
ఒట్టావా:కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
మా దేశాన్ని,మా ఆటను మీరు తీసుకోలేరు’అని ట్రంప్‌కు చురకంటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెనడాపై అమెరికా టీమ్ విజయం సాధించాలని,కెనడా త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని ట్రంప్ ఒక పోస్టులో ఆకాంక్షించారు. దీనికి బదులుగా హాకీ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని ట్రంప్‌కు కౌంటర్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
You can’t take our country — and you can’t take our game.
— Justin Trudeau (@JustinTrudeau) February 21, 2025
అమెరికా,కెనడా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లలో గత 50 ఏళ్లలో ఎక్కువ మ్యాచ్‌లు కెనడానే గెలుపొందడం గమనార్హం.కాగా4, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత పొరుగు దేశమైన కెనడాపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment