'లూసిఫర్‌' రీమేక్‌ టైటిల్‌ ఫిక్సయినట్లేనా? | Chiranjeevi Lucifer Remake Title As Raaraju | Sakshi
Sakshi News home page

చిరంజీవి రీమేక్‌ సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌!

Published Wed, Mar 31 2021 4:55 PM | Last Updated on Wed, Mar 31 2021 6:59 PM

Chiranjeevi Lucifer Remake Title As Raaraju - Sakshi

మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ లూసిఫర్‌ తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ పాత్రను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ కుదిరిందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం ఈ రీమేక్‌ సినిమాకు రారాజు అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారట.తమిళ దర్శకుడు మోహన్‌ రాజా డైరెక్షన్‌ చేయనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

మాతృకలో పెద్దగా సాంగ్స్‌ లేకపోయినప్పటికీ తెలుగులో మాత్రం చిరు ఇమేజ్‌కు తగ్గట్లు పాటలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ మార్పుచేర్పులు సినిమాకు ఎంతమేరకు ప్లస్‌ అవుతాయో చూడాలి. ఈ సినిమాను ఎస్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిరంజీవి సినిమాకు కూడా టైటిల్‌ ఖరారైనట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నందున దీనికి వీరయ్య అనే పేరును ఫిక్స్‌ చేసినట్లు వినికిడి.

చదవండి: పల్లెటూరి వీరయ్యగా మెగాస్టార్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement