Parvathipuram Manyam District
-
ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్
సాలూరు: పవన్‌కళ్యాణ్ ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా గిరి శిఖర గ్రామమైన సిరివర రహదారి శంకుస్థాపనలో పాల్గొన్నారు. పర్యటనలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకంగా భద్రతా దళాల కళ్లుగప్పి.. ఐపీఎస్ అధికారినంటూ ఓ డూప్లికేట్ పోలీస్ హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.నకిలీ ఐపీఎస్ అరెస్ట్స్వప్రయోజనాల కోసం ఐపీఎస్ అవతారమెత్తిన నకిలీ ఐపీఎస్ బి.సూర్యప్రకాశ్‌ను పోలీసులు శని వారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్ వివరించారు. విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన బి.సూర్యప్రకాశ్ 2003 నుంచి 2005 వరకు పంజాబ్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసి మానే శాడు. తరువాత బీటెక్, ఎంబీఏ పూర్తిచేసి పలు వ్యాపారాలు సాగించాడు. తన తండ్రి తవిటి బాబు కరోనాతో 2020లో మృతి చెందారు.ఆ సమయంలో తన తండ్రి ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి దత్తిరాజేరు మండలం గడసాం రెవెన్యూ పరిధిలో సుమారు 9.79 ఎకరాలను అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఇంట్లో లభ్యమైన ప త్రాల ద్వారా సూర్యప్రకాశ్ తెలుసుకున్నాడు. తండ్రి మరణంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రావాలని సదరు రైతులను సూర్యప్రకాశ్ కోరగా నిరాకరించారు. తను ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యా నని డిసెంబర్ 2023లో కుటుంబీకులు, బంధు వులను నమ్మించాడు. ట్రైనింగ్ కోసమంటూ 2024 జనవరిలో హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడ హాస్టల్లో ఉండి పోలీస్ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు. తను ట్రైనింగ్‌లో ఉన్నట్టు ఫొటోలు తీయించుకుని బంధువులకు పంపించాడు. ఆ ఫొటోలు, ఐడీ కార్డులను చూపించి ఆ భూములను రిజి స్ట్రేషన్ చేయాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు. పోలీస్‌నని నమ్మించేందుకే..రైతులందరినీ తాను పోలీస్ అయినట్టు నమ్మించాలని ప్లాన్‌చేసి.. ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మక్కువ పర్యటనకు వచ్చిన నేప థ్యంలో ఉదయం 9.30 గంటలకు ముడిదాం నుంచి డ్రైవర్‌తో కలిసి సూర్యప్రకాశ్ కారులో మక్కువ కు చేరుకున్నాడు. దుగ్గేరు వద్ద పోలీసులు మంత్రి కాన్వాయ్ వెహికల్స్ తప్ప మిగిలిన వాహనాలను నిలిపివేశారు. సూర్యప్రకాశ్ కారును కూడా అక్కడే ఆపేశారు. దీంతో అతడు కారు దిగి కొంతదూరం కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ అడిగి బాగుజోలకు చేరుకున్నాడు. అప్ప టికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తికావడం, అక్క డ ఎవరూ లేకపోవడం చూసి శిలాఫలకం దగ్గర ఫొటో తీసుకున్నాడు. అక్కడ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులతో ఫొటోలు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెటు కున్నాడు. విషయం తెలుసుకున్న మక్కువ పోలీ సులు సూర్యప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. -
పార్వతీపురంలో గజరాజుల బీభత్సం
-
తెలుగువారి బాహుబలి.. ఇనుప కండలు.. ఉక్కు నరాలు!
‘తిండి కలిగితె కండకలదోయ్.. కండకలవాడేనుమనిషోయ్’ అని చెప్పిన మహాకవి గురజాడ నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే ప్రపంచం మెచ్చిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి నాయుడు కూడా తిరుగాడారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్క్యులస్గా, మల్లమార్తాండగా ప్రపంచదేశాల్లో భారత కీర్తిప్రతిష్టలు చాటిచెప్పారు. తన భుజ బలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు. బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించడం, ఒకటిన్నర టన్నుల బరువును గుండెలపై పెట్టించి మోయడం, ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవడం వంటి వళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసిన రామ్మూర్తినాయుడు గురించి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటిచేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు శభాష్ అన్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం. నేడు ఈ మల్లయోధుడి 142వ జయంతివీరఘట్టం: కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు వీరఘట్టంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారబంతో రామ్మూర్తి నాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మాకొడుతూ వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవాడు. కొడుకును చదివించాలనే దృష్టి ఉన్న వెంకన్న రామ్మూర్తిని విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణ స్వామి ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లినా రామ్మూర్తి చదువు కంటే వ్యాయామం వైపే మొగ్గు చూపుతుండటంతో పినతండ్రి రామ్మూర్తిని మద్రాస్ పంపి వ్యాయామ కళాశాలలో చేర్పించాడు. తర్వాత విజయనగరంలో తను చదివిన కళాశాలలోనే రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కొన్నాళ్లకు విజయనగరంంలో రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఊపిరి బిగబట్టి.. ఉక్కు గొలుసులు తెంపి రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో మరింత కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తిని ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంతవేగంగా నడిపించినా అవి కదిలేవి కాదు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామ్మూర్తినాయుడు పూణె వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రామ్మూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.1920 సంవత్సరంలో కార్లను ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతున్న రామ్మూర్తి ప్రదర్శన చూసి బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మింటో ఆశ్చర్యపోయారు. రామ్మూర్తి బృందాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లి బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి ముందుప్రదర్శన ఇప్పించారు. రామ్మూర్తి నాయుడు ప్రదర్శనకు మెచ్చిన ఇంగ్లండ్ రాణి అతనికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుతో సత్కరించారు. యూరప్‌లో పలు ప్రదర్శనలు ఇచ్చిన రామ్మూర్తినాయుడు అనంతరం జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలో స్థిరపడ్డారు. చేతికి ఎముకలేని దాత కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి, ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేసారని, అప్పటినుంచి ఆయన దైవచింతనలో ఉండేవారని చెబుతారు.ఆ సాధువు నుంచే రామ్మూర్తి జలస్తంభన, వాయుస్తంభన విద్యలు నేర్చుకున్నాడు. సర్కస్ కంపెనీ ద్వారా అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన రామ్మూర్తి భారీగా దానధర్మాలు, విరాళాలు అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సైతం తనవంతు సాయం అందించారు. జీవిత చరమాంకంలో రామ్మూర్తినాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముట్టాయి. కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాదీశుని పోషణలో ఉండగా 1942 జనవరి 16వ తేదీన రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. ‘కోడి’ బయోపిక్.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రెండేళ్ల కిందట కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ నటుడు దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఈ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి కోడి రామ్మూర్తినాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన అటువంటి మహానుభావుని చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించాలి. రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నార్త్ కరోలిన్, అమెరికాపాఠ్యాంశంగా చేర్చాలి 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది. కాలక్రమేణ సిలబస్ మారడంతో దాన్ని తొలగించారు. ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం -
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్‌గా మహేష్, సోషల్ టీచర్‌గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
పెళ్లిలో భర్తతో డాన్స్.. కొన్ని గంటల్లోనే మృతి
మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్ చేసిన నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్ చేసింది. అనంతరం నీరసంగా ఉందంటూ నిద్రలోకి జారుకుంది. తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కువ పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్‌సీకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్ వేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు. -
YSRCP మన్యం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే
పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 20వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. ఉదయం 10.30 గంటలకు చిన్న మంగళాపురంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరగనుంది. 12.00 లకు మంగళాపురం గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. సాయంత్రం 3.30 కి పాలకొండ ప్రధాన సెంటర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సాధికార యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శకుంతలమ్మ డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం శకుంతలమ్మ కళాశాల నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 3:30 గంటలకు బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైఎస్సార్ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైఎస్సార్ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు. -
‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’
సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు పాలన కరువు, అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీకి తార్కాణంగా నిలిస్తే.. జగన్ సంక్షేమ పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలు వేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించి.. అనంతరం బహిరంగ సభలో వాళ్లు ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు మన్యం సీమలో జనం నీరాజనం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్రకు అడుగడుగున ‘జై జగన్’ హర్ష ధ్వానాల మధ్య అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గంలో నాలుగన్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలు ప్రజలకు తెలియజేశారు. యాత్రలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారవు, పాముల పుష్పశ్రీ వాణి పాల్గొని.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ.. గిరిజనులకు, బడుగు, బలహీలన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న మేలును ఎన్నడూ మరిచిపోకూడదని, మరిస్తే మనకే ఇబ్బందులు.. కష్టాలు వస్తాయి. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీల కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేశారా?. ఎస్సీల కోసం గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, జగన్ రూ. 61 వేల కోట్లు ఖర్చు చేశారు. బీసీల కోసం రూ. లక్షా 62 వేల కోట్లు ఖర్చు చేశారు. గిరిజనుల కోసం రూ. 20వేల కోట్ల రూపాయలు జగన్ ఖర్చు చేయగా.. చంద్రబాబు కేటాయింపులే పూర్తిగా చేయలేదు. చంద్రబాబు హయాంలో కేబినెట్ లో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించలేదు. జీసీసీ కి చైర్మన్ ను వేయలేదు. ఎస్టీ కమిషన్ ను కూడా నియమించలేదు. పోడు, బీడు, బంజరు భూములను గిరిజనులకు జగన్ పంపిణీ చేస్తే.. భూపంపిణీ హామీని చంద్రబాబు మరిచిపోయారు. గిరిజనులకు రెండెకరాలు భూమి ఇస్తానని చెప్పి టీడీపీ మోసం చేసింది. గిరిజనులను మోసగించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ జగన్‌ను గెలిపించుకుని మళ్లీ సీఎంను చేయాలి. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మా జెండా కట్టాలి. మా రంగుచొక్కా ధరించాలి. మాకే ఓటు వేయాలి అని బెదిరించి గతంలో చంద్రబాబులాంటి వారు అణగారిన వర్గాలను అణిచివేశారు. చంద్రబాబు పరిపాలనలో కరవు,అరాచకం,దౌర్జన్యాలు,దోపిడీలు రాజ్యమేలాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నరేళ్లుగా కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయి. అర్హులైన సామాన్యులకు లబ్ధి చేకూరేలా పాలన కొనసాగుతోంది. పేదల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూనే.. విద్యా, వైద్యం పరంగా ఉచితంగా సేవలు, ఉండడానికి ఇల్లు అందిస్తోంది మన ప్రభుత్వం. కానీ, చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. పార్వతీపురం చుట్టూ అనేక ఉద్యమాలు పుట్టాయి. సమాజంలోని అసమానతల కారణంగా పోరాటాలు వచ్చాయి. ఇప్పుడు జగన్ పాలన కారణంగా ఎటువంటి ఆందోళనలు లేవు. అందరికీ సంక్షేమం అందుతోంది. రూ. 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి.. రాష్ట్రంలో 32 లక్షల మందికి సొంతింటి కలను జగన్ నెరవేరుస్తున్నారు. గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేశారా?. నిరుత్సాహం, నిస్పృహతో అల్లాడుతున్న ప్రజల కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గతంలో విద్య ప్రైవేటు పరమైపోయింది. ఎవరు కోరుకోకుండానే ప్రైవేటు విద్య ఎందుకు వచ్చింది?. ధనవంతులకు మాత్రమే విద్య పరిమితమైన పరిస్థితుల్లో.. సీఎం జగన్ విద్యాసంస్కరణలు తెచ్చారు. పేదలకు ఉన్నత విద్య ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు జగన్.. వీళ్లు ఎప్పుడూ పేదలు, రైతుల బాగుకోసం ఆలోచన చేస్తారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ, చంద్రబాబు మాత్రం పెత్తందారుల కోసమే పని చేస్తుంటారు. అసలు పార్వతీపురం ప్రాంతానికి చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశారు?. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ.. పాదయాత్రలో పేదల కష్టాలను గమనించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారు. కేవలం ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా పాలన చేయడం జగన్ అభిమతం. ఒక్క పార్వతీపురం నియోజకవర్గంలోనే రూ. 1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో ‘మా జీవన ప్రమాణాలు పెరిగాయి’ అని ప్రజలు చెబుతున్నారు. అంటే.. ఎంతటి సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారో అర్థం చేసుకోవాలి. సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలవాలి. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ నేత చంద్రబాబు తనకు నిజాయితీ, దూరదృష్టి ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దూరదృష్టి అంటే బాబు తన తనయుడు లోకేశ్ ఎలా సీఎం చేసుకుందామా? అనే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోనే తీసేసిన పార్టీకి నిజాయితీ ఎక్కడ ఉంది?. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించడం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తేవడం.. గిరిజన ప్రాంతాల్లో మెడికల్.. ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఇవి నిజాయితీ, దూరదృష్టి అంటే. అవి సీఎం జగన్‌కు సొంతం. -
ప్రైవేటు బస్సుపై ఏనుగు దాడి
కొమరాడ(పార్వతీపురం మన్యం జిల్లా): ఇటీవల ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు (హరి) పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై సోమవారం బీభత్సం సృష్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గదబవలస నుంచి ఆర్తాం గ్రామం వైపు ఒంటరి ఏనుగు వస్తుండగా జనం కేకలు వేశారు. దీంతో ఆంధ్రా–ఒడిశా అంతర్ రాష్ట్ర రహదారిలో వస్తున్న ప్రైవేటు బస్సును డ్రైవర్ నిలిపివేశారు. ఏనుగు ఒక్కసారిగా ఆ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసింది. రోడ్డుపై కాసేపు హల్చల్ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
పండుగలా ‘అమ్మ ఒడి’.. సీఎం జగన్ కురుపాం పర్యటన దృశ్యాలు..
-
అమ్మ ఒడి: కురుపాంలో థాంక్యూ జగన్ మామయ్య (ఫొటోలు)
-
కురుపాంలో అమ్మ ఒడి నిధుల్ని జమ చేసిన సీఎం జగన్
జగనన్న అమ్మ ఒడి 2023.. కురుపాం సభ అప్డేట్స్ ► కురుపాంలో 2023-24 ఏడాదిగానూ.. అమ్మ ఒడి నిధుల్ని బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం. ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ► రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అందిస్తున్నాం. పిల్లలకు తొలిసారిగా బైలింగ్వుల్ పుస్తకాలు అందజేస్తున్నాం. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.26,067.28 కోట్లు అందజేశాం. ► అంగన్వాడీల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ పిల్లలకు ట్యాబ్స్ కూడా అందించాం. ఆడపిల్లల కోసం స్వేచ్చ పథకం అమలు చేస్తున్నాం. ► విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా రూ. కోటి 25లక్షలు అందజేస్తున్నాం. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా అమలుచేస్తున్నాం. పెద్ద చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన అందిస్తున్నాం. ప్రతీ కుటుంబంలోనూ ఒక సత్యనాదెళ్ల వంటి వ్యక్తి రావాలి. పెత్తందారులకు అందుబాటులో ఉన్న చదవుల కన్నా గొప్ప చదువులు పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించాం. నాలుగేళ్లలో ఏపీలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అమలవుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారుకావాలన్నదే లక్ష్యం. ► విద్యార్థి మనస్వినీ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాను. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ అని ప్రశంసించింది. సీఎం జగన్ తీసుకువచ్చిన ప్రతీ పథకం తమకు ఎంతో మేలు చేస్తున్నదని తెలిపింది. సీఎం జగన్ ఏపీలో హిస్టరీ క్రియేట్ చేశారని పేర్కొంది. ► మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 83 లక్షల మందికిపైగా విద్యార్థులకు అమ్మఒడి ద్వారా లబ్ధి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు. విద్యారంగంలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు. ► ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చాం. విద్యారంగంలో సీఎం జగన్ సంస్కరణలు తీసుకువచ్చారు. ► పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మఒడి. చదువుల విప్లవం ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ► జగనన్న అమ్మఒడి పథకం గొప్ప ఆలోచన. పేద పిల్లల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ► చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా పేదల చదువుల కోసం అమ్మఒడి లాంటి పథకం అమలు చేశారా?. ► అమ్మ ఒడి పథకం పేదల అక్షయపాత్ర. పేదలకు మేలు చేసే జగనన్న డెడికేషన్‌ను చంద్రబాబు కాపీకొట్టలేరు. చంద్రబాబు పప్పులు ఈసారి జనం దగ్గర ఉడకవు. ► పార్టీ గుర్తులేని వారు ఎంతమంది గుంపులుగా వచ్చినా కనీసం జగనన్న నీడను కూడా తాకలేరు. జగనన్నను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుని లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. ► జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం కోసం.. కురుపాం బహిరంగ సభ వేదికపైకి సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి.. జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలకు అభివాదం చేసి కూర్చున్నారు. ► సీఎం జగన్ రాక నేపథ్యంలో.. కురుపాం హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ఆయన్ని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ అభిమానానికి మురిసిపోయిన ఆయన.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆత్మీయ స్వాగతం ► సీఎం వైఎస్ జగన్ కురుపాం చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, ఎమ్మల్యే లు, ఎంపీలు.. ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. ► జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంతో.. కురుపాంలో పండుగ వాతావరణం నెలకొంది. ► ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. ► తాజాగా విడుదల చేయబోయే నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది జగనన్న ప్రభుత్వం. ► కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పార్వతీపురం మన్యం పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. ► జగనన్న అమ్మ ఒడి 2023 నిధుల విడుదల కోసం.. తాడేపల్లి తన నివాసం నుంచి పార్వతీపురం మన్యం కురుపాంకు బయల్దేరారు సీఎం జగన్. ► పార్వతీపురం మన్యం కురుపాం బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. అమ్మ ఒడి నిధుల్ని సీఎం జగన్ విడుదల చేస్తారు. ► వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంను వేదికగా ఎంచుకున్నారు. ఇదీ చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి రైతులు! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహిళలకు అండగా వైఎస్సార్ ఆసరా
-
పార్వతీపురం మన్యం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, పార్వతీపురం: పెళ్లికి వేడుకకు హాజరైన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కొమరాడ మండలం చోళపదం వద్ద ఓ ఆటో.. లారీని ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా తుమ్మలవలసలో పెళ్లి వేడుకకు హాజరై.. తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో మృతులను అంటివలస గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
వైభవంగా పోలమాంబ అనుపోత్సవం
మక్కువ(పార్వతీపురం మన్యం): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.45 గంటలకు గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అమ్మవారి గద్దె వద్దకు చేరిన ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రాస్థలం వద్ద ట్రస్టు బోర్డుచైర్మన్ పూడి దాలినాయుడు, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్లు గంజి కాశినాయుడు, వసంతుల భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ, రెవిన్నాయుడు, పూడి, కరణం, కుప్పిలి, గిరిడ కుటంబాల సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు ఘటాలకు పూజలు చేశారు. అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయల్దేరిన అమ్మవారి ఘటాలకు దారి పొడవునా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చిన్నారులపైనుంచి ఘటాలను దాటించారు. యాత్రాస్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలను తీసుకెళ్లగా వందలాది మంది భక్తులు తరలివెళ్లారు. తప్పెటగుళ్లు, మహిళల కోలాట ప్రదర్శన, పోతిరాజు వేషధారణలు భక్తులను అలరించాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేశారు. వనంగుడిలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత పూజారి రామారావు గుడి చుట్టూ మూడుసార్లు తిరిగి కట్లువేశారు. ఈ నెల 31వ తేదీన పోలమాంబ అమ్మవారి మారుజాతర నిర్వహించనున్నారు. అమ్మవారి సేవలో భక్తజనం ప్రధానాలయంలో ఉన్న పోలమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. గోముఖి నదిలో పుణ్యస్నానాలాచరించి అమ్మవారికి చీరలు, గాజులు, కోళ్లను చూపించి మొక్కుబడులు చెల్లించారు. ఈఓ వి.రా ధాకృష్ణ భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ పి.దేవకుమార్ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను అనుపోత్సవం రోజున కూడా కొనసాగించారు. -
పార్వతీపురం మన్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.600 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలనపరమైన అనుమతిని మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టీచింగ్ ఆస్పత్రితోపాటు హస్టళ్లు, క్వార్టర్లు, నర్సింగ్ కాలేజీ, అనుబంధ భవనాలతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీకి పరిపాలన అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్యవిద్య సంచాలకులను ఆదేశించింది. (క్లిక్ చేయండి: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి) -
Parikshit raju: గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు..
సాక్షి, విజయనగరం: రానున్న 2024 సాధారణ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ నూతన అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తురాజు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమన్నారు. పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయన తొలుత 2012–17 మధ్యకాలంలో చినమేరంగి గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. తర్వాత పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పార్టీ బాధ్యుడిగా గత ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించాను. పారీ్టపరంగా ఆయా నియోజకవర్గాల్లో పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వాటిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గతం కన్నా ఇప్పుడు ప్రాంత విస్తీర్ణం తగ్గింది. ప్రతిబంధకాలు అంతగా ఉండవు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బడలిక తగ్గుతుంది. తద్వారా పార్టీ బాధ్యతలపై మరింతగా దృష్టి పెట్టడానికి అవకాశం కలిగింది. జగనన్న ఆశయాలకు అనుగుణంగా... పార్టీ అధిష్టానం నాకు పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేయడమే ఏకైక లక్ష్యం. ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలనేదీ జిల్లా అధ్యక్షులతో జరిగే సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఆ ప్రకారం జిల్లాలో పార్టీని విజయపథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. పార్టీ పెద్దలు, నాయకుల సహకారంతో... పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరోసారి వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తాను. అత్యంత సీనియర్ నాయకులైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉండటం మా అదృష్టం. ఆయన సూచనలు, సహకారంతో మంచి ఫలితాలు తీసుకొస్తాననే నమ్మకం ఉంది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి బాధ్యత తీసుకుంటాను. ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు ప్రస్తుతం సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ.. ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా తమ తమ పరిధుల్లో పార్టీ పటిష్టతకు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సానుకూలత ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపతాకం ఎగురవేస్తుందనడంలో సందేహం లేదు. ఇక విజయ ఢంకా మోగించడమే. -
ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
-
జనసేన కాదు.. టీడీపీకి తందానా
వీరఘట్టం: ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన టీడీపీ నేత చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ జతకట్టడంతో జనసేన పార్టీ.. కాస్త టీడీపీ తందానసేనగా మారిపోయిందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశంగా ఉన్న విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే మరో సింహగర్జన తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు పెద్ద దొంగ అంటూ 2018లో పవన్‌కళ్యాణ్ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో లక్ష ఎకరాలు దోచుకున్నది చంద్రబాబేనని, విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని, అమరావతిలో రాజధాని దండగ అంటూ ఆ నాడు పేర్కొన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చి దొంగనాయకుడితో చేతులు కలపడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు కాళ్ల దగ్గర కూర్చునేవాడిని నాయకుడిగా ఎలా భావిస్తారని, జనసేన కార్యకర్తలు, నాయకులు ఓసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దానిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ప్యాకేజీ స్టార్‌ను, చంద్రబాబునాయుడుని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఆకాంక్ష జిల్లాల జాబితాలో మన్యం, అల్లూరి జిల్లాలు
కొయ్యూరు: మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఆకాంక్ష జిల్లాల జాబితాలో చేరాయని అరకు ఎంపీ మాధవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి అందించిన లేఖ మేరకు నీతి అయోగ్ నిర్వహించిన సమావేశంలో ఆకాంక్ష జిల్లాల జాబితాలో వాటిని చేర్చారన్నారు. రెండు జిల్లాలు వెనుకబడి ఉన్నందున అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక చేరిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర సౌకర్యాలు అందుతాయన్నారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. అరకు ఎంపీ మాధవి బుధవారం ఢిల్లీ నిర్వహించిన విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. (క్లిక్ చేయండి: మెట్ట భూములకు పాతాళగంగ) -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
విద్యుత్ వినియోగం తెలుసుకో.. బిల్లు భారం తగ్గించుకో..
ఇంటిలో కావలిసినంత వెలుతురు ఉంటుంది... కానీ విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. సహజసిద్ధమైన గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నా ఏసీలు ఆపేందుకు ఇష్టపడం.. కళ్ల ముందే ఫ్యాన్లు తిరుగుతున్నా పట్టించుకోం. జీరో ఓల్ట్ బల్బులతో విద్యుత్ పొదుపు చేయవచ్చని ఆ శాఖాధికారులు పదేపదే చెబుతున్నా వినిపించుకోం.. ప్రతినెలా వచ్చే బిల్లును చూసి భయపడతాం. అందుకే.. వినియోగం తెలుసుకుని.. బిల్లు భారం తగ్గించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారుల్లో చైతన్యం నింపుతున్నారు. వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా.. కాస్త పొదుపు మంత్రం పాటిస్తే.. ఇతర పారిశ్రామిక అవసరాలను తీర్చవచ్చని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వినియోగదారులపై బిల్లుల భారం కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. విద్యుత్‌ను ఆదాచేసే చిన్నచిన్న మెలకువలను తెలియజేస్తున్నారు. విద్యుత్ ఆదాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలిలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 1,65,784 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగం కనెక్షన్లు 1.05 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 22 వేలు, వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లు 3033, ఇతర విద్యుత్ కనెక్షన్లు 35,751 ఉన్నాయి. రోజుకు జిల్లాలో 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ పొదుపు పాటిస్తే భవిష్యత్‌లో మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. (క్లిక్: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ) ఇదీ లెక్క.. ఒక్కో విద్యుత్ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణ బల్బు వంద వాట్స్ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. ఒక కిలోవాట్. గంట పాటు పది బల్బులు(ఒక కిలోవాట్) ఒకేసారే వేస్తే ఒక యూనిట్ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇలా ప్రతీ విద్యుత్ ఉపకరణానికీ ఓ లెక్క ఉంది. దీనిని తెలుసుకుంటే అవసరం మేరకు విద్యుత్‌ను వినియోగించవచ్చని, బిల్లు కూడా ఆదా అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో చాలా వరకు విద్యుత్ అనవసరంగా వాడుతున్నారు. అవసరం లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు, ఇన్వర్టెర్లు వినియోగి స్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ప్రజలు విద్యుత్ ఆదా చేయాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నాం. – టి.గోపాలకృష్ణ, విద్యుత్‌శాఖ ఈఈ, పాలకొండ -
సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండు తింటే..
సాక్షి, పార్వతీపురం జిల్లా: సీతాఫలాల సాగుకు పార్వతీపురం మన్యం జిల్లా పెట్టిందిపేరు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో వంద శాతం సేంద్రియ పద్ధతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం, రుచిగా ఉండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. అందుకే మన్యం సీతాఫలాలకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్వతీపురంమన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో సీతాఫలం పంట సాగవుతోంది. ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసేవరకు సీతాఫలం సీజన్ కొనసాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజనరైతులు సంబరపడుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడులు... దశాబ్దాల కాలంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, సాలూరు, మక్కువ, జి.ఎల్.పురం, జియ్యమ్మవలస, కురుపాం, పాచిపెంటలోని కొండ ప్రాంతంలో సుమారు 5 వేల ఎకరాల్లో సీతాఫలం పంట సాగువుతోంది. శతశాతం సేంద్రియ పద్ధతిలోనే పంట సాగుచేస్తున్నారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది. అందుకే రుచిగా ఉంటాయి. ఏటా వంద కోట్ల వ్యాపారం... మన్యంలో ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. కిలో రూ.15 నుంచి రూ.25లకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్లుగా విభజిస్తారు. తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్లో రూ.40 నుంచి రూ.50కు, గ్రేడ్–1 రకం రూ.70 నుంచి రూ.80లకు అమ్ముతున్నారు. ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. రైతుల కంటే వ్యాపారులకే అధిక ఆదాయం సమకూరుతోంది. చదవండి: Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి.. సీతాఫలంతో ప్రయోజనాలెన్నో.. ►సీతాఫలాల్లో మానవ శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఏ,బి–6, సీ, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్లు ఉంటాయి. కండరాల వృద్ధికి దోహదపడతాయి. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ► సీతాఫలాన్ని, తేనెను తగినమోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతమవుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది. ► బరువు తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం చక్కని ఔషధం. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి, ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. తల్లిలో పాలవృద్ధికి దోహదపడుతుంది. ►మలబద్దకంతో బాధపడేవారు సీతాఫలాలు తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్‌గా లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యానికి మంచిది సీతాఫలంలో విటమిన్–ఎ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతివంతమవుతుంది. విటమిన్–ఎ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటిచూపును ఇస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. – డాక్టర్ జి.ప్రదీప్‌కుమార్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం మార్కెట్ సదుపాయం కల్పిస్తా.. మన్యం జిల్లాలో పండే సీతాఫలాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అయితే, గిరిజనులకు ఆ ధరలు దక్కడం లేదు. వ్యాపారులు చౌకగా పంటను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సీతాఫలాలకు జీసీసీ ద్వారా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా. – విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ ఎగుమతి చేసేందుకు చర్యలు మన్యం సీతాఫలాలు భలే రుచిగా ఉంటాయి. ఇటువంటి ఫలాలు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ సదుపాయం కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో మాట్లాడి సీతాఫలంకు మార్కెట్ సదుపాం కల్పిస్తాం. – బి.నవ్య, సీతంపేట ఐటీడీఏ పీఓ -
విద్యార్థుల ప్రయాణం సురక్షితం.. సుఖవంతం
పాఠశాలలు.. కళాశాలలకు వెళ్లేందుకు.. తిరిగి ఇంటికి చేరేందుకు విద్యార్థులకు బెంగలేదిక. చదువు సమయం వృథా అవుతుందన్న ఆందోళన అవసరం లేదు. సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాయితీ ప్రయాణాలు కల్పిస్తూ... విద్యార్థుల బంగారు భవితకు పరోక్షంగా బాటలు వేస్తోంది. పార్వతీపురం టౌన్: ఆర్టీసీ సంస్థ సేవలను విస్తరిస్తోంది. ఓ వైపు ప్రయాణికులతో పాటు కార్గో సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అధిక ఆదాయం ఆర్జిస్తోంది. మరోవైపు విద్యార్థులకు సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యాలయాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది. రాయితీపై పాసులు జారీ చేస్తోంది. దీనివల్ల చదువు సమయం వృథా కాకుండా.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పరోక్షంగా సాయపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు రాకపోకలు సాగించే రూట్లలో ప్రత్యేక బస్‌సర్వీసులను నడుపుతూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రత్యేక సర్వీసులు ఇలా.. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 3, పాలకొండ నుంచి 5, సాలూరు డిపో నుంచి ఒక బస్సును పాఠశాల, కళాశాల వేళల్లో నడుపుతున్నారు. ఉచిత బస్‌పాస్‌లు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం లేకుండా చేస్తోంది. సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1800 ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. జిల్లాలోని 1,03,733 మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విద్యను అభ్యసించిన వారే. 12–18 ఏళ్లలోపు విద్యార్థులు 15,970 మందికి 60 శాతం రాయితీపై పాసులు జారీ చేశారు. అర్హులందరికీ ఉచిత పాసులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల పరిధిలోని 1800 మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసు లను అందజేశాం. 15, 970 మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని 9 విద్యార్థుల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎక్కువుగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అదనపు బస్సులను పంపించేందుకు చర్యలను చేపట్టాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం ఇబ్బందులు లేకుండా... గతంలో కళాశాలలకు రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సులలో నిలబడి వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు బస్సులు ఉండకపోవడంతో ఆటోలపై వెళ్లేవాళం. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాయితీతో బస్సు పాసులను అందజేసి సమయానికి ఇంటికి, పాఠశా లలకు, ఇళ్లకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. – సాయి, విద్యార్థి, పుట్టూరు, పార్వతీపురం మండలం సమయానికి చేరుకుంటున్నాం కళాశాలల సమయానికి చేరుకుంటున్నాం. ఆర్టీసీ మా ప్రాతం నుంచి పార్వతీపురం పట్టణానికి ప్రత్యేక బస్సు వేశారు. దీనివల్ల ఎటువంటి భయంలేకుండా సమయానికే పాఠశాలలకు చేరుకుంటున్నాం. పాఠశాల పూర్తయిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికే బస్సు దొరుకుతుంది. తొందరగా ఇళ్లకు చేరుకుంటున్నాం. – దేవి ప్రసాద్, కొత్తపల్లి, కురుపాం మండలం -
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
APSRTC: చౌకగా ఆర్టీసీ కార్గో సేవలు.. పెరుగుతున్న ఆదరణ
ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ప్రయాణం సురక్షితంగా.. సుఖవంతంగా సాగుతుందన్న భరోసా. ఇప్పుడు కార్గో సేవల్లోనూ ఆ సంస్థ అధికారులు అదే మంత్రాన్ని పఠిస్తున్నారు. సరుకులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. చౌకగా రవాణా సేవలు అందిస్తున్నారు. అందుకే... ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సుస్థిర ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. దీనికి పార్వతీపురం మన్యం జిల్లాలో కార్గో సేవలతో ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయమే నిదర్శనం. పార్వతీపురం టౌన్: ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. సరకు రవాణా పెరుగుతుండడంతో సంస్థకు అదనపు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో కార్గో ఆదాయం గతేడాది కంటే పెరిగింది. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో సురక్షితంగా సేవలందుతుండడంతో వినియోగదారులు కార్గోపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. చౌకగా రవాణా.. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తదితరవి తక్కువ చార్జీలతో రవాణా చేస్తుండడంతో ఆర్టీసీ కార్గోసేవలు వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. జిల్లాలో కార్గో సేవల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.90లక్షల ఆదాయం సమకూరింది. పార్సిల్స్, కొరియర్ కవర్లు రవాణా చేయడంతో ఈ ఆదాయాన్ని సముపార్జించింది. రోజూ సుమారు మూడు డిపోల ద్వారా 90 పార్సిళ్లు ఉంటున్నాయి. పార్సిళ్లను జిల్లాలో అయితే సుమారు 8 గంటల్లోపు, రాష్ట్రంలో అయితే 24 గంటల్లోపు గమ్య స్థానాలకు చేర్చుతోంది. 2021–22లో సరుకు రవాణాతో రూ.1.16 కోట్ల ఆదాయం ఆర్జించింది. యువతకు ఉపాధి.. కార్గో సేవలతో ఓ వైపు ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. జిల్లాలో ని 3 డిపోల నుంచి సరకు రవాణా చేయడమే కాకుండా పార్వతీపురం డిపోకు అనుసంధానంగా బొబ్బిలి బస్టాండ్‌లో కార్గో పాయింట్లలో ఆరుగురు, సాలూరు డిపోలో ఆరుగురు, పాలకొండలో ఆరుగురు మొత్తం 18 మంది ఏజెంట్లను నియమించింది. వారికి కార్గో వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది. 180 మంది కళాసీలకు పని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన మరింతమంది నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఏజెన్సీలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా కేవలం సరకు బుకింగ్, డెలివరీ సదుపాయాలే కాకుండా ఆర్టీసీ బస్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రూ.10వేలు డిపాజిట్‌గా, మిగిలిన ప్రాంతాల్లో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఏజెన్సీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నమ్మకంతో రవాణా ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగింది. అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఆదాయం గణనీయంగా వృద్ధిచెందింది. వ్యాపారులకు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు వారి సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం -
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్)కూ కాల్‌ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్‌లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్‌ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
ప్రసవించిన ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోసం...తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
పార్వతీపురంటౌన్: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా, ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్1న ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి. గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు. ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతలు ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఎస్.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు -
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన గేదెల తుషార్‌రావు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. తుషార్‌రావు తండ్రి నారాయణరావు (దాసునాయుడు) ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన సుప్రీంకోర్డు న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాది కుటుంబంలో పుట్టిన తుషార్‌రావు ఇన్నాళ్లూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ జడ్జిగా నియామకమయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం రావడం గర్వంగా ఉందని వీరఘట్టం జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, ఆయన మేనల్లుడు ధనుకోటి శ్రీధర్ పేర్కొన్నారు. (చదవండి: అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్) -
ఆర్టీసీ బస్సులో నిద్రలోకి జారుకున్న మహిళ.. తెగిపడిన చేయి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): అతివేగంతో వస్తున్న ఆటో బస్సును రాసుకుంటూ వెళ్లిపోవడంతో ఓ ప్రయాణికురాలి చేయి తెగి పడిపోయిన సంఘటన వీరఘట్టంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి శనివారం ఉదయం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు త్రీ స్టాప్ బస్సులో వచ్చింది. చదవండి: ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే! అక్కడ నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉండే మూడో సీట్లో విండో పక్కన కూర్చుంది. బస్సు వీరఘట్టం వట్టిగెడ్డ వంతెన దాటిన తర్వాత పైడితల్లి చేయిని బయటకు పెట్టి నిద్రలోకి జారుకుంది. అక్కడకు కొద్దిసేపటికి బస్సు జిల్లా పరిషత్ హైసూ్కల్‌కు చేరుకునే సరికి ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటో.. బస్సును రాసుకుంటూ పోవడంతో ఆటో పైనుండే రాడ్ తగిలి పైడితల్లి చేయి తెగి పడిపోయింది. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో బస్సుని నిలిపివేశా రు. సహచర ప్రయాణికులు బాధితురాలిని వీరఘట్టం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. -
సర్కారు వారి ఆరా
సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి సాలూ రు నియోజకవర్గంలోని సాలూరు పట్టణ పరిధిలోని 3వ వార్డు గుమడాం గ్రామానికి చెందిన నారాపాటి అప్పారావు తెలుగుదేశం పార్టీ అభిమాని. ఇంట్లో ఎన్టీఆర్ ఫొటోను కూడా పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈయన ఇంటికి వెళ్లగానే లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ పాలన చూశాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం. ఎటువంటి ప్రలోభాలు, అడ్డంకులు లేకుండా మా ఇంట్లో వారికి అర్హత ఉన్న అన్ని పథకాలు, పింఛన్ అందుతున్నా యి. ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు. ఎన్టీఆర్ అభిమానినే అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలన చూసిన తరువాత నాకు ఆనందం కలిగిందంటూ తమకు అందుతున్న పథకాల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. గుమడాం గ్రామంలో నిర్వహించిన గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామస్తుల అందరి నుంచి ఇదే స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా సంక్షేమం పొందుతున్న ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జైజగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. సంక్షేమమే లక్ష్యంగా పాలనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఆరా తీస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా జరుగుతోంది. గ్రామా ల్లోని ప్రతి ఇంట్లో సంక్షేమ పథక లబ్ధిదారులు ఉండ గా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి గడప ఎక్కుతుండడంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ అభిమానులు సైతం ప్రభుత్వానికి అభిమానులుగా మారి తాము పొందుతున్న లబ్ధిని తమ గడపకు వచ్చిన నాయకులకు వివరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సచివాల య వ్యవస్థ ద్వారా కల్పించిన ఉద్యోగాల్లో తమ పిల్లలు స్థిరపడిన విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుమడాంలో సందడి సందడిగా.. సాలూరు నియోజకవర్గం గుమడాం గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారకముందే స్వయాన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తమ గ్రామంలోకి వచ్చి తలుపుతడుతున్నారనగానే గ్రామం మొత్తం కదిలింది. డిప్యూటీ సీఎం తమ ఇంటికి వచ్చి కష్టసుఖాలు తెలుసుకోవ డం చాలా ఆనందంగా ఉందని అందరూ సంబరపడుతున్నారు. గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎంకు ప్రతి ఇంటి నుంచి ఆధారాభిమానాలతో పాటు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పక్కాగా పథకాలు అమలవతున్నాయని, ఎవరికి ఒక్క పైసా కూడా చెల్లించలేదని లబ్ధిదారులు ఆయనకు చెబుతుంటే ఆయన మనసంతా సంతోషంతో నిండిపోయింది. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడు తూ ఇంతటి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీ అందించాలని గ్రామస్తులను కోరారు. అక్కడక్కడ ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని, గొంతులు చించుకుని లేని పోని ఆరోపణ లు చేసినంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగవని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్మన్ పూల ఈశ్వరమ్మ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ పాచిపెంట నాయకులు పి.గౌరీశ్వరరావు, పాచిపెంట వీరన్నాయుడు, మండల కన్వీనర్ గొట్టాపు ముత్యాలనాయుడు, దండి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ తాడ్డి లక్ష్మి, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
పార్వతీపురం టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు. గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’ గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం... ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. మెనూ ఇది.. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు. మా బాబు బరువు పెరిగాడు.. మా బాబు చాలా తక్కువ బరువు ఉండేవాడు. మొదటి సంవత్సరం మా అబ్బాయి బరువు 8 కేజీ లు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు తదితర బలవర్ధక పదార్థాలతో ఏడాదిన్నర కాలంలో 11 కేజీలకు బరువు పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్య ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి మాలాంటి తల్లుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దివ్య, పాలకొండ మండలం, బుప్పూరు పౌష్టికాహారంతో ఆరోగ్యం గర్భిణిగా మూడో నెలనుంచి మాకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పథకం కింద పౌష్టికాహారం తీసుకుంటున్నా ను. ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే వివిధ రకాల పోషకాహార వస్తువులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నాను. – దీప్తి పండా, పార్వతీపురం పట్టణం జిల్లాలో 15,601 మందికి లబ్ధి జిల్లాలోని 15 మండలాల్లో ని గర్భిణులు, బాలింతలు 15,601 మందికి లబ్ధి చేకూరుతోంది. గర్భిణుల కు మూడోనెల నుంచి ప్రసవించేవరకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ పోషణ కిట్లతో పాటు ఐరన్ మాత్రలు తీసుకున్న వారిలో 9 శాతం ఉన్న హిమోగ్లోబిన్ 11 శాతాని కి పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు. – వరహాలు, పీడీ ఐసీడీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా -
నాడు అధ్వానం..నేడు అద్భుతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె దారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడచూసినా సిమెంట్, తారురోడ్లు అందంగా దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్లపై ప్రజలు, వాహనచోదకులు ప్రయాణం సాగిస్తున్నారు. సీతానగరం మండలం బూర్జ, గరుగుబిల్లి మండలం అజ్జాడ రహదారి గతంలో రోడ్లు ఆధ్వానంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ నిధులు రూ.60లక్షలు మంజూరు చేయడంతో రోడ్లు నిర్మించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. – పార్వతీపురం టౌన్ సాఫీగా ప్రయాణం గతంలో వ్యాపారం నిమిత్తం ఈ రోడ్డుపై ప్రయాణం చేసేవాడిని. రహదారి సరిగాలేక వ్యాపారం మానుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. మళ్లీ వ్యాపారం ప్రారంభించాను. – గణేష్, బట్టల వ్యాపారస్తుడు, పార్వతీపురం -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గోపాలపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోనెల చంటి బుధవారం ధ్వంసం చేశాడు. మండపంపై నుంచి విగ్రహాన్ని పెకిలించి రోడ్డుమీద ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిని పంచాయతీ వార్డుసభ్యుడు కోనపురెడ్డి శ్రీనివాసరావు, గ్రామస్తులు అడ్డుకున్నా రు. చంటికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. సర్పంచ్ బోను రామినాయుడితో పాటు గ్రామపెద్దలతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి లాక్కెళుతున్న చంటి, నిందితుడు చంటి తొలగించిన విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించారు. పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఘటన వెనుక చాలా అనుమానా లున్నాయని చెప్పారు. ఎవరైనా చేయించి ఉండవచ్చన్నారు. నింది తులను కఠినంగా శిక్షించాలని, ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుం డా చూడాలని పోలీసులను కోరారు. డీఎస్పీ సుభాష్, సీఐ విజయానంద్, పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డు సభ్యుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 153ఎ, 427, 109 సెక్షన్లతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్‌కాల్ లిస్టుపై ఆరా తీస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్‌కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్‌కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్‌ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్‌కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. (చదవండి: పంట భద్రుడు...ఆదర్శ రైతుగా మారిన ఉపాధ్యాయుడు) -
పంట భద్రుడై... ఆదర్శ రైతుగా నిలిచాడు
ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన అర్హతలు కలిగిన ఓ పట్టభద్రుడు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పదిమంది రైతులు సాగు చేస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించి వాణిజ్యపంట సాగు చేపట్టాడు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కనీవినీ ఎరుగని డ్రాగన్ పండ్ల తోట పెంపకం చేపట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలోని డ్రాగన్ తోట వేరే ఏ ప్రాంతంలోనిదో కాదు. సంప్రదాయంగా పండిస్తున్న వరి, మొక్క జొన్న, అరటి, పామాయిల్ పంటపొలాల్లోనిదే. ఈ వాణిజ్య పంటను ఓ యువరైతు పండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన యువరైతు లండ ఏసుబాబు రెండెకరాల్లో డ్రాగన్ పంటను సాగుచేస్తున్నారు. ఈ తోట వేసి ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే పూతదశకు రావడంతో, అక్కడక్కడ పిందెలు కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ రెండెకరాల పంటలో తొలిపూత వచ్చే అవకాశం ఉందని రైతు సాక్షికి వెల్లడించారు. ఈ పంట నుంచి తొలి పూతలో పెద్దగా దిగుబడి ఉండదని, రెండేళ్ల తరువాత ఎకరాకు 3 టన్నుల వరకూ డ్రాగన్ పండ్లు రానున్నాయని తెలిపాడు. నల్గొండలోని ప్రముఖ రైతు రాజారెడ్డి నర్సరీ నుంచి మొత్తం 3,000 మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు టన్ను ధర రూ.2 లక్షలు పైబడి ఉందని చెబుతున్నాడు. లీజు భూముల్లో సాగు పాలకొండ మండలంలోని లుంబూరు గ్రామం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఈ యువ రైతు 20 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ముళ్లపొదలు కూడా మొలకెత్తని ఈ భూమిని ఏడాదికి ఎకరాకు లీజు రూ.14 వేలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుని డ్రాగన్ సాగు ప్రారంభించాడు. బీఎస్సీ బీఈడీ చేసిన ఈ రైతు పలుచోట్ల డ్రాగన్ పండ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఈ పంట సాగుతో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితం సాగు మొదలుపెట్టాడు. ఒక హెక్టార్లో డ్రాగన్ సాగుకు ప్రభుత్వం 30 శాతం మేర రాయితీతో విత్తన మొక్కలను అందిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ప్రభుత్వం నుంచి రూ. 30 వేల మేర రాయితీ పొందాడు. మొత్తం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశాడు. సిమెంట్ స్తంభాలు, చక్రాలతో తోటకు అనుగుణంగా పందిళ్లు నిర్మించాడు. ఈ మొత్తం ఏర్పాట్లకు తోట పెంపకానికి ఇప్పటివరకూ ఎకరాకు రూ.5 లక్షల మేర ఖర్చయిందని రైతు ఏసుబాబు చెప్పాడు. ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి మధ్య 8 నుంచి పది అడుగుల వ్యత్యాసంతో డ్రాగన్ మొక్కలు వేయగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు యువరైతు సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాడు. పేడగత్తెం, కుళ్లిన ఎండుగడ్డి, జీవా మృతాల ద్వారానే సాగు చేపట్టాడు. రసాయనిక ఎరువులను వినియోగించి, సాదారణ పంటలు సాగుచేసే రైతులకు ఏసుబాబు చేస్తున్న సాగు ఆదర్శంగా మారింది. బీడు భూమిలో రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి సాగులోకి తీసుకు రావడంతో పాటు అధునాతన సాగును ప్రారంభించడంతో పలువురు రైతు ఏసుబాబును అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట కావడంతో ఈ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పాలకొండ ఉద్యానవనశాఖాధికారిణి టి.అమరేశ్వరి అన్నారు. ఈ వినూత్న సాగు చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో యువరైతు ఏసుబాబు ముందుకు రావడం విశేషమని వెల్లడించారు. బాగుంటుందనే ఉద్దేశంతో.. వాణిజ్యపంటల సాగు ఆసక్తితోనే చేపట్టాను. నా స్నేహితుడి సాయం కూడా ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో లీజుకు తీసుకుని డ్రాగన్ తోటలు వేశాను. ప్రస్తుతం పూతదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది బాగా పూత వస్తుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఎల్. ఏసుబాబు, యువరైతు, లుంబూరు. -
కొండబారిడి దంపుడు బియ్యానికి గుర్తింపు
కురుపాం: కురుపాం మండలానికి మారుమూలన ఉన్న కొండబారిడి గిరిజన మహిళల శ్రమకు ఫలితం దక్కేరోజు వచ్చింది. వ్యాపారం మరింత వృద్ధిచేసుకునే అవకాశం కలిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు దంపుడు బియ్యాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని రోళ్లలో దంచి బియ్యంగా మలస్తున్నారు. కిలో ప్యాకెట్ల రూపంలో ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్న మహిళల విజయగాథపై ఈ నెల 24న “దంపుడు బియ్యానికి కేరాఫ్ కొండబారిడి’ శీర్షికన “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహిళల శ్రమను, కొత్త ఆలోచనను ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 26న తన ట్విట్టర్ ఖాతాలో “పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి మహిళలు దంపుడు బియ్యంతో వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు. సభ్యులంతా కలిసి రోళ్లలో దంచిన బియ్యాన్ని విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. గిరిజన మహిళలు ఒక ఉపాధి మార్గాన్ని సృష్టించుకుని మైదాన ప్రాంత ప్రజలకు సరఫరా చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉద్యోగులను కొండబారిడి గ్రామానికి గురువారం పంపించారు. గిరిజన మహిళలకు గిట్టుబాటు ధర చెల్లించి దంపుడు బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా కొంత నగదును మహిళలకు చెల్లించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో కొండబారిడి దంపుడు బియ్యాన్ని మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
దంపుడు బియ్యానికి c/o కొండబారిడి
దంపుడు బియ్యంలో పోషకాలు అధికం. ఆరోగ్యానికి మేలు. అందుకే మార్కెట్లో గిరాకీ ఉంది. నాణ్యమైన దంపుడు బియ్యం వినియోగించేందుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దీనినే ఓ మారుమూల గిరిజన గ్రామ మహిళలు ఆదాయవనరుగా మలచుకున్నారు. కొండ జక్కరతో సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని ‘జట్టు’గా రోకళ్లతో దంచి బియ్యంగా మార్చుతున్నారు. కిలోల చొప్పున ప్యాక్‌చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. గ్రామాన్ని దంపుడు బియ్యానికి కేరాఫ్‌గా మార్చిన కొండబారిడి గిరిజన గ్రామ మహిళల విజయగాథకు ‘సాక్షి’ అక్షర రూపం. కురుపాం(పార్వతిపురం మాన్యం): కొండబారిడి.. కురుపాం మండలానికి మారుమూలన ఉన్న చిన్న గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. వరిని సైతం అదే దారిలో పండిస్తున్నారు. ధాన్యాన్ని మరపట్టించాలంటే కొండపైనుంచి కిందకు దించాలి. వ్యయప్రయాసలకోర్చాలి. అందుకే.. ఏ ఇంటిలో చూసినా ఏ రోజు తిండిగింజలను ఆ రోజు రోకళ్లతో దంచి బియ్యంగా మార్చడం మహిళల దినచర్య. మరోవైపు దంపుడు బియ్యంతో ఆరోగ్యం సిద్ధిస్తోంది. వీటికి మార్కెట్లో గిరాకీ ఉంది. దీనిని కొందరు మహిళలు గుర్తించారు. ఒక అడుగు ముందుకు వేశారు. ‘జట్టు’ సంస్థ సాయంతో 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని నిర్వహణలో అన్నపూర్ణ, శాంతి, ఏకలవ్య, శ్రీ కృష్ణ, శ్రీ భగవాన్, మిత్ర, సావిత్రి సంఘాలకు చెందిన మహిళలు భాగస్వాములయ్యారు. స్థానికంగా లభ్యమైన ధాన్యాన్ని దంచి దంపుడు బియ్యంగా మార్చుతున్నారు. కిలో ప్యాకెట్లుగా మార్చి తెలంగాణాలోని హైదరాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు బీఎంపీఎస్ ట్రావెల్స్‌లో సరఫరా చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కొండబారిడి గ్రామం శతశాతం సేంద్రియ వ్యవసాయ గ్రామంగా ఎంపిక కావడం, అక్కడ పండే ధాన్యాన్ని దంపుడు బియ్యంగా మార్చి విక్రయిస్తుండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దంపుడు బియ్యంతో బోలెడు ప్రయోజనాలు ► దంపుడు బియ్యంలో గోధుమ రంగులో ఉండే సెలీనియం పెద్ద పేగుకు కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ► దంపుడు బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థలో ఉండే కేన్సర్ కారకాల రసాయానాలను బయటకు పంపుతూ పెద్ద పేగుకు కేన్సర్ రాకుండా కాపాడుతుంది. ► గోధుమ రంగులో ఉండే పైటోన్యూట్రిన్స్ లిగ్నాట్ రొమ్ము కేన్సర్, గుండె జబ్బులను అడ్డుకునేందుకు సహాయ పడుతుంది. ► వయస్సు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో దంపుడు బియ్యం (ముడి బియ్యం) తినడం వల్ల ఎంట్రోలాక్ట్స్ స్థాయి పెరిగి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె జబ్బులు దరిచేరవు. ► దంపుడు బియ్యంలో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. శరీర బరువు సాధారణంగా ఉంటుంది. ► ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం 21 శాతం వరకు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి. ► రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్తం గడ్డకట్టకుండా ఉపయోగ పడుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. ► గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్–2 డయాబెటీస్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఆదాయం బాగు.. ►2019లో ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా దంపుడు చేసిన 1000 కేజీల బియ్యంను కేజీ రూ.45 చొప్పున విక్రయించి రూ.45,000 వేలు ఆదాయం ఆర్జించారు. ►2020–21 సంవత్సరాల్లో 2000 కేజీల బియ్యంను రూ.50 చొప్పున విక్రయించగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మూడున్నర సంవత్సరాలుగా లక్షా 35వేల పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం పొందినట్టు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. మార్కెట్లో గిరాకీకి తగ్గట్టుగా దంపుడు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషకాలు మెండు ముడి బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పోలేట్ (పోలిక్ యాసిడ్), బి–విటమిన్లు శరీరానికి కొత్త కణాలను ఏర్పరచేందుకు సహాయపడతాయి. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి. బియ్యంలో అధికంగా ఉండే పీచుపదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. – ఎ. ప్రసన్నరాణి, కృషివిజ్ఞాన కేంద్రం, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, రస్తాకుంటుబాయి, కురుపాం మండలం తెలిసిన వ్యాపారం.. బియ్యం దంచడం మాకు నిత్యకృత్యం. దంపుడు బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏడు సంఘాల మహిళలం ఏకమయ్యాం. ప్రతిరోజూ ధాన్యాన్ని దంచుతూ బియ్యం తయారు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యం కావడంతో డిమాండ్ పెరుగుతోంది. ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో రూ.65కు విక్రయిస్తున్నాం. – పత్తిక సుశీల, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, కొండబారడి, కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో ఉన్న సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రం -
లక్ష్మీనర్సింహస్వామికి కరెన్సీ నోట్లతో అలంకరణ
సీతానగరం: మండల కేంద్రంలో సువర్ణముఖి నదీతీరాన వేంచేసిన లక్ష్మీనర్సింహస్వామి కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలంకరణతో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మీనర్సింహ స్వామివారిని కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వందలాది మంది భక్తులతో వేకువ జామునుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ స్వామివారికి భక్తులు కానుకగా సమకూర్చిన కరెన్సీ నోట్లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన పుష్పాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించామన్నారు. -
విద్యార్థులకు పరీక్ష
బలిజిపేట: పగటి ఉష్ణోగ్రతలతో పాటు విద్యార్థులకు పరీక్షల వేడి మొదలైంది. ఈ నెల 27 వ తేదీ నుంచి పదవ తరగతి, వచ్చేనెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండగా ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు 26వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6,7 తరగతులకు మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. 8వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం పరీక్షలు ఉదయం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు మధ్యాహ్నం ఉంటాయి. 9వ తరగతి విద్యార్థులకు పేపర్–1 ఉదయం, పేపర్–2 మధ్యాహ్నం జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షలను ఆయా పాఠశాలలు నిర్వహిస్తాయి. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. మే 15వ తేదీ లోగా ప్రమోషన్ జాబితాలను సిద్ధంచేయాలని స్పష్టం చేసింది. పరీక్షకు గంట ముందే.. ప్రశ్నపత్రాలను జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు ప్రాథమిక పాఠశాలల ప్రశ్నపత్రాలు క్లస్టర్ వారీగా పంపించారు. యూపీ, ఉన్నత పాఠశాలల ప్రశ్నపత్రాల బండిళ్లను ఎప్పటికప్పుడు పరీక్ష రోజున గంటముందు ఎంఆర్సీ నుంచి ప్రధానోపాధ్యాయులు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. పదో తరగతి మాదిరిగా వార్షిక పరీక్షలు వార్షిక పరీక్షలను పదవతరగతి పరీక్షల మాదిరిగా పకడ్బందీగా నిర్వహిస్తాం. ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. పర్యవేక్షణ ఉంటుంది. శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట పకడ్బందీగా శ్లాస్ పరీక్ష విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించే శ్లాస్ (స్టేట్ లెవెల్ లెర్నింగ్ అసెస్మెంట్ సర్వే) పరీక్షను గురువారం బలిజిపేట మండలంలో పకడ్బందీగా నిర్వహించారు. మండలంలోని గంగా డ డీపీఈపీ, నారాయణపురం, నారాయణపురం–2, నూకలవాడ, గలావల్లి, అజ్జాడ రెగ్యులర్, పలగర, బలిజిపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. బలిజిపేట మండలంలో 4వతరగతి విద్యా ర్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల విజ్ఞానానికి శ్లాస్ సీతానగరం/పార్వతీపురంటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శ్లాస్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు పార్వతీపురం ఎంఈఓ సూరిదేముడు తెలిపారు. మండలంలోని గాదెలవలస జెడ్పీ ఉన్నత పాఠశాల, హోలీక్రాస్ ఉన్నత పాఠశాల (ప్రైవేట్) ఆరోతరగతి విద్యార్థులకు, అలాగే అంటిపేట, జోగింపేట, బూర్జ, నిడగల్లు ప్రాథమిక పాఠశాలల్లో నాల్గవతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేసి పై చదువులకు అవసరమైన తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు మండలంలో ఎస్ఏ–2 పరీక్షలు ఈనెల 22నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 9గంటలనుంచి 11.30 గంటలవరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
వింత వ్యాధి కలకలం?
సాలూరు: మన్యంలో వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 13న పాచిపెంట మండలంలోని కర్రివలస పంచాయతీ కంకణాపల్లి గ్రామంలో వింత వ్యాధితో మరణాలు సంభవించాయి. ఈ నెల రెండవ వారంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాళ్లు, చేతులు, ముఖం పొంగి బాగా నీరసించిపోయారు. వెంటనే వారు పాచిపెంట పీహెచ్‌సీకి వెళ్లగా సాలూరు సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. బాధితుల్లో గమ్మెల ప్రశాంత్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈనెల 13న మరణించాడు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా సుమారు పదిమంది ఈ విధంగానే భాదపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన వింత వ్యాధితో సంభవిస్తున్న మరణాలపై గిరిజనుల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ విథమైన మరణాలపై గతేడాది జనవరి19వ తేదీన మన్యంలో మరణ మృదంగం శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఐటీడీఏ పీఒ కూర్మనాథ్ స్పందించి గ్రామంలో పర్యటించి వైద్యసేవలు ముమ్మరం చేశారు. కానరాని వింతవ్యాధి లక్షణాలు అయితే మళ్లీ ఈ నెలలో ఆ తరహా వ్యాధి ప్రబలడంతో పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పీవీ లక్ష్మిని వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో రెండు రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ అనారోగ్య లక్షణాలు తప్ప వింత వ్యాధి లక్షణాలు ఎవరికి లేనట్లు గుర్తించామన్నారు.త్వరలో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. తాగునీరు సమస్య కారణం కావచ్చన్న అనుమానంతో తాగునీటి పరీక్షలు నిర్వహించగా ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట చినఅప్పలనాయుడు తెలిపారు. దీనిపై ఐటీడీఏ పీఓ కూర్మనా«థ్ వివరణ కోరగా, గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా సమీప ఒడిశా నుంచి వస్తున్న సారా మన్యంలో ఏరులై పారుతున్న నేపథ్యంలో సారా తాగడం ఈ విధమైన వ్యాధులకు కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, మన్యాల్లో సారా నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
Rajanna Dora: ధ్యాసంతా గిరిజనంపైనే..
సాక్షి, విజయనగరం: గిరిజన బిడ్డగా, గిరిజన సహకార సంస్థ మాజీ అధికారిగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా పీడిక రాజన్నదొరకు గుర్తింపు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని సాక్షి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మీకు రావడంపై మీ అభిప్రాయం? రాజన్నదొర: సాలూరు నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యాను. మహిళల కు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా గిరిజన, ఎస్సీ, బీసీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తానని సీఎం అప్పుడే చెప్పారు. రెండో దఫాలో నాకు అవకాశం ఇస్తానని నాడే హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పదవి రావడానికి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు కారణం. వారికి సర్వదా కృతజ్ఞుడిని. సాక్షి: గిరిజన బిడ్డగా, వారి కష్టసుఖాలు తెలిసిన మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు? రాజన్నదొర: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 31 తెగల గిరిజనులు ఉన్నారు. వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా కాలానుగుణ పరిస్థితులను బట్టి ప్రణాళికలను రచించారు. గతంలో అటవీ ఉత్పత్తులే గిరిజనులకు ఆధారం కాబట్టి వాటికి మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రణాళికలు అమలు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన పంటలపై కూడా ఆధారపడుతున్నారు. విద్య ప్రాధాన్యం తెలుసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితులకు తగినట్లుగా, ప్రాంతాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, గిరిజన ఎమ్మెల్యేలమంతా చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అందుబాటులోనున్న నిధులను సది్వనియోగం చేసుకుంటూ గిరిజనులకు తక్షణమే లబ్ధి కలిగేలా చూస్తాను. సాక్షి: ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మీరు గుర్తించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు? రాజన్నదొర: గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మెరుగుపడ్డాయి. వారికి నాణ్యమైన విద్యను అందేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారాయి. కొన్నిచోట్ల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అవన్నీ సమకూర్చుతాం. వైద్యం విషయానికొస్తే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుచేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతాను. ఒడిశాలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిపైనా ఆయా అధికారులతో చర్చించి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సాక్షి: మంత్రి పదవితో మీ సేవలకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా? రాజన్నదొర: మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. దానితో పాటు నా కష్టం, పనితీరు, నిబద్ధత చూసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పారీ్టకి మంచిపేరు వచ్చేలా పనిచేస్తాను. సాక్షి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగానున్న కొటియా సమస్యపై ఏవిధంగా దృష్టి పెడతారు? రాజన్నదొర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబర్ 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్తో చర్చలు జరిపారు. అప్పటికే ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొటియా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఒడిశాలో సామాజిక పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.2,500 చొప్పున ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అమలు జరుగుతున్నన్ని సంక్షేమ పథకాలు ఒడిశాలో లేవు. పేదలందరికీ ఇళ్లు, రైస్‌కార్డు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, చేదోడు... నవరత్నాలన్నీ కొటియా గ్రామాల్లో అమలవుతున్నాయి. ఏదేమైనా అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరిహద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతాను. -
భయానక దృశ్యం.. ఆ చిన్నారులు స్కూల్ కెళ్లి ఇంటికి వచ్చేసరికి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): ఉదయం అమ్మ చేతి గోరుముద్దలు తిని స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు.. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ భయానక దృశ్యాన్ని చూసిన చిన్నారుల గొంతు మూగబోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర శంకరమ్మ(45) మంగళవారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: బీటెక్ ఫెయిలవ్వడంతో.. ఉప్పుటేరులో దూకి.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర పారయ్య, కొమరాడకు చెందిన శంకరమ్మకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పారయ్యకు రెండో వివాహం. పారయ్య, శంకరమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు హరికృష్ణ, ధనుష్‌లు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన పారయ్య, భార్య శంకరమ్మతో అన్యోన్యంగా ఉండేవాడు. అయితే మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో గానీ గ్రామసమీపంలో ఉన్న గొర్రెల మందను కాసేందుకు భర్త వెళ్లగా, భార్య శంకరమ్మ ఇద్దరు పిల్లలకు భోజనం పెట్టి ఊళ్లో ఉన్న స్కూల్‌కు పంపించింది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ఎం.హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అడవి బిడ్డలకు ఆర్థిక భరోసా
పార్వతీపురం టౌన్: ఆరు దశాబ్దాల కిందటి వరకూ గిరిజనులు నిలువు దోపిడీకి గురయ్యేవారు. గిరిజనులు పండించే పంటను మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేసి వారి శ్రమను దోచుకునేవారు. గిరిజన గూడాల్లో జీసీసీలు ఏర్పడే వరకూ ఇదే తంతు సాగగంతో ఆర్థికంగా వారి బతుకులు కుదేలయ్యాయి. అయితే ఇప్పుడు గిరిజనుల సంపదకు వారే యజమానులు. గిరిజనుల నుంచి మద్దతు ధరకు ముడిసరుకును జీసీసీ (గిరిజన సహకార సంస్థ) కొనుగోలు చేస్తుండడంతో వారి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన సరుకులను మరింత నాణ్యమైన ఉత్పత్తులుగా మలిచి జీసీఎంఎస్ (గిరిజన్ కార్పొరేషన్ మార్కెటింగ్ సొసైటీ) ద్వారా జనం చెంతకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) చేర్చుతోంది. తక్కువ ధరలకే విక్రయిస్తూ అటు వినియోగ దారులు, ఇటు గిరిజనులకు లాభాల వారధిగా నిలుస్తోంది. దళారుల బారినుంచి గిరిజనులను కాపాడుతూ అధిక ఆదాయం అర్జించి పెడుతూ ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం సాగిస్తోంది. ఉత్పత్తులు ఇలా.. గిరిజనుల నుంచి తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను ఏటా జీసీసీ కొనుగోలు చేసి 70 కేంద్రాల్లో నిల్వచేస్తోంది. ఏడు పారిశ్రామిక సదుపాయాల్లో ప్రాసెసింగ్ అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే జీసీసీ లక్ష్యం. పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి తదితర 27 ఉత్పత్తులను రిటైల్‌గా ప్రత్యేక ఔట్లెట్లు, సూపర్ బజార్లు, రైతుబజార్లు, ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిసర గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టి విక్రయాలు నిర్వహించడమే కాకుండా మొబైల్ సేవలను కూడా ప్రారంభించింది. మారుమూల పల్లెలకు గిరిజన ఉత్పత్తులను చేరవేస్తోంది. గిరిజనులకు ఆర్థిక ఊతం ప్రకృతి సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవకుండా మైదాన ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు జీసీఎంఎస్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలందరికీ చేరువచేసే ప్రణాళిక సిద్ధం చేశాం. గిరిజనులకు ఆర్థిక ఊతం కల్పిస్తాం. ముడిసరుకులకు మద్దతు ధరకల్పిస్తాం. - శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, జీసీసీ ప్రతి గ్రామానికి చేరువ చేస్తాం జీసీఎంఎస్‌కు మరింత ఆదాయం చేకూరేలా ఉత్పత్తులను గ్రామ స్థాయి ప్రజలకు అందించేందు మొబైల్ సేవలు ప్రారంభించాం. దీనివల్ల గిరిజనులు లబ్ధిపొందడమే కాకుండా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి జీసీఎంఎస్ ఉత్పత్తులు సరఫరా అయ్యేలా మొబైల్ సేవలను విస్తృతం చేస్తాం. - డి. సురేంద్ర కుమార్, జీసీసీ డివిజనల్ మేనేజర్ పార్వతీపురం ఆరోగ్యకర ఉత్పత్తులు స్వచ్ఛమైన ముడి సరుకుల తో ప్రజారోగ్యానికి ఎటు వంటి హాని కలిగించని ఉత్పత్తులను జీసీఎంఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలుచేసే ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురం పరిధిలో నాలుగు స్టాల్స్‌తో పాటు మొబైల్ వాహన సేవలు ప్రారంభించాం. - సాంబశివరావు, సీనియర్ అసిస్టెంట్, జీసీసీ పార్వతీపురం