మలయాళ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో నయనతార స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ‘సైరా’లో చిరు భార్యగా నయన నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవికి జోడీగా కాదు.. విలన్ పాత్రకు వైఫ్‌గా కనిపించనున్నారట నయనతార. అలానే యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే సత్యదేవ్‌ది విలన్ పాత్ర కాదట. మరి.. విలన్‌గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment