Canada
-
కెనడాలో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ట్రూడోకు షాకిచ్చిన ఎన్డీపీ
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) షాక్ ఇచ్చింది. ట్రూడో లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎన్డీపీ నేత జగ్మీత్సింగ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.తాజాగా ఎన్డీపీ నేత జగ్మీత్సింగ్ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను పోస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన..‘జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం ట్రూడో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం అని చెప్పుకొచ్చారు. దీంతో, కెనడా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.మరోవైపు.. కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా..కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీల మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే కెనాడలో తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసిపోతుంది. Justin Trudeau failed in the biggest job a Prime Minister has: to work for people, not the powerful.The NDP will vote to bring this government down, and give Canadians a chance to vote for a government who will work for them. pic.twitter.com/uqklF6RrUX— Jagmeet Singh (@theJagmeetSingh) December 20, 2024 -
కెనడాలో ఏపీకి చెందిన విద్యార్థి హఠాన్మరణం!
కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయికాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని అన్నారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. పన్నులు, సైనిక రక్షణపై భారీ మొత్తంలో ఆదా అవుతుంది. అందుకే చాలా మంది కెనడియన్లు కెనడా 51వ రాష్ట్రంగా మారాలని కోరుకుంటున్నారు ’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.దీనికి తోడు కెనడా మార్కెట్ రిసెర్చ్, ఎన్నికల నిర్వహణ సంస్థ ఈ వారం లెగర్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో 13 శాతం మంది కెనడియన్లు సైతం కెనడా దేశం అమెరికాలో కలిపితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. President Trump doubles down on making Canada the 51st state Time to rid this country of the flea infested liberal swamp 🇨🇦🇨🇦 pic.twitter.com/naJEQqIcw1— wastedcanadian (@melissacare01) December 18, 2024గతంలోనూట్రంప్ కెనడా గురించి వ్యాఖ్యలు చేయడం ఇలా తొలిసారి గతంలోనూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా తర్వాత ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఆ భేటీలో ట్రూడో - ట్రంప్‌లు పలు అంశాలపై చర్చించారు.అమెరికా మీడియా కథనాల ప్రకారం.. మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్‌కు ట్రూడో స్పష్టంచేశారు. దీనిపై వెంటనే ట్రంప్ స్పందించారు.‘‘ అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లకు చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి’’ అని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు.దీంతో ట్రూడో నిశ్చేష్టులయ్యారని వినికిడి. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖంపై కృత్రిమ నవ్వును ఒలకబోశారని అక్కడి వారు చెప్పారు. ‘‘ కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్ స్టేట్‌గా ఉంటే బాగుంటుంది’’ అని ట్రంప్ ముక్తాయించాడు. -
ట్రంప్ ఆర్డర్స్.. కెనడా.. చైనా ఖేల్ ఖతం!
-
కెనడాలో భారత విద్యార్థి హత్య
టొరంటో:కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్‌దీప్‌సింగ్‌ను ఎడ్మాంటన్‌లోని అతడి అపార్ట్మెంట్లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్ రెయిన్,జుడిత్ సాల్టియాక్స్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్‌దీప్‌సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్‌లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికే హర్షన్‌దీప్‌సింగ్ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: డేంజర్ బెల్స్.. మనపాలిట శాపాలివే -
స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య
ఇద్దరు స్నేహితుల మధ్య వంట గదిలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో 22ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.కెనడా పోలీసుల వివారాల మేరకు.. సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన 22 ఏళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ సర్నియా నగరంలో లాంబ్టన్ కాలేజీలు చేరాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో తన 34 క్రాస్లీ హంటర్‌తో కలిసి ఉంటున్నాడు.అయితే, ఈ తరుణంలో నవంబర్ 30 రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు,హంటర్ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారి తీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్ను హంటర్ కత్తి దాడి చేశారు. ఈ ఘటనలో గురుసిస్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన అనంతరం, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈ హత్యపై విచారణ నిర్వహిస్తున్నామని సర్నియా పోలీస్ అధికారి డేవిస్ తెలిపారు. హత్యకు గల కారణాల్ని వెలుగులోకి తెస్తామన్నారు. కాగా, గురుసిస్ హత్యపై లాంబ్టన్ కాలేజీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. -
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
51వ రాష్ట్రంగా చేరిపొండి
వాషింగ్టన్: తాను అధికారంలోకి వస్తే కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించి కెనడా కలవరపాటుకు గురయ్యేలా చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఏకంగా కెనడా ప్రధానితోనే వెటకారంగా మాట్లాడారు. అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయిన సందర్భంగా ఈ అనూహ్య సంభాషణ చోటుచేసుకుందని సమాచారం.అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే చర్యల్లో భాగంగా కెనడాపై పన్నుల భారం తగ్గించుకునేందుకు ట్రూడో శనివారం రాత్రి ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ ప్రాంతంలో ట్రంప్‌కు చెందిన మార్–ఏ–లాగో రిసార్ట్‌లో కలిశారు. మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్‌కు ట్రూడో స్పష్టంచేశారు. దీనిపై వెంటనే ట్రంప్ స్పందించారు.‘‘ అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లకు చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి’’ అని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు.దీంతో ట్రూడో నిశ్చేష్టులయ్యారని వినికిడి. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖంపై కృత్రిమ నవ్వును ఒలకబోశారని అక్కడి వారు చెప్పారు. ‘‘ కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్ స్టేట్‌గా ఉంటే బాగుంటుంది’’ అని ట్రంప్ ముక్తాయించాడు. -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం మోపనున్న అమెరికా
-
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్‌బామ్‌కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్‌చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
వెలుగు స్తంభాలు
నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. –10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది. ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రూడో తాయిలాలు
టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్ కెనడియన్స్ రిబేట్’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది. ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు. ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్ సింగ్ అన్నారు. -
పిల్లల తిండి కోసం... పస్తులుంటున్న కెనడియన్లు
ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట. సాల్వేషన్ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... → కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు → సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు → కెనడాలో ఫుడ్ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. → దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి. → చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది → డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు → అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు. చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది– జాన్ ముర్రే, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి -
మోదీ, అమిత్ షాపై ఆరోపణలతో కవ్వింపు చర్యలు.. వెనక్కి తగ్గిన కెనడా
ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వేర్పాటువాదీ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, విదేశాంగమంత్రి, పలువురు ప్రముఖుల హస్తం ఉందంటూ కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్' ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది.. కెనడాలో నివసిస్తున్న మరికొందరు వేర్పాటువాదులను కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొంది.అయితే ఆ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. కెనడా అర్థంలేని ఆరోపణలు చేస్తుందని, ఇటువంటి హాస్యాస్పదమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు ఊహజనితమైనవని, అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు జస్టిన్ ట్రూడో జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ సలహాదారు నథాలీ జి డ్రౌయిన్ ఓ ప్రకటన విడుదల చేశారు.‘ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరు 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు, అధికారులు అసాధారణ చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడా గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేర కార్యకలాపాలకు భారత ప్రధాని మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎన్నడూ పేర్కొనలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితం.. అవాస్తవమైనవే’’ అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించారు.కాగా నిజ్జర్ హత్యగురించికెనడా ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రికలో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అవన్నీ హాస్యాస్పద వార్తలనేనని ఖండించింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. . ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
మోదీ టార్గెట్‌గా కెనడా కొత్త ప్లాన్!.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు.సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్ షాను కూడా టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024 -
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
కెనడా: ఇండియన్ సింగర్స్ ఇళ్ల వెలుపల కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో వెలుపల జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు దుండగులు చోరీ చేసిన వాహనంలో ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. అనంతరం స్టూడియో వెలుపల కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా సారించాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ గాయకుల ఇళ్లు ఉన్నాయి. అలాగే వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయి.ఈ కాల్పుల ఘటనకు ముందుదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొందరు పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో నృత్యం చేయడం కనిపిస్తోంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని, కెనడియన్ మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.ఇదిలావుండగా ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. కెనడాలోని వాంకోవర్‌లో గల అతని ఇంటి వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికిముందు కెనడాలోని ప్రముఖ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి.ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు -
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు
ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి.ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు. -
మా సరిహద్దుపై ఓ కన్నేసి ఉంచాం- కెనడా ప్రధాని
-
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
కెనడాలో బ్యాంక్ సేవలపై ఎస్బీఐ ప్రకటన
భారత్, కెనడా మధ్య గత కొంత కాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ఆ దేశంలోని హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. దీంతో హిందువులు పెద్ద ఎత్తున కెనడా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ తరుణంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అక్కడ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.కెనడాలో జరుగుతున్న ఉద్రిక్తతలు బ్యాంక్ సేవల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కాబట్టి సంస్థ తన కార్యకలాపాలను ఎప్పటిలాగే నిర్వరిస్తుందని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. అంతే కాకుండా రెగ్యులేటరీ రెగ్యులేటర్లు లేదా కస్టమర్ల విధానంలో మేము ఎలాంటి మార్పును చూడలేదని పేర్కొన్నారు.ఎస్బీఐ.. కెనడాలో టొరంటో, బ్రాంప్టన్, వాంకోవర్లతో సహా పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా ఎనిమిది శాఖలను నిర్వహిస్తోంది. ఎస్బీఐను కూడా మేము అక్కడి స్థానిక బ్యాంకులలో ఒకటిగా భావిస్తున్నామని సీఎస్ శెట్టి అన్నారు. 1982 నుంచి ఎస్బీఐ కెనడాలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.