చిరు ‘గాడ్‌ ఫాదర్‌’కు సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌, డేట్స్‌ కూడా ఫిక్స్‌! | Salman Khan Plays Guest Role In Chiranjeevi Godfather Movie | Sakshi
Sakshi News home page

Salman Khan: చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీకి సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

Published Tue, Aug 24 2021 9:08 PM | Last Updated on Tue, Aug 24 2021 9:25 PM

Salman Khan Plays Guest Role In Chiranjeevi Godfather Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్‌ ‘లూసిఫర్‌’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం చిరు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీకి గాడ్‌ ఫాదర్‌ అనే టైటిల్‌ ఖారారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు.

చదవండి: Nayantara: సత్యదేవ్‌కు భార్యగా నయనతార

ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్‌ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపించగా దీనిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో సల్మాన్‌ గాడ్‌ ఫాదర్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తాజా బజ్‌ ప్రకారం.. సల్మాన్‌ తన డెట్స్‌ సర్దుబాటు చేసి ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీకి తన షెడ్యూల్‌ కెటాయించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చెందిన స్టార్‌ నటీనటులు కూడా భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ను మేకర్స్‌ సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట.

చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్‌ హీరో తెలుసా! 

అయితే తెలుగులో నటించడానికి సల్మాన్‌ ఆసక్తిగా లేడని, ఈ నేపథ్యంలో గాడ్‌ ఫాదర్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లనేనని, ఈ చిరంజీవి సినిమా ఆఫర్‌ అనగానే సల్మాన్‌ హ్యాపీగా ఫీల్‌ అయినట్లు ఆయన సన్నిహితులు నుంచి సమాచారం. కాగా తమిళంలో పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ నటించనున్నాడట. మరి దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. అయితే ఇందులో చిరుకు సోదరిగా లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటిస్తోంది. సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నయన్‌, సత్యదేవ్‌లు భార్యభర్తలుగా కనిపించనున్నారట. 

చదవండి: Allu Arjun: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement