దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు.
దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు సరికొత్త రికార్డులు సృష్టించాయి.
అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment