ఒట్టావా: భారత సంతతి, కెనడా ఎంపీ చంద్ర ఆర్య నామినేషన్ దాఖలు చేశారు. కెనడా ప్రధాని పదవి రేసులో తాను ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని కన్నడలో ప్రకటించారు.
ఇటీవల,కెనడాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ట్రూడో తరువాత కెనడా ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ప్రకటించారు. తాజాగా కెనడా ప్రధాని పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది.
కెనడా ప్రధాని పదవి కోసం పోటీ చేస్తున్నట్లు చంద్ర ఆర్య ఈ నెల ప్రారంభంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి.
లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు.
I am running for the position of Prime Minister of Canada.
Our nation faces structural challenges that require tough solutions.
We must make bold political decisions to secure prosperity for our children and grandchildren.
I have outlined everything in the statement provided… pic.twitter.com/bIdK0RFX18— Chandra Arya (@AryaCanada) January 12, 2025
కర్ణాటక టు కెనడా
కర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ ర్‌గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment