prime minister
-
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు(Chaitra Navratri celebrations) ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్మృతి మందిరంలో జరిగే చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ(Prime Minister Modi) డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించనున్నారు. 1956లో అంబేద్కర్ వేలాది మంది తన అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.33 వేల కోట్ల విలువైన పథకాలను ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి ఆదివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ చేరుకుంటారు. అక్కడ ఎన్టీపీసీ సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-3కి శంకుస్థాపన చేయనున్నారు. ఎనిమిది కిలోమీటర్ల పొడవు గల ఏడు రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 111 కిలోమీటర్ల పొడవు గల మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించనున్నారు. ఈ పథకంలోని లబ్ధిదారులకు ప్రధానమంత్రి వారి ఇంటి తాళాలను అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు -
3 నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకల్లో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీ వరకు థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. ప్రాంతీయ సహకారానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ‘మహాసాగర్ విధానం’అమలే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. మొదటగా ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ 3, 4 తేదీల్లో జరిగే బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్రంలో పాల్గొంటారు. 3న థాయ్ ప్రధానితో భేటీ అవుతారు. అనంతరం శ్రీలంకకు వెళతారని తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకేతో చర్చలు జరుపుతారంది. మారిషస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ‘మహాసాగర్’ను ప్రకటించినట్లు విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత్‌తోపాటు బంగాళాఖాత తీరప్రాంత దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్లతో ఏర్పాటైనదే బిమ్స్టెక్ కూటమి. -
ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్ మిశ్రా
న్యూఢిల్లీ: మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో కార్యదర్శి హోదాలో పూర్తి సమయం సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(Economic Advisory Council to the Prime Minister)(EAC-PM) అనేది అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహా ఇచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర సంస్థ.EAC-PM ప్రస్తుత సభ్యులుసుమన్ బెర్రీ (ఛైర్మన్)సంజీవ్ సన్యాల్ (సభ్యులు)డాక్టర్ షమికా రవి (సభ్యులు)రాకేశ్ మోహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)డాక్టర్ సజ్జిద్ చినోయ్ (పార్ట్ టైమ్ సభ్యులు)డాక్టర్ నీలేశ్ షా (పార్ట్ టైమ్ సభ్యులు)ప్రొఫెసర్ టీటీ రామ్మెహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)డాక్టర్ పూనమ్ గుప్తా (పార్ట్ టైమ్ సభ్యులు)సంజయ్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణునిగా ఆయన పలు ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 2018, నవంబర్ 19న న రెండు సంవత్సరాల పదవీకాలానికి ఈడీ చీఫ్‌గా నియమితులయ్యారు. దీనికిముందు ఆయన ఢిల్లీలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు. 2020లో మిశ్రా పదవీకాలాన్ని మూడు సంవత్సరాలకు పొడిగించారు.సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొన్న వివరాల ప్రకారం మిశ్రా హయాంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాపై మిశ్రా నేతృత్వంలో ఈడీ చర్యలు చేపట్టింది. ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట -
ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు
ఒట్టావా: కెనడాలో ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 28న ముందస్తు పోలింగ్ జరపనున్నట్లు ఆదివారం కెనడా ప్రధానమంత్రి కార్నీ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగడంతో రెండు వారాల క్రితమే కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆదివారం ఆయన గవర్నర్ జనరల్‌తో భేటీ అయి పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార లిబరల్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కార్నీ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. -
మహాకుంభమేళాలో ఐక్యత అనే అమృతం ఉద్భవించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) నుంచి ఐక్యత అనే అమృతం ఉద్భవించింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి జనం ఈ కార్యక్రమానికి ఐక్యంగా తరలివచ్చారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభ్‌ను ప్రజలను ఐక్యపరిచిన కార్యక్రమంగా అభివర్ణించారు. మహా కుంభ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ లోక్ సభలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహా కుంభ్‌లో జాతీయ చైతన్యానికి గల భారీ రూపాన్ని మనం చూశామని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మన సామర్థ్యాలపై కొంతమందికి ఉన్న సందేహాలకు తగిన సమాధానం లభించిందని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(SP chief Akhilesh Yadav) గతంలో మహా కుంభమేళాపై గతంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.ప్రధానమంత్రి మోదీ మహా కుంభ్‌ను భారతదేశ చరిత్ర(History of India)లోని మైలురాయితో పోల్చారు. ఇటువంటివి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. మహా కుంభ్ పై ప్రశ్నలు లేవనెత్తే వారికి విజయవంతమైన ఈ మహా కుంభ్ తగిన సమాధానం అని ప్రధాని మోదీ అన్నారు. మహా కుంభమేళాలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారని అన్నారు. ఈ మహాకుంభమేళాలో ఐక్యత అనేది ఒక ముఖ్యమైన ఘట్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కుంభమేళా కారణంగా యువత సంప్రదాయం, సంస్కృతిని అలవర్చుకుంటున్నారని అన్నారు.గత ఏడాది అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాబోయే వెయ్యి సంవత్సరాలకు దేశం ఎలా సిద్ధమవుతుందో మనమందరం గ్రహించాం. ఇప్పుడు ఒక సంవత్సరం తరువాత నిర్వహించిన ఈ మహా కుంభమేళా మనందరి ఆలోచనలను మరింత బలోపేతం చేసింది. దేశంలోని ఈ సామూహిక చైతన్యం దేశానికున్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తి ఉద్యమ సమయంలో దేశంలోని ప్రతి మూలలోనూ ఆధ్యాత్మిక స్పృహ ఉద్భవించిందని అన్నారు. శతాబ్దం క్రితం చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి చాటిందని, ఇది భారతీయుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే.. -
మారిషస్ స్వాతంత్య్ర వేడుకలకు ప్రధాని మోదీ
పోర్ట్ లూయిస్/న్యూఢిల్లీ: మార్చి 12వ తేదీన జరిగే మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మారిషస్ ప్రధానమంత్రి రాం గులామ్ శుక్రవారం జాతీయ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. ద్వైపాక్షిక సన్నిహిత సంబంధాలకిది నిదర్శనమన్నారు. ‘నా ఆహ్వానం మేరకు మన దేశ 57వ స్వాతంత్య్ర దినం సందర్భంగా జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహృదయంతో అంగీకరించారని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను’అని ఆయన తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనలు ముగించుకుని వచ్చిన మోదీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన ఆహా్వనాన్ని మన్నించారన్నారు. -
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. మీకు ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు వెల్లడించారు. ఇది నా తండ్రి ఏఎన్నార్ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను మీరు గుర్తించడం మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున ట్వీట్ చేశారు.పార్లమెంట్ హౌస్‌లో అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రధానిని కలిసి ఫోటో దిగారు. నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా నరేంద్ర మోదీని కలిశారు. కాగా.. ఇటీవల మన్ కీ బాత్‌లో తెలుగువారి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. Profoundly thankful to Hon'ble Prime Minister @narendramodi ji for today's meeting at Parliament House. It was an honor to present 'Akkineni Ka Virat Vyaktitva' by Padma Bhushan awardee Dr. Yarlagadda Lakshmi Prasad, a tribute to my father ANR garu's cinematic heritage. Your… pic.twitter.com/4y5y1C1eRY— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 7, 2025 -
బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్!
భాగల్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను తెలియజేస్తూ, దేశ ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇదేవిధంగా ప్రధాని విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ‘పరీక్షా పర్ చర్చ’(పరీక్షలపై చర్చ) కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు.ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన చిన్నారులు ప్రధాని మోదీతో సంభాషించే అవకాశాన్ని పొందుతారు. బీహార్‌కు చెందిన సుపర్ణ అనే బాలిక ఈ కార్యక్రమానికి ఎంపిక అయిన వారిలో ఒకరు. ఈ చిన్నారి బీహార్‌లోని భాగల్పూర్లోని సాహెబ్‌గంజ్‌లో కుటుంబంతో పాటు ఉంటోంది. అధికారుల ఇంటర్వ్యూ అనంతరం ఆ చిన్నారి ఎంపికయ్యింది. దీంతో ఆమె ‘పరీక్షా పర్ చర్చ’ కార్యక్రమంలో పాల్గొని, ప్రధాని మోదీని పలు సందేహాలు అడగనున్నారు.సుపర్ణ సిన్హా మీడియాతో మాట్లాడుతూ తాను భాగల్పూర్లోని గవర్నమెంట్ గర్ల్స్ ఇంటర్ లెవల్ హై స్కూల్లో 11వ తరగతి చదువుతున్నానని చెప్పింది. ఈ కార్యక్రమానికి తనను ఎంపిక చేసిన అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపింది. కాగా ప్రతి సంవత్సరం బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షల గురించి చర్చిస్తారు. దీనికి తొలుత ‘ఎగ్జామ్ వారియర్స్’ అని పేరు పెట్టారు. పరీక్షలకు ముందు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమంలో పొల్గొనేందుకు తొలుత విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఈ ఇంటర్వ్యూ చేస్తారు. అనంతరం విద్యార్థులను ఎంపికచేస్తారు. ఈ విధంగా ఎంపికైన సుపర్ణ బోర్డు పరీక్షల్లో తనకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం జరిగే తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం త్వరలోనే వెల్లడించనుంది. గత ఏడాది ఈ కార్యక్రమం జనవరి 29న జరిగింది. ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం -
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత.. చంద్ర ఆర్య నామినేషన్ దాఖలు
ఒట్టావా: భారత సంతతి, కెనడా ఎంపీ చంద్ర ఆర్య నామినేషన్ దాఖలు చేశారు. కెనడా ప్రధాని పదవి రేసులో తాను ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని కన్నడలో ప్రకటించారు. ఇటీవల,కెనడాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ట్రూడో తరువాత కెనడా ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ప్రకటించారు. తాజాగా కెనడా ప్రధాని పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది.కెనడా ప్రధాని పదవి కోసం పోటీ చేస్తున్నట్లు చంద్ర ఆర్య ఈ నెల ప్రారంభంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి.లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు.I am running for the position of Prime Minister of Canada.Our nation faces structural challenges that require tough solutions.We must make bold political decisions to secure prosperity for our children and grandchildren.I have outlined everything in the statement provided… pic.twitter.com/bIdK0RFX18— Chandra Arya (@AryaCanada) January 12, 2025 కర్ణాటక టు కెనడాకర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ ర్గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు. 👉చదవండి : గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. విశ్వంభరలో చిరంజీవి..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi. Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025 -
కెనడా ప్రధాని రేసులో మరో భారత సంతతి నేత
ఒట్టావా: భారత సంతతికి చెందిన మరో నేత కెనడా ప్రధాని రేసులో నిలిచారు. నేపియాన్ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య గురువారం ఈ మేరకు ప్రకటించారు. దేశ పునర్నిర్మాణం కోసం సమర్థమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమని వీడియో ప్రకటనలో ఉద్ఘాటించారు. ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు. ఈ ప్రయాణంలో అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన నేపథ్యంలో ఆయన వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారడం తెలిసిందే. భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్‌తో పాటు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తదితర లిబరల్ పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. I am running to be the next Prime Minister of Canada to lead a small, more efficient government to rebuild our nation and secure prosperity for future generations.We are facing significant structural problems that haven’t been seen for generations and solving them will require… pic.twitter.com/GJjJ1Y2oI5— Chandra Arya (@AryaCanada) January 9, 2025కర్ణాటక టు కెనడాకర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ ర్గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.మార్చి 9న కొత్త ప్రధానికెనడా కొత్త ప్రధానిని, తమ నాయ కుడిని మార్చి 9న ప్రకటిస్తామని అధికా ర లిబరల్ పార్టీ గురువారం వెల్లడించింది. ఇందుకోసం దేశవ్యాప్త ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.👉ఇదీ చదవండి : ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’ -
కెనడా ప్రధాని బరిలో అనితా ఆనంద్
ఒట్టావా: జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో.. కెనడా ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పదవికి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్న అనితతోపాటు మాజీ డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ మరికొందరు పోటీలో ఉన్నారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని ట్రూడో సోమవారం తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు మార్చి 24 వరకు సమయం ఉన్న నేపథ్యంలో పోటీలో ఉన్న నాయకులను ఓసారి చూద్దాం. పోటీలో ఉన్న ఇతరులు.. 2021 నుంచి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న మెలానియా జోలీకూడా పోటీలో ఉన్నారు. అంతకుముందు మరో మూడు కేబినెట్ పదవులను నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదివిన 45 ఏళ్ల జోలీని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది ట్రూడోనేనని చెబుతారు. పోటీ ప్రచారంలో ఉన్న మరో అభ్యర్థి క్రిస్టియా ఫ్రీలాండ్. ట్రూడో సహాయకురాలిగా, ఆయన కేబినెట్లో అత్యంత శక్తివంతమైన మంత్రుల్లో ఒకరిగా పేరొందారు. జర్నలిస్ట్ అయిన ఫ్రీలాండ్ 2013లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత ట్రూడో కేబినెట్లో చేరారు. పోటీ పడేవారిలో మార్క్ కార్నీ పేరు కూడా వినబడుతోంది. బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ అయిన కార్ని.. ఇటీవలి నెలల్లో ట్రూడోకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయిన 59 ఏళ్ల కార్నీ ఇంతకుముందెన్నడూ ప్రభుత్వ పదవుల్లో పనిచేయలేదు. కానీ ఆయనకు బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2015లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన షాంపైన్ అనేక కేబినెట్ బాధ్యతలను నిర్వహించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వీడిష్–స్విస్ బహుళజాతి ఆటోమేషన్ కంపెనీ ఏబీబీ గ్రూప్‌లో షాంపైన్ సీనియర్ పాత్ర పోషించారు. కొత్త ప్రధాని ఎన్నిక... కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని తాను పార్టీని కోరినట్లు ట్రూడో తెలిపారు. లిబరల్ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ఈ వారంలో పార్టీ జాతీయ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. అమెరికా తరహాలోనే కెనడాలో ప్రత్యేక నాయకత్వ సమావేశాల ద్వారా నాయకుడిని ఎన్నుకుంటారు. ఇది నిర్వహించడానికి నెలలు పడుతుంది. ట్రూడో ఇంకా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీకి చాలా సమయం పట్టవచ్చు. 2013 ఏప్రిల్‌లో లిబరల్ నాయకుడిగా ట్రూడోని ఎన్నుకున్నప్పుడు పోటీ సరిగ్గా ఐదు నెలలు కొనసాగింది. 2006లో దాదాపు ఎనిమిది నెలల పాటు కొనసాగింది. అయితే ట్రూడో నాయకత్వంపై పెరిగిన వ్యతిరేకత కారణంగా లిబరల్ పార్టీ వీలైనంత త్వరగా ట్రూడో స్థానాన్ని భర్తీ చేసేలా సంక్షిప్త పోటీని ప్రకటించి కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నిక లిబరల్ పార్టీ భవిష్యత్తునే కాకుండా కెనడా రాజకీయ దిశను కూడా నిర్ణయిస్తుంది.ముందస్తు ఎన్నికలు జరిగేనా? అయితే నాయకుడు ఎవరయినా లిబరల్స్ ఎన్నికల్లో ఓడిపోతారని సర్వేలు బలంగా చెబుతున్నాయి. అందుకే జనవరి 27 తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాలని తొలుత విపక్షాలు భావించాయి. జనవరి 27న తిరిగి ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ట్రూడో ప్రకటించారు. సెషన్ ఎజెండా ప్రభుత్వ నియంత్రణలో ఉండటంతో పార్లమెంటు సమావేశాలకోసం ప్రతిపక్షాలు వేచి చూడక తప్పదు. సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షాలన్నీ కలిసి ఓటు వేస్తే లిబరల్స్‌ను ఓడించే అవకాశం ఉంటుంది. అలాగైనా మే లోపు కొత్త ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎలాగోలా జూన్ 20 వరకు లిబరల్స్ అధికారంలో ఉంటే అక్టోబర్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.తమిళ మూలాలు... భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ఐదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్నారు. రవాణా శాఖతో పాటు పబ్లిక్ సర్విసెస్, ప్రొక్యూర్మెంట్ సహా పలు శాఖలను నిర్వహించారు. అనిత తండ్రి తమిళుడు. తల్లి పంజాబీ. 57 ఏళ్ల అనిత.. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. 2019లో ఓక్విల్లే నుంచి ఎంపీగా గెలుపొందిన ఆమె ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు పబ్లిక్ సర్విసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2021 అక్టోబర్ నుంచి 2023 జూలై వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు సారథ్యం వహించారు. రక్షణ మంత్రిగా, రష్యాతో యుద్ధం మధ్య ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు ఆనంద్ నాయకత్వం వహించారు. అయితే 2024 డిసెంబర్ వరకు ట్రెజరీ బోర్డును పర్యవేక్షించడానికి ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెను మళ్లీ రవాణా, అంతర్గత వాణిజ్య శాఖ మంత్రిగా మార్చారు. -
కెనడా ప్రధానిగా పియరీ పొయిలీవ్రే?
ఒట్టావా: జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలీవ్రే పైనే పడింది. ఆయనే తదుపరి కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.పియర్ పోయిలీవ్రే నేపథ్యం45 ఏళ్ల పియరీ పొయిలీవ్రే కెనడా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు. కెనడాలోని కాల్గరీ నగరంలో జన్మించారు. కాల్గరీ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్ షిప్ డిగ్రీని పొందాడు. 2004లో కన్జర్వేటివ్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పొయిలీవ్రే గతంలో మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ నేతృత్వంలో సీనియర్ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. పియరీ పొయిలీవ్రే, అనైడా దంపతుల ఇద్దరు పిల్లలు వాలెంటినా, క్రజ్‌తో కలిసి గ్రీలీలో నివసిస్తున్నారు.జస్టిన్ ట్రూడో రాజీనామాకెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా పదవిలో కొనసాగుతానన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా, తొమ్మిదేళ్ల పాలన అనంతరం నాయకత్వ మార్పిడి కోరుతూ అధికార పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్త ఎంపిక ప్రక్రియలో తదుపరి నేత ఎన్నికయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతాను’ అని ట్రూడో మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నాయని బహిరంగంగానే అంగీకరించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైంది. అందుకే బరి నుంచి తప్పు కోవాలనుకుంటున్నా’’ అని చెప్పారు.‘‘నేను పోరాటయోధుడిని. కెనడా కోసం పోరాడేందుకు నా శరీరంలో అణువణువూ సిద్ధమే. కానీ ఎంతగా కృషి చేస్తున్నా కొంతకాలంగా పార్లమెంట్ సజావుగా సాగడం లేదు. అందుకే పార్లమెంట్ సమావేశాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్ జనరల్‌కు తెలిపా. అందుకామె అంగీకరిస్తూ సమావేశాలను జనవరి 27 నుంచి మార్చి 24కు వాయిదా వేశారు’’ అని వివరించారు. ఆలోగా కొత్త నేతను ఎంపిక చేసుకునేందుకు అధికార పారీ్టకి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రజాదరణలో అధికార లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ ఎంతో మెరుగ్గా ఉంది.ఈ దశలో ట్రూడో రాజీనామా ప్రకటనతో అధికార పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జనవరి 27వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మూడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించడం గమనార్హం. దీనిని తప్పించుకునేందుకే ట్రూడో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. పదేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ లిబరల్ పార్టీ నేతగా ఉన్న ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.ఆయన తండ్రి పియెర్రె గతంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి, మంచి పేరు సంపాదించుకున్నారు. ట్రూడో పాలన మొదట్లో బాగుందనిపించినా రాన్రానూ ఆయన ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ వచ్చింది. ఆహారం, ధరలు ఆకాశాన్నంటడం, వలసలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. అంతకుముందు హౌసింగ్ మంత్రి వైదొలిగారు.ట్రూడో రాజీనామా చేయాలంటూ బాహాటంగానే కొందరు నేతలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇవి కూడా ట్రూడో తాజా నిర్ణయానికి బలమైన కారణాలుగా ఉన్నాయి. -
రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో?
ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో అధికార లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రూడ్ ఇప్పటి వరకు తన భవిష్యత్ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని (Canadian Prime Minister) బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ట్రూడో రాజీనామాకు గల కారణాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.ఇటీవల, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వెలుగులోకి వచ్చిన కెనడా మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ట్రూడో రాజీనామా చేస్తే .. ప్రస్తుత ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్తో తాత్కాలిక నాయకుడిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. -
ప్రధాని నిర్ణయం నిజమైన గేమ్ ఛేంజర్: పీఎం మోదీపై రామ్ చరణ్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan) ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు. భారత ప్రభుత్వం మీడియా, వినోద రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, మద్దతు చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.సినిమా రంగంపై మన ప్రధాన మంత్రి(narendra Modi) దృష్టి సారించడం అద్భుతమైన విషయమని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాదిలో ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ సమ్మిట్(Waves-2025) నిర్వహించనుండటం మన దేశానికి, భారతీయ సినిమాకు గర్వకారణమని పోస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు సహకారం అందించడం నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందని రామ్ చరణ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖుల గురించి ప్రస్తావించారు. మన టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును స్మరించుకున్నారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన సినిమాల్లో మన సంప్రదాయం, విలువలు కళ్లకు కట్టేలా చూపించారని ప్రధాని అన్నారు. మన్ కీ బాత్‌లో ఏఎన్నార్ పేరును ప్రస్తావించడంపై అక్కినేని నాగార్జున, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానికి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్..కొత్త ఏడాదిలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇటీవల విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించిన ఆయన ట్రైలర్‌పై అప్డేట్ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ ఈ బుధవారం విడుదల కానుంది. అంతేకాకుండా ఏపీలోని రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. Wonderful to see Honourable Prime Minister Shri. @narendramodi Ji and the Government of India supporting the Media & Entertainment sector.The Film and Entertainment world summit, WAVES 2025, will be a true Game Changer for industry collaboration.— Ram Charan (@AlwaysRamCharan) December 31, 2024 -
నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన
టెల్అవీవ్:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(75) మూత్రనాళ ఇన్ఫెక్షన్కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.ఈ అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రం మిసైల్ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి యారివ్లెవిన్ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి.. మస్క్ కీలక ట్వీట్ -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మనదేశానికి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఎన్నో ఏళ్లపాటు సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల సీఎంలు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అయితే ఆర్థిక చాణక్యుడిగా పేరున్న మన్మోహన్ తన జీవితంలో ఎన్నో గొప్ప అవార్డులు సాధించారు. పద్మ విభూషణ్ లాంటి పురస్కారానికి ఎంపికయ్యారు. తన హయాంలో సమాచారం హక్కు చట్టంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యావత్ భారతావని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటోంది.మన్మోహన్ సింగ్ బయోపిక్..అయితే మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర గురించి ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2019లో విడుదలైన ఈ సినిమా పలు వివాదాల తర్వాత విడుదలైంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం 2019లో జనవరి 11న రిలీజైంది. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" పుస్తకంలోని పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్‌గా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ నటించారు. ఈ సినిమాను రుద్ర ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య గల సంఘటనలను చూపించారు.ఓటీటీలో స్ట్రీమింగ్..ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్
డమాస్కస్: అసద్ నిరంకుశ పాలనకు తెరదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇతర తిరుగుబాటుదారుల గ్రూప్‌లు ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. 2025 మార్చి ఒకటో తేదీదాకా ఈయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి మంగళవారం డమాస్కస్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. మైనారిటీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆదేశ విదేశాంగ మంత్రి చెప్పారు. -
ఫ్రాన్స్ లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న విపక్షాలు
-
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని మైకేల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మితవాద, అతివాద విపక్షాలు చేతులు కలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 577 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోవాల్సి రావడం గమనార్హం. ప్రధాని తన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు అందజేశారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత అరవై ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రం అధ్యక్షుడు మేక్రాన్ చేతికొచ్చాయి. ఇటీవలి కాలంలోనే ఈయన రెండు సార్లు ప్రధానులను ఎంపికచేశారు. జూలైలో పగ్గాలు చేపట్టిన గేబ్రియల్ కొద్దికాలానికి వైదొలగగా ఇప్పుడు బార్నియర్ అదేబాటలో పయనించారు. దీంతో మేక్రాన్ తాజాగా మూడోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్ పదవికి సంబంధం లేదు. దీంతో మేక్రాన్ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు.France's government officially collapses after a no-confidence vote against French Prime Minister Michel Barnier. pic.twitter.com/t0vP2LoA9D— Spacy (@TheSpacy_) December 5, 2024 -
ఫ్రాన్స్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం !?
పారిస్: ఫ్రాన్స్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేక తిప్పలు పడుతున్న ప్రధాని మైఖేల్ బార్నర్ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిగువసభలో ఓటింగ్ చేపట్టకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు దిగుతున్నాయి. తీర్మానానికి అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, వామపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్ఆర్) తదితరాలు మద్దతివ్వనున్నాయి. ఈ ప్రయత్నాలను బార్నర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ దేశ భవిష్యత్తును పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఇలాంటి పార్టీలను ప్రజలు క్షమిస్తారనుకోను. మా ప్రభుత్వం కూలితే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుంది’’ అని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే గత 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం కూలడం తొలిసారి అవుతుంది. తాను మాత్రం 2027లో పదవీకాలం పూర్తయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానని ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలితే ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుత పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీలో మేక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి, అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, మరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ లేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 574 మంది సభ్యులకుగాను 288 మందికిపైగా సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. అయితే విపక్షాలు రెండూ కలిస్తే వాటి బలం 330కిపైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విద్యుత్‌పై కొత్త పన్నులను తొలగించాలని మరీన్ లీ పెన్ డిమాండ్‌చేశారు. -
Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న ప్రధానులు వీరే
ప్రయాగ్‌రాజ్: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు.స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు. ताकि सनद रहे : पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू भी कुंभ में स्नान कर चुके हैं और जनेऊ भी धारण किए हुए हैं।#KumbhMela2019 pic.twitter.com/06DUeCHBwr— Vinod Kapri (@vinodkapri) January 18, 2019పండిట్ జవహర్లాల్ నెహ్రూ (1951)భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.ఇందిరా గాంధీభారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అటల్ బిహారీ వాజ్‌పేయి (2001)అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి విశేష కృషి చేశారు.నరేంద్ర మోదీ (2019)2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.త్రివేణీ సంగమం కేంద్రంగా..ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలుగాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమంజనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు. జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన గానంతో మ్యాజిక్ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్‌రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్‌పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రయాణం గర్వకారణం
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే. ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయ యువతకు తిరుగులేదు నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. -
ప్రజా సేవలో 23 ఏళ్లు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యే వరకు మరింత దీక్షతో, అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంతో సాధించినా చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా ప్రస్థానంలో సోమవారంతో 23 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మోదీ సోమవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వాధిపతిగా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, 23 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీని బీజేపీ ప్రశంసల్లో ముంచెత్తింది. ‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా జీవితానికి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రజా సేవ ప్రయాణం ఒక వ్యక్తి తన జీవితాంతం దేశం, ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకితభావానికి, సజీవ చిహ్నం’అని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టక మునుపు సీఎం పోస్టులో 13 ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో మూడో విడత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
నేటి నుంచి ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నేడు(శనివారం) అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.ఈ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొననున్నారు.నేడు అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించనున్న ప్రధాని మోదీ తన ప్రయాణంలో లాడ్లీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషించనున్నారు. ఆధునిక ఫీచర్లతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన మొబైల్ యాప్ మెట్రో కనెక్ట్-3ని కూడా ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.ఎంఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడుతూ 'నేడు ముంబై ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. మెట్రో లైన్-3ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ముంబై మెట్రోలో ప్రయాణించే వారికి ఈ కొత్త మెట్రో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ భూగర్భ మెట్రో నగర రూపురేఖలను మార్చనుందని’ అన్నారు. ఇది కూడా చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్ -
అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం. -
శ్రీలంక ప్రధానిగా హరిణి
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య(54) ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సోమవారం ప్రధాని దినేశ్ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్స నాయకే మంగళవారం జరిగిన ఒక కార్య క్రమంలో హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.ఎన్‌పీపీకే చెందిన విజితా హెరత్, లక్ష్మణ్ నిపుణ రచ్చిలతోపాటు అధ్యక్షుడు దిస్సనాయకే కూడా మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం. నవంబర్ 14∙పార్లమెంట్ ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక కేబినెట్ పనిచేస్తుంది. పార్లమెంటును రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే మంగళవారం రాత్రి నిర్ణయం ఉత్తర్వులు జారీ చేశారు.బండారునాయకే తర్వాత: సిరిమావో బండారు నాయకే (2000) తర్వాత శ్రీలంక ప్రధాని అయిన తొలి మహిళగా హరిణి నిలిచారు. ఆమె హక్కుల కార్యకర్త. యూనివర్సిటీ లెక్చరర్‌గా చేస్తున్నారు.డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్య డిగ్రీ చదివింది ఢిల్లీ యూనివర్సిటీ లోనే. ఇక్కడి హిందూ కాలేజీలో 1991– 1994 సంవత్సరాల్లో సోషియాలజీలో బీఏ పూర్తి చేశారు. హిందూ కాలేజీ పూర్వ విద్యార్థిని శ్రీలంక ప్రధాని కావడం తమకెంతో గర్వకారణమని కాలేజీ ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ హర్షం వ్యక్తం చేశారు. హరిణి బ్యాచ్‌మేట్, బాలీవుడ్ డైరెక్టర్ నళినీ రంజన్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
తప్పుడు సంకేతాలకు ఆస్కారం..!
న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపదా? నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన సలహాదారులైనా చెప్పాలిగా.. తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉంద’ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ కార్యక్రమాన్ని ఇలా బహిరంగపర్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగేందుకు అవకాశం కలి్పంచకూడదని సూచించారు. సీజేఐ ఇంట్లో పూజలో మోదీ పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ వెల్లడించారు. గత 50 ఏళ్లుగా తాను సుప్రీంకోర్టులో పని చేస్తున్నానని, ఎంతోమంది గొప్పగొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని, అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, బయటపెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేలి్చచెప్పారు. తాజా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తుచేశారు. ఈ విభజన రేఖ విషయంలో సీజేఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఆ పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి: సంజయ్ రౌత్ సీజేఐ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజ పట్ల శివసేన(ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతంజస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేకూర్చగలరా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: సుప్రియా సూలే జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. వయసులో, అనుభవంలో ప్రధాని మోదీ, జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని, వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు. అయితే, సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు. నీచ రాజకీయాలు చేయొద్దు: సంబిత్ పాత్రా సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచి్చన విందుకు అప్పటి సీజేఐ వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తంచేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే ఇక్కడి రాజకీయ పారీ్టలేవీ స్పందించడం లేదని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. -
ప్రధాని మోదీ మెచ్చిన ఆలూ.. అందరూ తినొచ్చంటున్న వైద్యులు
సాధారణంగా చాలామంది వైద్యులు బంగాళదుంపలు(ఆలూ) ఆరోగ్యానికి అంతమంచివి కావని చెబుతుంటారు. మరోవైపు ఆరోగ్య స్పృహ కలిగినవారిలో కొందరు బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. అయితే మార్కెట్లోకి ఇటీవలే వచ్చిన ఒకరకం బంగాళదుంపలను నిరభ్యంతరంగా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ బంగాళదుంపను ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పూసా) వారు రూపొందించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మోదీపురంలోని రీజనల్ సెంటర్లోని పూసాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనుగొన్న ఈ కొత్త రకం బంగాళదుంప పేరు కుఫ్రీ జామునియా. ఈ రకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సుమారు తొమ్మదేళ్లు పట్టింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 2015లో ప్రారంభమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ నూతన తరహా బంగాళదుంపను ప్రధానికి చూపించి, దాని ప్రత్యేకతను కూడా వివరించారు.ఈ బంగాళాదుంపను కనుగొన్న పూసా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్కె లూత్రా మీడియాతో మాట్లాడుతూ కుఫ్రీ జామునియా అనేది యాంటీ-ఆక్సిడెంట్లుతో పాటు ఊదారంగు గుజ్జు కలిగిన బంగాళాదుంప రకం. 100 గ్రాముల దుంపలోని గుజ్జులో అధిక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి (52 మి.గ్రా), ఆంథోసైనిన్ (32 మి.గ్రా), కెరోటినాయిడ్స్ (163 మైక్రోగ్రాములు) ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కుఫ్రీ జామునియాను హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పండించేందుకు అనువైన వాతావరణం ఉంది. -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హాగెన్/న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్‌హాగెన్‌లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్‌కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్ పార్లమెంట్‌కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్‌పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 7.15 గంటలకు ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు,స్నిపర్లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందినిమోహరించనున్నారు.రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసుల SWAT (ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు), NSG నుంిచి కమాండోలు ఈవెంట్ రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ, వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు. ఐదు కంపెనీల పారామిలటరీ, ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించనున్నారు. ఈ కర్యాక్రమానికి సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో గత సంవత్సరం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతనే కల్పించనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఢిల్లీిలో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు. \ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు 291 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో బీజేపీ 242 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిత్రపక్షాలతో కలిసి మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
గెలుపు, ఓటములు సహజం.. నంబర్స్ గేమ్ కొనసాగుతుంది: మోదీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్‌కు మోదీ బయలుదేరారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా?
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను. ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా! రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు. ఐదవది – ఇంటర్వ్యూయర్‌కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు. లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం. కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి. లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి. చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
స్లొవాకియా ప్రధానిపై కాల్పులు
ప్రేగ్: స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై హత్యాయత్నం జరిగింది. ఆయన బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ భవనం బయట గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో ఆయనపై నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఫికోను హుటాహుటిన బాన్స్క్ బై్రస్టికాలోని ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తూటాలు పొట్టలోంచి దూసుకుపోయినట్టు చెబుతున్నారు. ఫికో తలకు, ఛాతీకి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అనుమానితున్ని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించినట్టు సమాచారం. దీన్ని దేశ ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివరి్ణంచారు. దుండగునిగా భావిస్తున్న 71 ఏళ్ల అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను రచయిత అని, ప్రత్యర్థి పారీ్టకి చెందిన రాజకీయ కార్యకర్త అని రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దుండగుడు తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాడికి కారణం తెలియరాలేదు. దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు జరుగుతు న్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఫికో పారీ్టతో కూడిన అతివాద పక్షాల కూటమిదే పై చేయి అవుతుందని భావిస్తున్న వేళ ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.రష్యా అనుకూలుడు ఫికో రష్యా అనుకూలునిగా పేరుబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు. గత సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రష్యా అనుకూల, అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించిపెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు అంటున్నారు. ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగింది. ఫికో, దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైన పీటర్ పలెగ్రినీ ఇటీవలే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెను ముప్పుకు ఫికోపై దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రినీ అన్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్‌ల్లో కాకుండా ఇలా తూటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకస్లొవాకియా 1992లో చెక్ రిపబ్లిక్, స్లొవాకియాగా విడిపోవడం తెలిసిందే. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ మళ్లీ గెలిస్తే.. తదుపరి ప్రధాని అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే.. ఎందుకు రాజీనామా చేయలేదంటే... ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ ‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్‌లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్‌దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు. యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ -
లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోదీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.2019 ఎన్నికల సమయంలోనూ రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన రన్ ఫర్ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన యూనివర్శిటీ ఏది?
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు. దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.