breaking news
USA
-
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్‌ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పోర్ట్‌ఫోలియోలో మొండిబాకీల (ఎన్పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది. గత ఆరి్థక ఆఖరులో 3.59 శాతంగా ఉండగా, ఈసారి 3.7–3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం ఇందుకు కారణం కానుంది. క్రిసిల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్స్టైల్స్, గార్మెంట్స్..కార్పెట్స్, రత్నాభరణాలు, రొయ్యలు తదితర ఎగుమతుల ఆధారిత ఎంఎస్ఎంఈలపై టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని సంస్థ డైరెక్టర్ శుభ శ్రీ నారాయణన్ తెలిపారు. ఆరి్థక వృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న వ్యాపారాలకు మరింతగా రుణాలివ్వాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల రిసు్కలు కూడా ఉంటాయని గుర్తించాలని నివేదిక సూచించింది. గతంలో కూడా ఎంఎస్ఎంఈలు వేగంగా వృద్ధి చెందినప్పుడు, కొన్నాళ్ల తర్వాత ఎన్పీఏలు భారీగా పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంఎస్ఎంఈల రుణాలు సుమారు 17 శాతంగా, కార్పొరేట్ రుణాలు 38 శాతంగా ఉంటాయి. రిటైల్ లోన్లకు సంబంధించి అన్సెక్యూర్డ్ విభాగంలోనూ రుణ నాణ్యతపై ఓ కన్నేసి ఉంచాల్సి వస్తుందని తెలిపింది. -
రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్‌కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా లేరంటూ తాజాగా రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లూక్ ఆయిల్‌పై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల కొరఢా ఝులిపించారు.దీంతో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకుంటున్న రష్యా డిస్కౌంట్ క్రూడ్‌కు అడ్డుకట్ట పడొచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్ నిర్వహిస్తోంది. భారత్‌కు రష్యా రోజుకు 1.7–1.8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఎగుమతి చేస్తుండగా.. ఇందులో దాదాపు సగం వాటా రిలయన్స్‌దే కావడం గమనార్హం. జామ్‌నగర్ రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్న పెట్రోలియం ప్రొడక్టుల్లో అత్యధికంగా యూరప్, అమెరికాకు మార్కెట్ ధరతో విక్రయిస్తున్న రిలయన్స్... దీని ద్వారా భారీగా మార్జిన్లను ఆర్జిస్తోంది. అయితే, అమెరికా తాజా ఆంక్షలతో అమెరికన్ లేదా విదేశీ సంస్థలేవీ రష్యా సంస్థలతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదు. ఉల్లంఘిస్తే, సివిల్ లేదా క్రిమినల్ జరిమానాలకు గురికావాల్సి వస్తుంది. అమెరికాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యా క్రూడ్ దిగుమతులను రిలయన్స్ గణనీయంగా తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 35 బిలియన్ డాలర్లు.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రిలయన్స్ దాదాపు 35 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ క్రూడ్‌ను డిస్కౌంట్ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ఉక్రెయిన్ వార్‌కు ముందు, అంటే 2021లో రిలయన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసిన క్రూడ్ విలువ కేవలం 85 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం విశేషం. 25 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ వరకు ముడి చమురు దిగుమతి చేసుకునేలా (ఏడాదికి 25 మిలియన్ టన్నులు) రాస్నెఫ్ట్తో 2024లో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా రాస్‌నెఫ్ట్, లూక్ఆయిల్పై విధించిన ఆంక్షలతో నవంబర్ 21 లోపు ఆయా కంపెనీలతో రిలయన్స్ లావాదేవీలను నిలిపేయాల్సి ఉంటుంది. కాగా, ఈ పరిణామాలపై రిలయన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోపక్క, తాజా ఆంక్షలతో నయారా ఎనర్జీకి కూడా మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ కంపెనీలో రాస్‌నెఫ్ట్‌కు 49.12 శాతం వాటా ఉంది. ఇది పూర్తిగా రష్యా క్రూడ్ దిగుమతులపైనే ఆధారపడి రిఫైనరీ, రిటైల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జూలైలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆంక్షలతో ఇప్పటికే నయారా ఇబ్బందుల్లో చిక్కుకుంది.ప్రభుత్వ రిఫైనరీలకు నో ప్రాబ్లమ్! అమెరికా ఆంక్షల ప్రభావం ప్రభుత్వ రంగ రిఫైనింగ్ సంస్థలపై (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతరత్రా) ఉండకపోవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వ రిఫైనరీలు రాస్‌నెఫ్ట్, లూక్‌ఆయిల్ నుంచి నేరుగా క్రూడ్ దిగుమతి చేసుకోవడం లేదు. మధ్యవర్తి ట్రేడర్లు, ప్రధానంగా యూరోపియన్ ట్రేడర్ల (వారిపై ఆంక్షలు లేవు) నుంచి ముడి చమరు కొనుగోలు చేస్తుండటం వల్ల, ప్రస్తుతానికి దిగుమతులు యథాతథంగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నేరుగా రాస్‌నెఫ్ట్ ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందనేది వారి అభిప్రాయం. రష్యా చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని, మోదీ ఈ మేరకు హామీనిచ్చారంటూ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకా అలాంటి ప్రకటనేదీ చేయలేదు. పైగా, రష్యా క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను కూడా ట్రంప్ విధించడం తెలిసిందే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత రష్యా క్రూడ్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా అవతరించిన నేపథ్యంలో తాజా ఆంక్షలను భారత్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
ట్రంప్ టారిఫ్ లకు భారత్ చెక్
-
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్‌లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్‌గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్‌తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్‌లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్‌ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్‌మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఈ ఏడాది జూన్‌లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్‌కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి! -
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు) -
అమెరికా నుంచి శుభవార్త!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ వార్’లో మెత్తబడనున్నారా?. వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో త్వరలో భారత్‌కు గుడ్‌న్యూస్ అందించబోతున్నారా?. ఇప్పటికి అమలవుతున్న 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించబోతున్నారా?.. భారత్ చెందిన ఓ వార్తా సంస్థ కథనం అవుననే అంటోంది.అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తాజాగా దీపావళి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతోనూ ఈ అంశంపైనే మాట్లాడానని అన్నారాయన. ఇటు ట్రంప్ ఫోన్‌కాల్‌ను ధృవీకరించిన మోదీ.. ఏ అంశాలపై మాట్లాడరనేది మాత్రం చెప్పలేదు. ఈలోపు.. జాతీయ ఆంగ్ల పత్రి మింట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ట్రేడ్‌డీల్‌కు భారత్-అమెరికా చేరువయ్యాయని, ఇందులో భాగంగానే భారత్‌పై అమెరికా విధించిన సుంకాల్లో భారీగా తగ్గుదల ఉండబోతోందని ఆ కథనంలో ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్లపైనా ఈ ఒప్పందం ప్రభావం చూపించబోతోందని పేర్కొంది. క్రమక్రమంగా తగ్గించే అవకాశం ఉందని ప్రస్తావించింది.అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం శక్తి(ఎనర్జీ), వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉండబోతోంది. ఈ తగ్గింపుతో సుంకాలు 50 శాతం నుంచి 15-16 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ముగ్గురికి మాత్రమే తెలుసు అని మింట్ కథనం పేర్కొంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయా ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించే విధానాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాసింది. ఈ కథనంపై మరో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్.. ఇటు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖను, అటు వైట్‌హౌజ్‌ను సంప్రదించింది. అయితే.. ఇరువర్గాలు దీనిపై స్పందించలేదు.47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశానికి ఆసియాన్ దేశాల నాయకులతో పాటు అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సైప్రస్, ఫిన్లాండ్ దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ప్రాంతీయ సహకారానికి, ద్వైపాక్షిక ఒప్పందాలకు కీలక వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఓ పేరుంది.అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల టైమ్‌లైన్2023 జూన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయం, టెక్నాలజీ, ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.2023 ఆగస్టు: అమెరికా భారత దిగుమతుల పన్నులపై సమీక్ష ప్రారంభించింది. దీంతో చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి.2024 ఫిబ్రవరి: వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతుల పరిమితులు, పన్నుల తగ్గింపు అంశాలపై చర్చలు కొనసాగాయి.2024 జూన్: భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSMEs), రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.2024 డిసెంబర్: పన్నుల సమీక్ష విధానం ప్రతిపాదించబడింది. మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తుల దిగుమతులపై దృష్టి సారించాయి.2025 సెప్టెంబర్ 16: ఆగిపోయిన వాణిజ్య చర్చలు.. ట్రంప్ సుంకాల ప్రభావంతో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధులు భారత్‌కు చర్చల కోసం వచ్చారు.2025 అక్టోబర్ 13–20: చర్చలు తుది దశకు చేరాయి. ట్రంప్-మోదీలు ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.2025 అక్టోబర్ 22: వాణిజ్య ఒప్పందం తుది రూపు దిద్దుకుంటోంది. మింట్ నివేదిక ప్రకారం.. అమెరికా 50% టారిఫ్‌ను 15–16%కి తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది -
వైట్‌హౌజ్ దీపావళి సెలబ్రేషన్స్‌లో ట్రంప్.. వైరల్ అవుతున్న ఫొటోలు
-
దీపావళి వేడుకల్లో ట్రంప్.. మోదీపై ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక సమయం) వైట్ హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు, భారతీయ అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, దీపావళి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారతదేశ ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు భారత ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. మేము ప్రపంచ వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా మోదీతో నాకు స్నేహం ఉంది. అలాగే, పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దు అని మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. దాంట్లో వాణిజ్యం కూడా ఉందనేది వాస్తవం. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం’ అని చెప్పుకొచ్చారు.BREAKING 🚨 President Trump just lit the diyas in celebration of Diwali. The Peace President 🙏 pic.twitter.com/kpDLTMRIkf— MAGA Voice (@MAGAVoice) October 21, 2025ఇదే సమయంలో దీపావళి పండుగ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్..‘చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము. ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి. దీపావళి సందర్భంగా ఆనందించేవారు శత్రువులను ఓడించడం, అడ్డంకులు తొలగించడం.. బందీలను విడిపించడం గురించి పురాతన కథలను గుర్తుచేసుకుంటారు. దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికీ జ్ఞాన మార్గాన్ని వెతకడం, శ్రద్ధతో పనిచేయడం, అనేక ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.⚡ US President Trump lights a diya in the Oval Office to celebrate Diwali. pic.twitter.com/yFfSgDiEse— OSINT Updates (@OsintUpdates) October 22, 2025వైట్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ODNI డైరెక్టర్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ట్రంప్ పరిపాలన నుండి అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ-అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.NOW — POTUS Hosts A Diwali Celebration In The Oval Office 🪔"In the spirit of Diwali, we should acknowledge all the administration is doing to boost technology innovation leading to economic growth...Mr. President, I'd like to thank you." - Business Leader pic.twitter.com/oYJcaSxmr1— Townhall.com (@townhallcom) October 21, 2025 -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్‌కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
దిగిరాకపోతే 155 శాతం సుంకాలు: ట్రంప్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు. తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement) చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్‌హౌజ్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్‌ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్‌లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్ 29, 30 తేదీలలో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ట్రంప్ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన నెతన్యాహు! -
ట్రంప్ పై దాడికి మరో కుట్ర.. ?
-
‘భారత్‌కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్‌లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్‌పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్‌పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్‌పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్‌ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు. -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ! -
హెచ్1బీ ఫీజు పెంపుపై పిటిషన్
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్‌లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. -
7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్‌తో సెంచరీ కొట్టేశా!
వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్‌మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన సి లిబర్‌మాన్ తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంలో ముఖ్యంగా నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం, తీవ్రమైన మాంద్యం పరిస్థితులు తదితర విషయాలను షేర్ చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి.. ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు చిట్కాలుసంబంధాలపై దృష్టి (Focus on relationships): బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost)సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో తన స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని చెప్పారు.వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్‌లో నడవడం, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. నచ్చిన పని, మీనింగ్పుల్గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్‌కు ఎడిటర్‌గా పనిచేశా. 40 ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా చాలెంజింగ్ అండ్ రివార్డింగ్ జాబ్ అది చాలా ఇష్టం చేశా. ఇప్పటికీ బిజీగా ఉండటానికి రాస్తాను.కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్‌ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్‌కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్‌లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్‌ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్‌గా చెప్పాలంటే నోర్‌పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు) -
‘ఆ సుంకాల ప్రభావం ఊహించినంత తీవ్రమేమీ కాదు’
ప్రపంచ వృద్ధి మందగమనానికి "అనిశ్చితి, రక్షణవాదం" వంటి హెడ్‌విండ్స్ (ప్రతికూల ప్రభావాలు) కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పేర్కొంది. అయినప్పటికీ, వాణిజ్య సుంకాల వల్ల వచ్చే ప్రభావం "మొదట భావించిన దానికంటే తక్కువగా ఉందని" సంస్థ విశ్లేషించింది."ప్రధాన విధాన మార్పులు ఉన్నప్పటికీ, ప్రపంచ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. సుంకాల పెరుగుదల ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం వెనుక, కొత్త వాణిజ్య ఒప్పందాలు, బహుళ మినహాయింపులు, సరఫరా గొలుసులను పునఃఆయోజనం చేయడంలో ప్రైవేట్ రంగం చురుకుదనం ముఖ్య పాత్ర పోషించాయి" అని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివర్ గౌరించాస్ పేర్కొన్నారు.భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా అంచనా ప్రకటించింది. గత అంచనా అయిన 6.4 శాతాన్ని ఎగువకు పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 0.20 శాతం తగ్గిస్తూ 6.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది.అమెరికా టారిఫ్‌ల ప్రభావాలకు మించి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బలమైన వృద్ధి నమోదు కావడాన్ని తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం.ప్రపంచ వృద్ధి 2024లో నమోదైన 3.3 శాతం నుంచి 2025లో 3.2 శాతానికి, 2026లో 3.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి సైతం 2024లో నమోదైన 4.3 శాతం నుంచి 2025లో 4.2 శాతానికి, 2026లో 4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్‌లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్‌కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్‌కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
నేటి నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు మళ్లీ షురూ
అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులను ఇండియా పోస్ట్ అక్టోబర్ 15 నుంచి (నేడు) పునప్రారంభిస్తున్నట్లు పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) మార్గదర్శకాల ప్రకారం భారత్ నుంచి వెళ్లే షిప్‌మెంట్స్ కన్సైన్మెంట్ విలువలో 50 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుందని పేర్కొంది.పోస్టల్ ఐటమ్‌లపై ప్రోడక్టును బట్టి సుంకాలు విధించడంలాంటివి ఉండదని వివరించింది. దీనితో చిన్న వ్యాపారులు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పోస్టల్ శాఖ తెలిపింది. జులై 30, 2025న యూఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది. దాని ప్రకారం.. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత మినహాయింపులను ఉపసంహరించుకుంది. 100 డాలర్ల లోపు బహుమతులు మినహా దాదాపు అన్ని షిప్మెంట్లపై తప్పనిసరి కస్టమ్స్ సుంకాలు విధించారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ద్వారా అధికారం పొందిన రవాణా క్యారియర్లు, అర్హత కలిగిన పార్టీల కోసం కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. దాంతో ఇండియా పోస్ట్ ఆగస్టు 25, 2025 నుంచి యూఎస్‌కు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్‌ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్‌పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్‌లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్‌గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్‌కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్‌కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైమ్ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్‌పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్‌ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా? -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్‌ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్‌ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్‌లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్‌ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్‌హోల్‌లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్‌బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్‌బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్‌కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్‌రెడ్డి పిటిషన్
విజయవాడ లీగల్: ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తరఫున చంద్రగిరి విష్ణువర్ధన్ సోమవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్ధించారు. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 5 వరకు న్యూయార్క్‌లో నిర్వహించే సమావేశాలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డికి ఆహా్వనం అందింది. ఇప్పటికే ఈనెల 27 నుంచి 31వరకు అమెరికా పర్యటన నిమిత్తం మిథున్‌రెడ్డి పాస్‌పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈనెల 20నుంచి వచ్చేనెల 5వరకు అమెరికా వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని మిథున్‌రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ, న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదావేశారు. విచారణకు సహకరిస్తున్నా రిమాండ్ పొడిగింపు మద్యం అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ రిమాండ్ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వారందరినీ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరితోపాటు బెయిల్‌పై ఉన్న మిథున్‌రెడ్డి, పైలా దిలీప్, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఏసీబీ న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రిమాండ్ ముగుస్తున్న ప్రతీసారి ఏవిధమైన మార్పులు లేకుండా ఒకేవిధమైన రిమాండ్ పొడిగింపు నోటీసును న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.ఇప్పటివరకు ఈ కేసులో సిట్ 35 రూపాయలు కూడా స్వా«దీనం చేసుకోలేదన్నారు. నిందితులందరిపై చార్జిషీటు దాఖలుచేసినా 200 రోజుల నుంచి వారందరినీ జైలులోనే ఉంచారన్నారు. వారిని విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై ప్రాసిక్యూషన్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్‌ను పొడిగించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాణి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సెల్‌ఫోన్ తెరిచేందుకు అనుమతి మద్యం అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు వద్ద సీజ్ చేసిన సెల్ఫోన్లో మరిన్ని ఆధారాలున్నాయని పేర్కొంటూ సెల్‌ఫోన్‌ను తెరిచేందుకు బయోమెట్రిక్‌కు అనుమతించాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దీనికి అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న కాలంలో నిధుల అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్‌ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్‌లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్‌కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్‌ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్‌లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్‌లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్‌తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
మన ఎగుమతిదార్లకు మంచి చాన్స్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో భారతీయ ఎగుమతిదార్లు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో అగ్రరాజ్యానికి ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి చాన్స్ లభించవచ్చని పేర్కొన్నారు. 2024–25లో అమెరికాకు భారత్ సుమారు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. చైనాపై భారీ టారిఫ్‌ల వల్ల అమెరికన్ కొనుగోలుదారులు భారత్‌వైపు మొగ్గు చూపవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఈ వాణిజ్య యుద్ధం ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో చైనా దిగుమతులపై మొత్తం సుంకాలు 130 శాతానికి చేరతాయి. అమెరికా డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి కీలమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై అక్టోబర్ 9న చైనా తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత్‌పై అంతకన్నా ఎక్కువగా 50 శాతం వేస్తోంది. దీనితో మన ఉత్పత్తుల కన్నా చైనా ఉత్పత్తులే చౌకగా లభించే పరిస్థితి నెలకొంది. అయితే, చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు, మిగతా దేశాలతో పోటీపడలేనంతగా పెరిగిపోతాయని ఓ ఎగుమతిదారు తెలిపారు. దీంతో సుంకాలు తక్కువగా ఉన్న దేశాల వైపు అమెరికన్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా తెలిపారు. ఇప్పటికే టార్గెట్లాంటి రిటైల్ దిగ్గజాలు కొత్త ఉత్పత్తుల కోసం తమను సంప్రదించినట్లు వివరించారు. ఈవీల రేట్లకు రెక్కలు.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), విండ్ టర్బైన్లు, సెమీకండక్టర్ల విడిభాగాల రేట్లకు రెక్కలొచి్చనట్లు మేథావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్ల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోందని పేర్కొంది. వరుసగా నాలుగో ఏడాది 2024–25లో కూడా భారత్‌కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా, దిగుమతుల్లో 6.22 శాతంగా ఉంటోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్‌పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్‌కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ఎడారిలోన పంట పండెనెంత సందడి!
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి. ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్‌లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. మాయా మట్టీ!ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! (చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్) -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్‌బాల్ ఆట ముగిసిన తర్వాత 18ఏళ్ల బాలుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్ మేయర్ జాన్ లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సంప్రదాయ ఫుట్‌బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్‌పాట్
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్‌ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్. కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!సెప్టెంబర్ 19న డెట్రాయిట్‌లోని కొమెరికా పార్క్‌లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్‌లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్అవే విజేత వాలెరీ విలియమ్స్‌కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్‌లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది. మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. -
ఆ దగ్గు మందు మా దగ్గరకు రాలేదు: అమెరికా స్పష్టం
వాషింగ్టన్: భారతదేశంలో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ అమెరికాకు రాలేదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ధృవీకరించింది. భారత్‌లో ఒక దగ్గు మందు కారణంగా పలువురు చిన్నారులు మరణించినట్లు వస్తున్న ఆరోపణల గురించి తమకు తెలిసిందని అమెరికా పేర్కొంది. ఈ ఉత్పత్తులు భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఎగుమతి కాలేదని ఎఫ్‌డీఏ పేర్కొంది. విషపూరిత మందులు అమెరికాలో ప్రవేశించకుండా చూసే విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్‌డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్ చేస్తున్న మందులు సురక్షితంగా, అత్యున్నత నాణ్యతతో ఉండేలా నిర్ధారించుకోవాలని తయారీదారులను ఎఫ్‌డీఏ కోరింది. భారతదేశంలో విక్రయిస్తున్న కొన్ని రకాల దగ్గు, జలుబు మందులలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉందనే వార్తల నివేదికల గురించి తమకు తెలిసిందని యూఎస్ ఎఫ్‌డీఏ తెలిపింది.మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.కోల్డ్రిఫ్ సిరప్‌కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్పూర్, సికార్‌లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్‌లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్లు, హోల్‌సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. -
అమెరికాలో భారీ పేలుడు.. ఏకంగా 19 మంది మృతి
-
అమెరికా బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు
మెక్ఈవెన్ (యూఎస్): అమెరికాలోని టెన్సెసీ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం (స్థానిక కాలమా నం ప్రకారం) మందుగుండు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు (దాదాపు 19 మంది) మర ణించినట్లు, చాలామంది గల్లంతైనట్లు తెలిసింది. అయితే, మరణాల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. హిక్మాన్ కౌంటీలోని అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ అనే సంస్థ కర్మాగారంలో ఉదయం 7.45 గంటల సమయంలో పేలుడు సంభవించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సహాయ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా మళ్లీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టలేక పోయారు. ‘పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు ఉన్నట్లు తెలిసింది. కానీ ఎంతమంది ఉన్నారనేది తెలియదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ పనిచేసేవారి కుటుంబాలను సంప్రదిస్తున్నాం’అని హంప్ష్రేస్ కౌంటీ షెరిఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు. -
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు. -
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంయాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే.. మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు. -
H1B వీసా నిబంధనల్లో మరో షాకిచ్చిన ట్రంప
-
‘శాంతిదూత’ ట్రంప్.. నోబెల్ కల నెరవేరేనా?
2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)ప్రకటనపై యావత్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ రేసులో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా గాజా సంక్షోభానికి ముగింపు పడేలా.. ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కి తీరుతుందేమోనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ అర్హత దక్కే అవకాశాలపై ఓ లుక్కేద్దాం.. తాను శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపానని, ఎనిమిదవ యుద్ధం ముగింపు దశలో(గాజా) ఉందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తద్వారా జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించటం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం.. లాంటి కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అన్నివిధాలా అర్హుడినని అంటున్నారాయన(Trump Nobel Peace Prize). మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ఇప్పటికే ఆయన్ని ‘పీస్ ప్రెసిడెంట్’గా ప్రకటించుకుంది. ఇదిలా ఉంటే.. 2025కిగానూ ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఒప్పందం ఆధారంగా ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలనే ప్రతిపాదనతో యూఎస్ చట్టసభ్యురాలు క్లౌడియా టెన్నీ నామినేషన్ సమర్పించారు. దీనికి ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా మద్దతు ప్రకటించాయి కూడా. ఇస్తారా? ఇవ్వరా?నోబెల్ శాంతి బహుమతి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. దీనికి ఎవరు.. ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్‌కి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువ. నోబెల్ కమిటీ సాధారణంగా దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలు, అంతర్జాతీయ సహకారం, నిరుపేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా చూస్తుంది. అంతేకాని తాత్కాలిక ఒప్పందాలు, రాజకీయ ప్రచారాలు కాదు. వీటికి తోడు ట్రంప్ చర్యలు, అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం, ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం చూపడం.. ఇవన్నీ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే ట్రంప్ ప్రధానంగా చెబుతున్న గాజా ఒప్పందం తాజాగా కుదరగా.. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ గడువు ఫిబ్రవరి 1వ తేదీతోనే ముగియడం గమనించదగ్గ విషయం. పైగా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతును ప్రకటించిన వాళ్లంతా కూడా ఈ మధ్యకాలంలోనే ఆ ప్రకటనలు చేయడం మరో విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ట్రంప్ బహిరంగంగా బహుమతిని కోరడం, నోబెల్ కమిటీపై విమర్శలు చేయడం వంటి చర్యలు బహుమతి అవకాశాలను తగ్గించాయి. అల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా కమిటీ పనిచేస్తోందని.. ఒబామా ఏమి చేశాడో తెలియకుండానే బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. అలాగే.. ఏదో ఒక కారణం చూపుతూ తనకు నోబెల్ ఇవ్వొద్దని చూస్తున్నారని కూడా అన్నారాయన. ఒకవేళ.. ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. దాని విలువపై ప్రశ్నలు రేకెత్తే అవకాశం లేకపోలేదు. గాజా యుద్ధంలో తాత్కాలిక ఒప్పందం ఆధారంగా బహుమతి ఇవ్వడాన్ని ‘శాంతి కృషి’కి అవమానంగా నిపుణులు భావించే అవకాశం లేకపోలేదు. నార్వే.. అందుకు సిద్ధమా?..తనకు నచ్చకున్నా.. కోపం వచ్చినా.. ట్రంప్ ఎంతకైనా తెగిస్తారన్నది గత 9 నెలలకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేపథ్యంలో.. నార్వే అప్రమత్తమైంది. నోబెల్ బహుమతి తనకే రావాలంటూ నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్బర్గ్క్కి ట్రంప్ ఇంతకు ముందే ఫోన్ చేశారు. అయితే.. నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హార్ప్వికిన్ మాత్రం తాము ఒత్తిళ్లకు తలొగ్గమని, పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ నిర్ణయం అమెరికాతో తమ దేశ సంబంధాలపై ప్రభావం చూపించొచ్చనే ఆందోళన అక్కడి రాజకీయవర్గాల్లో ఉంది. ‘‘ట్రంప్ ఎలా స్పందిస్తారో తెలియదు.. సిద్ధంగా ఉండాలి’’ అని నార్వే సోషలిస్ట్ పార్టీ నేత క్రిస్టీ బెర్గ్స్టో అంటున్నారు.శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ 338 నామినేషన్లు (244 వ్యక్తులు, 94 సంస్థలు) స్వీకరించింది, రేసులో.. పాకిస్తాన్(ఇమ్రాన్ ఖాన్), ఎలాన్ మస్క్(అమెరికా), పోప్ ఫ్రాన్సిస్ (ఇటలీ.. మరణాంతరం), అన్వర్ ఇబ్రహీం(మలేషియా)తో పాటు సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సూడాన్), అలాగే.. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(CPJ), ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ (WILPF) లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖంగా నిలిచాయి.2025 నోబెల్ శాంతి బహుమతి భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10న(శుక్రవారం.. ఇవాళే) మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) ప్రకటించబడుతుంది. ఈ ప్రకటనను నార్వేలోని ఒస్లో నగరంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నర్ ఫ్రైడ్నెస్ ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ అధికారిక YouTube ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. -
H1B Visa: కారు మబ్బులు.. కాంతి రేఖలు
మొదట సుంకాల మోత... ఆ తర్వాత కొత్త హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు వ్యవహారం.. ఆపైన బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలితో భారత్-అమెరికా సంబంధాల్లో తెలియని గందరగోళం నెలకొంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మొన్న అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావమూ మన వీసాలపై పడనుంది.ఇప్పుడేం జరిగింది?హెచ్1బీ వీసాల ఫీజును ఒకేసారి దాదాపు 60 రెట్లు పెంచుతూ, లక్ష డాలర్లు చేస్తున్నట్టు సెప్టెంబర్ 19న ట్రంప్ సంతకం చేశారు. గందరగోళం రేగడంతో, కొత్త దరఖాస్తులకే ఈ హెచ్చు ఫీజు వర్తిస్తుందనీ, ఇప్పటికే వీసా ఉన్నవారికీ, రెన్యువల్ కోరుతున్న వారికీ అది వర్తించదనీ వాషింగ్టన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో అక్టోబర్ 1 నాటి షట్‌డౌన్ నిర్ణయంతో మరో చిక్కు వచ్చి పడింది.షట్‌డౌన్ కథేమిటి?ఏటా అక్టోబర్ 1 నుంచి మరుసటి సెప్టెంబర్ 30 వరకు అమెరికా ప్రభుత్వపు ఆర్థిక సంవత్సరం. ఆ కాలవ్యవధికి అన్ని శాఖల వ్యయపరిమితిని నిర్ణ యిస్తూ మన బడ్జెట్ తరహాలో నిధుల కేటాయింపు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా, దేశాధ్యక్షుడు సంతకం చేయాలి. ఈ ఫండింగ్ బిల్ సమయానికి ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే, అత్యవసరం కాని సర్వీసులు స్తంభిస్తాయి. దీనితో కొత్త దరఖాస్తులు, బదిలీలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియలు ఆగిపోయాయి.ఎంత కష్టం? ఎవరికి నష్టం?నిజానికి, అమెరికన్ పౌరులు కానివారు ఆ దేశంలో ప్రత్యేక ఉద్యోగాలు సంపాదించడానికి హెచ్1బీ వీసాలు ఒక మార్గం. ఏటా గరిష్ఠంగా 65 వేల వీసాలే ఇవ్వాలి. అమెరికాకు చెందిన ఉన్నత విద్యాసంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, లేదా డాక్టరేట్ చేసిన విదేశీ వృత్తి నిపుణులకై అదనంగా మరో 20 వేల వీసాలు ఇవ్వవచ్చు. నిరుడు 80 వేల మందికి పైగా భారతీయులు హెచ్1బీలకు దరఖాస్తులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన మొత్తం హెచ్1బీలలో 71 శాతం మన భారతీయులవే. పెంచిన తాజా వీసా ఫీజు ఆ దేశంలో భారీ టెక్ సంస్థలకే నష్టం. అవన్నీ విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయి.తెరుచుకున్న కొత్త తలుపులుఇప్పుడు ట్రంప్ ఫీజు పెంపుతో భారతీయ వృత్తి నిపుణుల్లో లక్ష మందిపై ప్రభావం పడుతుందని అంచనా. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లోని వారు ఎక్కువ నష్టపోతారు. ఈ పరిస్థితుల్లో చైనా, జర్మనీల నుంచి బ్రిటన్ దాకా వివిధ దేశాలు భారత్‌లోని ప్రతిభావంతుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక వీసా విధానాల్ని అందిస్తామంటున్నాయి. చైనా ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కొత్త ‘కె’ వీసాను అమలులోకి తెచ్చింది. స్పాన్సర్ అవసరం లేకపోవడం ‘కె’ వీసా ఆకర్షణ.మరోపక్క విదేశీ ఉద్యోగులను తీసుకొనేందుకు త్వరలోనే కొన్ని ప్రతిపాదనల్ని చేయనున్నట్టు కెనడా ప్రధాని ఇటీవలే ప్రకటించారు. అమెరికాకు ప్రత్యామ్నాయం తమ ఆర్థిక వ్యవస్థే అంటూ, ఐటీ, సైన్స్, టెక్ రంగాలలో భారతీయులకు పుష్కలంగా అవకా శాలున్నాయని జర్మనీ చెబుతోంది. పైగా, జర్మనీలో పెరుగుతున్న వయోవృద్ధుల రీత్యా కనీసం 2040 వరకు ఏటా దాదాపు 2.88 లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. ఇవన్నీ అమెరికన్ వీసాల సంక్షోభ వేళ భారతీయులకు అందివచ్చిన సరికొత్త అవకాశాలు.రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? వీసా ఫీజుపై ఇవే నిబంధనలు కొనసాగితే, అమెరికన్ ఐటీ సంస్థలు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు పెట్టి కొత్త ఉద్యోగుల్ని తీసుకువెళ్ళడం కష్టమే. కాకపోతే, మరో మార్గం ఉంది. భారతీయుల ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవి ఇక్కడే ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ (జీసీసీలు) నెలకొల్పవచ్చు. ఇప్పటికే మన దేశంలో 1,600 జీసీసీలు పెట్టాయి. మరిన్ని జీసీసీ లొస్తే, వీసా షరతుల ప్రభావం ఉండదు. ఈ 2025 నాటికి భారత్‌లోని జీసీసీలు 20 లక్షల మందికి పైగా నిపుణులకు ఉపాధినిస్తున్నాయి. ఏమైనా, సాక్షాత్తూ అమెరికాయే వలస జీవులతో నిర్మితమైన దేశం. ఆ సంగతి ట్రంప్ మర్చిపోతేనే కష్టం. -
సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్‌లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్‌రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి30 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
కాలిఫోర్నియా రాష్ట్ర సెలవుగా దీపావళి
న్యూయార్క్: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరంలో పబ్లిక్ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎంఆర్ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్ దర్శనా పటేల్‌ను అభినందించారు. -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
నోబెల్ వరించిన విషయం తెలియకుండానే..
కొన్ని సమయాల్లో ఊహకందని విధంగా అంతర్జాతీయ స్థాయి రేంజ్లో బహుమతి వరించినా..అది ఆ వ్యక్తికి తెలియకపోతే.. ఔను..! ఆ వ్యక్తి తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే..అదృష్టం వచ్చి ఒళ్లో వాలినా..తెలుసుకోలేకపోవడం అంటే..అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదేమో కదూ. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ శాస్త్రవేత్త. చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. పైగా తనకు ఈ బహుమతి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ శాస్త్రవేత్తే అమెరికాకు చెందని ఇమ్యునాలజిస్ట్ ఫ్రెడ్ రామ్స్డెల్. అతను డిజిటల్ డిటాక్స్ కోసం తన భార్యతో కలిసి అడవిలో సేద తీరుతున్నాడు. అలా అక్కడి పరిసరాలతో మమేకమవుతుండగా భార్య ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసింది. అది చూసి రామ్స్డెల్ అడివిలో ఉండే ఎలుగుబంటులను చూసి భయపడింది కాబోలు అనుకున్నాడు. తర్వాత ఆమె అసలు విషయం చెప్పడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అస్సలు ఇది ఊహించలేదంటూ రామ్స్డెల్ సంబరపడ్డట్లు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్లమాన్ పేర్కొన్నారు. అమెరికాలోని మోంటాన పర్వత శ్రేణుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ జంట ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్‌కు చేరుకుని నేరుగా న్యూయార్క్ టైమ్స్‌తో కాసేపు ముచ్చటించారు. తాను కచ్చితంగా నోబెల్ బహుమతి గెలుచుకుంటానని అస్సలు అనుకోలేదని, అస్సలు తాను పరిశోధన చేసిన విషయాన్నే మర్చిపోయానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు రామ్స్డెల్. ఇక రామ్స్ డెల్కి రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై చేసిన ఆవిష్కరణలకు గానూ ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని రామ్స్డెల్ సీటెల్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రంకో, జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన షిమోన్ సకాగుచిలతో పంచుకున్నారు. అంటే ఈముగ్గురికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ 11కోట్లు పైనే) నగదు లభిస్తుంది. కాగా రామ్స్డెల్ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించే టీ కణాలకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందారు. ఇక్కడ టీ కణాలు అనేవి ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు. ఇది శరీరంపై దాడి చేసే సూక్ష్మ జీవులను గుర్తించడానికి, లేదా కేన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయట. వాటిని తరుచుగా సెక్యూరిటీ గార్డ్లుగా వ్యవహరిస్తారు పరిశోధకులు. ఇక నోబెల్ కమిటీ సెక్రటరీ పెర్లమాన్ మిగతా ఇద్దరు పరిశోధకులు టచ్‌లో ఉన్నారని, కానీ ఈ 65 ఏళ్ల రామ్స్డెల్ని సంప్రదించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆయన తన ఫోన్‌ని ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచడంతో సంప్రదించడం కష్టమైందని, అందువల్ల ఆయన భార్యకు సమాచారం అందించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇలా నోబెల్‌బహుమతి గెలుచుకున్న విజేతలను సంప్రదించడంలో ప్రతిసారి తమకు చాలా నిరాశ ఎదురవ్వుతోందని కమిటీ వాపోయింది. గతంలో సంగీతకారుడు బాబ్ డిలన్ విషయంలో రోజుల తరబడి సమయం పట్టిందని, మరొకరు ఈ బహుతిని గెలుచుకున్న రోజుల వ్యవధిలో మరణించారని నోబెల్ కమిటీ వెల్లడించింది.డిజిటల్ డిటాక్స్ అంటే..డిజిటల్ పరికరాల (స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివి) అన్నింటికి ఉద్దేశపూర్వకంగా విరామం ఇచ్చి..తోటి వ్యక్తులతో, పరిసరాలతో కనెక్ట్ అవ్వడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇది ఒత్తిడిని, నిద్ర సమస్యలను దూరం చేయడమే గాక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. (చదవండి: సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..) -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్‌లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్‌ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్‌లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్‌లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
Nobel Prize 2025: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: 2025 ఏడాదికిగాను నోబెల్ పురస్కారాల్లో భాగంగా భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్, మైఖేల్ హెచ్ డెవొరెట్‌లకు నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు గాను వీరు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారు.వీరి పరిశోధన ఏమిటి?"మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ" అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్‌ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్‌లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కాగా, హెచ్ డెవొరెట్ ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత..గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు కానీ... ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్తలో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్లు అట్లాంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయుల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తూంటారు కదా.. అచ్చం అలాగే శక్తిని కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే అణుస్థాయిలో ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు.క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలేర్పడింది. గూగూల్, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగా తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి.అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే వీలేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియలాజికల్ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి సమస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చుఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, అక్టోబర్6) వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించగా, ఈరోజు(మంగళవారం, అక్టోబర్(7) భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలును ప్రకటించారు. రేపు(బుధవారం, అక్టోబర్ 8) రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించనున్నారు. ఆపై వరుసగా సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న, అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా స్వీడన్‌లోని స్టాక్‌హోమ్, నార్వేలోని ఒస్లో నగరాల వేదికగా ఈ బహుమతులు అందజేస్తారు.ఇదీ చదవండి: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ -
పాక్‌తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్‌లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్ఎస్ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి. యూఎస్ఎస్ఎం ఒక ప్రకటనలో ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్ మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎస్ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్ఎస్ఎం, పాకిస్తాన్ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్‌పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్ ప్రభుత్వం వాషింగ్టన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు. -
మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్(Trump Another Tariff) పేల్చారు. ఈసారి మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యస్థ, భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. ఇక.. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విడి భాగాలు, ఉపకరణాలు (components) దిగుమతులపై కూడా టారిఫ్‌లు ఉంటే, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్-ఆధారిత వ్యాపారాలపై ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల (Medium/Heavy-duty Trucks) దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతగా ప్రభావం పడకపోవచ్చు. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: నెల తిరగకముందే రాజీనామా చేసిన ప్రధాని! -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్‌డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్‌కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్‌కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
వివాదాస్పదంగా మారిన యూనైటెడ్ స్టేట్స్ మింట్ నిర్ణయం
-
ట్రంప్ నాణెంపై వివాదం
వాషింగ్టన్: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్ మింట్(టంకశాల) నిర్ణయించింది. ఒక డాలర్ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్‌తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్ ముఖం కలిగిన ఒక డాలర్ కాయిన్ రావడం అనేది ఫేక్ న్యూస్ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. నాణెంపై ట్రంప్ పోరాట పటిమ కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియా చిత్రాన్ని ట్రంప్ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్ ఇటీవల కాయిన్ రీడిజైన్ యాక్ట్‌ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్ చిత్రంతో కొత్త కాయిన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్‌ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. -
అమెరికాకు.. స్టెమ్ భారతీయులే!
