అట్టావా: టారిఫ్‌ల విషయంలో కెనడా, అమెరికా మధ్య రాజకీయం వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. బలవంతంగా టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కామెంట్స్ చేశారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే అది వారి ఇష్టం. అమెరికాపై ప్రతిస్పందనకు మేము సిద్ధంగా ఉన్నాం. మాపై ఉద్దేశపూర్వకంగా టారిఫ్‌లు విధిస్తున్నారు. దీన్ని వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతిస్తాయి. రెండు దేశాల సమిష్టి భద్రతను దెబ్బతిస్తాయి. కెనడాతో వాణిజ్యం అమెరికా దీర్ఘకాలిక శ్రేయస్సు, భద్రతకు ఎంతో ముఖ్యమైనంది. కెనడా ఉక్కు మరియు అల్యూమినియం, కీలకమైన ఖనిజాలు అమెరికాకు ఎంతో అవసరం. వీటిపై మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు నేటి నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు.
కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు.
Prime Minister Justin Trudeau on Donald Trump's looming 25% tariffs on Canada tomorrow:
"If the president does choose to implement any tariffs against Canada, we're ready with a response. A purposeful, forceful but reasonable, immediate response." pic.twitter.com/fUmmqj6sSr— Art Candee 🍿🥤 (@ArtCandee) January 31, 2025
Comments
Please login to add a commentAdd a comment