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. చదవండి: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇక పెళ్లి ఎప్పుడెప్పుడాని ఎదురు చేస్తున్న వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు షాకిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలన్ని చూట్టేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న అభిమానులు తమ కెమెరాల్లో బంధించారు. చదవండి: పర్స్‌లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అలా ఓ ఫ్యాన్ తీసిన వీడియోలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించింది. అది చూసిన నెటిజన్లు నయనతారకు, విఘ్నేశ్‌కు పెళ్లి అయిపోయిందని, అయినా వీరిద్దరు బయటికి చెప్పడం లేదంటూ అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ జంట క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం వీరిద్దరూ కాతువాక్కుల రెండు కాదల్ మూవీతో బిజీగా ఉన్నారు. విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ మూవీలో నయనతారా, సమంతవ, విజయ్ సేతుపతిలో లీడ్‌రోల్ పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝑵𝒂𝒚𝒂𝒏𝒕𝒉𝒂𝒓𝒂 (@nayanthara.kurian) -
ఒకే సెట్లో సల్మాన్, చిరంజీవి
టాలీవుడ్ స్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకే స్టూడియోలోకి అడుగుపెట్టనున్నారు. డైరెక్టర్ స్టార్ట్ అనగానే గెట్.. సెట్.. షూట్ అంటూ నటించడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ శనివారం ముంబయ్‌లో ఆరంభం కానుందని టాక్. కజ్రత్‌లోని ఎన్డీ స్టూడియోలో జరగనున్న ఈ షెడ్యూల్లో చిరంజీవి, సల్మాన్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారని టాక్. దాదాపు వారం పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్. ఇందులో నయనతార కీలక పాత్ర చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?
హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వరనేది పచ్చి నిజం. కానీ ఇప్పడు వారు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. కాగా సినిమా సినిమాకు మన హీరోయిన్లు క్రేజ్ పెరిగిపోతోంది. లేడి ఒరియంటెడ్ పాత్రలకు సైతం సై అంటూ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారి రెమ్మునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండ వారి పారితోషికం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత్రను బట్టి ఆ సినిమా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్ల నుంచి లక్షల వరకు పారితోషికంగా అందుకుంటున్న సౌత్ హీరోయిన్లు ఎవరూ, ఎవరెంత డిమాండ్ చేస్తున్నారు. వారి రెమ్మునరేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. నయనతార: ఒక్కో సినిమాకు ఇప్పటికీ రూ.4 కోట్ల వరకు తీసుకుంటుంది నయన్. ఇప్పటికీ అదే రేంజ్ మెయింటేన్ చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్లో కథానాయికగా చేస్తున్న నయన్ ఈ మూవీకి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. పూజా హెగ్డే: వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ లెగ్ అనిపించుకుంటుంది. దీంతో ఆమెను హీరోయిన్గా మాత్రమే కాకుండా... ఇతర చిత్రాల ఈవెంట్స్‌కు కూడా ముఖ్య అతిథిగా స్వాగతం ఇస్తున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటిస్లూ పూజ రెమ్యునరేషన్‌ను కూడా భారీగా డిమాండ్ చేస్తుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్యలో అడుగుతుందని, ఇక మూవీ ఈవెంట్స్‌కు లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సమంత: పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే యశోద సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనుష్క శెట్టి: అరుంధతి మూవీ రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న స్వీటీ.. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇటిటీవల కమిటైన యూవీ క్రియేషన్స్ సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన్న: ఒక్కో సినిమాకు ఇప్పుడు 2.25 కోట్ల నుంచి రూ. 3 కోట్లవరకు తీసుకుంటుంది రష్మిక. హిందీలో అయితే అంతకంటే ఎక్కువగానే అందుకుంటుందని అంచనా. కీర్తి సురేశ్: సినిమాల విజయాలు, వైఫల్యాలతో సంబంధం లేకుండ కీర్తి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. సాయి పల్లవి: సైలెంట్‌గా సంచలనాలు సృష్టించడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా. ఈ ముద్దుగుమ్మ కూడా ఒక్కో సినిమాకు సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు అందుకుంటుంది. కాజల్ అగర్వాల్: ఎంతమంది కొత్తవాళ్లు వచ్చిన కాజల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కాజల్ రూ. 3 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంది. తమన్నా: ఒకప్పుడు కోట్లలో పారితోషికం తీసుకునే తమన్నా.. కాస్తా తన క్రేజ్ తగ్గడంతో రూ. కోటి నుంచి కోటిన్నరకుపైగా డిమాండ్ చేస్తుందట. స్పెషల్ సాంగ్ అరకోటి నుంచి కోటి వరకు అందుకుంటుంది. టీవీ షోలకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ మిల్కీ బ్యూటీ. రాశీ ఖన్నా: జై లవకుశ వంటి సినిమాలలో నటించిన తర్వాత కూడా రాశీ ఖన్నా రేంజ్ పెరగలేదు. దీంతో ఇప్పుడు సినిమాకు రూ. 60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అంచనా. రకుల్ ప్రీత్ సింగ్: మొన్నటి వరకు కోటికి తగ్గని రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు సినిమాకు 70 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
గుజరాతీ సినీ రంగంలోకి లవ్‌బర్డ్స్ ఎంట్రీ
సాక్షి, చెన్నై: లవ్‌బర్డ్స్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గుజరాతీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరూ నిర్మాతలుగా మారి రౌడీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గుజరాతీ భాషలో చిత్రం నిర్మించడానికి సిద్ధమయ్యారు. తమిళంలో విజయం సాధించిన ఆండవన్ కట్టలై చిత్రాన్ని గుజరాతీ భాషలో రీమేక్ చేస్తున్నారు. దీనికి శుభయాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో గుజరాతీ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మల్హర్ టక్కర్, నటి మొనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. దీనికి ప్రముఖ గుజరాతీ దర్శకుడు మనీష్ సైనీ దర్శకత్వం నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటనను నయనతార, విఘ్నేష్ శివన్ విడుదల చేశారు. ఇకపై గుజరాతీ భాషలోనూ వరుసగా చిత్రాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన కాత్తువాక్కుల రెండు కాదల్ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్!, ఏ మూవీలో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతారా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్ హిట్ టిమిండియా బౌలర్, నటుడు శ్రీశాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాని అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శ్రీశాంత్ మహ్మద్ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతిల లుక్ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ ఈ సినిమాలో శ్రీశాంత్, సమంత సరసన పలు సన్నివేశాల్లో కనిపించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే శ్రీశాంత్ ఓ మూవీతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీనితో పాటు శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటింస్తున్నట్లు తెలుస్తోంది. Controversy’s Child, Cricketer Sreesanth to Star in Samantha Movie.#Sreesanth #Nayanthara #Samantha #SamanthaRuthPrabhu #VijaySethupathi #VigneshShivan #KaathuVaakulaRenduKaadhal #KVRK #MohammedMobi #Cricket https://t.co/ahXn73TOzw — yousaytv (@yousaytv) February 10, 2022 -
మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన నయనతార
Nayanthara Starts New Business With Renitha Rajan: ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లంతా మరోవైపు వ్యాపార రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నయన తారలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ది లిప్‌బామ్ కంపెనీ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్ చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి నయన్ ఈ బ్రాండ్‌ను తాజాగా ప్రారంభించింది. ఈ సందర్భంగా రేణిత రాజన్ మాట్లాడుతూ.. ‘మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ చెప్పుకొచ్చారు. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ కాగా గతంలో కత్రినా కైఫ్ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకోనున్న నయనతార కేరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భర్త డైరెక్షన్లో ఇటీవల నయన్ నటించిన ‘కాత్తువక్కుల రెండు కాదల్’ త్వరలోనే విడుదల కానుంది. అలాగే చిరంజీవి సరసన ‘గాడ్ ఫాదర్’లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ నయన్ సంతకం చేసింది. -
నయన తార కొత్త ఇల్లు కొనుగోలు.. ఎక్కడో తెలుసా ?
Nayantara Buys A New House At Poes Garden In Chennai: నయనతార.. ఈ స్టార్ హీరోయిన్ అందం, అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే. పుట్టింది కేరళలోని తిరువల్ల అయిన తెలుగు అమ్మాయికి ఏమాత్రం తీసిపోదు. లక్ష్మీ, తులసి, యోగి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నయన్ తాజాగా చెన్నైలోని పొయెస్ గార్డెన్లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త ఇంటికి మారనుందని ప్రచారం జరుగుతోంది. నయన్ కొత్త ఇళ్లు తీసుకున్న పొయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. చెన్నైలోని పొయెస్ గార్డెన్లో భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందట. సుమారు అక్కడ ఫ్లాట్స్ కోట్లలో ఉండొచ్చని సమాచారం. నయనతార ఇటీవలే 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా సెట్లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో పుట్టిన రోజు జరుపుకుంది. వివిధ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న నయన్. ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పింది నయన తార. -
నయన్‌కు సామ్ బర్త్‌డే విషెస్, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్
Samantha Wishes Her Co-Star Nayantara On Her Birthday: లేడీ సూపర్‌స్టార్ అంటూ ఫ్యాన్స్‌తో నీరాజనాలు అందుకుంటున్న స్టార్ హీరోయిన్ నయనతార ఈ రోజు (నవంబరు18) 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, సహా నటీనటులు నయన్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమె ప్రియుడు కాబోయే భర్త , దర్శకుడు విఘ్నేష్ శివన్ నయన్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. స్పెషల్ పార్టీతో తన లేడీ లవ్‌ను సర్ప్రైజ్ చేశాడు. చదవండి: VikkyNayan: విక్కీ సర్ప్రైజ్, బర్త్‌డే బ్యాష్ మామూలుగా లేదుగా ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి నుంచి చెన్నైలో నయన్ పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. అర్థరాత్రి నయన్‌తో కేక్ కట్ చేయించి బాణాసంచాలు పేలుస్తూ నానా హడావుడి చేశాడు విఘ్నేశ్. ఇదిలా ఉంటే కాబోయే భర్త డైరెక్షన్లో నయన్ ‘కాతువాకుల రెండు కాదల్’ అనే తమిళ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలు కూడా లీడ్‌రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ సెట్లో కూడా నయనతార బర్త్‌డే సెలబ్రెషన్స్ జరిగాయి. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్.. సమంత, విఘ్నేశ్ సమక్షంలో నయన్ కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇందులో నయన్‌కు టైట్ హగ్ ఇస్తూ దిగింది సమంత. ఈ ఫొటోలను పంచుకుంటూ సామ్ తన పోస్ట్‌లో నయన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఆమె చాలా ధైర్యవంతురాలని అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించింది. అంతేగాక ఆసక్తికర రీతిలో నయన్ గురించి క్యాప్షన్ ఇస్తూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా నయన్ ఆమె క్వీన్ అని పిలిచింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతోన్న సామ్!
Samantha New Conditions To Directors: విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పటికి తన కెరీర్‌ను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు సామ్. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సామ్ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయన తారను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలు, షూటింగ్‌ల విషయంలో దర్శకులకు కొత్త నిబంధనలు పెడుతోందట. వాటికి సరే అంటేనే సినిమా సైన్ చేస్తోందట. చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి ఇక సమంత కండీషన్స్ కూడా అంత ఇబ్బందికరంగా లేకపోవడంతో దర్శక-నిర్మాతలు కూడా ఒకే అంటున్నారట. తాను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్స్ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్స్ పెడుతోందట సామ్. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్ అయితే ఇండోర్ మాత్రమే పెట్టాలని కొరుతుందట. ఏం చేసిన ఇండోర్ షూట్స్ పెట్టమని చెబుతున్నట్లు సమాచారం. ఇక పబ్లిక్‌లో షూటింగ్ అయితే అసలు వద్దని చెబుతోందట. తన కండీషన్స్‌కు ఓకే చెప్తేనే సినిమాలకు సైన్ చేస్తోందట లేదంటే నో చెబుతోందని వినికిడి. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేయడానికి సమంత పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇంకా కొంతకాలం తను చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: రాజీనామాలపై అప్పుడే ఆలోచిస్తా: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇదిలా ఉంటే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోతున్న ఓ మూవీ కోసం ఆయన సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి తాను సైన్ చేసేందుకు పైన పేర్కొన్న కండిషన్స్ పెట్టిందట సమంత. అలాగే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం సామ్ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. హరి, హరీశ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందట. కాగా కేవలం ఇండోర్ షూటింగ్స్‌కే నయన్ ఆసక్తి చూపుతోందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే సినిమా ప్రమోషన్స్‌కు కానీ, ఇతర ఈవెంట్స్‌కు నయన్ హజరయ్యేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామ్ కూడా నయనతార తరహాలోనే కండిషన్స్ పెడుతోందంటూ సినీ వర్గాలు చర్చించకుంటున్నాయి. -
అక్టోబర్‌లో ఆరడుగుల బుల్లెట్..
గోపీచంద్, నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలాజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మింన ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్స్. త్వరలోనే ప్రవెషన్స్ను స్టార్ట్ చేయబోతున్నామని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అభిమన్యు సిన్హా తదితరులు నటించారు. -
పెళ్లి తర్వాత కూడా నయన్ నటిస్తుందా?, హీరోయిన్ స్పందన
లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలో ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నయన్ పెళ్లి అనంతరం నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఫిలిం దూనియాలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది నయన్. కాగా ఈ మధ్య గ్లామర్ రోల్లు పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర నటిగా నయన్ గుర్తింపు పొందింది. చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! అయితే విఘ్నేశ్‌తో వివాహనంతరం ఆమె నటిస్తారా లేదా అనే దానిపై ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తను నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పెళ్లి తర్వాత తన సినీ కేరీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని స్పష్టం చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం నయనతార చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హిందీలో షారుక్ ఖాన్‌తో ‘అట్లీ’, ప్రియుడు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాతువాకుల రెండు ఖాదల్’ మూవీలో నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తున్నారు. కాగా లాక్డౌన్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ డిసెంబర్లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. -
సెట్స్‌పైకి అట్లీ-షారుక్ మూవీ, షూటింగ్లో పాల్గొన్న నయన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఈ మూవీ సెట్స్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా పూణేలో జరిగే షూటింగ్ కోసం శుక్రవారం నయతార, ప్రియమణిలు పమయనమైనట్లు సమాచారం. పుణే ఎయిర్పోర్ట్ నుంచి వారిద్దరూ బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమించాయి. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఈ మూవీలో షారుక్ డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. నయనతార, ప్రియమణిలు కథానాయికలు. ఇదిలా ఉండగా గతంలో ప్రియమణి, షారుక్‌తో చెన్నై ఎక్స్ప్రస్లో స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నయనతారకు మాత్రం బాలీవుడ్లో ఇది తొలి చిత్రం. ఈ మూవీతో డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. -
చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్ ‘లూసిఫర్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం చిరు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖారారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను ప్రారంభించాడు. చదవండి: Nayantara: సత్యదేవ్‌కు భార్యగా నయనతార ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపించగా దీనిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో సల్మాన్ గాడ్ ఫాదర్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. సల్మాన్ తన డెట్స్ సర్దుబాటు చేసి ‘గాడ్ ఫాదర్’ మూవీకి తన షెడ్యూల్ కెటాయించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చెందిన స్టార్ నటీనటులు కూడా భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ను మేకర్స్ సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట. చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా! అయితే తెలుగులో నటించడానికి సల్మాన్ ఆసక్తిగా లేడని, ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లనేనని, ఈ చిరంజీవి సినిమా ఆఫర్ అనగానే సల్మాన్ హ్యాపీగా ఫీల్ అయినట్లు ఆయన సన్నిహితులు నుంచి సమాచారం. కాగా తమిళంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించనున్నాడట. మరి దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. అయితే ఇందులో చిరుకు సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నయన్, సత్యదేవ్‌లు భార్యభర్తలుగా కనిపించనున్నారట. చదవండి: Allu Arjun: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..! -
ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. ఇందులో సమంత, విజయ్ సేతుపతి, నయనతారలు లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పుదుచ్చేరిలో షూటింగ్జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో బస్సులో చిత్రీకరించిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంతలు బస్సులో ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ఉన్నారు. అయితే ఈ సీన్ చూస్తుంటే అచ్చం అమలా, కమల్ హాసన్ జంటగా గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సత్యా మూవీలోని ‘వలై ఓసై’ పాట సీన్‌ను తలపిస్తుంది. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇందులో కమల్ హాసన్ లాగే విజయ్ సేతుపతి వైట్ షర్ట్, టైతో నల్ల ప్యాంటు ధరించి ఉండగా.. పక్కనే సమంత, నయన్‌లు అమలా మాదిరిగా తెల్ల చీర కట్టుకుని ఉన్నారు. కాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐ.ఎఫ్.ఎఫ్.ఎం) 2021 గాను సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఎఫ్ఎఫ్ఎం 2021 ఈ అవార్డ్స్‌కు ఎన్నికైన నటీనటుల జాబితాను ఇటీవల ప్రకటించింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్-2’కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సమంత ఈ ఆవార్డును అందుకోనుంది. చదవండి: IFFM: రాజీ నటనకు దిగొచ్చిన అవార్డు.. ఉత్తమ నటిగా సమంత Kaathuvaakula Rendu Kaadhal shoot. Vignesh Shivan aa nambalamaa? pic.twitter.com/DUtgvgyBwZ — Selva (@seldicap17) August 23, 2021 -
సత్యదేవ్ భార్యగా నయనతార
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్ ‘లూసిఫర్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అయితే ఇందులో మెగాస్టార్ సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్లో వివెక్ ఒబెరాయ్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేస్తున్నాడు. చదవండి: పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్ ఇదిలా ఉంటే ఈ మూవీలో సత్యదేవ్‌కు నయనతార భార్యగా కనిపించనుందట. ఈ పాత్రకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సోలో హీరోగా సక్సెస్ రూట్లోకి వచ్చిన సత్యదేవ్ కెరీర్‌కు ఈ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చెందిన స్టార్ నటీనటులు ఈ మూవీలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా.. తమిళంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌లో గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్! -
పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ టీవీ షోకు హజరైన నయన్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వెల్లడించింది. లాక్డౌన్లో కొద్దిమంది కుటుంబ సభ్యులు మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలిపింది. అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు స్పష్టం చేసింది. అయితే నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.. కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా అందరి సమక్షంలో చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా అందరిని ఆహ్వానిస్తానని పేర్కొంది. విఘ్నేశ్‌శివన్ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత కెరీర్ మరింత ఊపందుకుందని, అతని ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నత లక్ష్యాల్ని ఎంచుకున్నానని పేర్కొంది. కాగా 2015లో ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా సమయంలో నయన్, విఘ్నేశ్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విహారయాత్రలు ప్లాన్ చేస్తూ పనిలో పనిగా పలు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీళ్లిద్దరూ మొత్తానికి ఒకింటివారవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా వుంటే విఘ్నేశ్ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ లో నయనతార
ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్‌లను మ్యానేజ్ చేస్తూ కెరీర్లో మరో లెవల్‌కు వెళ్తున్న హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రుతీహాసన్, రాశీ ఖన్నాల జాబితాలో హీరోయిన్ నయనతార కూడా చేరారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించనున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేసేందుకు నయనతార పచ్చ జెండా ఊపారని తెలిసింది. ఆమెకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్. సో.. డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో నయనతార తొలి అడుగు వేస్తున్నారన్న మాట. రెండు సీజన్స్‌గా రాబోతున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబరులో ఆరంభం కానుంది. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఈ పాత్ర పూర్వాపరాల మీద వెబ్ సిరీస్ ఉంటుందని టాక్. 2015లో వచ్చిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన పంజాబీ నటి వామికా గబ్చి ఈ శివగామి పాత్ర చేయనున్నారని సమాచారం. అదే నిజమైతే నయనతార పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక నయనతార నటించిన తాజా చిత్రాలు ‘అన్నాత్తే’, ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’, ‘నెట్రిక్కన్’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. -
అన్నయ్యా.. దీపావళికి రెడీయా!
రజనీకాంత్ అభిమానులకు గురువారం సన్ పిక్చర్స్ ఓ తీపి వార్త అందించింది. ‘అన్నాత్తే.. దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అన్నాత్తే’. ఇటీవల వైద్య పరీక్షల కోసం రజనీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లక ముందే ఆయన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. దాంతో కరోనా లాక్డౌన్లాంటివి ఏమీ లేకపోతే ముందు అనుకున్నట్లుగానే చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని సూచించే విధంగానే గురువారం ట్వీట్ చేశారు. సో.. పండగకి రజనీ సినిమా వస్తే ఆయన అభిమానులకు పండగే పండగ. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గ్రామ పెద్ద పాత్రలో కనిపిస్తారు. -
నయనతార బాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..
ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్. ఈ ప్రక్రియలో భాగంగానే తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజా– రాణి’ (2013), ‘బిగిల్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరును పరిశీలిస్తున్నారట అట్లీ. ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. మరి.. షారుక్‌తో నయనతార జోడీ కడతారా? హిందీ సినిమాకు నయనతార సైన్ చేస్తారా? వేచి చూడాల్సిందే. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
నిశ్చితార్థం చేసుకున్న నయనతార!
కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి తలంబ్రాలు పోసుకునేందుకు రెడీగా ఉన్నారట. ఈమేరకు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయన్ ప్రియుడు షేర్ చేసిన ఫొటోనే ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. కాగా విఘ్నేశ్ శివన్ గురువారం ఉదయం ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో నయనతార చేయి అతడి గుండెల మీద ఉండగా ఆమె వేలికి ఉంగరం తొడిగి ఉంది. ఇది చూసిన అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ ప్రేమ పక్షులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ కామెంట్లతో ఊదరగొడుతున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతోంది. కాగా 2015లో 'నానుమ్ రౌడీదాన్' సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విహారయాత్రలు ప్లాన్ చేస్తూ పనిలో పనిగా పలు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీళ్లిద్దరూ మొత్తానికి ఒకింటివారవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి వీరిద్దరూ నిజంగానే ఏడడుగులు వేస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా వుంటే విఘ్నేశ్ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) చదవండి: ప్రియుడి బర్త్‌డే: నయన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? -
అన్నయ్య రెడీ
‘అన్నాత్తే’ తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అన్నాత్తే’. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తీ సురేష్, నయనతార నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ చిత్రబృందంలో కొందరు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక, విశ్రాంతిలో ఉన్న రజనీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారట. మార్చి 15న చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే రజనీకాంత్ కూడా పాల్గొంటారట. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమైందని...ఆర్టిస్టుల కాల్షీట్స్ ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్‌ను తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట శివ. నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది. -
పండగ తర్వాత బిజీ
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్’ రీమేక్ పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
విలన్ వైఫ్?
మలయాళ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో నయనతార స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ‘సైరా’లో చిరు భార్యగా నయన నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవికి జోడీగా కాదు.. విలన్ పాత్రకు వైఫ్‌గా కనిపించనున్నారట నయనతార. అలానే యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే సత్యదేవ్‌ది విలన్ పాత్ర కాదట. మరి.. విలన్‌గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నీడ వీడారు
కుంచక్కో బొబన్, నయనతార ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నిళల్’. ‘నిళల్’ అంటే నీడ అని అర్థం. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇందులో నయనతార పాత్ర ఫుల్ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలిసింది. ఈ సినిమాలో మిస్టరీను కనుగొనే పాత్రలో నయన కనిపిస్తారట. కేరళలోని కొచ్చి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. నాన్‌స్టాప్‌గా నలభై ఐదు రోజుల చిత్రీకరణతో ఈ సినిమాను ముగించారు. ‘‘సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పాత్రకు లేడీ సూపర్‌స్టార్ నయనతారే కరెక్ట్ అని చిత్రబృందం భావించాం. అనుకున్నట్టుగానే నయనతార తన పాత్రకు న్యాయం చేశారు’’ అన్నారు దర్శకుడు అప్పు ఎన్. బట్టాతిరి. -
నీడలో నయనతార
నయనతార లేడీ సూపర్ స్టార్. వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. కానీ నయనతార నీడలో ఉండిపోబోతున్నారట. అయితే ఇదంతా సినిమా కోసమే. నయనతార తాజాగా మలయాళంలో ఓ సినిమా కమిటయ్యారు. ‘నిళల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మలయాళ థ్రిల్లర్‌లో హీరోయిన్గా నటించనున్నారామె. కున్చాచ్కో బోబన్ హీరోగా కనిపిస్తారు. అప్పు యన్. బట్టాత్తిరి దర్శకత్వం వహిస్తారు. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలన్నీ కోవిడ్ వల్ల బ్రేక్‌లో ఉన్నాయి. తక్కువ మంది యూనిట్ సభ్యులు, తక్కువ రోజుల్లో ‘నిళల్’ సినిమా చిత్రీకరణ ను ప్లాన్ చేశారు. సినిమా పూర్తయ్యే వరకూ ఏకథాటిగా షూటింగ్ జరగనుందని తెలిసింది. నయనతార పోషించే పాత్ర సినిమాకు చాలా కీలకమని, నయనతారే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని చిత్రబృందం తెలిపింది. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
హాలిడే ఇన్ గోవా
వీలున్నప్పుడల్లా వెకేషన్‌కు వెళ్లడం లవ్‌బర్డ్స్ విఘ్నేష్ శివన్, నయనతారకు అలవాటు. కోవిడ్ వల్ల కొన్ని నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సింది వచ్చింది. మొన్నే ఓనమ్ పండగకు నయనతార సొంతూరు కొచ్చిన్‌కి వెళ్లారు. నయనతో పాటు విఘ్నేష్ కూడా కొచ్చిలో పండగ జరుపుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. గోవాలో హాలిడే చేసుకుంటున్న ఫోటోలను విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ హాలిడేలో విఘ్నేష్ తల్లి కూడా జాయిన్ అయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార నటిస్తున్న ‘నెట్రికన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు విఘ్నేష్. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కాదువాక్కుల రెండు కాదల్’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు నయనతార. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నయనతార పచ్చబొట్టు మారింది
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, కొరియోగ్రాఫర్, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవాల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. అయితే వీరు గాఢంగా ప్రేమించుకుంటున్న సమయంలో నయన్ అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రభుదేవా పేరుని సగం ఇంగ్లీషులో, మిగతా సగం తమిళంలో వేయించుకుంది. అయితే తర్వాత ఏమైందో కారీ ఈ ప్రేమపక్షులు విడిపోయారు. కానీ ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే నయన్ తాజాగా షేర్ చేసిన ఫొటో ద్వారా టాటూను మార్చివేసినట్లు తెలుస్తోంది. ప్రభుదేవాని కాస్తా రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చింది. (మళ్లీ ఒంటరైన నయన) నయన్ తీసుకున్న అభిప్రాయం సరైనదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో శింబుతో, తర్వాత ప్రభుదేవాతో.. ఇలా రెండుసార్లు ప్రేమ బెడిసికొట్టడంతో నయన్ మానసిక వేదనకు గురైంది. అనంతరం దాని నుంచి కోలుకుని సినిమాలపై దష్టి పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2015 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లులో ప్రేమలో విఫలమైన నయన్ ఈసారైనాపెళ్లివరకు వెళుతుందో లేదో చూడాలి. (నయన్ విషయంలోనూ అలాగే జరగనుందా?) View this post on Instagram us ❤️ #vn💍#santorini A post shared by nayanthara🔵 (@nayantharaaa) on Jun 10, 2019 at 7:21am PDT -
అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ..
సినిమా: మీకు అలా అర్థమైందా? అని అడుగుతున్నారు నటి సమంత. ఈ బ్యూటీ సమంత అక్కినేని అయిన తరువాత హైదరాబాద్‌లో సెటిల్ అవడంతో పాటు తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ప్రస్తుతం కమర్శియల్ కథా చిత్రాలకంటే మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అలా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సూపర్‌డీలక్స్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో చిత్రం చేయలేదు. త్వరలో ఒక క్రేజీ చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి విఘ్నేశ్ శివన్ దర్శత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల తెలుగులో సమంత నటించిన తాజా చిత్రం ‘జాను’. ఇది తమిళంలో సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రానికి రీమేక్. కాగా జాను చిత్ర ప్రచారంలో భాగంగా సమంత మాట్లాడుతూ.. మరో రెండు మూడేళ్లలో నటనకు గుడ్‌బై చెబుతానని అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారం మితి మీరడంతో సమంత స్పందిస్తూ.. ‘ఓహో నేను చెప్పింది మీకు అలా అర్థం అయ్యిందా?’ అని ప్రశ్నించారు. నిజానికి తాను 3 ఏళ్ల తరువాత సినిమాకు గుడ్‌బై చెబుతానని చెప్పలేదన్నారు. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని సినిమా ప్రపంచం సవాల్‌తో కూడుకున్నదని అన్నట్టు చెప్పారు. ఇక్కడ నటీమణులు ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అని చెప్పానన్నారు. అలా అవకాశాలు లేక తాను నటించలేకపోయినా, ఏదోవిధంగా సినిమాలోనే కొనసాగుతానని చెప్పానన్నారు. నటనకు కొంచెం గ్యాప్ రావచ్చునని, దీంతో సినిమాకు దూరం అవుతానని ఎవరూ భావించాల్సిన అవసరం లేదంటూ.. తన గురించి వైరల్ అవుతున్న అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ ఇచ్చారు. స్నేహితులతో కలిసి పేద విద్యార్దుల కోసం ఒక పాఠశాలను కూడా సమంత కట్టిస్తున్నట్టు సమాచారం.