హెచ్ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ( స్టెమ్) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.అనుభవం.. అవకాశాలు!చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు.. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.‘స్టెమ్’ మీద దెబ్బఅమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే. ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్నవారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం. -
అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు!
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. పాకిస్తాన్లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్‌కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్‌తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది. పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్‌ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్‌కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది. అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్‌లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్‌కు కీలకం. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
Gaza Issue: డొనాల్డ్ ట్రంప్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్‌కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
అమెరికా-పాక్‌లు! నాకు నువ్వు.. నీకు నేను!
ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్ల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీరి స్నేహ బంధం బలపడుతూ వచ్చింది. ప్రపంచ దేశాలపై విపరీతమైన సుంకాలు విధిస్తూ అమితానందాన్ని పొందుతున్న ట్రంప్.. పాకిస్తాన్ విషయంలో ఆచితూచి అడుగలు వేస్తున్నారు. భారత్‌తో ఉన్న బంధాన్ని కాలరాసుకున్న ట్రంప్.. ఇక చేసేది లేక పాక్‌తో మాత్రం జబ్బలు రాసుకుంటూ తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను అమెరికా పర్యటనలకు పలుమార్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం.. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు భేటీలో ఏం జరిగిందనేది బయటకు చెప్పకపోయినా.. భారత్ గురించి కచ్చితంగా వీరి మధ్య ప్రస్తావన వచ్చే ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశ నాయకులు చేస్తున్న కృషి అమోఘం అంటూ కొనియాడారు. అయితే దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది. ఇందులో తాము చేసేంది కాస్తే అయినా ట్రంప్ గాజాలో శాంతి కోసం చేస్తున్న కృషి వెలకట్టలేదని అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రశంసించారు. గాజాలో శాంతి కోసం తమకు 20 పాయింట్లతో కూడిన ముసాయిదాను తమకు ట్రంప్ పంపారని, ఇందులో కొన్ని సరిచేసి పంపామన్నారు దార్.‘ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు మావి కావని నేను స్పష్టం చేశాను. ఇవి మావి కావు. మాకు సంబంధమున్న ముసాయిదాలో, కొన్ని మార్పులు చేసామని మాత్రమే నేను చెబుతున్నాను. ఈ క్రెడిట్ అంతా ట్రంప్‌దే’ అంటూ కొనియాడారు దార్.అయితే ఇరు దేశాల మైత్రి నెటిజన్లు కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘నాక నువ్వు-నీకు నేను అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి.అంటూ పలువురు స్పందించగా, ‘తాను మునిగి, మిగతా వారిని కూడా ముంచుతున్న ట్రంప్‌తో పాక్ మైత్రి బాగుంది బ్రదర్’ అంటూ మరొకరు కౌంటరిచ్చారు. -
కత్తి ఇవ్వలేదని.. డైరెక్టర్ని ఉద్యోగం నుంచి ఊడబీకిన ట్రంప్!
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్‌హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్‌కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్‌కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు. -
అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు. -
భారత్‌తో వాణిజ్య సమతూకం!
మాస్కో: భారత్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. #BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదుభారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు. భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్‌తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు. భారతీయ సినిమాలంటే ఇష్టం భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే! -
ఖతార్ భద్రత మా బాధ్యత.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
దుబాయ్: ఖతార్ భద్రత తమ బాధ్యతని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖతార్ రక్షణకు అవసరమైతే సైనిక పరంగా సాయమందిస్తామని స్పష్టం చేస్తూ తాజాగా ఆయన ఓ ఉత్తర్వు జారీ చేశారు. సోమవారం దీనిపై సంతకం చేయగా బుధవారం వైట్ హౌస్ వెబ్సైట్లో కనిపించింది. అయితే, దీనిపై అమెరికా ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.గాజాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ఖతార్ ఉన్న హమాస్ నేతలపై ఇటీవల ఇజ్రాయెల్ అనూహ్యంగా దాడికి దిగడం తెల్సిందే. సోమవారం వైట్ హౌస్‌లో ట్రంప్‌తో చర్చలు జరిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆయన సమక్షంలోనే ఖతార్ నాయకత్వానికి క్షమాపణ చెప్పడం తెలిసిందే.🚨⚡️BREAKING AND UNUSUALPresident Trump officially signs an executive order that makes any attack on Qatar a threat to the security of the United States!The White House confirms: "The measures include diplomacy, economics, and even military."-: Something is happening here..… pic.twitter.com/lGEsILidhO— RussiaNews 🇷🇺 (@mog_russEN) October 1, 2025తాజాగా, ఖతార్‌కు మద్దతుగా ట్రంప్.. సన్నిహిత సహకారం, ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఖతార్ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, బయటి నుంచి జరిగే దాడుల నుంచి రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆ ఉత్తర్వులో ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ కార్యాలయంలో ఉన్న ఆరుగురు చనిపోయారు. ఈ దాడి అనంతరం సౌదీ అరేబియా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. -
ఆ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్‌పోర్ట్‌లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్‌పోర్ట్‌లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్‌లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది. -
అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్‌లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ananya 🐬 | Relatable Adult Life (@ananyastruggles) -
స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును తిరస్కరించిన డెమొక్రాట్లు
-
నాలుగు వారాల్లో జిన్‌పింగ్‌ను కలుస్తా: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌తో భేటీపై ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్‌పింగ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్‌పింగ్‌ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. Trump announced he will have a meeting with Xi to beg China to start buying American soybeans again: pic.twitter.com/liZZ3cEkFU— Spencer Hakimian (@SpencerHakimian) October 1, 2025 మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్‌టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్‌టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
‘నాకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్టే’
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్‌దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్ పేర్కొన్నారు. -
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) చెబుతోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్‌ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు. ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్‌కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది. -
అమెరికాలో షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో మరో అలజడి మొదలైంది. కీలకమైన స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభించలేదు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. గడువు ముగిసినా బిల్లు నెగ్గకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం దేశంలో షట్‌డౌన్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘బుధవారం తెల్లవారుజాము 00:01 గంటల’ను సూచించే టైమర్ చిత్రాన్ని ‘డెమొక్రటిక్ షట్‌డౌన్’ పేరిట వైట్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అమెరికాలో 1981 తర్వాత ఇది 15వ షట్‌డౌన్ కాగా, గత ఏడేళ్లలో ఇది రెండోసారి. చాలావరకు ఈ షట్డౌన్లు కేవలం కొన్ని రోజులపాటే కొనసాగాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018 డిసెంబర్లో షట్‌డౌన్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనేట్ అంగీకరించలేదు. ఫలితంగా షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. 35 రోజులపాటు కొనసాగింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్‌డౌన్ కావడం గమనార్హం. 2013లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది. ఆరోగ్య ప్రయోజనాలపైనే ప్రతిష్టంభన ప్రభుత్వ పరిపాలనకుగాను స్వల్పకాలానికి (ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ దాకా) నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించినదే స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు. దీన్ని షార్ట్–టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్లు అని కూడా అంటారు. త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టగా, అధికార రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని, బిల్లులో చేర్చడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఆరోగ్య ప్రయోజనాలను పొడిగిస్తే ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దాంతో సెనేట్‌లో బిల్లుకు విపక్ష డెమొక్రాట్లు సుముఖత వ్యక్తంచేయలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ట్రంప్ పారీ్టకి మెజార్టీ ఉన్నప్పటికీ.. సెనేట్‌లో మెజార్టీ లేకపోవడంతో స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. షట్‌డౌన్ ముగించడంపై ఓటింగ్ విఫలం షట్‌డౌన్‌ను తక్షణమే ముగించడానికి బుధవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. డెమొక్రాట్లు అంగీకరించకపోవడంతో ఓటింగ్ విఫలమైంది. ఆరోగ్య రంగానికి సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు నిధులు కేటాయించాలన్న తమ డిమాండ్ పట్ల వారు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా, తాజా షట్‌డౌన్ ఎన్నిరోజులు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడేం జరగొచ్చు? → షట్‌డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే, షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు. → అత్యవసర సేవల్లో లేని సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తారు. 7.50 లక్షల మందిని తొలగించే అవకాశం ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం రోజుకు 400 మిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని అంచనా. → ఎఫ్‌బీఐ, సీఐఏ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, హోంల్యాండ్సెక్యూరిటీ అధికారులు యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. సైనిక దళాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. → సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు ఆటంకాలు ఉండవు. ఆరోగ్య బీమాపై వైద్య సేవలు పొందవచ్చు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయి. → పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి. → తమ సిబ్బందిలో 90 శాతం మందిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా విద్యాశాఖ ప్రకటించింది. → మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి. -
అమెరికాలో కనిపించిన ఏలియన్ ?
-
ట్రంప్ పుణ్యమాని.. అమెరికాకు భారీ నష్టం తప్పదా?
వాషింగ్టన్: కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. మంగళవారం అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు విషయంలో సెనేట్‌లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.అయితే, అమెరికాలో షట్‌డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ఇక, ఈసారి షట్‌డౌన్ ఎన్ని రోజులు కొనసాగనుంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ షట్‌డౌన్ కారణంగా అమెరికా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత షట్‌డౌన్ (2018–19) నష్టం..35 రోజుల పాటు కొనసాగిన ఈ షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైనది. Congressional Budget Office (CBO) అంచనా ప్రకారం.. 11 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. ఇందులో 3 బిలియన్ డాలర్ల మేరకు జీడీపీ స్థిరంగా కోల్పోయింది. అంటే తిరిగి పొందలేని నష్టం ఇది. దీంతో.. 8,00,000 ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవులోకి వెళ్లారు.భారీ నష్టం తప్పదా?..ప్రస్తుత షట్‌డౌన్ (2025) నష్టం అంచనా ప్రకారం.. దాదాపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రేపటికి రాజీనామా చేయవచ్చని అంచనా ఉంది. దీంతో, 85% నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. పాస్‌పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్య బీమా సబ్సిడీలు వంటి సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫెడరల్ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, పరిశోధన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవచ్చు. జీడీపీ, ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచికలు వంటి కీలక డేటా సేకరణలు నిలిపివేయబడతాయి. దీని వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. దీంతో, ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అనే ఆందోళన అమెరికన్లలో నెలకొంది.గతంలో.. అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే). 2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్‌డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులు. ఇదిలా ఉండగా.. గత ఆరు సంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్ కావడం ఇదే ప్రథమం.Folks — this is not a normal government shutdown.Let me explain the stakes and how we got here. pic.twitter.com/nVjXHbbghI— Robert Reich (@RBReich) October 1, 2025ఎందుకీ షట్‌డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్‌డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్‌డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి. సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్‌డౌన్ ఏర్పడుతుంది. షట్‌డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. Trump said he wanted a shutdown so that he could destroy government programs and fire Democrats working for the federal government THREE TIMES TODAY ALONE! This is Donald Trump's shutdown. He wanted it. pic.twitter.com/TEJJLRQTiG— Home of the Brave (@OfTheBraveUSA) October 1, 2025 -
నిలిచిపోనున్న అమెరికా ఫెడరల్ సేవలు
-
ఆరేళ్ల తర్వాత.. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్(USA Shutdown) మొదలైంది. నిధుల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో.. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు(Funding Bill) విషయంలో సెనేట్‌లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించగా.. షట్‌డౌన్ ఆందోళన నడుమ ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. గత ఆరుసంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్ కావడం ఇదే. ఎందుకీ షట్‌డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్‌డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్‌డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి.సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్‌డౌన్ ఏర్పడుతుంది. షట్‌డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. 📌షట్‌డౌన్ ఎందుకు జరుగుతుంది?రాజకీయ విభేదాలు వల్ల బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడంపార్టీల మధ్య రాజీ లేకపోవడంప్రాధాన్యతలపై విభేదాలు.. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ, పన్ను విధానాలు, వలస చట్టాలు🛑 షట్‌డౌన్ జరిగితే.. నాన్-ఎసెన్షియల్ (అత్యవసరంకాని) సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయిఫెడరల్ ఉద్యోగులుకి వేతనం లేకుండా సెలవు ఇవ్వబడుతుందిప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు, జాతీయ పార్కులు మూసేస్తారువీసా ప్రాసెసింగ్, రుణాల మంజూరు, పరిశోధన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి👨✈️ ఎవరిపై ప్రభావం ఉండదు?సైనికులు, సరిహద్దు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వంటి అత్యవసర సేవల ఉద్యోగులు పని చేస్తారు. కానీ జీతాలు తర్వాతే చెల్లిస్తారుసోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సేవలు కొనసాగుతాయి🕰️ గతంలో..అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే)2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్‌డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులుఇదీ చదవండి: ఓహో.. ట్రంప్‌తో మునీర్ అంత మాట అన్నాడా? -
అప్పట్లో మమ్మల్ని అమెరికాయే అడ్డుకుంది
న్యూఢిల్లీ: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా యూపీఏ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ముఖ్యంగా అమెరికా ప్రభావం, విదేశాంగ శాఖ విధానం వల్లే మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని తనకు లోలోపల ఉన్నప్పటికీ ప్రభుత్వం సైనికపరమైన ప్రతిచర్యకు విముఖంగా ఉందని ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దాదాపు 175 మంది ప్రాణాలను బలి తీసుకున్న కొద్ది రోజులకే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానన్నారు. యుద్ధానికి దిగవద్దంటూ ప్రపంచ దేశాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చారన్నారు. ‘అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ నేను బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ని, నన్ను కూడా కలిశారు. ‘దయచేసి రియాక్షన్ తీసుకోకండి’అని ఆమె కోరారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆమెకు చెప్పాను. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా అనిపిస్తున్నా ఆ విషయం ఆమెకు తెలియపర్చలేదు. బదులు తీర్చుకునే విషయమై ప్రధానితోపాటు సంబంధిత వర్గాలతో సంప్రదించా’అని చిదంబరం వెల్లడించారు. అడ్డుకున్నది ఎవరు?కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. విదేశాల ఒత్తిళ్ల వల్లే ముంబై దాడుల విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిన విషయం అందరికీ తెల్సిందేనని పేర్కొంది. అయితే, పాక్‌పై ప్రతిచర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది సోనియా గాంధీనా లేక ప్రధాని మన్మోహన్ సింగా అని ప్రశ్నించింది. -
భారత్ ఎగుమతులపై టారిఫ్‌ల ప్రభావం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో (క్యూ1) బలమైన వృద్ధి రేటు (7.8 శాతం)ను నమోదు చేసినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మరోసారి తన అంచనాలను ప్రకటించింది. భారత్‌పై అమెరికా మోపిన 50 శాతం టారిఫ్‌లు వృద్ధి అవకాశాలకు విఘాతం కలిగిస్తాయని, ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలలపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏడీబీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాల్లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రకటించడం గమనార్హం. భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో జూలైలో వృద్ధి రేటు అంచనాను 6.5శాతానికి తగ్గించింది. ఇప్పుడు కూడా అదే అంచనాను కొనసాగించింది. ‘‘వినియోగం పెరగడం, ప్రభుత్వం అధికంగా వ్యయం చేయడంతో క్యూ1లో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా అదనంగా టారిఫ్‌లు విధించడం వృద్ధి రేటును తగ్గిస్తుంది. ముఖ్యంగా 2025–26 ద్వితీయార్ధం, 2026–27 వృద్ధిపై ఈ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో స్థిరమైన దేశీ వినియోగం, సేవల ఎగుమతులు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి’’అని ఏడీబీ తాజా నివేదిక వెల్లడించింది. ప్రభావం పరిమితమే.. జీడీపీలో ఎగుమతుల వాటా తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడంతో వృద్ధి రేటుపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఏడీబీ తెలిపింది. సేవల ఎగుమతులు బలంగా ఉన్నాయంటూ, వాటిపై టారిఫ్‌లు లేని విషయాన్ని గుర్తు చేసింది. పరపతి విధాన పరంగా దేశీ వినియోగానికి ఊతమివ్వడాన్ని సైతం ప్రస్తావించింది. ఇక ప్రభుత్వం అంచనా వేసిన 4.4 శాతం కంటే అధికంగా ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండొచ్చని ఏడీబీ నివేదిక పేర్కొంది. జీఎస్టీ శ్లాబుల కుదింపు కారణంగా పన్ను ఆదాయం తగ్గనుందని, 2025–26 బడ్జెట్ అంచనాలు ప్రకటించే నాటికి ఈ ప్రతిపాదన లేకపోవడాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.7 శాతం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. కరెంట్ ఖాతా లోటు మాత్రం జీడీపీలో 0.9 శాతానికి ఎగబాకొచ్చని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 0.6 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) కరెంటు ఖాతా లోటు 1.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంచనాలకు మించి ఆహార ధరలు వేగంగా తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025–26 మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాలు ఆదాయానికి మించి బలంగా ఉన్నట్టు, దీంతో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ద్రవ్యలోటు పెరిగినట్టు వివరించింది. -
పాక్‌పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్‌తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్‌ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్‌ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్‌కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్‌కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్‌కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్‌లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్‌కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్‌కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
సినిమాలపై ట్రంప్ టారిఫ్.. టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. No . Trump Tariffs on Films will Not be Implemented. Since The Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) explicitly Stops presidential restrictions/Tariffs under IEEPA on imported informational materials like films, as confirmed by congressional records. Combined with First… https://t.co/0d7qvItrr2— Nikhil Siddhartha (@actor_Nikhil) September 30, 2025 -
కనీవినీ ఎరుగని రీతిలో ఎన్ఆర్ఐల బతుకమ్మ సంబరాలు
-
గాజా ఆక్రమణ ఉండదు
వాషింగ్టన్: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్–థానీకి ఫోన్ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధానికి ఫోన్‌చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న అప్పు ఒత్తిడి భారత్ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు. అమ్మో... అప్పా? కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్ కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్ డ్రా చేస్తున్నారు. ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్ (సిద్దిపేట) సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది. అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్ అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను. -
'పోరాటస్ఫూర్తి'ని కోల్పోవద్దు!
యూనివర్సిటీ నుంచి మీరు బయటకు అడుగుపెట్టబోతు న్నారు. జీవితంలో కొన్ని అవరోధాలు, వైఫల్యాలు, అసంతృప్తులు ఎదురవడం సహజం. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడంలో, విజయాన్ని అందుకోవడంలో మీకు సహాయపడగలిగినవి, నాకు తోచిన జీవిత పాఠాలు కొన్ని చెబుతాను.మీపై మీరు నమ్మకం ఉంచండిటెలివిజన్, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు లేని రోజుల్లో పెరిగి పెద్దవాడినవటం వల్ల నేనొక రకంగా అదృష్టవంతుడినే. నాతో నేను ఎక్కువ సమయం గడపగలిగే వాడిని. దేన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నానో నిర్ణయించుకోగలిగే వాడిని. అలా ఆస్ట్రియాలోని మా కుగ్రామం నుంచి – బాడీబిల్డింగ్ ఛాంపియన్ అవడం ద్వారా అమెరికాలో కాలుమోపాలని అనుకున్నా. నేను ఆరాధించే ‘మిస్టర్ యూనివర్స్’... రెగ్ పార్క్’. ఆయనలా బాడీబిల్డింగ్ చాంపియన్ అనిపించుకోవడం, సినిమాల్లో ప్రవేశించడం, కోట్లాది డాలర్లు సంపాదించడం నా లక్ష్యం. మిగిలినవారు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా, నా మీద నమ్మకంతో నేను ఏర్పరచుకున్న లక్ష్యం అది. సూత్రాలను పక్కన పెట్టండి!మా ఆవిడ వేసుకొనే ఒక టీషర్ట్‌పై ‘నియమానుసారంగా నడ చుకొనే మహిళలు చరిత్రను సృష్టించటం అరుదు’ అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ అది వర్తిస్తుంది. మరీ సూత్రానుసారంగా ఉంటే, మీ లక్ష్య సాధనకు ‘పిచ్చి పట్టినట్లుగా’ ప్రయత్నించలేరు. నాకు ఎక్కడైనా ఏదైనా లభించిందీ అంటే, అది ఈ సూత్రాలలో కొన్నింటిని పక్కన పెట్టినందువల్లనే సాధ్యమైంది. బాడీబిల్డింగ్కు శ్రమించినట్లుగానే, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను.అందుకోసం ఇంగ్లీషు క్లాసులకు వెళ్లాను. ఫలితం దక్కింది. మొదట టెలివిజన్‌లో, తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విజయవంతమైన నటుడిని అయ్యాను. తర్వాత గవర్నర్‌ని కూడా అయ్యాను. వైఫల్యానికి భయపడకండి!నేను ఏది ప్రయత్నించినపుడైనా, విఫలమవడానికి కూడా సుముఖంగా ఉండేవాడిని. ‘రెడ్ సోంజా’, ‘హెర్క్యులిస్ ఇన్ న్యూయార్క్’, ‘లాస్ట్ యాక్షన్ హీరో’ వంటి నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ‘టెర్మినేటర్’, ‘క్యానన్’, ట్రూ లైస్’, ‘ప్రిడేటర్’, ‘ట్విన్స్’ వంటి చిత్రాలు ఊహించనంత విజయం సాధించాయి. కనుక, మనం అన్నిసార్లూ సఫలం కాలేకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకునేందుకు భయపడకూడదు. విఫలమవు తామనే భయంతో నిర్వీర్యం కాకూడదు. మీపై మీకు నమ్మకం ఉంది కనుక, ఏది చేస్తున్నారో అదే సరైన పని అనిపించుకుంటుందని భావిస్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి. మాటలకు ప్రభావితం కాకండి!మా అత్తగారు యూనస్ కెనడీ ష్రైవర్ 1968లో స్పెషల్ ఒలింపిక్స్‌కు శ్రీకారం చుట్టినపుడు చాలామంది ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. అదెలా సాధ్యపడుతుంది అన్నారు. ‘‘కుదరని పని. సంస్థల నుంచి పోటీదారులను బయటకు తీసుకురావడం కష్టం. వారు జంపింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడల్లో పాల్గొనేటట్లు మీరు చేయలేరు. ఒకవేళ పాల్గొన్నా, వారు గాయపడవచ్చు. ఒకరి నొకరు గాయపరచుకోవచ్చు. ఈతకొలనులో మునిగిపోతారు’’ అని నిరుత్సాహపరచారు. 40 ఏళ్ల తర్వాత, గొప్ప సంస్థలలో స్పెషల్ ఒలింపిక్స్ ఒకటిగా ఉంది. ఈరోజు మానసిక వైకల్యంతో బాధపడు తున్నవారికి 164 దేశాలలో అంకిత భావంతో పని చేస్తోంది. జనం మాటలకు ఆమె నీరుగారిపోయి తన ప్రయత్నం ఆపేసి ఉంటే, ఇది సాధ్యమయ్యేదా? అంతరాత్మ ‘‘నీకు సాధ్యమే’’ అని చెబుతుంటే ఇక ఎవరి మాటా వినకండి!శ్రమిస్తేనే విజేతలు కాగలరు!తగినంత కృషి చేయకుండానే విఫలం అవకూడదు. అంటే, ప్రయత్న లోపం ఉండకూడదన్నది నా ఉద్దేశం. గట్టిగా ప్రయత్నించిన తర్వాత విఫలమైనా ఫరవాలేదు. అంతేకానీ, కష్టపడి సాధన చేయకుండా, పోటీలో లేదా ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని నేను ఇష్ట పడను. లక్ష్య సాధనకు సర్వశక్తులూ ఒడ్డాలన్నదే నా అభిమతం. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం కూడా ముఖ్యమే. కాదనను. కానీ, మనం సేదదీరుతున్న సమయంలో మరెవరో శ్రమించి పని చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. వారూ విజేతలుగా నిలవొచ్చు. అంతమాత్రాన, ఏదో చేజారిపోయింది అని మనం అనుకోకూడదు. రోజుకు 6 గంటలు నిద్రిస్తే చాలు. మిగిలిన 18 గంటలూ పనిచేస్తూ ఉండాలి. సమయాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చుకు నేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.చురుగ్గా చేజిక్కించుకోవాలిరెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిచ్చెన ఎక్కగలం అని మాత్రం అనుకోకండి. కార్యాచరణకు దిగకుండా ‘విజయానికి సూత్రాల’ను నెమరువేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అవకాశాలను చేజిక్కించు కోవాలి. కలలను సాకారం చేసుకునేందుకు సోమరితనం వదిలించుకుని, చురుకుగా పనిచేయాలి. ఇవన్నీ మీకు తెలియనివి ఏమీ కావు. శ్రద్ధాసక్తులతో చదువుకోకపోతే మీరీ రోజు ఇక్కడ కూర్చో గలిగేవారే కాదు. ఇక మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడాలి. అందుకు తగిన వ్యవధిని చిక్కించుకోవాలి. సమాజానికి, మీ రాష్ట్రానికి, లేదా మీ దేశానికి తిరిగి ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. మా మామగారు సార్జంట్ ష్రైవర్ గొప్ప అమెరికన్. ఆయన పేదలకు న్యాయ సహాయం లాంటి పనులు నిర్వహించారు. ‘‘అదే పనిగా అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకండి. కాసేపు అద్దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే చేయూత అవసరమైన లక్షలాది మందిని మీరు మీ చుట్టుపక్కల చూడ గలుగు తారు’’ అని ఆయన ఒకసారి యేల్ పట్టభద్రుల స్నాతకోత్సవంలో చెప్పారు. ఇతరులకు సహాయపడడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదని మాత్రం నేను మీకు చెప్పగలను.ఎన్నింటిని దాటుకుని వచ్చాం!చివరగా ఇంకొక్క సంగతి చెబుతా! ఈ విశ్వవిద్యాలయాన్ని 1880లో నెలకొల్పారు. అప్పట్లో లాస్ ఏంజలెస్ చిన్న పొలిమేర పట్టణం. మీకన్నా ముందు 125 పట్టభద్రుల బృందాలు తయారై ఉంటాయి. వారు మంచి రోజులను, గడ్డు రోజులను, యుద్ధాలను, శాంతియుత పరిస్థితులను, ఆశలు రేకెత్తించిన కాలాన్ని, మహా అస్థి రమైన కాలాన్ని కూడా చూసి ఉంటారు. వాటన్నింటినీ దాటుకుని ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ యూనివర్సిటీ దృఢంగా నిలిచాయి. ఇపుడు మనం తిరిగి గడ్డు రోజులను, ప్రపంచంలో చాలా అస్థిరతను చూస్తున్నాం. ఒకటి మాత్రం ఖాయం. మనం వాటిని తట్టుకుని నిలబడగలం. మునుపటికన్నా పటిష్ఠంగా, సంపన్నమైనదిగా దేశం పునరుత్తేజం పొందుతుంది. ఆశావాదాన్నీ, పోరాట స్ఫూర్తినీ కోల్పో వద్దు. మీ అందరికీ అభినందనలు. ఆ కరుణామయుడి చల్లని చూపులు మీపై ప్రసరించాలి. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటేఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్‌పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.పరిశ్రమలో ఆందోళనఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా.. రేపే..
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్‌హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్.. -
భారత్‌ను దారికి తీసుకురావాలి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్‌ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు. అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.North Carolina shooter opens FIRE from a boatGunfire tears into restaurant — reports of 7 victimsSuspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025విల్మింగ్టన్కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్‌పోర్ట్ పోలీస డిపార్ట్మెంట్కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.pic.twitter.com/0P055nihKy— TheBlaze (@theblaze) September 28, 2025 -
హెచ్-1బి వీసా రాని టెకీలకు కెనడా గాలం!
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్‌లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.తాజాగా లండన్‌లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్‌పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి. -
ఆటో విడిభాగాలకు టారిఫ్‌ల దెబ్బ
న్యూఢిల్లీ: అధికస్థాయిలో యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల తయారీని దెబ్బతీయనున్నట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే భారత్ నుంచి ఆటో విడిభాగాలను ఎగుమతి చేసే సంస్థలకు ఇది ప్రతికూలంగా పరిణమించనున్నట్లు తెలియజేసింది. ఇది భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ప్రాధాన్యతను పట్టి చూపుతున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో 30 శాతం ఎగుమతులనుంచే లభిస్తున్నట్లు తెలియజేసింది. దీనిలో ఒక్క యూఎస్ నుంచే 27 శాతం సమకూరుతున్నట్లు వివరించింది. వెరసి ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల ఉత్పత్తిపై ప్రత్యక్షంగా 8 శాతం ప్రభావాన్ని చూపనున్నట్లు ఇక్రా తాజాగా అంచనా వేసింది. 15–30% టారిఫ్‌లను ఎదుర్కొంటున్న చైనా, జపాన్, వియత్నాం, ఇండొనేసియా తదితర ఆసియా దేశాలతో పోల్చితే భారత్ ఎగుమతిదారులకు ప్రతికూలమేనని తెలియజేసింది. -
రోజంతా చిన్న గదిలో బంధించారు
చండీగఢ్: అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్‌కు బలవంతంగా (డిపోర్ట్) పంపేశారని పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జిత్‌కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబసభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్కౌర్ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు.. కొద్దిరోజుల క్రితం భారత్‌కు తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్‌లోని తార్న్‌తరణ్ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవటంతో ఆమె 1992లో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోరి్నయాలోని ఈస్బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన ఆమెను రెండుగంటలపాటు కూర్చోబెట్టి.. అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల తీరుపై ఆమె కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్‌కు బలవంతంగా పంపేశారు. కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్‌కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ప్రతి ఆరు నెలలకు నేను ఐసీఈ ఆఫీస్‌కు వెళ్లి హాజరు వేయించుకునేదాన్ని ఈ నెల 8న అలాగే వెళ్లాను. కానీ, ఏ కారణం చెప్పకుండానే నన్ను అరెస్టు చేశారు. నా కుటుంబసభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నన్ను భారత్‌కు తామే తీసుకెళ్తామని నా కుటుంబసభ్యులు అధికారులకు తెలిపి, విమాన టికెట్లు చూపించినా వాళ్లు పట్టించుకోలేదు. నాకు అమెరికాలో వర్క్ పరి్మట్ ఉంది. ఐడీ, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. అయినా అరెస్టు చేశారు’అని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురుకావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఏం చెప్పనూ.. ! నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నన్ను అరెస్టు చేసిన తర్వాత అధికారులు నా ఫొటోలు తీసుకొని ఒక రాత్రంతా ఓ గదిలో ఉంచారు. అది చాలా చల్లని ప్రదేశం. నాకు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నా చేతులకు బేడీలు వేసి బంధించి శాన్ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్‌ఫీల్డ్‌కు తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకోనివ్వలేదు. నా మొరను ఎవరూ పట్టించుకోలేదు. నేను పూర్తిగా శాకాహారిని. వాళ్లు నాకు గొడ్డుమాంసంతో కూడి భోజనం ఇచ్చారు. దీంతో నేను అది తినలేక చిప్స్, బిస్కట్లతోనే కడుపు నింపుకున్నాను’అని చెప్పారు. ఖైదీలకు వేసినట్లు నాకు ఓ యూనిఫాం వేసి పంపేశారు. నా మనవడు ‘ఈ డ్రస్‌లో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మ’ అని బాధపడ్డాడు అని కౌర్ తెలిపారు. మళ్లీ అమెరికా వెళ్తా తాను మళ్లీ అమెరికా వెళ్లగలననే నమ్మకం ఉందని హర్జిత్ కౌర్ తెలిపారు. ‘భారత్‌లో నాకు ఉండటానికి ఏమీ లేదు. నా కుటుంబమంతా అమెరికాలోనే ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి నా కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉంది’అని ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచి్చన తర్వాతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. -
అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్‌లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్‌పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్‌లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్‌కు కంటగింపుగా ఉంది.అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.అమెరికా అవసరాలపై ప్రభావంఎరువుల కొరత, ధరల పెరుగుదలరష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్‌లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్‌లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.కీలక లోహాలు, రసాయనాలుపల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్‌కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్‌లు పెంచడం కష్టమైన పని.ఎంపిక చేసిన టారిఫ్‌లు..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్‌లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్‌ల బెదిరింపులురష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్‌లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.చివరగా..రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్‌లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్‌లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్‌ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్‌లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్‌కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్‌పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్‌కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్‌గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్‌హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
మన ఫార్మాపై ప్రభావం ఉండదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి వంద శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంతో మన కంపెనీలపై తక్షణ ప్రభావం పడే అవకాశమేమీ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన కేవలం పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే తప్ప జనరిక్ ఔషధాలకు కాదని వివరించాయి. చౌకైన, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయంగా ఔషధాల సరఫరా వ్యవస్థకి భారత్ మూలస్తంభంగా నిలుస్తోందని, 47 శాతం అమెరికా ఔషధ అవసరాలను తీరుస్తోందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. టారిఫ్‌ల ప్రభావం మన మీద ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ‘మనం చాలా మటుకు జనరిక్స్నే అందిస్తున్నందున పేటెంట్, బ్రాండెడ్ ఫార్మా దిగుమతులపై ప్రతిపాదిత 100 శాతం టారిఫ్‌లు భారత ఎగుమతులపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. అంతేగాకుండా పలు బడా భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తయారీ ప్లాంట్లు లేదా రీప్యాకేజింగ్ యూనిటను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి‘ అని నమిత్ జోషి వివరించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) కూడా మన ఫార్మాపై అమెరికా టారిఫ్‌ల తక్షణ ప్రభావమేమీ ఉండదని తెలిపింది. ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 23 దేశీ దిగ్గజాలకు ఐపీఏలో సభ్యత్వం ఉంది. వీటికి ఔషధ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం, దేశీ మార్కెట్లో సుమారు 64 శాతం వాటా ఉంది. కొత్త అవకాశాలపై ఇన్వెస్ట్ చేయాలి .. రాబోయే రోజుల్లో బల్క్ డ్రగ్స్, ఏపీఐలకు (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) సంబంధించిన వ్యయాలను మరింతగా తగ్గించుకుంటే ఇతర సరఫరాదారుల కన్నా భారత్ వైపే అమెరికా మరింతగా మొగ్గు చూపడానికి అవకాశం ఉందని జోషి చెప్పారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్ మొదలైన విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాకు తమ ఎగుమతులు పెద్దగా లేనందున టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండదని ఎమ్క్యూర్ ఫార్మా తెలిపింది. భారత ఫార్మా కంపెనీల జనరిక్ ఔషధాల సరఫరాతో 2022లో అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు, 2013–2022 మధ్య కాలంలో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదా అయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఫార్మెక్సిల్ గణాంకాల ప్రకారం 2024–25లో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనరిక్స్ మన బలం.. భారత్ బలం జనరిక్ ఔషధాలని, వీటికి టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నందున భారత్‌పై ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వీపీ దీపక్ జోత్వానీ తెలిపారు. అయితే, అమెరికా వెలుపల ఉంటూ, ఆ దేశానికి ఎగుమతి చేసే బ్రాండెడ్ డ్రగ్ కంపెనీలతో కొన్ని భారతీయ ఫార్మా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సదరు కంపెనీలకు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)లాంటివి సరఫరా చేసే మన కంపెనీలపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అటు ప్రధానంగా జనరిక్స్నే ఎగుమతి చేస్తుంది కాబట్టి భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఉండదని, కాకపోతే ఈ పరిణామం, భవిష్యత్తులో దేశీయంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సవాళ్లు ఎదురు కావొచ్చని సూచిస్తోందని ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు రాహుల్ అహ్లువాలియా చెప్పారు. ఈ నేపథ్యంలో మన కంపెనీలకు పెద్ద మార్కెట్లు అందుబాటులోకి వచ్చే దిశగా అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు అమెరికా వినియోగదారులపై టారిఫ్‌ల భారం మరీ ఎక్కువగా ఉండకుండా కొన్ని కేటగిరీలను మినహాయిస్తూ, తదుపరి చర్యలు ఉండొచ్చని అడ్వైజరీ సేవల సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హెడ్ లూయీసీ లూ తెలిపారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్‌కేర్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్‌లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్‌లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్‌లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
సమస్యగా కాదు... సదావకాశంగా చూద్దాం!
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్‌కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.భారత నిపుణులను యూరప్ బలవంతంగా..భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్‌కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్‌లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్‌లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ -
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్‌పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్‌ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్‌హౌస్‌కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్‌కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025 -
ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి: జెలెన్స్కీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచ దేశాలన్నీ మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంతగా విధ్వంసకర ఆయుధాల రేసులో పరుగులు పెడుతున్నాయని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ( Volodymyr Zelensky) విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బతికి బట్టకట్టాలన్నది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని యూరప్ ఖండం అంతటికీ విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధాలు ఆపటంలో ఐరాస విఫలం ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నీ విఫలమయ్యాయని జెలెన్స్కీ ఆరోపించారు.ఉక్రెయిన్, గాజా(Gaza), సూడాన్.. ఇలా ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాలు మనుగడ సాగించటానికి అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదని మండిపడ్డారు. ‘స్నేహితులు, ఆయుధాలు ఉన్నవారికి తప్ప. ఇతరుల భద్రతకు ఎలాంటి హామీ లేదు’అని పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంతో మార్పు తీసుకురాగలమని అన్నారు. రష్యాతో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలిచిన అమెరికా, యూరప్ దేశాలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ వెళ్తన్న రష్యా తీరును ఐరాస సభ్యదేశాలన్నీ ఖండించాలని కోరారు.ఇది కూడా చదవండి: ఆ మూడు విధ్వంసాలపై దర్యాప్తు జరగాల్సిందే..‘రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే.. మేము కూడా దీనిని మరింత విస్తరిస్తాం. మరింత విధ్వంసకరంగా మారుస్తాం. మొదట ఉక్రెయిన్‌పై దాడిచేసిన రష్యా.. ఇప్పుడు యూరప్ అంతటా తన డ్రోన్లను తిప్పుతోంది. రష్యా కార్యకలాపాలు ఎప్పుడు ఎల్లలు దాటాయి. జార్జియా, బెలారస్లాగా కాకుండా రష్యాకు జోక్యం నుంచి మాల్దోవా తనను తాను కాపాడుకుంటోంది. యూరప్ ఖండం మాల్దోవాను కూడా కోల్పోకూడదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయపరమైన సానుభూతి కాదు. నిధులు, ఇంధన మద్దతు కావాలి’అని పేర్కొన్నారు. డ్రోన్లతోనే వేలమంది హత్య ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లతోనే వేలమందిని ఎలా చంపాలో చూపిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ‘ఇటీవల డ్రోన్ల కారణంగానే యూరప్‌లో విమానాశ్రయాలు మూసివేయాల్సి వచ్చింది. టాక్టికల్ డ్రోన్‌ను పరీక్షించినట్లు గత వారమే ఉత్తరకొరియా ప్రకటించింది. అతి తక్కువ వనరులు ఉన్న దేశాలు కూడా ప్రమాదకరమైన డ్రోన్లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మనం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల రేసు యుగంలో నివసిస్తున్నాం’అని పేర్కొన్నారు. -
భారత్‌కు ట్రంప్ భారీ షాక్!
సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్‌పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. భారతంపై ప్రభావం..భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్ 27.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషదాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో సుమారు భారత్ 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలోనే దాదాపు 3.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికాకు వెళ్లడం గమనార్హం. ట్రంప్ విధించిన తాజా సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై వర్తిస్తాయన్నది స్పష్టత వచ్చింది. సాధారణంగా భారత్ అమెరికాకు ఎగుమతి చేసే మందుల్లో జనరిక్ ఔషదాలే ఎక్కువ. అయితే ట్రంప్ తాజా నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్ తయారీ చేస్తున్న భారత మల్టీనేషనల్ కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిప్లా, డివిస్ లాబ్స్, అజంత ఫార్మా, అలాగే.. నిఫ్టీ ఫార్మా స్టాక్స్‌పై టారిఫ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరింత తప్పదు!ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.ఇదీ చదవండి: ‘ఇడియట్ ట్రంప్’పై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే.. -
అమెరికాలో అందమైన నగరం: ఇన్‌స్టాలో ఇదే టాప్..
స్మార్ట్‌ఫోన్ వచ్చిన తరువాత.. అందమైన ప్రదేశం కనిపించగానే ఫోటో తీసేస్తారు. అంతటితో ఊరుకుంటారా?, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం చూస్తారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో తీసి పోస్ట్ చేయడానికి అనువైన ఆకర్షణీయమైన నగరాల జాబితాను ఆర్ట్ అండ్ డిజైన్ ఇంప్రెంట్ అయిన రివర్స్ వాల్ ఆర్ట్ ఒక నివేదికలో విడుదల చేసింది.రివర్స్ వాల్ ఆర్ట్ డేటా ప్రకారం.. అమెరికాలో అత్యంత అందమైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలోని 25 అతిపెద్ద నగరాల్లో 895 మిలియన్లకు పైగా హ్యాష్‌ట్యాగ్‌లను విశ్లేషించిన తరువాత నిపుణులు నివేదిక విడుదల చేసారు. న్యూయార్క్ ఒక సాంస్కృతిక చిహ్నం. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. యాన్యువల్ రాక్ఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ నుంచి ఎంపైర్ స్టేట్ భవనం వరకు.. ఈ నగరంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లలో #NYC (145.3 మిలియన్), #NewYorkCity (35.9 మిలియన్స్) ఉన్నాయి. మొత్తం మీద న్యూయార్క్ హ్యాష్‌ట్యాగ్‌లతో 183,869,262 పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత అందమైన నగరం మాత్రమే కాదు.. అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా.ఇన్‌స్టాగ్రామ్‌లో అధికంగా పోస్ట్ చేసిన అమెరికాలోని నగరాలు●న్యూయార్క్: 18,38,69,262 పోస్ట్‌లు●లాస్ ఏంజిల్స్: 141,271,982 పోస్ట్‌లు●చికాగో: 60,196,138 పోస్ట్‌లు●లాస్ వెగాస్: 54,038,732 పోస్ట్‌లు●శాన్ ఫ్రాన్సిస్కో: 45,895,134 పోస్ట్‌లు●వాషింగ్టన్: 45,470,821 పోస్ట్‌లు●శాన్ డియాగో: 39,451,127 పోస్ట్‌లు●సియాటిల్: 37,597,785 పోస్ట్‌లు●ఆస్టిన్: 34,022,105 పోస్ట్‌లు●హూస్టన్: 33,942,790 పోస్ట్లుఇదీ చదవండి: అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్ -
అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్
ప్రపంచ సాంకేతిక రంగం అసాధారణ వేగంతో విస్తరిస్తోంది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే దశాబ్దాలుగా.. అమెరికా భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రధాన గమ్యస్థానంగా ఉండడంతో, మనవాళ్ల ఆలోచనలు అమెరికాను దాటి వెళ్లలేదు. అయితే, పెరుగుతున్న వీసా పరిమితులు మాత్రమే కాదు, అమెరికన్ నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల కూడా గత కొంతకాలంగా చాలా మంది భారతీయ నిపుణులు కెరీర్ కోసం అమెరికాను దాటి ఇతర నగరాల వైపు చూడటం ప్రారంభించారు.కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 నివేదిక ప్రకారం.. యూరప్, ఆసియా ఇతర ప్రాంతాలలోని అనేక నగరాలు తమను తాము ప్రపంచ ఐటీ కేంద్రాలుగా వేగంగా మలచుకుంటున్నాయి. ఈ గమ్యస్థానాలు కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచ స్థాయి కెరీర్లకు వేదికలను అందించడమే కాకుండా, మెరుగైన జీవనశైలికి కూడా హామీ ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ వెలుపల కెరీర్ అవకాశాలను అన్వేషిస్తున్న వారి కోసం కొలియర్స్ నివేదిక అందించిన 25 ఐటీ కేంద్రాల జాబితా ప్రకారం, అవి ఏవేవి అంటే..లండన్ (యునైటెడ్ కింగ్డమ్)బలమైన వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అభివృద్ధి చెందుతున్న ఏఐ పర్యావరణ వ్యవస్థ మద్దతుతో లండన్ యూరప్ కి ఒక ప్రబల ఆర్థిక సాంకేతిక శక్తి కేంద్రంగా ఉండి ఐటీ కెరీర్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారింది.బీజింగ్ (చైనా)ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బలమైన పట్టు ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన ఆవిష్కరణ కేంద్రం.బెంగళూరు (భారతదేశం)తరచుగా భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలువబడే బెంగళూరు, ఐటీ సేవలు, స్టార్టప్‌లు గ్లోబల్ ఆర్ అండ్ డి లో దేశాన్ని ముందుండి నడిపిస్తూనే ఉంది.పారిస్ (ఫ్రాన్స్)బహుళజాతి కంపెనీలు వినూత్న స్టార్టప్‌ల శక్తివంతమైన మిశ్రమంతో, పారిస్ సాంకేతిక ప్రతిభకు అగ్రగామిగా యూరోపియన్ కేంద్రంగా ఉంది.డబ్లిన్ (ఐర్లాండ్)బలమైన స్టార్టప్ వ్యవస్థ ప్రతిభ సమూహంతో యూరప్ సాంకేతిక రంగానికి చిరునామాగా డబ్లిన్ ఉద్భవించింది.టోక్యో (జపాన్)రోబోటిక్స్, ఆటోమేషన్ ఏఐ లకు ప్రసిద్ధి చెందిన టోక్యో ఆసియా ఖండపు హైటెక్ ఆవిష్కరణల రాజధానిగా ఎదుగుతోంది.మ్యూనిచ్ (జర్మనీ)అధునాతన ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఐటీ సాంకేతికత ఆధారిత పరిశ్రమలలో లోతైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది.స్టాక్‌హోమ్ (స్వీడన్)ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు నిలయం, స్టాక్‌హోమ్ వ్యవస్థాపకత ఆవిష్కరణలకు కేరాఫ్‌గా వృద్ధి చెందుతోంది.షాంఘై (చైనా)ఈ-కామర్స్, ఫిన్‌టెక్ కృత్రిమ మేధస్సులలో సామర్ధ్యాలతో వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.బెర్లిన్ (జర్మనీ)డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రసిద్ధి చెందిన బెర్లిన్, యువ ఆవిష్కర్తలకు ఒక సరికొత్త అయస్కాంతంగా మారింది.సియోల్ (దక్షిణ కొరియా)ఎలక్ట్రానిక్స్, 5జీ, ఏఐ స్వీకరణలో అగ్రగామిగా ఉన్న సియోల్, డిజిటల్ సరిహద్దులను విస్తరిస్తూ దూసుకుపోతోంది.షెన్జెన్ (చైనా)ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో కీలకమైన నగరం, ప్రపంచ డిజిటల్ సేవల విస్తరణకు గణనీయంగా దోహదపడుతోంది.టొరంటో (కెనడా)ఏఐ పరిశోధన టెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న టొరంటో పెట్టుబడి ప్రపంచ ప్రతిభ రెండింటినీ ఆకర్షిస్తుంది.బుకారెస్ట్ (రొమేనియా)విస్తరిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో తూర్పు ఐరోపాలో ఐటీ అవుట్సోర్సింగ్కు నిఖార్సైన గమ్యస్థానం.మాడ్రిడ్ (స్పెయిన్)ఫిన్‌టెక్, టెలికాం డిజిటల్ సేవలలో బలమైన మాడ్రిడ్, యూరోపియన్ ఐటీ హబ్‌గా క్రమంగా దినదినాభివృద్ధి చెందుతోంది.ఆమ్స్టర్ డామ్ (నెదర్లాండ్స్)ఫిన్‌టెక్ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్ధ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం డిజిటల్ వాణిజ్యానికి కూడా ఒక కేంద్రం.హైదరాబాద్ (ఇండియా)అనేక ఆర్ అండ్ డి కేంద్రాలకు నిలయం, హైదరాబాద్ భారతదేశ ఐటీ విస్తరణకు మూలస్తంభంగా వేగంగా ఎదుగుతోంది.పూణే (ఇండియా)అభివద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో, పూణే అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది.హాంగ్జౌ (చైనా)ఇ–కామర్స్ డిజిటల్ ఆవిష్కరణలలో ప్రముఖ నగరం, హాంగ్జౌ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రంలో నిలుపుతోంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)బ్యాంకింగ్ రంగానికి బలమైన సంబంధాలతో యూరప్ ఖండపు ఫిన్‌టెక్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా గుర్తింపు పొందింది.మెక్సికో నగరం (మెక్సికో)లాటిన్ అమెరికాలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ హబ్, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)బ్లాక్‌చెయిన్, ఫిన్‌టెక్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్ ఆవిష్కరణ స్థిరత్వం రెండింటినీ అందిస్తుంది.వార్సా (పోలాండ్)తూర్పు ఐరోపాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల కేంద్రం, యువ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మద్దతుతో విస్తరిస్తోంది.గ్వాంగ్జౌ( చైనా)ఆవిష్కరణలను తయారు చేయడం డిజిటల్ సేవలను విస్తరించడంపై దృష్టి సారించిన చైనా నగరం.రోమ్ (ఇటలీ)ఇయు సాంకేతిక కార్యక్రమాల బలమైన అండతో యూరప్‌లో డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న నగరం. -
అమెరికా డల్లాస్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు
-
ట్రంప్ అధికప్రసంగం!
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.ఏటా సెప్టెంబర్‌లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్‌కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు. మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు. మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్‌లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్‌గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్‌కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు. గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే. -
డాలస్‌లో కాల్పులు.. నలుగురు మృతి
డాలస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో బుధవారం జరిగిన కాల్పుల ఘట నలో నలుగురు చనిపోయారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఫెసిలిటీ భవనంపై ఓ వ్యక్తి పక్కనున్న భవనం నుంచి కాల్పులకు దిగాడు. ఘటన లో ముగ్గురు చనిపోయారు. పోలీసులు జరి పిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. ఐసీఈ అధికారులే లక్ష్యంగా ఈ కాల్పులకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి వివరాలు తెలియరాలేదు. మృతుల వివరాలను కూడా పోలీసులు తెలపలేదు. అయితే, వీరిలో కొందరు ఐసీఈలో నిర్బంధించిన వారు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. జూలై 4వ తేదీన టెక్సాస్ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఓ అధికారి గాయపడ్డారు. జూలై 7న టెక్సాస్ సమీపంలోని మెకల్లెన్ వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో బోర్డర్ పెట్రోల్ అధికారి ఒకరు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. -
'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్‌లో సాధారణ డ్రెస్ వేర్లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్‌కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) (చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!) -
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్‌లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్‌లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్‌లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. ట్రంప్ నోట అదే మాట
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. అమెరికా అధ్యక్షుడిగా కేవలం ఏడు నెలల కాలంలో ఏడు యుద్ధాలు ఆపాను. అందుకే తన పరిపాలన స్వర్ణయుగం అంటూ అభివర్ణించారు. అమెరికా న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 80వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ‘ఇజ్రాయెల్ -ఇరాన్, భారత్-పాకిస్థాన్, రువాండా - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా -అజర్బైజాన్, ఈజిప్ట్ - ఇథియోపియా, సెర్బియా -కొసావో దేశాల మధ్య అంతులేని యుద్ధాల్ని ముగించా. కొన్ని యుద్ధాలు 31 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మరికొన్ని 36ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అలాంటి అంతులేని యుద్ధాల్లో నేను ఏడు యుద్ధాలు ఆపాను. మరే ఇతర అధ్యక్షుడు వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ నేను వాటిని ఆపాను. భారత్-పాక్ యుద్ధాన్ని కూడా నేనే ఆపా. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నా. ప్రజల ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్ అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిపై విమర్శలు గుప్పించారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది. ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. దేశాల మధ్య యుద్ధ సమస్యల్ని పరిష్కరించేలా సహాయం చేసేందుకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్యసమితి తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఐక్యరాజ్య సమితివన్నీ ఒట్టి మాటలే. ఆ ఒట్టి మాటలు యుద్ధాల్ని ఆపలేవు’ అని ట్రంప్ అన్నారు. -
రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. ఈ తరుణంలోనే రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సీఈఓలు(CEO)గా భారతీయుల పేర్లను ప్రకటించాయి.అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ (T-Mobile).. సీఈఓగా 'శ్రీని గోపాలన్' పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీని.. నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.గోపాలన్.. హిందూస్తాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్లలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కంపెనీకే (టీ-మొబైల్) సీఈఓగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరికచికాగోకు చెందిన పానీయాల దిగ్గజం.. మోల్సన్ కూర్స్ (Molson Coors) కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్‌ను నియమించింది. అక్టోబర్ 1నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అన్నారు. ఈయన మైసూర్లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. భారతదేశంలోని కూర్స్, మోల్సన్ బ్రాండ్లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు. -
‘భారత్ మాకు ఎంతో ముఖ్యం.. సంబంధాలు కీలకమే’: అమెరికా
సుంకాలు, హెచ్1బీ వీసా ఆందోళనలు(Tariffs, H1B Visa Chaos) కొనసాగుతున్న వేళ.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు తమ దేశానికి ఎంతో కీలకమని వ్యాఖ్యానించారాయన. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీపై స్పందిస్తూ రుబియో తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశం సందర్భంగా.. జైశంకర్, మార్కో రుబియో(Marco Rubio) భేటీ అయ్యారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. ఈ పరిణామంపై రుబియో స్పందిస్తూ.. భారత్ అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు.. తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇరు దేశాల అభివృద్ధికి ఈ సహకారం అవసరం. .. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా రెండు దేశాలకు అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా, ఓపెన్ విధానాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తాం అని పేర్కొన్నారాయన. మరోవైపు.. రుబియోతో భేటీపై జైశంకర్(Jaishankar) స్పందిస్తూ.. మార్కో రూబియోతో సమావేశం సానుకూలంగా సాగింది. అయితే ప్రాధాన్య అంశాలపై మరిన్ని చర్చలు అవసరం అని పేర్కొన్నారు. Met with Indian External Affairs Minister @DrSJaishankar at UNGA. We discussed key areas of our bilateral relationship, including trade, energy, pharmaceuticals, and critical minerals and more to generate prosperity for India and the United States. pic.twitter.com/5dZJAd85Za— Secretary Marco Rubio (@SecRubio) September 22, 2025Good to meet @SecRubio this morning in New York. Our conversation covered a range of bilateral and international issues of current concern. Agreed on the importance of sustained engagement to progress on priority areas. We will remain in touch. 🇮🇳 🇺🇸 pic.twitter.com/q31vCxaWel— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 22, 2025ట్రంప్ ప్రభుత్వం భారతపై విధించిన సుంకాలు, H-1B వీసా ఫీజు పెంపు వంటి పరిణామాల తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చి సంప్రదింపులు జరిపి వెళ్లిపోయింది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం వాషింగ్టన్లో వాణిజ్య చర్చలు జరుపుతోంది. నవంబర్ కల్లా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సమయంలోనే రుబియో-జైశంకర్ భేటీ జరగడం, ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడేలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: ట్రంప్ తెచ్చిన తంటా! -
అమెరికాలో భూకంపం.. భయంతో జనం పరుగులు
బర్కిలీ: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే, బర్కిలీకి సమీపంలో సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శాన్ఫ్రాన్సిస్కో, బర్కిలీతోపాటు అక్కడికి 161 కిలోమీటర్ల దూరంలోని సలినాస్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తీవ్ర భూప్రకంపనలతో భయంతో నిద్ర నుంచి మేల్కొన్న జనం పరుగుపరుగున ఇళ్లు వదిలి వీధుల్లోకి చేరుకున్నారు. దుకాణాల షెల్ఫుల్లోని ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లు కదులుతున్నట్లుగా ఉన్న వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. భూకంపం కారణంగా కొద్దిసేపు రైళ్లను తక్కువ వేగంతో నడిపారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. నష్టం గురించిన సమాచారం కూడా లేదన్నారు. భూకంప కేంద్రం బర్కిలీకి ఆగ్నేయంగా 1.6 కిలోమీటర్ల దూరంలో, సుమారు 7.7 కిలోమీటర్ల లోతులో ఉంది. -
అమెరికా చదువులపై తగ్గిన ఆసక్తి
న్యూఢిల్లీ: అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా అమెరికాలో గురించి వాకబు చేసే వారి సంఖ్య ఏకంగా 46 శాతం తగ్గిపోయిందని, అదే కెనడా విషయానికొస్తే రెండేళ్ల కాలంలో 75 శాతంపైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐడీపీ ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా, కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని సంస్థ దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కెనడా ప్రాంతీయ డైరెక్టర్ పియూష్ కుమార్ తెలిపారు. ‘మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అమెరికా విషయం ప్రస్తావించాలి. ఇక్కడ గడిచిన 12 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడు కాకముందు గతేడాది జూన్ నుంచే అక్కడ అననుకూల వాతావరణం నెలకొంది. అప్పటి నుంచే మంజూరయ్యే వీసాల సంఖ్య తగ్గుతూ వస్తోంది’అని ఆయన విశ్లేషించారు. ‘అమెరికాలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో సాధారణంగా వీసాల జారీ సంఖ్య తగ్గుతుండటం మనం గమనించొచ్చు. ఇందుకు రకరకాల కారణాలుంటాయి. కానీ, ట్రంప్ అధ్యక్షుడయ్యాక, ఆయన ఎలాంటి చర్యలను ప్రకటిస్తారనే ఉత్కంఠ కూడా విద్యార్థుల ఆసక్తిపై ప్రభావం చూపింది’అని పియూష్ తెలిపారు. కెనడాలో ఏం జరిగింది? 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చే సరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకబు చేసే వారి సంఖ్య 46.4 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అదేవిధంగా, కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య రెండేళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75 శాతానికి తగ్గినట్లు వెల్లడైందన్నారు. ‘గడిచిన రెండేళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వం మధ్య విబేధం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది. అనంతర కాలంలో కెనడాపై అమెరికా 80 శాతం టారిఫ్‌లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఆ సమయంలో కెనడాకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అంతా భావించారు. ఎందుకంటే, చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్నది వారి అంచనాగా ఉంది. చదువయ్యాక స్వదేశానికి తిరిగిరాక తప్పదని అనుకోవడం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు’అని ఆయన వివరించారు. అయితే, కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత ఆ దేశం తన విధానాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చుకుంటే పరిస్థితి మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఆ్రస్టేలియాలో మరిన్ని అవకాశాలు మరో వైపు, అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ యథా ప్రకారం కొనసాగుతోందన్నారు. ఈ రెండుదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో కూడా మార్పు లేదని పియూష్ చెప్పారు. పైపెచ్చు, గత ఏడాది కంటే 9 శాతం ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆ్రస్టేలియా ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆ్రస్టేలియా ముందుకు వెళుతోందన్నారు. ఆ్రస్టేలియా ప్రభుత్వం 1969 ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంతర్జాతీయ విద్యార్థులకు సేవలందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీలు, కోర్సుల ఎంపికతోపాటు దరఖాస్తు చేసుకోవడం, వీసా ప్రక్రియ వంటి వాటిలో నిపుణులతో ఉచితంగా సలహాలిప్పిస్తూ సాయపడుతూంటుంది. ఇంగ్లిష్ భాషా ప్రావీణ్య పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌ను సైతం ఐడీపీ ఎడ్యుకేషన్ చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది యూనివర్సిటీల్లో లక్ష మంది ఐడీపీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంస్థకు భారత్‌లోని 63 నగరాల్లో 73 కార్యాలయాలున్నాయి. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్‌కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
ఐరాస అవసరం తీరిపోలేదు!
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్‌ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎనభై అన్నది కీలక ఘట్టంఅంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది. ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్‌లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే. ‘శాంతి కోసం సమైక్యత’అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్‌కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది. ‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్‌పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు. చెప్పుకోదగిన విజయాలురెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా–ఐరాస పోలికలుఅంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్‌లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది. అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు. డేనియల్ వార్నర్వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత -
అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!
కొత్త హెచ్-1బి వీసాల (H-1B Visa) ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన వేళ మరో ప్రముఖ దేశం యూకే.. కీలక ప్రతిపాదనల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసే ఎంపికలను స్టార్మర్‌కు చెందిన "గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" చర్చిస్తోంది.యూకే (UK)గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు ఖర్చు అవుతుంది. నిపుణుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే రుసుము వర్తిస్తుంది. దీంతో పాటు దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు వార్షిక హెల్త్‌కేర్ సర్ ఛార్జ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.2020లో ప్రవేశపెట్టిన ఈ వీసా విధానం.. సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మెడిసిన్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగాల్లో గుర్తింపు పొందినవారికి యూకేలో ఉండే అవకాశం కల్పిస్తుంది.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వీసా ఫీజు నిర్ణయంతో బ్రిటన్‌లో సంస్కరణల కోసం ఒత్తిడులు ఊపందుకున్నట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపినట్లుగా నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత? -
‘ఇదేందయ్యా ఇది..!’ ఒకే వేదికపై మెరిసిన ట్రంప్-మస్క్
అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో తీవ్రస్థాయి పరస్పర విమర్శలు గుప్పించుకున్న ట్రంప్-మస్క్.. మళ్లీ ఒక్కటయ్యారు!. అరిజోనా స్టేట్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ వెనుక కూర్చుని ఇద్దరూ తెగ ముచ్చటించుకున్నారు. అంటే.. పొరపచ్చాలను పక్కన పెట్టి అమెరికా కోసం మళ్లా ఒక్కటిగా కలిసి పని చేయబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్‌ను అమెరికా స్వాతంత్ర సమర యోధుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కిర్క్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం అరిజోనా స్టేట్ గ్లెన్డేల్ నగరంలోని స్టేట్ ఫామ్ స్టేడియంలో నిర్వహించిన కిర్క్ స్మారక సభలో ట్రంప్ పై ప్రకటన చేశారు. అయితే.. ఇదే వేదికగా కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ట్రంప్‌తో కరచలనం చేసి.. పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం మస్క్‌ను టచ్ చేస్తూ ఆప్యాయంగానే మాట్లాడారు. ఆ సమయంలో మస్క్ తన చేతులను ‘‘పిరమిడ్ హ్యాండ్ సింబల్’’ రూపంలో ఉంచడమూ.. ఇంటర్నెట్ను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.NEW: President Trump and Elon Musk were spotted sitting together and chatting during a surprise reunion at Charlie Kirk’s memorial. pic.twitter.com/5asd3mTiJF— Fox News (@FoxNews) September 21, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్‌ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్‌కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్‌నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు.. మస్క్‌ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్‌ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.అయితే, కొన్నాళ్లుగా మస్క్ స్వరం మారింది. ట్రంప్‌లాగే చార్లీ కిర్క్‌తో ఎలాన్ మస్క్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన స్మారక సభలో మస్క్ భావోద్వేగంగా స్పందించారు. అదే సమయంలో ట్రంప్‌తో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత విభేదాలను పక్కనబెట్టి, మళ్లీ కలిసి పనిచేయబోతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. దీనికి మస్క్ ఎక్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. -
ట్రంప్ సృష్టించిన వీసా ప్రకంపనలు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు రుసుముపై అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలంటూ సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్నవారు, హెచ్–1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు బెంబేలెత్తిపోయారు. ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? అని ఆవేదనకు గురయ్యారు. అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇందులో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులైతే వెంటనే అమెరికాకు చేరుకోవడానికి పరుగులు పెట్టారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి విమానం టికెŠక్ట్ కొనుగోలు చేయాల్సి వచి్చంది. అయితే, హెచ్–1బీ వీసాల విషయంలో కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే లక్ష డాలర్లు వసూలు చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచి్చంది. దీంతో చాలామంది ఊరట చెందారు. పెద్ద భారం భారం దిగిపోయినట్లుగా ఉపశమనం పొందారు. టిక్కెట్‌కు రూ.7.04 లక్షలు మహారాష్ట్రకు చెందిన ఒకరు హెచ్–1బీ వీసాతో అమెరికాలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. తన తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ఇటీవలే అమెరికా నుంచి నాగపూర్ వచ్చాడు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. హెచ్–1వీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు గురించి తెలియగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే అమెరికాకు ప్రయాణం కట్టాడు. అప్పటికప్పుడు విమానం టిక్కెట్ దొరకాలంటే మాటలు కాదు కదా! ప్రయాణం కోసం ఎక్కువ సొమ్ము చెల్లించక తప్పలేదు. నాగపూర్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి 8,000 డాలర్లు (రూ.7.04 లక్షలు) ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రోహన్ మెహతా వాపోయాడు. సాధారణం అయ్యే ఖర్చు కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. ట్రంప్ ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చి ఉంటే తనకు ఈ భారం తప్పేదని ఆవేదన వ్యక్తంచేశాడు. యూరప్ దేశాలే ముద్దు దసరా, దీపావళి పండుగల కోసం స్వదేశానికి రావడానికి అమెరికాలోని భారతీయులు ముందే ప్లాన్ చేసుకున్నారు. హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధిస్తున్నారని తెలియగానే విమానం టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. పండుగలకు వెళ్లలేమంటూ ప్రయాణాలు ఆపేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 19న ట్రంప్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచి్చంది. దాంతో సోషల్ మీడియాలో ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. అమెరికాలోని హెచ్–1బీ వీసాదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇండియాకు వెళ్లకపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేశారు. స్వదేశంలో కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకోవాలన్న ఆసక్తి చచి్చపోయిందని ఓ భారతీయుడు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఉన్న వృత్తి నిపుణులు అమెరికా పట్ల విముఖత చూపుతున్నారు. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో వారు పునరాలోచనలో పడ్డారు. ఉద్యోగాలకు యూరప్ దేశాలే బెటర్ అని అంచనాకొచ్చారు. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. పెళ్లి రద్దయ్యింది ఇండియాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇండియాలోనే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారమే పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం శుక్రవారం ఆనందంగా స్వదేశానికి బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ట్రంప్ విసిరిన వీసా బాంబు గురించి తెలిసింది. ఇప్పుడు ఇండియాకు వెళ్తే మళ్లీ వెనక్కి వస్తామో లేదో తెలియని పరిస్థితి. దాంతో ఆ యువకుడు ప్రయాణం ఆపేసి ఎయిర్పోరుŠట్ నుంచి ఇంటికి తిరిగివెళ్లాడు. ఇండియాలో జరగాల్సిన పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు ఉన్నవారిపై లక్ష డాలర్ల రుసుము ఉండబోదని మొదటే చెబితే తనకు ఈ బాధ తప్పేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. -
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం
లండన్: పరమకిరాతకంగా వందల కొద్దీ బాంబులేస్తూ, భూతల దాడులుచేస్తూ పాలస్తీనియన్ల మరణశాసన రాస్తున్న ఇజ్రాయెల్‌పై ధర్మాగ్రహంతో బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గాజావాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ మూడు దేశాలు ఆదివారం ప్రకటించాయి. పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయనిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం వ్యాఖ్యానించారు. తామూ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్‌చేశారు. తాము సైతం పాలస్తీనాకే మద్దతు పలుకుతున్నట్లు ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణమృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్‌లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరిచింది. కాల్పుల విరమణ, గాజాలో ఐరాస మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలితే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ ప్రకటించారు. ద్విదేశ పరిష్కారం ఉత్తమం ఈ మేరకు లండన్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి స్టార్మర్ పేరిట ఒక వీడియో సందేశం వెలువడింది. ‘‘ పాలస్తీనియన్లకు అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఇది హమాస్ సాయుధ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తులో పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదు. పాలస్తీనాలో శాంతియుత భవిత కోసం మనందరం కలసినడుద్దాం. హమాస్ చెరలోని బందీలను విడిపించుకుందాం. ఘర్షణలకు చరమగీతం పాడదాం. శాంతి, భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమం’’ అని స్టార్మర్ స్పష్టంచేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతరకాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాది రాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తానాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే భారత్ సహా 140కిపైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానంచేసి ఐరాసతో స్వతంత్రదేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యాయి. అయితే ఈసారి ఆ దిశగా అడుగులుపడే అవకాశముందని తెలుస్తోంది. తప్పుబట్టిన నెతన్యాహూ ఆ్రస్టేలియా, యూకే, కెనడాల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుబట్టారు. ‘‘మీరంతా పాలస్తీనాను దేశంగా గుర్తించినంతమాత్రాన సరిపోదు. దానిని వాస్తవరూపంలోకి తీసుకురావాలి. అది అసాధ్యం. పాలస్తీనాను గుర్తించడం అంటే 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ సాయుధుల మెరుపుదాడి, వందల మంది ఊచకోతను ఈ దేశాలన్నీ సమరి్థంచినట్లే. ఈ తాజా గుర్తింపు హమాస్‌కు మీరంతా ఇచ్చే బహుమతితో సమానం. జోర్డాన్ నదీ పశ్చిమాన పాలస్తీనా ఆవిర్భావాన్ని నేను సాధ్యంకానివ్వను. వచ్చే వారం అమెరికాలో పర్యటన, ట్రంప్‌తో భేటీ తర్వాత నా తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా’’ అని నెతన్యాహూ అన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక ఓట్టొమన్ రాజ్యపతనం ఆరంభమైంది. అప్పటి నుంచి వందేళ్లపాటు పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాలపై ఫ్రాన్స్, బ్రిటన్ల ఆధిపత్యం కొనసాగింది. యూదుల కోసం ఒక దేశం అవసరమని చేసిన 1917లో చేసిన బాల్ఫోర్ తీర్మానాన్ని బ్రిటనే రచించింది. తీర్మానం మొదటిభాగాన్ని సవ్యంగా అమలుచేసిన బ్రిటన్ ఆ తర్వాత రెండో భాగాన్ని గాలికొదిలేసింది. పాలస్తీనియన్ల పౌర, మత హక్కులకు ఎలాంటి అవరోధాలు సృష్టించకూడదని రెండోభాగంలో తీర్మానించినా అది ఇజ్రాయెల్ కారణంగా అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత బ్రిటన్ పాలస్తీనాను గుర్తించి గతంలో తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసిందని రాయల్ యునైటెడ్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు బెర్కూ ఒజ్సేలిక్ వ్యాఖ్యానించారు. -
తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ 'శ్రీధర్ వెంబు' స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''విభజన సమయంలో అన్నీ వదిలి భారతదేశానికి ఎలా రావాల్సి వచ్చిందో.. సింధీ స్నేహితుల నుంచి నేను చాలా విషయాలను విన్నాను. వారు తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారు. సింధీలు భారతదేశంలో బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో.. హెచ్1బీ వీసాపై ఉన్న భారతీయుల వంతు వచ్చింది. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.. మన దేశానికి తిరిగి వచ్చేయండి. మీ జీవితాలను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టవచ్చు. కానీ అది మిమ్మల్ని బలపరుస్తుంది. భయంతో జీవించవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు బాగానే ఉంటారు'' అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.I have heard so many accounts from Sindhi friends about how their families had to leave everything and come to India during partition. They rebuilt their lives and Sindhis have done well in India.I am sad to say this, but for Indians on an H1-B visa in America, this may be that…— Sridhar Vembu (@svembu) September 21, 2025శ్రీధర్ వెంబు పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''వాస్తవాలు తెలియకుండా భయాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలో ఉన్న వ్యక్తులకు కొత్త నియమాలు వర్తించవు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త నియమాలు కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకు మాత్రమే'' అని ఒక యూజర్ పేర్కొన్నారు. బెంగాలీలు, పంజాబీల నుంచి మీరు చాలా విషయాలను విని ఉండవచ్చు. కానీ వారు ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి దాదాపు మూడు తరాలు పట్టింది. ఇది అంత సులభం కాదని ఇంకొకరు అన్నారు.ఇలాంటి సవాళ్లు అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశానికి తిరిగి వచ్చి, జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చాలా కృషి అవసరం. కానీ భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ధైర్యం, పట్టుదలతో, అభివృద్ధి చెందవచ్చని.. మరో యూజర్ శ్రీధర్ వెంబు మాటలతో ఏకీభవించారు. -
‘మన టాలెంట్ చూసి భయపడుతున్నట్లున్నారు’
న్యూఢిల్లీ: అమెరికా హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు రుసుము భారీ పెంచిన నేపథ్యంలో ఒకవైపు ఆందోళన నెలకొంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయుల ఆశలకు దాదాపు గండిపడింది. సుమారు లక్ష అమెరికన్ డాలర్ల(రూ. 83 లక్షలు) రుసుము చెల్లిస్తే కానీ కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిక అవకాశం ఉండదు. అంటే తమ దేశానికి రావొద్దని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చేశారు. తమ దేశ సంపదను భారతీయులు కొల్లగొట్టేస్తున్నారనే భయం ట్రంప్‌లో మొదలైనట్లుంది.భారతీయుల్లో టాలెంట్‌కు కొదవ లేకపోవడంతో అమెరికాలోని అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన అసూయను బయటపెట్టేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ మన దేశంలోని యువత ప్రతిభకు అమెరికా భయపడినట్లుంది’ అంటూ చమత్కరించారు. ఇదే విషయంపై ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ మాట్లాడారు. రేపు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు గోయల్. అయితే ముందుగానే అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా రుసుముకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. టాలెంట్ పరంగా చూస్తే మనవాళ్లు మేటి అని, దాన్ని చూసే అమెరికా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసిందంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. ‘మన ప్రతిభను చూసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చమత్కరించారు. పలు దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు ఎదురుచూస్తున్నాయని, భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచకోవడానికి చాలా దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. Bharat is a winner, come what may! pic.twitter.com/5MXtih8Cnr— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2025 కాగా, నేటి(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదిలా ఉంచితే, పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 22న అమెరికాకు పయనం కానున్నారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం.. భారత ప్రతినిధి రాజేష్ అగర్వాల్ తో జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాలను తగ్గించడం ఈ చర్చల్లో ఒక కీలక అంశం కానుంది. -
h1b visa: ‘హెచ్1బీ’ వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గ దర్శకాల ప్రకారం.. హెచ్ 1 బీ వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. మినహాయింపులు:అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలుఅమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులువ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌసులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసా దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే దాఖలైన కానీ ఇంకా వీసా పొందని ధరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే.ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్‌కు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్‌కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
United States: గుజరాతీ మహిళ హత్యకేసులో యువకుని అరెస్ట్
దక్షిణ కరోలినా: దక్షిణ కరోలినాలో గుజరాతీ మహిళ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16న గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ మరణానికి దారితీసిన కాల్పుల సంఘటనతో సహా రెండు కాల్పుల సంఘటనలలో ప్రమేయం ఉన్న జైడాన్ మాక్ హిల్ (21)ను పోలీసులు అరెస్టు చేశారు.సెప్టెంబర్ 16న దక్షిణ కరోలినాలోని యూనియన్ కౌంటీలోని సౌత్ మౌంటైన్ స్ట్రీట్‌లోని ఒక యార్డ్‌లో చార్లెస్ నాథన్ క్రాస్బీ(67) అనే వృద్దుడిని మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే రోజు సాయంత్రం, కిరణ్ పటేల్ (49) పై డీడీస్ ఫుడ్ మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిగాయి. ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. గో ఫండ్‌మీ పేజీలోని వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ సమయంలో కిరణ్ పటేల్ యూనియన్ కౌంటీలో గ్యాస్ స్టేషన్-కమ్-కన్వీనియన్స్ స్టోర్ రిజిస్టర్ వద్ద నగదు లెక్కిస్తున్నారు. హిల్ ఆమె వద్దకు వచ్చి, క్యాష్ రిజిస్టర్ లాక్కున్నాడు. ఆమె అతనికి నగదు ఇచ్చేలోపుగానే అతను కిరణ్ పటేల్‌పై కాల్పులు జరిపాడు.అతనిని అడ్డుకునేందుకు కిరణ్ పటేల్ అతనిపైకి ప్లాస్టిక్ బాటిల్ విసిరి పరిగెత్తింది. హిల్ కూడా ఆమె వెంట పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం వైపు పరిగెత్తిన కిరణ్ పటేల్ పై హిల్ కాల్పులు కొనసాగించాడు. ఆమెకు బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చి మరోమారు కాల్పులు జరిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సౌత్ కరోలినా లా ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో సౌత్ చర్చి స్ట్రీట్‌లోని హిల్ ఇంటికి చేరుకున్నారు. అయితే హిల్ వారిని ప్రతిఘటించాడు. ఎట్టకేలకు పోలీసులు హిల్‌ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో.. లక్ష డాలర్లా.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే
-
అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?
అమెరికా హెచ్-1బి వీసాలపై భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వీసాలకు వార్షిక ఫీజును యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు చేశారు. అంటే దాదాపు రూ.88 లక్షలపైనే. దీంతో ఈ హెచ్-1బి వీసాలపై ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు, కొత్తగా వెళ్లాలనువారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు ఎంత సంపాదిస్తున్నారు.. వారి జీతాలు, వాస్తవ స్థితిగతుల గురించి ఈ కథనంలో చూద్దాం..అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి భారతీయ ఐటీ సంస్థలచే నియమితులైనవారు మరీ అంత ఎక్కువ జీతాలేమీ పొందడం లేదు. వారి జీతంలో అత్యధికం బేస్ పే (ప్రాథమిక జీతం)కు ఉండటం వల్ల మొత్తం ప్యాకేజీ చూడగానే ఆకర్షణీయంగా కనిపించినా, అమెరికన్ టెక్ కంపెనీలతో పోల్చితే గణనీయమైన తేడా స్పష్టమవుతుంది.జీత నిర్మాణంఅమెరికాలో ఈ ఉద్యోగుల బేస్ పే మొత్తం జీతంలో 70-90% వరకు ఉంటుంది. ఇది యూఎస్ కార్మిక విభాగం (U.S. Department of Labor) నిర్ణయించిన వేతన స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. జాబ్ రోల్, అనుభవం, పని ప్రదేశాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా, భారతీయ సంస్థలు తమ హెచ్-1బి ఉద్యోగులకు 65,000 నుండి 90,000 డాలర్ల మధ్య బేస్ పేని అందిస్తుంటాయి.అదే ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చాక కొన్ని సంస్థలు ఆ జీతాన్ని భారీగా తగ్గించేస్తున్నాయి. ఇది మొత్తం ప్యాకేజీలో 10% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే పీఎఫ్, గ్రాట్యుటీ వంటి లీగల్ బెనిఫిట్ల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.అలవెన్సులు, బోనసులుబేస్ పే పైన, కొన్ని ఆన్సైట్ అలవెన్సులు – హౌసింగ్, కాల్ (Cost of Living) అడ్జస్ట్మెంట్లు, రీలొకేషన్ సపోర్ట్ – జీతంలో 5-20% వరకు ఉంటాయి. అయితే, ఇవి ప్రాంతం, సంస్థ విధానంపై ఆధారపడి, యూఎస్ లోని స్థానిక ఉద్యోగుల అలవెన్సులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.బోనస్‌లు సాధారణంగా జీతంలో 10% లోపు ఉంటాయి. సీనియర్ ఉద్యోగులకు కొంత మెరుగుదల కనిపించినా, అవి యూఎస్ కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలతో పోల్చితే తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు హెచ్-1బి ఉద్యోగులకు 120,000 – 200,000 డాలర్ల వరకు బేస్ పే, అదనపు ఈక్విటీ, స్టాక్ ఆప్షన్లు, గణనీయమైన బోనస్‌లు అందిస్తున్నాయి.ప్రయోజనాలుహెచ్-1బి ఉద్యోగులకు హెల్త్ బెనిఫిట్స్ కింద ఆరోగ్య బీమా, డెంటల్, కంటి బీమా వంటి ప్రాథమిక ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇవి సాధారణంగా కుటుంబ సభ్యులను కూడా కవర్ చేస్తాయి. అయితే, భారతీయ ఐటీ సంస్థలలో స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్‌లు చాలా అరుదుగా ఉంటాయి. ప్రత్యక్షంగా యూఎస్ కంపెనీలచే నియమితులైన ఉద్యోగులకు మాత్రమే ఇవి సాధారణంగా లభ్యమవుతాయి.ఈ పరిస్థితులలో హెచ్-1బి వీసాపై ఉన్న భారతీయ ఉద్యోగులు అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నా, తమ స్థానిక సహోద్యోగులతో పోల్చితే జీతాల పరంగా తక్కువగానే అందుకుంటున్నారు. దీన్నిబట్టి అమెరికాలో హెచ్-1బి వీసాల ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
భారతీయులకు శరాఘాతమే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారతీయ టెక్నాలజీ ఉద్యోగులకు శరాఘాతమేనని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు. అత్యంత ప్రతిభావంతులపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వారి సేవలు తప్పనిసరిగా అవసరమని అమెరికా కంపెనీలు భావిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడొచ్చు. ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను అధ్యక్షుడు ట్రంఫ్ పాటిస్తున్నారు. అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు.వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని ‘ప్రాజెక్టు ఫైర్‌వాల్’గా అమెరికా కార్మిక శాఖ అభివర్ణించింది. అమెరికన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు రక్షణఛత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీసా ఫీజు లక్ష డాలర్లుఅంటే అది సాధారణ హెచ్–1బీ ఉద్యోగ వార్షిక వేతనంతో సమానం, కొందరి విషయంలో అంతకంటే ఎక్కువే కావడం గమనార్హం. వీసా కోసమే ఏటా లక్ష డాలర్లు చెల్లించి భారతీయులను నియమించుకోవడం చాలా కంపెనీలకు తలకు మించిన భారమే. 2023లో 1.91 లక్షల మంది, 2024లో 2.07 లక్షల మంది భారతీయులు హెచ్–1బీ వీసాలు పొందారు.ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర భారతీయ ఐటీ కంపెనీలు జూనియర్ లేదా మిడ్–లెవెల్ ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపించకపోవచ్చు. మరోవైపు వీసా రుసుము పెంపు వల్ల విదేశీ ఉద్యోగుల కంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమ ప్రధానంగా విదేశీయులపై ఆధారపడుతోంది. వారి రాకను అడ్డుకుంటే నవీన ఆవిష్కరణలు, ప్రగతికి ఆటంకం కలగొచ్చు. అంతిమంగా అమెరికాకే నష్టం జరుగుతుంది.అది తెలివైన నిర్ణయం కాదు భారతీయులను లక్ష్యంగా చేసుకోవడాన్ని కాటో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డేవిడ్ బియర్ తప్పుపట్టారు. ఇండియన్ హెచ్–1బీ వీసాదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని తెలిపారు. వారు పన్నుల రూపంలో ప్రతిఏటా బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. శాంతి కాముకులు, కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు, చట్టాలను చక్కగా గౌరవించే భారతీయులను దూరం పెట్టడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. మొత్తం అమెరికాకే వన్నె తెస్తున్న భారతీయులను బయటకు పంపించాలని అనుకోవడం తెలివైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేవలం భారత్‌లో జన్మించారన్న కారణంతో వివక్ష చూపడం, వారి సేవలు వదులుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ మేరకు డేవిడ్ బియర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.భారత్‌కు ప్రయాణాలు బంద్ హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల వార్షిక రుసుమును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అమెరికాలోని భారతీయులు ఆందోళనకు గురయ్యారు. స్వదేశానికి పయనమైన చాలామంది హఠాత్తుగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. పండుగలు, బంధుమిత్రుల వివాహాల కోసం భారత్‌కు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. విమానాలు ఎక్కాల్సిన వారు కూడా వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఇండియాకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో కనిపించింది. త్వరలో జరగాల్సిన ప్రయాణాలను సైతం కొందరు రద్దు చేసుకున్నారు. అమెరికాలోని భారతీయుడికి పెళ్లి కుదిరింది. త్వరలో భారత్‌లోనే పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడు ట్రంప్ ప్రకటన తెలిసి ఏం చేయాలో అర్థంకాక వెనక్కి మళ్లాడు.అంటే అతడి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే ఇండియాలో ఉన్న హెచ్–1బీ వీసాదా రుల్లో సందిగ్ధత నెలకొంది. పెరిగిన వీసా రుసుములు చెల్లించాలా లేదా అని ఆరా తీస్తూ కనిపించారు. అమెరికాలోని టెక్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పట్లో స్వదేశాలకు వెళ్లే ఆలోచన చేయొద్దని, అమెరికాలోనే ఉండిపోవాలని సూచించాయి. బయట ఉన్నవారు వెంటనే రావాలని ఆదేశించాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు రావడం భారతీయు లను నిరాశకు గురిచేసింది.ఇండియాలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలని ఆశించామని, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నామని, ట్రంప్ ప్రకటనతో తమ ఆనందం ఆవిరైపోయిందని ఓ భారతీయుడు ఆవేదన వ్యక్తంచేశాడు. చాలామంది తమ మనసులోని బాధను సోషల్ మీడియా పోస్టుల్లో వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారతీయుల్లోనూ ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు హెచ్–1బీ వీసాల ఫీజులు పెంచేశారని, ఇతర వీసాలను ట్రంప్ వదిలిపెట్టబోడని వారు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ నిర్ణయాలను కోర్టులు నిలిపివేయొచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.అధ్యయనం చేస్తున్నాం: రణధీర్ జైశ్వాల్హెచ్–1బీ వీసా ఫీజు పెంపుతో భారతీయ కుటుంబాల్లో కొన్ని పర్యవసానాలు తలెత్తే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. వీసా ఫీజు పెంపు వల్ల ఏర్పడే పరిణామాలపై భాగస్వామ్య పక్షాలతో కలిసి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులు ఇక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందన్నారు. భారతీయ స్కిల్డ్ వర్కర్లతో అమెరికా లబ్ధి పొందుతోందని గుర్తుచేశారు. భారత్, అమెరికాల మధ్య ప్రతిభావంతుల బదిలీ అనేది సహజంగా జరుగుతోందని వివరించారు. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. -
భారత టెక్ కంపెనీలపై ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరికా అదనంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించడంపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో ఆన్‌షోర్ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఫలితంగా భారతీయ టెక్నాలజీ సర్వీస్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అంతే గాకుండా దీని అమలుకు ఒకే ఒక్క రోజు గడువు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్, విద్యార్థుల విషయంలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ, భారతీయ కంపెనీల కోసం హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న భారతీయులపైనా అమెరికా నిర్ణయం ప్రభావం పడుతుందని నాస్కామ్ వివరించింది. వీసా ఫీజులపై ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మార్పుల వల్ల అమెరికా నవకల్పనల వ్యవస్థపై, అలాగే ఉద్యోగాలపై కూడా ప్రభావాలు పడతాయని పేర్కొంది. వీటికి తగ్గట్లుగా సర్దుబాట్లు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కంపెనీలు పని చేస్తాయని వివరించింది. ఈ స్థాయి మార్పులు చేసేటప్పుడు వ్యాపారవర్గాలు, వ్యక్తులు ప్రణాళిక వేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ‘మేము ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీని వల్ల తలెత్తే ప్రభావాల గురించి పరిశ్రమవర్గాలతో సమాలోచనలు జరుపుతున్నాం‘ అని నాస్కామ్ తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం హెచ్1బీ వీసాలు కలిగి ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులను అత్యవసరంగా అమెరికాకు తిప్పి పంపేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కంపెనీలకు నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ సూచించారు. కృత్రిమ మేథ, ఇతరత్రా టెక్నాలజీలను అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థకు విఘాతం కలుగుతుందని తెలిపారు. నవకల్పనలకు నిపుణులు కీలకం.. కొత్త ఆవిష్కరణలను కనుగొనేందుకు, అమెరికా దీటుగా పోటీపడేందుకు, ఆ దేశ ఎకానమీ అభివృద్ధి చెందేందుకు ప్రతిభావంతులు అవసరమని నాస్కామ్ తెలిపింది. ఏఐతో పాటు ఇతరత్రా సాంకేతికతల్లో అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో వారి సేవలు కీలకంగా మారాయని వివరించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసా ఫీజులు కంపెనీ స్థాయిని బట్టి సుమారు 2,000–5,000 డాలర్ల వరకు ఉన్నాయి. కొత్తగా విధించిన 1,00,000 డాలర్లు దీనికి అదనం. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరుతో తలపెట్టిన చేపట్టిన ఈ చర్య, కీలకమైన ప్రతిభావంతుల లభ్యతను దెబ్బతీస్తుందని కార్పొరేట్ న్యాయవాది సీఆర్ సుకుమార్ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయాన్ని వీసా కన్సల్టెంట్, ఐటీ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ నూనే ’షాకింగ్’గా అభివర్ణించారు. అమెరికాలో సర్వీసులు అందిస్తున్న చాలా మటుకు ఐటీ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీనితో ప్రతిభావంతులను అమెరికాకు రప్పించడం కష్టతరం అవుతుంది కాబట్టి అమెరికన్ కంపెనీలపైనా ప్రభావం పడుతుందన్నారు. అమెరికాలో నియామకాలు పెంచుకుంటున్నాం .. భారత్ కేంద్రంగా పని చేసే కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామకాలను పెంచుకోవడం ద్వారా కొన్నాళ్లుగా వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న సంగతిని నాస్కామ్ గుర్తు చేసింది. ఈ కంపెనీలు హెచ్1బీ ప్రాసెస్‌లకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తున్నాయని, నిర్దేశిత జీతభత్యాలు చెల్లిస్తున్నాయని, స్థానిక ఎకానమీ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, కొత్త ఆవిష్కరణల కోసం విద్యాసంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ కంపెనీల్లో హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న వర్కర్లతో అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని స్పష్టం చేసింది. ఐటీ కంపెనీల వ్యయాలు పెరుగుతాయ్హెచ్1బీ వీసాల ఫీజు పెంపుతో భారతీయ ఐటీ కంపెనీలకు వ్యయాలపరంగా సవాళ్లు గణనీయంగా పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో దీని పరిణామాలు కొంత తీవ్రంగా ఉండొచ్చు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో నియామకాలను మరింతగా పెంచుకునేందుకు, గ్లోబల్ డెలివరీ వ్యవస్థను పటి ష్టం చేసుకునేందుకు ఇది దారి తీయొచ్చు. తద్వా రా సవాలును అవకాశంగా మల్చుకోవడానికి ఆస్కారం ఉంది. – బీవీఆర్ మోహన్ రెడ్డి, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ఆఫ్షోరింగ్ వేగవంతంహెచ్1బీ వీసా ఫీజుల పెంపుతో కొత్త దరఖాస్తులపై ప్రభావం పడుతుంది. దీని ఎఫె క్ట్‌తో ఓవైపు ప్రతిభావంతులు దొరక్క, మరోవైపు వ్యయాలు పెరిగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్యకలాపాల ఆఫ్‌షోరింగ్ మరింత వేగవంతం అవుతుంది. హెచ్1బీ వీసాలపై భారత ఐటీ కంపెనీలు ఆధారపడటం కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది. డేటా ప్రకారం అమెరికన్ టెక్ దిగ్గజాలే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నాయి. కొత్త దరఖాస్తులకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే దీని ప్రభావం పరిమితమే. అమెరికాలో చౌకగా పని చేసి పెట్టేలా ఉద్యోగులను పంపించేందుకు కంపెనీలు ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయన్న అభిప్రాయాలన్నీ అపోహలే. హెచ్1బీ వీసాలను వినియోగించుకునే టాప్ 20 కంపెనీలు సగటున 1,00,000 డాలర్ల పైగానే జీతభత్యాలు ఇస్తున్నాయి. – మోహన్‌దాస్ పాయ్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వోఅమెరికాకు నష్టం, భారత్‌కు లాభం హెచ్1బీ వీసా ఫీజులను భారీగా పెంచడం వల్ల అమెరికాలో కొత్త ఆవిష్కరణలపై దెబ్బ పడుతుంది. అయితే, దీని వల్ల భారత్‌లో నవకల్పనలకు ఊతం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్ లాంటి నగరాలకు కొత్త ప్రయోగశాలలు, పేటెంట్లు, అంకురాలు వెల్లువెత్తుతాయి. తద్వారా హెచ్1బీ ఫీజులను పెంచడమనేది అమెరికాకు నష్టదాయకం, భారత్‌కు లాభదాయకంగా మారుతుంది. దీని వల్ల దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు భారతదేశ వృద్ధి గాధలో, వికసిత భారత్ లక్ష్య సాధనలో పాలుపంచుకునే అవకాశం లభించినట్లవుతుంది. – అమితాబ్ కాంత్ , నీతి ఆయోగ్ మాజీ సీఈవో -
కొత్తవాళ్లకు మాత్రమే
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుము పెంపుపై సర్వత్రా గగ్గోలు రేగిన నేపథ్యంలో ఈ పెంపు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుందని ‘వైట్‌హౌస్’ అధికారి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం పేర్కొంది. ‘హెచ్1బీ ఫీజు పెంపునకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సవాళ్లను అధిగమిస్తే అంతర్జాతీయ వృత్తి నిపుణులను తీసుకొనే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏటా లక్ష డాలర్ల ఫీజు చొప్పున ఆరేళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ఫీజు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుంది’ అని ‘వైట్‌హౌస్’ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది. మరోవైపు స్వదేశాలకు వెళ్లిన ప్రస్తుత హెచ్1బీ వీసాదారులు నిర్దేశిత గడువులోగా హడావుడిగా తిరిగి అమెరికా చేరుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. -
గోల్డ్ కార్డ్ వచ్చేసింది
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే అత్యంత ఖరీదైన ‘గోల్డ్ కార్డ్’పథకానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఎవరైనా 10 లక్షల డాలర్లు చెల్లించి ఈ గోల్డ్కార్డ్ను తమ వశంచేసుకోవచ్చు. ఎంచక్కా అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవచ్చు. తమ సంస్థ పురోభివృద్ధికి అక్కరకొస్తారని భావించే అత్యంత నైపుణ్యమున్న సిబ్బంది, ఉన్నతాధికారులను అమెరికాకు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అమెరికా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వును రూపొందించగా దానిపై ట్రంప్ సంతకం చేశారు. ద్రవ్యలోటును తగ్గిస్తూ అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్లను జమచేసే ఈ కీలక పథకాన్ని స్వయంగా ట్రంప్ రూపొందించారని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న పెట్టుబడి వీసా(ఈబీ–5)కి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్‌ను తాజాగా తీసుకొచ్చారు. హెచ్–1వీ వీసాదారులు మొదలు ఎలాంటి వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవాళ్లయినా నేరుగా అమెరికా స్థిరనివాసం కావాలంటే ఈ గోల్డ్కార్డ్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ప్రపంచంలోని ఏ దేశంలోని సంపన్నులైనా అమెరికాలో శాశ్వత స్థిరనివాస హోదా సంపాదించాలంటే వీసా పొంది తర్వాత గ్రీన్‌కార్డ్ కోసం ఆతర్వాత పౌరసత్వం కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సంపన్నులు, లక్షల డాలర్లు గుమ్మరించే స్తోమత ఉన్న ఉన్నతాధికారుల కోసమే ప్రత్యేకంగా ఈ గోల్డ్కార్డ్ను అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఖజానాకు ఆదాయ వరద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశాక ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గోల్డ్‌కార్డ్ సాయంతో ఇకపై మేం వందల కోట్ల డాలర్లను ఒడిసిపట్టబోతున్నాం. ఖజానాకు గోల్డ్‌కార్డ్ ఆదాయ వరదను పారించనుంది. తమకు అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, నిపుణులు అనుకున్న వాళ్లను కంపెనీలు ఈ గోల్డ్‌కార్డ్‌తో అమెరికాకు రప్పించుకోవచ్చు. గోల్డ్‌కార్డ్ అనేది నిజంగా అత్యద్భుతం. ఈ కార్డ్‌ల విక్రయాలతో వచ్చే నగదుతో మా ద్రవ్యలోటు భారం తగ్గిపోతుంది. ఖజానా నిండిపోతే మేం పన్నులు కూడా తగ్గిస్తాం. అప్పుల గుదిబండను కాస్తంత దించుకుంటాం. గోల్డ్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అడిగిన ప్రతి డాక్యుమెంట్‌ను సమయానికి ఇవ్వాలి. కార్డ్ మంజూరైతే 10 లక్షల డాలర్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా మసలుకుంటామని మాటివ్వాలి’’అని ట్రంప్ చెప్పారు. ‘‘కార్డ్ పొందిన వాళ్లు చట్టబద్ధ శాశ్వత స్థిరనివాస హోదా పొందేందుకు అర్హత సాధిస్తారు. వీసా అందుబాటులో ఉంటుంది. గోల్డ్కార్డ్దారులు ఇచ్చే 10 లక్షల డాలర్లను వాణిజ్యమంత్రి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ నగదును అమెరికా వాణిజ్యం, దేశీయ పారిశ్రామికాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు. అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న పెట్టుబడిదారులు, అంకుర సంస్థల అధినేతలు, నైపుణ్య సిబ్బందికి గోల్డ్‌కార్డ్ సులువైన చక్కటి మార్గం’’అని ట్రంప్ అన్నారు. పౌరసత్వానికి గోల్డ్‌కార్డ్ అనేది సుగమం చేస్తుందని గతంలో వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా అనే తేడాలేకుండా లక్షలు చెల్లించే ఏ దేశ పౌరునికైనా ఈ కార్డ్‌ను అమెరికా విక్రయించి స్థిరనివాసానికి సాదరస్వాగతం పలుకుతోంది. ట్రంప్ నిర్ణయంతో సంపన్న భారతీయులకు వేగంగా యూఎస్ పౌరసత్వం లభించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. కార్డ్ వస్తే వెంటనే పౌరసత్వం ఇచ్చినట్లుగా భావించకూడదని ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది. -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్‌నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం ‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల నిప్పులు పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్‌రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి. దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి. ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు. షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలిచిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్‌లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు. రుణాలు ఇక సులువు ‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్‌ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్‌ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో హెలికాప్టర్లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్‌లోని లోథల్‌లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్‌నగర్‌కు చేరుకోగానే రోడ్‌షోలో పాల్గొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్‌పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B visas: టీసీఎస్వే ఎక్కువ..
అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తర్వాత అత్యధిక హెచ్ 1బీ వీసా అప్రూవల్స్ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
భారతీయులకు ఘోర అవమానం.. యూఎస్ హోవార్డ్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన భారతీయులనే టార్గెట్ చేసి ఇలా అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ సందర్భంగా ప్రతీ హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో, హెవార్డ్ మాట్లాడుతూ..‘ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే. కేవలం అత్యుత్తమైన, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలి. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.“Stop this nonsense of letting people come to America on visas for free. Only valuable people are welcome,” says US Commerce Secretary Howard Lutnick hiking H1B visa fee pic.twitter.com/SwGh3D9sih— Shashank Mattoo (@MattooShashank) September 19, 2025దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హెచ్1బీ వీసాలపై భారతీయులే ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తారు. ఈ నేపథ్యంలో హోవార్డ్.. భారతీయులను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేశారని, అవమానించే విధంగా మాట్లాడరని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్య 28లక్షలుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా ద్వారా.. ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ప్రతీ ఏడాది 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. -
హెచ్1 బీ వీసా.. భారతీయులకు బిగ్ షాక్
-
H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయులకు బిగ్ షాక్
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది.2025 జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం ఈ క్రమంలోనిదే. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అత్యంత కీలకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. ‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారికే ఇవ్వండి. ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయండి’ అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు.అమెరికా సర్కారు హెచ్1బీ కింద కొన్ని రంగాల్లో తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకువచ్చేందుకు కంపెనీలకు ఏటా 65 వేల వీసాలు ఇస్తుంటుంది. అడ్వాన్స్డ్ డిగ్రీలు కలిగిన కార్మికులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడున్న విధానంలో వీసా కోసం లాటరీలో ప్రవేశించేందుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది. దీనికి ఆమోదం పొందిన తర్వాత, తదుపరి రుసుములు వేల డాలర్లలో ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల కన్నా చాలా చాలా తక్కువని చెప్పుకోవచ్చు. కాగా అన్ని వీసా రుసుములను కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసాలకు మూడు నుంచి ఆరేళ్ల కాలానికి ఆమోదం లభిస్తుంది. హెచ్1బీ వీసా కలిగినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది హెచ్1బీ వీసాల లబ్ధిదారుల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. మొత్తం వీసాలలో 71 శాతం భారతీయులకే లభించగా, చైనా 11.7శాతంతో తరువాతి స్థానంలో ఉంది. 2025 మొదటి ఆరు నెలలో అమెజాన్.కామ్, దాని క్లౌడ్-కంప్యూటింగ్ విభాగం ఏడబ్ల్యూఎస్ 12 వేలకుమించిన హెచ్1బీ వీసాలను ఆమోదింపజేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు ఒక్కొక్కటి ఐదువేలకు మించినహెచ్1బీ వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. ఇదిలాఉండగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఒక మిలియన్ డాలర్లు చెల్లించగలిగేవారికి గోల్డ్ కార్డ్‌ను తీసుకువచ్చేందుకు ట్రంప్ తాజాగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఒక లక్ష అమెరికన్ డాలర్లు భారతీయ కరెన్సీలో సుమారు రూ.88 లక్షలకు సమానం -
షీ జిన్‌పింగ్‌కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్‌పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్‌పింగ్‌ను కలుస్తా: ట్రంప్ జిన్‌పింగ్‌తో మాట్లాడానని, టిక్‌టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. -
గాజా తీర్మానంపై అమెరికా వీటో
ఐక్యరాజ్యసమితి: గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతామండలి చేసిన తీర్మానాన్ని గురువారం మరోసారి అమెరికా వీటో చేసింది. హమాస్ చర్యలను ఈ తీర్మానం సరైన విధంగా ఖండించలేదంటూ అగ్ర రాజ్యం తప్పుబట్టింది. మండలిలోని శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు ఈ తీర్మానాన్ని బలపర్చగా, అమెరికా మాత్రం తిరస్కరించింది. తనకున్న వీటో హక్కును వాడుకుంది. రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికైన 10 శాశ్వతేతర దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి. గాజాలో పరిస్థితులపై గత నెలలో విడుదల చేసిన నివేదికలో ఐరాస తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, మానవతా సాయంపై ఆంక్షలు తొలగిస్తేనే ఈ పరిస్థితి మెరుగవుతుందని పేర్కొంది. ఈ నివేదికను మండలి ముసాయిదా తీర్మానం ప్రస్తావించింది. గాజాలో తీవ్ర మానవీయ సంక్షోభం కొనసాగుతోందని తీర్మానం పేర్కొంది. అక్కడున్న 21 లక్షల పాలస్తీనియన్లకు సాయం అందించడంలో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ‘ఈ తీర్మానం హమాస్ చర్యలను తప్పుబట్టలేదు, ఇజ్రాయెల్కుగల ఆత్మరక్షణ హక్కును బలపర్చలేదు. హమాస్‌కు అనుకూల తప్పుడు వాదనలనే ఈ తీర్మానం తలకెత్తుకుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేస్తుంది’అని ఓటింగ్‌కు ముందే సీనియర్ యూఎస్ పాలసీ అడ్వైజర్ మోర్గాన్ ఒరా్టగుస్ వ్యాఖ్యానించారు. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మండలి సభ్యదేశాలు తీర్మానంలో వాడిన భాష కూడా ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరికొద్ది రోజుల్లో ఐరాస జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రపంచ దేశాల నేతలు ప్రసంగిస్తారు. ఈ దఫా ప్రధానంగా గాజాపై చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో, అమెరికా ప్రధాన మిత్ర దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఈ వైఖరిని ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తీర్మానం వీగిన అనంతరం ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ స్పందిస్తూ.. భద్రతా మండలి సెషన్లో జరిగిన పరిణామాలు పాలస్తీనా ప్రజల్లో మరింత ఆవేదనకు ఆగ్రహానికి కారణమవుతాయని వ్యాఖ్యానించారు. మండలి సభ్యదేశం నైజీరియా స్పందిస్తూ.. సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడలేకపోతున్నందుకు క్షమించాలంటూ పాలస్తీనా వాసులను కోరింది. ఇజ్రాయెల్ రాయబారి స్పందిస్తూ.. బందీల విడుదలకు గానీ, ఈ ప్రాంతంలో భద్రతను నెలకొల్పడానికి గానీ ఈ తీర్మానం ప్రయతి్నంచలేదని ఆరోపించారు. తమ పౌరుల భద్రతకు, హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గత వారం జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల ప్రతిపాదనను అత్యధిక మెజారీ్టతో ఆమోదించింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఇజ్రాయెల్‌ను కోరింది. హమాస్ లక్ష్యంగా గాజాను నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించడంతోపాటు పౌరులపై యథేచ్ఛగా కాల్పులు, దాడులకు పాల్పడటాన్ని ఫ్రాన్స్, యూకే తీవ్రంగా ఖండిస్తున్నాయి. త్వరలో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనకు మద్దతిస్తామని ప్రకటించాయి. -
భారత్‌కు అల్టిమేటమా?.. ఏమాత్రం పనిచేయదు
టారిఫ్‌ల బెదిరింపులతో భారత్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందా?.. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదని.. అలాంటి అల్టిమేటంలు ఎన్ని ఇచ్చినా భారత్ తలవంచబోదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాలని, అలాంటి దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ఒత్తిడులు ఏమాత్రం పని చెయ్యబోవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం ఆపాలని చేస్తున్న ఒత్తిళ్లు.. ఆ దేశాలను అమెరికాకు మరింత దూరం చేస్తాయే తప్ప ప్రయోజనం ఉండబోదని ‘ది గ్రేట్ గేమ్’ అనే టీవీ కార్యక్రమంలో లావ్రోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు ద్వారా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 25 శాతం పెనాల్టీ సుంకాలను ట్రంప్ విధించారు(మొత్తం 50 శాతం). రష్యాతో వాణిజ్యం ఆపకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై సెర్గీ స్పందించారు. ‘‘నాకు నచ్చనిది వెంటనే ఆపండి. లేకుంటే మరిన్ని సుంకాలు విధిస్తా’’ అనే భాష ఆ దేశాలపై ప్రయోగించడం ఏమాత్రం సరికాదు. అలాంటి బెదిరింపులు ప్రాచీన నాగరికత ఉన్న ఆ దేశాలపై పని చేయవు కూడా అని అన్నారాయన. పైగా..ఈ తరహా విధానం ఆ దేశాల ఆర్థిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా, వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొత్త మార్కెట్లు, కొత్త ఇంధన వనరులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక, ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, దీని కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఈ విధానానికి నైతికంగా, రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారాయన. ఇక రష్యాపై కొత్త ఆంక్షల విధింపు బెదిరింపులపైనా ఆయన స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే.. కొత్త ఆంక్షల వల్ల ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ట్రంప్ మొదటి పదవీకాలంలోనే ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. బైడెన్ పదవీకాలంలో ఆంక్షలకు బదులు దౌత్యపరమైన చర్చలు తెరమీదకు వచ్చాయి. కానీ, అమెరికాతో రాజీ కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధ కొనుగోళ్ల అంశంతో భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే చైనా విషయంలో మాత్రం కేవలం బెదిరింపులకే పరిమితం అయ్యారు. అలాగే రష్యాపైనా కఠిన ఆంక్షలు ఉంటాయంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలోకి మాత్రం తీసుకురావడం లేదు. ఇదిలా ఉండగానే అమెరికా-భారత్ వాణిజ్య చర్చల్లో పురోగతి చోటు చేసుకోవడం.. సుంకాలపై అమెరికా వెనక్కి తగ్గవచ్చనే సంకేతాలను అందిస్తోంది. -
అమెరికాలో తెలంగాణ వాసి మృతి
-
రాజకీయాల్లో జోక్యం చేసుకోను
రోమ్: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని పోప్ లియో స్పష్టం చేశారు. అయితే, ఆ దేశంలో కేథలిక్ చర్చి, వలసలకు సంబంధించిన అంశాలపై మాత్రం మాట్లాడుతానన్నారు. అమెరికాకు చెందిన మొట్టమొదటి పోప్‌గా చరిత్ర సృష్టించిన లియో మొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మతబోధకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ కేథలిక్కులు, వాటికన్–చైనా సంబంధాలు సహా పలు అంశాలపై మాట్లాడారు. వాటికన్ కరస్పాండెంట్ ఎలిస్ అన్ అల్లెన్‌కు ఇచి్చన ఈ ఇంటర్వ్యూ గురువారం ప్రచురితమైంది. ‘కేథలిక్ చర్చిలోకి అందరూ ఆహా్వనితులే’అంటూ ఎల్జీబీటీక్యూ ప్లస్ కేథలిక్కులను ఉద్దేశించి దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన సందేశాన్ని తానూ స్వీకరిస్తున్నానన్నారు. లైంగిక సంబంధ అంశాల్లో చర్చి వైఖరి మారడానికి దాదాపుగా అవకాశమేలేదని స్పష్టం చేశారు. హోమోసెక్సువల్ వ్యక్తులను కూడా గౌరవించాలని కేథలిక్ చర్చి చెబుతోందన్నారు. అయితే, స్వలింగ వివాహాన్ని చర్చి వ్యతిరేకిస్తుందన్నారు. వివాహం ఆడ, మగ జరగాల్సిందని స్పష్టంగా చెబుతోందని పోప్ లియో అన్నారు. చైనాతో సంబంధాలపై ఆయన..బిషప్పుల నియామకంపై 2018లో చైనాతో చేసుకున్న వివాదాస్పద ఒప్పందంలో సమీప భవిష్యత్తులో మార్పులు జరిగే అవకాశం లేదని భావిస్తున్నానన్నారు. చైనాలో వివిధ చర్చిల పరిధిలో ఉన్న కోటికి పైగా కేథలిక్కులను ఏకం చేసే లక్ష్యంతో పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. చర్చిల్లో లైంగిక వేధింపుల కుంభకోణాలను ప్రస్తావించిన పోప్ లియో..నిజంగా ఇదో సంక్షోభమన్నారు. బాధితుల్లో 90 శాంత వరకు ముందుకొచ్చి తన ఆరోపణలు చేస్తున్నారని, వీరి సాంత్వన కలిగించే విషయంలో చర్చి వ్యవస్థ ఒక పరిష్కారాన్ని కనుగొనలేకపోయిందని చెప్పారు. అదే సమయంలో మతబోధకుల హక్కులను కూడా గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యవహారాలపై అమెరికా పలుకుబడి గణనీయంగా ఉందన్న లియో..కేథలిక్ చర్చి వలసలను కూడా ఒక ముఖ్యమైన అంశంగానే భావిస్తోందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వ వలసదారుల వ్యతిరేక చర్యలను పోప్ ఫ్రాన్సిస్ ఇచి్చన పిలుపు మేరకు అమెరికా బిషప్పులు బహిరంగంగానే వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తోటి మనిషిని తగు రీతిలో గౌరవించాలన్నదే తమ అభిమతమని చెప్పారు. -
భారతీయ సంస్థల అధికారుల వీసాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకరమైన ఫెంటానిల్ మాదకద్రవ్యం తయారీలో ఉపయోగించే రసాయనాల అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న భారతీయ కంపెనీల ఉన్నతాధికారులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ట్రంప్ పరిపాలన విధానాల్లో భాగంగా అమెరికన్లను ప్రమాదకరమైన సింథటిక్ నార్కోటిక్స్ నుండి రక్షించే ప్రయత్నంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదలచేసింది. కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులను అమెరికాకు ప్రయాణించడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే వాళ్లలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల అభ్యర్థనలను తిరస్కరించామని పేర్కొంది. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 221(ఐ), 212(ఎ)(2)(సీ), 214(బీ) సెక్షన్లకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఫెంటానిల్ రసాయనాల స్మగ్లింగ్ చేసే కంపెనీలకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేస్తే లోతైన పరిశీలన, అధ్యయనం తప్పవని యూఎస్ రాయబార కార్యాలయ ప్రతినిధి జోర్గాన్ ఆండ్రూస్ చెప్పారు. -
టారిఫ్‌లకు పది వారాల్లో పరిష్కారం
కోల్‌కతా: అమెరికా టారిఫ్‌లకు వచ్చే ఎనిమిది, పది వారాల్లో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ చెప్పారు. 25 శాతం ప్రతీకారం సుంకం, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతంతో కలిపి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగేశ్వరన్ మాట్లాడారు. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా వెనక్కి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయంటూ, వచ్చే 8–10 వారాల్లో పరిష్కారం లభించొచ్చన్నారు. ‘‘భారత్‌పై విధించిన 25 శాతం పీనల్ టారిఫ్‌ను నవంబర్ చివరి నాటికి అమెరికా ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 30 తర్వాత ఉండకపోవచ్చు. ఇటీవలి పరిణామాల ఆధారంగా ఇది కేవలం నా అంచనాయే. ప్రస్తుతమున్న 25 శాతం ప్రతీకార సుంకం సైతం 10–15 శాతానికి తగ్గొచ్చు’’అని సీఈవో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ టారిఫ్‌లు కొనసాగితే అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయన్నారు. భారత్ మధ్యస్థ ఆదాయ దేశమని, మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు చెప్పారు. కరోనా విపత్తు తర్వాత ఎన్నో దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని సాధించినట్టు తెలిపారు. తయారీ, వ్యవసాయం, సేవల పాత్ర వచ్చే రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో తయారీ, సేవలు, వ్యవసాయ రంగంలో గొప్ప పాత్ర పోషిస్తాయని నాగేశ్వరన్ చెప్పారు. అలాగే, వినియోగం, పెట్టుబడులు వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్నారు. జీడీపీలో భారత రుణ నిష్పత్తి సహేతక స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ఇతర దేశాల కంటే మెరుగైన వృద్ధిని సాధిస్తున్నామని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దానికి ఇది సంకేతంగా పేర్కొన్నారు. గ్రామీణ వినియోగం బలంగా ఉందంటూ, అదే సమయంలో పట్టణ డిమాండ్ పుంజుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుందని, దీంతో పట్టణ వినియోగం సైతం ఇతోధికం అవుతుందని అంచనా వేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సాయం పెరుగుతోందని, పెద్ద పరిశ్రమలకు రుణాల్లో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోందన్నారు. నేటి రోజుల్లో నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచి్చనట్టు చెప్పారు. ఎగుమతులు బలంగా కొనసాగుతున్నట్టు నాగేశ్వరన్ తెలిపారు. మొదటి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.2 శాతానికి పరిమితమైనట్టు చెప్పారు. ‘‘డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న బలం దృష్ట్యా దీర్ఘకాలంలో రూపాయి తన విలువను కాపాడుకుని, బలంగా నిలబడుతుంది’’అని నాగేశ్వరన్ దేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేíÙంచారు. దేశ ప్రైవేటు రంగం పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను మరింతగా పెంచాలని, మరిన్ని ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేథ (ఏఐ) ఉపాధి పరంగా పెద్ద అవరోధం కాదన్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. -
ట్రంప్‌తో బ్రిటన్‌కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్ బ్రిటన్‌లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్‌కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్... స్టార్మర్ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్ 2019లో బ్రిటన్‌లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.కానీ ట్రంప్ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలను స్టార్మర్ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్ మరే హామీ ఇవ్వలేదు. బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్ గుర్తించాల్సి ఉంది. ఆ పనిచేస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది. రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్‌కు విశ్వసనీయత తక్కువ. భారత్ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్... ఉక్రెయిన్ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్ తాజా పర్యటన వల్ల బ్రిటన్‌కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్‌నగర్ యువకుడి మృతి
అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. మహబూబ్‌నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు. -
భారత్‌కు గుడ్‌న్యూస్.. టారిఫ్‌పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
న్యూఢిల్లీ: భారత్‌పై 50శాతం టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్‌లో 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను రద్దు చేయనున్నట్లు సమాచారంరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్‌పై ట్రంప్ టారిఫ్‌తో పాటు పెనాల్టీ టారిఫ్ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్‌ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కోల్‌కతా మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్‌పై టారిఫ్‌ల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్‌లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు. -
ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో
తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏఐ171 డ్రీమ్‌లైనర్‌విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు బాధిత కుటుంబాలు బోయింగ్, హనీవెల్‌పై దావా వేశాయి. కంపెనీ తీవ్ర నిర్లక్ష్య కారణంగానే విమానం కూలిపోయిందని ఆరోపిస్తూ అమెరికాలోని కోర్టులో ఫిర్యాదు నమోదు చేశాయి. తమకు జరిగిన పూడ్చలేని నష్టానికి పరిహారం చెల్లించాలని కోరాయి. ఈ ప్రమాదంపై అమెరికా కోర్టులో దావా వేయడం ఇదే తొలిసారి.డెలావేర్ సుపీరియర్ కోర్టులో మంగళవారం ఈ నాలుగు కుటుంబాలు ఫిర్యాదును దాఖలు చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోని స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని, ముఖ్యంగా 2018లో US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేక బోయింగ్ విమానాలలో డిసేబుల్డ్ లాకింగ్ మెకానిజమ్‌ల గురించి హెచ్చరించిన తర్వాత, స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని పేర్కొన్నారు. ఈ స్విచ్ లాకింగ్ మెకానిజం అనుకోకుండా ఆగిపోవచ్చు, లేదా కనిపించకుండా పోవచ్చు. దీనివల్ల ఇంధన సరఫరా ఆగిపోవచ్చు, టేకాఫ్‌కు అవసరమైన థ్రస్ట్ కోల్పోవచ్చు అని వాదులు తెలిపారు. థ్రస్ట్ లివర్ల వెనుక నేరుగా స్విచ్‌ను ఉంచడం ద్వారా, "సాధారణ కాక్‌పిట్ కార్యకలాపాలు అనుకోకుండా ఇంధన కటాఫ్‌కు దారితీయవచ్చని బోయింగ్ సమర్థవంతంగా హామీ ఇచ్చింది" అయినా, ఈ విపత్తును నివారించడానికి హనీవెల్ , బోయింగ్ చేసిందేమీలేదని ఫిర్యాదులో మండిపడ్డాయి.ఈ ప్రమాదంలో కోల్పోయిన తమ బంధువులు కాంతాబెన్ ధీరూభాయ్ పఘడల్, నవ్య చిరాగ్ పఘడల్, కుబేర్భాయ్ పటేల్, బాబిబెన్ పటేల్ మరణాలకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాయి. అయితే వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న బోయింగ్ బుధవారం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో ఉన్న హనీవెల్ కూడా ఇంకా స్పందించలేదు. రెండు కంపెనీలు డెలావేర్లో విలీనమైనాయి.కాగాఅహ్మదాబాద్‌లోనిమెడికల్ కాలేజీపై ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది సిబ్బంది, మరో 19మందితో229 మంది మరణించారు. ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదిక ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో గందరగోళం నెలకొందని, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జూలైలో నివేదించింది. భారత్, యూకే, అమెరికన్ పరిశోధకులు ప్రమాదానికి కారణం ఇదీ అని నిర్ణయించ లేదు. మరోవైపు బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) దీనిపై క్లారిటీ ఇచ్చింది. US FAA నిర్వాహకుడు బ్రయాన్ బెడ్ఫోర్డ్, యాంత్రిక సమస్య లేదా ఇంధన నియంత్రణ భాగాల అనుకోకుండా కదలికలు కారణం కాదనే గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఈ వేలంవెర్రికి తెర పడదా?
సింపుల్‌గా.... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి ఇప్పుడేం జరిగింది?అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్‌లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!నేపథ్యం ఏమిటి?అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.గత చరిత్రఅమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.వర్తమానం... భవిష్యత్తు...అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్‌తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్‌పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్‌కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025


