పండగ తర్వాత బిజీ | Lucifer Telugu remake is floors on January 20 | Sakshi
Sakshi News home page

పండగ తర్వాత బిజీ

Published Sat, Jan 9 2021 12:21 AM | Last Updated on Sat, Jan 9 2021 5:11 AM

Lucifer Telugu remake is floors on January 20 - Sakshi

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్‌’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్‌’ రీమేక్‌ పొలిటికల్‌ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement