presidant
-
మోడీ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన రాష్ట్రపతి
-
దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన యూనివర్శిటీ ఏది?
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు. దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. -
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి కన్నుమూత!
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి రోజ్లిన్ కార్టర్(96) ఆదివారం స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతిపై అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకూ ఏది సాధించినా దానివెనుక రోజ్లిన్ నాకు అండగా నిలిచారు. నేను నిరాశకు గురైనప్పుడల్లా, ఆమె నాకు ప్రోత్సాహాన్ని అందించారు. నాకు నిరంతరం మంచి సలహాలు ఇచ్చేవారు. ఆమె నాకు ఉత్తమ సలహాదారు’ అని పేర్కొన్నారు. గత ఏడాది(2022) మేలో ఆమెకు డిమెన్షియా అనే వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ఆమె చికిత్స అందుకుంటోంది. అయితే గత ఫిబ్రవరి నుంచి ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. జిమ్మీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ విజయంపై ప్రపంచ వేదికపై ఆయనకు ప్రశంసలు అందాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఇరాన్ వివాదాల కారణంగా జిమ్మీ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజ్లిన్ తన భర్తకు అండగా నిలిచారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం కార్టర్ దంపతులు కార్టర్ సెంటర్ అనే సంస్థను స్థాపించారు. జిమ్మీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ దంపతులు క్యూబా, సూడాన్, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ కార్టర్‌కు 2002లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 1999లో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కార్టర్ దంపతులను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరించారు. ఇది కూడా చదవండి: పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం -
ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ శ్రేయస్సుతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. దేశంలోని తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారన్నారు. దేశంలోని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है। Wishing you all a Happy Vijaya Dashami! — Narendra Modi (@narendramodi) October 24, 2023 -
ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
జయప్రకాష్ నారాయణ్.. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, దానికిమించి ప్రజా నేత. భారత మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా అమితమైన ప్రజారదణ పొందారు. ఆయన జీవితాంతం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. ఉన్నత పదవులు వరించినా, వాటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం పలు పోరాటాలు సాగించారు. ఒకానొక సమయంలో జయప్రకాష్ నారాయణ్‌కు భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. మరోమారు రాష్ట్రపతి అయ్యే ప్రతిపాదన వచ్చినా దానిని కూడా తిరస్కరించారు. 1901 అక్టోబర్ 11న బెంగాల్ ప్రెసిడెన్సీ (నేటి బీహార్ రాష్ట్రం)లోని సరన్ జిల్లాలోని సీతబడియార గ్రామంలో జన్మించిన జయప్రకాష్ నారాయణ్ 9 ఏళ్ల వయస్సులో చదువు కోసం పట్నాకు వచ్చారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన కారణంగా కాలేజీని విడిచిపెట్టారు. తరువాత తన చదువును కొనసాగించారు. ఉద్యమం కోసం కాలేజీ చదువును మధ్యలోనే వదిలిన ఆయన బీహార్ విద్యాపీఠ్‌లో అడ్మిషన్ తీసుకుని, చదువు పూర్తి చేశారు. తన 20 ఏళ్ల వయసులో కార్గో షిప్లో అమెరికా చేరుకున్నారు. కాలిఫోర్నియాలో రెండు సంవత్సరాలు డిష్ వాషర్గా, గ్యారేజీలో మెకానిక్‌గా, ఔషధాల విక్రయం, పండ్లను ప్యాకింగ్ చేయడం, బోధించడం వంటి పనులు చేస్తూ, ఉన్నత విద్యను పూర్తి చేశారు. అమెరికాలో చదువుకుంటూనే ఆయన కార్మికుల సమస్యలను తెలుసుకునేవారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ సైన్సెస్‌లో ఎంఏ, ఒహియో విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ చేశారు. ఈ సమయంలో ఆయన కార్ల్ మార్క్స్ , అతని సోషలిజం సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1929లో భారతదేశానికి తిరిగి వచ్చాక గాంధీ చెంత చేరారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. అయితే అప్పటికే ఆయన దేశ రాజకీయాలపై తీవ్ర నిరాశకు లోనయ్యారు. 1954లో బీహార్‌లోని గయలో వినోబా భావే చేపట్టిన సర్వోదయ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు. 1960వ దశకం చివరిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 1974లో బీహార్ రైతుల కోసం ఉద్యమించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ రాజకీయ కార్యాచరణను కొనసాగించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఉద్యమంలోకి దూకారు. ఎమర్జెన్సీ సమయంలో జేపీ జైలుకెళ్లారు. అనంతరం విడుదలయ్యారు. 1977లో జరిగిన ఎన్నికల్లో జేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం ఇందిరా గాంధీపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో జేపీ ప్రధానమంత్రి పదవికి తిరుగులేని బలమైన పోటీదారుగా మారారు. అయినా ప్రధాని పదవిని చేపట్టలేదు. అధికారానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. తరువాత అతని పార్టీ, ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని అంగీకరించాలని ఆయనను కోరింది. అయితే దీనిని కూడా జేపీ తిరస్కరించారు. రాజకీయాల్లో ఉన్నత ఆదర్శాలకు కట్టుబడిన నేతగా పేరొందారు. పలు అనారోగ్య కారణాలతో జేపీ 1979, అక్టోబర్ 7న బీహార్‌లోని పట్నాలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి? -
అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత?
విదేశీయులు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారు వివిధ నియమాలను పాటించాల్సివుంటుంది. ఇటీవల కెనడా పౌరులకు భారతదేశం వీసాలపై నిషేధం విధించింది. అంటే ఇప్పుడు ఎవరైనా కెనడాకు చెందిన వ్యక్తి భారత్ వచ్చేందుకు అనుమతి లేదు. ఇతర దేశాల ప్రజలు భారతదేశానికి రావచ్చు. అయితే దీనికి భిన్నంగా.. ఆ దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా స్వాగతం పలుకుతాడు. కెవిన్ బాగ్ స్వయం ప్రకటిత దేశం. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా అని పిలుస్తారు. ఇది అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. 30 మంది మనుషులు, 4 కుక్కలు ఉన్న ఈ చిన్న దేశానికి సొంత కరెన్సీ (వలోరా) కూడా ఉంది. 2.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బ్యాంక్ ఆఫ్ మొలోసియాలో నాణేలు, ముద్రించిన నోట్లను ఉపయోగిస్తారు. ఈ స్వయం ప్రకటిత దేశంలో కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. నియంత కెవిన్ బోగ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఇక్కడ ఉంటున్నాడు. కెవిన్ బోగ్ ఎప్పుడూ సైనిక దుస్తులలో కనిపిస్తాడు. అతను తనను తాను స్వతంత్ర దేశానికి పాలకునిగా చెప్పుకుంటూ, దేశానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతాడు. 1990లలో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తూర్పు జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 2006లో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా ముస్టాచెస్టన్ అనే మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. దీనిలో కెవిన్ బాగ్ గెలిచాడు. బదులుగా ముస్టాచెస్టన్ పాలకుడు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 2010లో ఈ చిన్న ‘దేశం’ మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తన జాతీయ గీతాన్ని రెండుసార్లు మార్చింది. ఈ దేశపు జెండా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? -
ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి?
ఆ రోజు సుప్రీం కోర్టులో ఆసక్తికర వాతావరణం నెలకొంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరగనున్నదోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు జరిగే ఒక ప్రత్యేక కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు ఒక ప్రముఖ వ్యక్తి హాజరుకావాల్సి ఉంది. ఆ ప్రముఖుని కోసం ఒక సోఫాను హాలులో ఏర్పాటు చేశారు. సాక్షి కోసం సుప్రీంకోర్టు డాక్లో సోఫాను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి, చివరిసారి. నిజానికి ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయాలను రద్దు చేసే అధికారం కలిగిన వ్యక్తి స్వయంగా సాక్ష్యం చెప్పేందుకు రాబోతున్నారు. అతనే దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి... ఆరోజు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యునిగా.. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా దేశాధ్యక్ష్య పదవిలో ఉంటూ, ఆయనే స్వయంగా వాంగ్మూలం ఇవ్వడానికి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మళ్లీ అలాంటి దృశ్యం కనిపించలేదు. అది 1970వ సంవత్సరం. చట్టపరమైన మినహాయింపు ఉన్నప్పటికీ, అప్పటి రాష్ట్రపతి వివి గిరి కోర్టుకు హాజరై, తన వాంగ్మూలాన్ని వినిపించారు. భారత నాల్గవ రాష్ట్రపతి అయిన వీవీ గిరి 1894 ఆగస్టు 10న ఒరిస్సాలోని బ్రహ్మపూర్‌లో జన్మించారు. అతని తండ్రి వివి జోగయ్య పంతులు న్యాయవాది. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడు. వీవీ గిరి 1913లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఐర్లాండ్ వెళ్లారు. తరువాత్ భారత్ తిరిగివచ్చి బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. తాత్కాలిక రాష్ట్రపతిగా నియామకం దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి కార్మికనేతగానూ పేరుగాంచారు. 1928లో ఆయన నాయకత్వంలో రైల్వే కార్మికుల అహింసాయుత సమ్మె జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కార్మిక సంఘాలను భాగస్వాములను చేసిన ఘనత కూడా వివి గిరికి దక్కుతుంది. కాగా దేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1969 మే 13న మరణించారు. అనంతరం వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ సిండికేట్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరా గాంధీ వ్యతిరేకతను పట్టించుకోకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు సిండికేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిరా గాంధీ.. వివి గిరికి మద్దతు ప్రకటించారు. 1969 ఆగస్టు 16న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో నీలం సంజీవ రెడ్డి, వివి గిరి, ప్రతిపక్ష అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వివి గిరి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతలో ఆయనకు 48 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆయనకే మెజారిటీ వచ్చింది. అయితే వీవీ గిరి ఎన్నిక చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పుడు పద్ధతులను ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. భారతరత్నతో సత్కారం ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రపతి వీవీ గిరి స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై సాక్షిగా విచారణలో పాల్గొన్నారు. చివరకు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి, వీవీ గిరి ఎన్నికను సమర్థించింది. వీవీ గిరి 1969 ఆగస్టు 24 నుంచి 1974 ఆగస్టు 24 వరకూ రాష్ట్రపతి పదవిని చేపట్టారు ఆయన తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి అయ్యారు. 1975లో వీవీగిరి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. వీవీ గిరి తన 85 సంవత్సరాల వయస్సులో 1980 జూన్ 24న మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) మరణించారు. ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు! -
‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్!
త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు. opposition named their alliance I.N.D.I.A government changes India's name to Bharat Opposition : pic.twitter.com/cTaigawSaF — coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023 ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. #Bharat The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk — Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023 దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. Opposition names their alliance I.N.D.I.A Government proposes to change India's name to Bharat Opposition : pic.twitter.com/YsT9OCUrLo — SwatKat💃 (@swatic12) September 5, 2023 -
వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్
ప్రపంచ బ్యాంకు కాబోయే అధ్యక్షుడు (అమెరికన్ నామినీ) భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు కోవిడ్ సోకింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా చేసిన రొటీన్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అజయ్ బంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అజయ్ బంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అజయ్ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో భారత్ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. తన గ్లోబల్ లిజనింగ్ టూర్లో బంగా.. ఆయా ప్రాంతాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజంతో సమావేశమవుతూ వస్తున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీల కేసులు 7,026కి పెరిగాయి. -
ఇజ్రాయెల్ ప్రధాని భేటీలో బైడెన్ కునికి పాట్లు!
జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయెల్ నూతన అధ్యక్షుడు నఫ్టాలి బెన్నెట్‌తో జరిగిన సమావేశంలో బైడెన్ నిద్రపోయారు. ఈ మేరకు ఆ వీడియోలో వెనుక నుంచి నెతాన్యాహు వాయిస్ ఆడియోలో వస్తుంటుంది. (చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి) ఆ ఆడియోలో నెతాన్యాహు మాట్లాడుతూ... "మీకు తెలుసా బెన్నెట్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బైడెన్ శ్రద్ధగా వినడమే కాక తన అంగీకారాన్ని తెలుపడంలో ఊ కొడుతూ తల వాల్చినట్లున్నారు". అని సెటైర్ వేశారు. అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు(ఇజ్రాయెల్ , పాలస్తీనా) దేశాల పరిష్కార దిశగా చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెన్నెట్ ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సంకీర్ణం ప్రభుత్వ ఏర్పాటుతోపాటు 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన నెతన్యాహు పదవీచ్యుతుడు కావడంతోనే బైడన్ పై తన అక్కసును వెళ్లగక్కారు. అంతేకాదు ఈ ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తానని నెతన్యాహు గతంలో శపథం చేసిన సంగతి విదితమే. (చదవండి: ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో బాక్సర్ పకియావ్) -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
-
జస్టిస్ ధర్మాధికారి రాజీనామా
ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్ సత్యరంజన్ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నా. ముంబైని విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నన్ను నియమించేందుకు వారు సిద్ధంగా లేరు’ అని శుక్రవారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత బాధ్యతలున్నాయన్నారు. 2003లో జస్టిస్ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
మరికొంతకాలం అమిత్ షాయే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలను కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తాత్కాలిక చీఫ్‌ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు అమిత్‌షా గురువారం వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, 18న ఆఫీస్ బేరర్లు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. రోడ్‌మ్యాప్‌పై కమిటీ గురువారం నాటి సమావేశంలో అమిత్‌షా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని కొనియాడారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తెలంగాణ, ఒడిశాలలో మంచి ఫలితాలను సాధించిందన్నారు. సంస్థాగత ఎన్నికలతోపాటు ఇతర ప్రధాన అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్, నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
వారి పర్యటనల కోసం రూ.4469.5 కోట్లు
ఢిల్లీ : భారత ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల విదేశీ పర్యటనల కోసం భారత ప్రభుత్వం మూడు బోయింగ్ 777 విమానాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భారీ విమానాల్లో పలు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పర్యటనల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించాడానికి విలేకరుల సమావేశ గది, వీఐపీ ఎన్‌క్లోజర్, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించే విధంగా వీటిని రూపుదిద్దనున్నారు. క్షిపణి దాడులను తట్టుకునే విధంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించేందుకు అమెరికా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఈ మూడు విమానాలును ఎయిర్ ఇండియా నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ .4,469.50 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. ఈ విమానాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా 44 మంది పైలెట్లను నియమించుకోనుంది. వీరిలో నలుగురు కచ్చితంగా ఢిల్లీలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. వీరితో పాటు క్యాబిన్ సిబ్బంది, ఇంజనీర్లు, అత్యవసర సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ బోయింగ్ విమానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి కావడానికి 18 నెలల సమయం పట్టనుంది. 2020 నాటికి ఇవి అందబాటులోకి వస్తాయి. 2019లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో వీటిలోనే కొనసాగుతాయి. -
ఆదోనివాసికి రాష్ట్రపతి అవార్డు
ఆదోని: పట్టణానికి చెందిన సాకరే గచ్చి రమేష్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి రాజ్‌భాషా కీర్తి పురస్కార్ అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బంధువులు గురువారం విలేకరులకు తెలిపారు. హావన్న పేటకు చెందిన సాకరే వెంకోబరావు, రాధాబాయి దంపతుల కుమారుడు రమేష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగపూర్ శాఖలో సీనియర్ మేనేజరుగా పనిచేస్తున్నారు. ఈయన హిందీపై బ్యాంకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తన విధులు నిర్వహిస్తూనే హిందీ భాషాభివద్ధికి రమేష్ చేస్తున్న కషిని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను జాతీయ అవార్డుతో సత్కరించింది. హిందీ దివస్‌ను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రమేష్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డు ప్రదానం చేశారు.