judge
-
జస్టిస్ వర్మపై దర్యాప్తు... కీలక దశకు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు దొరికిన ఘటనపై దర్యాప్తు కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చురుగ్గా వ్యవహరిస్తోంది. తొలి దశ దర్యాప్తును ఇప్పటికే పూర్తిచేసింది. విచారణ కీలకమైన రెండో దశకు చేరినట్లు తెలిసింది. ఈ దశలో లభించే సాక్ష్యాధారాలే జస్టిస్ వర్మ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. త్రిసభ్య కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు సీజే జస్టిస్ అనూ శివరామన్ ఉన్న విషయం తెలిసిందే. కమిటీ దర్యాప్తును సీజేఐ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తొలి దశ దర్యాప్తులో ఫిర్యాదు ఆధారంగా కొందరు సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. అందులో తేలిన అంశాల ఆధారంగా రెండో దశలో మరింత లోతుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తవగానే సీజేఐకి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఇందుకు గడువేమీ నిర్దేశించలేదు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. కాలిపోయినట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ అందజేశారు. వాటిని ఆయన సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా తమ సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలేవీ దొరకలేదని ఢిల్లీ ఫైర్ సరీ్వసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తొలుత ప్రకటించారు. తానలా అనలేదంటూ మర్నాడే వివరణ ఇచ్చారు. నోట్ల కట్టల విషయం నిజమేనని తేలితే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ సిఫార్సు చేయవచ్చు. అనంతరం పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించవచ్చు. సీజేఐ ఖన్నాపై ప్రశంసల వర్షం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, కీలక డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం గొప్ప విషయమని న్యాయ నిపుణులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి ఉదంతాల్లో వివరాలను సాధారణంగా గోప్యంగా ఉంచుతుంటారు. కానీ వాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో తేవడం ద్వారా గొప్ప సంస్కరణకు సీజేఐ శ్రీకారం చుట్టారు. ఆయనకు మా సెల్యూట్’’ అని సీనియర్ అడ్వొకేట్లు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిష్ సి.అగర్వాల్ తదితరులు అభినందించారు. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటును కూడా ప్రశంసించారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బు కట్టల వీడియోను చూసి ఆందోళన చెందానని ఆదిష్ చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు కాలిపోయిన స్థితిలో దొరకడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేలాలని సీనియర్ న్యాయవాది మార్కండేయ ఖట్జూ అన్నారు. నాపై కుట్రలు: జస్టిస్ వర్మ నా ఇంట్లో ఎలాంటి నగదూ దొరకలేదు కాలిపోయాయంటున్న నోట్లతో సంబంధం లేదు నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు న్యూఢిల్లీ: తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత నోట్ల కట్టలేవీ లభించలేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయకు ఆయన లేఖ రాశారు. ఆ నోట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవి అక్కడికెలా వచ్చాయో తనకు తెలియదన్నారు. ‘‘అగ్నిప్రమాదం జరిగిన రోజు నేను ఇంట్లో లేను. ప్రమాదం తర్వాత స్టోర్‌రూంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు తొలగించడం గానీ, స్వాదీనం చేసుకోవడం గానీ జరగలేదని నా కుమార్తె, సిబ్బంది చెప్పారు. కాలిన నోట్లను అధికారులు నా కుటుంబసభ్యులకు చూపలేదు. ఆ నోట్లను వారు బయటకు తీసుకెళ్లినట్లు నా కుటుంబీకులు చూడలేదు. నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ స్టోర్‌రూంలో నగదు భద్రపర్చే అలవాటు లేదు. ఆ గదిలో మంటల్లో పాక్షికంగా కాలిన నగదు దొరికినట్లు చెప్పడం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం. దీని వెనక కుట్ర ఉంది’’ అని ఆరోపించారు. అందరూ స్వేచ్ఛగా తిరిగే స్టోర్‌రూంలో ఎవరైనా భారీగా నగదు దాస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు లేని నోట్లు తర్వాత అక్కడెలా ప్రత్యక్షమయ్యాయో దర్యాప్తు అధికారులే తేల్చాలన్నారు. ‘‘మేం బ్యాంకు ఖాతాల నుంచే ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం. నగదు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తుంటాం. వాటికి అన్ని లెక్కలూ ఉన్నాయి’’ అని చెప్పారు. -
న్యాయవ్యవస్థలో అవినీతికి అడ్డుకట్ట ఎలా?
హోళీ ముందురోజు హోళీ కా దహన్ ఉంటుంది. హోళికా అన్న రాక్షసిని చంపడాన్ని భారత ప్రజలు పండు గగా జరుపు కొంటారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసిన రాక్షసి హోళికా. చెడు మీద మంచి గెలుపునకు ప్రతీకాత్మకంగా హోళీ దహ నాన్ని చూస్తారు.చెడు పెరిగి పోతున్నప్పుడు ప్రకృతి తన చర్యలని చేపడుతుందని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇది నిజమేనని అనిపిస్తుంది. నిప్పు కూడా ప్రకృతిలో భాగమే. అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి మీద తన ప్రతాపాన్ని ఈ నెల 14వ తేదీన చూపించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో చెలరేగిన మంటల వల్ల ఆయన ఇంట్లో భారీ నగదు ఉన్నట్టుగా పోలీసు, అగ్నిమాపక అధికారులు కను గొన్నారు. ఆ మంటలు దేశంలోని న్యాయ వ్యవస్థని మండించాయి.మంటలు చెలరేగినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఒక గదిలో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదుని అధికారులు కనుగొన్నారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకి తెలియజేశారు. ఫలితంగా విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయ మూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్‌కు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలోని సభ్యులు ఈ నేరానికి అంత ర్గత విచారణ అవసరమని అభిప్రాయపడినారని వార్తలు. కేవలం బదిలీతో ఆయనను వదిలేస్తే న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని కొంతమంది న్యాయమూర్తులు భావించినారు.న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసం నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు శుక్రవారం అంతర్గత విచారణను ప్రారంభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదికను కోరింది. శుక్రవారం ఉదయం జరిగిన న్యాయమూర్తుల ఫుల్ కోర్టు సమావేశంలో శిక్షాత్మక బదిలీ సరిపోదని, న్యాయమూర్తిపై కొంత నిర్దిష్ట చర్య తీసుకోవాలని అభిప్రాయపడినట్టుగా చెబుతున్నారు. అంతర్గత విచారణకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరిస్తూ బదిలీని మొదటి అడుగుగా భావించినారు. బదిలీ ప్రక్రియ తక్షణమే అమల్లోకి రాదు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం తాజాగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు.జస్టిస్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్‌లో జన్మించి నారు. 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2016 ఫిబ్రవరి 1న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు. న్యాయ వాద వృత్తిలో ఉన్నప్పుడు జస్టిస్ వర్మ రాజ్యాంగ, కార్మిక పారిశ్రామిక చట్టాలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టుకి న్యాయవాదిగా 2006 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు పని చేశారు.హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు?న్యాయమూర్తులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, న్యాయమూర్తులపై ఫిర్యాదు అందిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ అడుగుతారు. ఆ వివరణకు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందనప్పుడు, లేదా ఆ విషయంపట్ల మరింత దర్యాప్తు అవసర మని భావించినప్పుడు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు.ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాత సంబంధిత న్యాయమూర్తి చేసిన దుష్ప్రవర్తన తీవ్రమైనదని, అతన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి భావిస్తే రాజీనామా చేయమని ఆ న్యాయమూర్తిని అడుగు తారు. ఆ న్యాయమూర్తి అందుకు నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ద్వారా ఆయన తొలగింపునకు చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రభు త్వానికి లేఖ రాస్తారు.జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుండి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు కొలీజియమ్ ఆయన్ని అలహాబాద్‌కి బదిలీ చేయాలని సిఫారస్ చేయాలని వార్తలు వచ్చాయి. ఈ సిఫారస్పై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు. అతణ్ణి ఇక్కడికి పంపించడానికి వీల్లేదు. అవినీతిపరులను మేం అంగీకరించం. అవస రమైతే కోర్టు పనిని మానివేస్తాం’ అని అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ అన్నారు. జస్టిస్ వర్మ ఇంటి నుండి 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బార్ అసోసియేషన్ తన ప్రెస్ నోట్లో పేర్కొంది.కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ శుక్రవారం ఉదయం రాజ్యసభలో జస్టిస్ వర్మ అంశాన్ని లేవనెత్తారు. ఈ షాకింగ్ కేసుతో దేశం మేల్కొందని ఆయన అన్నారు. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేష్... ప్రయాగరాజ్‌లో విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా గత డిసెంబర్లో 50 మంది పార్లమెంట్ సభ్యులు ఛైర్మన్‌కి పంపిన అభిశంసన నోటీసుని గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయపరమైన జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంతో చర్చించాలని ఛైర్మన్‌ని కోరారు.సుప్రీంకోర్టు ఏం చేయాలి?సుప్రీంకోర్టు కోరిన తరువాత కూడా ఆరోపణలు ఎదు ర్కొంటున్న న్యాయమూర్తి రాజీనామా చేయనపుడు, ఇతర హైకోర్టులు బార్ అసోసియేషన్లు అతని బదిలీని అంగీకరించ నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇదీ ప్రశ్న.అభిశంసన అనేది కార్యరూపం దాల్చ డానికి చాలా సమయం పడుతుంది. అందు కని ఆ న్యాయమూర్తికి ఎలాంటి పని అప్ప గించకుండా చర్యలు తీసుకోవాలి. ఆ అవ మాన భారంతో ఆ న్యాయమూర్తి రాజీ నామా చేసే అవకాశం ఉంది.ఇది ఇలా ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రా యపడింది. ఇది చాలా కలవరపెట్టే విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆ ఉత్తర్వులని స్టే చేసింది. అది సుప్రీంకోర్టు ముందుకు త్వరలో రానున్నది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి.న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎవరూ సహించరు. ఇది చాలా తీవ్రమైన విషయం. న్యాయ వ్యవస్థలోనే కాకుండా సమాజంలో అవినీతి అనేది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తన దృష్టిని సారించా ల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నగదు
-
సుప్రీం జడ్జిగా బాగ్చీ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్ 3న జన్మించిన జస్టిస్ బాగ్చీ.. 2011 జూన్27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్ బాగ్చీ పేరును సిఫారసు చేసింది. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది. ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. -
హద్దులు చెరిపేసి... నిరూపిస్తున్నారు
ఇరవై ఏళ్లుగా 35 దేశాల్లో జరిగిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్‌గా, జడ్జ్‌గా, గ్రూమర్‌గా ఉన్నాను. ఒకప్పుడు పదిమంది అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ, నేడు అమ్మాయిలే కాదు, అమ్మలు అయ్యాక తమని తాము నిరూపించుకోవడానికి వచ్చే మహిళల శాతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునే క్రమంలో మహిళలకు సరైన ΄్లాట్ఫారమ్ దొరక్కపోవడం,ప్రొఫెషనల్ గా లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం, కుటుంబ బాధ్యతలు అడ్డుగా ఉండటం .. వీటన్నింటి వల్ల టైమ్ దాటిపోతుంటుంది. కానీ, ఏదో ఒక సమయంలో రియలైజ్ అయి, ఆలస్యంగా అయినా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ‘మిసెస్ బ్యూటీ’ పోటీలలో పాల్గొనే గృహిణుల సంఖ్య పెరిగింది. ‘నేను స్టేజీ మీద వాక్ చేయాలి, మంచి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవాలి, కాన్ఫిడెంట్‌గా సమాధానాలు చెప్పగలగాలి...’ ఇలా ఆలోచిస్తున్నారు. గత తరం వరకు సమాజంలో ఒక ఫ్యాషన్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశం కూడా అదే. అందుకు తగినట్టుగానే ఇప్పుడు చాలా వేదికలు ముందుకు వచ్చాయి. మిసెస్ కేటగిరీలోకి వచ్చే మహిళల మైండ్ సెట్, ఔట్ లుక్ పూర్తిగా మారింది. ఇప్పుడు కావాల్సింది టాలెంట్, కాన్ఫిడెన్స్. మహిళ జీవితమే ఒక ఛాలెంజ్. అందుకే, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మహిళలు సవాళ్లను చాలా సులవుగా అధిగమిస్తున్నారు. ఒక కాలేజీ అమ్మాయి మిస్ కాలేజీ తర్వాత మిస్ ఇండియా ఆ తర్వాత మిస్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నట్టే, గృహిణులుగా ఉన్నవారు కూడా అలాగే క్లారిటీగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ రంగంలో గతంలో అమ్మాయిల గురించి ఉన్న నెగిటివిటీ స్థానంలో పాజిటివిటి చేరింది. ఇది చాలా మంచి మార్పు. జూన్‌లో మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్‌ని హోస్ట్ చేస్తున్నాను. దీనికి గృహిణులుగా ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారికి శిక్షణ ఇస్తున్నాను.– వాలెంటీనా మిశ్రా, క్రియేటివ్ డైరెక్టర్, మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ హోస్ట్ -
ముగ్గురు అదనపు జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తు లకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారా యణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అద నపు న్యాయమూర్తులుగా నియమితులైన విష యం తెలిసిందే. కాగా, శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ
విజయసాధనకు అకుంఠిత దీక్ష అవసరమని అంటారు. పట్టుదలతో లక్ష్యం దిశగా పయినించినవారు తప్పక విజయం సాధిస్తారని కూడా చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు యాసిన్ షా మహ్మద్. ఈయన జీవితం ఒక సినిమాను తలపిస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్న యాసిన్ చివరకు విజయబావుటా ఎగురవేశాడు.జీవితంలో ఎత్తుపల్లాలు, మలుపులుఇటీవల జరిగిన కేరళ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాసిన్ షా మహ్మద్ రెండో స్థానం సాధించాడు. దీంతో సివిల్ జడ్జి అయ్యే అర్హత సాధించాడు. డెలివరీ బాయ్ నుండి మేజిస్ట్రేట్ అయ్యే దిశగా సాగిన యాసిన్ జీవన ప్రయాణంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. యాసిన్‌కు మూడేళ్ల వయసున్నప్పడే అతని తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టివెళ్లిపోయాడు. నాడు 19 ఏళ్లు ఉన్న అతని తల్లి.. పిల్లలను పెంచిపోషించింది. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటూ, వారు కాలం వెళ్లదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద వారికి ఒక చిన్న ఇంటి సౌకర్యం లభించినప్పటికీ, వారికి అది ఏమాత్రం అనువుగా ఉండేది కాదు.న్యూస్ పేపర్ పంపిణీ చేస్తూ..యాసిన్ తన బాల్యంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. తరువాత 7 గంటల నుండి పాల ప్యాకెట్లు పంపిణీ చేసేవాడు. ఇది పూర్తయ్యాక స్కూలుకు వెళ్లేవాడు. యాసిన్ తల్లి రెండు పాడి ఆవును కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని సాకేది. యాసిన్ తన ఆరేళ్ల వయసు నుంచే ఆదాయం వచ్చే పనులు చేసేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పంపిణీ చేసేవాడు.స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం..సమయం చిక్కినప్పుడు యాసిన్ పెయింటర్‌గా, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గానూ పనిచేశాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.29 ఏళ్ల పోరాటంయాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇది కూడా చదవండి: ‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది? -
Big Question: చంద్రబాబు భారీ కుట్ర.. ఏకంగా జడ్జిపైనే నిఘా!.. లూథ్రా చేతిలో పోలీసులు?
-
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
-
ఏకంగా న్యాయమూర్తుల పైనే చంద్రబాబు సర్కార్ నిఘా
-
బెంగళూరు టెక్కీ తండ్రి సంచలన ఆరోపణలు
పాట్నా : భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని ఓ న్యాయవాది అతుల్ సుభాష్‌ను డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతుల్‌పై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు.కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ‘కేసు పరిష్కరించేందుకు’ రూ.5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్దమైనట్లు చెప్పారు. ఆ సమయంలో తాను మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు రూ.20 వేల అడిగారని, ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. Atul Subhash’s father shares how the judiciary systematically harassed his son and family. It’s so painful to watch. 😣To everyone involved, remember—karma is real, and you have your family too.😏#JusticeIsDue #JusticeForAtulSubhash pic.twitter.com/H8211785xL— Sann (@san_x_m) December 12, 2024 ప్రస్తుతం, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగవంతం చేశారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ను విచారణ చేపట్టారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నారు. 👉చదవండి : సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం గాయత్రి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు.తండ్రి వ్యవ సాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు. కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం చదివించారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి.. అప్పుడు విజయం సాధించలేకపోయారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించారు. కాగా, మొండయ్య ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. -
జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కోర్టులో జడ్జి వేధించాడని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి చనిపోయేందుకు ప్రయత్నించాడు. అదృష్టం బాగుండి అధికారులు కాపాడటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అలీఘర్‌లో వెలుగుచూసింది.బన్నాదేవి పోలీస్ స్టేసన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్ కుమార్ ఇటీవల బైక్ చోరికి పాల్పడిన అయిదుగురు నిందితులను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచారు.అయితే నిందితులను కాకుండా తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారని స్థానిక న్యాయమూర్తి త్రిపాఠి.. ఎస్సై సచిన్‌ను మందలించారు. కోర్టు విచారణ సమయంలో మేజిస్ట్రేట్ తన పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించారని.. కోరిన రిమాండ్‌ను మంజూరు చేయకుండా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి ఉండేలా చేశారని కుమార్ ఆరోపించారు.Sub Inspector Sachin Kumar sitting on the railway track to commit su!cide, over He said that "The police had caught 5 bike thieves. I presented them in the court. The judge said that you have caught wrong people. The judge misbehaved with me" pic.twitter.com/WWck5gBpnU— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2024దీంతో మనస్తాపం చెందిన సచిన్ కుమార్ రైల్వే ట్రక్‌పై కూర్చొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన స్టేషన్ ఇంచార్జ్ పంకజ్ కుమార్ మిత్రా, ఇతర పోలీసులు వెంటనే స్పందిచి కుమార్‌ను రక్షించారు. అయితే ఈ ఆరోపణలపై న్యాయమూర్తి త్రిపాఠి ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు. -
భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతదేశ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం విడిచి పారిపోవడానికి మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్ ప్రయచారని అక్కడి మీడియా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. న్యాయశాఖ మాజీ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మా ఢాకా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టు దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది. హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బీఎన్పీ సెక్రెటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగీర్ డిమాండ్ చేశారు. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి విమర్శలు.. నేడు విచారించనున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. తనకు సంబంధించిన కేసును తానే విచారించనుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన విమర్శలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం(ఆగస్టు7) విచారించనుంది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి షెరావత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తనను కాస్త ఎక్కువ ఊహించుకుంటోందని, అదే సమయంలో హైకోర్టును కాస్త తక్కువ అనుకుంటోందని వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థాయి ఉందని, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆదేశాలిచ్చేందుకు వీలు లేదని అన్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యల అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారమే సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కమిషనర్‌గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయ బాడిగ
-
అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయ బాడిగ
న్యూయార్క్: భారతీయ సంతతి అమెరికా పౌరురాలు, తెలుగుబిడ్డ జయ బాడిగ అక్కడి శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా జయ కమిషనర్‌గా సేవలందిస్తుండటం విశేషం. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోరి్నయా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటారీ్నగా పనిచేశారు. 2018లో కాలిఫోరి్నయా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు. -
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
జడ్జీల పేరిట.. లాయర్ ఘరానా మోసం! చివరికీ..
సాక్షి, హైదరాబాద్: భూవివాద కేసులో జడ్జీలను మేనేజ్ చేస్తానంటూ రూ.7 కోట్లు తీసుకున్న హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణతోపాటు బెదిరింపులకు పాల్పడిన మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై ఇటీవల ఐఎస్‌సదన్ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చింతల్‌లోని వాణీనగర్‌కు చెందిన డాక్టర్ చింతల యాదగిరి సామాజిక కార్యకర్త. ఈయన తండ్రి మల్లయ్య తన కులానికి చెందిన వారి కోసం ఓ సంఘం ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత యాదగిరి దీనిని పర్యవేక్షిస్తున్నారు. సంఘం కోసం 1982లో బౌరంపేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పట్టాదారుడికి నగదు చెల్లించి ప్రైవేట్ సేల్ డీడ్ ద్వారా స్థలం పొందారు. 2005లో కొందరి కన్ను ఈ స్థలంపై పడింది. దీనిపై సంఘానికి చెందిన వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, సివిల్ దావాలు దాఖలు చేశారు. ఇవి ఫలితాలు ఇవ్వకపోవడంతో యాదగిరి నేతృత్వంలోని కులపెద్దలు సైదాబాద్‌లో ఉండే న్యాయవాది వేదుల వెంకట రమణను సంప్రదించగా, హైకోర్టు కేసు నడుస్తోంది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో దాదాపు 18 ఏళ్లు కేసు మూలనపడింది. మాట్లాడదాం రమ్మని చెప్పి.. కేసు విషయమై మాట్లాడటానికి యాదగిరిని కులపెద్దలతో కలిసి తన కార్యాలయానికి రమ్మని న్యాయవాది వెంకటరమణ చెప్పాడు. దీంతో యాదగిరి 10 మందితో వెళ్లి చర్చించారు. తీర్పు వేగంగా, అనుకూలంగా తెచ్చుకోవడానికి బెంచ్‌లో ఉన్న జడ్జీలను మేనేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి, దీని కోసం వెంకటరమణ రూ.10 కోట్లు అడిగాడు. రూ.7 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని వారంతా నగదుగా అందజేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా వీరికి అనుకూలంగా లేకపోవడంతో భూమిని కోల్పోయారు. వెంకటరమణ తమ ప్రతివాదులతో కుమ్మక్కు అయ్యి, వారి నుంచి 25 కోట్లు తీసుకున్నాడని యాదగిరి, కుల పెద్దలకు తెలిసింది. దీనికి న్యాయవాది వెంకటరమణ వైఖరే కారణమని భావించిన బాధితులు తమ వద్ద తీసుకున్న మొత్తం నగదు తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారంగా అంతే మొత్తం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒత్తిడి చేయగా, రూ.కోటి మాత్రమే వెంకటరమణ తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించకపోగా, వెంకటరమణతోపాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అనుచరుడు జైకుమార్‌తో పాటు పాతబస్తీకి చెందిన రౌడీలతో బెదిరింపులకు దిగారంటూ యాదగిరి ఐఎస్‌సదన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద వెంకటరమణ, అహ్మద్ బలాల, జైకుమార్ తదితరులపై కేసు నమోదై సీసీఎస్‌కు బదిలీ అయ్యింది. ఇవి చదవండి: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ! వేటు పడింది.. -
గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి,ఎవరీ శ్రీపతి?
తమిళనాడు తిరుపట్టూరు జిల్లాఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు.నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. శ్రీపతి పరిచయం... ఆరు నెలల క్రితం... తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో ‘తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్’(టి.ఎన్.పి.ఎస్.సి) ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె ‘సివిల్ జడ్జ్’ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే చరిత్రే. చురుకైన అమ్మాయి తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసి΄ాపగానే చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ (తిరుపట్టూరు జిల్లా)కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్ వరకూ చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్ వరకూ చదువుకుంది. ‘ఇప్పుడు చదివి ఏం చేయాలంటా’ అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి. గిరిజనుల హక్కుల కోసం ‘మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు ΄÷ందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను’ అంది శ్రీపతి. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్ట్ కోసం టి.ఎన్.పి.ఎస్.సి పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. ‘తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని... ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని’ స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్ జయసుఖ్ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు. బల్సరా న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు. -
సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జజ్టిస్ ప్రసన్న బి.వరాలే పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్.దినేశ్‌కుమార్‌ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సమావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ అనంతరం సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూ డో న్యాయమూర్తిగా జస్టిస్ వరాలే నిలవనున్నారు. ‘‘జస్టిస్ ఎస్.కె.కౌల్ రిటైర్మెంట్తో గత డిసెంబర్ 25 నుంచి సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉన్నందున ఖాళీలుండరాదు. అందుకే జస్టిస్ వరాలే పేరును సిఫార్సు చేస్తున్నాం’’ అని కొలీజియం పేర్కొంది. 56 మంది సుప్రీం న్యాయవాదులకు సీనియర్ హోదా 11 మంది మహిళలతో సహా 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో తెలుగు న్యాయవాది శ్రీధర్ పోతరాజు కూడా ఉన్నారు. -
షాకింగ్ ఘటన.. కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు
లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెయిల్ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ అనూహ్య పరిణామం లాస్ వెగాస్‌లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్‌లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్కు బెయిల్ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది. Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD — Great Clips (@Altaynova) January 3, 2024 ఆమె పక్కనే ఉన్న క్లర్క్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్‌చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు. A man attacked a Clark County judge in court today after she denied his probation. 😬 pic.twitter.com/CkJXj7Tc5a — non aesthetic things (@PicturesFoIder) January 3, 2024 -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
న్యాయమూర్తులపైనే దాడులా? చీఫ్ జస్టిస్ సీరియస్
ఢిల్లీ: సమాజంలో న్యాయాన్ని కాపాడేవారు న్యాయమూర్తి. అలాంటి హోదా ఉన్న వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. కానీ అలాంటి జడ్జికే లైంగిక వేధింపులు ఎదురైతే? ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో సహచర సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జడ్జి ఆరోపించారు. స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమితి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు. ఉత్తరప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ' ప్రజలకు సేవలు చేసే న్యాయమూర్తి వృత్తిలో తక్కువ కాలంలోనే నాకు గొప్ప అగౌరవం జరిగింది. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు' అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. 'ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎలాంటి చర్యలు లేవు. హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. సాక్షులు ప్రభావితం కాకుండా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. కానీ నా అభ్యర్థనను కొట్టివేశారు. ఏడాదిగా ఈ బాధ అనుభవిస్తున్నా. నేను బతికుండి ప్రయోజనం శూన్యం. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వండి' అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఈ అంశంపై స్టేటస్ అప్డేట్ కోరాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదనంతరం, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నుంచి కూడా నివేదికను కోరారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం
యూఎస్ కోర్టులో కొనసాగుతున్న యాంటీట్రస్ట్ కేసులో భారతీయ అమెరికన్ ఫెడరల్ జడ్జి అమిత్ మెహతా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక భారతీయుడు సీఈఓగా ఉన్న టాప్ టెక్ కంపెనీ భవితవ్యాన్ని తేల్చే బాధ్యత మరో భారతీయ అమెరికన్ చేతిలో ఉంది. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద టెక్ మోనోపోలీ కేసు. ఇది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం, ఇంటర్నెట్ స్వభావాన్ని పూర్తిగా మార్చనున్నది. దీనిని 1998లో మైక్రోసాఫ్ట్‌పై జరిగిన యాంటీట్రస్ట్ ట్రయల్‌తో పోలుస్తున్నారు. దీనిలో టెక్ దిగ్గజానికి ఓటమి ఎదురయ్యింది. న్యాయమూర్తి అమిత్ మెహతా సమక్షంలో ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ మూడు నెలల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. కాగా మెహతా గుజరాత్‌లోని పటాన్‌లో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చారు. కాగా తమిళనాడులోని మదురైలో జన్మించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన చదువు పూర్తి అయిన తర్వాత అమెరికాకు వచ్చారు. అటు అమిత్ మెహతా, ఇటు పిచాయ్ ఇద్దరూ దాదాపు ఒకే వయస్సులో ఉన్నారు. మెహతా వయస్సు 52 ఏళ్లు. పిచాయ్ కంటే ఒక ఏడాది ఎక్కువ. రెండు దశాబ్దాల క్రితం అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్లో శోధనను నిర్వహించడానికి ఒక వినూత్న మార్గంతో స్క్రాపీ స్టార్టప్‌గా గూగుల్ సిలికాన్ వ్యాలీకి డార్లింగ్‌గా మారిందని న్యాయ శాఖ తన 2020 నాటి ఫిర్యాదులో పేర్కొంది. ఇదే వ్యాజ్యానికి ఆధారం. ఇలా ఆవిర్భవించిన గూగుల్ అప్పుడే అంతరించిపోయింది. నేడున్న గూగూల్ ఇంటర్నెట్ గుత్తాధిపత్యానికి గేట్‌కీపర్‌గా మారింది. అత్యంత సంపన్న కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత కొన్నేళ్లుగా గూగుల్ సాధారణ శోధన సేవలు, శోధన ప్రకటనలు, సాధారణ శోధన టెక్స్ట్ ప్రకటనల కోసం మార్కెట్లలో తన గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సంస్థ విస్తరణకు పోటీ వ్యతిరేక వ్యూహాలను ఉపయోగించిందని న్యాయశాఖ ఆరోపించింది. మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని నిర్వహించకుండా నిరోధించడానికి ఈ కేసు ఉద్దేశించినది. గుత్తాధిపత్య ఫిర్యాదులోని ప్రధాన అంశం ఏమిటంటే గూగుల్ దాని పరికరాలు, మొజిల్లా వంటి వెబ్ బ్రౌజర్లలో గూగుల్‌ను డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా చేయడానికి ఆపిల్,శాంసంగ్ వంటి కంపెనీలకు కొన్ని బిలియన్లను చెల్లిస్తుంది. దీనివల్ల పోటీదారులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండదు. అమెరికాలో గూగుల్‌ను సెర్చ్ ఇంజిన్‌గా 95 శాతం మేరకు ఉపయోగిస్తున్నారు. కాగా గూగుల్ తమ అత్యుత్తమ నాణ్యత కారణంగా ప్రజలు తమ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగించాలని కేసులో వాదించింది. అయితే ఈ విషయంలో తామేమీ బలవంతం చేయడంలేదని, ఇతర శోధన ఇంజిన్లకు సులభంగా మారవచ్చని కూడా తెలిపింది. ఈ కేసులో ప్రారంభ విచారణ బహిరంగం అయిన నేపధ్యంలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ తదిత టెక్ కంపెనీలు తమ వాణిజ్య రహస్యాలను బహిరంగంగా చర్చించడం వల్ల తమ కంపెనీలకు ప్రమాదం వాటిల్లుతుందని వాదించడంతో విచారణ రహస్యంగా కొనసాగుతోంది. లారీ పేజ్,సెర్గీ బ్రిన్లు స్థాపించిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ చివరికి యూఎస్‌లోని చట్టసభ సభ్యుల నుండి కూడా ఇలాంటి యాంటీట్రస్ట్ విమర్శలను ఎదుర్కొంది. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌లు యుఎస్ కాంగ్రెస్ విచారణలో పిచాయ్‌ను ఇదే విషమయై ప్రశ్నించారు. రిపబ్లికన్ చట్టసభ సభ్యులు కూడా ఈ సీఈఓలందరూ గూగుల్ తీరును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇది కూడా చదవండి: అనీ బిసెంట్ భారత్ ఎందుకు వచ్చారు? -
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్‌కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్‌పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై ససెన్షన్ వేటు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై జడ్జి జయకుమార్ కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో.. శ్రీనివాస్‌గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఆర్ఐ చేయాలని జడ్జి జయకుమార్ ఇంతకు ముందు ఆదేశించారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు పెట్టాలని గతంలో ఆదేశించారు. అసలు ఏం జరిగిందంటే ? 2018 ఎన్నికల్లో TRS పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ మహాబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక కోసం నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ డాక్యుమెంట్లను సాధారణ ప్రక్రియలో భాగంగా అప్లోడ్ చేశారు. అయితే అప్లోడ్ అయిన డాక్యుమెంట్లలో కొన్ని పొరపాట్లు ఉండడంతో శ్రీనివాసగౌడ్ తెర వెనక వ్యవహరం చేశారని, పాత డాక్యుమెంట్ డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారని కొందరు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఏం చేసింది? ఈ ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్ వాసి చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసు వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మహబూబ్‌నగర్ రెండో టౌన్ స్టేషన్లో శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 10 మంది అధికారులపై ఇటీవలే కేసు నమోదయింది. తిరకాసు ఎక్కడంటే ? ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మొత్తం పది మంది అధికారులను చేర్చారు. వీరిలో నాటి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ , నాటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ , ఆనాటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులున్నారు. ఎన్నికల సంఘం ఏం చేసింది? తెలంగాణ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీసుకున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఎక్కడయితే తప్పు జరిగిందో, ఎవరయితే తప్పు చేశారో వారిని నిందితులుగా చూడాలి తప్ప.. ఆ సమయంలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిందితులుగా పేర్కొనడం సరికాదని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. వీరి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ జయకుమార్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు.. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి..
లాస్ ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జి బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగారు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో జడ్జి తనవద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తన సహచరుడికి మెసేజ్ పెడుతూ.. రేపు నేను కోర్టుకి రాలేను.. నేను జైలులో ఉంటానని సందేశం పంపించినట్లు తెలిపారు పోలీసులు. కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి జెఫ్రీ ఫెర్గ్యూసన్(72) ఆగస్టు 3న తన భార్య షెరిల్(65) ఒక రెస్టారెంటుకు వెళ్లగా అక్కడ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అలా వారి మధ్య జరిగిన వివాదం కొద్దిసేపటికి బాగా ముదిరిపోయింది. ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో షెరిల్.. పదే పదే వేలు చూపించే బదులు ఒక తుపాకీ చూపించి కాల్చేయొచ్చు కదా అని అరిచింది. వెంటనే ఫెర్గ్యూసన్ తన వద్ద ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో చాలా దగ్గర నుండి కాల్చేశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోనులో.. నేను సహనం కోల్పోయి, నా భార్యను చంపేశాను.. రేపు నేను రాకపోవచ్చు, బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమోనని సందేశం పంపారు. అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని వివరించారు. పోలీసులు అతడి ఇంటిని సోదా చేయగా ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లు లభించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ బాగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలపగా ఫెర్గ్యూసన్ నేరాన్ని అంగీకరించలేదు. ఆయన తరపు లాయర్ పాల్ మేయర్ ఈ హత్య ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని పొరపాటున జరిగిందని దీన్ని నేరంగా పరిగణించవద్దని అన్నారు. కోర్టు లాయర్ వాదనంతో ఏకీభవించి జడ్జికి బెయిల్ మంజూరు చేయడమే కాదు మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది. ఇది కూడా చదవండి: ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్ -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్, అగర్బత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను టీటీడీ చైర్మన్ అందజేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు సీజే శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. తిరుచానూరులో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ఠాకూర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారిక వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను జూన్ 11న 2,33,248గా, తర్వాత 2,33,506గా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అభ్యర్థుల సంఖ్య అలా ఎలా పెరిగిందని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంతకాల్లో భారీగా మార్పు ఉన్నా ఇన్విజిలేటర్ ఎందుకు అభ్యంతరం తెలుపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి ప్రశ్నపత్నం లీకై మరలా పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి తీర్పు రిజర్వు చేశారు. తప్పిదాలు పట్టించుకోలేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన టీఎస్పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్లు అయ్యింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్‌ను మ్యానిప్యులేట్ చేసేందుకు ఇది అవకాశం ఇస్తుందని పిటిషనర్లు వినతిపత్రం ఇచ్చినా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్నారు. పైగా అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్–1 విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కీలకమైన గ్రూప్–1 పరీక్షలో వేలిముద్రలు తీసుకోని టీఎస్పీఎస్సీ..గ్రూప్–4 పరీక్షకు మాత్రం వేలిముద్రలు తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి..’అని కోరారు. పకడ్బందీగా ప్రిలిమ్స్: ఏజీ టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాల్ టికెట్లను సరిపోల్చి చూశారు. ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ప్రిలిమ్స్‌ను కమిషన్ సమర్థవంతంగా నిర్వహించింది. ఓ అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లి అయిన తర్వాత పెళ్లికి ముందు ఉన్న ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. ఈ ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు..’అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని, టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు, మెయిన్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి
హర్యానాలోని నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్ జిల్లా అడిషనల్ చీఫ్ జస్టిస్ అంజలి జైన్.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్ సియారమ్తో కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు. చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు. దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్‌లు కలిసి రచించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరమని, దీంతో ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత ఉండాలని సూచించారు. తప్పుడు రిపోర్టింగ్, తప్పుడు సమాచారంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్‌ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా భావిస్తున్నానన్నారు. ఈ పుస్తకం పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ మాట్లాడుతూ.. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని చెప్పారు. -
మంత్రి సెంథిల్ బాలాజీ కేసులో కొత్త ట్విస్టు!
మంత్రి సెంథిల్ బాలాజీ కేసులో మద్రాసు హైకోర్టులో బుధవారం ‘ధర్మ’సంకటం ఏర్పడింది. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు మంగళవారం భిన్న తీర్పులను వెలువరించారు. ఒకరు సెంథిల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, మరొకరు చట్ట విరుద్ధమేనంటూ వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో మూడో న్యాయమూర్తి ప్రమేయం తప్పనిసరిగా మారింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. సాక్షి, చైన్నె: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని గత నెల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విచారణ సమయంలో గుండె పోటు రావడంతో సెంథిల్ బాలాజీని తొలుత ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో కావేరి ఆసుపత్రికి తరలించి బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధించిన రిమాండ్ కాలాన్ని ఈనెల 12వ తేదీ వరకు పొడించారు. అదే సమయంలో సెంథిల్‌ను ఎలాగైనా తమ కస్టడీకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈడీ వర్గాలు తీవ్రంగానే న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నాయి. ఇక, తన భర్తను ఈడీ చట్ట విరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్ సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గత నెల 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు ఈడీ పేర్కొందని, అయితే మరుసటి రోజు ఉదయం రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని కోర్టుకు వివరించారు. ఈ రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో..? ఏం చేశారో..? అన్ని వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని, తన భర్త అరెస్టును రద్దు చేయాలని కోర్టులో వాదనలు తమ న్యాయవాదుల ద్వారా వినిపించారు. ఈడీ సైతం బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచింది. సెంథిల్‌ను చట్ట బద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. మెమో తీసుకోక పోవడంతో ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామని వాదించారు. ఆయన్ని ఇంత వరకు తాము విచారించ లేదని పేర్కొంటూనే, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉందని కోర్టుకు వివరించారు. వీటిని తారు మారు చేసే పరిస్థితులు ఉన్నట్లు వాదించారు. వారం రోజులు ఈ వాదనలు జరగ్గా, తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు నిషా భాను, భరత చక్రవర్తి వాయిదా వేశారు. ఆసక్తికరంగా.. వాదనలను పరిశీలించిన అనంతరం మంగళవారం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. నిషా భాను తన తీర్పులో ఈ పిటిషన్ విచారణ యోగ్యమేనని పేర్కొన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టును చట్ట విరుద్ధంగా భావిస్తున్నామని ప్రకటించారు. సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న కాలాన్ని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చారు. అదే సమయంలో ఈ తీర్పునకు భిన్నంగా న్యాయమూర్తి భరత చక్రవర్తి తీర్పు వెలువరించారు. మేఘల పిటిషన్ విచారణ యోగ్యం కాదని స్పష్టం చేశారు. అరెస్టు అనంతరం సెంథిల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ వ్యవహారాలన్ని చట్టబద్ధంగానే జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే కస్టోడియల్ గడువును పెంచుతున్నట్టు ప్రకటించారు. కావేరి ఆస్పత్రిలో వైద్యుల సూచన మేరకు ఆయన చికిత్సలో ఉన్నారని , ఆతదుపరి పరిణామాలతో జైలుకు పంపించడం లేదా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవచ్చు అని సూచించారు. ఒకరు చట్ట విరుద్ధమని, మరొకరు చట్టబద్ధంగానే అరెస్టు జరిగినట్టు భిన్న తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భిన్న తీర్పుల నేపథ్యంలో ఈకేసులోకి మూడో న్యాయమూర్తి ప్రమేయం అవశ్యమైంది. దీనిపై హైకోర్టు సీజే ఎస్వీ గంగాపూర్వాలకు ద్విసభ్య బెంచ్ సిఫార్సు చేసింది. న్యాయమూర్తుల మధ్య భిన్న తీర్పుపై సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇలంగో స్పందిస్తూ, కొన్ని కేసుల్లో భిన్న తీర్పులు సహజమేనని, ఇది వరకు భిన్న తీర్పులు వెలువరించిన కేసులను గుర్తు చేశారు. మూడో న్యాయమూర్తి ఎదుట బలమైన వాదనలు ఉంచుతామన్నారు. వారంలో మూడో న్యాయమూర్తి నియామకం సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల దాఖలు చేసిన పిటిషన్‌పై ఓ వైపు హైకోర్టులో భిన్న తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం చేరింది. సెంథిల్ బాలాజీని కావేరి ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ కూడా మంగళవారమే విచారణకు వచ్చింది. కేసులో ఆధారాలను తారు మారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విచారణలో జాప్యం జరిగే కొద్ది కేసు వీగి పోయే పరిస్థితులు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో హైకోర్టు సైతం భిన్న తీర్పును వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో మూడో న్యాయమూర్తి నియామకం జరగాలని, తొలి ప్రాధాన్యతగా పరిగణించి కేసును త్వరితగతిన విచారించి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా, సెంథిల్ వ్యవహారంలో మూడో న్యాయమూర్తి ప్రమేయంతో మళ్లీ కేసు మొదటికి వచ్చినట్లయ్యిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
జస్టిస్ మిశ్రా గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఆత్మీయ విందు (ఫొటోలు)
-
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
సాక్షి, విజయవాడ: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సత్కరించిన సీఎం వైఎస్ జగన్.. మెమెంటో అందజేశారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు. ఆయన ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఏపీ హైకోర్టు సీజేగా పని చేసి ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానెల్స్‌లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్(తెలుగు), మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆ ఆర్డర్‌కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీడియాలో కొందరు వ్యక్తులతో చర్చలు పెట్టారు. ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. మొత్తం న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ఒకస్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని అనకున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుని విచారణ కొనసాగించా. సస్పెండై, అరెస్టయిన ఒక మెజిస్ట్రేట్ ఏకంగా.. న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయని వ్యాఖ్యానించారు. గౌరవమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్, మహాటీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది’’ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో.. తొలి రెండు పేజీల్లో జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్న వ్యాఖ్యల సారాంశం. ‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయ’’ని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు -
ఒక్కరికే 36 యావజ్జీవాలు.. లండన్‌లో భారత సంతతి జడ్జి తీర్పు!
లండన్: అత్యాచారం కేసుల్లో నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ బాబీ చీమా–గ్రప్ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడలో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో సంచలనాత్మకంగా మారింది. మెట్రోపాలిటన్ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్ కారిక్(48) 2003 నుంచి 2020 దాకా.. 17 ఏళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని దారుణంగా హింసించాడు. అతడు 49 నేరాలకు పాల్పడినట్లు తేలింది. నేరాలన్నీ నిరూపితమయ్యాయి. లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ మంగళవారం తీర్పు ప్రకటించారు. దోషికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు జైల్లో ఉండాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు. -
మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై ఈనెల 10న(శుక్రవారం) విచారణ జరుపుతామని చెప్పారు. విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు -
స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్. ‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్ కే పటేల్. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్లో హౌస్‌కీపింగ్ జాబ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్. ‘టెక్సాస్‌లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్ -
కటకటాల రాథోడ్.. అప్పుడు షూ.. ఇప్పుడు రాయి!
క్రైమ్: నేరస్తుల్లో మార్పు రావాలనే శిక్షలు విధిస్తుంది న్యాయస్థానం. కానీ, మార్పు రాకపోగా మరింత మూర్ఖంగా తయారయ్యే వాళ్లు లేకపోలేదు. అలాంటోడే ధర్మేష్ రాథోడ్. అటెంప్ట్ టూ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ధర్మేష్ రాథోడ్ అనే ఖైదీ.. శుక్రవారం గుజరాత్ నవ్‌సరి కోర్టులో సెషన్స్ జడ్జి మీదకు రాయిని విసిరాడు. అదృష్టం కొద్ది జడ్జి ఏఆర దేశాయ్ పక్కకు తప్పుకోవడంతో ఆ రాయి వెనకాల ఉన్న గోడను తాకింది. అంత రాయి అతనికి దగ్గరకు ఎలా వచ్చిందని దర్యాప్తు చేపట్టిన పోలీస్ శాఖ.. అతనిని కోర్టుకు తీసుకెళ్లిన లాజ్‌పోర్ జైలులోని ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక జడ్జి మీదకు రాయి విసిరి దాడి చేయాలనుకున్న నేరానికి రాథోడ్‌పై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రాథోడ్ ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడట. ఓ న్యాయమూర్తిపైకి ఏకంగా షూని విసిరాడట. దీంతో అతన్ని ఆ తర్వాత కాలి కాళ్లతో కోర్టుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహారించాలని పోలీసులను పలువురు న్యాయవాదలు సూచిస్తున్నారు. -
అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి
ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్‌గా జోయితా మోండల్ నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం. (చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
Bilkis Bano Case: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్ అజయ్ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేశారు బిల్కిస్ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్ -
భార్యను చంపేశా! అంటూ స్నేహితుడికి వాయిస్ మెయిల్..షాక్‌లో పోలీసులు
ఏమైందో ఏమో ఒక మహిళా జడ్జి, ఆమె భర్త, వారి పెంపుడు జంతువులతో సహా ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన న్యూమెక్సికోలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బెర్నాలిల్లో కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు(పోలీసులు) అల్బుకెర్కీలోని రాంచిటోస్ రోడ్లో ఉన్న ఆ జడ్జీ ఇంటి వద్దకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్లు తాము పనికి వచ్చేటప్పటికే ఆ భార్యభర్తలిద్దరు, వారి పెంపుడు జంతువులు చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ లాస్ రాంచోస్ మున్సిపల్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న 65 ఏళ్ల డయాన్ ఆల్బర్ట్‌గా గుర్తించారు. ఐతే పోలీసులు జడ్జీ భర్త ఎరిక్ పింక్‌టరన్ తన భార్య ఆల్బర్ట్తోపాటు వారి పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పింక్‌టరన్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే బాధితుడు పింక్‌టరన్ తన స్నేహితుడుకి తన భార్యను పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపినట్లు వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మెయిల్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి అతను కౌంటీ షరీఫ్ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. శవాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో..) -
'నేను 'గే' అయినందు వల్లే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు'
సీనియర్ న్యాయవాది సౌర్‌భ్ కిర్పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వలింగ సంపర్కుడు(గే) అయినందు వల్లే జడ్జిగా పదోన్నతి కల్పించడం లేదని పేర్కొన్నారు. న్యాయమూర్తల నియామక ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిన నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి సౌరభ్ కిర్పాల్ 2017లోనే జడ్జి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జిగా పదోన్నతి లభించకపోవడానికి తన లైంగిక ధోరణే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సౌరభ్ కిర్పాల్ పేర్కొన్నారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సుముఖంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్ -
హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు
లక్నో: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్ సింగ్ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్ డ్యూటీ పడింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యి పోలీస్ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. (చదవండి: స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్) -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా
సాక్షి, న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ సహా 29 మంది న్యాయమూర్తులున్నారు. గరిష్ట సంఖ్య 34. కోల్‌కతాకు చెందిన జస్టిస్ దత్తా 1965లో జన్మించారు. 1989లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. పలు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేశారు. రాజ్యాంగపరమైన, సివిల్ కేసులు వాదించడంలో దిట్టగాపేరొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదిగా పనిచేశారు. 2006లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. -
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
అమెరికాలో అపీల్స్ కోర్టు జడ్జిగా రూపాలీ దేశాయ్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జడ్జి రూపాలీ హెచ్.దేశాయ్ చరిత్ర సృష్టించారు. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన నైన్త్ సర్క్యూట్ అపీల్స్ కోర్ట్ జడ్జిగా నియమితురాలయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి జడ్జి ఆమే. 44 ఏళ్ల రూపాలీ నియామకానికి సెనేట్ 67–29 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన రూపాలీ నామినేషన్‌కు భారీ మద్దతు లభించడం ఆశ్చర్యం కలిగించలేదని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ చైర్పర్సన్ డిక్ డర్బిన్ కొనియాడారు. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేసే నైన్త్ సర్క్యూట్ అమెరికాలోని 13 పవర్ఫుల్ అపీల్ కోర్టుల్లో అతి పెద్దది. 9 రాష్ట్రాలు, 2 ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. రూపాలీ 1978లో కెనడాలో జన్మించారు. అమెరికాలో న్యాయవాదిగా, న్యాయ నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం ఆమె సొంతం. అరిజోనా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌చేశారు. మెరిట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. 2007 నుంచి కాపర్స్మిత్ బ్రోకెల్‌మన్ లా సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. 2021లో కీలకమైన అమెరికన్ లా ఇన్స్టిట్యూట్లో మెంబర్‌గా చేరారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా రాష్ట్రంలో జో బైడెన్ గెలుపును సవాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వేసిన కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమర్థంగా వాదనలు విన్పించి ఆకట్టుకున్నారు. -
హైకోర్టు జడ్జిగా సీవీ భాస్కర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలోని మొదటి కోర్టు హాల్లో గురువారం ఉదయం ఆయనతో సీజే జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయ మూర్తులు, న్యాయాధికారులు హాజరయ్యారు. తొలిరోజు సీజేతో కలసి మొదటి కోర్టు హాల్లో విధులు నిర్వహించారు. జస్టిస్ చాడ విజయభాస్కర్‌రెడ్డి ప్రమాణంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. అలాగే.. సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఆ తర్వాత కూడా మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. -
ఏసీబీ అవినీతిపై ఆరోపణలు.. హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అనేది కలెక్షన్ సెంటర్‌గా మారిందని, అదో అవినీతి కూపమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఆరోపించడం వల్ల తనకు బదిలీ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసం బదిలీ బెదరింపును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. 2021 మేలో రూ.5 లక్షల లంచంతీసుకుంటూ అరెస్టయిన బెంగళూరు అర్బన్ కలెక్టరేట్లోని డిప్యూటీ తహశీల్దార్ పీ.ఎస్.మహేశ్ సమర్పించిన బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ హెచ్.పీ.సందేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఏసీబీలో అక్రమాలను ప్రశ్నించినందుకు నాకు బదిలీ బెదిరింపు వచ్చాయి. గతంలో కూడా ఓ న్యాయమూర్తి ఇలా బదిలీ అయ్యారు. నాకు ఎవరైనా భయం లేదు. పిల్లికి గంట కట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. జడ్జి అయిన తరువాత ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను రైతు కొడుకును. ఎలా జీవించాలో నాకు తెలుసు. 50 రూపాయలతో బతకగలను. అలాగే రూ.50 వేలతోనూ జీవించడం తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. రాజ్యాంగానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఏ పార్టీకి లొంగను’ అని స్పష్టం చేశారు. చదవండి: కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! జడ్జి లకే భద్రత లేదు ఎస్ఐ నియామక అక్రమాలకు సంబంధించి ఏడీజీపీ అరెస్ట్ అయినే నేపథ్యంలో హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రను సస్పెండ్ చేయాలని, సీఎం బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కళంకం వచ్చిందని, న్యాయ వ్యవస్థకు భద్రత లేని పరిస్థితి ఉద్భవించిందన్నారు. సోమవారం ప్రభుత్వ అధికారులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అధికారి అరెస్ట్ అయిన అర్ధ గంటలో ఆరోగ్య పరీక్షలకు పంపించారు. అంత త్వరగా విచారణ పూర్తి చేసింది ఎందుకు? అని అన్నారు. కుంభకోణానికి బాధ్యత వహించి సీఎం, హోంమంత్రి తప్పుకోవాలన్నారు. యడ్డి కొడుకుపై ఆరోపణలు మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మంత్రి అశ్వత్థ్ నారాయణ పీఎస్ఐ అక్రమ నియామకాల్లో ప్రమేయముందని, వీరిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిని బెదరించారని, బదిలీ చేస్తామని భయపెట్టారని, న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఏసీబీ కలెక్షన్ బ్యూరో అయిందని విమర్శించారు. -
కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా?
బెంగళూరు: కోర్టు హాల్లో జడ్జి ముందు.. అదీ వాదనలు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్లంతా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందునా ప్రత్యేకించి.. అక్కడున్నవాళ్లను సైలెంట్‌గా ఉండాలని, జడ్జి ముందు హుందాగా వ్యవహరించాలని బంట్రోతు మధ్యమధ్యలో వారిస్తుంటాడు కూడా. అయితే.. కోర్టు హాల్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నిజంగా తప్పా? అలా కూర్చోవడంపై నిషేధం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది ఇప్పుడు. అయితే అలాంటి నిబంధనేది కోర్టు మార్గదర్శకాల్లో లేదని ఆర్టీఐ ద్వారా సమాధానం వచ్చింది. కర్ణాటక హలసూర్‌కు చెందిన నరసింహా మూర్తి అనే వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా దీని గురించి వివరణ కోరారు. దీనిపై హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ బదులిస్తూ.. కోర్టు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ, నోటిఫికేషన్లుగానీ, సూచనలుగానీ.. కాలు మీద కాలేసుకోవడం సరికాదని, దానిపై నిషేధం ఉందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టత ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఎక్కడైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ప్రత్యేకించి మార్గదర్శకాలు ఉంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంతే!. గంటల తరబడి అలా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నరసింహా మూర్తి.. ఆ ఆర్టీఐ పిటిషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. -
జడ్జి ముందు సికింద్రాబాద్ ఆందోళనకారులు
-
సిప్పీ సిద్ధూ హత్య కేసు.. ఏడేళ్లకు ప్రొఫెసర్ కళ్యాణి అరెస్ట్
చండీగఢ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. నేషనల్ లెవల్ షూటర్ సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ(35) 2015, సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్ మాత్రమే కాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. పైగా ఛండీగఢ్ మాజీ సీజే ఎస్ఎస్ సిద్ధూ మనవడు. రిలేషన్షిప్ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్ సెక్టార్ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు. జాతీయ షూటర్, పైగా హైఫ్రొఫైల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు.. పంజాబ్ గవర్నర్ జోక్యంతో.. 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందించిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది సీబీఐ. అంతేకాదు.. సిప్పీ హత్య జరిగిన సమయంలో ఓ యువతి అతనితో ఉందని, ఆమె ఎవరో ముందుకు వస్తే.. ఆమెను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందని, లేకుంటే.. ఆమెకు కూడా హత్యలో భాగం ఉందని భావించాల్సి ఉంటుందని ఏకంగా సీబీఐ ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది కూడా. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఇది అతని ప్రేయసి కళ్యాణి చేయించిన హత్యేనని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది. మరోవైపు 2021లో ఈ కేసులో నజరానాను ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచింది సీబీఐ. ఇక 2020లో సిప్పీతో ఉన్న మహిళను గుర్తించలేకపోయామని కోర్టు తెలిపి.. కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. కళ్యాణి సింగ్‌ను కూలంకశంగా ప్రశ్నించిన తర్వాతే.. అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆపై ప్రత్యేక న్యాయమూర్తి సుఖ్‌దేవ్ సింగ్ ఎదుట ఆమెను హాజరుపరిచి.. నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది సీబీఐ. (చదవండి: స్కూల్స్‌లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్.. టెన్షన్లో అధికారులు) -
సామాజిక న్యాయం దిశలో మైలు రాళ్లు!
న్యాయవ్యవస్థలో ఆణిముత్యం జస్టిస్ లావు నాగేశ్వరరావు. ‘‘ఈ దేశంలో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రం రాలేదు. కులం, మతం పేరుతో విభజన ఉంటే స్వాతంత్య్రం రానట్లే...’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జూన్ 7న పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు. సామాజిక న్యాయం దిశగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. మూడు దశాబ్దాల పాటు న్యాయవాదిగా సేవలందిం చిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పని చేయకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని అందుకున్న అతికొద్ది మందిలో ఒకరు. ఇది ఆయన ప్రతిభా విశేషాలకు తార్కాణం. ఇలా సుప్రీం న్యాయమూర్తిగా మారే గౌరవం అందుకున్న తొలి తొలుగువాడు కూడా ఆయనే. గుంటూరు జిల్లా, పెద నందిపాడు ఆయన స్వగ్రామం. ఒక సామాన్య రైతు కుటుం బంలో జన్మించారు. గుంటూరు ‘ఏసీ కాలేజీ ఆఫ్ లా’లో న్యాయవాద పట్టా అందుకున్నారు. పలు హిందీ సినిమాల్లో నటించారు. క్రికెట్, గోల్ఫ్ క్రీడల్లో ప్రావీణ్యముంది. 1982లో గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిం చారు. తర్వాత తన ప్రాక్టీస్‌ను ఏపీ హైకోర్టుకు మార్చారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టారు. అన్ని దశల్లోనూ ఆయన తన ప్రతిభను నిరూపించు కున్నారు. 2000వ సంవత్సరంలో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత తరఫున వాదించి ఆమెపై కోర్టు అన్ని ఆరోపణలను కొట్టేసేలా చేశారు. బీసీసీఐలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను విచారించేందుకు సుప్రీం నియమించిన ‘ముద్గల్ కమిటీ’లో ఆయన సభ్యులు. రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే విషయంలో ఎన్నికల కమిషన్ అధికార పరిధికి సంబంధిం చిన కేసును వాదించారు. ఆయన ప్రతిభను గుర్తించి యూపీఏ ప్రభుత్వం 2003–2004లోనూ, ఎన్డీఏ ప్రభుత్వం 2013–14లోనూ ‘అదనపు సొలిసిటర్ జనరల్’గా నియమించుకొని ఆయన సేవలు పొందాయి. 34 ఏళ్లపాటు లా ప్రాక్టీసు చేసిన ఆయన దేశంలో అత్య ధికంగా ఆర్జించే న్యాయవాదిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా వచ్చిన అభ్యర్థనను ఆయన ఒకసారి నిరాకరించారు. రెండో సారి ఆ ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చేస్తే కాదనలేకపోయారు. గత ఆరేళ్లలో ఆయన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ న్యాయపరిధికి సంబంధించి అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. ‘బలవంతపు వాక్సినేషన్’ ప్రైవసీ హక్కుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షపడ్డ ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయమని ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చారు. న్యాయమూర్తిగా ఆయన 552 బెంచ్‌లలో విచారణలో పాల్గొని 163 కీలక తీర్పులు వెలువరించారు. మద్రాస్ బార్ అసోసి యషన్ కేసులో తీర్పునివ్వడం ద్వారా దేశంలో ‘ట్రిబ్యునల్’ వ్యవస్థను పునర్నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కు తుంది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన రాజద్రోహం కాదని ఆయన ‘సోలీ సోరాబ్జీ స్మారకో పన్యాసం’లో స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి ఐపీసీలో సంబంధిత సెక్షన్లను సవరించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ జోక్యం సరైంది కాదని పేర్కొన్నారు. (క్లిక్: వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?) జస్టిస్ నాగేశ్వరరావు తన గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు చాలా ప్రేమ. కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని విశాఖపట్టణంలో ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ 14వ వార్షిక పురస్కార సభలో అన్నారు. ఎన్నో ఉన్నత భావాలు కలిగిన జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయవ్యవస్థకు తీరని లోటు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ‘అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రా’నికి ఆధిపత్యం వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన ఆధ్వర్యంలో ఈ కేంద్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూన్ 7న జస్టిస్ లావు నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా...) -
అరకులో న్యాయమూర్తి పెళ్లి వేడుక
సాక్షి, పాడేరు (ఏఎస్ఆర్ జిల్లా): గిరిజన సంప్రదాయంలో ఓ పెళ్లి వేడుక. వరుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. వధువు ఆయన శ్రీమతి. చుట్టూ న్యాయమూర్తులు. గిరిజనులే పెళ్లి పెద్దలు. చట్టాలను ఔపోసన పట్టి, వేలాది కేసుల్లో ప్రతిభావవంతమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి, ఆయన శ్రీమతి ఆ గిరిజనుల ముందు సిగ్గుమొగ్గలయ్యారు. గిరిజన సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో మెరిసారు. మరోసారి పెళ్లి పీటలెక్కి ఒద్దికగా కూర్చున్నారు. గిరిజన పూజారులు న్యాయమూర్తి దంపతులకు గిరిజన ఆచారం ప్రకారం మరోసారి వైభవంగా వివాహం చేశారు. అలనాటి వివాహ వేడుకను గురుు తెచ్చుకుంటూ న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టి మురిసిపోయారు. దండలు మార్చుకొని సంబరపడ్డారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పెదలబుడు గ్రామంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, అమితా ఉదయ్ దంపతుల గిరిజన సంప్రదాయ వివాహ వేడుక అలరించింది. ఈ వేడుకలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, సుచితా మిశ్రా దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాహ్, జీబా అమానుల్లాహ్ దంపతులు, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్, నల్సా డైరెక్టర్ పి. శేగల్, పాల్గొన్నారు. వేసవి విడిదిలో భాగంగా జిల్లాలోని అరకు లోయను సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దంపతులు సందర్శించారు. వారితో పాటు జిల్లా న్యాయమూర్తులు రైలు మార్గంలో అరకు లోయ చేరుకున్నారు. వారికి రైల్వే స్టేషన్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తులు పెదలబుడు గ్రామంలోని ఐటీడీఏ ఎకో టూరిజం ప్రాజెక్టు గిరి గ్రామదర్శినిని సందర్శించి గ్రామ దేవతలకు పూజలు చేశారు. -
కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం క్రైం: అనంతపురంలోని తపోవనానికి చెందిన నారాయణస్వామి మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... నగరంలోని ప్రశాంతినగర్‌కు చెందిన జి.ఆదినారాయణకు బళ్లారి బైపాస్ ప్రాంతంలో స్థలం ఉంది. ఈ స్థలంలోని షెడ్డులో నారాయణస్వామి కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. గత నెల 5న షెడ్డు వద్ద నారాయణస్వామి, కుటుంబసభ్యులు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో ఆదినారాయణ, అతని కుమారుడు నవీన్‌కుమార్ అక్కడికెళ్లారు. షాపు ఖాళీ చేసి తీరాలంటూ గట్టిగా హెచ్చరించారు. ఆ సమయంలో నవీన్‌కుమార్‌పై నారాయణస్వామి కుమారుడు పవన్ దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణస్వామి, ఆయన భార్య అంజినమ్మ, కుమారుడు పవన్‌పై ఐపీసీ 324 సెక్షన్ కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఊండ్ సర్టిఫికెట్ ఆధారంగా మరో సెక్షన్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయంగా విచారణకు స్టేషన్‌కు రావాలని నిందితులకు సూచించారు. అప్పటి నుంచి నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం ఉదయం కోర్టు ఆవరణలో నారాయణస్వామి, అంజినమ్మ ప్రత్యక్షమయ్యారు. నారాయణస్వామి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి జడ్జి ఓంకార్ ముందుకెళ్లి రూరల్ పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయాడు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి ఆదేశాల మేరకు.. కోర్టు సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై నారాయణస్వామిని ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి) -
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన గేదెల తుషార్‌రావు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. తుషార్‌రావు తండ్రి నారాయణరావు (దాసునాయుడు) ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన సుప్రీంకోర్డు న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాది కుటుంబంలో పుట్టిన తుషార్‌రావు ఇన్నాళ్లూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ జడ్జిగా నియామకమయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం రావడం గర్వంగా ఉందని వీరఘట్టం జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, ఆయన మేనల్లుడు ధనుకోటి శ్రీధర్ పేర్కొన్నారు. (చదవండి: అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్) -
స్టెనో నుంచి న్యాయమూర్తిగా.. ఆమె జర్నీ సాగిందిలా..
సాక్షి,విశాఖ లీగల్: నగరంలోని 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న సాయి సుధ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన ఆమె హైస్కూలు విద్యను తాటిపూడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పూర్తి చేశారు. ఎన్వీపీ న్యాయ కాలేజీలో న్యాయశాస్తంలో పట్టా తీసుకున్నారు. అనంతరం కోర్టులో స్టెనోగా విధుల్లో చేరారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తి పరీక్షల్లో సాయి సుధ ప్రతిభ చాటారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉన్నారని ఆమె చెప్పారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, ఇతర న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు, సీనియర్ న్యాయవాది గోలి శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి! -
అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్ ... ఊహించని షాక్‌లో రష్యా
Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. యూటర్న్ తీసుకున్న భారత న్యాయమూర్తి అయితే భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్ తగిలింది. (చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి) -
రెండురోజులు జైళ్లోనే హీరో.. అనుచిత ట్వీట్ ఎఫెక్ట్
హిజాబ్ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. కన్నడనాట హిజాబ్ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ. సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని తెలిపింది. చేతన్ చేసిన ట్వీట్‌గా వైరల్ అవుతోంది ఇదే అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్ అరెస్ట్ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్ వ్యవహారం హిజాబ్ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అరెస్ట్‌ను.. హిజాబ్‌కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా. -
బాధిత మహిళలకు అండగా..
దీర్ఘకాలమే పట్టినా నిరాదరణకు గురైన మహిళా న్యాయమూర్తికి న్యాయం దక్కింది. మధ్యప్రదేశ్‌లో జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తూ ఎనిమిదేళ్ల క్రితం రాజీనామా చేయాల్సివచ్చినామెకు సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం అసాధారణమైన తీర్పు వెలువరించింది. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా విషయ పరిశీలన చేయాలో, బాధితులపట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే అర్థమవుతుంది. మన వ్యవస్థలన్నిటా ప్రచ్ఛన్నంగా అలుముకున్న పురుషాధిక్య భావజాలాన్ని ఈ తీర్పు సరిదిద్దగలిగితే లింగ వివక్ష అంతానికి అది నిస్సందేహంగా దోహదపడుతుంది. లింగ వివక్ష, వేధింపులు కొత్తేమీ కాదు... అన్నిచోట్లా అవి దర్శనమిస్తూనే ఉంటాయి. కాకపోతే న్యాయదేవత కొలువుదీరే పవిత్రస్థలం కూడా వీటికి మినహాయింపు కాదన్న చేదు నిజమే అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారనీ, లైంగికంగా వేధిస్తున్నారనీ అప్పట్లో మహిళా న్యాయమూర్తి ఆరోపించారు. అభ్యంతరం చెప్పినం దుకు ఇబ్బందులపాలు చేస్తున్నారని అక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. కానీ ఆ కష్టాలు తొలగిపోలేదు సరిగదా ఆమెను గ్వాలియర్ జిల్లానుంచి దూర ప్రాంతానికి బదిలీచేశారు. ఎనిమిది నెలల్లో తన కుమార్తె చదువు పూర్తవుతుందనీ, అప్పటివరకూ బదిలీ ఆపాలనీ, లేదంటే సమీపంలోని నాలుగు నగరాల్లో ఎక్కడికి వెళ్లమన్నా వెళ్తాననీ విజ్ఞప్తిచేశారు. బదిలీ విధానంలోని నిబంధనలు సరిగా పాటించకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదంతా అరణ్యరోదనే అయింది. దాంతో విధిలేక ఆమె 2014 జూలైలో ఉద్యోగంనుంచి నిష్క్రమించారు. ఆ మహిళా న్యాయమూర్తి ఉదంతానికి ముందూ, తర్వాతా కూడా న్యాయవ్యవస్థలో వేధింపుల ఆరోపణలు వినబడ్డాయి. ఆ కేసులు చివరికెలా ముగిశాయన్న సంగతి అలా ఉంచితే, ప్రస్తుత కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ పదిహేనేళ్లపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగి, జిల్లా అద నపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నవారు. పైగా లైంగిక వేధింపుల కేసుల్ని పరిశీలించే జిల్లా స్థాయి ‘విశాఖ కమిటీ’ చైర్పర్సన్. అలాంటి బాధ్యతల్లో ఉన్నామె తానే నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొనే దుస్థితిలో పడితే ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారా? దీర్ఘకాలం భాగస్వామిగా ఉన్న వ్యవస్థే తనకు అన్యాయం చేసిందంటే తట్టుకోగలుగుతారా? ఫిర్యాదును లోతుగా పరిశీలించి ఉంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదిలోనే సమస్యను చక్కదిద్దగలిగేది. కానీ జరిగిందంతా వేరు. ఆమె పని తీరు ప్రశంసనీయంగా ఉన్నదంటూ అంతకు ఏడాది ముందు ‘వెరీ గుడ్’ గ్రేడ్ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానమే ఏకపక్షంగా బదిలీ చేసింది. బదిలీ సంగతలా ఉంచితే ఆ తర్వాత చకచకా జరిగిన పరిణామాలు సర్వోన్నత న్యాయస్థానానికి ఆశ్చర్యం కలిగించాయి. వేధింపుల గురించి వివరించడానికి వ్యక్తిగతంగా కలుస్తానన్న ఆమె చేసిన వినతిని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ తోసిపుచ్చారు. పైగా ఉద్యోగానికి రాజీనామా చేస్తే కేవలం రెండు రోజుల్లోనే ఆమోదించారు. ఇదంతా ఒక ఎత్తయితే అదే ఏడాది ఆగస్టు 1న ఆమెనుంచి తమకందిన లేఖపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరినప్పుడు వ్యవహరిం చిన తీరు మరో ఎత్తు. ఇద్దరు న్యాయమూర్తులతో ఏర్పాటుచేసిన కమిటీలో తనకు న్యాయం దక్కే అవకాశంలేదని ఆమె మొరపెట్టుకున్నా హైకోర్టు వినలేదు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా ఓ కమిటీని నియమించారు. అయితే ఆమె ఎదుర్కొన్న వేధింపులకు సరైన సాక్ష్యాలు లేవని ఆ కమిటీ తేల్చింది. నిజమే... ‘నీ పనితీరు బాగుంది. అంతకన్నా నీ అందం మరింత బాగుంది’ అని ఒక శుభకార్యంలో న్యాయమూర్తి అంటే అందుకు సాక్ష్యం ఏముంటుంది? ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఎవరూ లేనప్పుడు కోరితే... ‘ఐటెమ్ సాంగ్’కు నృత్యం చేయమని ఒక న్యాయమూర్తి భార్య ద్వారా కబురుపెడితే... ఎవరిస్తారు సాక్ష్యం? ఆమెకు అటెండ ర్ని ఇవ్వకపోవడం, స్టెనోగ్రాఫర్ సదుపాయం నిరాకరించడం వేధింపులుగా గుర్తించేదెవరు? చివరకు 2015 మార్చిలో రాజ్యసభ నియమించిన న్యాయమూర్తుల కమిటీ కూడా వాటిని పసిగట్ట లేకపోయింది. బదిలీలో మానవీయతా కోణం లోపించిందని మాత్రం గుర్తించింది. ఆమె తిరిగి సర్వీసులోకి వస్తానంటే అందుకు అవకాశమీయాలని సిఫార్సు చేసింది. అయినా మధ్యప్రదేశ్ హైకోర్టు తీరు మారలేదు. సర్వీస్‌లో చేరతానన్న ఆమె విన్నపాన్ని 2017, 2018ల్లో తోసిపుచ్చింది. మరోసారి పునఃపరిశీలించాలని, పోస్టులు ఖాళీ లేకపోతే వేరే రాష్ట్రానికైనా బదిలీ చేయాలని 2019లో సుప్రీంకోర్టు కోరినా ఫలితం లేదు. చివరకు ఇన్నేళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కింది. తీర్పులిచ్చే స్థానంలో ఉన్న మహిళలు కూడా వేధింపులకు అతీతం కారన్న భావన అందరినీ అభద్రతలోకి నెడుతుంది. దీన్ని తన స్థాయిలోనే హైకోర్టు గమనించుకోగలిగితే ఆ మహిళా న్యాయమూర్తికి న్యాయం దక్కడంతోపాటు అన్ని వ్యవస్థల్లోనూ చొరబడ్డ దుశ్శాసనులకు అదొక హెచ్చరికగా ఉండేది. కానీ అందుకు సర్వోన్నత న్యాయస్థానం పూనుకోవాల్సివచ్చింది. ఈ తీర్పు బాధిత మహిళలకు ధైర్యాన్నిస్తుందనడంలో... వేధింపుల కేసుల పరిష్కారంలో వ్యవస్థల కుండాల్సిన పవిత్ర బాధ్యతను గుర్తుచేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. -
ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా
Mouni Roy Return To Small Screen After 5 Years As A Judge: బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌని రాయ్ హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన గ్రామరస్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హిందీ సీరియల్స్‌లో నటించిన తర్వాత ఆమెకు వరుసగా బీటౌన్ మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గోల్డ్, రాజ్ కుమార్ రావుకు జంటగా మేడ్ ఇన్ చైనాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న మౌని.. సుమారు ఐదేళ్ల తర్వతా మళ్లీ బుల్లితెరపైన సందడి చేయనుంది. ఆమె తొలిసారిగా నటనను ప్రారంభించిన వేదికపైకి మళ్లీ వెళ్లనుంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ షోలలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' ఒకటి. ఈ షో ఐదో సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది మౌని రాయ్. ఈ విషయం గురించి మౌని మాట్లాడుతూ 'నాకు డ్యాన్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. వివిధ కళారూపాల సమ్మేళనం. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోకు న్యాయనిర్ణేతగా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై చిన్న పిల్లల ప్రతిభను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.' అని తెలిపింది. 'క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ', 'దేవోన్ కీ దేవ్.. మహాదేవ్' సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ 'నాగిన్'తో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇదీ చదవండి: తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని -
నేరస్తుడితో లిప్‌లాక్ చేసిన మహిళా న్యాయమూర్తి.. వీడియో వైరల్
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య చిగురిస్తుందో చెప్పలేం. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను పెనవేస్తోంది. అయితే అందరి ప్రేమలు విజయవంతంగా ముగియవు.. కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయాయి. సాధారణంగా స్నేహితులు, క్లాస్‌మెట్స్, సహోద్యోగులిద్దరూ ప్రేమలో పడటం చూశాం. కానీ న్యాయమూర్తి, నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొంచెం వింతగా నిజంగానే ఇది జరిగింది. ఒక మహిళా న్యాయమూర్తి ఏకంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది. దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే ఖైదీ న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది: చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. 2009లో పోలీస్ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్లో మారియల్ భాగం. బస్టోస్‌కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తి ఆమె. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్ VIDEO DOCUMENTO. AMIGOS ARGENTINA TOCO FONDO. JUEZA QUE INTEGRO TRIBUNAL QUE CONDENO A PERPETUA AL ASESINO DE UN POLICIA EN CHUBUT, FUE HACERLE MATE Y MIMOS A LA PRISION AL CONDENADO. FUE SUMARIADA. LA JUEZA SE LLAMA, MARIEL ALEJANDRA SUAREZ. pic.twitter.com/Gf07UEIA1H — MARCELO FAVA (@MARCELOFAVAOK) January 4, 2022 -
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ న్యాయమూర్తులంతా గత మంగళవారం.. జస్టిస్ సుభాషన్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ తర్వాత ఆయనకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తిపై సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి మొత్తం 32 జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సుప్రీంలో వారానికి మూడు రోజులు మాత్రమే వర్చువల్ మోడ్‌లో కేసుల విచారణ జరుగుతుంది. పార్లమెంట్లో నిర్వహించిన ర్యాండమ్ టెస్టుల్లో కూడా 400 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో సెక్రటేరియట్ స్టాఫ్‌తోపాటు సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదు కాగా..327 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 5 లక్షల 90 వేల 611 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పెరిగింది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3623కు చేరింది. చదవండి: ‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’ -
బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్లోనే చేదు అనుభవం ఎదురైంది. జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. Special POCSO Judge P.S. Kala ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం. ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం. -
మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి
బెర్లిన్: పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో పరితపిస్తుంటారు. ఒకవేళ ఏదైన సమస్యలుంటే.. వారు ఆసుపత్రుల చుట్టు.. ఆలయాల చుట్టు తిరుగుతుంటారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తాయి. ఒకవేళ పిల్లలకు ఏదైన ఆపద సంభవిస్తే.. తమ ప్రాణాలను కూడా లెక్కచేయవు. ప్రస్తుతం క్షణికావేశంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిన్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. జర్మనీలో కూడా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళ, తన భర్తతోపాటు కలిసి జీవిస్తుంది. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ క్రమంలో.. ఒక రోజు తన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో.. విచక్షణను కోల్పోయి తన ఇంట్లో ఉన్న బాత్‌టబ్‌లో ఐదుగురు పిల్లలను ముంచి ఊపిరాడకుండాచేసి అతి క్రూరంగా హత్యచేసింది. చనిపోయిన పిల్లలంతా.. 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసులోపు వారున్నారు. సంఘటన జరిగినప్పుడు.. తన భర్త, పెద్దకొడుకు లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ.. ట్రైన్‌ఎదుట వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారించిన ఆమెను జీవితఖైదు విధిస్తు జడ్జి తీర్పునిచ్చారు. తాజాగా, ఆమె తరపు న్యాయవాది.. నిందితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని ఆమెకు బెయిల్ ఇవ్వాలని, శిక్షాకాలాన్ని 8 సంవత్సరాలకు తగ్గించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా అమానుషమని, అరుదైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత.. నిందితురాలు భర్తకు.. ఇకమీదట నీవు నా పిల్లలను చూడలేవని మెసెజ్ చేసింది. దీని అర్థం ఏంటని ప్రశ్నించారు?.. అదే విధంగా నిందితురాలి మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యుడిని నియమించారు. అతను.. ఆమెను విచారించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని , ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడంలేదని కోర్టు వారికి తెలిపారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరును న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. -
జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ
రాంచీ: సంచలనంగా మారిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారన్ని అందించిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. హత్య, కుట్ర వివరాలు ఎవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని తెలియజేసిన వారికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పేర్కొంది. గత నెల 28న ఉదయం 5గంటల సమయంలో రోడ్డు పక్కన జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఓ టెంపో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాపు చేసి.. ఆ టెంపో వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటో తీసుకున్న సూప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత
హబ్సిగూడ/రాయదుర్గం/సాక్షి,న్యూఢిల్లీ: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు(60) గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేశవరావు పార్థివదేహానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, లోకాయుక్త జస్టిస్ బీఎస్ రాములు, జస్టిస్ ఎంఎస్ రాంచందర్‌రావు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ సోమయాజులు, జస్టిస్ గంగారావు, జస్టిస్ విజయలక్ష్మి నివాళులు అర్పించారు. జస్టిస్ కేశవరావు మృతితో హైకోర్టు, జిల్లాల్లోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌కు సోమవారం సెలవు ప్రకటించారు. నీతినిజాయితీలకు మారుపేరు.. జస్టిస్ కేశవరావు వరంగల్ జిల్లా పెండ్యాల గ్రామంలో 1961 మార్చి 29న జన్మించారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొం దారు. 1986లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అనంతరం కొంతకాలంపాటు వరంగల్‌లో న్యాయవాదిగా పనిచేసి 1991 నుంచి హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2010 నుంచి 2016 వరకు సీబీఐ కేసుల్లో వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2015లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక సంచలన కేసులలో తీర్పులు ఇచ్చిన ఆయన.. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంతాపం జస్టిస్ పి.కేశవరావు మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్టిస్ కేశవరావు మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన శ్రద్ధ, కరుణ కలిగిన న్యాయమూర్తి. 35 ఏళ్ల సుదీర్ఘ లీగల్ ప్రొఫెషన్లో విశేష సేవలందించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం సంతాప సందేశంలో పేర్కొన్నారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య జస్టిస్ కేశవరావు అంతిమయాత్ర నగరంలోని ఆయన ఇంటి నుంచి రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానం వరకు కొనసాగింది. అక్కడే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారులు నిషాంతరావు, సిద్ధార్థరావు, తండ్రి ప్రకాశ్‌రావు, సోదరుడు నర్సింహారావు సమక్షంలో పోలీసులు గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. అంత్యక్రియల్లో హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ అమర్నాథ్గౌడ్, జస్టిస్ నవీన్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. గవర్నర్ దిగ్భ్రాంతి, సీఎం సంతాపం జస్టిస్ పి.కేశవరావు అకాల మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో దేశం, ప్రత్యేకంగా తెలంగాణ గొప్ప న్యాయ కోవిదుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ పి.కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. -
న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదు: సీజేఐ రమణ
-
జార్ఖండ్ జడ్జి హత్య కేసు: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్ దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడంలేదని, పట్టించుకోవడం లేదని చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్వీ రమణ ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు. కాగా ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం జార్ఖండ్ డీజీపీనుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి..
సాక్షి, పెద్దవూర(నల్లగొండ): మండలంలోని ఏనెమీది తండాకు చెందిన మూడవత్ హిమబిందు శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో జడ్జిగా ఎంపికైంది. పట్టుదలతో చదివితే సాధించలేనిదంటూ ఏమీ లేదని గిరిజన బిడ్డ నిరూపింంది. ఆమె కటిక పేదరికంలో పుట్టినా ఆమె విజయానికి పేదరికం అడ్డుతగలలేదు. ఆమె 2019లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత హైకోర్టులో బార్ అసోసియేషన్ సభ్యత్వం పొంది ప్రాక్టిస్‌చేసింది. శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో హిమబిందు జడ్జిగా ఎంపికైనట్లు ఆమె మంగళవారం తెలిపారు. హిమబిందు జడ్జిగా ఎంపికవ్వడంపై తల్లిదుండ్రులు, గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
అవును వాళ్లిద్దరు విడిపోయారు.. అధికారికంగా.!
బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ దాంపత్య జీవితానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదే ఈ పరిణామం.! 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా మే నెలలో విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత వారి నిర్ణయాన్ని అంగీకరిస్తూ వాషింగ్టన్ కు చెందిన కింగ్ కౌంటీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. దీంతో బిల్ గేట్స్, మెలిందా గేట్స్ బంధానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది. మే నెలలో బిల్‌గేట్స్ - మెలిందాలు తాము విడిపోతున్నట్లు, విడాకుల కోసం కింగ్ కౌంటీ కోర్ట్‌ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు. దీంతో వారు విడిపోవడంపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు మరోమారు చర్చకు దారితీశాయి.. అమెరికా చట్టాల ప్రకారం డివోర్స్ కావాలంటే మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంది. అందుకే బిల్‌గేట్స్ దంపతులు విడాకుల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో కింగ్ కౌంటీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. బ్లూం బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం.. విడాకులతో సుమారు 152 బిలియన్ల డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస్తిని ఎలా పంచుకుంటారో తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఫ్రెంచ్ గేట్స్‌కి బదిలీ చేసినట్టు అమెరికన్ మీడియా 'టీఎంజీ' తన కథనంలో పేర్కొంది. ఇక వాషింగ్టన్ న్యాయ నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో ఆస్తులు,ఇతర వ్యవహారాల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో.. విడిపోయే సమయంలో కూడా ఆ నిబంధనలపై కట్టుబడి ఉండాలి. వాటికి లోబడే బిల్‌గేట్స్-మెలిందా గేట్స్ ఆస్తుల్ని పంచుకోవాలని న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ ఆస్తి ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరి ఆస్తి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
17 మంది అరెస్టు..243 మంది నిర్బంధం
ధన్‌బాద్/రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుకు సంబంధించి పోలీసులు 243 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, 17 మందిని అరెస్టు చేశాయి. మరో 250 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎస్పీ సంజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. జడ్జి మృతి ఘటన దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం తదితర కారణాలతో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఏర్పాటైన సిట్ బృందం..వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం దాడులు నిర్వహించి 243 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతోందన్నారు. జిల్లాలోని 53 హోటళ్లలో సోదాలు జరిపి, జడ్జి మృతికి సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టామన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో జడ్జిని ఢీకొట్టిన ఆటోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామంటూ ఆయన..ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్‌లో ఎటువంటి పత్రాలు లేని 250 ఆటోలను పట్టుకున్నట్లు వివరించారు. మృతి ఘటన సీసీ టీవీ ఫుటేజీని బహిర్గత పరిచినందుకు పోలీస్ సబ్ ఎన్స్పెక్టర్ ఆదర్శ్ కుమార్‌ను, ఆటో చోరీ ఫిర్యాదుపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినందుకు గాను పథర్ది పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఉమేశ్ మాంఝిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహాయకుడు రాహుల్ వర్మను అరెస్ట్ చేశారు. కాగా, జడ్జి మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జడ్జి హత్య కేసు సీబీఐకి
రాంచీ: ధన్‌బాద్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు సెవెన్ సీటర్ ఆటోతో ఢీకొట్టి చంపిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని శనివారం సిఫారసు చేశారు. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన 50 ఏళ్ల ఉత్తమ్ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగా వెనకనుంచి ఆటోతో ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
జార్ఖండ్ జడ్జి మృతి: వారంలోగా నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: జార్ఖండ్ జడ్జి మృతి కేసుపై సుప్రీంకోర్టు స్పందించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా.. జార్ఖండ్ ఏజీని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ధన్బాద్లో ఉదయం జాగింగ్‌కు వెళ్లిన డిస్ట్రిక్ట్, 8వ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు ఆటోతో ఢీకొట్టగా.. ఆయన మృతి చెందిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జార్ఖండ్ హైకోర్టు స్పందింది, ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించింది. ఇక ఈ ఘటనను సమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం సీఎస్, డీజీపీని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. -
జాగింగ్ చేస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లిన ఆటో
-
జాగింగ్ చేస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లిన ఆటో..
-
జాగింగ్ చేస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లిన ఆటో..
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఓ జడ్జిని దుండగులు ఆటోతో ఢీకొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో రాష్ట్ర హైకోర్టు స్పందించి, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశించింది. డిస్ట్రిక్ట్, 8వ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ధన్‌బాద్‌లోని తన నివాసం నుంచి జాగింగ్‌కు బయలుదేరారు. అక్కడికి సమీపంలోని రణ్‌ధీర్ వర్మ చౌక్ వద్ద రోడ్డు పక్కన వెళ్తుండగా 7– సీటర్ ఆటో ఒకటి ఆయన్ను వెనక నుంచి ఢీకొని వెళ్లిపోయినట్లు వీడియో పుటేజీల్లో వెల్లడైంది. రక్తపు మడుగులో పడి ఉన్న జడ్జిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ధన్‌బాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అందజేసిన లేఖను రిట్ పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి రంజన్.. సిట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. సిట్ బృందానికి పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ లట్కర్ నేతృత్వం వహిస్తారని డీజీపీ నీరజ్ సిన్హా హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విశ్వాసం వ్యక్తం చేశారని జస్టిస్ రవి రంజన్ పేర్కొన్నారు. కాగా, జడ్జి హత్య ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయంతోపాటు, జడ్జి మృతికి కారణమైన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, జడ్జి ఉత్తమ్ ఆనంద్‌కు నిజాయతీగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇటీవల ఆయన కొందరు గ్యాంగ్స్టర్లకు బెయిల్ నిరాకరించారు. ఈ వ్యవహారంతో ఆయన మృతికి సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉండగా, జడ్జి హత్య ఘటనపై విచారణను జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నందున, ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం అవసరం కాకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ ఘటనను సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా ఆయన ఈ మేరకు స్పందించారు. -
భర్త అరెస్ట్‌తో రియాలిటీ షో నుంచి తప్పుకున్న శిల్పాశెట్టి!
Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్‌కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు హెడ్‌లైన్స్‌గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్ కనిపించడం రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే కరీష్మా కేవలం ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే గెస్ట్‌గా వచ్చారని, ఆమె షో మొత్తానికి కొనసాగరని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో శిల్పా శెట్టి స్థానంలో మరొకరు వస్తారా? లేక ఆమె తిరిగి జడ్జిగా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం రాజ్‌కుంద్రా సహా మిగతా కుటుంబసభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిల్పా బ్రేక్ తీసుకోగా, ఆమె స్థానంలో మలైకా అరోరా జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మరో రియాలిటీ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు శిల్పా శెట్టి ప్రధానపాత్రలో నటించిన 'హంగామా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో శిల్పాకు గడ్డుకాలమనే చెప్పొచ్చంటున్నారు సినీ పెద్దలు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
బెంగాల్ హింస పిటిషన్: అనూహ్యంగా తప్పుకున్న జడ్జి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై బాధితుల తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో నిన్న(శుక్రవారం) ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషన్లో వాదనలు వినాల్సిన జడ్జి తనంతట తానుగా తప్పుకున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ కేసును విచారణ చేపట్టేందుకు నేను సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అందుకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని జస్టిస్ ఇందిరా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆమె బెంగాల్‌కు చెందిన వ్యక్తే. ఇక ఈమె తప్పుకోవడంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బాధితుల కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు మమతా బెనర్జీ సర్కార్ మాత్రం ఇవి రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌గా పేర్కొంటూ కొట్టివేయాలని సుప్రీంను కోరుతోంది. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే ఈ అభ్యర్థనపై సరైన వివరణ ఇవ్వాలని సుప్రీం బెంగాల్ సర్కార్‌ను ఆదేశించింది. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ప్రతీ ఘటనను ఎన్నికల హింసకు ఆపాదించడం సరికాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు గ్యాంగ్ రేప్‌నకు గురైన ఓ దళిత బాలిక, వృద్ధురాలి తరపున ఘటనలపై సిట్ లేదా సీబీఐ విచారణ జరిపించాలనే పిటిషన్ దాఖలు అయ్యాయి. చదవండి: బెంగాల్ హింస ఆగేది ఎన్నడో? -
అమెరికాలో తొలి పాక్–అమెరికన్ జడ్జి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాక్–అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జాహిద్ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. కాగా, ఖురేషీ ఎంపికకు సంబంధించి సెనెట్ 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో ఏకీభవించడం గమనార్హం. దీనిపై సెనెటర్ రాబర్ట్ మెనెండెజ్ స్పందిస్తూ.. జడ్జి ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరో సారి రుజువైందన్నారు. న్యూజెర్సీ కోర్టులో ఇప్పుడు వైవిధ్యం సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. ఇక ఖురేషీ ఎంపికపై ఇస్లాం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పాక్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. 46 ఏళ్ల ఖురేషీ 2004, 2006లో ఇరాక్‌లో పర్యటించాడు. అంతేకాదు ఆయన తండ్రి కూడా గతంలో ప్రాసెక్యూటర్గా పని చేశాడు. చదవండి: ట్రంప్ రీఎంట్రీ.. ఎలా సాధ్యమంటే.. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు కరోనా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు మరో సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశంలో కరోనా సంక్షోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరుగాల్సి ఉండగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మరో తేదీకి వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. జస్టిస్ బాబ్డే పదవీ విరమణ తరువాత ఆయన నేతృత్వంలోని ధర్మాసనం వింటున్నకోవిడ్ కేసులను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చారు. సుప్రీంకోర్టు జాతీయ విపత్తుకు " మౌనంగా ప్రేక్షకపాత్ర " వహించబోదని ఆయన ఇటీవలే కేంద్రానికి స్పష్టం చేశారు. ( చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి ) -
కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం!
మహబూబ్‌నగర్: హత్య కేసులో ఓవ్యక్తికి యావజ్జీవ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.బాలగంగాధర్‌రెడ్డి కథనం మేరకు.. రెండేళ్ల క్రితం ఫరూక్నగర్ మండలం ఎలికట్టకి చెందిన జంగం మంగమ్మ (34)ను..జంగం రాములు తన కోరికను తీర్చాలని ఒత్తిడి చేసేవాడు. అదేక్రమంలో 2019 మార్చి 26న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మంగమ్మను నా కోరిక తీర్చకపోతే నిన్ను బతకనివ్వనంటూ జంగం రాములు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అటుగా వెళ్తున్న వారు మంటలు ఆర్పి షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్ కుమార్ నేర అభియోగపత్రం దాఖలు చేయగా, న్యాయస్థానంలో కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.బాలగంగాధర్‌రెడ్డి 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత నేరస్థుడిగా రాములు రుజువుకావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ప్రేమావతి తీర్పు ఇచ్చారు. చదవండి: మహిళపై 10 మంది గ్యాంగ్ రేప్, వీడియో ప్రత్యక్షం! -
కోర్టు విచారణ.. జడ్జికే లైన్ వేసిన ముద్దాయి
వాషింగ్టన్: కోర్టు విచారణ సమయంలో నిందితులు ఎంతో పద్దతిగా ప్రవర్తిస్తారు. పోలీసుల దగ్గర కాస్త అతి చేసినా చెల్లుతుంది కానీ.. కోర్టులో మాత్రం ఎలాంటి పిచ్చి వేశాలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పడం... మన వాదన వినిపించడం ఇదే జరిగేది. మన సినిమాల్లో కూడా న్యాయవాదులు, కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, సీన్లు ఉండవు. చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఇంతటి అత్యున్నత స్థానం ఉన్న కోర్టులో ఓ నిందితుడు పిచ్చి వేషాలు వేశాడు. ఏకంగా జడ్జికే లైన్ వేయడమేకాక.. పడిపోయాను అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు.. దక్షిణ ఫ్లోరిడా కోర్టులో తబితా బ్లాక్‌మోన్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రతివాది డెమెట్రిస్ లూయిస్ బ్రోవార్డ్ కౌంటీ జడ్జి తబితా బ్లాక్‌మోన్ ముందు వర్చువల్ విచారణలో హాజరయ్యాడు. కెమరా ముందుకు వచ్చాక లూయిస్.. జడ్జిని ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘జడ్జి గారు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా.. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు పడిపోయాను’’ అంటూ జడ్జి తబితాను మోసే ప్రయత్నం చేశాడు. అతడి పొగడ్తలకు ఆమె నవ్వుకుని.. ‘‘థాంక్యూ.. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. పొగడ్తలు ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ కాదు’’ అని తెలిపారు. ఇక లూయిస్‌పై నమోదయిన కేసు ఏంటంటే కొద్ది రోజుల క్రితం అతడు తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని సదరు ఇంటి ఓనర్ డోర్‌బెల్ కెమెరా ద్వారా చూసి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ నేరానికి గాను కోర్టు లూయిస్‌కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. ఇక గతంలో మరణాయుధం కలిగి ఉన్నాడనే నేరం కింద లూయిస్ నాలుగేళ్లు జైల్లో గడిపి 2019లో బయటకు వచ్చాడు. చదవండి: ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి? జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే -
5న హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈ నెల 7న ఉత్తరాఖండ్ సీజేగా ప్రమాణం చేస్తారు. మరోవైపు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి ఈనెల 6న ప్రమాణం చేయనున్నారు. అలాగే న్యాయమూర్తి జోయ్ మాల్యా బాగ్చీ ఈ నెల 4న ఉదయం 10:15 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు. -
హెచ్1బీ వీసా : ట్రంప్‌కు మరో షాక్
వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపైవీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకుంది. ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో హెచ్1 బీ వీసా ఆంక్షలను తక్షణమే అడ్డుకుంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్1బీ, హెచ్ 4, హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
అమెరికా సుప్రీం జడ్జిగా జస్టిస్ అమీ
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ శనివారం ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ మరణంతో ఏర్పడిన ఖాళీని ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చేసిన అభ్యర్థనను ట్రంప్ పట్టించుకోలేదు. 48 ఏళ్ల వయసున్న బారెట్ పూర్తిగా సంప్రదాయ భావాలు కలిగిన మహిళ. సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్ తనకు దక్కిన అత్యంత గౌరవమని బారెట్ అన్నారు. సెనేట్ ఆమోదం తర్వాత గిన్స్బర్గ్ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది. ట్రంప్ బారెట్‌ను అత్యంత మేధావి, సత్ప్రవర్తన కలిగిన మహిళగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత భావాలు కలిగిన గిన్స్బర్గ్ స్థానంలో అందుకు పూర్తిగా విరుద్ధమైన భావజాలం కలిగిన మహిళను ట్రంప్ నామినేట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలకి కొద్ది వారాలే గడువుండగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నామినేషన్‌ను తీసుకున్న ట్రంప్ సుప్రీం కోర్టులో కూడా రిపబ్లికన్ల సంప్రదాయ ముద్ర వేయాలని చూస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకు ఆమోదించొద్దు: బైడెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో కూడా పట్టు బిగించడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని జో బైడెన్ విమర్శించారు. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేవరకు అమీ నామినేషన్‌ను ఖరారు చేయవద్దని ఆయన సెనేట్‌కు విజ్ఞప్తి చేశారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నూతన న్యాయమూర్తిని నియమిస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. అధ్యక్ష ఎన్నికల అనంతరం నూతన ప్రెసిడెంట్ కొత్త జడ్జిని నియామించాలంటూ డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్ సుప్రీం కోర్టుకు నామినేట్ చేసే ఏ అభ్యర్థికి కూడా ఓటు వేయవద్దని సెనేట్ రిపబ్లికన్లను కోరారు. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనం కోసం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారని తెలిపారు. అధ్యక్షుడి ప్రణాళిక మేరకు ప్రస్తుత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే.. అప్పుడు 6-3 మెజారిటీ వస్తుంది.. ఇది అమెరికన్ల చట్టాలని, జీవితాన్ని దశాబ్దాలుగా ప్రభావితం చేస్తుందన్నారు బైడెన్. (చదవండి: రూత్ స్థానంలో మహిళనే నామినేట్ చేస్తాం) అంతేకాక ‘సుప్రీం కోర్టు జడ్జీ నియామకంలో ఈ దేశ ఓటర్లు పాలు పంచుకోవాలి. రాజ్యంగం ద్వారా తమకు లభించిన హక్కు మేరకు వారు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రజలు ఆమోదించిన నాయకుడు ఈ నియమాకాన్ని చేపట్టాలి’ అన్నారు బైడెన్. ట్రంప్ ప్రతిపాదనను అంగీకరిస్తే.. నిరంతరాయమైన రాజకీయ దాడులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. అలానే తనకు అవకాశం వస్తే ఒక ఆఫ్రికన్-అమెరికన్ మహిళని సుప్రీం కోర్టుకు నామినేట్ చేస్తానని బైడెన్ పునరుద్ఘాటించారు. ఇది చాలా చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. 100 సీట్ల చాంబర్లో ఇప్పటికే ట్రంప్ ప్రతిపాదనను 53 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. వీరితో పాటు 62 శాతం మంది అమెరికన్లు నూతన అధ్యక్షుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చికాగోకు చెందిన 7 వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన అమీ కోనీ బారెట్, అట్లాంటాకు చెందిన 11 వ సర్క్యూట్‌కు చెందిన బార్బరా లాగోవాలను గిన్స్బర్గ్ సృష్టించిన ఖాళీని భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థిగా ట్రంప్ పేర్కొన్నారు. -
రూత్ స్థానంలో మహిళనే నామినేట్ చేస్తాం
వాషింగ్టన్: కేన్సర్‌తో పోరాడి కన్నుమూసిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానంలో మరో మహిళనే నామినేట్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తర కరోలినాలోని ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ సుప్రీం న్యాయమూర్తిని వచ్చేవారంలో నామినేట్ చేస్తామని మహిళకే ఆ అవకాశం దక్కుతుందన్నారు. ఒక అధ్యక్షుడిగా సుప్రీం జడ్జిని నియమించే అధికారం పూర్తిగా తనకి ఉందన్నారు. సంప్రదాయ భావ జాలం కలిగిన రిపబ్లికన్ పార్టీ సుప్రీం కోర్టు జడ్జిని నియమించడం ద్వారా న్యాయవ్యవస్థపైనా, ఇతర సామాజిక అంశాలపైనా పట్టు సాధిస్తుందన్న ఆందోళన ఇప్పటికే డెమొక్రాట్లలో ఉంది. అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో తనకి అంది వచ్చిన ఈ అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే అధ్యక్ష ఎన్నికల తర్వాతే సుప్రీం కోర్టు జడ్జి నియామకం జరగాలన్న డెమొక్రాట్ల వాదనని ఆయన పట్టించుకోలేదు. 45 మంది వరకు తమ జాబితాలో ఉన్నారని, త్వరలోనే వారిలో షార్ట్ లిస్ట్ చేసి వచ్చే వారమే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ట్రంప్ వెల్లడించారు. -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం -
ఐదేళ్లుగా సంతకం.. న్యాయమూర్తి షాక్
సాక్షి, చెన్నై: కోర్టు విధించిన నిబంధనను ఐదేళ్లుగా ఇద్దరు నిందితులు తూచా తప్పకుండా అనుసరిస్తుండడం వెలుగుచూసింది. వీరి పరిస్థితిని చూసిన ఓ సామాజిక కార్యకర్తలు ఆ నిబంధనల్ని ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సేలం జగత్తు వనపట్టిలో 2015లో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీశాయి. రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నట్టు, వాహనాలపై దాడులు చేసినట్టు మణి, పళని అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలతో కూడిన బెయిల్‌పై అదే ఏడాది మేలో బయటకు వీరు వచ్చాయి. కోర్టు విధించిన నిబంధనను ఇద్దరు ఐదేళ్లుగా అనుసరిస్తున్నారు. ఇందులో నుంచి విముక్తి కోసం ఆ ఇద్దరు కోర్టును ఆశ్రయించలేదు. పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్ల లేదు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లుగా కోర్టు నిబంధనను అనుసరి స్తూ ఆ ఇద్దరు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కి వస్తుండడాన్ని విజయేంద్రన్ అనే వ్యక్తి గుర్తించారు. వారికి విముక్తి కల్పించడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆ ఇద్దరు కోర్టు నిబంధనల్ని అనుసరిస్తూ వస్తుండడం చూసి న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. తక్షణం ఇద్దరికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
చపాతీలో విషం : ఇద్దరిని బలిగొన్న మహిళ
భోపాల్ : చపాతీల్లో విషం కలిపి జిల్లా జడ్జి, ఆయన కుమారుడి మరణానికి కారణమైన ఓ మహిళ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జడ్జి మహేంద్ర త్రిపాఠి, ఆయన కుమారుడు విషం కలిపిన చపాతీలు తినడంతో మరణించారని వెల్లడైంది. న్యాయమూర్తి త్రిపాఠికి గతంలో చింద్వారాలో పనిచేసిన సమయంలో అక్కడ ఎన్జీవోను నిర్వహించే మహిళ సంధ్యా సింగ్ (45)తో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే న్యాయమూర్తి కుటుంబం బెతుల్‌లో ఆయనతో కలిసి నివసిస్తుండటంతో నాలుగునెలలుగా సంధ్యా సింగ్ త్రిపాఠీని కలుసుకోలేకపోయారు. దీంతో త్రిపాఠీ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే కసితో ఆమె రగిలిపోయింది. న్యాయమూర్తి కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా పూజ చేస్తానని ఈనెల 20న త్రిపాఠీని నమ్మబలికిన నిందితురాలు పూజ చేసేందుకు గోధుమ పిండిని తీసుకురావాలని కోరింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఆయనకు ఇవ్వగా మహిళ ఇచ్చిన గోధుమపిండితో చేసిన చపాతీలను తిన్న న్యాయమూర్తి త్రిపాఠి, ఆయన కుమారుడు అస్వస్థతకు లోనయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా ఈనెల 25న తండ్రీ, కుమారులు మరణించారు. చపాతీలను తిన్న రెండో కుమారుడు సైతం అస్వస్ధతకు గురై చికిత్స పొందుతున్నారు. త్రిపాఠి భార్య ఆ రోజు చపాతీలు తినకుండా రైస్ తీసుకోవడంతో బతికిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు సంధ్యా సింగ్ ఆమె డ్రైవర్ సంజూ, ఆమెకు సహకరించిన దేవీలాల్ చంద్రవంశి, ముబిన్ ఖాన్, కమల్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తాంత్రిక్ బాబా రామ్‌దయాళ్ కోసం గాలిస్తున్నారు. చదవండి : ప్రాణం పోయాక వెలుగుచూసిన దారుణం -
న్యాయవ్యవస్థ సమగ్రతే శిరోధార్యం కావాలి
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ గుప్తా బుధవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. లాక్డౌన్ కారణంగా, బార్బర్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్యనే ఈ రోజు తనకు హెయిర్ కట్ చేసిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. -
బెడ్‌మీద నుంచే "యువర్ ఆనర్’’ అంటున్నారు..
లాక్డౌన్ అయినా సరే కోర్టులు పని చేయాలి. లేకపోతే ముఖ్యమైన కేసులు ఆగిపోతాయి. అందుకే ఇప్పుడు అన్నీ దేశాల కోర్టులూ ఆన్లైన్లో వాదోపవాదాలు విని తీర్పులు ఇస్తున్నాయి. ఫ్లోరిడాలో మార్చి 16 నుంచి కోర్టులు పని చేయడం లేదు. లాయర్లు, జడ్జిగారు వీడియో కాన్ఫరెన్సులోకి వచ్చి కేసుల పరిష్కారం చేస్తున్నారు. అయితే ఫ్లోరిడా జడ్జి డెన్నిస్ బెయిలీకి తనకై తను పరిష్కరించుకోవలసిన సమస్యొకటి వచ్చి పడింది. లాయర్లు బెడ్ మీద నుంచి లేవకుండానే ఆన్లైన్లో స్క్రీన్ మీద సాక్షాత్కరిస్తున్నారు. కొందరికి ఒంటిమీద తగినన్ని బట్టలు ఉండటం లేదు. ఇంకొందరు కళ్లు నులుముకుని ఆవులిస్తూ, ‘‘యువర్ ఆనర్’’ అంటున్నారు. ‘‘ఆర్గ్యుమెంట్సే వినాలా, మీ అవతారాలను చూడాలా’’ అని అప్పటికీ జడ్జిగారు అన్నారు. ఆ మాటను సరిగా అర్థం చేసుకోలేదో.. స్క్రీన్ మీద కనిపించేదానికి కోటూ, టై ఎందుకు అని అనుకున్నారో.. ఎవరూ స్పందించలేదు. చివరికి విసిగిపోయిన జడ్జి డెన్నిస్.. ఆర్డర్ పాస్ చేసి అందరికీ మెయిల్ పెట్టారు... కోర్టుకు వచ్చినట్లే వీడియో కాన్ఫరెన్స్కీ రావాలని. -
జడ్జికి కరోనా రానూ: లాయర్ శాపనార్థం
కోల్‌కతా: తనకు అనుకూలంగా తీర్పు రాలేదన్న కోపంతో జడ్జికి కరోనా వైరస్ సోకాలంటూ ఓ న్యాయవాది శపించిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.. కరోనా విజృంభిస్తున్న వేళ కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా న్యాయవాది బిజోయ్, బ్యాంకుకు లోన్ చెల్లించిని వ్యవహారంలో ఓ పిటిషనర్ తరపున కేసు వాదిస్తున్నారు. అయితే లోన్ చెల్లించకపోవడంతో పిటిషనర్‌కు చెందిన బస్సును జనవరి 15న బ్యాంకు వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సదరు వ్యక్తి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇప్పుడు దీన్ని అత్యవసర విషయంగా పరిగణించి విచారణ చేపట్టలేమని, వేసవి సెలవుల అనంతరం విచారణ జరుపుతామని న్యాయమూర్తి దీపంకర్ దత్తా ఆదేశాలు ఇస్తున్నారు. (బాధితుల కోసం వెళ్తే.. లాయర్ అరెస్టు) ఈ సమయంలో కోపం కట్టలు తెంచుకున్న లాయర్ బిజోయ్ మైక్రోఫోన్‌ను విసిరికొట్టడమే కాక ఎదురుగా ఉన్న టేబుల్‌పై గట్టిగా చరుస్తూ అతనికి అంతరాయం కలిగించారు. పైపెచ్చు జడ్జికి కరోనా సోకుతుందంటూ శాపనార్థం పెట్టారు. దీంతో షాక్‌కు గురైన జస్టిస్ దత్తా వెంటనే తేరుకుని కోర్టు ధిక్కారం కింద సదరు న్యాయవాదిపై చర్యలకు ఆదేశించారు. న్యాయవాది మాటల వల్ల తన భవిష్యత్తు గురించి భయపడట్లేదని, కోర్టు ప్రాధాన్యతే తనకు అన్నింటికన్నా ముఖ్యమైన అంశమని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. (వీడియో కాన్ఫరెన్సింగ్) -
జస్టిస్ ధర్మాధికారి రాజీనామా
ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్ సత్యరంజన్ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నా. ముంబైని విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నన్ను నియమించేందుకు వారు సిద్ధంగా లేరు’ అని శుక్రవారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత బాధ్యతలున్నాయన్నారు. 2003లో జస్టిస్ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
జడ్జినే బురిడీ కొట్టించబోయి.. బుక్కయ్యారు!
సాక్షి, కావలి: నకిలీ పత్రాలతో జడ్జినే బురిడీ కొట్టించబోయి నకిలీ జామీన్‌దారులు అడ్డంగా దొరికిపోయారు. న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు ముఠా సభ్యులను గురువారం అరెస్ట్ చేశారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీ హనుమకొండపాళెం చెందిన కర్రా బాలరాజు కన్నకూతురిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి కావలి సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు బాలరాజుకు బెయిల్ మంజూరు చేసి, కావలి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జామీనులను హాజరుపరచాలని ఆదేశించింది. అయితే బాలరాజుకు జామీన్ ఇచ్చేందుకు స్వగ్రామస్తులను అతని తండ్రి వెంకటయ్య కోరితే ఈసడించుకొన్నారు. న్యాయవాది సహకారంతో.. తన కుమారుడికి జామీన్ ఇచ్చేందుకు వెంకటయ్య కావలిలోని బంధువైన రమణమ్మను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు రహమాన్ అనే న్యాయవాదిని కలిశాడు. ఆయన రూ.20 వేలు ఫీజు అవుతుందని, అవసరమైన జామీనుదారుల కోసం కావలికే చెందిన యాకోబును కలవమని సూచించాడు. వెంకటయ్య యాకోబును కలిస్తే తాను ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదని, నెల్లూరులోని మీరామొహిద్దీన్ను కలవమని చెప్పి పంపాడు. అతన్ని వెంకటయ్య సంప్రదించగా రూ.10 వేలు ఖర్చు అవుతుందని చెప్పి నెల్లూరు నగరంలోని పడారుపల్లి జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన కాకుముడి సుబ్బరామయ్య అలియాస్ చిన్నాతో డీల్ కుదిర్చాడు. చిన్నా నకిలీ రబ్బర్ స్టాంప్‌లు తయారు చేశాడు. స్వాధీనం చేసుకొన్న నకిలీ రబ్బర్ స్టాంపులు అదే ప్రాంతానికి మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను జామీన్‌దారులుగా సిద్ధం చేశాడు. అక్కుర్తి సుమన్ జామీన్‌దారులకు సంబంధించిన నకిలీ ప్రాపర్టీ ఫాంలను ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ, అదే మండలం మైపాడు పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ జామీన్ పత్రాలు సృష్టించారు. న్యాయమూర్తి అప్రమత్తతతో.. ఈ నెల 16వ తేదీ కర్రా బాలరాజు బెయిల్‌కు సంబంధించిన జామీన్‌దారులుగా మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను కావలిలోని అడిషనల్ మేజిస్ట్రేట్ పి.చైతన్య ముందు నాయ్యవాది రహమాన్ హాజరుపరిచారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే కేసు కావడంతో మేజిస్ట్రేట్ చైతన్య జామీన్దారుల్లో మందా విద్యాసాగర్‌ను నిందితుడు నీకు ఏమవుతాడని ప్రశ్నించారు. బాలరాజు తన చెల్లెలు భర్త అని చెప్పడంతో, మీ చెల్లెలు పేరేమిటని ప్రశ్నించడంతో తెల్లముఖం పెట్టేశాడు. దీంతో మేజిస్ట్రేట్ చైతన్యకు అనుమానం వచ్చి మళ్లీ విచారిస్తానని ఫైల్ పక్కన పెట్టారు. కోర్టులో మేజిస్ట్రేట్ ప్రశ్నలు అడుగుతుండగానే నకిలీ పత్రాలు సృష్టించి, వారితో పాటు వచ్చి కోర్టు బయటనే ఉన్న అక్కుర్తి సుమన్ పరారీ అయ్యాడు. జామీన్‌దారులుగా వచ్చిన మందా విద్యాసాగర్, తాటిపర్తి శివ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి అదృశ్యయ్యారు. ఈ విషయంపై కావలి వన్ టౌన్ పోలీసులకు మేజిస్ట్రేట్ చైతన్య ఫిర్యాదు చేయడంతో సీఐ ఎం.రోశయ్య దర్యాప్తు చేపట్టారు. ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని సభ్యులైన కాకుమూడి సుబ్బరామయ్య, అలియాస్ చిన్నా, అక్కుర్తి సుమన్, మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను అరెస్ట్ చేశారు. కావలిలోని న్యాయవాది రహమాన్ ప్రోద్భలంతో నకిలీ షూరిటీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ముఠాలో ఇంకా సభ్యులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ డి.ప్రసాద్ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎం.రోశయ్య, ఎస్సై సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. -
పిన్న వయస్సులోనే జడ్జిగా జైపూర్ కుర్రాడు!
జైపూర్ : అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా పనిచేసే అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తిగా మయాంక్ ప్రతాప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన అతడు.. 21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్‌కు ఈ అవకాశం లభించింది. ఈ క్రమంలో రాజస్తాన్ జుడిషియల్ సర్వీస్- 2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. వారందరికీ ధన్యవాదాలు.. ‘సమాజంలో న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. 2014లో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో జాయిన్ అయ్యాను. రాజస్తాన్ యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది పట్టా పుచ్చుకున్నా. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో నా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉంది. రాజస్తాన్ హైకోర్టు కనీస వయసు అర్హతను తగ్గించడంతోనే ఇది సాధ్యమైంది. చిన్న వయస్సులోనే జడ్జిగా కెరీర్ ఆరంభిస్తున్న కారణంగా సమాజానికి సుదీర్ఘ కాలంపాటు సేవ చేసే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మయాంక్ చెప్పుకొచ్చాడు. -
మహిళపట్ల గొప్ప మనసు చాటుకున్న జడ్జీ..!
వాషింగ్టన్: మనసుంటే మార్గం ఉంటుందని వాషింగ్టన్‌లోని ఓ కోర్టు జడ్జి నిరూపించారు. తన కళ్లెదుటే ఓ యువ న్యాయవాది ఇబ్బందులు పడుతుండటం చూసి.. ఆమెకు సాయం చేశాడు. అతని గొప్ప మనసును పొగుడుతూ.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వివరాలు.. జూలియానా లామర్ అనే వివాహిత లాకోర్సు సమయంలో గర్భం దాల్చింది. కోర్సు పూర్తయ్యేనాటికి ఓ పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టడానికి సిద్ధమైంది. అయితే, జూలియానా అడ్వకేట్‌గా ప్రమాణం చేస్తున్నప్పుడు ఓ చిక్కొచ్చిపడింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు బెకమ్ అల్లరి చేయడంతో.. అతన్ని ఎత్తుకుని ప్రమాణం చేసేందుకు తంటాలు పడింది. జూలియానా ఇబ్బందిని గమనించిన జడ్జీ రిచర్డ్ డింకిన్స్ చిన్నారి బెకమ్ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ చేతిలో పిల్లాడిని, మరో చేతిలో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని జడ్జీ జూలియానాతో ప్రమాణం చేయించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు. View this post on Instagram This feeling is indescribable. To say you’re going to do something then do it is such an amazing feat. There were a few times during this journey that brought me to my knees asking God for strength and reason. I’m glad he heard every prayer!! I’M A LICENSED ATTORNEY!! ⚖️ Today, I was sworn in to the Tennessee Bar by my mentor, Judge Dinkins, who has helped and guided me into my legal career, and my baby boy Beckham, who motivates me to keep going everyday and has been with me during half of my law school “experience.”❤️Thank you to my Husband for being there during all the late nights, all the suits you’ve ironed 😉, coffee you’ve bought to keep me awake, and taking my laptop to force me to go to sleep. Thank you to my Mom, for believing in me, knowing my potential, and (trying) to make me not be so hard on myself. Thank you all for your love and support. 😬 A post shared by Juliana Lamar, Esq. (@jaydotpett) on Nov 8, 2019 at 4:48pm PST Y'all. Judge Dinkins of the Tennessee Court of Appeals swore in my law school colleague with her baby on his hip, and I've honestly never loved him more. pic.twitter.com/kn0L5DakHO — Sarah Martin (@sarahfor5) November 9, 2019 వీడియో చూసిన వాళ్లలో కొందరు.. సదరు జడ్జీకి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని అభిప్రాయపడగా, మరికొందరు... స్త్రీలను గౌరవించే సమాజం ఉందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి చేసే ప్రయత్నం అని కామెంట్ చేశారు. పిల్లాడు మారాం చేయకపోయి ఉంటే ఇంత గొప్ప మానవీయ దృశ్యం ప్రపంచానికి దక్కేది కాదని.. పిల్లాడు పెద్దవాడైన తర్వాత అతనికి చూపించడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని కొంతమంది లాయరమ్మకు సలహా ఇచ్చారు. -
జ్వరంతో జడ్జి మృతి
సాక్షి, ఖమ్మం : ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి పి.జయమ్మ (45) జ్వరంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మరణించారు. జయమ్మకు భర్త, ఇద్దరు కుమారులున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్ గ్రామానికి చెందిన జయమ్మ 2013లో జడ్జిగా ఎంపికయ్యారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జిగా పనిచేసిన ఆమె జనవరి 7, 2019న ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యామూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె వృత్తిలో అనతికాలంలోనే న్యాయవాదులు, కక్షిదారుల మన్ననలు పొందారు. ఆమె పెద్ద కుమారుడు రోహిత్ డాక్టర్ కాగా.. చిన్న కుమారుడు విజయవాడలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. భర్త వెంకటేశ్వరబాబు డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి తాజుద్దీన్‌బాబా ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. న్యాయమూర్తి మృతికి ఐలు జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కార్యవర్గం, మహిళా న్యాయవాదులు, కోర్టు గుమస్తాలు తీవ్ర సంతాపం తెలిపారు. న్యాయమూర్తి మృతికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మధిర, మణుగూర్ బార్ అసోసియేషన్లు తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలిపాయి. అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బార్ సంఘం సభ్యులు కొల్లి సత్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు. -
ఖైదీతో కామవాంఛ నేరమే!
‘గత 18 నెలలుగా నేను డేనియల్ క్రాప్టన్ (29)తో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నాను. అందులో నేను సుఖం అనుభవించాలనే కోరిక కంటే అతనికి సుఖం అందించాలనే తాపత్రయమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి లైంగిక సుఖం దొరికే అవకాశం లేదు. పైగా నేను ప్రిజన్ ఆఫీసర్‌ను. అతనిలో సత్ప్రవర్తన తీసుకరావాల్సిన బాధ్యత కూడా నాకుంది. అందులో భాగంగా అతనితో స్నేహంగా మెదలడం వల్ల అనుకోకుండా ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏర్పడింది. నన్ను క్షమించండి!’ అంటూ దుర్హమ్ కౌంటీలోని ఫ్రాంక్లాండ్ జైలు అధికారి రాచెల్ వెల్‌బర్న్ (39) ఇటీవల జడ్జీని వేడుకున్నారు. అయినప్పటికీ జడ్జీ కరుణిస్తున్నట్లు కనిపించలేదు. జైలులోని ఓ గది కప్‌బోర్డులో క్రాప్టన్తో రాచెల్ లైంగిక వాంఛ కొనసాగిస్తూ పై అధికారులకు పట్టుబడ్డారు. ఆమె భర్త డేవిడ్ కూడా అదే జైలులో ప్రిజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ‘నేను 18 ఏళ్లుగా జైల్లో సేవలు అందిస్తున్నాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. పైగా పరస్పర అంగీకారంతోనే మేము లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందుకని నన్ను క్షమించి వదిలేయండి’ అంటూ రాచెల్ వేడుకొంది. ఖైదీ డేనియల్ క్రాప్టన్ అయినప్పటికీ దుర్హమ్ క్రౌన్ కోర్టు జడ్జీ క్రిస్టఫర్ వినిపించుకోలేదు. డేనియల్ క్రాప్టన్ సాధారణ నేరస్థుడు కాదని, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన ఫ్రాంక్ వర్సిలే (87)ని హత్య చేశారని, అలాంటి నేరస్థుడికి సెక్స్‌ను అందించాల్సిన అవసరం లేదని జడ్జీ అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ జైలులో ఎలాంటి సెక్స్ అయినా, నేరమేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాబిన్ ప్యాటన్ వాదించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఫ్రాంక్ వర్సిలే రాయల్ నావల్లో ఐదు యుద్ధ నౌకలకు నాయకత్వం వహించారని, ఆయన మాన్‌చెస్టర్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బుల కోసం క్రాప్టన్ ఆయన ఇంట్లో జొరబడి ఆయనను పిడి గుద్దులతో కిందపడేసి డబ్బులు దోచుకు పోయాడని, ఆస్పత్రిలో మూడు వారాల అనంతరం వర్సిలే మరణించాడని చెప్పారు. కొకైన్కు బానిసై క్రాప్టన్ ఈ దారుణానికి పాల్పడ్డారని కూడా ఆయన పేర్కొన్నారు. క్రాప్టన్ దాడిలో మరణించిన యుద్ధ వీరుడు ఫ్రాంక్ వర్సిలే 2013లో ఈ హత్య జరగ్గా, 2014లో క్రాప్టన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. క్రాప్టన్తో రాచెల్ లైంగిక సంబంధం మానసికమైనది కాదని, క్షణికావేశంతో కూడుకున్న లైంగిక వాంఛ అని కూడా ప్రాసిక్యూటర్ వాదించారు. అలాంటి వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు జైలు శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఆయన వాదనతో ఏకీభవించిన జడ్జీ క్రిస్టఫర్ ప్రిన్స్, రాచెల్‌కు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం శిక్ష విధించాలిగానీ ఇద్దరు చిన్న పిల్లలను దష్టిలో పెట్టుకొనే తక్కువ శిక్ష విధిస్తున్నానని జడ్జీ వ్యాఖ్యానించారు. -
సర్కారు బడిలో న్యాయమూర్తి పిల్లలు
సిరిసిల్లటౌన్: పోటీ ప్రపంచంలో అందరూ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు పరుగులు తీస్తుండగా.. ఓ న్యాయమూర్తి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి అంగడి జయరాజ్ తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. పది రోజులుగా జిల్లా కేంద్రంలోని బాలికల సెకండరీ పాఠశాలలో అందుతున్న విద్యపై తెలుసుకున్నారు. గురువారం ఇద్దరు కూతుళ్లు జనహిత (10వ తరగతి), సంఘహిత (8వ తరగతి)లను స్వయంగా వచ్చి చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే సుశిక్షుతులైన ఉపాధ్యాయులు ఉంటారనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. న్యాయమూర్తి తమ పాఠశాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పాఠశాల హెచ్ఎం సుధారాణి తెలిపారు. -
యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్రావు ఎన్నికయ్యారు. వైట్‌హౌస్‌లోని రూస్వెల్ట్ రూమ్‌లో ఆమె యూఎస్ సర్క్యూట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ నేతృత్వంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. భర్త అలెన్ లెఫ్కోవిజ్తో కలసి బైబిల్‌పై ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబర్‌లో నియోమీని జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె నియామకానికి 53–46 ఓట్ల తేడాతో సెనేట్ ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా, నియోమీ గతంలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ)లో అడ్మినిస్ట్రేటర్‌గా కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని ప్రముఖ కోర్టుల్లో సుప్రీంకోర్టు తర్వాత డీసీ కోర్టు కీలకం. డీసీ కోర్టు జడ్జిగా నియమితులైన భారతీయుల్లో నియోమీ రెండో వ్యక్తి. గతంలో శ్రీ శ్రీనివాసన్ అనే వ్యక్తి డీసీ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. -
బెయిల్ ఇచ్చిన జడ్జి ఇంట్లోనే చోరీ
కల్వకుర్తి: అతను వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఓ చోరీ కేసులో 2006లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొన్నాళ్లకు బెయిల్ లభించింది. ఆ తర్వాత బెయిల్ ఇచ్చిన జడ్జి ఇంట్లోనే మరోసారి దొంగతనం చేశాడు. 2002 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న రాఘవేందర్‌రెడ్డి అనే వ్యక్తి వాహన తనిఖీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి వృత్తిరీత్యా కారుడ్రైవర్. అయితే, కారు నడిపితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవటంతో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. సింగిల్‌గానే..: దొంగతనానికి రాఘవేందర్‌రెడ్డి ఒక్కడే వెళ్లేవాడు. ఏదైనా ప్రాంతంలో దొంగతనం చేయాలంటే ఆ ఊరిలో రాత్రి భోజనం చేసి సెకండ్ షో సినిమా చూశాక చోరీకి పాల్పడేవాడు. 2006లో చేవెళ్ల పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకి కూడా పంపించారు. అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బెయిల్ వచ్చిన రాత్రే జడ్జి ఇంట్లో దొంగతనం చేశాడు. అలాగే 2018 ఏప్రిల్ 19వ తేదీన ఒకేరోజు కల్వకుర్తి ఇందిరానగర్ కాలనీలో నాలుగు ఇళ్లు, విద్యానగర్ కాలనీలోని ఓ ఇంటిలో దొంగతనం చేశాడు. ఇందిరానగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఏమీ దొరకకపోవటం.. అప్పటికే ఆకలి వేస్తుండటంతో అన్నం వండుకుని తిని మరీ వెళ్లాడు. ఈ విషయాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కాగా, దొంగతనం చేసిన వస్తువులు అమ్మాక వచ్చిన డబ్బుతో గోవా, బెంగళూరు, హైదరాబాద్‌లో జల్సాలు చేసేవాడు. రాఘవేందర్‌రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి తెలిపారు. కోదాడ, పరిగి, వరంగల్, కాజీపేట, కల్వకుర్తి పోలీసుస్టేషన్లలో ఆయనపై పది కేసులు నమోదైనట్లు చెప్పారు. -
‘నా భార్య మృతికి జడ్జియే కారణం’
సాక్షి, వరంగల్ : తన భార్య తలుగుల టీనా మృతికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అనిరోజ్ క్రిష్టియానా కారణమని మృతురాలి భర్త రవి ఆరోపించారు. శుక్రవారం కోర్టు ఎదుట టీనా మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు. జడ్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జులైవాడకు చెందిన టీనా న్యాయసేవాధికార సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. జడ్జి క్రిష్టియానా మానసిక వేధింపులు, సహచర ఉద్యోగుల ఎదుట అవమానిస్తుండటంతో కలత చెందిన టీనా.. గతేడాది సెప్టెంబర్ 26న న్యాయసేవా సదన్ భవనంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరింది. మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో అనేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం దక్కలేదు. టీనా వైద్య ఖర్చులు నిమిత్తం ఇల్లును విక్రయించామని రవి సుబేదారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం టీనా తుదిశ్వాస విడిచింది. కోర్టు ఎదుట బైఠాయింపు కాగా, టీనా మృతదేహంతో కోర్టు గేటు ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మార్పీఎస్ నేతలు బైఠాయించారు. మధ్యాహ్నం మొదలైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. టీనా మృతికి కారణమైన జడ్జిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త రవి, కుమారుడు సంజీవ్ ఒక దశలో జడ్జి చాంబర్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన జడ్జి తిరుమలాదేవి ప్రతినిధిగా సూపరింటెండెంట్ రవికాంత్ బాధితుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. -
జస్టిస్ లోకూర్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్.బి.లోకూర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్ లోకూర్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు డిసెంబర్ 14నే జస్టిస్ లోకూర్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఆదివారంతో ఆయన పదవీకాలం పూర్తయింది. కేసుల కేటాయింపు విషయంలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ గొగోయ్, అప్పటి జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో కలిసి లోకూర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్ 31న జన్మించిన లోకూర్, 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లోకూర్ పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. -
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ గురువారం ప్రమాణం చేశారు. జస్టిస్ చౌహాన్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. సీజే కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, జస్టిస్ చౌహాన్ కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ చౌహాన్ మరో న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కలిసి కేసులను విచారించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జస్టిస్ చౌహాన్‌ను తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాద సంఘాలు ఘనంగా సన్మానించాయి. -
గురుగ్రామ్ : జడ్జి కొడుకు బ్రెయిన్ డెడ్
గురుగ్రామ్ : సెలవు ఇవ్వలేదన్న కోపంతో జడ్జి భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరిపిన హరియాణాలోని గురుగ్రామ్‌లో శనివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన జడ్జి భార్య మరణించగా, అతని కుమారుడు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. హరియాణా పోలీస్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న మహిపాల్ సింగ్ రెండెళ్లుగా అదనపు సెషన్స్ జడ్జి కృష్ణకాంత్ శర్మ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్ సింగ్ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్ సింగ్‌ను తరచూ దూషించేవారనే కోపంతో సదరు పోలీసు జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్‌లపై శనివారం అర్కాడియా మార్కెట్లో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బెల్లెట్ ధ్రువ్ తలలోకి దూసెకెళ్లడంతో అతనికి తీవ్ర రక్త స్రావమైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జడ్జి భార్య రీతూ మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న మహిపాల్, జడ్జి కుటుంబం తనను తరచుగా దూషించడం మూలానే తాను ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి కొలీజియం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయవాదుల కోటా నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వీరి పేర్లను శుక్రవారం సుప్రీం కోర్టుకు పంపనున్నట్లు సమాచారం. కొలీజియం ఎంపిక చేసిన వారిలో సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు (వెలమ), తడకమళ్ల వినోద్‌కుమార్ (బ్రాహ్మణ), బట్టు దేవానంద్ (ఎస్సీ), నైనాల జయసూర్య (కాపు), డి.రమేశ్ (కమ్మ), అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి (రెడ్డి), కూనురు లక్ష్మణ్ (గౌడ్) ఉన్నారు. వీరిలో రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, జయసూర్య, రమేశ్‌లు ఏపీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు తెలంగాణకు చెందిన వారు. వీరితో పాటు జిల్లా జడ్జీల కోటా నుంచి ఏడుగురు న్యాయాధికారులకు సైతం హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలనీ కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మిగిలిన 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగిలిన న్యాయమూర్తుల్లో 10 మంది న్యాయమూర్తులు న్యాయాధికారుల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖాళీలతో జడ్జీలపై భారం.. దాదాపు 50 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు తీవ్ర పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు విచారణకు నోచుకోక న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బం ది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ఈ అక్టోబర్‌తో ఆ బాధ్యతలు చేపట్టి 3 నెలలు పూర్తయింది. ఈ కాలంలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆయన తగిన అవగాహన తెచ్చుకున్నారు. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. కొలీజియంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కలసి న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ వడపోత.. కొలీజియం ఈ నెల 9న ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో సమావేశమై సుదీర్ఘ సమయం పాటు వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పలు సమీకరణల ఆధారంగా ఏడుగురు న్యాయవాదులను ఎం పిక చేసింది. ఈ ఎంపిక గురించి ఆ ఏడుగురికీ తెలియజేసి వారి అంగీకారం కూడా తీసుకుంది. అనంతరం వారి ఆదాయపు పన్ను వివరాలు, వాదించిన కేసులు, లా జర్నల్స్‌లో రిపోర్ట్ అయిన కేసులు తదితర వివరాలను పరిశీలించి వారి పేర్లను సుప్రీం కోర్టుకు పం పాలని నిర్ణయించింది. మరో కాపీ కేంద్రానికి కూడా వెళ్తుంది. ఈ జాబితా లోని వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా కేంద్రం తెప్పించుకుం ది. ఆ వ్యక్తుల ఐబీ నివేదికలను కేంద్రం సుప్రీం కోర్టుకు పంపుతుంది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు తమ ముందున్న జాబితా విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. జాబితా అందుకున్న రెండు నెలల్లోపు కేంద్రం ఐబీ నివేదికలను సుప్రీం కోర్టుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పంపకపోతే ఆ జాబితా విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు భావించి ఆ జాబితాను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతుంది. -
హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు
సిల్వర్ స్క్రీన్‌పై బ్రహ్మాండంగా నవ్విస్తున్న బ్రహ్మానందం ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌కి రానున్నారు. అయితే నవ్వించడానికి కాదు.. నవ్వించేవారిని ‘జడ్జ్’ చేయడానికి. ‘ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోలో కనిపించనున్నారు బ్రహ్మానందం. ఈరోజు ‘స్టార్ మా’లో ఈ షో స్టార్ట్ అవుతున్న సందర్భంగా బ్రహ్మానందంతో స్పెషల్ టాక్. ► ఇన్ని రోజులు వెండితెరపై ప్రేక్షకులను నవ్వించిన మీరు ఇప్పుడు తొలిసారి బుల్లితెరపైకి రాబోతున్నారు. ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తోంది? నవ్వించేవాళ్లను జడ్జ్ చేయబోతున్నాను. ఈ షోలో అద్భుతమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్లు స్టాండప్ కామెడీ చేయబోతున్నారు. ఎవరు బాగా నవ్వించారో వాళ్లను ఎంపిక చేయాలి. ► జడ్జ్మెంట్ అనేది కష్టం అంటారు? నవ్వొస్తే బాగుందని చెబుతాం. నవ్వు రాకపోతే బాగోలేదు అంటాం. దీనిని జడ్జ్ చేయడానికి మనకు ఓ సీట్ కేటాయించారు. లెక్కలేసుకుని ‘నవ్వు’కి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు. పెద్ద బాల శిక్షలా ఉండాలి. ► ఈ షోను అంగీకరించడానికి కారణం ఏంటి? నేను ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడిని. మిమిక్రీనే స్టాండప్ కామెడీ అంటుంటారు. ఇప్పుడు కుర్రాళ్లు చాలామంది స్టాండప్ కామెడీ చేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను ప్రోత్సహించాలి. ఎవరో ప్రోత్సహించే కంటే అనుభవం ఉన్న నాలాంటివాళ్లు ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుందనిపించింది. వాళ్లకూ ఉత్సాహంగా ఉంటుంది. ► మీరు బ్రహ్మాండంగా నవ్విస్తారు. ఈ షోలో పాల్గొనేవారు మిమ్మల్ని నవ్వించగలరని నమ్ముతున్నారా? నవ్వడం అనేది పెద్ద విషయమో, లేక పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో కాదు. నవ్వినోళ్లు మళ్లీ నవ్వకూడదని ఏమీ లేదు. నవ్వొస్తే ఎవరైనా నవ్వుతారు. ఆ నవ్వు వస్తే దేశ ప్రధాని అయినా నవ్వుతాడు. సామాన్యులూ నవ్వుతారు. నవ్వు అందరికీ కామన్. పెద్ద కమెడియన్ నవ్వకూడదని కాదు. ► అన్ని రసాల కన్నా హాస్య రసం కష్టం అంటారు.. నవ్వించడం బ్రహ్మానందానికే కాదు ఎవరికైనా కష్టమే. నవరసాల్లో హాస్యరసాన్ని పండించడం అంత ఈజీ కాదు. జుగుప్సాకరంగా కాకుండా అందంగా నవ్వించి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేయడం అనేది గొప్ప విషయమే. ► మరి ‘జుగుప్సాకరమైన హాస్యం’ ఉండకూడదని నిర్వాహకులతో మీరు చెప్పారా? నా దగ్గరకు నిర్వాహకులు రావడానికి, నేను ఈ షో అంగీకరించడానికి మొదటి కారణం అదే. ఇంటిల్లిపాదీ చూస్తూ కామెడీని ఆనందించే షోకే నేను జడ్జ్‌గా చేస్తాను. అలా కాకుండా భిన్నమైన మార్గాల్లో నవ్వించాలని ప్రయత్నిస్తే అదే రోజు మానేస్తానని కూడా చెప్పాను. ► ఫైనల్లీ ఈ షో వల్ల మీకెలాంటి అనుభవం దొరకుతుందని అనుకుంటున్నారు? కొత్త కుర్రాళ్లకు వాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక దొరికింది. ఉదాహరణకు.. పాటలు పాడేవారు, మిమిక్రీ చేసేవారు.. ఇలా విభిన్న రంగాల్లో ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారు. అత్త కూడా ఒకప్పటి కోడలే అంటారు కదా... ఇంకా చానెల్స్ రానప్పుడు డీడీ 8లో నేనూ స్టాండప్ కామెడీ చేసినవాడినే. ఒక్కసారి ఆ పూర్వపు రోజులను గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే వాళ్లలో ప్రతిభ ఉన్న వారు రేపు మంచి స్థాయికి వెళితే సంతోషపడతాను. -
బలిష్ట
కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. బెంచీలలో మనుషులు కూర్చునే చోట నిండా మనుషులు ఉండడం కోర్టు హాలు నిశ్శబ్దంగా లేకపోవడానికి కారణం కాదు. అక్కడెవ్వరూ లేరు. జడ్జీకి, నిందితుడికి మధ్య వాదన లాంటిది జరుగుతోంది. అందుకే కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ముందే జడ్జి నుంచి అనుమతి తీసుకుని మాట్లాడుతున్నాడు బలిష్ట. ‘‘మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఇవ్వడంలో నాకు ఆసక్తి లేదు. మీరే ప్రశ్నలు వేసుకుని, మీరే సమాధానాలు చెప్పుకుని, మీరే నాకు శిక్ష వేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. పోయే చోటకే పోతాను’’ అన్నాడు బలిష్ట. అతడు ఆ మాట అన్నప్పుడు జడ్జి వింతగా చూశాడు. ‘‘బాబూ, భారతీయ శిక్షాస్మృతి అని ఒకటి ఉంటుంది. అన్నీ ఆ స్మృతి ప్రకారమే ఇక్కడ జరుగుతాయి. నువ్వు శిక్షను అంగీకరించకుండా, నీ నేరం రుజువు కాకుండా నిన్ను చట్టం శిక్షించడానికి లేదు’’ అన్నాడు. ‘‘ఎలాంటి విచారణ లేకుండానే నేను నా నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమై వచ్చాను జడ్జిగారూ. అయితే మీ కోర్టులు నిందితుడు నేరం చేశాడా లేదా అన్నంత వరకే చూసి, లంచ్‌కి వెళ్లిపోతాయి.లేదా, హాలిడేస్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత బలిష్ట అనేవాడు ఏమైపోయాడన్నది ఈ న్యాయస్థానానికి అవసరం లేని విషయం. నా అభ్యర్థన ఏంటంటే.. ఈ నేరాలన్నీ నువ్వే చేశావా అని కాకుండా, ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావు? అని మీరు నన్ను అడగాలని నా ఆశ. అందుకు నేను సమాధానం చెప్పాలని నా ఆకాంక్ష. ఇవన్నీ కుదరవు అనుకుంటే.. శిక్ష విధించి జైలుకో, ఉరికంబానికో పంపించేయండి. నాకేం భయాలు, భీతులు, చింతనలు లేవు’’ అన్నాడు బలిష్ట చేతులు కట్టుకునే నిలబడి. జడ్జి బలిష్ట వైపు పరిశీలనగా చూశాడు. పేరుకు తగ్గట్టు లేడు బలిష్ట. పీలగా ఉన్నాడు. పీలగా ఉన్నవాడొకడు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేంత బలంగా ఉన్నాడంటే.. వ్యవస్థ ఎక్కడో బలహీనంగా ఉందని వాడు కనిపెట్టగలిగాడని! జడ్జి నవ్వాడు. కోర్టు హాల్లో గానీ, కోర్టు బయట గానీ జడ్జిలు నవ్వినట్లు న్యాయ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ ఈ జడ్జి నవ్వాడు. ‘‘ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావో తెలుసుకుని నీలో పరివర్తన తెచ్చేందుకు కోర్టుకు తగిన సమయం ఉండదు. తర్వాతి కేసు రెడీగా ఉంటుంది. ఒకవేళ సమాజంలో అందరూ ధర్మబద్ధంగా నడుస్తూ, ‘ఇవాళైనా ఒక కేసు వస్తే బాగుండు’ అని జడ్జీలు కేసుల కోసం ఎదురు చూసే ఒక కాలం ఓ వెయ్యేళ్ల తర్వాత వచ్చినా.. అప్పుడు కూడా దోషిని నిలబెట్టో, కూర్చోబెట్టో కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యత కోర్టులది కాదు. అందుకు వేరే విభాగాలు ఉంటాయి. సరే, నువ్వు కోరుకున్నట్లుగా ఇప్పుడు నేను నిన్నేం ప్రశ్నలు వేయలేను గానీ, నువ్వు నన్ను ఈ కోర్టు హాలులో ప్రశ్నించే అవకాశం ఇవ్వగలను. నిన్ను అడగందే సమాధానం తెలియనంత ప్రశ్నలు నిన్ను అడగడానికి నా దగ్గర ఏముంటాయి చెప్పు? అయితే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఇవాళ నేను కోర్టు సమయాన్ని వినియోగమో, దుర్వినియోగమో చేయదలచుకున్నాను’’ అన్నాడు నవ్వుతూ జడ్జి. బలిష్ట రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు. ‘‘మిమ్మల్ని ప్రశ్నించేంతటి వాడిని కాదు. నన్ను మాట్లాడ్డానికి అనుమతించినట్లే.. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి చాలు’’ అన్నాడు బలిష్ట. అలా.. వాళ్లిద్దరి మధ్యా మాటలు మొదలవడంతో కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ‘‘జడ్జిగారూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నానని నాపై అభియోగం. అంటే చట్టం చేయవలసిన పనిని నేను చేశానని. చట్ట ప్రకారం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. అయితే నేను చేసిన పనికి నన్ను ప్రేరేపించిన పని చట్టంలో నేరంగా పరిగణన పొందడం లేదు కనుక, నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నట్లు కాదు. చట్టమే నేరాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని నేను అభిప్రాయపడ్డాను. అందుకే ఒక్కొక్కరి మోకాళ్లూ విరగ్గొడుతూ వచ్చాను.’’ అన్నాడు బలిష్ట. జడ్జి వింటున్నాడు. ‘‘జడ్జి గారూ.. మన సమాజంలో హత్య నేరం. ఆత్మహత్య నేరం. అత్యాచారం నేరం. దొంగతనం నేరం. అవినీతి నేరం. అక్రమం నేరం.దాడి జరపడం నేరం. నేను మోకాళ్లు విరగ్గొట్టిన ఆ ఆరుగురో, ఏడుగురో ఈ నేరాలేవీ చేయలేదు కనుక, ఇంకా చట్టం లిస్టులో ఉన్న నేరాలేవీ వాళ్లు చేయలేదు కనుక.. పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ.. వాళ్లను నేరస్థులుగా కాకుండా, వాళ్ల మోకాళ్లను విరగ్గొట్టిన నన్ను నేరస్థుడిగా పరిగణించడం అంటే.. చట్టం నాకు ప్రసాదించిన ‘జీవించే హక్కు’ను నా పక్కన ఉన్నవాడు హరిస్తూ ఉన్నప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉండమని చట్టం చెప్పినట్లే కదా. నా జీవించే హక్కును నేను కాపాడుకునే ప్రయత్నంలో.. నాలాగే ఇంకెందరికో చట్టం ఇచ్చిన జీవించే హక్కును కాపాడే ప్రయత్నంలో నాకు తెలియకుండానే, పట్టలేని కోపంలో.. మోకాళ్లు విరగ్గొట్టానని చట్టం అర్థం చేసుకోలేదా’’ అని అడిగాడు బలిష్ట. కోర్టు హాల్లో బలిష్ట మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. అతడివైపే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు జడ్జి. ‘‘కానీ అబ్బాయ్.. సినిమా థియేటర్లో నీ వరుసలో కూర్చొని ఉన్నవాడు కాళ్లూపుతూ కూర్చున్నాడని, ఏదో ఆఫీస్‌లో ఎవరో నీకు కాళ్లూపుతూ సమాధానం చెప్పాడని, హోటల్లో ఎవరో కాళ్లూపుకుంటూ తింటున్నాడని, అసలు నీకు సంబంధమే లేని వారెవరెవరో, ఎక్కడెక్కడో నీకు దగ్గరగానో, నీకు దూరంగానో కాళ్లూపుకుంటూ నీకు కనిపించారని కోపం తెచ్చుకుని వెళ్లి.. వాళ్ల కాళ్లు, మోకాళ్లు విరగ్గొట్టడం నేరమే కదా! జీవించే హక్కు నీకెలాగైతే ఉందో, వాళ్లకూ.. వాళ్లకు ఇష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదని ఎలా అనగలం?’’ అన్నాడుజడ్జి. ‘‘కానీ జడ్జిగారూ.. ఒకరి జీవించే హక్కు.. ఇంకొకరి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు కదా! నా దృష్టిలో హంతకుడి కన్నా, అత్యాచారం చేసినవాడి కన్నా, దొంగ కన్నా, అవినీతి పరుడికన్నా.. నీచమైన వాడు, హీనమైనవాడు.. ఈ కాళ్లూపుతూ కూర్చునేవాడు! కాళ్లూపుతూ కూర్చున్నాడంటే వాడికి మంచీ మర్యాద లేదని. సంస్కారం లేదని. వాడికొక ధ్యేయం లేదని. ఒక లక్ష్యం లేదని. ఒక బాధ్యత లేదని. ముఖ్యంగా మనుషులంటే గౌరవం లేదని. వాడసలు సరిగా పెరగలేదని. అలాంటి వాడిని శిక్షించే సెక్షన్ మన చట్టంలో లేదని. పబ్లిక్‌లోనే కాదు, పెళ్లాం పిల్లల ముందు కూడా కాళ్లూపడం నేరమే అని ఒక చట్టం తెండి. ఈ కాళ్లూపే దరిద్రులంతా దారికొస్తారు’’ అన్నాడు బలిష్ట. ‘‘ద్రవ్యోల్బణం మన దరిద్రం కాదు జడ్జిగారూ. కాళ్లూపడం మన దరిద్రం’’ అని కూడా అన్నాడు. జడ్జి అతడి వైపు చూశాడు. అతడు జడ్జివైపు చూశాడు. ‘‘ఆగావేం చెప్పూ’’ అన్నట్లు చూశాడు జడ్జి. ‘‘చెప్పడానికేం లేదు’’ అన్నట్లు చూశాడు బలిష్ట. ‘‘అలా చూస్తున్నావేం’’ అని అడిగాడు జడ్జి.బలిష్ట మాట్లాడలేదు. కేసు తర్వాతి రోజుకు వాయిదా పడింది. బలిష్ట వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాతి రోజు జడ్జిగారు కోర్టుకు రాలేదు. ముందురోజు రాత్రి ఎ.. వ.. రో.. ఆయన కాళ్లు విరగ్గొట్టారు!ఆ తర్వాతెప్పుడూ బలిష్ట ఏ వాయిదాకూ రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు! కోర్టు హాల్లో ఎవరైనా కాళ్లూపుతున్నప్పుడు మాత్రం.. జడ్జిగారు భయంతో ‘‘ఆర్డర్.. ఆర్డర్’’ అంటుండేవారు. ఆయన అలా ఎందుకు అంటుండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. - మాధవ్ శింగరాజు -
2040 వరకు హైకోర్టు జడ్జి కాలేం
సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తాము 2040 వరకూ తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతిపై వెళ్లలేమని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. జిల్లా న్యాయమూర్తులు, ఇతర సబార్డినేట్ సర్వీసుల్లో ఉన్న న్యాయాధికారుల విభజనకు సంబంధించిన వివాదంపై బుధవారం తన వాదనలు కొనసాగించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వరుసగా రెండో రోజూ కేసును విచారించింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3, 4 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారానే విభజన జరగాలి. న్యాయాధికారుల విభజన కూడా అలాగే జరగాలి. కానీ ఆర్టికల్ 235 ప్రకారం సబార్డినేట్ కోర్టులు హైకోర్టు నియంత్రణలో ఉన్నాయి కాబట్టి.. విభజన కూడా ఆర్టికల్ 235 ప్రకారమే జరగాలంటే ఎలా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ 235 ఎలా వర్తిస్తుంది? కేంద్రం హైకోర్టుతో సంప్రదింపులు జరపవచ్చు. కానీ అంతిమంగా పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోనే కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలి. అసలు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి స్థానికతే గుండెకాయ. స్థానికత లేకుండా కేవలం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే మేం 2040 వరకూ కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందలేం’’అని హుజేఫా అహ్మదీ వాదించారు. ఫుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది: హైకోర్టు రిజిస్ట్రీ హైకోర్టు రిజిస్ట్రీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి తన వాదన వినిపించారు. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 78 గానీ, మరొకటి గానీ న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు. వీరు సవాలు చేసిన తీర్పు ఫుల్ కోర్టు ఇచ్చినది. మీరు సీనియారిటీని ఎలా విస్మరిస్తారు? సర్వీసు కండిషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆప్షన్లు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల వారు తరాలుగా వచ్చి స్థిరపడి ఉన్నారు. వారిని కాదంటే ఎలా? సీనియారిటీ ద్వారానే కేటాయింపులకు న్యాయం జరుగుతుంది’’అని వాదించారు. అప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు?: ఏపీ న్యాయాధికారుల సంఘం ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వై.రాజగోపాలరావు తమ వాదనలు వినిపించారు. ‘‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 నుంచి 80 వరకు ఏవీ కూడా న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు’’అని ఆదినారాయణ రావు వాదించారు. దీనికి జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘ఈ చట్టం ద్వారా విభజన చేపట్టవచ్చని హైకోర్టు అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.. మరి మీరెందుకు అంగీకరించడం లేదు’’అని ప్రశ్నించారు. ఆదినారాయణరావు బదులిస్తూ ‘‘ఈ చట్టం ఆధారంగా విభజనకు హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వలేదు. కేవలం ఆర్టికల్ 235 ద్వారా సంక్రమించిన అధికారాలతోనే మార్గదర్శకాలను రూపొందించింది’’అని పేర్కొన్నారు.‘‘సుప్రీంకోర్టు 1993లో ఆలిండియా జడ్జెస్ కేసులో ఇచ్చిన తీర్పు గానీ, ఇతర తీర్పులు గానీ పరిశీలిస్తే న్యాయవ్యవస్థలోకి ఏనాడూ కార్యనిర్వాహక వ్యవస్థ చొరబడేందుకు అనుమతివ్వలేదు. పిటిషనర్లు చెబుతున్నట్టు 371డీ న్యాయవ్యవస్థకు అమలు కాదు. అలా అమలైతే ప్రాంతాల వారీగా రిజర్వేషన్ వర్తించేది. కానీ ఈ సర్వీసులో అఖిల భారత స్థాయిలో ఎవరైనా పోటీపడొచ్చు. వారన్నట్టుగా స్థానికతే ప్రాతిపదిక అయితే ప్రస్తుతం ఈ సర్వీసులో తెలంగాణలో, ఏపీలో పనిచేస్తున్న తమిళనాడు వారినో లేదా కర్ణాటక వారినో ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నివాసం ఎక్కడ అనేది ఒక ప్రాతిపదికే కాదు. నియామకం సమయంలో ప్రాతిపదికగా లేని స్థానికతను ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవాలి’’అని వాదించారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటివరకు జరిగిన వాదనలపై కేసులోని అన్ని పార్టీలు తమ ప్రతిస్పందనలను ఆగస్టు 31 లోపు లిఖితపూర్వకంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయకుమార్ సాగర్ వాదనలు వినిపించారు. ఏపీ న్యాయాధికారుల సంఘం ప్రతినిధి గంటా శ్రీనివాసులు, తెలంగాణ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వరప్రసాద్, చంద్రశేఖర్ విచారణకు హాజరయ్యారు. -
ఈ జడ్జి గ్రేట్
దొడ్డబళ్లాపురం: సాధారణంగా హెల్మెట్లు ధరించకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తుంటారు.లేదా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ పనిని ఒక న్యాయమూర్తి చేయడం విశేషం. ఈ సంఘటన దావణగెరె జిల్లా హరపనహళ్లి పట్టణంలో చోటుచేసుకుంది. రోడ్డు భద్రతా వారోత్సవాల నేపథ్యంలో హరపనహళ్లి కోర్టు జడ్జీ మంజుళ శివప్ప తానే స్వయంగా రోడ్డు మధ్యలో నిలబడి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని నిలిపి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత గురించి వారికి వివరించారు. జడ్జి చొరవను అందరూ ప్రశంసించారు. -
‘దాని గురించి కూడా కామెంట్ చేయండి’
నేహా కక్కర్.. ఇండియన్ ఐడల్ టీవీ షో చూసేవారికి బాగా పరిచయమున్న పేరు. గత సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నేహాను ఈసారి అదృష్షం వరించింది. పోటీదారుగా పాల్గొన్న కార్యక్రమానికే న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. త్వరలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్ 10’కు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యహరించనున్నారు. ఈ నేపథ్యంలో తన సంతోషాన్నిఇన్స్టాగ్రామ్, ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నేహా ఈ విషయాన్ని పోస్టు చేయగానే కొందరు ఆమెను అభినందించగా చాలామంది మాత్రం ‘క్రైయింగ్ బేబీ’ అంటూ నేహాను ట్రోల్ చేస్తున్నారు. నేహాను ఇలా అనడానికి కారణం ఉంది. గతంలో నేహా ‘ఇండియన్ ఐడల్’లో పాల్గొన్న సమయంలో సహ పోటీదారుల బాధలు విని ఒక్కసారిగా ఏడ్చేశారు. పాపం అదే నేహా చేసిన తప్పు. ఆ రోజు జరిగిన విషయాలను ఇప్పుడు ట్యాగ్ చేసి, నేహాను ‘క్రైయింగ్ బేబీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడే అంతలా ఏడ్చావు. ఇప్పుడు బాస్‌గా(న్యాయ నిర్ణేతగా) ఇంకెంత ఏడుస్తావో’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తనను కామెంట్ చేసేవాళ్లందరికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు నేహా. తనను విమర్శించేవారిని ఉద్దేశిస్తూ.. ‘నేను ఏడ్చినందుకు నన్ను కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి నా నవ్వును కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక మీదట నేను చాలాసార్లు నవ్వుతూనే కనిపిస్తాను. నన్ను విమర్శించేవారందరిని ఒక్కటే అడుగుతున్నాను. నేను ఏడుస్తున్నానని కామెంట్ చేస్తున్నారు.. మరి నేను ఇతరులకు సాయం చేస్తుంటాను. ఆ విషయం గురించి కూడా కామెంట్ చేయండి. కెమెరా ముందు ఒకలా, బయట ఒకలా ఉండటం నాకు చేత కాదు. నేను కెమెరా ముందు ఎలా ఉంటానో నిజ జీవితంలో కూడా అలానే ఉంటాను. కెమెరా కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నవ్వాలనిపిస్తే నవ్వుతాను, ఏడుపొస్తే ఏడుస్తాను. అంతే తప్ప కెమెరా కోసం నా భావాలను నియంత్రించుకోను. భావోద్వేగాలు గల మనిషిగా నా గురించి నేను ఎప్పుడు గర్వంగా భావిస్తాను. ఈ కాలంలో జనాలు చాలా వరకూ ఎటువంటి భావోద్వేగాలు, స్పందనలు లేకుండా కఠినంగా ఉంటున్నారు. వాళ్లందరితో పోల్చుకుంటే నేను చాలా హాయిగా బతుకుతున్నాను’ అంటూ జవాబిచ్చారు. -
న్యాయమూర్తికే అన్యాయమా ?
అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు హద్దులు దాటాయి. సాక్షాత్తున్యాయమూర్తి కుటుంబాన్నే హతమారుస్తామని బెదిరించే స్థాయికి తెగించాయి.గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తినే భయభ్రాంతులకు గురిచేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత దినకరన్, ఎడపాడి, పన్నీర్‌సెల్వం రూపంలో పార్టీ మూడు చెక్కలైంది. ఎడపాడి, పన్నీర్ యుగళగీతం ఆలపించి ఏకంకాగా రెండు వర్గాలుగా మిగిలిపోయింది. శశికళ దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని చేపట్టిన ఎడపాడి, శశికళపై తిరుగుబాటు చేసి పన్నీర్‌సెల్వం ఏకమైన తనను ఒంటరివాడిని చే యడమేగాక పార్టీ నుంచి బహిష్కరించడాన్ని దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దినకరన్ తనకు మద్దతిచ్చే 19 మంది ఎమ్మెల్యేల చేత ప్రభుత్వానికి ఉపసంహరించుకున్నట్లుగా గవర్నర్‌కు ఉత్తరం ఇప్పించారు. అయితే ఇంతలో వీరిలో ఒక ఎమ్మెల్యే ఎడపాడి వైపునకు మొ గ్గారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని కూ లదోసే కుట్ర పన్నారనే ఆరోపణలపై మిగతా 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ అనర్హతవేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ ఫుల్ బెంచ్‌కు విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి వేటు చెల్లుతుందని తీర్పు చెప్పగా, స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయం చెల్లదని న్యాయమూర్తి సుందర్ తీర్పు వెల్లడించారు. దీంతో అనర్హత వేటు అంశం మూడో న్యాయమూర్తి ముంగిటకు వెళ్లింది. న్యాయమూర్తికి బెదిరింపులు ఈ నేపథ్యంలో అనర్హతవేటు పడిన 18 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్‌కు ఒక ఆకాశరామన్న ఉత్తరం అందింది. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల క్వార్టర్స్ సమీపంలో సుందర్ తన భార్య, కుమార్తెతో నివసిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆదివారంఅందిన ఉత్తరంలో ‘18 మంది ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పిన నిన్ను, నీ కుటుంబ సభ్యులను హతమారుస్తాం’ అని పేర్కొని ఉంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి దృష్టికి తీసుకెళ్లగా ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని గాలింపు చర్యలు ప్రారంభించారు. న్యాయమూర్తి సుందర్ ఇంటికి 24 గంటలపాటు బందోబస్తుకు సాయుధ పోలీసులను నియమించారు. న్యాయమూర్తి రాకపోకలు సాగించే దారుల్లోనూ బందోబస్తు పెట్టారు. -
వామ్మో చిన్నమ్మా.. నాకొద్దు ఈ పిటిషన్
చిన్నమ్మ శశికళ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించేందుకు న్యాయమూర్తినిరాకరించారు. తనకు ఈ కేసు వద్దు అని, మరో బెంచ్‌కు అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తికి బుధవారం సిఫారసు చేశారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల అమ్మ, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ అండ్ కుటుంబీకుల మీదున్న కేసుల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. అనేక కేసులో విచారణలో ఉన్నాయి. హైకోర్టులో కొన్ని, ఎగ్మూర్ కోర్టులో మరికొన్ని, ప్రత్యేక కోర్టులో ఇంకొన్ని ఇలా కేసుల విచారణ ఏళ్ల తరబడి వాయిదాల పర్వంతో సాగుతూ వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమె జైలుకు వెళ్లడంతో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణల వేగం పెరిగింది. దీంతో చిన్నమ్మ అండ్ కుటుంబాన్ని ఈ కేసులు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ చిన్నమ్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించడం గమనార్హం. నాకొద్దు ఈ పిటిషన్ : 1996–97 కాలంలో రూ. నాలుగు కోట్ల 97 లక్షలు విలువైన ఆస్తులకు గాను చెల్లించాల్సిన రూ. పది లక్షల 13 వేలు పన్నును శశికళ ఎగ్గొట్టినట్టుగా ఆదాయ పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న ఈ కేసును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టును చిన్నమ్మ ఆశ్రయించారు. ఆదాయ పన్ను శాఖ తన మీద దాఖలు చేసిన కేసు విచారణకు స్టే విధించాలని అందులో కోరారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. బుధవారం పిటిషన్ విచారణ న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రశాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ప్రశాంత్ తాను విచారించ దలచుకోలేదని వ్యాఖ్యానించారు. గతంలో తాను శశికళకు సంబంధించిన కేసులకు హాజరు అయ్యానని, ఈ దృష్ట్యా, తాను ఈ కేసును విచారించే లేనని స్పష్టం చేశారు. దీంతో మరో న్యాయమూర్తి సైతం పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ, దీనిని మరో బెంచ్‌కు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దీంతో తమ బెంచ్ ముందు ఉన్న ఈ పిటిషన్‌ను మరో బెంచ్‌కు అప్పగించాలని కోరుతూ న్యాయమూర్తి సుబ్రమణ్య ప్రశాంత్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి్జకి విజ్ఞప్తితో కూడి సిఫారసు చేశారు. ఈ దృష్ట్యా, కేసు విచారణ మరి కొంత కాలం జాప్యంతో సాగే అవకాశాలు ఎక్కువే. -
లాలూను శిక్షించిన జడ్జీ ఇంట్లో దొంగతనం
లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష వేసిన జడ్జీ శివపాల్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సీబీఐ కోర్జు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న శివపాల్ ఉత్తరప్రదేశ్‌లోని జలాలున్లో నివాసం ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి ఆయన ఇంట్లోకి దొంగలు చొరబడి 60,000 రూపాయలు, రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. శివపాల్ సోదరుడు సురేంద్ర సింగ్ గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగగొట్టి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ్‌పాల్ సింగ్ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
షరీఫ్ కూతురి కామాలు, ఫుల్‌స్టాపులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌పై జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. అవన్‌ఫీల్డ్ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అయితే ఆమె ప్రకటన చదివి వినిపిస్తున్న సమయంలో కామాలు, ఫుల్స్టాపులను కూడా చదువుకుంటూ పోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి వాటిని వదిలేసి ఉన్న మ్యాటర్ చదవాలంటూ ఆమెను కోరారు. అయినా మరయమ్ మాత్రం అలానే చదువుకుంటూ వెళ్లారు. వెటకారం చేస్తున్నారా? అంటూ ఒకానోక దశలో జడ్జి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫుల్‌స్టాపులు, కామాలు చదవకపోతే మొత్తం అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా చదివి వినిపిస్తున్నా’ అంటూ ఆమె ప్రశాంతంగా బదులిచ్చి కూర్చున్నారు. ఈ కేసులో జడ్జి అడిగిన మొత్తం 128 ప్రశ్నలలో 46కు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరయమ్ కంటే ముందు నవాజ్ షరీఫ్‌ను కూడా జడ్జి ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..16 మంది మృతి
బాగ్దాద్ : ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్ ప్రావిన్స్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాగ్దాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపాడని స్థానిక లుటెనంట్ కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారులవిగా గుర్తించారు. చనిపోయిన వారంతా ఈ ముగ్గురు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనాస్థలాన్ని సీజ్ చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు జుబౌరీ తెలిపారు. -
న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష
జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నా రని రాజకీయ నాయకులకు తెలుసు. చేతికందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదులుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధ మౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజకీయ పక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. వరుస ఘటనలు, చర్యల ఫలితంగా భారత న్యాయవ్యవస్థ నేడు చిక్కుకున్న ప్రమాదకర స్థితిని మనం ఏమని వర్ణించాలి? భారత అత్యున్నత న్యాయ మూర్తులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది? జడ్జీలు తమలో తాము వాదించుకుంటున్నారు. వ్యవస్థపై ప్రజా విశ్వాసం సన్న గిల్లింది. కార్యనిర్వాహక వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా న్యాయవ్యవస్థతో రాజీకి సిద్ధమౌతోంది. ఇదంతా ఒకింత నాటకీయంగా కనిపించవచ్చు. విషయం వివరిస్తాను. ఓ పేద మహిళ హక్కులు హరిస్తే, లేదా ప్రభుత్వం ఆమెపై దాడి చేస్తే ఆమె చివరికి ఎక్కడికి పోవాలి? దేశ సర్వోన్నత న్యాయ స్థానానికే అదే ప్రభుత్వ రక్షణ అవసరమైనప్పుడు ఆమెకు వ్యవస్థపై ఉన్న విశ్వాసం ఏమవుతుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ వారం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు ఆవేశంతో సమర్ధించింది. ప్రధాన న్యాయ మూర్తి పాత్ర నాటకీయంగా మారిపోయిందని మీకు అర్థమౌతుంది. అంతే కాదు, ఇదే వారం సుప్రీంకోర్టు జడ్జీ పదవికి ఆయన నేతృత్వంలోని కొలీ జియం సూచించిన ఇద్దరిలో ఒకరి నియామకాన్ని ఆమోదిస్తూ, రెండో సిఫా ర్సును మరోసారి పరిశీలనకు తిప్పిపంపుతూ ఆయనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు. రెండో జడ్జీ పేరు వెనక్కి పంపడానికి కేరళకు చెందిన చాలా మంది జడ్జీలు ఉన్నారని లేదా సీనియారిటీ తగినంత లేదని చెప్పిన కారణాలు నమ్మదగ్గవిగా లేవు. అంటే, రాజ్యాంగం అధికారాలను సమంగా పంపిణీ చేసినాగాని తనదే తుది అధికారమని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు ఇలా గుర్తుచేసింది. జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నారని రాజకీయ నాయకులకు తెలుసు. చేతి కందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదు లుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధమౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజ కీయపక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. నిజంగా ఈ అభిశంసన తీర్మానం ఆనాలోచితమైనదేగాక అనుచితమైనది. ఈ తీర్మానం ఎలాంటి రాజకీయ ప్రయోజనం సాధించలేదు. ఇది కేవలం సుప్రీం కోర్టును, మరీ ముఖ్యంగా సీజేఐని మరింత బలహీనపరిచింది. న్యాయవ్యవస్థపై పట్టుకోసం ‘రాజకీయం’ బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఎంత ద్వేషించుకుంటున్నాగాని న్యాయ వ్యవస్థపై పెత్తనానికి మాత్రం రెండూ ఏకమయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య కీచులాట లున్న ఈ పార్లమెంటు శరవేగంతో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు చట్టం చేసింది. అత్యున్నత న్యాయవ్యవస్థ ముఖ్యంగా జడ్జీల నియామకంలో కొలీజియం అధికారాలకు కత్తెర వేయడానికి ఈ చట్టం ఆమోదించారు. సుప్రీంకోర్టు కూడా అంతే హడావుడిగా ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ కొట్టివేసింది. రాజకీయ వ్యవస్థ మొత్తం తన అధికారాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. రెండు ప్రధాన పార్టీలూ పరస్పరం పోరు సాగిస్తున్నట్టు నటిస్తూ ఉమ్మడి ప్రత్యర్థి అయిన న్యాయవ్యవస్థను దెబ్బదీస్తున్నాయి. ఎన్‌జేఏసీ చట్టాన్ని ఐదుగురు జడ్జీల బెంచీ 4–1 మెజారిటీ తీర్పుతో చెల్లకుండా చేయడమేగాక కార్య నిర్వా హక వర్గానికి న్యాయవ్యవస్థ నిరంతరం ‘రుణపడి ఉండేలా’ చేయజాలమని వ్యాఖ్యానించింది. జడ్జీల నియామకానికి సంబంధించిన తమ సిఫార్సులకు విలువ లేక పోవడంతో కొలీజియంలోని మిగిలిన నలుగురు సీనియర్ జడ్జీల నుంచి ఎదు రౌతున్న ప్రశ్నలు, జడ్జీ బీహెచ్ లోయా మృతి కేసు, వైద్య కళాశాలల కేసుల్లో తీర్పులను నిరసిస్తూ సమరశీల లాయర్ల విమర్శలు, కాంగ్రెస్ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం, సుప్రీంకోర్టును సమర్థిస్తూ బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రక టనలతో ప్రధాన న్యాయమూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఇంత రభస జరిగాక న్యాయవ్యవస్థ కోసం ఆయన తిరిగి పోరాడగలరని ఆశించగలమా? అసంతృ ప్తితో ఉన్న సోదర న్యాయమూర్తులతో ఓ అంగీకారానికి రావడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలరని అంచనా వేయ గలం? రాజకీయనేతలు న్యాయవ్యవస్థను పీడిస్తున్న కొత్త బలహీనతలన్నిం టినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కూపీలాగుతున్నారు. జడ్జీల పదవులకు కొలీ జియం సిఫార్సుల ఆధారంగా నియామకాలను జాప్యం చేయడం సర్వ సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఓ హైకోర్టు జడ్జీ పదవీకాలానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్పును ప్రభుత్వం మార్చేసింది. కొలీ జియం దాన్ని సహించింది. దీంతో దూకుడు పెంచిన కేంద్రసర్కారు సుప్రీం కోర్టుకు జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం సిఫార్సును మరోసారి పరిశీలనకు వెనక్కి పంపింది. మరోసారి ఈ విషయంలో కొలీజియం మిన్నకుండిపో యినా లేదా తమలో తాము కీచులాడుకున్నా ప్రభుత్వం న్యాయవ్యవస్థను పలుచన చేసే మరింత దుందుడుకు చర్యకు సిద్ధమౌతుందని మీరు నిస్సందే హంగా భావించవచ్చు. సుప్రీంకోర్టు నీరస పోకడలు ఇలాగే కొనసాగితే ప్రభు త్వం జడ్జీల సీనియారిటీ సూత్రానికి తిలోదకాలిస్తుంది. మరుసటి సీజేఐగా అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రంజన్ గోగోయ్ నియామకానికి అంగీ కారం తెలపకపోయే ప్రమాదం పొంచి ఉంది. న్యాయమూర్తులపై చిన్నచూపుతో మరింత ప్రమాదం ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రజల సానుభూతిని చాలా వరకు కోల్పోయిం దని ప్రభుత్వం భావించడంలో ఆశ్చర్యం లేదు. ఓ పక్క విచారణకు నోచుకో కుండా వేలాది కేసులు పడి ఉండగా, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే తొందరలో న్యాయవ్యవస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) స్వీకరి స్తోంది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లదంటూ వేగంగా తీర్పు ఇవ్వడం వల్ల జడ్జీలు తమ ప్రయోజనాలు కాపాడుకునే సందర్భాల్లోనే త్వరగా నిర్ణయాలు ప్రకటిస్తారనే భావన బలపడింది. లోయా కేసు తీర్పును విమర్శించేవారిపై చర్యకు డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్(పిల్)ను ప్రధాన న్యాయమూర్తి విచార ణకు తీసుకుంటే పై అభిప్రాయం జనంలో మరింత బలపడే ప్రమాదముంది. న్యాయవ్యవస్థ అందరినీ కాపాడే సంస్థగా కాకుండా తన కోసమే తాను పోరాడే వ్యవస్థగా దిగజారినట్టు కనపిస్తుంది. ఈ విషయంతోపాటు జడ్జీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఉమ్మడి ప్రయోజనాలు కాపాడే విషయంలో భారత ప్రజలతో న్యాయవ్యవస్థకున్న సామాజిక అంగీకారాన్ని దెబ్బదీస్తాయి. అందుకే తన అధికారాల విషయంలో ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికి న్యాయవ్యవస్థకు ఇదే సరైన సమయం. ఆత్మగౌరవం కోసం పాడాల్సిన పాట న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఆలోచిస్తుంటే స్వాతంత్య్ర పోరాటం తొలి దశలోని ఓ అధ్యాయం నాకు గుర్తుకొస్తోంది. భూమి యజమానుల ఆస్తులపై తమకు తిరుగులేని అధికారాలిచ్చే కాల నైజేషన్ బిల్లును బ్రిటిష్ పాలకులు 1906–1907లో తీసుకొచ్చారు. భూము లున్న ఏ రైతు(పంజాబ్‌లో సొంత భూములున్న రైతును జాట్ అని పిలిచే వారు) పొలాలనైనా సొంతం చేసుకోవడానికి ఆంగ్ల సర్కారుకు అధికారం ఇచ్చే దుర్మార్గమైన నిబంధన ఈ బిల్లులో పొందుపరిచారు. లాలా లజపత్ రాయ్, భగత్‌సింగ్ చిన్నాన్న అజిత్‌సింగ్ ఈ నిబంధనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నడిపారు. ఈ జనాందోళనకు స్ఫూర్తినిచ్చే పోరాట గీతాన్ని ల్యాల్ పూర్ (ఇది నేటి పాక్ నగరం ఫైసలాబాద్)కు చెందిన పత్రికా సంపాదకుడు బంకే దయాళ్ రాశారు. ‘‘పగ్డీ సంభాల్ జాట్టా, పగ్డీ సంభల్ ఓయే– తేరా లూట్ నా జాయే మాల్ జాట్టా’’ (తల పాగా బిగించే ఉంచు, రైతు సోదరా, లేకుంటే నీ సంపదను, ఆత్మగౌరవాన్ని వారు లూటీ చేస్తారు) అంటూ దయాళ్ రాసిన పాట ఉద్యమాన్ని ముందుకురికించింది. అందుకే ఈ ఉద్యమం పగ్డీ సంభల్ జాట్టా ఆందోళన అనే పేరుతో చరిత్రలో భాగమైంది. బ్రిటిష్ పాలకులు లాలా లజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌ను బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అయినా ఈ పోరు గీతం భగత్‌సింగ్ కాలం వరకూ జనం గుండెల్లో నిలిచే ఉంది. తర్వాత అనేక తరాల భారతీయులు ఈ పోరాట పాటను భగత్‌సింగ్‌తో ముడిపెడతారు. అత్యంత జాగ్రత్తతో, గొప్ప ఆలోచనాత్మకత, సావధానతలతో నేను దీన్ని రాస్తున్నాను. ఇది భారతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ‘‘çపగ్డీ సంభాల్ జాట్టా’’ను పాడవలసిన క్షణం. నిబద్ధ న్యాయవ్యవస్థ కోసం ఇంది రాగాంధీ వెదుకులాట, 1973 తర్వాత అదే నిబద్ధతను పెకిలిస్తూ పోయిన ఘటనల పర్యవసానాల తర్వాత మన న్యాయవ్యవస్థ ఇప్పుడు మళ్లీ అత్యంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కులబంధనాలతో కూడిన కొలీజి యంను సంస్థాగతం చేయడం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని న్యాయ వ్యవస్థ భావించి ఇప్పటికి రెండు దశాబ్దాలయింది. కానీ పేలవమైన నియా మకాలు చేయడం, సత్వర సంస్కరణలను నిర్లక్ష్యపర్చడం, న్యాయ ప్రక్రి యలో జాప్యం పట్ల సాధికారత కలిగిన బృందాల్లో పెరుగుతున్న అసహ నాన్ని గ్రహించడంలో విఫలం కావడం, న్యాయమూర్తుల బలహీనతలను గమనించడంలో సంశయానికి గురికావడం వంటి పరిణామాలతో న్యాయ వ్యవస్థ రాన్రానూ తన్ను తాను బలహీనపర్చుకుంది. అయితే ఈ విషయాలను మళ్లీ చెప్పి న్యాయవ్యవస్థను బాదటానికి ఇది సందర్భం కాదు. ఈ పోరాటంలో న్యాయవ్యవస్థ నష్టపోయినట్లయితే, ఆ శాశ్వత నష్టం నుంచి కోలుకోవడం కష్టం. న్యాయవ్యవస్థే కాదు పౌరులుగా మనందరమూ నష్టపోతాం. ప్రధాన న్యాయమూర్తి ఇష్టపడినా ఇష్టపడకపో యినా.. సుప్రీంకోర్టు కోసం, తన కొలీజియం కోసం పోరాడి తీరవలసిన స్థితిలో తను ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చ జరప డానికి కూడా నేను సిద్ధపడను. సీజేఐ సోదర జడ్జీలకు సంబంధించినంత వరకు 1973–77 నాటి చరిత్ర జ్ఞాపకం వారిని కాస్త సంతృప్తిపర్చవచ్చు. ఇందిరాగాంధీ తీసివేత చర్యల ఫలితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా ఎదిగివచ్చిన ఆ న్యాయమూర్తి పేరును కూడా ఇప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. కానీ ఆమె తప్పు నిర్ణయానికి నిరసనగా పదవికి రాజీ నామా చేసిన న్యాయమూర్తి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శిఖర స్థాయిలో నిలబడిపోయారు. అలాంటి పరీక్షకు మళ్లీ సిద్ధపడేందుకు మన న్యాయమూర్తులలో కొందరయినా ముందుకు రావడానికి ఇష్టపడవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు కేసులో సంచలన తీర్పును వెల్లడించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిన్ ఆమోదించలేదు. అంతేకాకుండా జడ్జి రవీందర్ రెడ్డి పెట్టుకున్న తాత్కాలిక సెలవును కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన గురురవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. కాగా మక్కా మసీదు పేలుళ్ల కేసుపై సోమవారం ఉదయం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అనంతరం ఆయన తన రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. కాగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ప్రచారం జరిగింది. -
మక్కా పేలుళ్ల తీర్పునిచ్చిన జడ్జి రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పును వెలువరిచిన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఐదుగురు నిర్దోషులు అంటూ సోమవారం ఉదయం తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రవీందర్ రెడ్డి రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే తీర్పు తరువాత బెదిరింపు కాల్స్ వచ్చాయని రవీందర్ రెడ్డి తన మిత్రులకు చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్ అయిన 11 మందిలో ఆయన ఒకరు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం గతంలో రాజీనామా సైతం చేశారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. ఎన్ఐఏ జడ్జిగా రాజీనామా చేసిన రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జల్లా. ప్రస్తుతం ఆయన తెలంగాణ జ్యుడీషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ రాజీనామాకు కారణం ఒత్తిల్లేనని భావిస్తున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర మనోవ్యధతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నా అసలు కారణం మాత్రం తెలియరాలేదు. -
మక్కమసీదు పేలుడు కేసు: జడ్జి రాజీనామా
-
మరో అవినీతి జడ్జి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఒకటవ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి రాధాకృష్ణ మూర్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం ఎక్సైజ్ పోలీసులు గాంధీనగర్‌లో అరెస్ట్ చేసిన ఓ బాధితుడికి బెయిల్ మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశాడని రాధాకృష్ణ మూర్తిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో బాధితుడి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. జడ్జి రాధా కృష్ణపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఏసీబీ డెప్యూటీ డైరెక్టర్ రమణ కుమార్ స్పందిస్తూ.. ‘ఒక బెయిల్ విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్ట్ ఆదేశాలతో జడ్జి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో సోదాలు చేస్తున్నాం. డ్రగ్స్ కేసులో ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడం కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణ ఉంది. ఆల్వాల్తో పాటు మరో రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రాధా కృష్ణ మూర్తి ఇంటితో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఆస్తులను గుర్తించాం కానీ అవి సక్రమమా కాదా అనేది దర్యాప్తులో తేలాలి. బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ ఒక్క కేసులోనే కోర్ట్ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నాం’ అని వెల్లడించారు. -
సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: ఒక న్యాయమూర్తిని పదోన్నతిపై కర్ణాటక హైకోర్టుకు పంపే ముందు ఆయనపై ఓ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును సుప్రీంకోర్టు కొలీజియం పట్టించుకోలేదని న్యాయశాఖ సీనియర్ అధికారులు తెలిపారు. న్యాయవ్యవస్థలో నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న జస్టిస్ చలమేశ్వర్ ఆరోపణలను వారు ఖండించారు. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కృష్ణ భట్‌కు పదోన్నతి ఇవ్వాలన్న కొలీజియం సిఫారసుపై ప్రభుత్వం తొందరపడలేదని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు పట్టించుకోలేదనే కారణంతోనే కొలీజియం ప్రతిపాదనలను న్యాయశాఖ రెండుసార్లు వెనక్కి పంపిందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఆ అధికారులు వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి భవన్‌కు బాధితురాలు ఫిర్యాదు చేయటంతో పదోన్నతి ప్రతిపాదనను రెండోసారి కొలీజియంకు పంపారని తెలిపారు. నిర్దేశిత విధివిధానాల మేరకు..ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్‌కు మాత్రమే న్యాయశాఖ లేఖ రాసిందనీ, అంతేకానీ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాదన్నారు. అలాంటి అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా కొలీజియం లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కనపెట్టిందని తెలిపారు. -
న్యాయవ్యవస్థలో తోలిసారి.. న్యాయాధికారి అరెస్ట్ !
-
న్యాయాధికారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఓ న్యాయాధికారి ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్టు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనా ర్హం. శనివారం సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.20కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మీడియాతో గాంధీ మాట్లాడారు. వ్యక్తిగత కోపంతో బంధువుల్లోని కొందరు అనిశాకు తప్పుడు సమాచారం అందించారన్నారు. తన భార్యకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని సైతం అక్రమాస్తులంటున్నారని పేర్కొన్నారు. మీడియాతో మాట్లడాక ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో శనివారం సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఓ న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం. సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శనివారం రాత్రి అనంతరం కూడా సో దాలు కొనసాగుతున్నాయి. సమీప బంధువు ఫిర్యాదుతో గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన సమీప బంధువు ఒక రు ఇటీవల ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అన్ని వివరాలు, ఆధారాలు సమర్పించారు. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఏసీబీ అధికారులు.. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కలసి.. తమకు అందిన ఫిర్యాదు, తాము సేకరించిన ఆధారాలను సమర్పించారు. పూర్తిస్థాయి ఆధారాలు ఉండటంతో గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుకు ఏసీజే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు శనివారం గాంధీపై కేసు నమోదు చేసి... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, మరికొన్ని చోట్ల గాంధీ, ఆయన సమీప బంధువుల నివాసాల్లో ఏకకాలం లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదేళ్లకు పైగా ఒకే కోర్టులో.. మల్లంపేట గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2015లో హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన గాంధీ కుమార్తె వివాహ వేడుకల్లో ఆ నేత చాలాసేపు గడిపారని కొందరు న్యాయాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఢిల్లీస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సైతం గాంధీ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఓ దశలో గాంధీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏకంగా ఐదేళ్లకుపైగా కొనసాగారు. ఓ న్యాయాధికారి ఒకే కోర్టులో ఐదేళ్లకుపైగా కొనసాగడాన్ని అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. దాడుల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.57 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. బంజారాహిల్స్‌లో రూ.10.52 లక్షల విలువైన ఫ్లాట్ డీడీ కాలనీలో రూ.33.51 లక్షల విలువైన ఫ్లాట్ వారాసిగూడలో రూ.35 లక్షల విలువైన ఇల్లు వారాసిగూడలోనే రూ.70 లక్షల విలువైన నూతన మూడు అంతస్తుల భవనం రూ.12.30 లక్షల విలువైన వెర్నా కారు రూ.17 లక్షల విలువైన కారోలా ఆల్టిస్ కారు రూ.3.5 లక్షల విలువైన ఆల్టో కారు రూ.60 వేల విలువైన హోండా యాక్టివా టూ వీలర్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో రూ.48.65 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కరగపాడులో రూ.23 లక్షల విలువైన 8.73 ఎకరాల భూమి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో రూ.30 లక్షల విలువైన 1.5 కేజీల బంగారం బ్యాంకు లాకర్లో రూ.2 లక్షల విలువగల 4 కేజీల వెండి అభరణాలు బ్యాంకు ఖాతాలో రూ.9 లక్షల నగదు నిల్వ.. ఇంట్లో రూ.89 వేల నగదు రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు రూ.33 లక్షల విలువగల చిట్టీల డబ్బు -
ఏసీబీ వలలో చిక్కిన లేబర్ కోర్టు జడ్జీ
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ శనివారం ఉదయం దాడులు జరిపింది. ఆదాయానికి మించి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో వారాసిగూడలోని జడ్జి గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపారు. హైకోర్టు అనుమతితో జడ్జి అక్రమ ఆస్తులపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ జిల్లా జడ్జి క్యాడర్లో ఉన్నారు. ఏసీబీ అధికారులు జడ్జీపై కేసు నమోదు చేసి విచారుస్తున్నారు. వారాసిగుడలోని జడ్జీ ఇంటితో పాటు.. నాంపల్లి, డీడీ కాలనీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని కొవ్వూరులో రెండు చోట్ల, ఏలూరు, రాజమండ్రితో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టింది. -
ఐదుగురికి జీవిత ఖైదు..ముద్దాయి పరారీ
గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభాల కోటేశ్వరరావు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి తీర్పివ్వగానే కోర్టు నుంచి ముద్దాయి రఫీ చాకచక్యంగా పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో సత్తెనపల్లిలోని ఓ గోడౌన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోటేశ్వరరావును కొంతమంది వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ స్థల విషయమై కోటేశ్వర రావుతో కొంతమంది వ్యక్తులకు పొరపొచ్చాలు రావడంతో వారు హత్యకు పూనుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా ఒకరు చనిపోయారు. మిగిలిన ఐదుగురికి గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.1000 జరిమానా కూడా విధించారు. పారిపోయిన ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడంలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లంచం తీసుకున్న ఇద్దరికి కఠిన శిక్ష
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు. అనంతరం వీఆర్వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్హాండ్గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు. -
బాలిక కిడ్నాప్ కేసులో ముద్దాయిలకు యావజ్జీవం
జయపురం: ఒక బాలికను కిడ్నాప్ చేసిన కేసులో 16 ఏళ్ల తరువాత కొరాపుట్ జయపురం జిల్లా జడ్జి ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చారు. శిక్ష పడిన ముద్దాయిలు జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సి. భుజంగఆచారి, కె. స్వామికృష్ణ, టి. రాకేష్ కుమార్,సి. కిరణ్ కుమార్, సుమేష్ శెట్టిలు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్ టెలికాం డివిజన్ మేనేజర్ కె. రాజశేఖర్ 4 యేళ్ల కుమార్తె 2002 డిసెంబర్ 18వ తేదిన ఉదయం 11.15గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి తండ్రి రాజశేఖర్‌కు ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు సూచించిన ప్రకారం రాజశేఖర్ డబ్బుతో ఘాట్‌గుమార్ సమీపంలోగల కారభైరవ మందిరం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో రాజశేఖర్ తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు రాజశేఖర్ కొరాపుట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆ మరునాడు 19వ తేదీన కొరాపుట్ కాఫీబోర్డు ప్రాంతంలో ఒక విద్యార్థినిని చూసి ఆమెను రాజశేఖర్ ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తరువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదల కేసును సుదీర్ఘంగా విచారించిన జిల్లా జడ్జి విద్యుత్ కుమార్ మిశ్రా 24 మంది సాక్షులను విచారించి ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేకపోతే మరో రెండేళ్ల జైలు జీవితం గడపాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఎస్. కామేశ్వర రావు, కైలాశ ఖొరలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. మరో నిందితుడు ఉమానాయక్ మరణించాడు. ఈ కేసును ప్రభుత్వ న్యాయవాది కైలాస్‌పట్నాయక్ వాదించారు. -
లాలూ కోసం బెదిరింపులు.. యోగి సీరియస్
లక్నో : దాణా స్కామ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. యూపీకి చెందిన ఇద్దరూ జడ్జిలే వీటి వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావటంతో యోగి విచారణ కమిటీని నియమించారు. జలౌన్ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్ డివిజినల్ న్యాయమూర్తి ఇద్దరూ తీర్పు వెలువడక ముందు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ ను ఫోన్లో సంప్రదించారంట. లాలూ శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్‌ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో వార్త ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. దీంతో యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని ఝాన్సీ కమిషనర్ అమిత్ గుప్తా వెల్లడించారు. మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్ సింగ్ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్‌లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్‌తో తాము చర్చించినట్లు సబ్ డివిజినల్ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్ అక్తర్ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. I never talked to him (Shivpal Singh) over phone. He must issue a statement, if it happened. On the date mentioned in reports, I was in my home town, on a leave.: Mannan Akhtar, Jalaun DM on reports of him calling Special Court Judge Shivpal Singh for Lalu Yadav on #FodderScam pic.twitter.com/X920OtaQJO — ANI UP (@ANINewsUP) January 11, 2018 -
12 ఏళ్లు..లక్ష కేసులు!
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు సీనియర్ జడ్జీగా పనిచేస్తున్న సుధీర్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2005 అక్టోబర్ 5వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన ఈయన బుధవారం నాటికి (12 ఏళ్లలో) లక్ష కేసులను పరిష్కరించారు. హైకోర్టు లక్నో బెంచ్‌లో ఉండగానే జడ్జి సుధీర్ అగర్వాల్ 10వేల కేసులను పరిష్కరించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. -
సంచలనాల సైనీ!
న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ న్యాయమూర్తి ఓం ప్రకాశ్ సైనీ కొన్ని కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వాస్తవాలతో సీబీఐ చార్జిషీటు రూపొందించిందని, నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్టబద్ధ సాక్ష్యం కోసం ఏడేళ్ల సమయం ఎదురుచూశానని, అయితే తన ఎదురుచూపులు పూర్తిగా వ్యర్థమయ్యాయని పేర్కొంటూ సీబీఐ విచారణ తీరును ఆయన తప్పుపట్టారు. క్విడ్ ప్రొ కొ ఆరోపణలకు సీబీఐ ఎలాంటి సాక్ష్యాల్ని సమర్పించలేదని.. అందువల్ల రాజాపై ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడేళ్లు వ్యర్థం.. గత ఏడేళ్లుగా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా సరైన సాక్ష్యాన్ని తీసుకొస్తారేమోనని అన్ని పనిదినాల్లో, వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కోర్టు గదిలో కూర్చున్నాను. అయితే నా ఎదురుచూపులు వ్యర్థమయ్యాయి. న్యాయబద్ధమైన ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ వదంతులు, పుకార్లు, ఊహాగానాలతో కూడిన జన సామాన్య దృష్టితో ముందుకెళ్లారని అర్థమవుతోంది. న్యాయ విచారణలో అలాంటి వాటికి స్థానం లేదు. ఈ కేసులో కుట్రకు రాజా సూత్రధారి అనేందుకు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవు. రాజా తప్పుచేసినట్లు, కుట్ర లేదా అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఉత్సాహంగా మొదలుపెట్టి.. సీబీఐ ఈ కేసు విచారణను ఎంతో ఆవేశంగా, ఉత్సాహంతో మొదలుపెట్టింది. కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ ఎంతో జాగత్తగా, రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల ... ఏం నిరూపించాలని ప్రాసిక్యూషన్ భావిస్తుందో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. తుది దశలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ), సీబీఐ ప్రాసిక్యూటర్లు ఎలాంటి సమన్వయం లేకుండా పనిచేశారు. కేసు విచారణ చివరికొచ్చేసరికి ప్రాసిక్యూషన్ ప్రమాణాలు పూర్తిగా దిగజారడంతో పాటు.. ఎలాంటి దశా దిశా లేకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా తయారైంది. సీబీఐ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనేక దరఖాస్తులు, వివరణలు సమర్పించినా.. విచారణ చివరి దశలో మాత్రం ఒక్క సీనియర్ అధికారి, ప్రాసిక్యూటర్ కూడా వాటిపై సంతకాలు చేసేందుకు మొగ్గు చూపలేదు. దరఖాస్తులపై సంతకాల గురించి నేను ప్రశ్నించినప్పుడు.. ఎస్పీపీ సంతకం చేస్తారని సీబీఐ ప్రాసిక్యూటర్ చెప్పగా.. ఎస్‌పీపీని అడిగితే సీబీఐ సిబ్బంది సంతకం చేస్తారని సమాధానమిచ్చారు. కోర్టుకు సమర్పించిన, చెప్పిన అంశాలపై బాధ్యత తీసుకునేందుకు విచారణాధికారులు గానీ ప్రాసిక్యూటర్లు గానీ సిద్ధంగా లేరని దీనిని బట్టి అర్థమవుతోంది. తుది వాదనల సమయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించలేదు. దానికి బదులుగా.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు లిఖితపూర్వకంగా ఇస్తే తాను సమర్పిస్తానంటూ కోర్టుకు తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రతులపై సంతకాలు చేసేందుకు కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధంగా లేకపోవడం అత్యంత బాధాకరం. ఎవరి సంతకం లేకపోతే కోర్టులో ఆ పత్రానికి ఉపయోగం ఏమిటి? ‘క్విడ్ ప్రొ కొ’కు ఎలాంటి ఆధారాలు లేవు ఏ రాజాను ప్రశ్నించే సమయంలో ప్రాసిక్యూషన్ మొదటిసారి ‘క్విడ్ ప్రొ కొ’ పదం వాడింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన మొత్తం ఆధారాల్లో.. రూ. 200 కోట్ల బదిలీని అక్రమ ప్రతిఫలంగా నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాన్ని పేర్కొనలేదు. అలాగే కలైంగర్ టీవీలో పెట్టుబడి పెట్టిన నాలుగు సంస్థలు.. ఆ పెట్టుబడిని సాధారణ వ్యాపార లావాదేవీలుగా నమ్మించేందుకు వాటి గుర్తింపును దాచిపెట్టాయన్న ఆరోపణకు సాక్ష్యం సమర్పించలేదు. రాజాను దోషిగా నిరూపించేందుకు అవసరమైన వ్యతిరేక సాక్ష్యం లేదని సీబీఐ చేసిన నిరుపయోగమైన క్రాస్ ఎగ్జామినేషన్‌తో అర్థమవుతోంది. అందువల్ల కలైంగర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టడంలో రాజా పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. అందుకు రాజాను తప్పుపట్టలేం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయంలోని సీనియర్ అధికారులు వాస్తవాల్ని మన్మోహన్‌కు తెలియకుండా కప్పిపుచ్చినందుకు రాజాను తప్పు పట్టలేం. రాజా లేఖలోని సంబంధిత, వివాదాస్పద అంశాల్ని మన్మోహన్‌కు తెలియకుండా పులక్ ఛటర్జీ దాచిపెట్టారు. అందువల్ల ప్రధానిని రాజా తప్పుదారి పట్టించారని లేక ఆయనకు తెలియకుండా వాస్తవాల్ని దాచిపెట్టారన్న ప్రాసిక్యూషన్ వాదనలో ఎలాంటి నిజం లేదు. నేర్పుగా ఈ కుంభకోణాన్ని అల్లారు కొందరు నేర్పుగా కొన్ని ఎంపికచేసుకున్న వాస్తవాలతో 2జీ కుంభకోణాన్ని అల్లారు. ఊహించని స్థాయిలో అవినీతి జరిగిందని అనుకునే స్థాయికి అంశాల్ని పెద్దది చేసి చూపించారు. ఈ కేసులో తప్పుడు వాస్తవాలతో అద్భుతంగా సీబీఐ చార్జిషీటును తయారుచేసింది. అయితే 2జీ కేసులో నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో విఫలమైంది. టెలికం శాఖకు చెందిన కొందరు అధికారుల చర్యలు, నిర్లిప్తత వల్ల ఈ కేసులో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిఒక్కరూ భావించారు. వారి చర్యలు ఒక పెద్ద కుంభకోణం జరిగినట్లు ప్రజలు ఊహించేదిశగా ప్రేరేపించాయి. టెలికం శాఖ రికార్డుల ప్రకారం.. యూఏఎస్ఎల్(యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్స్) కోసం దరఖాస్తుల పరిశీలన, లైసెన్స్‌ల కేటాయింపుల్లో కొందరు అధికారుల నిర్వాకం వల్ల ఆ శాఖలో ఎంత గందరగోళం ఉందో స్పష్టమైంది. అధికారిక బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. వారే స్వయంగా రూపొందించిన అధికారిక రికార్డులతో తమకు సంబంధం లేదని చెప్పి చంచల మనస్తత్వంతో, పిరికితనంగా వ్యవహరించారు. రికార్డుల్లో పేర్కొన్న దానికి భిన్నంగా తప్పును మరొకరిపై నెడుతూ వాంగ్మూలమిచ్చారు. సంచలనాల సైనీ! 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎవరూ ఊహించని రీతిలో తీర్పు ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓంప్రకాశ్ సైనీ(58) 1980ల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన ఆరేళ్లకు పరీక్ష రాసి మేజిస్ట్రేట్ అయ్యారు. హరియాణాకు చెందిన సైనీ ఢిల్లీ ప్రత్యేక పోటా జడ్జీగా ఎర్రకోట కాల్పుల కేసులో నిందితులకు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్‌ను దోషిగా తేలుస్తూ ఆయన విధించిన మరణశిక్షను తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఖరారుచేశాయి. పలు సున్నితమైన కేసుల్ని విచారించడంతో సైనీకి కేంద్రం 24 గంటలపాటు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. టెలికాం స్పెక్ట్రమ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఢిల్లీ ప్రభుత్వం సైనీ నేతృత్వంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 2జీ కేసుకు ముందు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసును సైనీ విచారించారు. చివరికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడీ సహాయకులు ఆరుగురిని దోషులుగా తేల్చి జైళ్లకు పంపారు. 2జీ కేసులో నిందితురాలైన డీఎంకే ఎంపీ, తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి కూమార్తె కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి సైనీ నిరాకరించడం అనూహ్య పరిణామం. ఆమె మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎందరినైనా ప్రభావితం చేయగల శక్తిమంతమైన నేత కావడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. 2జీ కేసు విచారణ సందర్భంగా ఎంతటి పెద్ద వ్యాపారవేత్తలనూ వదలకుండా వారు కోర్టులో క్రమశిక్షణ పాటించేలా సైనీ వ్యవహరించి అందరి ప్రశంసలు పొందారు. మొబైల్ టెలికాం రంగంలో హేమాహేమీలైన ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిత్తల్, హచిసన్ మేక్స్ అధినేత అసీమ్ ఘోష్, స్టెర్లింగ్ సెల్యూలర్ చీఫ్ రవి రూయాలను తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సైనీ కోర్టుకు రప్పించారు. ‘గత ఏడేళ్లుగా వేసవి సెలవులతో సహా అన్ని పనిదినాల్లో నేను ఉదయం పది నుంచి ఐదింటి వరకూ ఓపెన్ కోర్టులో కూర్చున్నా. ఎవరైనా చట్టపరంగా నిలబడే సాక్ష్యం ఏదైనా తీసుకొస్తారేమోనన్న నా ఎదురుచూపులు నిష్ఫలమయ్యాయి’అని సైనీ తన తీర్పులో చెప్పిన మాటలు ఆయన నిజాయితీకి మచ్చుతునకలు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏడుగురికి జీవిత ఖైదు
సాక్షి, ఆదిలాబాద్: కోడలిని హత్య చేసిన కేసులో అత్తమామలతోపాటు కుటుంబ సభ్యులు ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక జిల్లా అదనపు న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మీ సంచలన తీర్పునిచ్చారు. లైజన్ అధికారి వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల్‌వాడ కాలనీకి చెందిన శాలినికి ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పవార్ మస్నాజితో 2013లో వివాహం జరిగింది. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన వస్తువుల కోసం శాలిని, ఆమె తల్లి కానిస్టేబుల్ సర్దార్‌సింగ్‌తో కలిసి శాలిని అత్తగారింటికి వెళ్లారు. తమ కుమారుడి మృతికి కోడలే కారణమంటూ 2015 ఏప్రిల్ 13న శాలినిపై అత్తమామలు పవార్ లక్ష్మణ్, మతురబాయిలతోపాటు బావలు రమేశ్, సంజీవ్, బాలాజీ, తోడికోడళ్లు సులోచన, తానాబాయిలు కర్రలతో దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో శాలిని అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె వెంట వెళ్లిన కానిస్టేబుల్‌ను బంధించి దాడికి పాల్పడ్డారు. శాలిని తల్లి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. దాడిపై కానిస్టేబుల్ దరఖాస్తు ఇవ్వడంతో అప్పటి ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేశారు. సీఐ మోహన్ చార్జీషీటు దాఖలు చేయగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ 24 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువైనందున ఈ కేసుకు సంబంధించి సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి భరతలక్ష్మీ ఏడుగురు నేరస్తులకు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.20,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.