
కొమరాడ(పార్వతీపురం మన్యం జిల్లా): ఇటీవల ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు (హరి) పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై సోమవారం బీభత్సం సృష్టించింది.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గదబవలస నుంచి ఆర్తాం గ్రామం వైపు ఒంటరి ఏనుగు వస్తుండగా జనం కేకలు వేశారు. దీంతో ఆంధ్రా–ఒడిశా అంతర్ రాష్ట్ర రహదారిలో వస్తున్న ప్రైవేటు బస్సును డ్రైవర్ నిలిపివేశారు. ఏనుగు ఒక్కసారిగా ఆ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసింది. రోడ్డుపై కాసేపు హల్‌చల్ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయింది.
చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి
Comments
Please login to add a commentAdd a comment