Telugu remake
-
తెలుగు ప్రేక్షకులకు దండం పెట్టాలి: సుప్రియ
‘‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన తెలుగువాళ్లే. మంచి సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. అందుకే మన ప్రేక్షకులకి దండం పెట్టాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో, అతిథిగా రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’గా అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలు చేశారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ చెప్పిన విశేషాలు. ► ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ సినిమాని అనువదించడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వందకు పైగా వాయిస్‌లు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి వాయిస్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు డబ్ చేశాం. ‘బాయ్స్ హాస్టల్’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్లు సినిమాలను చాలా చక్కగా చేస్తున్నారు.. అందుకే వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ► వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘మనం’ సినిమా షూటింగ్ మరో పది రోజులు ఉందనగా తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు చేశారు. ‘మనం’ ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలనుకున్నపుడు ఎంతో ఒత్తిడి ఉండేది. రోజుకు 22 గంటలు పని చేశాం. అయితే ఆ టైమ్‌లో ఎవరితోనూ తిట్టించుకోవడం గొప్ప విషయం (నవ్వుతూ). తాతగారు ఇప్పటికీ నెలకోసారి కలలోకి వచ్చి నన్ను తిడుతుంటారు (నవ్వుతూ). ► నాగార్జునగారి కంటే మంచి నిర్మాత ఎవరూ లేరు. ఆయన యాక్టర్ అవ్వడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ప్రారంభమైన కొత్తల్లో కరెంటు బిల్లు కూడా కట్టేంత ఆదాయం వచ్చేది కాదు. తాత, అమ్మమ్మ (ఏఎన్ఆర్–అన్నపూర్ణ) బాధ పడేవారు. ఇప్పుడు ఈ స్టూడియో ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జునగారి కృషి ఉంది. నాకు యాక్టింగ్ వస్తుందా? రాదా అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ). ‘గూఢచారి 2’లో నా పాత్ర ఉంటే నటిస్తాను. మా బ్యానర్లో నాగచైతన్య, అఖిల్‌లతో ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. -
అందుకే అందరూ కనెక్ట్ అవుతారు
‘‘బాయ్స్ హాస్టల్’ కథకు యూనివర్సల్ అప్పీల్ ఉంది. ప్రపంచంలో హాస్టల్స్ అన్ని చోట్ల ఉన్నాయి. అందుకే ఇందులోని పాత్రల్ని అందరూ రిలేట్ చేసుకుంటారు. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ నెల 12న కన్నడలో విడుదలైన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నితిన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బాయ్స్ హాస్టల్’ నా తొలి చిత్రం. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి చక్కని మ్యూజిక్ చేశారు. తెలుగు నేటివిటీ కోసం రష్మి, తరుణ్ భాస్కర్గారి పాత్రల్ని రీ షూట్ చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ లాంటి సంస్థల ద్వారా తెలుగులోకి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా రవితేజ.. ఆ హిట్ సినిమానే టార్గెట్
హీరో రవితేజ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. అజయ్‌దేవగన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ‘రైడ్’ (2018) సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. నిజాయితీ గల ఓ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ అమీ పట్నాయక్ (అజయ్ దేవగన్) తనకు ఎదురైన సవాళ్లను ఏ విధంగా సాల్వ్ చేశాడన్నదే ‘రైడ్’ కథాంశం. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందంటూ వార్తలు వచ్చాయి. కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా మరోసారి ‘రైడ్’ రీమేక్ ప్రస్తావన టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తారని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్. మరి.. ‘రైడ్’ రీమేక్‌లో రవితేజ నటిస్తారా? లేదా? తెలియాలంటే వేచి చూడాలి. -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
జోరు మీదున్న హీరోలు, రీమేక్ అంటే మరింత హుషారు
ఒక భాషలో హిట్టయిన సినిమా వేరే భాషలవాళ్లకు నచ్చుతుందా? ఆ సినిమా కథ కనెక్ట్ అయితే నచ్చుతుంది.. అలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలతో కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో అలాంటి కథలపై కొందరు స్టార్స్ ఓ చూపు చూశారు. ఆ కథలను రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి మంచి జోరు మీద ఉన్నారు. నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చేసి, డైరీని ఫుల్ చేసేశారు. ఈ నాలుగైదు చిత్రాల్లో ఇప్పటికే రెండు రీమేక్స్ సెట్స్ మీద ఉండటం విశేషం. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, దర్శకుడు పూరి జగన్నాథ్, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘బోళా శంకర్’. ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’కు రీమేక్ అని తెలిసింది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. అలాగే మలయాళంలో మరో హిట్‌గా నిలిచిన ‘బ్రో డాడీ’ చిత్రంలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు చేశారు వెంకటేశ్. ఈ మధ్య రెండు రీమేక్స్‌లో నటించారాయన. ధనుష్ తమిళ హిట్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’, మోహన్‌లాల్ మలయాళం హిట్ ‘దృశ్యం 2’ రీమేక్ ‘దృశ్యం 2’లో నటించారు వెంకటేశ్. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఇదే టైమ్‌లో వెంకీ డిజిటల్ ఎంట్రీ కూడా ఖరారైంది. ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో వెంకీతో పాటు రానా మరో ప్రధాన పాత్రధారి. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకులు. అమెరికన్ పాపులర్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’కు ఈ ‘రానా నాయుడు’ అడాప్షన్ అన్న మాట. అంటే ఆల్మోస్ట్ రీమేక్ అనుకోవాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఓ హీరోగా ఉన్న రానా దీనికంటే ముందు ‘భీమ్లానాయక్’ చిత్రంలో నటించారు. ఇది మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు తెలుగు రీమేక్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ హీరోగా నటించారు. అయితే పవన్ కల్యాణ్ మరో రీమేక్‌లో నటించనున్నారని సమాచారం. తమిళ హిట్ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అలాగే తమిళ హిట్ విజయ్ ‘తేరి’ తెలుగు రీమేక్‌లోనూ పవన్ కనిపిస్తారని, ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘కర్ణన్’ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ కీ రోల్ చేస్తున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రాల్లో ‘గుర్తుందా.. శీతాకాలం’ ఒకటి. ఇది కన్నడ సినిమా ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక తమిళ హిట్ ‘ఓ మై కడవులే..’ రీమేక్ ‘ఓరి దేవుడా..’లో విశ్వక్ సేన్, మలయాళ ఫిల్మ్ ‘కప్పెలా’ రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో సిద్ధు జొన్నలగడ్డ (‘డీజే టిల్లు’ ఫేమ్), మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్ ‘బటర్ ఫ్లై’లో అనుపమా పరమేశ్వరన్, మలయాళ ‘నాయట్టు’ రీమేక్‌లో అంజలి, ‘మిడ్నైట్ రన్నర్స్’ రీమేక్‌లో నివేదా, రెజీనా.. ఇలా... మరికొందరు నటీనటులు రీమేక్స్ వైపు ఓ చూపు చూశారు. హిందీ ‘బదాయీ దో’, ‘దేదే ప్యార్ దే’, తమిళ ‘విక్రమ్ వేదా’, మలయాళ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, సౌత్ కొరియన్ ‘లక్కీ కీ’ వంటి చిత్రాలూ తెలుగులో రీమేక్ కానున్నాయి. చదవండి: విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్.. క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్ -
ఆ నిర్మాతకు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్..
Udumbu Telugu Remake Rights Went To Producer Gangapatnam Sridhar: మలయాళంలో మంచి హిట్ సాధించిన చిత్రం "ఉడుంబు". ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. నిర్మాత శ్రీధర్ ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో "చిత్రాంగద", సుమంత్ తో 'ఇదం జగత్" ఛార్మితో మంత్ర-మంగళ" వంటి పలు చిత్రాలతోపాటు.. సుకుమార్ "కుమారి 21ఎఫ్" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సాధించారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో "శివగామి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఉడుంబు" చిత్రాన్ని మలయాళంలో కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన "ఉడుంబు" మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. పలు అగ్రనిర్మాణ సంస్థలు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువ ప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ "ఉడుంబు" మూవీని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా.. తమిళలంలో ఓ సీనియర్ హీరోయిన్ తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. -
మండేలా తెలుగు రీమేక్: హీరోగా సునీల్?
ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం తెలిసిందే. తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మండేలా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యోగిబాబు హీరోగా మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, మంచి హిట్ అయింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను అనిల్ సుంకర దక్కించుకున్నారు. తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. తెలుగు రీమేక్‌లో హీరోగా సునీల్ నటించనున్నారని టాక్. మరి.. మండేలాగా సునీల్ కనిపిస్తారా? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది త్వరలోనే తెలుస్తుంది. -
స్పీడు పెంచిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు. -
దృశ్యం-2 రిలీజ్ డేట్ ఫిక్స్?
అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. -
'లూసిఫర్' రీమేక్ టైటిల్ ఫిక్సయినట్లేనా?
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ లూసిఫర్ తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మోహన్‌లాల్ పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ కుదిరిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం ఈ రీమేక్ సినిమాకు రారాజు అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారట.తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మాతృకలో పెద్దగా సాంగ్స్ లేకపోయినప్పటికీ తెలుగులో మాత్రం చిరు ఇమేజ్‌కు తగ్గట్లు పాటలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ మార్పుచేర్పులు సినిమాకు ఎంతమేరకు ప్లస్ అవుతాయో చూడాలి. ఈ సినిమాను ఎస్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిరంజీవి సినిమాకు కూడా టైటిల్ ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నందున దీనికి వీరయ్య అనే పేరును ఫిక్స్ చేసినట్లు వినికిడి. చదవండి: పల్లెటూరి వీరయ్యగా మెగాస్టార్? -
"దృశ్యం 2" రీమేక్ షురూ
‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ చిత్రానికి సిద్ధం అయ్యారు వెంకటేశ్. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ (2013). ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. మలయాళ ‘దృశ్యం’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు వెంకటేశ్. సీక్వెల్లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే. మలయాళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. -
డాన్స్ రాజా
ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య పాత్రల్లో వెంకీ ఎ.ఎల్. దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’గా తెలుగులో విడుదల కానుంది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రచయిత చిన్నికృష్ణ విడుదల చేసి, ‘‘నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తమిళ ప్రేక్షకులను డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. భారతీబాబు మాటలు–పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిన్నికృష్ణ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ట్రైలర్ విడుదలలో ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు. -
నారప్ప పూర్తప్ప!
నారప్ప ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మే 14వరకూ ఆగాల్సిందే. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్.థాను, సురేశ్ బాబు నిర్మించారు. ప్రియమణి కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మే 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు వెంకటేశ్. మణిశర్మ సంగీత దర్శకుడు. -
మరో కొరియన్ రీమేక్
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
పండగ తర్వాత బిజీ
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్’ రీమేక్ పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
విలన్ వైఫ్?
మలయాళ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో నయనతార స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ‘సైరా’లో చిరు భార్యగా నయన నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవికి జోడీగా కాదు.. విలన్ పాత్రకు వైఫ్‌గా కనిపించనున్నారట నయనతార. అలానే యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే సత్యదేవ్‌ది విలన్ పాత్ర కాదట. మరి.. విలన్‌గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కుడి ఎడమైతే...
వెబ్ సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా సిరీస్‌లలో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పచ్చజెండా ఊపుతున్నారు. ఆల్రెడీ అమలా పాల్ ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన హిందీ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ స్ట్రీమింగ్కి రెడీ అవుతోంది. తాజాగా ‘కుడి ఎడమైతే’ పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారట. పవన్ కుమార్ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ ఈ సిరీస్‌ని నిర్మించనుందని టాక్. థ్రిల్లర్ కథాంశంతో ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ సాగుతుందని తెలిసింది. -
హిట్లర్ టు లూసిఫర్
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్‌కి నిర్మాత. చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కి వెళతాం. ఏప్రిల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్‌తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్. -
నాన్‌స్టాప్ నారప్ప
వికారాబాద్ అడవుల్లోకి ఎంటరయ్యారు నారప్ప. నెక్ట్స్ పదిహేను రోజులు అక్కడే మకాం అని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభం అయింది. పదిహేను రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయా లనుకుంటున్నారు. -
జోడీ లేదు
సినిమా అంటే హీరో, హీరోయిన్ పక్కా. అదో లెక్క. కానీ కథను బట్టి ఈ లెక్కల్ని మార్చొచ్చు. కథ అడిగినప్పుడు హీరో లేకుండా లేదా హీరోయిన్ లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా చిరంజీవి కూడా హీరోయిన్ లేకుండా సినిమా చేయబోతున్నారని తెలిసింది. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘లూసీఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్‌లో హీరోగా చేయనున్నారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ‘లూసీఫర్’ సినిమాలో మోహన్లాల్కి జోడీగా హీరోయిన్ పాత్ర ఉండదు. అయితే తెలుగు రీమేక్‌లో పలు మార్పులు చేశారని, హీరోయిన్ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ లేకుండానే ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మల్టీస్టారర్
తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుతో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారాయన. గత ఏడాది మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేశారు. ఇప్పుడు అన్న సురేశ్‌బాబు కొడుకు రానాతో సినిమా చేయనున్నారని టాక్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ అని, తెలుగుకి అనుగుణంగా కథని మార్చి, పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్–అబ్బాయ్ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. కాగా క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ..’ పాటలో రానాతో కలసి వెంకటేశ్ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సినిమాలో ఇద్దరూ కనిపిస్తే సందడి డబుల్ అనొచ్చు. రియాలిటీ షోలో.. మల్టీస్టారర్ సినిమా కంటే ముందు వెంకటేశ్–రానా ఓ రియాలిటీ షో చేయనున్నట్లు టాక్. ఇటీవల రానా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. దానికోసం ఈ ఇద్దరూ ఓ షో చేయనున్నారట. అలాగే ఓ ఎంటర్టైన్మెంట్ చానల్ వీరి కాంబినేషన్లో ఓ రియాలిటీ షోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
రేడియో మాధవ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్’. జయరామ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, ‘నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు. ‘ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు శ్రీ విష్ణుగారికి కృతజ్ఞతలు. గతంలో దుల్కర్ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశాం. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్’ని అందిస్తున్నాం. రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది’ అన్నారు కృష్ణస్వామి. ‘థియేటర్స్ పరిస్థితిని బట్టి విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడారు. -
హిట్ సినిమా రీమేక్‌లో...
తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్ నటిస్తారు. ఈ రీమేక్‌కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్ స్టూడియో బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్ని ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం. -
క్రేజీ రీమేక్‌కి సై
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన క్రేజీ చిత్రం ‘అంధాధూన్’కి ఇది తెలుగు రీమేక్. ‘ఠాగూర్’ మధు సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ . సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘అంధాధూన్’లో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను తెలుగులో తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్ చేయనున్నారు. ‘అంధాధూ¯Œ ’లో టబు నటనకు ప్రశంసలు దక్కాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను చేసే సవాలును స్వీకరించారు తమన్నా. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: హరి కె. వేదాంత్. -
చిరు చెల్లెలుగా సాయి పల్లవి!
హీరోయిన్గా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు సాయి పల్లవి. ఇలాంటి సమయంలో చెల్లెలు పాత్ర అంగీకరిస్తారా? ఆ పాత్ర చుట్టూ కథ తిరిగితే అప్పుడు అంగీకరించే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘వేదాళం’లో ఉన్న చెల్లెలు పాత్ర అలాంటిదే. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించనున్నారు. తమిళంలో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్ చేశారు. తెలుగులో ఆ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమా, పైగా పాత్ర కూడా గొప్పగానే ఉంటుంది.. ఈ రెండు కారణాలతో సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుంటారని ఊహించవచ్చు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. -
నారప్ప మళ్లీ మొదలప్ప
తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. నారప్పగా టైటిల్ రోల్లో వెంకటేశ్ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే చిత్రమిది. ఇందులో వెంకటేశ్ రైతుగా కనిపిస్తారు. లాక్డౌన్ ముందు చాలా శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. లాక్డౌన్ వల్ల సుమారు ఆర్నెల్లు చిత్రీకరణకు గ్యాప్ వచ్చింది. అక్టోబర్‌లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ‘నారప్ప’ చిత్రబృందం ఉందని టాక్. అక్టోబర్‌లో ప్రారంభించి సినిమా మొత్తాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలన్నది ఆలోచనట. ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. -
డిటెక్టివ్ రాబోతున్నాడు
మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుప్పరివాలన్’. తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదలయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ మొత్తాన్ని విదేశాల్లోనే పూర్తి చేయాలని ప్లాన్. సినిమా షూటింగ్ మధ్యలో మనస్పర్థలతో దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో మిగతా సినిమాకు దర్శకత్వ బాధ్యతలను విశాల్ తీసుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం కూడా చేస్తున్నారు విశాల్. ఇటీవల విశాల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్ స్నేహితుడిగా ప్రసన్న కనిస్తారు. -
కిలాడీ లేడీ ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధూన్’. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. అయితే మొదటి నుంచి టబు పోషించిన పాత్రకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు అంత స్పెషాలిటీ ఏంటీ అంటే? నెగటివ్ షేడ్స్ ఉండటమే. కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర కావడమే అందుకు ప్రధాన కారణం. మొదట టబూయే ఆ పాత్ర మళ్లీ చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార ఆ పాత్ర చేయబోతున్నారని ఓ వార్త. తాజాగా ఈ పాత్రకు ప్రియమణి లేదా శ్రియను తీసుకోవాలనుకుంటున్నారట చిత్రబృందం. మరి ఈ కిలాడీ లేడీ పాత్ర చేసే ఛాన్స్ ఎవరికొస్తుందో వేచి చూడాలి. -
లూసిఫర్‌కి విలన్?
హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత జగపతిబాబు కాల్షీట్ డైరీ ఫుల్‌గా ఉంటోంది. ‘లెజెండ్’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో విలన్‌గా జగపతిబాబు నటన అదుర్స్. తాజాగా ఆయన మరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును సంప్రదించారట చిత్రబృందం. అది విలన్ రోల్ అని తెలిసింది. ఇదే చిత్రంలో నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మరో రీమేక్
ఈ ఏడాది మార్చిలో విడుదలైన మలయాళ చిత్రం ‘కప్పెల’ మంచి విజయం సాధించింది. ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వంలో అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ముఖ్యతారాగణంగా రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేయనున్న సితార ఎంటర్టైన్మెంట్ అధినేతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ‘కప్పెల’ తెలుగు రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఓ ఇద్దరు ప్రముఖ హీరోలు నటించే ఈ చిత్రానికి ఒక యువదర్శకుడు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. మరోవైపు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో రవితేజ, రానా హీరోలుగా నటించబోతున్నారని టాక్. మలయాళ హిట్ ‘ప్రేమమ్’ను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రీమేక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది అతడే?
మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మలయాళం చిత్రం తెలుగు రీమేక్‌పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా, రవితేజలు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తొలుత హరీశ్ శంకర్, సుధీర్ వర్మ వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారట. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..) ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు’ వంటి సెన్సిబుల్ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్రతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ తెలుగు రీమేక్ చిత్రానికి ఈ యువ దర్శకుడే ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రానా, రవితేజ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళంలో సాచీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోటాపోటీగా నటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్న సంగతి తెలిసిందే. (మరి మీరు ఎటువైపు?: నాని) -
చిరంజీవి చిత్రంలో విజయశాంతి?
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కాంబినేషన్లో టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. దాదాపు 20 సినిమాలతో హిట్ పెయిర్‌గా వీరిద్దరికి మంచి పేరు ఉంది. అయితే తొలుత విజయశాంతి, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక వీరిద్దరు కలిసి మరోసారి తెరపై కనిపించలేదు. అయితే ఫిలింనగర్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం.. చిరంజీవి చిత్రంలో విజయశాంతి కనిపించనున్నారట. దీంతో సుదీర్ఘ గ్యాప్ తర్వాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!) మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం) మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. చిరు సూచించిన సూచనలకు తగ్గట్టు సుజీత్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మెగాస్టార్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మలయాళ చిత్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో ఎలివేషన్ సీన్స్ సూపర్బ్‌గా ఉంటాయి. ఆదే జోరులో తెలుగులోనూ హీరో ఎలివేషన్ సీన్స్ ఉండేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నారని టాక్ ఆఫ్ ది టౌన్. -
తెలుగు దియా?
2018లో ‘యు టర్న్’ (కన్నడ ‘యు టర్న్’– తెలుగు, తమిళ రీమేక్), 2019 లో ‘ఓ బేబీ’ (సౌత్ కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్), 2020లో ‘జాను’ (తమిళ ‘96’ తెలుగు రీమేక్)... ఇలా మూడేళ్లుగా ఏడాదికో రీమేక్ చిత్రంలో నటించారు సమంత. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాది కన్నడలో సూపర్ హిట్ సాధించిన ‘దియా’ తెలుగులో రీమేక్ కానుందనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో నడుస్తోంది. ఇందులో సమంత నటించే అవకాశాలు ఉన్నాయట. ఇక ‘దియా’ చిత్రకథ విషయానికి వస్తే... ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి కథ.. మరో కొత్త ప్రేమకు ఎలా దారి తీసింది? తన గత ప్రేమ తాలూకు అంశాలు ఆమె ప్రస్తుత ప్రేమను ఎంతలా ప్రభావితం చేశాయి? అనే అంశాల నేపథ్యంలో సాగుతుంది. -
డైరెక్టర్ ఎవరు?
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుజిత్‌కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
నితిన్ @ 31
‘భీష్మ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న హీరో నితిన్ నటిస్తోన్న 31వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ చిత్రానికి ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై 6వ చిత్రంగా తీయబోతున్న ఈ చిత్రానికి ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవంలో హారిక–హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: హరి కె.వేదాంత్. -
వసంత కాలం వస్తోంది
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ చిత్రం ‘కొలయుతిర్ కాలమ్’. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వసంత కాలం’ టైటిల్‌తో ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత దామెర వి.యస్. యస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేశాం. నయనతార నటన, గ్లామర్ ‘వసంత కాలం’ సినిమాకు హైలెట్. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం’’ అన్నారు. ప్రేమ వార్షికోత్సవం ‘‘నీతో కలసి ఉన్న ప్రతిరోజూ నాకు వేలంటైన్స్ డేనే. అప్పుడే 5 ఏళ్లయిపోయాయా? నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటున్నారు దర్శకుడు విఘ్నేష్ శివన్. నయనతార, విఘ్నేష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 5 ఏళ్లుగా మేం రిలేషన్షిప్లో ఉన్నామని, 5 ఏళ్ల ప్రేమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం అని విఘ్నేష్ పేర్కొన్నారు. ‘‘మా క్యూట్ స్టోరీకి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లు నీతో (నయన్) ప్రేమమయం అయిపోయింది’’ అని నయన్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు విఘ్నేష్. ప్రస్తుతం విఘ్నేష్ నిర్మాణంలో ‘నెట్రిక్కన్’ అనే సినిమా, దర్శకత్వంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ సినిమా చేస్తున్నారు నయనతార. -
అదే మాకు పెద్ద సక్సెస్
‘‘ఒక నటుడిగా నేను బాగానే చేస్తున్నానంటున్నారు కానీ రావాల్సిన పేరు ఇంకా మనకు రాలేదా? అనే ఒక చిన్న వెలితి ఉండేది. ‘జాను’ చిత్రం యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. నా కెరీర్లోనే ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విజయం యాక్టర్‌గా నా ఆకలిని కొంచెం తీర్చింది’’ అన్నారు శర్వానంద్. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► ‘96’ చూసి క్లాసిక్ మూవీ, తెలుగు రీమేక్ అవసరమా? అనిపించింది. ‘శతమానం భవతి’(2017) సినిమా సమయంలో కూడా ‘కథ బాగుంది కాకపోతే నా పాత్ర అంతగా ఉన్నట్లు లేదు’ అనే సందేహం వచ్చినప్పుడు.. ఈ సినిమాతో ఫ్యామిలీకి దగ్గరవుతావు’ అన్న ‘దిల్’ రాజుగారి జడ్జ్మెంట్ నిజమైంది. ‘జాను వర్కౌట్ అవుతుంది’ అని అన్నారాయన. ఆ నమ్మకంతోనే నటించాలనుకున్నాను. ‘దిల్’ రాజుగారు నిర్మాత కాకపోతే గ్యారంటీగా ‘జాను’ చిత్రం చేసేవాడిని కాను. ► ఒక రోజు రాత్రి జరిగే కథ. ఓ నలభై రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. కానీ రామచంద్ర క్యారెక్టర్ కళ్లతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఇరవై రోజులు కెన్యాలో షూట్ చేశాం. మాల్దీవుల్లో చేశాం. ఓ సీన్లో గాయపడ్డాను. మరోవైపు కో–స్టార్‌గా సమంత. రిలీజ్ తర్వాత మా ఇద్దరి యాక్టింగ్‌కు పోలికలు పెట్టి ట్రోల్ చేస్తారేమోనన్న భయం. కానీ నా కెరీర్లోనే నేను బాగా కష్టపడ్డ సినిమా ‘జాను’. సమంత కాకుండా వేరే ఎవరైనా ‘జాను’ పాత్ర చేసినా నా నుంచి అంత నటన వచ్చి ఉండేది కాదేమోనని ఒక యాక్టర్‌గా నేను అనుకుంటున్నాను. ‘96’లో చేసిన విజయ్‌సేతుపతి, త్రిషలను మర్చిపోయి ‘జాను’లో శర్వా, సమంతలను చూస్తున్నాం అంటున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్. ► వ్యక్తిగా, నటుడిగా సమంత నుంచి చాలా నేర్చుకున్నాను. ‘నేనొక సూపర్‌స్టార్.. నేను అక్కినేని ఫ్యామిలీ’ అనే గర్వం తనలో లేదు. నేనొక షాట్ పూర్తి చేసి వెళ్లి కూర్చొంటే... సమంత మాత్రం మానిటర్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకునేది. ఇప్పుడు ఆ ఫార్ములాను నా సెట్లో నేను వాడుతున్నాను. రిలీజ్ తర్వాత మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. ‘సైలెంట్‌గా ఉంటావ్ కానీ బాగానే మార్కులు కొట్టేశావ్.. నువ్వు దొంగవి’ అంది సమంత. ► ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఉంటుంది. నాకు కూడా ఉంది కాబట్టే రామచంద్ర పాత్రలో బాగా నటించానేమో (నవ్వుతూ). ఫస్ట్ లవ్‌ను పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. 100లో 5 పర్సెంట్ ఉంటారేమో. ► నా కెరీర్లో ‘గమ్యం, ప్రస్థానం’ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ‘జాను’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. నా కెరీర్లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా. ► తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేద్దామనే అక్షయ్‌కుమార్ ఫార్ములాను ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. 3 సినిమాలు అయిపోవాలి.. 3 సెట్స్‌పై ఉండాలి. ‘శ్రీకారం’లో రైతు పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నాం. -
పేరు కోసమే కష్టపడ్డాను
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా నేను పేరుకోసమే పని చేశాను. ఒక సినిమా చేయాలా? వద్దా? అనే నా నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేయలేదు. కొత్త సినిమాని ఒప్పుకునేముందు ఆ సినిమా వల్ల నాకు ఎంత పేరు వస్తుందని మాత్రమే ఆలోచించుకుని నా వంతు కష్టపడ్డాను. డబ్బు ఆటోమేటిక్‌గా వచ్చేసింది(నవ్వుతూ)’’ అని సమంత అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్. ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే ‘జాను’ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు... ► ‘జాను’ ఇద్దరు వ్యక్తుల కథ. నాకైతే చాలా పెద్ద సినిమా చేశాననిపించింది. ఎక్కువ రిస్క్ అనిపించింది. నా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ‘96’ సినిమా బాగా నచ్చింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి బాగా చేశారన్నారు. నాకైతే ‘96’ త్రిషగారి సినిమా అనిపించింది. ఈ సినిమా రీమేక్‌లో నటించకూడదని తొలుత అనుకున్నాను. ‘దిల్’రాజుగారు అడగడంతో కాదనలేకపోయాను. కానీ ‘జాను’ సినిమా చేయకపోతే నా కెరీర్లో ఒక మంచి సినిమా కోల్పోయేదాన్ని.. పశ్చాత్తాపం చెందాల్సి వచ్చేది. ► త్రిషగారి నటనను కాపీ చేయలేదు. సినిమాలోని పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో విభిన్నంగా నటించాను. అది స్క్రీన్‌పై ఎంత వర్కవుట్ అయ్యిందన్నది ప్రేక్షకులు చెబుతారు. నేను చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్‌ను చాలాసార్లు చదివాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ‘96’లాంటి సినిమాలను రీమేక్ చేయడం కష్టం. కానీ ప్రేమ్‌కుమారే తెరకెక్కించడంతో ఆ మ్యాజిక్‌ను రీ–క్రియేట్ చేశారనిపించింది. ► స్క్రిప్ట్ ప్రకారం నా నటన బట్టే శర్వాగారి నటన ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుని బెస్ట్ ఔట్పుట్ రావడం కోసం కష్టపడ్డాం.. శర్వా బాగా నటించారు. క్లైమాక్స్ మార్చడం కోసం షూటింగ్‌ను ఆపేశామనే వార్తల్లో నిజం లేదు. శర్వాగారికి ఆరోగ్యం సహకరించనప్పుడు కొంత షూట్ ఆపాం. ఆ తర్వాత మొదలైన ఒక్క షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేశాం. ► నా కెరీర్లో పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచేకొద్దీ కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ట్రెండ్ మారిపోతుంటుంది. కొందర్ని బెటర్ పెర్ఫార్మెన్స్ అంటారు.. ఇంకొందర్ని బ్యూటిఫుల్ అంటారు. కానీ వీలైనంత కాలం నా పేరు నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లు కష్టపడుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా నా మొదటిదిగా భావిస్తాను. నా నటన, నా ప్రవర్తన పట్ల సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారో లేదో కూడా ముఖ్యమే. ► ప్రమోషన్స్ ఎంతవరకు సినిమా కలెక్షన్స్‌ను ప్రభావితం చేస్తాయో నాకు తెలియదు. కానీ నేను ఒక చోటుకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం వల్ల పది టిక్కెట్లైనా అమ్ముడు పోతాయంటే వెళ్లి ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఒక నిర్మాత నన్ను నమ్మి, ఇంత పారితోషికం ఇచ్చినప్పుడు చేయాలి. మూవీ విడుదలై, విజయం సాధిస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయను (సరదాగా). అదే రిలీజ్‌కు ముందు అయితే నాకు వీలైనంత ప్రమోషన్ చేస్తాను. రిలీజ్ టైమ్‌లో సినిమా ఫలితం గురించి కాస్త ఆందోళనకి గురవుతా. ► నా చదువు పట్ల మా అమ్మగారు మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. కానీ, నేను ఫుల్ మార్క్స్ రావాలని కోరుకుంటాను. 12వ తరగతిలో అకౌంట్స్‌లో 200కి 199 మార్కులు రావడంతో బాగా ఏడ్చాను. నేను ఫెయిల్ అయ్యానని మా అమ్మ అనుకున్నారు. అసలు విషయం తెలియడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు. ► నా సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతుంటాను. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుదు మాది గర్ల్స్ కాలేజ్. చాలా స్ట్రిక్ట్. ఎవరూ టీవీ, ఇండస్ట్రీ అంటూ ఉండేవారు కాదు. కానీ, నేను చేసేదాన్ని. సినిమాలకే కాదు.. కుటుంబానికీ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక ఆర్టిస్టుగా నేను సాధించే విజయాల కన్నా కూడా నా వ్యక్తిత్వం గురించి మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అవుతారు. ► ‘రంగస్థలం’ తర్వాత సమంత ఏం చేసినా హిట్ అయిపోతుందన్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్, కొంచెం కథ తెలుసంతే. ఎంటైర్ స్క్రిప్ట్ తెలియదు. ఇప్పుడు నేను సినిమాలను చాలా తెలివిగా ఎంచుకుంటున్నాని అంటున్నారు. కానీ అది అలా జరుగుతోందంతే. ► ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో కొత్త సమంతను చూస్తారు. చాలా కష్టపడ్డాను. నేను ఒక్కషాట్‌లో కూడా డూప్ వాడలేదు. అప్పుడు అనుకున్నాను.. సినిమాలో ఫైట్స్ కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని!. ఇందులో నేను చేసిన పాత్రను ఇదివరకు చేయలేదు. -
మనతో పాటు ఇంటికి వచ్చే చిత్రం జాను
‘‘96’ సినిమాను రీమేక్ చేయొద్దు అని’ రాజుగారికి నా అభిప్రాయం చెప్పాను. శర్వానంద్, సమంత చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నా’’ అని నాని అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది తెలుగు రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జాను’ పాత్రలో సమంతను తప్ప ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. శర్వా కూడా ‘96’ చూసి సూపర్ అన్నాడు. ఒరిజినల్ ‘96’ చేసిన ప్రేమ్‌కుమార్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. షూటింగ్ సమయంలో శర్వా ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ తర్వాత మరో ఇబ్బంది. ఒక్కో అడ్డంకి దాటుకొని సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎన్నో జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకెళ్తారు’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్‌ని నిరుత్సాపరచకూడదని ప్రతి సినిమాకు భయపడుతుంటా. ప్రతిరోజు మొదటి సినిమా షూటింగ్‌లానే భావిస్తాను. ప్రతిరోజూ షూటింగ్లో మ్యాజిక్ జరుగుతుండేది. ప్రేమ్‌కుమార్ మ్యాజిక్‌ని రిపీట్ చేశారు. ఫ్యాన్స్ అందరూ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అన్నారు సమంత. ‘‘నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత వంటి హీరోయిన్స్‌తో నటించేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. లేకపోతే సన్నివేశాలను తినేస్తారు. ప్రతీ సినిమా వంద శాతం చెక్ చేసుకుంటుంది సమంత. అందుకే సూపర్‌స్టార్ అయింది. ఆరు నుండి తొంభై ఏళ్ల వరకూ అందరికీ ‘జాను’ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన టీమ్ అందరికీ థ్యాంక్స్. నానితో నా స్నేహం సారథి స్టూడియోస్‌లో ప్రారంభం అయింది. నేను, నరేశ్, నాని చాలా ట్రిప్స్‌కి వెళ్లే వాళ్లం’’ అన్నారు శర్వానంద్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శర్వా నా తొలి ఫ్రెండ్. శర్వానంద్, సమంత ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మర్స్. పోటీ పడి నటించారు. శర్వానంద్ చేసే ప్రతి సినిమాలో తనకు మంచి పేరు వస్తుంది. స్యామ్ ఎంచుకుంటున్న సినిమాలు చూసి గర్వపడుతున్నాను. రాజుగారికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలి. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. కొన్ని సినిమాలను ఇంటికి తీసుకెళ్తాం. ‘జాను’ మీతో పాటు ఇంటికి తీసుకువెళ్లే సినిమా’’ అన్నారు నాని. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులు సాయి కిరణ్, గౌరి మాట్లాడారు. -
కురుమలైలోనారప్ప
తమిళనాడులో ఫైట్ చేస్తున్నారు ‘నారప్ప’. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రంలో ప్రియమణి, అమలాపాల్ కథానా యికలుగా నటిస్తున్నారని తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని పాల్తూరు గ్రామంలో ఇటీవల ‘నారప్ప’ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని కురుమలైలో జరుగుతోంది. స్టంట్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి అనంతపురంలో ‘నారప్ప’ చిత్రీకరణ మొదలవుతుంది. ‘నారప్ప’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ. -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు. -
అనంతపురంలో అసురన్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
జోడీ కుదిరిందా?
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్ నటించిన సూపర్‌హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కళైపులి యస్. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్‌లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. -
పింక్ రీమేక్‌లో అంజలి?
రెండేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ‘పింక్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అనిరుద్ధ రాయ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్ ‘పింక్’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘పింక్’ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. ‘దిల్’ రాజు, బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమన్ స్వరకర్త. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్ నటించబోతున్నారని లేటెస్ట్ టాక్. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. -
కారులో నుంచి బయటపడేదాన్ని!
‘‘ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనిపించేయాలనుకోవడం లేదు. ఒక దాని తర్వాత ఒక సినిమా చేసినా నాకు నచ్చిన సినిమాలే చేయాలనుకుంటున్నాను. చేసే ఒక్కటి అయినా మంచి సినిమా చేయాలి. స్క్రిప్ట్ నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించకపోతే సినిమా అంగీకరించడం లేదు’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్ సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవ రం’. తమిళ చిత్రం ‘కణితన్’కి ఇది తెలుగు రీమేక్. బి.మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘మొదట ఈ సినిమాకు నో చెప్పాను. రీమేక్ సినిమాలో చేయడానికి ఏం ఉంటుంది? అనే ఉద్దేశంతో అలా అన్నాను. కానీ కథ వినగానే చాలా నచ్చింది. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ అమ్మాయిని. నకీలి సర్టిఫికెట్స్ మాఫీయా గురించి ఈ సినిమాలో చర్చించాం. దాని వల్ల టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఎలా నష్టపోతున్నారో చూపించాం. ఈ సినిమాలో కొన్ని రిస్కీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక సన్నివేశంలో కారులో నుంచి బయటపడబోయేదాన్ని. కొంచెంలో మిస్ అయింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్‌గా ఉంది (నవ్వుతూ). ‘అర్జున్ సురవరం’ రిలీజ్ ఆలస్యం కావడంతో సినిమా ఏమైనా అవుడ్ డేట్ అయిపోతుందా, స్టేల్ అయిపోతుందా? అనే ఆలోచన నాక్కూడా వచ్చింది. కానీ మా ట్రైలర్‌ని చూసినవాళ్లందరూ ఫ్రెష్‌గానే ఉంది అంటున్నారు. ‘ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడం లేదేంటి?’ అని కొంతమంది అడుగుతున్నారు. సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు నచ్చిన పాత్రలు రావడం లేదు. ఈ గ్యాప్‌లో నాకు నచ్చిన ప్రదేశాలకు వెళుతున్నాను. కొత్త డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను. నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాను. దానికోసం డిసెంబర్లో హాకీ శిక్షణ ప్రారంభిస్తాను. కాలేజీ రోజుల్లో మా అమ్మగారు కూడా హాకీ ఆడేవారట’’ అన్నారు. ‘అర్జున్ సురవరం’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను 26న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చిత్రబృందం తరఫున ఈ వేడుకకు చిరంజీవిని అహ్వానించారు నిఖిల్. చిరంజీవి, నిఖిల్ -
కపటధారి
కన్నడంలో సూపర్ హిట్ అయిన చిత్రం ‘కవలుదారి’. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సుమంత్. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. సుమంత్, నందితా శ్వేత జంటగా నాజర్, పూజాకుమార్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనంజయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్ కే కింగ్, డైలాగ్స్: బాషా శ్రీ. -
రీమేక్ కోసం కలిశారు
తమిళ సూపర్‌హిట్ సినిమా ‘అసురన్’ని తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేస్తారని ప్రకటించినప్పటినుంచి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా? అనే ఆసక్తి ఏర్పడింది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ పేద–ధనిక విబేధాలు, వర్గ పోరు అనే సమస్యలను చర్చించిన సినిమా. తమిళంలో నిర్మించిన కలైపులి యస్ థానుతో సురేశ్‌బాబు తెలుగు రీమేక్‌ను నిర్మిస్తారు. ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్ చేసే దర్శకుడు ఎవరనే చర్చ సినిమా ప్రియుల్లో మొదలైంది. తెలుగు రీమేక్‌కి దర్శకులు వీరే అని పలు పేర్లు వినిపించినా ఫైనల్‌గా శ్రీకాంత్ అడ్డాల కన్ఫార్మ్ అయ్యారని తెలిసింది. గతంలో వెంకటేశ్, శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా చేశారు. ఇప్పుడు రీమేక్ కోసం ఆరేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కలిసింది. జనవరి మొదటివారంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో శ్రియని కథానాయికగా అనుకుంటున్నారని సమాచారం. -
రీమేక్‌కి రెడీ
బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’. ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్ వర్మ హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
దర్శకుడు దొరికాడోచ్
ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రం తమిళంలో మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన కలైపులి యస్. థానుతో కలసి డి. సురేశ్ బాబు తెలుగులో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ ఈ చిత్ర దర్శకుడు ఎవరనే విషయం ప్రకటించలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు దొరికాడని తెలిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు’ సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ‘అసురన్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్గా నటించనున్నారట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంకటేశ్ రైతు పాత్రలో కనిపించనున్నారు. -
తీన్మార్?
‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా నటించారు వెంకటేశ్, శ్రియ. వెంకటేశ్ నటించిన ‘తులసి’ సినిమాలో ‘నే చికుబుకు బండినిరో..’ అనే స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు మూడోసారి వెంకటేశ్, శ్రియ జోడీ కడుతున్నట్టు తెలిసింది. ధనుష్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ని వెంకటేశ్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్గా శ్రియ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది అధికారిక ప్రకటన రాలేదు. టీవీ యాంకర్, దర్శకుడు ఓంకార్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కలైపులి యస్. థాను, సురేశ్‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
తోడు లేని జీవితాలు
అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ పేరుతో పఠాన్ చాన్‌బాషా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రం విడుదల కానుంది. చాన్ బాషా మాట్లాడుతూ– ‘‘మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ని తమిళంలో ‘భాస్కర్ ఒరు రాస్కెల్’గా రీమేక్ చేశారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించగా సిద్ధిక్ దర్శకత్వం వహించారు. మలయాళంలో విజయం సాధించటంతో తమిళంలో అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా సిద్ధిక్ రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా కలిశారు, ఆ ఇద్దరూ కలవటానికి ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారనేది ఈ సినిమా. నటి మీనా కూతురు నైనిక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసింది’’ అన్నారు. -
ఫిబ్రవరిలో వస్తాం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలకరిస్తానంటున్నారు శర్వానంద్. సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు సమంత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని తాజా సమాచారం. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో రూపొందుతున్న సినిమా కాబట్టి బహుశా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల ఉంటుందని ఊహించవచ్చు. -
నాతోటి పందాలు వేస్తే సస్తరు
‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు, మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా, గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేం టు సేం, గద్దలకొండ గణేశ్ అంటే గజ గజ వణకాలి’ అంటూ ‘వాల్మీకి’ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కి ఇది తెలుగు రీమేక్. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘వాల్మీకి’ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’ సినిమాని నేను ఏ దృష్టితో చూశానో వరుణ్ కూడా అదే కోణంలో చూసి నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి సాఫ్ట్ పాత్రలు చేసిన వరుణ్ ‘వాల్మీకి’ లో పక్కా మాస్ పాత్ర చేశారు. ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. హిందీ ‘దబాంగ్’ సినిమాని ‘గబ్బర్‌సింగ్’గా రీమేక్ చేసినప్పుడు చాలా మార్పులు చేశాను.. ‘వాల్మీకి’లో మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మాత్రమే మార్పులు చేశాం. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి బోయ సంఘంవారు, వాల్మీకి అభిమానులు గర్వపడతారు’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర అవసరమా? అని చాలామంది అన్నారు. కానీ హరీష్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి.. ‘జిగర్తాండ’ అలాంటి చిత్రమే. చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్... వంటి వారు గతంలో చేసిన సినిమాలు చూస్తే రాముడు మంచి బాలుడు అనేలా హీరోలా పాత్రలు ఉండేవి. ఈ మధ్య హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. నేను కూడా హీరోలాంటి పాత్రలు చేశా. కానీ, వైవిధ్యంగా ఉండేలా ప్రయోగాత్మకంగా ఏదైనా ఓ పాత్ర చేయాలనుకున్నా. అలాంటి పాత్రే ఇది. ఈ పాత్ర నాకే కొత్తగా అనిపించింది. సినిమాలో మంచోడి కంటే చెడ్డోడి పాత్ర బాగుంటుంది (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటగార్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో ‘జర జర...’ పాటకి చాలా మంచి స్పందన వస్తోంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అన్నారు. నిర్మాత రామ్ ఆచంట పాల్గొన్నారు. -
విక్రమ్ ఓకే.. వేదా ఎవరు?
రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్ వేదా’ చిత్రానికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ ఎస్. శశికాంత్ నిర్మించారు. పోలీసాఫీసర్ విక్రమ్ పాత్రలో మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో ‘విక్రమ్‌వేదా’ చేసిన ఎస్. శశికాంతే తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విక్రమ్ పాత్రను రవితేజ చేయనున్నారని సమాచారం. వేద పాత్ర కోసం కొంతమంది నటులను పరిశీలిస్తున్నారు. మరోవైపు స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విక్రమ్ పాత్రలోకి వచ్చేస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘విక్రమ్‌వేదా’ చిత్రం హిందీలో కూడా రీమేక్ కానుంది. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్ గాయత్రి ద్వయమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. -
అంధ పాత్రపై కన్నేశారా?
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌పై నాని కన్ను పడిందని ఇండస్ట్రీ టాక్. ‘అంధాధూన్’లో చూపు లేని పాత్ర చేసిన ఆయుష్మాన్ ఖురానాను అన్ని ఇండస్ట్రీలు తొంగి చూశాయి. ఆయుష్మాన్ పెర్ఫార్మెన్స్కు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో హీరోగా నాని నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ చిత్రాన్ని శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. మరి తెలుగు చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. -
రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె
‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అథర్వ డైలాగ్‌తో మొదలవుతుంది ‘వాల్మీకి’ టీజర్. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు... నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అని వరుణ్ తేజ్ చెప్పిన మాస్ డైలాగ్‌తో ముగుస్తుంది. వరుణ్ తేజ్, అథర్వ ముఖ్య తారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
లుంగీ కడతారా?
రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం లుంగీ కట్టి లుంగీ డ్యాన్స్ చేశారు షారుక్ ఖాన్. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ప్రమోషన్లో భాగంగా ఇలా చేశారాయన. ఇప్పుడు మరోసారి లుంగీ కట్టనున్నారని బాలీవుడ్ గాసిప్. 2014లో వచ్చిన అజిత్ ‘వీరమ్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకుడు. దీనికి ‘లాల్’ (ల్యాండ్ ఆఫ్ లుంగీ) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా తొలుత అక్షయ్ కుమార్ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత విక్కీ కౌశాల్ దగ్గరకు వెళ్లింది. డేట్స్ లేని కారణంగానే ఈ హీరోలు లుంగీ కట్టే చాన్స్ మిస్ అయ్యారు. ఇప్పుడు షారుక్ ఖాన్ ఈ రీమేక్‌లో హీరోగా కనిపిస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. -
అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా
‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐశ్వర్యారాజేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్‌గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్ హిట్లు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్‌కి నాంది అవుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు. ఐశ్వర్యారాజేష్ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు, కె. అశోక్ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్ రాజా కామరాజు, కెమెరామెన్ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
సైకలాజికల్ థ్రిల్లర్
సాయి పల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అథిరన్’. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. 1970లలో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటించి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అను మోతేదత్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, సంగీతం: పి.ఎస్. జయహరి. -
అదే అంకిత భావంతో ఉన్నా
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్‌కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు. ► మా బ్యానర్లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్‌తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు. ► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్‌లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్‌గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్‌రాజు క్యారెక్టర్స్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా చేసిన మిథాలీరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్‌ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే. -
ఫన్ రైడ్
వెండితెరపై సమంత ఉన్నప్పుడు థియేటర్స్‌లోని ఆడియన్స్‌కు ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఆ ఎంజాయ్మెంట్ను మరోసారి ఆడియన్స్‌కు అందించడానికి సమంత రెడీ అయ్యారు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబి’. సౌత్ కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు సహ నిర్మాతలు. ‘ఓ బేబి’ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాలను ఆలోచింపజేసే కోణంలో ఈ సినిమాను నందినీ రెడ్డి రూపొందించారు’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేశ్, తేజ సజ్జ, ప్రగతి తదితరులు నటించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. విజయ్ డొంకాడ, దివ్యా విజయ్ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. -
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని భీమనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్గార్ల టైమ్‌లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్నాథ్ మనవరాలు, హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్‌లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్ చేసి ‘కణ’ రీమేక్ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్ చేద్దా’మన్నాను. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ శివ శ్రీరాములు పాల్గొన్నారు. -
వెంకీ–రోహిత్ ఓ రీమేక్?
విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్ దర్శకుడు అని తెలిసింది. మాధవన్ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్లో వెంకటేశ్ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్ – వీవీవినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
నంబర్ వన్ రేస్‌లో...
గణేశ్, రష్మికా మండన్నా కథానాయికలుగా సుని దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘చమ్మక్’. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా ‘గీతా..ఛలో: వీకెండ్ పార్టీ’ పేరుతో ఈ సినిమాను ఈ నెల 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయడమే కాదు. రిలీజ్ విషయంలోనూ సరైన ప్రణాళిక ఉండాలి. నిర్మాతలు పంపిణీరంగంలో అనుభవజ్ఞులు. ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బు, పేరు రావాలి’’ అన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాలు ఎన్ని విడుదలైనా టేస్ట్‌ఫుల్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘గీత గోవిందం’ సినిమాలో వందకోట్ల క్లబ్లో చేరారు రష్మిక. నంబర్ 1 రేస్‌లో ఉన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు ఈ చిత్రసమర్పకుడు దివాకర్. ‘‘కన్నడలో ఈ చిత్రం దాదాపు 30కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
కెన్యాలో క్లిక్
కెమెరా పట్టుకుని కెన్యా అడవుల్లో క్లిక్‌మనిపిస్తున్నారు శర్వానంద్. ఎందుకంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారు శర్వా. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘96’ తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శర్వా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ రూపొందుతోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం కెన్యాలో మొదలైంది. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగనుంది. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా శర్వానంద్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సినిమాలో వైల్డ్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే దృశ్యాల చిత్రీకరణను ఈ షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. అలాగే ఆ మధ్య మారిషస్‌లో జరిగిన షెడ్యూల్లో ఓ సాంగ్‌లో భాగంగా శర్వానంద్ స్కూబా డైవ్ చేశారు. కెన్యా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్, వైజాగ్‌లలో కూడా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జూలై లోపు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. మహేంద్రన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. -
అన్నింటికీ ధనమ్ మూలమ్
అధర్వ, మిస్తీ చక్రవర్తి జంటగా దర్శకుడు బద్రి వెంకటేశ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సెమ్మ బోథ ఆగాదే’. ఈ చిత్రాన్ని ‘ధనమ్ మూలమ్’ టైటిల్‌తో నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు ఈ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘కిక్కు ఎక్కిపోయెరా’ అనేది క్యాప్షన్. ‘‘ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజశేఖర్. ‘‘ఇదో క్రైమ్ థ్రిల్లర్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. తమిళంలో లాగానే తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు సహ నిర్మాత జె.వి. రామారావు. ఈ చిత్రానికి సమర్పణ: వీరబ్రహ్మాచారి అన్నభీమోజు, నిర్మాణం: గ్రేహాక్ మీడియా. -
ఈద్‌కు రాక్షసుడు
డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. లేటెస్ట్గా తమిళ చిత్రం ‘రాక్షసన్’ తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు. ‘‘ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ రచయితగా పరిచయం అవుతున్నారు. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత హవీష్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: జిబ్రాన్. -
ఉగాదికి ప్రారంభం
తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తమిళ ‘96’ చిత్రం తెలుగు రీమేక్ ఆరంభం కానుందని తెలిసింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘96’. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సమంత నటిస్తారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది రోజున జరగనున్నట్లు తెలిసింది. ఆ రోజున ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. స్కూల్ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి, అమ్మాయి ఆ తర్వాత విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత కలిసిన ఈ ఇద్దరి మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై ఈ సినిమా కథనం ఉంటుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు
తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియో ప్రతినిధి శశికాంత్ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్ స్టూడియోస్ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు. -
పాఠాలు చెబుతారట
ఎక్కువగా అల్లరి పాత్రల్లో కనిపించిన అనుపమా పరమేశ్వరన్ అల్లరి చేసే పిల్లలను కంట్రోల్లో పెట్టే టీచర్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్నారు. హవీష్ కోనేరు నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమిలో అమలాపాల్ పోషించిన పాత్రను తెలుగులో అనుపమా చేయనున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ థ్రిల్లర్ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
యస్ అండ్ యస్ 96కి ఫిక్స్
తమిళ బ్లాక్‌బస్టర్ ‘96’ తెలుగులో రీమేక్ కానుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ. ఇందులో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘దిల్’ రాజు నిర్మాత. ‘‘మా సంస్థలో చేస్తోన్న 34వ ప్రాజెక్ట్‌లో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించడం హ్యాపీగా ఉంది. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని పేర్కొంది చిత్రబృందం. తమిళ ‘96’ స్క్రిప్ట్‌ను తెలుగు నేటివిటీకు తగ్గట్టు పలు మార్పులు చేశారట. చిన్ననాటి స్నేహితులంతా మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్‌తో చిత్రకథ సాగుతుంది. రెండు, మూడు డిఫరెంట్ గెటప్స్‌లో శర్వానంద్, సమంత కనిపిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాలి. -
వేసవి నుంచి వేగం
2018లో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘96’ ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషించనున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ లవ్ స్టోరీని తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. హీరోయిన్గా సమంత యాక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం, పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం, వారిలో ఓ ప్రేమ జంట వాళ్ల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఇలా సినిమా కథ సాగుతుంది. వేసవి నుంచి ఈ షూటింగ్లో జాయిన్ అయి జ్ఞాపకాల్లో వేగంగా వెనక్కి వెళ్తారన్నమాట శర్వానంద్. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు శర్వానంద్. -
న్యాయాన్ని గెలిపిస్తారు
ముగ్గురు ఆకతాయిల వల్ల లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిలు న్యాయం కోసం పోరాడతారు. వీరికి ఓ లాయర్ అండగా నిలబడతాడు. న్యాయం గెలిచేట్టుగా కలసి పోరాడతారు. ఈ కథాంశంతో బాలీవుడ్లో రూపొందిన చిత్రం ‘పింక్’. అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్ర పోషించారు. లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించారు. ‘పింక్’ చిత్రం సూపర్ హిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బోనీ కపూర్. అమితాబ్ పోషించిన పాత్రను అజిత్ చేయనున్నారు. ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో మలయాళ నటి నజ్రియా నజీమ్, ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. నటుడు ఫాహద్ ఫాజిల్‌తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు నజ్రియా. ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. అలాగే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి తెలియాలి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ‘ఖాకీ’ ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్టర్. మే 1 అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్రేమికుల రోజున...
కొంటె సైగతో దేశంలోని యూత్ అందర్నీ ఫిదా చేసిన ‘వింక్ సెన్సేషన్’ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ఆమె కన్ను కొట్టే షాట్ ఎంత హల్చల్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం ‘లవర్స్ డే’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్ వినోద్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఒరు ఆధార్ లవ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క కంటి సైగతో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులను మేం సొంతం చేసుకున్నాం. వేలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీగా సాగే ఈ కథకు షాన్ రెహమాన్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్ధ్, కథ– దర్శకత్వం: ఒమర్ లులు. -
పోరీ.. చిన్నచిన్న చోరీ!
అదొక పెద్ద స్ట్రీట్. అక్కడున్న షాప్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. చేతి వాటం చూపించాలనుకునేవాళ్లకు బెస్ట్ ప్లేస్. ఓ అందమైన అమ్మాయి ఆ స్ట్రీట్‌లోకి ఎంటరైంది. కూల్‌గా నడుచుకుంటూ ఓ షాప్‌లోకి ఎంటరైంది. కంటికి ఓ ఐటమ్ నచ్చింది. అంతే.. సునాయాసంగా చేజిక్కించుకుని, బ్యాగ్‌లో వేసేసుకుంది. మరి.. బిల్? బాసూ.. అలాంటివన్నీ ఇక్కడ కుదరదు. ఏదైనా ఫ్రీగా కొట్టేయడమే. తమిళ చిత్రం ‘జిగర్‌దండా’లో కథానాయిక లక్ష్మీ మీనన్ చేసిన సరదా క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఈ పాత్రను ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నా చేయనున్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ ‘జిగర్‌దండా’ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. తెలుగు చిత్రంలో రష్మికను కథానాయికగా తీసుకున్నారని సమాచారం. సినిమాలో ఈ పోరి చేసే చిన్న చిన్న చోరీలు భలే కామెడీగా ఉంటాయట. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. అన్నట్లు.. ‘ఛలో’ తర్వాత రష్మిక బిజీ అయ్యారు. ‘గీత గోవిందం’ సక్సెస్‌తో మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’, నితిన్‌తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. -
96 రీమేక్‌లో?
యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రాల్లోనే కాదు.. మంచి ప్రేమకథా చిత్రాలతోనూ ప్రేక్షకులను మెప్పించగలరు అల్లు అర్జున్. ‘ఆర్య, పరుగు’ సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన తమిళంలో మంచి హిట్ అయిన లవ్‌స్టోరీ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ‘96’ సినిమా తెలుగు హక్కులను ఇటీవల నిర్మాత ‘దిల్’రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని వినికిడి.అల్లు అర్జున్ కెరీర్‌కు మంచి ప్లస్ అయిన ‘పరుగు’ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది. గతేడాది అల్లు అర్జున్–‘దిల్’ రాజు–హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా డిసెంబర్లో ప్రారంభమవుతుందట. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్. -
ధనిక కుర్రాడి పేద జీవితం!
ధనిక కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు పేద జీవితం గడపాల్సి వచ్చింది. ఎందుకు అంటే మలయాళ ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ‘ఏబీసీడీ’ పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘అల్లు’ శిరీష్ హీరోగా నటిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో సంజీవ్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ–నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. జుధా సాంధీ మంచి çస్వరాలు అందిస్తున్నారు’’ అన్నారు. -
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అల్లు హీరో
కెరీర్లో భారీ హిట్ లేక సతమతమవుతున్నాడు మెగాహీరో అల్లు శిరీష్. దాంతో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘1971’ సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తనకి ఈ సినిమాతో మంచి హిట్ లభిస్తుందని ఈ మెగా హీరో కోటి ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ న్యూస్‌ను అల్లూ శిరీష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ‘సినిమాలో నేను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్ చేశాడు. -
తొంభయ్యారు.. తెలుగుకి తయారు
సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సహజం. కానీ తమిళంలో ఇంకా రిలీజ్ కాని ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘96’. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో విజయ్‌సేతుపతి, టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. ఆల్రెడీ ఈ సినిమాను చూసి, రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు ‘దిల్’ రాజు. దీంతో తెలుగు రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ‘‘తమిళంలో అక్టోబర్ 4న విడుదల కాబోతున్న ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం. నటీనటులను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేమికులు ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు. -
వినోదం.. సందేశం
కన్నడ రైజింగ్ స్టార్ యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ కుమార్ అక్టోబర్ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా. మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్.రావు. -
బిజీ బీజీ!
సంయుక్తా హెగ్డే.. పేరు ఎక్కడో విన్నారు కదూ. కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆమె హైపర్‌కు థియేటర్స్‌లో మంచి మార్కులు పడ్డాయి. ఎంతలా అంటే.. ఈ కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాను తెలుగులో ‘కిర్రాక్ పార్టీగా’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు సేమ్ రోల్‌కు సంయుక్తానే తీసుకునేంతగా. ఈ సినిమాతో తెలుగులోనూ మార్కులు కొట్టేశారామె. ఇప్పుడీ కన్నడ బ్యూటీ కోలీవుడ్‌లో బిజీ బీజీగా ఉన్నారట. ‘జయం’ రవి, కాజల్ ఓ తమిళ సినిమా కోసం జోడీ కట్టారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా సెకండ్ హీరోయిన్‌కు చాన్స్ ఉందట. దీంతో మేకర్స్ సంయుక్తాను సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకా చకా జరిగిపోయాయట. ఇది కాకుండా తమిళ సినిమా ‘పప్పీ’లో నటిస్తున్నారీ బ్యూటీ. -
ఝాన్సీగా...
జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నాచియార్’. బాలా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్, కల్పనా చిత్ర బ్యానర్‌పై ‘ఝాన్సీ’ పేరుతో డి. అభిరాం అజయ్‌కుమార్, కోనేరు కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. జ్యోతిక యాక్షన్, డైలాగ్స్ చూస్తుంటే తనలో నన్ను నేను చూసుకున్నా అని హీరో సూర్య అన్నారు. ఏ పాత్రనైనా ఛాలెంజింగ్‌గా చేయగల జీవీ ప్రకాష్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇళయరాజాగారి సంగీతం ఈ సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణం. త్వరలోనే ‘ఝాన్సీ’ టీజర్ రిలీజ్ చేయనున్నాం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న జ్యోతిక చిత్రం మాదే’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: యశ్వంత్ మూవీస్. -
కోలీవుడ్ కాలింగ్
ఇంకా సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వలేదు. హీరోయిన్గా చేస్తున్న సినిమా ఆన్ సెట్స్‌లో ఉంది. కానీ కోలీవుడ్ నుంచి శివానీకి కబురొచ్చింది. జీవితా రాజశేఖర్ల కుమార్తె శివానీ హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ ఆఫర్ గురించి చెప్పాలంటే... విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులోనే కథానాయికగా చాన్స్‌ను దక్కించుకున్నారు శివానీ. ఈ సినిమా షూట్లో పాల్గొనడానికే ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారని సమాచారం. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపిస్తారట శివానీ. ఇదిలా ఉంటే మన తెలుగమ్మాయి శివానీ ఈ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు వెళుతుంటే, ఈ చిత్ర కథానాయకుడు విష్ణు విశాల్.. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్యం’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నారు. -
ఓ బ్లఫ్ మాస్టర్ కథ
‘జ్యోతిలక్ష్మి, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత కథానాయిక. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై నిర్మించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘లారెన్స్ నటించిన తమిళ ‘శివలింగ’ చిత్రాన్ని తొలిసారి మా బ్యానర్లో తెలుగులో అనువదించి మంచి విజయం అందుకున్నాం. 2014లో తమిళంలో ఘన విజయం సాధించిన ‘చతురంగ వేటై్ట’ సినిమాని ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. కొడైకెనాల్, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. పాటలను ఈ నెలాఖరులో, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు, ఘోరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతిచోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
నాలుగోసారి వస్తున్నాం
కొన్ని సినిమాలకు కాంబినేషన్ వల్ల క్రేజ్ ఏర్పడుతుంది. రాజ్‌తరుణ్–హెబ్బా పటేల్ లది అలాంటి కాంబినేషనే. ‘కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు’ సినిమాల్లో కలసి నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నాలుగోసారి జత కట్టనున్నారని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ తెలుగు రీమేక్‌లో ఈ యువ జంట కలసి నటించబోతోందట. విజయ్ సేతుపతి పాత్రను రాజ్ తరుణ్, నయనతార క్యారెక్టర్‌ను హెబ్బా పోషించనున్నారని సమాచారం. తమిళంలో ఈ చిత్రం పెద్ద హిట్. పెట్టిన బడ్జెట్‌కి మూడింతలు ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా. మరి.. తెలుగు రీమేక్ ఉందా? అనేది వెయిట్ అండ్ సీ. ∙హెబ్బా పటేల్, రాజ్‌తరుణ్ -
దటీజ్ మహాలక్ష్మి
... అనగానే టక్కున తమన్నా గుర్తుకు రాక మానరు. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంలోని ‘దటీజ్ మహాలక్ష్మి..’ పాట, తమన్నా చెప్పిన ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. మహాలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు మిల్కీ బ్యూటీ. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అ’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘మీ సినిమా టైటిల్ ‘ఇట్స్ మీ మహాలక్ష్మి’, ‘దటీజ్ మహాలక్ష్మి’.. ఈ రెంటిలో ఏది? అని ఓ అభిమాని ట్వీటర్లో అడిగిన ప్రశ్నకు ‘కన్ఫ్యూజ్ అవ్వొద్దు... ‘దటీజ్ మహాలక్ష్మి’ అని క్లారిటీ ఇచ్చారు తమన్నా. ‘క్వీన్’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అవుతోంది. తమిళంలో కాజల్ అగర్వాల్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘ప్యారిస్ ప్యారిస్’ టైటిల్ కన్ఫార్మ్ చేశారు. కన్నడ వెర్షన్‌కి ‘బటర్‌ఫ్లై’ అని పెట్టారు. ఇందులో పరుల్ యాదవ్ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ రీమేక్‌లో మంజిమా మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జామ్ జామ్’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. మరి.. నాలుగు భాషల్లో ఏ ‘క్వీన్’ బెస్ట్ అనిపించుకుంటారో వేచి చూద్దాం. -
జోడీ కుదిరింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హిట్ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి) తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఏబిసిడి’ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ మా చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
సత్యమూర్తి ఏం చేశాడు?
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేశ్ ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో జూన్ 2న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది. సినిమా అంతా ప్రస్తుత ట్రెండ్‌పై ఆధారపడి ఉంటుంది’’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: పమ్ర్ కుమార్. -
కన్ఫ్యూజ్డ్ దేశీ.. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్
దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రం తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజయ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీని తీసుకున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘ఆపరేషన్ అలిమేలమ్మ, చమక్’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు జుడా స్యాండీ. ‘‘ఏబిసిడికు జుడా స్యాండీను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాం. కన్నడలో యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ టూ టాలీవుడ్ బ్రో’’ అంటూ స్యాండీను టాలీవుడ్‌కు వెల్కమ్ చేశారు శిరీష్. ‘‘తెలుగు సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గౌరవంగా కూడా ఉంది’’ అని పేర్కొన్నారు జుడా స్యాండీ. -
పయనం ఎటు?
ముందుకు వెళితే 2726 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ. వెనక్కు తిరిగితే 3 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరునెల్వేలి. మరి.. విక్రమ్ పయనం ఎటు? అనే ప్రశ్నకు సిల్వర్ స్క్రీన్‌పైనే సమాధానం దొరుకుతుంది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సామీ స్క్వేర్’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రభు గణేశన్, బాబీ సింహా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్సంగీతం. విక్రమ్, హరి కాంబినేషన్లో దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సామీ స్క్యేర్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోలీసాఫీసర్‌గా విక్రమ్ మార్క్ యాక్షన్ కనిపించనుందని ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే ‘సామీ’ చిత్రం తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’ మూవీలో బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. -
అప్పుడే అయిపోయిందా అంటారు
మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ అతిథిగా, కొత్త నటీనటులు నటించిన చిత్రం ‘ఆనందం’. గణేష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో ఈరోజు విడుదల చేస్తున్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో పికి ్నక్కి వెళ్లొచ్చే విద్యార్థుల కథే ఈ చిత్రం. నేటి యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. వేసవిలో ప్రేక్షకులకు నవ్వుల జల్లులు పంచే చిత్రమిది. సినిమా చూశాక అప్పుడే అయిపోయిందా! అంటారు. మలయాళంలో 4కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు సంప్రదించారు. అయితే.. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఉండటంతో రీమేక్ చేయకుండా డబ్ చేశాం. ‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’ అంటూ స్టార్ హీరోలు, డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలంతా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారే కానీ, ఆచరణలో పెట్టరు. చిన్న సినిమాలను ప్రోత్సహించినప్పుడే చాలామందికి పని దొరుకుతుంది. నటుడవ్వాలని హైదరాబాద్‌కొచ్చిన నేను బ్రహ్మానందంగారు, రాజేంద్రప్రసాద్‌గారు వంటి వారితోపాటు చాలా సినిమాల్లో నటించా. కానీ, బ్రేక్ రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లా. మళ్లీ నిర్మాతగా మారా. త్వరలోనే మా సుఖీభవ మూవీస్ బ్యానర్లో ఓ స్ట్రెయిట్ ఫిల్మ్ నిర్మించనున్నాం’’ అన్నారు. -
ఇండ్రు.. నేట్రు.. నాళై...
... అర్థం కావడంలేదా? ఇవాళ, నిన్న, రేపు అని అర్థం. తమిళంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పేరుతో సందీప్ కిషన్ ఓ సినిమా చేయనున్నారని టాక్. తెలుగు సినిమాలతో పాటు సందీప్ తమిళ – తెలుగు బైలింగ్వల్ సినిమాలు కూడా చేస్తుంటారు. ఈసారి ‘ఇండ్రు నేట్రు నాళై’ అనే తమిళ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించనున్నారట. సురేష్ బాబు, రాజ్ కందుకూరి నిర్మించనున్న ఈ సినిమా ద్వారా శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారని సమాచారమ్. ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. -
కాలేజీ రోజులే ఆనందానికి కేరాఫ్
కాలేజ్ రోజులు, కాలేజ్ క్యాంపస్‌లో సరదాగా గడిపే క్షణాలే ఆనందానికి కేరాఫ్ అడ్రస్. ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగు రోజుల ఇండస్ట్రియల్ టూర్లో మూడు ప్రేమ జంటల మధ్య జరిగే కథతో వచ్చిన మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆనందం’. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో ఈ నెల 23న విడుదల చేస్తున్నారు సుఖీభవ మూవీస్ ఎత్తురి గురురాజ్. ఆయన మాట్లాడుతూ – ‘‘డబ్బింగ్ వర్క్ దాదాపు పూర్తి అయింది. ఈ నెల 17న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేస్తాం. సచిన్ వారియర్ స్వరపరిచిన మ్యూజిక్కు వనమాలి చక్కటి సాహిత్యం అందించారు. ‘హ్యాపీడేస్’ తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. చాలా మంది నిర్మాతలు రీమేక్ చేస్తాం అన్నా కూడా కథ మీద నమ్మకంతో అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సహనిర్మాతలు: వీరా వెంకటేశ్వరరావు, వీఆర్బీ రాజు, రవి వర్మ చిలువూరి, దర్శకత్వం: గణేశ్ రాజ్. -
‘హ్యాపీడేస్’ను మరిపించేలా...
ఆనందమే.. 4 కోట్లతో తీసిన సినిమా దాదాపు 20 కోట్లు రాబడితే ఏ చిత్రబృందానికైనా ఆనందమే. మలయాళ చిత్రం ‘ఆనందం’ అలాంటి రికార్డునే సొంతం చేసుకుంది. అరుణ్ కురియస్, థామస్ మాథ్యూ, రోషస్ మాథ్యూ, విశాక్ నాయర్ ముఖ్య తారలుగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో గణేశ్ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను ఆర్. సీతరామరాజు సమర్పణలో సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో అనువదిస్తున్నారు. వీర వెంకటేశ్వరరావు, వీఆర్బీ రాజు, రవి వర్మ చిలుకూరి ఈ చిత్రానికి సహనిర్మాతలు. ‘‘తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీ పడినా, మేము హక్కులు దక్కించుకున్నాం. రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. కానీ సినిమాలో తెలుగు నేటివిటీ ఎక్కువగా ఉండటంతో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నాలుగు రోజుల ఇండస్ట్రియల్ టూర్‌కి వెళ్లిన స్టూడెంట్స్ ఏం చేశారు? అనేది ఆసక్తికరం. సచిన్ వారియర్ మంచి సంగీతం ఇచ్చారు. మార్చి ఫస్ట్ వీక్‌లో సాంగ్స్‌ను, సినిమాను 16న విడుదల చేయాలనుకుంటున్నాం. ‘హ్యాపీడేస్’ను మరిపించే సినిమా అవుతుంది’’ అన్నారు గురురాజ్. -
స్పోర్ట్స్ కామెడీ
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద హిట్ సాధించిన మలయాళ చిత్రం ‘గోదా’. టవీనొ థామస్ , వామికా గబ్బి, ప్రముఖ రచయిత రెంజీ పనికర్ నటించిన ఈ చిత్రానికి బసిల్ జోసఫ్ దర్శకత్వం వహించారు. 2017 మేలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలీవుడ్లో సైతం ఈ సినిమాను రీమేక్ చేసేందుకు భారీ నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తెలుగులో కొంకా ప్రొడక్షన్స్ సంస్థ ‘గోదా’ డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ సొంతం చేసుకొంది. తెలుగు హక్కుల కోసం ఎంతోమంది పోటీ పడగా నిర్మాత సంతోష్ కొంకా ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నట్లు కొంకా ప్రొడక్షన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ కె.రామ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘ఇది స్పోర్ట్స్ కామెడీ మూవీ. ప్రస్తుతం తెలుగు రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మలయాళంలోలా తెలుగులోనూ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ముచ్చటగా మూడు!
కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకూ సమ స్యలు లేనివాళ్లు ఉండరు. అయితే ఆ సమస్యను ఎవరు ఎలా తీసుకుంటున్నారు? అనేది ముఖ్యం. కొందరు లైట్ తీసుకుంటారు. కొంతమంది టెన్షన్ పడతారు. తమన్నా అయితే ఏం చేస్తారో తెలుసా... జస్ట్ మూడు సూత్రాలు పాటిస్తారు. ‘‘ప్రతి సమస్యను పరిష్కరింటానికి మూడు సూత్రాలు ఉంటాయి. మొదటిది ఆ సమస్యను అంగీకరించటం, రెండోది దాన్ని మార్చగలగటం, మూడోది వదిలిపెట్టేయడం. ‘ఒకవేళ నువ్వు ఆ సమస్యను అంగీకరించలేకపొతే మార్చేయ్, దాన్ని మార్చలేకపోతే వదిలేయ్’’ అన్నారు తమన్నా. చాలా బాగా చెప్పారు కదండీ. మనమూ ఇవే సూత్రాలను పాటించడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతం హిందీ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘క్వీన్ వన్స్ఎగైన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు తమన్నా. -
డబ్బుంటే చాలు...
ఏ ప్రాబ్లమ్ అయినా సరే డబ్బుంటే చాలు సాల్వ్ అయిపోతుందని అనుకునే టైప్ అతను. ఎంత కన్నింగ్‌లా ఆలోచిస్తాడంటే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆ తర్వాత అతని లైఫ్ ఎలా టర్నింగ్ తీసుకుంది? అతని ఆలోచనల్లో మార్పు వచ్చిందా? అన్న అంశాలతో మలయాళంలో షఫీ రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. ఇప్పుడు ఈ చిత్రాన్ని సునీల్ కథానాయకుడిగా ఎన్. శంకర్ తెలుగులో సేమ్ టైటిల్‌తో రూపొందించారు. ‘‘2 కంట్రీస్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో సరికొత్త సునీల్‌ని చూడబోతున్నారు. సునీల్‌కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది. అమెరికాలో ఎక్కువ శాతం షూటింగ్ జరిపాం. షూటింగ్, డబ్బింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేశాం. వచ్చే వారం ఫస్ట్ లుక్‌ను, డిసెంబర్లో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు ఎన్. శంకర్. షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకర్త. -
అవకాశాలు పెంచుకునే దిశగా..
తమిళసినిమా: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీని పాటించే హీరోయిన్లలో నటి తమన్నా భాటియా ముందుంటారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తున్న తమన్నా ఇంచుమించు స్టార్ హీరోలందరితోనూ నటించింది. దీంతో పారితోషికాన్ని అందుకు తగ్గట్టుగానే పెంచుకుంటూ పోయిందంటారు. మధ్యలో అవకాశాలు కొరవడ్డా బాహుబలితో మరోసారి విజృంభించింది. అయితే ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని రూ.కోటి వరకూ పెంచేసిందట. దీంతో అవకాశాలు మళ్లీ తగ్గాయనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ మధ్య హిందీ చిత్రం క్వీన్ దక్షిణాది భాషలో రీమేక్‌లో నటించడానికి తమన్నాను సంప్రదించగా దర్శక నిర్మాతలు కళ్లు తిరిగి కిందపడేంత పారితోషికం డిమాండ్ చేసిందనే ప్రచారం జోరుగా సాగింది. తమన్నాకు అవకాశాలు తగ్గడానికి ఇదీ ఒకకారణం కాగా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడం మరో కారణం అన్నది చిత్ర వర్గాల టాక్. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించిన ఈ బ్యూటీ ఒక మెట్టు దిగొచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకోవడంతో మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయని సమాచారం. ఇంతకు ముందు చిత్రానికి రూ.కోటి, సింగిల్ సాంగ్‌కే రూ.60 లక్షలు పుచ్చుకున్న తమన్నా తాజాగా పారితోషికం విషయంలో పట్టువిడుపుల విధానాన్ని పాటిస్తున్నట్లు సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్న టాక్. ఏదేమైన ఈ మిల్కీ బ్యూటీ చేతిలో ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రెండేసి చిత్రాలు ఉన్నాయి. విక్రమ్‌తో రొమాన్స్ చేస్తున్న స్కెచ్ చిత్రం మినహా ఏ ఒక్క చిత్రం లోనూ స్టార్ హీరో లేరన్నది గమనార్హం. మరో విషయం ఏంటంటే ముందుగా క్వీన్ హిందీ చిత్రం రీమేక్‌లో నటించడానికి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిన తమన్నా ఇప్పుడు అదే చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. -
అమెరికా వెళుతున్నాం!
సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా షూటింగ్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘అమెరికాలో మాగ్జిమమ్ సినిమా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘2 కంట్రీస్’కి తెలుగు రీమేక్ ఇది. మన నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశాం. మలయాళ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్, తెలుగు చిత్రానికీ స్వరాలు సమకూరుస్తున్నారు’’ అని చెప్పారు. నరేశ్, షాయజీ షిండే, పోసాని కృష్ణమురళి, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: సి. రాంప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి రమణ. -
నేను, సమంత ఆ సినిమా చేయట్లేదు: చైతూ
బాలీవుడ్లో విజయవంతమైన రొమాంటిక్ కామెడీ సినిమా ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో తాను నటించడం లేదని యంగ్ హీరో అక్కినేని నాగాచైతన్య స్పష్టం చేశాడు. అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నాగాచైతన్య, ఆయన కాబోయే భార్య సమంత జంటగా నటిస్తారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్‌లో మీరు జంటగా నటించబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘మేం ఆ సినిమా చేయడం లేదు. మేం కనీసం ఆ సినిమా స్క్రిప్ట్ కూడా వినలేదు. ఇక ఆ సినిమా చేసే ప్రసక్తి ఎక్కడిది’ అని చైతూ తాజాగా తెలిపాడు. చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్: ద స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్’ నవల ఆధారంగా ‘ 2 స్టేట్స్’ సినిమా తెరకెక్కింది. హిందీలో హిట్టయిన ఈ సినిమా హక్కులను ఇటీవల తెలుగులో రీమేక్ చేసేందుకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో అలరించబోయే జంట ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. -
ఆ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ పోటీ
ఫిలిం ఇండస్ట్రీలో సక్సెసే కీలకం అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త కథలతో ప్రయోగాలు చేసేకన్నా, వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా రీమేక్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 60 కోట్లు పైగా వసూలు చేసిన ఓ చిన్న సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా, తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ ఎవరూ సొంతం చేసుకోకపోయినా త్వరలోనే సైరత్ తెలుగు రీమేక్ పై క్లారిటీ రానుంది. -
మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో
హైదరాబాద్: ఎట్టకేలకు మెగా వారసుడు రామ్ చరణ్ తేజ తన కొత్త చిత్ర షూటింగ్‌కు హాజరుకానున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బ్లాక్ బ్లస్టర్ మూవీ 'తనీ ఒరువన్' రీమెక్ కోసం ఆయన మార్చి నెలలో కొబ్బరి కాయ కొట్టనున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా ఆయనతో షూటింగ్ షురూ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 'ఈ చిత్ర ప్రాజెక్టు కార్యక్రమాలు నేటి నుంచి హైదరాబాద్ లో కొనసాగుతాయి. అరవింద స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ వారి షెడ్యూల్ ప్రకారం హాజరవుతారు. మార్చి తొలివారం నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
'వేదలం' రీమేక్ లో పవన్!
అజిత్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన 'వేదలం' సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి హీరోలు నటించే అవకాశముందని ఇప్పటివరకు ఊహాగానాలు విన్పించాయి. అయితే మరో టాప్ హీరో పేరు తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. 'ఖుషి'తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'వేదలం' రీమేక్ చేసేందుకు పవన్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. 'చాలా స్టోరీ లైన్లు అనుకున్నా వర్కవుట్ కాలేదు. వేదలం కథ పవన్ కు బాగా కుదురుతుందని భావించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ రెవేంజ్ స్టోరీని తెలుగులోనూ తెరకెక్కించాలని నిర్ణయించార'ని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ మొదలైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు ఎస్ జే సూర్య పలుమార్లు 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్ వచ్చారట. 'వేదలం' సినిమా నిర్మాత కూడా ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసారని సమాచారం. 'వేదలం' సినిమా రీమేక్ లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించే అవకాశముందని అంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. -
సిద్ధార్థ్‌తో మరోసారి
ఎక్కువగా వార్తల్లో ఉండే సినీ జంటల్లో సిద్ధార్థ్, సమంత అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి గురించి తరచూ ఏదో ఒక న్యూస్ ప్రచారంలో ఉంటుంది. సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లి పీట లెక్కనున్నారని, వీరి ప్రేమ బ్రేకప్ అయ్యిందని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సిద్దార్థ్‌తో సమంత ప్రేమ అటకెక్కిందని దీంతో ఆమె బాలీవుడ్లో మకాంకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెల్లడయ్యాయి. తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ నటించిన కావ్య తలైవన్ చిత్రం చాలా బాగుందని సిద్ధార్థ్ చాలా బాగా నటించారని సమంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. దీంతో ఈ ప్రేమికుల మధ్య సఖ్యత ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. సిద్ధార్థ్ సమంత తెలుగులో కలిసి ఒక చిత్రం చేసినా తమిళంలో ఇంతవరకు హీరో హీరోయిన్గా కలిసి నటించలేదు. తీయ వేల సెయ్యనుం కుమార చిత్రంలో అతిథిగా సమంత మెరిశారు. అయితే త్వరలో ఈ జంట ఒక చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ బెంగుళూర్ డేస్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో సమంత రొమాన్స్ చేయనుంది. మరో హీరోగా ఆర్య నటించనున్నారు. తెలుగుచిత్రం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. -
తెలుగు క్వీన్ సమంతే(నా)..!!
-
ఓ మై గాడ్...!
అనుకున్నవన్నీ జరగనిదే జీవితం. సినిమా పరిశ్రమ కూడా అంతే. ఊహించని పరిణామాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అష్టా చమ్మా గడుల్లో పావుల్లా... ఇక్కడి పరిస్థితుల్లో నిలకడ ఉండదు. రీసెంట్గా అలాంటి పరిస్థితే నయనతార విషయంలో ఎదురైందట. ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్‌లో నటించడానికి నయనతార పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ సినిమా నుంచి నయన తప్పుకున్నారని టాక్. వివరాల్లోకెళ్తే... వెంకటేశ్ ‘రాధ’ చిత్రం ఆగిపోవడంతో... ఆ సినిమాకు సంబంధించిన నయనతార డేట్స్‌ని ‘ఓ మైగాడ్’కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే... కథానుగుణంగా ‘రాధ’లో నయనతారది హీరోకు సమానమైన పాత్ర. ‘ఓ మైగాడ్’లో మాత్రం ఆమెది చాలా చిన్న పాత్ర. చిక్కంతా ఇక్కడే వచ్చింది. ‘రాధ’ చిత్రంలో నటించడానికి భారీ పారితోషికం అడిగారట నయనతార. అవే డేట్స్‌ని ఇప్పుడు ‘ఓ మైగాడ్’కు వాడుతున్నారు కాబట్టి, సదరు చిత్ర నిర్మాతలను అదే మొత్తం పారితోషికంగా ఇవ్వాలని నయన డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే... పాత్ర చిన్నది అవ్వడంతో అంత పారితోషికం మేం ఇవ్వలేమని కరాఖండీగా చెప్పేశారట సదరు చిత్ర నిర్మాతలు. ‘‘పాత్ర చిన్నదో పెద్దదో నాకు అనవసరం. నా డేట్స్ మీ దగ్గరున్నాయి. దానికి తగ్గ పారితోషికం మీరు ఇవ్వాల్సిందే’ అనేది నయన వాదన. దానికి ‘ఓ మై గాడ్’ నిర్మాతలు ససేమిరా అనడంతో... ‘ఓ మై గాడ్’ నుంచి నయన తప్పుకున్నారని తెలిసింది. మరి నయనతార స్థానాన్ని భర్తీ చేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా... ఓ గొప్ప అవకాశాన్ని నయనతార చేజార్చుకున్నారని ఫిలింనగర్ టాక్. -
కన్నడ సినిమా కోసం పోటీ పడుతున్న బన్నీ, ఎన్టీఆర్
-
ఆషికి 2 తెలుగు రీమేక్‌లో సచిన్ జోషి
హిందీలో సంచలన విజయం సాధించిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 'ఆషికి 2'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తన సొంత వైకింగ్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేశ్‌తో కలిసి సచిన్ జోషి ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. 'మౌనమేలనోయి', 'ఒరేయ్ పండు' లాంటి చిత్రాల్లో హీరోగా నటించిన బాలీవుడ్ హీరో సచిన్ జోషి ఈ తెలుగు చిత్రంలో హీరోగా చేయబోతున్నాడు. అయితే ఈ తెలుగు సినిమాకు ఇంకా పేరు మాత్రం నిర్ణయించలేదు. ''ఆషికి 2 తెలుగు వెర్షన్లో నటించడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు బండ్ల గణేశ్‌కు కృతజ్ఞతలు. నువ్వు నిజమైన స్నేహితుడివి'' అని సచిన్ తన ట్విట్టర్ పేజీలో రాశాడు. బండ్ల గణేశ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తాను, సచిన్ కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నామని, తాను కేవలం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటానని, సచిన్ తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీస్తున్నాడని ఆయన చెప్పారు. మిగిలిన నటీనటులను ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్తుందని అంటున్నారు. 'ఆజాన్', 'ముంబై మిర్రర్' లాంటి హిందీ చిత్రాలతో పాటు సన్నీ లియోన్ ఇటీవల నటించిన 'జాక్‌పాట్' చిత్రంలోనూ సచిన్ జోషి నటించాడు. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది.