ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్ సత్యరంజన్ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నా. ముంబైని విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నన్ను నియమించేందుకు వారు సిద్ధంగా లేరు’ అని శుక్రవారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత బాధ్యతలున్నాయన్నారు. 2003లో జస్టిస్ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment