
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన గేదెల తుషార్‌రావు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. తుషార్‌రావు తండ్రి నారాయణరావు (దాసునాయుడు) ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన సుప్రీంకోర్డు న్యాయవాదిగా పనిచేశారు.
న్యాయవాది కుటుంబంలో పుట్టిన తుషార్‌రావు ఇన్నాళ్లూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ జడ్జిగా నియామకమయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం రావడం గర్వంగా ఉందని వీరఘట్టం జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, ఆయన మేనల్లుడు ధనుకోటి శ్రీధర్ పేర్కొన్నారు. (చదవండి: అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment