Elephant Attack
-
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
యువకులపై ఏనుగుల దాడి..ఒకరు మృతి
-
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం
సాక్షి,మన్యం: పార్వతీపురంలో గజ రాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మండలం నర్సి పురం సమీపంలో ఏనుగుల గుంపు కొబ్బరి తోటల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను లాగి విసిరేశాయి. పంటపొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల బీభత్సాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన వాహనాల్ని పక్కకు నెట్టాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపుతో స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
పెంచికల్పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్‌ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులతో వాగ్వాదం బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఏనుగుకు హాని తలపెట్టొద్దు.. బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్‌గఢ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు. -
హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం!
ఆదిలాబాద్: కుమురంభీం జిల్లా ప్రజలను గజరాజు హడలెత్తిస్తున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్న ఏనుగు గ్రామీణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో దహెగాం, కొండపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరిని పెద్దపులి హతమార్చగా.. ఇప్పుడు ఏనుగు రూపంలో మృత్యువు వెంటాడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇద్దరు రైతుల మృతి.. బూరెపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగును కొంతమంది గ్రామస్తులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారాన్ని విశ్వసించని అటవీ అధికారులు ఏనుగును నియంత్రించకపోవడంతో అది నది దాటి చింతలమానెపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఉదయం 11 గంటల సమయంలో బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల వద్దకు వచ్చిన ఏనుగు అక్కడే మిరపతోటలో పని చేస్తున్న రైతు అల్లూరి శంకర్‌పై దాడి చేసి చంపేసింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని అనుసరించగా.. గంగాపూర్, ఖర్జెల్లి గ్రామాల పక్కన ఉన్న ప్రాణహి త చేవేళ్ల ప్రాజెక్టు కాలువ పక్క నుంచి రుద్రాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అధికారులు ఏనుగు కదలికలను గుర్తించలేదు. మళ్లీ గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపింది. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్కరి సుధాకర్‌ను వెంబడించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు పలువురికి చెందిన తోటలు, పంటలు ధ్వంసం చేసింది. చింతలమానెపల్లి మండలం నుంచి బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో సంచరించింది. ఈమండలాలతో పాటు పక్కన ఉన్న కౌటాల, దహెగాం మండలాలు కలిపి రెండు రోజులుగా ఏనుగు ఐదు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా గత మంగళవారం ఏనుగు బూరెపల్లి వద్ద ప్రాణహిత నదికి అవతలి వైపు ఉన్న చౌడంపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. చింతలమానెపల్లి మండలానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గడ్చిరోలి జిల్లా రేపన్‌పల్లి రేంజ్ పరిధిలోని కమలాపూర్‌లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏనుగు అడవుల్లో సంచరించేది. దక్షిణ గడ్చిరోలి ప్రాంతంగా పిలిచే మాలెవాడ, మురుంగావ్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంతో కలిసి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంది. మూడేళ్ల క్రితం మాలెవాడ అటవీ ప్రాంతానికి 25 నుంచి 30 ఏనుగుల బృందం వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు నుంచే ఓ ఏనుగు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గడ్చిరోలి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనోరాలో ఈ ఏనుగుల గుంపు కొద్ది నెలలుగా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓ డ్రైవర్ సహా మరో ముగ్గురిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి అటవీ ప్రాంతం గుండా గడ్చిరోలిలోని మాలెవాడ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. అటవీశాఖపై విమర్శలు.. బూరెపల్లి వద్ద ఏనుగు సంచరిస్తున్న సమచారాన్ని అటవీశాఖకు చేరవేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సరైన సమయంలో స్పందించని కారణంగానే అల్లూరి శంకర్ ఏనుగు దాడిలో మరణించాడని ఆరోపిస్తున్నారు. ఒకరిపై దాడి చేసిన అనంతరం స్వయంగా జిల్లా అటవీ అధికారి పర్యవేక్షణలో ఉండగానే పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి వద్ద మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించిందని, గోప్యత పాటించడంతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో కొన్ని నెలల క్రితం అటవీ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులను బాధ్యులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు పలువురిపై వేటు వేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఎస్పీ సురేశ్‌కుమార్, అటవీ కన్జర్వేటర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టోబ్రివాల్, డీఎస్పీ కరుణాకర్ స్వయంగా ఆయా మండలాలలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు.. పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో గురువారం వేకువజామున రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటలకు బెజ్జూర్ నుంచి పెంచికల్పేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొండపల్లి టర్నింగ్ వద్ద ఎదురొచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పీసీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ఏనుగు సంచారాన్ని నిర్ధారించారు. లోడుపల్లి అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో పెంచికల్పేట్– సలుగుపల్లి రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. నా వెంట పడింది.. ఉదయం పూట కొండప ల్లి సమీపంలో వాకింగ్‌కు వెళ్లా. ఏనుగు ఘీంకరించిన శబ్దం వినిపించింది. దూరంగా ఉన్న ఇద్దరు మిత్రులను అప్రమత్తం చేస్తూ అరవడంతో ఏనుగు నా వెంట పడడంతో పరుగెత్తి తప్పించుకున్నా. తర్వాత ఏను గు ఉన్న స్థలంలో చూడడానికి వెళ్లగా అక్కడ కారు పోశన్న మృతదేహం కనిపించింది. – ఎల్కరి సుధాకర్, పెంచికల్పేట్ -
ఏనుగు దాడిలో రైతు మృతి
చింతలమానెపల్లి (సిర్పూర్): ఏనుగు దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని అటవీప్రాంతం నుంచి బుధవారం తెల్లవారుజామున ప్రాణహిత నది దాటి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూము ల్లోకి చొరబడింది. అక్కడే ఉన్న ఓ రైతుపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం బూరెపల్లిసమీపంలోని ప్రాణహిత నదిలో ఏనుగును గ్రామస్తులు కొంతమంది గమనించారు. ప్రాణహిత నది నుంచి బూరెపల్లి వ్యవసాయ భూముల వైపు వెళ్లింది. ఆ సమయంలోనే గ్రామ శివారులోని మిరపతోటలో అల్లూరి శంకర్(55) భార్య సుగుణబాయి, మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నాడు. ఏనుగు రాకను గమనించిన సుగుణ బాయి భర్తతోపాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరుగెత్తింది. తోట నుంచి వెళ్లలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. నేరుగా అక్కడికే వచ్చిన ఏనుగు శంకర్‌ను తొండంతో పైకి లేపి విసిరింది. ఎగిరి కింద పడిన అతడిని మళ్లీ కాలితో తొక్కడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగు అక్కడి నుంచి బాబాపూర్ వైపు వెళ్లడంతో కుటుంబసభ్యులు శంకర్ మృతదేహం వద్దకు వెళ్లారు. శంకర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, డీఎఫ్ఓ నీరజ్‌కుమార్ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.10వేలు అందించారు. చిక్కని ఏనుగు: కౌటాల సీఐ సాదిక్ పాషా, ఖర్జెల్లి రేంజ్ అధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందాలు ఏనుగును అనుసరించాయి. గంగాపూర్ నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాలువల మీదుగా ఖర్జెల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఖర్జెల్లి గ్రామస్తులు ఏనుగు గ్రామం వైపు రాకుండా మంటలు పెట్టారు. రాత్రి కావడంతో ఏనుగు వెళుతున్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాకపోకలు నిలిపివేశారు. రాత్రి పది గంటల వరకు రుద్రాపూర్ సమీపంలో ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి కొండా సురేఖ ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ మృతి చెందడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామన్నారు. -
ఏనుగు దాడిలో కూలీ బలి
బనశంకరి: అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ బలి కాగా ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా అల్దూరు జోన్లో బుధవారం చోటుచేసుకుంది. హెడదాళు గ్రామానికి చెందిన మీనా (45) మృతురాలు. గాయపడిన ఇద్దరు కార్మికులను జిల్లా ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది. తోటకు వెళ్తుండగా మీనా ఇద్దరు కార్మికులతో కలిసి తోటకు వెళుతున్న సమయంలో అడవి ఏనుగు దాడిచేసింది. తొండంతో కొట్టి తొక్కివేయడంతో మీనా అక్కడిఅక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు వెళ్లి మృతదేహంతో పాటు గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత నెలరోజులనుంచి అల్దూరు, అరేనూరు, హెడదాళు గ్రామాల్లో సంచరిస్తున్న అడవి ఏనుగులు మందలో గున్న ఏనుగు వేరు పడింది. ఈ అడవి ఏనుగు ను బంధించాలని నెలరోజులనుంచి అటవీశాఖ అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని ఘటనాస్థలం వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. సీఎం సమావేశం ఈ ప్రమాదం నేపథ్యంలో మూడిగెరెలో జిల్లాధికారి, జిల్లా ఎస్పీ, అటవీ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం నిర్వహించారు. నగరాల్లోకి వస్తున్న ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరమాలన్నారు. మీనా బంధువులతో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.15 లక్షల చెక్‌ను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. -
HYD: జూపార్క్‌లో ఏనుగు దాడి.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రు జూపార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూపార్క్‌లోని ఓ ఏనుగు దాడిలో దాని కేర్ టేకర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నెహ్రు జూపార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కాగా, ఏనుగు దాడిలో కేర్ టేకర్ షెహబాజ్ మృతిచెందాడు. ఏనుగు దాడి అనంతరం, షెహబాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో... -
ప్రైవేటు బస్సుపై ఏనుగు దాడి
కొమరాడ(పార్వతీపురం మన్యం జిల్లా): ఇటీవల ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు (హరి) పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై సోమవారం బీభత్సం సృష్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గదబవలస నుంచి ఆర్తాం గ్రామం వైపు ఒంటరి ఏనుగు వస్తుండగా జనం కేకలు వేశారు. దీంతో ఆంధ్రా–ఒడిశా అంతర్ రాష్ట్ర రహదారిలో వస్తున్న ప్రైవేటు బస్సును డ్రైవర్ నిలిపివేశారు. ఏనుగు ఒక్కసారిగా ఆ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసింది. రోడ్డుపై కాసేపు హల్చల్ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జార్ గ్రామ్ గ్రామంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు ఇట్టే పసిగట్టి క్షణాల్లో వాలిపోయి మొత్తం ఆహారాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా జార్ గ్రామ్ లో ఓ పెళ్ళిలో ఏనుగులు ఇలాగే హల్ చల్ చేయడంతో అతిథులంతా చెల్లాచెదురు కాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బైక్ పైన ఉడాయించారు. ఇటీవలి కాలంలో జార్ గ్రామ్ గ్రామ సరిహద్దుల్లో ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఊళ్ళో ఎక్కడ భోజనం వాసన వచ్చినా వెంటనే వెళ్లి ఆవురావురుమంటూ లాగించేస్తున్నాయి. అందుకే స్థానికంగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా వణికిపోతున్నారు. ఆదివారం జార్ గ్రామ్ సమీపంలోని జోవాల్ భంగా గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘా వివాహం జరుగుతుండగా వివాహ కార్యక్రమం అప్పుడే పూర్తై అతిధులు భోజనాలకు సిద్ధమవుతున్నారు. అంతలో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంపల కుర్మాలతో కూడిన మెనూ వాసనలు వెదజల్లుతూ ఏనుగులను స్పృశించాయి. ఇంకేముంది ఆహ్వానం లేకుండానే పెళ్ళికి వచ్చి అతిధుల కంటే ముందే విందునారగించేందుకు తయారయ్యాయి. కళ్యాణ మండపంలో అవి చేసిన రాద్ధాంతానికి అతిథులంతా భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో నక్కారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగోలా బైక్ ఒకటి సంపాదించి దానిపైన పారిపోయారు. చాలా రోజులుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి అభ్యర్థులు ఏనుగుల గుంపులు భయపడి ఆర్భాటాలు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఇది కూడా చదవండి: తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి.. -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
చిక్కిన అరికొంబన్!
సాక్షి, చైన్నె : కేరళ – తమిళనాడు సరిహద్దులలోని తేని జిల్లా వాసులను హడలెత్తిస్తూ వచ్చిన అరి కొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టుబడింది. సోమవారం ఉదయం దీనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. కుంకీల సాయంతో లారీలో ఎక్కించి దట్టమైన అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకెళ్లారు. వివరాలు.. కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లా పరిధిలో గత కొంతకాలంగా అరి కొంబన్ ఏనుగు హడలెత్తిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు దాడికి పంట పొలాలు నాశనం అయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌లో అతికష్టంపై ఈ ఏనుగును పట్టుకున్నారు. తెక్కడైలోని దట్టమైన పెరియార్ రిజర్వుర్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. దీనికి రేడియో కాలర్ అమర్చి కదలికలను పరిశీలిస్తూ వచ్చారు. అయితే, కేరళను వీడిన ఈ అరి కొంబన్ ఏనుగు గత నెలాఖరులో తమిళనాడులోని తేని జిల్లాలోకి ప్రవేశించింది. వారం రోజులకు పైగా అవస్థలు తేని జిల్లా పరిధిలోని కంబం పట్టణంలోకి తొలుత దూసుకొచ్చిన ఈ అరికొంబన్ రోడ్ల మీద పరుగులు తీస్తూ, వాహనాలపై తన ప్రతాపం చూపించింది. ఈ క్రమంలో పలువురిపై దాడి చేసింది. ఒకరిని కొట్టి చంపేసింది. గత వారానికి పైగా ఆ తర్వాత గూడలూరు పరిసరాలలో వీరంగం సృష్టించింది. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టుకునేందుకు వచ్చిన అధికారుల కళ్లు గప్పి తప్పించుకుంటూ వచ్చిన ఈ అరికొంబన్ సోమవారం ఉదయం షణ్ముగా నదీ డ్యాం తీరంలో ఉన్నట్లు రైతులు గుర్తించారు. తక్షణం అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకున్నారు. పథకం ప్రకారం చాకచక్యంగా రెండుడోస్‌ల మత్తు ఇంజెక్షన్లను ఈ ఏనుగుకు ఇచ్చారు. వెను వెంటనే స్వయంబు, అరిసి రాజ, ఉదయన్ అనే మూడు కుంకీ ఏనుగుల సాయంతో అరి కొంబన్ను చుట్టుముట్టారు. కుంకీ ఏనుగుల సహకారంతో బలవంతంగా లారీలోకి అరి కొంబన్ను ఎ క్కించారు. ఇది మళ్లీ తప్పించుకోకుండా ఆగమేఘాలపై లారీలో దట్టమైన అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకెళ్లారు. మార్గం మధ్యలో కట్టిన తాళ్లను ఈ ఏనుగు తెంచి పడేయడంతో ఉత్కంఠ నెలకొంది. అతికష్టం మీద ఈ ఏనుగును బంధించారు. అడవిలోకి తీసుకెళ్లి వదిలి పెట్టే సమయంలో ఈ ఏనుగు ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వైద్యులు పరిశీలించనున్నారు. వారం రోజులకు పైగా తమ కంటి మీద కునుకు లేకుండా చేసిన అరి కొంబన్ చిక్కడంతో తేని వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి పట్టణాలు, గ్రామాల్లో విధించిన 144 సెక్షన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ అరి కొంబన్ రూపంలో ఎదురైన నష్టం తీవ్రతను అంచనా వేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కలకాడు వాసుల నిరసన పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగును తిరునల్వేలి జిల్లా కలకాడు అభయారణ్యంలో వదిలి పెట్టాలని రాష్ట్ర అటవీ అధికారులు నిర్ణయించారు. తేని నుంచి కలకాడుకు లారీలో ఈ ఏనుగును తీసుకొచ్చారు. అయితే కలకాడు అడవుల్లో ఈ ఏనుగును వదిలిపెట్టడాన్ని పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏనుగుతో వచ్చిన లారీని ప్రజలు సాయంత్రం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఏనుగును ఇక్కడ వదిలి పెడితే, తమకు భద్రత లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు నిరసన కారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసినానంతరం అభయారణ్యంలోకి ఏనుగును తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్లో అరి కొంబన్ఉంది. అదే సమయంలో ఈ ఏనుగును మది కట్టాం చోళైలో వదిలి పెట్టేందుకు ఆదేశించాలని కోరుతూ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. -
ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప ఏడవడంతో..
తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు ‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది. -
ఏనుగుకు కోపం వస్తే ఇంతే.. ట్రక్కును ఏం చేసిందో తెలుసా?
వన్య ప్రాణుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాటికి కోపం తెప్పించడం, జంతువులతో ఓవరాక్షన్ వంటివి చేస్తే వెంటనే దాడి చేస్తాయి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఏనుగుల విషయంలో ఇప్పటికే దాడి చేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఏనుగులు ఎంతో ప్రశాంతతో ఉంటాయి. వాటి జోలికి వెళ్లనంత వరకు ఎవరి మీదా దాడి చేయవు. కానీ, అసోంలో మాత్రం ఓ ఏనుగు నడిరోడ్డుమీద వాహనదారులకు చుక్కలు చూపించింది. దారిలో వస్తున్న వాహనాలకు అడ్డుకుంది. వాహనదారులను భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో ఏనుగుకు ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలేరో ట్రక్కును అడ్డుకుంది. నాకే ఎదురుగా వస్తావా అని ఫీలైనట్టు ఉంది.. కోపంతో ట్రక్కును బోల్తా పడేసింది. రోడ్డు కిందకు లాగిపడేసి.. రెండుసార్లు బోల్తా కొట్టించింది. #VIDEO | An #elephant attacked and overturned a vehicle in #Guwahati. The video which is going viral on social media is said to be from Narengi Army Cantt. However, the source of the video is not known. #Assam @assamforest @cmpatowary pic.twitter.com/bzwaKQn9J6 — G Plus (@guwahatiplus) January 14, 2023 ఇదే క్రమంలో అటుగా వస్తున్న వాహనాలను సైతం అడ్డుకుంది. రోడ్డుపై వస్తున్న కార్లకు అడ్డుగా వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎంతో సహాసం, చాకచక్యంతో ఓ కారు డ్రైవర్.. ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వామ్మో.. ఏనుగు ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Assam: Another incident of an elephant attack came up. An elephant was spotted in the Narengi area of Guwahati. The elephant was seen angrily chasing after cars. However, people managed to safely flee the scene. pic.twitter.com/pm1brSVmNO — India Today NE (@IndiaTodayNE) January 13, 2023 -
వైరల్ వీడియో: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
-
Viral: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
వైరల్: వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. ఒక తీరని సమస్య. జరిమానాలు, కఠిన చర్యలు కూడా కొందరిని కట్టడి చేయలేని పరిస్థితి. అదే టైంలో.. కొన్ని కొన్నిసార్లు అధికారుల తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంటుంది. అయితే.. అవగాహనలో ఈ మధ్యకాలంలో కొన్ని డిపార్ట్మెంట్లు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోతే.. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంటుంది అంటూ ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ(ఈస్ట్ డివిజన్) కళా కృష్ణస్వామి. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్ని పక్కన పడేసింది ఓ ఏనుగు. ఆ సమయంలో పక్కనే రోడ్డుకు కింది భాగంలో మరో రెండు బైకులు ఉన్నా.. ఆ ఏనుగు వాటి జోలికి పోలేదు. దీంతో.. నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని, అలా పార్క్ చేయొద్దంటూ సదరు ఐపీఎస్ అధికారిణి ట్వీట్ చేశారు. ఆ అధికారిణి టైంకి లైకులు, షేర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ ఏనుగు వీడియో కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కేరళ మలప్పురంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. కాసేపు ప్రజలకు పరుగులు పెట్టించింది. ఆ సమయంలోనే జనాలను బెదరగొట్టి.. అలా బైక్‌ను లాగి తన్నింది. చివరకు.. గ్రామస్తులు దానిని ఎలాగోలా అడవిలోకి తరిమేసినట్లు తెలుస్తోంది. " Don't park on main road " pic.twitter.com/Z8OYGBZmDR — Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023 -
పిచ్చి అంటారండి దీన్ని!.. కాస్త ఉంటే..
మనుషులకు-వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలియంది కాదు. నగరీకరణ, అడవుల్లో కార్పొరేట్ వ్యవహారాలు పెరిగి పోయే కొద్దీ.. అలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. జనావాసాల వైపుగా వచ్చిన ఏనుగుల మందను తరిమే క్రమంలో ఓ కుర్రాడు.. కర్రతో ఏనుగును కొట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ గజరాజు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సురేందర్ మెహతా.. ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. జస్ట్ మ్యాడ్నెస్(కేవలం పిచ్చి) అనే క్యాప్షన్ ఉంచారాయన. Just madness…🐘#Wildlife #conflict @susantananda3 pic.twitter.com/Il8jx4AqgZ — Surender Mehra IFS (@surenmehra) December 4, 2022 ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం -
ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!
తిరువనంతపురం: ఆలయానికి వెళ్లిన ఓ కొత్త జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోని గజరాజు ముందు ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు దాడి చేసింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ ‘వెడ్డింగ్ మొజిటో’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10న జరిగింది. గజరాజు ఒక్కసారిగా దాడి చేయడంతో సమీపంలోని భక్తులంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీడియో ప్రకారం.. కొత్త జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. వారికి గజరాజు కుడివైపున ఉంది. ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించగా.. ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎత్తి కుమ్మిపడేసింది. తొండంతో పైకెత్తేందుకు ప్రయత్నించగా కింద పడిపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, అతని శరీరంపై ఉన్న బట్టలను ఏనుగు లాగేసింది. ఆ తర్వాత ఏనుగుపై ఉన్న మరో మావటి దానిని అదుపు చేశాడు. తమకు ఎదురైన ఈ సంఘటనను వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. తాము ఫోటోలు దిగుతుండగా అంతా అరుస్తూ పరుగెడుతున్నారని, తన భార్య చేతిని పట్టుకుని లాక్కెళ్లినట్లు చెప్పాడు. View this post on Instagram A post shared by Wedding Mojito (@weddingmojito) ఇదీ చదవండి: Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు -
Viral Video: ఎమ్మెల్యేపై గ్రామస్థుల దాడి.. తరిమి తరిమి కొట్టిన జనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో తమ ప్రాంతంలో తరుచూ ఏనుగు బారిన పడి ప్రజలు చనిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు. అయితే మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ మ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. The villagers were outraged & gave gherao to #BJP MLA #MPKumaraswamy. They have been driven on the main road of the village. Some of the villagers who were very indignant also abused with unspoken sounds. #BJPMLA's were grabbed & dragged.#Karnataka #Chikkamagaluru pic.twitter.com/NyY2oOegeT — Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022 ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, తరలించారు. కాగా ఏనుగు దాడిలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్తే గ్రామస్థులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. Chikkamagaluru, Karnataka | Mudigere MLA from BJP, MP Kumaraswamy's clothes were allegedly torn by locals of Hullemane village when he visited them following the death of a woman in an elephant attack. The villagers alleged that the MLA didn't respond properly to elephant attacks pic.twitter.com/xIeCiSlBDX — ANI (@ANI) November 21, 2022 ఏనుగు దాడిలో మహిళ మృతి.. భర్త కళ్ల ముందే ఘోరం ఏనుగు దాడిలో మహిళ మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి సతీశ్‌గౌడ, శోభ దంపతులు పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా పరుగులు తీశారు. శోభను ఏనుగు వెంబడించి ఆమెను తొక్కి చంపేసింది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు. గతంలోను కెంజి గ్రామానికి చెందిన ఆనంద దేవాడిగను ఏనుగు ఇలాగే బలిగొంది, ఈ ఘటనతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. -
మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
నాతోనే మజాకా.. టూరిస్టులకు చుక్కలు చూపించిన ఏనుగు
ఏనుగులు సాధారణంగా ఎంతో ప్రశాంతమైన జీవులు. అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. వాటికి కోపం తెప్పిస్తే మాత్రం మామూలుగా ఉండదు. వెంటపడి మరీ దాడి చేస్తాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కొందరు టూరిస్టులో కొద్దిలో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బదోలా ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, వీడియోలో అడవిలో సందర్శనకు వచ్చిన టూరిస్టులను ఏనుగు తరుముతుండటంతో సఫారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా రివర్స్ చేస్తుండటం ఈ వైరల్ వీడియోలో ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు లోనుచేస్తుంది. సఫారీ డ్రైవర్ ఏమాత్రం తడబాటు లేకుండా జీపును వెనక్కి డ్రైవ్ చేస్తాడు. ఆ సమయంలో ఏనుగు ఆగ్రహంతో సఫారీ మీదకు దూసుకు వస్తుంది. ఇక, ఇలా కొంత దూరం వెనక్కి వెళ్లిన తర్వాత ఏనుగు తనంతట తానే రూట్ మార్చి అడవిలోకి వెళ్లిపోతుంది. దీంతో, సఫారీలో ఉన్న టూరిస్టులు సేదా తీసుకుంటారు. కాగా, వీడియో షేర్ చేసిన సాకేత్ బదోలా.. డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ఏనుగు ఎందుకు ఆగ్రహంగా దూసుకెళ్లిందో విచారించాలని అధికారులను కోరుతూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఏనుగు ఇంత వయలెంట్‌గా ఉందేంటి కామెంట్స్ చేస్తున్నారు. Credits to the driver for his skills and keeping his cool. Not an easy situation to be in. However, authorities should investigate the reason behind the elephant’s irritation. pic.twitter.com/KSR4XF6nlZ — SAKET (@Saket_Badola) September 9, 2022 -
ఏం సార్.. గోక్కోవడం కూడా తప్పేనా..
మనుషులకు దురదేస్తే ఏం జరుగుతుంది.. ఏమీ జరగదు.. గోక్కుంటారు అంతే.. మరి ఏనుగుకు దురదేస్తే ఏం జరుగుతుంది? ఏదో ఒకదానికి మూడుతుంది. ఇక్కడ వంతు ఈ కారుది. ఎక్కడ జరిగిందన్న విషయం తెలియనప్పటికీ.. దీన్ని ట్విట్టర్లో షేర్ చేస్తే.. జనం తెగ చూశారు. చూడటమే కాదు.. తెగ నవ్వుకున్నారు కూడా.. మీరే ఏనుగై.. మీకు దురదేస్తే ఏం చేస్తారు? అన్న క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేయడంతో రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెట్టారు. గజరాజు ఈ కారును టాయిలెట్ పేపర్ కింద వాడుకున్నట్లు ఉంది అని ఒకరు వ్యాఖ్యానించారు. గోక్కోవడం తప్ప.. దాడిలాంటిది ఏనుగు చేయకపోవడంతో ఆ సమయంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. -
ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె!
అడవుల్లో పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ ఏనుగులు ఆహారం కోసం కొత్త ప్రాంతాల్లోకి చొరబడాల్సిన పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణుల ప్రాణాలతోపాటు పంటలకు, పశువులకు రక్షణ కొరవడుతున్నది. ఏనుగులు–మనుషుల సంఘర్ణణను నివారించేందుకు కంచె పంటగా మల్బరీ మొక్కలను సాగు చేయటం, తేనెటీగల పెట్టెలతో కంచెను ఏర్పాటు చేయటం సత్ఫలితాలనిస్తున్న విషయమై గత వారం చర్చించుకున్నాం. ఈ వారం మరో బయోఫెన్స్ గురించి పరిశీలిద్దాం. పంట పొలాలు, గ్రామాల చుట్టూ నిమ్మ చెట్లతో దట్టమైన కంచెను ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల బెడద నుంచి బయటపడిన అస్సాం రైతుల అనుభవం గురించి తెలుసుకుందాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని శివసాగర్ జిల్లాలో గతంలో ఏనుగులు–మనుషుల ఘర్షణ. ప్రాణనష్టంతో పాటు పంట నష్టం సంఘటనలు తరచూ వినిపిస్తూ ఉండేవి. ఏనుగుల గుంపులో 150–200 నుంచి నాలుగైదు వరకు ఏనుగులు ఉంటాయి. అయితే, గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడుల బాధ తప్పిందని సౌరగూరి ప్రాంత రైతులు సంతోషిస్తున్నారు. నిమ్మ చెట్లతో బయోఫెన్స్లు నిర్మించుకోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అరణ్యక్ వీరికి అండగా నిలిచింది. నిమ్మ కంచెలపై అవగాహన కల్పించటంతోపాటు మొక్కలను సైతం అందించింది. జిగ్‌జాగ్ పద్ధతిలో మూడు వరుసలుగా నిమ్మ మొక్కలను దగ్గర దగ్గరగా నాటుకోవాలి. రెండు మూడు ఏళ్లు పెరిగేటప్పటికి నిమ్మ మొక్కల కొమ్మలు కలిసిపోయి ఏనుగులు దూరి రావటానికి వీలుకాదు. నిమ్మ చెట్లకుండే ముళ్లు, నిమ్మకాయల వాసన.. ఈ రెండిటి వల్ల ఏనుగులు నిమ్మ కంచెలు దాటి రాలేకపోతున్నట్లు అరణ్యక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి రక్షించడంతో పాటు రైతులకు నిమ్మకాయల విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది. నాలుగేళ్ల క్రితం నిమ్మ మొక్కల కంచె నాటిన హజారికా అనే రైతు వారానికి వెయ్యి వరకు నిమ్మకాలను కోసి విక్రయిస్తున్నారు. ఆఫ్సీజన్లోలో నిమ్మకాయ రూ.5 కి అమ్ముతున్నారు. సీజన్లో అయితే రూ.2–3కు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానిక వాతావరణం, పర్యావరణం, మట్టి స్వభావాన్ని బట్టి బయోఫెన్స్ రకాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ‘తేనెటీగ పెట్టెలతో కూడిన కంచెలు వర్షపాతం తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తేనెటీగలు మనుగడ సాగించలేవు. వెదురు మొక్కలతో కంచెలు స్వతహాగా వెదరు పెరిగే ప్రాంతాల్లో పర్వాలేదు. ఇతర ప్రాంతాల్లో వెదురు కంచెలు ఏర్పాటు చేస్తే.. ఇతర చెట్లను పెరగనీయకుండా ఇవే విస్తరించి జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయి. నిమ్మ చెట్లు, మొగలి ఆకారంలో ఉండే కిత్లలి (అగవె) జాతి తుప్పలతోనూ బయెఫెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతానికి ఏది అనువైనదో గ్రహించాలి. ఏనుగుల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఘర్షణలు నివారించి సహజీవన సూత్రాన్ని పాటించడానికి ‘కంచె తోటలు’ ఉపకరిస్తుండటం విశేషం. -
వాహనంపై గజరాజు దాడి.. నలుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హొరనాడుకు బయలుదేరిన పర్యాటకుల వాహనంపై అడవి ఏనుగు దాడి చేయడంతో నలుగురు గాయపడిన సంఘటన మూడిగెరె వద్ద చోటుచేసుకుంది. చిక్కమగళూరు తాలూకా కుప్పళ్లికి చెందిన చంద్రన్న, మోహిని, బాలుడు అవనీష్, రాధమ్మ ఏనుగు దాడిలో గాయపడ్డారు. వీరంతా సోమవారం ఉదయం హొరనాడు అన్నపూర్ణేశ్వరి దర్శనానికి ఓమ్ని వ్యాన్‌లో బయలుదేరి మూడిగెరె తాలూకా కుందూరు వద్ద వెళ్తుండగా అడవిలో నుంచి దూసుకువచ్చిన ఏనుగు ఒక్కసారిగా వాహనాన్ని తొడంతో ఎత్తి విసిరేసింది. వ్యాన్ నుజ్జుగుజ్జు కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హొంగనూరు చెరువులో ఏనుగులు ఠికాణా దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ తాలూకా హొంగనూరు గ్రామంలోని చెరువులో ఆరు అడవి ఏనుగుల మంద ఠికాణా వేసి ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆకలి వేసినప్పుడు పంట పొలాలపైపడి తరువాత నీటిలో దిగి జలకాలాడుతున్నాయి. ఏనుగుల భయంతో చుట్టుపక్కల పొలాలు, తోటలకు రైతులు పనులకు వెళ్లలేకపోతున్నారు. -
Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు
ఏనుగులు మనుషులపై దాడులు చేయడం తరచూ చూస్తుంటాం. మావటి వాళ్లకు, మచ్చిక చేసుకునే వాళ్లకు తప్ప ఎవరీకి అవి లొంగవు. అలాంటిది ఓ అడవి ఏనుగు.. థాయ్‌లాండ్‌లో వింతగా ప్రవర్తిస్తోంది. వాసన పసిగట్టి.. ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి.. వంట గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లో చలెర్మ్కియాపట్టణా గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్.. వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు.. తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది. ఈ క్రమంలో వస్తవుల్ని నాశనం చేసిందిక ఊడా. ఆ నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. A wild elephant in Thailand bursts its head through a kitchen wall to steal a bag of rice!#animals #wildworld #elephant #viralvideo #shocking #thailand #thailandnews pic.twitter.com/UJwFniXH1W — Newsflare (@Newsflare) June 21, 2021 కాగా, బూన్చుయే అనే ఆ మగ ఏనుగు.. ఇలా వ్యవహరించడం కొత్తేం కాదు. కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో ఉండే ఈ ఏనుగు.. తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్‌గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. చదవండి: రాక్షసుల కన్నా దారుణంగా వ్యవహరించారు -
చనిపోయినా వీడి పోలేక..
పలమనేరు (చిత్తూరు జిల్లా): తమ బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఏనుగులు కోతిగుట్ట గ్రామంలో గున్న ఏనుగు మృతి చెందిన చోటును విడిచిపెట్టడం లేదు. శనివారం సైతం అక్కడికి వచ్చిన ఏనుగులు బిడ్డ కోసం రోధించాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామ పొలాల్లోకి సమీపంలోని కౌండిన్య అడవి నుంచి చొరబడ్డ ఏనుగుల గుంపులో ఓ గున్న ఏనుగు కరెంట్‌షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా శుక్రవారం ఉదయం వరకు ఏనుగుల గుంపు మృతి చెందిన గున్న ఏనుగును విడిచిపెట్టి పోలేదు. శనివారం మరోసారి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు గున్న ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి చేరుకున్నాయి. గున్న ఏనుగుకు పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టిన గుంత వద్ద గుమిగూడి రోదించాయి. కొన్ని ఏనుగులు గుంతను తోడేందుకు యత్నించాయి. ఇలా ఉండగా, గ్రామంలోకి వచ్చిన ఏనుగులను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అరుపులు కేకలు పెట్టి వాటికి ఆగ్రహాన్ని తెప్పించారు. కేరింతలు కొడుతూ సెల్ఫోన్లలో రికార్డు చేయడం చూసి అవి జనంపైకి తిరగబడ్డాయి. గుంపులోని ఓ మదపుటేనుగు రవి అనే రైతును వెంబడించి తొండంతో కొట్టడంతో అతను గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించారు. భయం గుప్పిట్లో కోతిగుట్ట గున్న ఏనుగు మృతిని ఏనుగులు ఏమాత్రం జీర్ణించుకోలేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి మళ్లీ మళ్లీ గ్రామంలోకి వచ్చి జనంపై దాడి చేసే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే కాలువపల్లి వద్ద ఓ యువకుడు స్మార్ట్‌ఫోన్ లైట్ వేసి ఏనుగును అదిలించగా అది ఆ యువకుడిని తొక్కి చంపింది. ఏనుగులు పగబట్టి మరిన్ని దాడులు చేసేలా ఉండటంతో కోతిగుట్ట వాసులు భయాందోళనలు చెందుతున్నారు. -
ఏనుగు దాడిలో రైతు దుర్మరణం
గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బొమ్మవారిపల్లిలో బుధవారం ఓ ఏనుగు విధ్వంసం సృష్టించింది. మామిడి చెట్లు, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసింది. నాశంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కళావతిని గాయపరిచింది. అక్కడ ఉన్న ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయింది. కళావతిని 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏనుగు గంగాధరనెల్లూరు వైపు వచ్చింది. పొలం పనులు చేసుకుంటున్న లక్ష్మి ఆ ఏనుగును దగ్గర్నుంచి చూడటంతో భయంతో పరుగులుదీసింది. ఈ క్రమంలో ఓ రాయిపై పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అనంతరం నీవా నది పక్కన పొలం పనులు చేసుకుంటున్న వేల్కూరు ఇందిరానగర్ కాలనీకి చెందిన వజ్రవేల్(48)పై ఏనుగు దాడి చేసింది. దంతాలతో పొడవడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
యువకుడిని తొండంతో కొట్టి చంపిన ఏనుగు
పలమనేరు(చిత్తూరు జిల్లా): పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువకుడిని ఒంటరి ఏనుగు తొండంతో కొట్టి చంపిన ఘటన పలమనేరు మండలంలోని కాలువపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన త్యాగరాజు కుమారుడు జానకిరామ(27) తమ పొలం సమీపంలోని ఓ ఆలయంలో రాత్రిపూట పడుకుంటూ వరిపొలానికి నీరు పెట్టేవాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో త్రీఫేస్ కరెంట్ రావడంతో సెల్‌ఫోన్ టార్చ్ వేసుకుంటూ పొలానికి బయలు దేరాడు. ఏదో అలికిడి కావడంతో స్మార్ట్‌ఫోన్ టార్చ్‌తో చూశాడు. టార్చ్ కాంతి పొలం సమీపంలో పొదల చాటునున్న ఒంటరి ఏనుగు కళ్లలో పడింది. దీంతో ఆగ్రహించిన ఏనుగు తొండంతో అతన్ని తలపై బలంగా కొట్టింది. దీంతో మెదడుకు దెబ్బ తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత సేపటికి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బంది గమనించి పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి తెలిపారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బిడ్డ ఏనుగు దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబీకులు కన్నీరు మున్నీరై రోధించారు. ( చదవండి: కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. ) -
ఏనుగు పాదానికి గాయమైందని వెళితే.. విసిరికొట్టింది!
మాడ్రిడ్: ఓ ఏనుగు తన తొండంతో గట్టిగా కొట్టి, ఎన్‌క్లోజర్ నుంచి జూ కీపర్‌ను బయటకు విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోని కాబార్సెనో నాచురల్ పార్క్‌లో జూ కీపర్ జోక్విన్ గుటిరెజ్ ఆర్నైజ్(44)పై ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో జూ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఏనుగు పాదానికి ఇన్ఫెక్షన్ అయినట్లు తెలుస్తోంది. ఆ గాయం స్థితిని తెలుసుకోవడానికి జూకీపర్ దాని వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఏనుగుకు దగ్గు రావటంతో అది ఒక్కసారిగా తన తొండాన్ని బలంగా ముందుకు విసిరింది. దీంతో దాని పాదాల వద్ద ఉన్న జూ కీపర్ ఎన్‌క్లోజర్ అవతలపడ్డాడని తెలిపారు. ఆ ఏనుగు తొండానికి చాల బలం ఉంటుందని, అది మనుషులకు తగిలితే బతకటం కష్టమని పేర్కొన్నాడు. ఈ ఘటన చోటు చేసుకోవటం బాధాకరం, 30 ఏళ్ల జూ చరిత్ర ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరిగిందని ఆయన తెలిపాడు. చదవండి: తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం -
వైరల్: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?
జంతువులను చూసేందుకు అడవులకు వెళ్లినప్పుడు సాధారణంగా వాటిని దూరం నుంచి చూస్తాం. కొన్ని సార్లు తమకు నచ్చిన జంతువులను చూశామన్న ఆనందంలో వాటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది జంతువుల చేతిలో ప్రాణాలు కొల్పొయిన విషయం తెలిసిందే. మరి కొన్నిసార్లు ఆ జంతువులు వారిపై ఎదురు తిరిగితే భయంతో పరుగెత్తిన వార్తలు చదివాం. తాజాగా ఓ ఏగును దాని వెనకాల వచ్చిన టూరిస్టు బృందం మీద గట్టిగా అరుస్తూ వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సురేందర్ మెహ్రా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఏం జరగలేదు. వీరు ఏనుగును వీడియో తీశారు. వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులను ఎదుర్కొన్నప్పుడు మనకు ఎన్నిసార్లు ఒకేలా అనిపిస్తుంది. అడివిలోకి జంతువులను చూడడానికి వెళ్లినపుడు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రకృతి వారికి ఓ పాఠం నేర్పింది’ అని ఆయన కామెంట్ జత చేశారు. వివరాలు.. ఓ పర్యాటకుల బృందం జీపులో కూర్చోని అడవిలో తిరుగుతూ.. ఓ ఏనుగు వెనక నుంచి వీడియో తీశారు. ఆ ఏనుగు తమను చూడలేదని భావిస్తూ దాని వెనకాలే జీపుతో ముందుకు వెళ్లారు. కానీ, ఆ ఏనుగు ఒక్కసారిగా వెనక్కు తిరిగి వారి వాహనంపైకి కోపంగా అరుస్తూ పరుగెత్తుకొని వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అడవిలో ఉన్నప్పుడు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.. జంతువులను గౌరవించాల్సిన అవసరం ఉంది.. వాళ్లు చాలా పిచ్చి మనుషులు.. ఏనుగులు శబ్దాలు వింటాయని మర్చిపోయారా?’ అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఆరు వేల మంది వీక్షించారు. చదవండి: ఏనుగుపై దాడి.. మీరు మనుషులా రాక్షసులా! -
తండ్రీకూతుళ్లపై ఏనుగులు దాడి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల వద్ద కాపలా ఉన్న తండ్రీకూతుళ్లపై ఏనుగులు దాడి చేశాయి. పంటలనంతా ధ్వంసం చేసి.. బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో సోనియా అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. -
ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: భయానక దృశ్యం. సాధారణంగా అడవిలో గజరాజు కనిపిస్తే చాలు గుండె ఆగినంత పనౌవుతుంది. ఇంకా అది కొపంతో మన మీదకు వస్తే ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఊహించుకుంటునే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. కానీ అతడు ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా శుక్రవారం షేర్ చేశారు. దీనికి ‘ఈ వ్యక్తికి మరో జీవితం అంటూ’ నందా ట్వీటర్లో పంచుకున్నారు. (చదవండి: వైరల్: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ) 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పొదల చాటున ఉన్న ఆ వ్యక్తిని చూసిన ఏనుగు అతడి మీదకు కోపంగా వస్తుంది. అదలా రావడం చూసిన అతడు దానిపైకి కర్ర ఎత్తాడు. దీంతో అది కాస్తా ఆగి.. మరింత కోపం తెచ్చుకుని అతడి మీదకు దూసుకురావడంతో మరింత అప్రమత్తయ్యాడు. పైకి లేచి కర్రను మరింత పైకి లేపి దానిని బెదిరించాడు. దీంతో అది తోకముడిచి ఏనుగు వెనక్కి వెళ్లిన వీడియోను షేర్ చేసిన గంటల వ్యవధిలోనే సుమారు 13.5 లక్షల వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ఇది నిజంగా భయంకరంగా ఉంది’, ‘అతడు చాలా అదృష్టవంతుడు’, ‘అతడు సమయస్పూర్తితో వ్యవహరించాడు’, ‘నిజంగా అతడికి ఇది మరో జీవితం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు) This man had a second life.. pic.twitter.com/r9y7EYxTw5 — Susanta Nanda (@susantananda3) August 20, 2020 -
ఒంటరి ఏనుగు హల్చల్
యాదమరి/చిత్తూరు జిల్లా పరిషత్ : మండల ప్రజలకు ఒంటరి ఏనుగు కునుకులేకుండా చేస్తోంది. డీకే చెరువు, రంగనాయకుల చెరువు, పెరగాండ్లపల్లె, అయ్యప్ప వూరు, కూసూరు గ్రామాలు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. నెల రోజులుగా ఏనుగుల గుంపు ఈ గ్రామాల్లో సంచరిస్తూ పంట నష్టం కలిగిస్తోంది. అటవీ అధికారులు తీసుకున్న చర్యల కారణంగా కొన్ని రోజుల క్రితం ఏనుగుల గుంపు గుడిపాల మండలం వైపు వెళ్లిపోయినా వాటి నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మాత్రం భయబ్రాంతులకు గురిచేస్తోంది. అది ఆదివారం రాత్రి రంగనాయక చెరువు గ్రామంలోని పొలా ల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేసింది. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అది గ్రామం వైపు వస్తుండడంతో రైతులు, యువకులు టపాకాయలు పేల్చారు. ఆగ్రహించిన ఏనుగు టపాకాయలు పేల్చిన తోట కాలితో తన్నుతూ, ఘీంకరిస్తూ వారి వైపు పరుగులు తీసింది. తప్పించుకునే క్రమంలో పలువురు యువకులు, రైతులు గాయపడ్డారు. బంగారుపాళెం మండలంలోని శేషాపురం గ్రామంలోనూ ఆదివారం రాత్రి పంటలపై ఏనుగులు దాడి చేశాయి. గ్రామానికి చెందిన రైతులు రత్నంనాయుడు, ప్రసాద్‌కు చెందిన వరి మడిని తొక్కేశాయి. అరటి, పనస చెట్లను విరిచేశాయి. ఊరును ఖాళీ చేయించిన అధికారులు గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుసుకుని గ్రామస్తులను ఊరి నుంచి పంపించేశారు. రాత్రిపూట వేరే గ్రామాల్లో తలదాచుకోవాలని సూచించారు. పొద్దుపోయాక పొలాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. తాము వెళ్లిపోతాము సరే.. పశువుల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏనుగు వాటిపై దాడి చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఏనుగులను రెచ్చగొట్టకండి తమిళనాడులోని అటవీ ప్రాంతాల నుంచి కొన్ని ఏనుగులు జిల్లాలోకి ప్రవేశించాయని, ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయని, వాటిని రెచ్చగొట్టవద్దని చిత్తూరు పశ్చిమ డివిజన్ అటవీ శాఖాధికారి (వెస్ట్ డీఎఫ్‌వో) సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమ వారం ఉదయం గుడిపాల మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో ఏనుగులు నాశనం చేసిన పంట పొలాలను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏనుగుల గుంపును తమిళనాడు అటవీ ప్రాంతానికి తరిమేసినా మళ్లీ వస్తున్నాయని చెప్పారు. రైతులు తమ పంటలను కాపాడుకోవాలన్న ఆతృతతో వాటిని రెచ్చగొట్టరాదన్నారు. తద్వారా ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. ఇవి జిల్లాలోకి రాకుండా తమిళనాడు అటవీ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వేసవి రానుండడంతో మరిన్ని ఏనుగులు జనావాసాల్లోకి వచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దారుణం: ఏనుగు దాడిలో మహిళ మృతి
చెన్నై : ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ ఏనుగు దాడిలో మృతిచెందారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గణపతి మా నగర్‌కు చెందిన పి. భువనేశ్వరి తన భర్త ప్రశాంత్ వీకెండ్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి భువనేశ్వరి దంపతులు రెండు కార్లలో పాలమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో పాలమలైకు చేరుకుని.. కార్లను రోడ్డు పక్కన నిలిపి.. నాలుగు కి,మీ దూరంలో ఉన్న పాలమలై అరంగనాథర్ దేవాలయం వరకు నడుస్తూ వెళ్లారు. వీరికి దారిలో ఏనుగు ఎదురుపడింది. దీంతో భయభ్రంతాలకు గురై అందరూ దూరంగా పరుగులు తీశారు. ఈ క్రమంలో పొదల్లో దాక్కొవాలని భువనేశ్వరి ప్రయత్నించగా.. అది గమనించిన ఏనుగు ఆమెను తొండంతో విసిరి పారేసింది.దీంతో ఆమె అక్కడక్కడే మరణించారు.మిగతా వారు ఏనుగు దాడి నుంచి సురక్షింతంగా బయటపడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని రక్షించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కళాశాలకు పంపారు. కాగా భువనేశ్వరికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై రేంజ్ అధికారి సురేష్ మాట్లాడుతూ.. ఆడవిలో ప్రవేశించడానికి సదరు బృందం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అనుమతులు లేకుండా అడవుల్లో ట్రెక్కింగ్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. పాలమలై రిజర్వ్ ప్రాంతమని ఇక్కడ జంతువుల దాడి జరుగుతుందని ఇప్పటికే చుట్టు పక్కలా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశామని అధికారి తెలిపారు -
కమ్మపల్లె గ్రామస్తులపై ఏనుగు దాడి
యాదమరి: మండల పరిధిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తోంది. పంట పొలాలను నాశనం చేయడమేగాక గ్రామాల్లో ఇళ్ల మధ్య తిరుగుతూ ప్రజలపై దాడికి తెగబడుతోంది. దాడిలో ఒక యువకుడు గాయపడ్డాడు. యాదమరి మండలంలో పది రోజులకు పైగా ఏనుగుల గుంపు తిష్టవేసింది. 14 ఏనుగులు గుంపుగా మండల పరిధిలోని పలు గ్రామాలలో పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మూడు రోజులుగా గుంపులో నుంచి రెండు ఏనుగులు విడిపోయాయి. అవి మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న పేరకూరు, చిన్నిరెడ్డిపల్లె, గొల్లపల్లె గ్రామాల వైపు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం తమిళనాడు సరిహద్దులోని పెరగాండ్లపల్లె, ఎలమూరు, గ్రామాల్లోని పంట పొలాల్లో పంటలను నాశనం చేయగా, విడిపోయిన రెండు ఏనుగుల్లో ఒకటి నుంజర్ల ప్రాజెక్టు అటవీ ప్రాంతానికి వెళ్లింది. రెండో ఏనుగు పేరకూరు, చిన్నిరెడ్డిపల్లె, 12 కమ్మపల్లె, దళవాయిపల్లె గ్రామాల వైపు వెళ్లింది. అక్కడి పొలాల్లోకి వెళ్లడంతో నీరు కడుతున్న రైతులు దాన్ని చూసి పరుగులు తీశారు. అనంతరం 12 కమ్మపల్లె గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. గోపి అనే యువకుడిని తొండంతో విసిరికొట్టింది. దీంతో అతను గాయపడ్డాడు. చిన్నపిల్లలు కేకలు పెడుతు పరుగులు తీశారు. పంట పొలాలపై ఆగని గజ దాడులు గంగవరం : మండలంలోని కీలపట్ల గ్రామ పరిసరాల్లో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. గురువారం రాత్రి గుంపుగా వచ్చిన ఏనుగులు పంట పొలాలపై పడ్డాయి. మూర్తికి చెందిన క్యాబేజీ, టమాటా, బీన్స్, పశుగ్రాసం, డ్రిప్‌పైపులు, ఉలవ పంటను ధ్వంసం చేశాయి. పొలం వద్దే కాపురముంటున్న మూర్తి కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. నాలుగు పెద్ద, రెండు చిన్న ఏనుగులు మొత్తం ఆరు గుంపుగా వచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం మునేంద్రకు చెందిన ఉలవ పంట, మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించే పంటలను ఏనుగులు నాశనం చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరి హారం చెల్లించాలని కోరుతున్నారు. -
వేకువజామున విషాదం
దొడ్డబళ్లాపురం: వాకింగ్ వెళ్లిన యువకుడిని ఏనుగు తొక్కి చంపివేసింది. ఈ ఘటన కనకపుర తాలూకా నారాయణపుర గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. టీ బేకుప్పె గ్రామానికి చెందిన చేతన్‌కుమార్(25) బుధవారం తెల్ల వారుజామున స్నేహితులతో కలిసి కోడిహళ్లి మెయిన్‌రోడ్డులో వాకింగ్‌కు వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు వాకింగ్ చేస్తూ వేగంగా వెళ్లగా చేతన్ వెనుకబడిపోయాడు. ఆ సమయంలో హఠాత్తుగా చెట్ల మధ్య నుండి వచ్చిన ఏనుగు చేతన్‌పై దాడిచేసి తొక్కి చంపింది. ఎంతసేపయినా చేతన్ రాకపోవడంతో మొబైల్‌కు కాల్ చేశారు. సమాధానం రాకపోవడంతో వెనక్కు వెళ్లి చూడగా చేతన్ మృతదేహం కనిపించింది. ఘటనాస్థలాన్ని అటవీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కనకపుర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మొగిలిఘాట్‌లో గజగజ!
పలమనేరు: చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ ప్రాంతంలో మంగళవారం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలిఫెంట్ ట్రాకర్ల సహాయంతో ఎనుగుల గుంపును దారి మళ్లించేందుకు యత్నించారు. అయితే అవి జగమర్ల దారిని దాటుకుని జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్నాయి. బంగారుపాళెం మండలంలో ఇటీవల విద్యుదాఘాతంతో ఓ మదపుటేనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏనుగులు ఆగ్రహంతో ఉన్నాయని, మనుషులపై దాడికి దిగే ప్రమాదముందని ఎఫ్ఆర్ఓ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే అప్రమత్తంగా వాటి కదలికలను గమనిస్తున్నామన్నారు. వాటిని కాలువపల్లె బీట్ మీదుగా మోర్ధనా అటవీ ప్రాంతానికి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మరోవైపు మొగిలిఘాట్‌లో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
ఏనుగులు విడిపోవడంవల్లే...
జియ్యమ్మవలస: ఒకటికాదు... రెండు కాదు... దాదాపు 16 నెలలుగా ఏనుగుల బెడద తప్పడం లేదు. ఏజెన్సీని వదిలి మైదాన ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ భయోత్సాతాన్ని సృష్టిస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. గతంలో దాడులతో గాయాలపాలైన వ్యక్తుల ఉదంతాలు చోటు చేసుకోగా తాజాగా ఓ మహిళ ఏనుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో మరింతఆందోళన నెలకొంది. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామం వద్ద ఏనుగుల దాడితో గంట చిన్నమ్మి(55) అక్కడకక్కడే మృతిచెందింది. శుక్రవారం సాయంత్రం గిజబ నుంచి స్వగ్రామం బాసంగికి వస్తూ ఊరికి సమీపంలోనే ఏనుగుదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలతోపాటు ఆందోళన కూడా నెలకొంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఏనుగులు బాసంగి పొలిమేరలో ఉండడంతో అటవీశాఖ సిబ్బంది గ్రామంలోనే ఉన్నారు. అటుగా వస్తున్న చిన్నమ్మికి ఏనుగులు ఉన్నాయని ఓ వైపు కేకలు వేశారు. అయితే రోడ్డుపక్కకు చేరిన ఆమెను ఒక ఏనుగు తొండంతో లాక్కొని పత్తి చేనులోకి లాక్కొని పోయి కాలితో నుజ్జునుజ్జు చేసింది. చిన్నమ్మి పేగులు బయటకు రాగా కాలుచేతులు విరిగిపోవడంతో అక్కడకక్కడే మృతిచెందిందని తెలిపారు. చిన్నమ్మికి శ్రీనివాసరావు, గౌరునాయుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారని వారికి పెళ్లిళ్లు అయిపోగా ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. పాపకు కూడా పెళ్లి అయిందని తెలిపారు. భర్త అప్పలస్వామినాయుడుతో జీవనం సాగిస్తుండగా వీరికి కుమారులే సాయం చేస్తుంటారు. చిన్నమ్మి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలము కున్నాయి. సంఘటనా స్థలానికి కురుపాం రేంజర్ మురళీకృష్ణ, చినమేరంగి ఎస్సై శివప్రసాద్, డిప్యూటీ తహసీల్థార్ రాధాకృష్ణ వచ్చి మృతురాలి కుటుంబాల నుండి వివరాలు సేకరించారు. ఏనుగులు విడిపోవడంవల్లే... గతంలో 6 ఏనుగులు కలసి ఉండేవని, ఇప్పుడు నాలుగు ఏనుగులు ఓ వైపు ఉన్నాయని, మిగిలిన రెండు వేరే చోట తిరుగుతున్నాయని కురుపాం ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఏనుగులు ఒకచోటకు చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాడు పంట నష్టం–నేడు ప్రాణ నష్టం మండలంలో 16 నెలల నుంచి ఏనుగులు సంచరిస్తున్నా ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు ఏదో సర్దుకుపోతున్నారు. పంటను నాశనం చేసి వెళ్లిపోయేవనీ, తమకూ అటవీశాఖ పరిహారం అందజేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ పంటలకే పరిమితమైన ఇవి ఇప్పుడు మనుషుల ప్రాణాలమీదకు రావడంతో భయాందోళనలు నెలకొన్నారు. రాత్రి సమయాన ఎటువెళతాయో తెలియడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏనుగులను శాశ్వతంగా తరలించాలని కోరుతున్నారు. -
ఎట్టకేలకు ఇండియా 'బిన్ లాడెన్' పట్టివేత
గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అసోంలోని ‘ఒసామా బిన్ లాడెన్’ను కూడా ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. అసోంలో లాడెన్ ఏంటి అనుకుంటున్నారా?.. గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు 'ఒసామా బిన్ లాడెన్' అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురు గ్రామస్తులను చంపింది. ఈ ‘లాడెన్’ను పట్టుకునేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఎట్టకేలకు ఈ ఏనుగు పట్టుబడిందని అసోం జిల్లా ఉన్నతాధికారులు తాజాగా తెలిపారు. దీనిని పట్టుకోవడానికి డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవిలో అటవీశాఖ అధికారులు ట్రాక్ చేశారు. నిపుణులైన షూటర్లు, బాణాలతో మత్తు మందిచ్చి పట్టుకున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు. ఇప్పుడు ‘లాడెన్’ ఏనుగును సమీపంలో మానవ నివాసాలు లేని అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో 24గంటల వ్యవధిలో లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. అటవీ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2,300 మంది ప్రాణాలు కోల్పోగా.. 2011 నుంచి ఇప్పటివరకు 700 ఏనుగులు చంపివేయబడ్డాయి. -
హమ్మయ్య.. చావు అంచులదాకా వెళ్లి...
ఇటీవల ఏనుగులు అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఏనుగులకు కోపం వస్తే ఎంతటి దారుణానికి అయినా వెనుకాడవు. దానికి మరో ఉదాహారణే ఈ ఘటన. ఓ వ్యక్తి ఏనుగు వల్ల చావు చివరి అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. పార్కులో ఉన్న గజరాజుకు ఏం కోపం వచ్చిందో ఏమో ఏకంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి.. ధ్వంసం చేయాలని చూసింది. థాయ్‌లాండ్‌లోని ఖోయోయాయి జాతీయ పార్కులో ఉన్న 35 ఏళ్ల ఏనుగు పార్కు నుంచి రోడ్డువైపు వస్తుండగా.. రోడ్డు మీద వెళుతున్న కారు దానికి అడ్డం వచ్చింది. ఏనుగును గమనించిన కారు డ్రైవర్.. వాహనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, కారును చూడటంతోనే ఏనుగుకు ఒక్కసారి కోపం వచ్చినట్టుంది. వెంటనే కారుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూ.. అద్దాలను, పైకప్పును ధ్వంసం చేసింది. దీంతో అప్రమత్తమైన కారులోని వ్యక్తి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని..కారును వేగంగా ముందుకు నడిపి ఏనుగు బారినుంచి తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ వీడియోను నిల్తారాక్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో సదరు పార్కు పర్యాటకుల కార్లను ఏనుగుల నుంచి 30 మీటర్ల దూరంలో పార్క్ చేయాలని సూచించింది. ఇదే పార్కులో ఇటీవల ఆరు ఏనుగులు జలపాతంపై నుంచి జారిపడి మృత్యువాతపడ్డాయి. -
మన్యంలో ఏనుగు భీభత్సం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : మన్యం గజగజలాడింది. ఐటీడీఏ పరిధిలోని గ్రామాలను పన్నెండేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఏనుగుల గుంపులోని ఓ మదగజం మారణకాండకు పాల్పడింది. సోమవారం ఈతమానుగూడ గ్రామానికి చెందిన సవర గయ్యారమ్మ (53), మండ గ్రామానికి చెందిన సవర బోడమ్మ(65)లను పొట్టనపెట్టుకుంది. సీతంపేట మండలంలో ఏనుగు దాడికి దిగడం పన్నెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మిగతా మండలాలపై ప్రతాపం చూపిన ఏనుగుల గుంపు సీతంపేట మండలాన్ని మాత్రం కనికరించాయి. 2007 అక్టోబర్ నెలలో మన్యంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు మండలంలోని కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన పసుపురెడ్డి అప్పారావు, సిరిపోతుల మరియమ్మలను చంపేశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇద్దరిని హతమార్చాయి. ఐటీడీఏ పరిధిలో 13 మందిని ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో పొట్టన బెట్టుకున్నాయి పని చేసుకుంటుంటే.. ఈతమానుగూడకు చెందిన గయ్యారమ్మ కొండపోడు పనులుచేస్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపులో ఓ ఏనుగు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందిం ది. అలాగే మండ గ్రామానికి చెందిన బోడమ్మ, శ్రీరంగమ్మలు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఏనుగులు కనిపించడంతో శ్రీరంగమ్మ పరుగు లంకించుకుని తప్పించుకుంది. బోడమ్మ మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏనుగు తీవ్రం గా దాడి చేసి గాయపర్చడంతో స్థానికులు ఆమెను సీతంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి పాలకొండ రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో శ్రీకా కుళం రిమ్స్‌కు తరలించాలని చెప్పారు. రిమ్స్‌కు తరలించగా అక్కడే ఆమె మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొండంతో తెచ్చి.. గయ్యారమ్మపై కొండపైన దాడి చేసిన ఏనుగు ఆమెను చంపేసి తొండంతో పట్టుకుని వచ్చి గ్రా మ పొలిమేరల్లో చెట్టు కింద పడేసిందని గిరిజనులు తెలిపారు. కిలోమీటరున్నర దూరంలో ఎత్తైన కొండపై కొండపోడు పని చేస్తుంటే అక్కడ దాడి చేసిన ఏనుగు మృతదేహాన్ని తొండంతో తీసుకురావడం, గ్రామానికి సమీపంలో ఓ భారీ వృక్షం వద్ద పడేసి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయని స్థానికులు చెబుతున్నారు. తామంతా వేర్వేరు చోట్ల కొండపోడు పనులు చేసుకుంటున్నామని, ఒక్కసారిగా వచ్చిన ఏనుగు భయంకరమైన అరుపులతో తన తల్లిపై దాడి చేసిందని మృతురాలి కుమారుడు ఈశ్వరరావు తెలిపారు. అలాగే గ్రామంలో ఓ మరుగుదొడ్డిని కూడా నాశనం చేసిందన్నారు. గంటల వ్యవధిలోనే.. గంటల వ్యవధిలోనే ఒకే ఏనుగు ఇద్దరిని చంపేసి బీభత్సం సృష్టించింది. మొదట కొండపోడు పనుల కోసం మండ నుంచి సుదూర ప్రాంతానికి నడిచివెళ్తున్న బోడమ్మపై దాడి చేసిన ఏనుగు అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈతమానుగూడకు చేరుకుని అక్కడ పోడు పనులు చేస్తున్న గయ్యారమ్మపై దాడి చేసి చంపేసింది. ఏజెన్సీలో తిరుగుతున్న నాలుగు ఏనుగుల గుంపులో కొద్ది రోజుల కిందట ఒక ఏనుగుకు విద్యుత్‌షాక్ తగిలి మతి భ్రమించిందని ఆ ఏనుగు మాత్రమే ఈ తరహా దాడులకు తెగబడుతోందని అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఓ వైపు 3 ఏనుగులు సంచరిస్తుంటే మరో వైపు ఒక ఏనుగు మాత్రం వేరేగా తిరుగుతోందని చెబుతున్నారు. కొండపో డు పనులు వంటివి చేయడానికి వెళ్లాలంటే భయమేస్తోందని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. గత మూడు నెలలుగా సీతంపేట మండలంలోనే ఏనుగులు తిష్టవేశాయి. మొదట చిన్నబగ్గ అటవీ పరిధిలో బగ్గ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న నాలుగు ఏనుగుల గుంపు బొండి సమీపంలో ఊటబావి వద్ద పక్షం రోజులకు పైగా గడిపాయి. అనంతరం కొండాడ, మేడ ఒబ్బంగిల్లో మరికొన్ని రోజులున్నాయి. అంటికొండ, పెద్దగూడ గ్రామాల్లో నాలుగు రోజుల కిందటి వరకు సంచరించాయి. తాజాగా మండ, జొనగ, ఈతమానుగూడ ప్రాంతాల్లో సంచరిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. -
వదలని గజరాజులు
విజయనగరం, కొమరాడ : మండలంలోని రైతులకు గజరాజుల భయం వీడడం లేదు. కొద్ది నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాగావళి పరివాహక ప్రాంతంలో వారం రోజుల కిందట జియ్యమ్మవలస మండలం బాసంగి వద్ద సంచరించిన ఏనుగులు తరువాత నాగావళి పరివాహక ప్రాంతాన్ని దాటుకుంటూ గుణానపురం, కళ్లికోట, దుగ్గి, ఆర్తాం, కుమ్మరిగుంట, రబ్బర్‌డ్యాం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో జంఝావతి రబ్బరు డ్యాం పరిసర ప్రాంతంలో గజరాజులు సంచరించి రత్నరెడ్డి అనే రైతు పొలంలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తుండగా దాడి చేశాయి. 36 బస్తాల ధాన్యాన్ని చిందరవందర చేశాయి. మోటారు పైపులను ధ్వంసం చేశాయి. దీన్ని గుర్తించిన రైతు అక్కడి నుంచి పరుగులు తీశాడు. గురువారం ఉదయం కూడా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అటవీ శాఖాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకెన్నాళ్లు ఈ బాధలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గజరాజుల విధ్వంసం
విజయనగరం , కొమరాడ: మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ కందివలసలో గజరాజులు సోమవారం అర్థరాత్రి గజరాజులు విధ్వంసం సృష్టించాయి. గ్రామంలోని టమాట, కూరగాయల పంటలను దెబ్బతీశాయి. ఇప్పటికే గ్రామంలో వరి, జొన్న, కూరగాయల పంటలు ధ్వంసం చేసిన ఏనుగులు తాజాగా సోమవారం అర్థరాత్రి మరోసారి కలకలం రేపాయి. కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో తాత్కాలిక ఉపశమన చర్యలు తప్పితే ఎటువంటి శాశ్వత చర్యలు చేపట్టకపోవడం పట్ల అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
విడిపోయిన ఏనుగుల గుంపు
విజయనగరం, కొమరాడ/ జియ్యమ్మవలస : నియోజకవర్గ ప్రజ లకు గజరాజుల బెడద తప్పడం లేదు. గతేడాది సెప్టెంబర్ ఐదున నియోజకవర్గంలోకి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపులో ఒక గున్న ఏనుగు ప్రమాదవశాత్తూ ఆర్తాం గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందింది. మిగిలిన ఏడు ఏనుగుల గుంపులో కూడా ఒకటి విడిపోయింది. అప్పటి నుంచి ఆరు ఏనుగుల గుంపు నాగావళి నది దాటుకుని జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడులో తిష్టవేశాయి. చెరుకు, అరటి పంటలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆరు ఏనుగుల గుంపులో మళ్లీ ఒక ఏనుగు తప్పిపోయి దుగ్గి, కళ్లికోట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కళ్లికోటకు చెందిన బుందాన గంగులు (60)పై దాడి చేసింది. ప్రస్తుతం అతను పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నివారణ చర్యలు శూన్యం. ఏనుగులు తరిలించే ప్రయత్నంలో అధికారులు చేపడుతన్న చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు నెలల కిందట వచ్చిన ఏనుగులను తరలించడంలో అధికారులు ఎందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను శాశ్వతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వదలని ‘గజ’ భయం
విజయనగరం, పార్వతీపురం/ కొమరాడ: ఏనుగుల భయం మన్యం ప్రాంత వాసులను వీడడం లేదు. నాలుగు నెలలుగా ఏనుగుల గుంపు కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు ఏనుగులను వెళ్లగొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇటీవల కెమిశిల పంచాయతీ నాయుడువలస గ్రామానికి చెందిన వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందగా మళ్లీ గంగురేగువలస గ్రామ సమీపంలో గురువారం తన పొలంలో పనిచేసుకుంటున్న గుంట్రెడ్డి రమేష్‌పై ఏనుగులు దాడి చేయడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు రమేష్‌ను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల తరలింపునకు అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి వాసులకు కంటిమీద కునుకు కరువైంది. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
ఏనుగు ముప్పు..ఎవరు దిక్కు
అంతరిస్తున్న అడవులు.. మేత, నీరు కరువు.. గజరాజులకు తీరని ఆకలి, దప్పిక.. వెరిసి అరణ్యం నుంచి జనారణ్యంలోకి దూసుకువస్తున్న ఏనుగులు.. పంటపొలాలు, రైతులపై దాడులు.. దీనికి అడ్డుకట్ట వేయడానికి సోలార్ ఫెన్సింగ్, ట్రెంచ్‌ల ఏర్పాటు.. అయినా ఫలితం శూన్యం. ఆగని దాడులు.. సాగుకు అన్నదాత దూరం. ఇదీ పలమనేరు, కుప్పం ప్రాంతంలోని కర్షకుల దుస్థితి. చిత్తూరు, పలమనేరు: జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో దశాబ్దాలుగా గజరా జుల దాడులతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. గజ దాడుల నుంచి పంటల పరిరక్షణకు అటవీ శాఖ సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు ఏ ర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. గజ దాడుల్లో ఏటా వేలాది ఎకరాల పంట నష్టం తోపాటు రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కంచె దాటి బయటకొచ్చే క్రమంలో ఏనుగులు సైతం మృతువాత పడుతున్నాయి. సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు వృథా గజ దాడుల నుంచి పంట రక్షణ కోసం ప్రభుత్వం 1984లో ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిర్వహణ కొండెక్కింది. దీంతో లక్ష్యం నీరుగారిపోతోంది. పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీశాఖ చెబుతోంది. ఇవి పలమనేరు కౌండిన్యలో మూడు గుంపులుగా, కుప్పం ప్రాంతంలో రెండు గుంపులుగా విడిపోయి అటవీప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇవి అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారుపాళెం మండలం నుంచి కుప్పం వరకు 264 కి.మీ మేర సోలార్ ఫెన్సింగ్‌ను రెండు దఫాలుగా ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ ఇప్పటికే దెబ్బతింది. దీంతో ఏనుగులు పంటపొలాల్లోకి వస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలిఫెంట్ ట్రెంచ్ పనులను చేశారు. పైన మూడు మీటర్ల వెడల్పు, లోపల రెండు మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల లోతు వీటిని తవ్వారు. అయినా ఏనుగులు ట్రెంచ్‌లను దాటి బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో గజదాడుల్లో 8 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. అలాగే 9 ఏనుగులు చనిపోయాయి. ఎలిఫెంట్ కారిడార్‌ను మరిచిన బాబు ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం, మోర్ధనా తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్‌ను నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాష్ట్ర సీఎం సంప్రదించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఎప్పుడు కుప్పం, పలమనేరుకు వచ్చినా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సమస్యను గురించి పట్టించుకోలేదు. పంటపొలాలపై ఏనుగుల దాడులు మండలంలోని శేషాపురంలో మంగళవారం రాత్రి పంటపొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. గ్రామ సమీపంలోని మోతకుంట అటవీ ప్రాంతం నుంచి మూడు ఏనుగులు పంటలపై దాడి చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఏనుగులు గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతినాయుడు పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసి పొలంలోకి ప్రవేశించాయి. జామ తోటలో చెట్లను తొక్కివేశాయి. డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. మునికృష్ణకు చెందిన చెరకు తోట, నాగభూషణంనాయుడి అరటి చెట్లను తొక్కివేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలి, మొగిలివారిపల్లె, గౌరీశంకరపురం గ్రామాల్లో ఏనుగులు వరుస దాడులు చేసి పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని తెలి పారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను బు ధవారం అటవీశాఖ అధికారులు పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పంటలపైకి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
దూసుకొచ్చిన గజరాజు.. హాహాకారాలు
కోలికట్: బస్సు ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. దూకొచ్చిన గజరాజు దాడితో ప్రాణాలు పోయినంత పనైంది. అయితే కొందరి సమయ స్ఫూర్తితో ప్రయాణికులంతా అంతా క్షేమంగా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం కర్ణాటక చామరాజనగర్ నుంచి కేరళలోని కోలికట్‌కు కేరళ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. బస్సు బందీపూర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఓ ఏనుగుల మంద వారి కంటపడింది. అయినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కాస్త ముందుకు పోనిచ్చాడు. ఆ శబ్ధానికి మందలోని ఓ ఏనుగుకు చిర్రెత్తుకొచ్చి బస్సు వైపుగా దూసుకొచ్చింది. ప్రయాణికులంతా హాహాకారాలు చేయగా, భయంతో డ్రైవర్ బస్సును 500 మీటర్లు వెనక్కి తీసుకెళ్లాడు. అయినా ఏనుగు మాత్రం వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. వెంటనే ప్రయాణికుల్లో కొందరు గట్టిగట్టిగా అరవటం ప్రారంభించారు. దీంతో ఏనుగు వెనక్కి పరుగు అందుకుని తిరిగి మందలో కలిసింది. ఈ ఘటనలో బస్సు స్వల్ఫంగా ధ్వంసం కాగా, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే బస్సులో ప్రయాణికులు గమ్యస్థానికి చేరుకున్నట్లు తెలిపారు. జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకుగానూ బందీపూర్ ఫారెస్ట్ రేంజ్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 7 వరకు వాహనాలను అనుమతించరు. ఘటనపై డ్రైవర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ప్రయాణికులకు భయానక అనుభవం
-
విదారక ఘటన
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది. నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఐదుగురు అటవీ అధికారులకు గాయాలు
మందస : మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు శుక్రవారం అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగాయి. నర్సింగపు రం పంచాయతీ సమీపంలోని దేవుపురం దామోదరసాగరం రిజ ర్వాయర్ జీడితోటల్లో ఏనుగులు ఉండడంతో డిప్యూటీ రేంజ్ అధికారి పి.వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లా రు. వీరిని చూసిన ఏనుగులు ఒక్కసారిగా ఘీంకరించి, బుసకొడు తూ దాడికి దిగాయి. ప్రాణరక్షణకై సిబ్బంది పరుగులు తీశారు. ఏనుగులు వెంబడించడంతో పరుగులు తీయలేక జారి పడిపోయారు. దీంతో డిప్యూటీ రేంజ్ అధికారికి చేతులు, తలపై స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా ఏబీఓ జీవీ కృష్ణారావు, ఎలిఫేంట్ ట్రాకర్స్ బాడ గణపతి, రామచంద్రరావు, ధనుంజయకు గాయాలయ్యాయి. బాధితులకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో ద్విచక్రవాహనం అంబులెన్స్ ద్వారా అందించారు. -
పూరిపాక ధ్వంసం చేసిన ఏనుగులు
సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో నాలుగు ఏనుగుల గుంపు శుక్రవారం బీభత్సం సృష్టించింది. చిన్నగోరపాడు కొండల్లో పూరిపాకను నాశనం చేసింది. సవర సూరయ్య జీడితోట కాపలాకు వేసుకున్నాడు. ఇందులో ఉన్న కొండ చీపుర్లు కట్టలను చిందరవందర చేశాయి. కొన్ని జీడిచెట్లను కూడా నాశనం చేయడంతో బాధితుడు విలపిస్తున్నాడు. ఎఫ్ఎస్వో తిరుపతిరావు, బీట్ ఆఫీసర్ కె.దాలినాయుడు, ఏనుగుల ట్రాకర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులు ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. -
రామకుప్పంలో ఏనుగుల బీభత్సం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని లింగాపురం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు స్థానిక ఇళ్లపై దాడి చేశాయి. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లో దిగి పంటలను నాశనం చేశాయి. అయితే గత కొన్నేళ్లుగా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయని, చేతికందిన పంటలను నాశనం చేస్తున్నాయిని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారమిచ్చినా తాత్కాలిక పరిష్కారంతో సరిపెడుతున్నారని మండిపడుతున్నారు. ఏగుగుల దాడితో ప్రాణనష్టం జరుగుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కనిపిస్తే చంపేస్తోంది..
క్రిష్ణగిరి : సూళగిరి సమీపంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. తాను వెళ్లే దారిలో ఎవరు కనిపించినా దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. శనివారం ఉదయం ఓ వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు అదే రోజు రాత్రి మరోమారు స్వైర విహారం చేసింది. నడిచి వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో సూళగిరి ప్రాంత ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోని భీతిల్లుతున్నారు. సూళగిరి సమీపంలోని దేవరగుట్టపల్లి గ్రామానికి చెందిన మునిరాజు(55) శనివారం రాత్రి చిన్నారు వద్ద నడచి వెళ్తుండగా ఏనుగు దాడి చేసి అంతమొందించింది. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను తరిమివేయకపోవడం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ సి.కదిరవన్, జిల్లా అటవీశాఖాధికారి దీపక్విల్జీలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డెంకణీకోట, రాయకోట, క్రిష్ణగిరి, శ్యానమావు, సూళగిరి అటవీశాఖ బృందాలను రప్పించారు. పశువైద్యులు ప్రకాష్ బృందాన్ని రంగంలోకి దింపారు. మత్తుమందు ఇచ్చి ఏనుగును బంధించేందుకు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు మునిరాజు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య క్రిష్ణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఏనుగు దాడిలో మహిళ మృతి
సాక్షి, అన్నానగర్: ఏనుగు దాడిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తమిళనాడులోని దిండుగల్ జిల్లా తాండిక్కుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తాండిక్కుడి కరుప్పుస్వామి ఆలయ వీధికి చెందిన కన్నన్ భార్య మూగమ్మాళ్(56) కూలీ. ఈమె సమీపంలోని పెరుంగాణల్ ప్రాంతంలో ఉన్న తేయాకు తోటలో మంగళవారం మధ్యాహ్నం పనిచేస్తున్నది. ఆ సమయంలో ఓ అడవి ఏనుగు తోటలోకి జొరబడింది. దాన్ని చూసి మూగమ్మాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఏనుగు ఆమెని వెంబడించి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. వత్తలక్కుండు అటవీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆమె మృతదేహాన్ని రైతులు తాండిక్కుడి-వత్తలకుండు రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. ఏనుగుల నుంచి తమను రక్షించాలని, ధ్వంసమైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు. -
చైనాలో ఏనుగు రెచ్చిపోయింది
-
బస్సును అలవోకగా తోస్తూ ఏనుగు హల్చల్
బీజింగ్ : చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ ఏనుగు రెచ్చిపోయింది. తన ప్రశాంతతకు భంగం కలిగించారనే కోపంతో వాహనాలపై దాడికి దిగింది. తొలుత ఓ బస్సును టార్గెట్ చేసింది. దాన్ని అయిదుదారు అడుగులు వెనక్కి తోసేసింది. బస్సు అద్దాలను పగలగొట్టింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న డ్రైవర్ ఏనుగును చూసి పారిపోయాడు. కొద్దిసేపు బస్సుకు తన వీపును రుద్దుకున్న ఏనుగు అంతటితో ఆగని ఏనుగుఅదే దారిలో వున్న మిగితా వాహనాలను టార్గెట్ చేసింది. ఓ మినీ ట్రాన్స్పోర్ట్ వ్యానప్ పై దాడికి దిగింది. దాన్ని అమాంతం పడేసేందుకు గట్టిగా ప్రయత్నించింది. కుదరకపోవడంతో ఇక చాల్లే అనుకుని మెల్లిగా అడవిదారి పట్టింది. -
తొండంతో కొట్టి చంపింది
-
తొండంతో కొట్టి చంపింది
కోల్‌కతా : సెల్ఫీ దిగాలని యత్నించిన వ్యక్తిని ఏనుగు తొండంతో కొట్టి చంపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని జల్పాయ్గురి జిల్లాకి చెందిన సాదిఖ్ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న అతనికి అటవీ ప్రాంతంలోని హైవేపై ఏనుగు వెళ్లడం కనిపించింది. ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన సాదిఖ్.. దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. ఏనుగు తొండంతో దాడి చేసింది. దాంతో సాదిఖ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు సాదిఖ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. -
జంబో సెల్ఫీ ఎంత పని చేసిందంటే...
సాక్షి, భువనేశ్వర్: సెల్ఫీ మోజు మరో వ్యక్తి ఒడిషాలో మరో వ్యక్తి ప్రాణాలు బలిగింది. ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. రూర్కెలా జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కటక్‌కు చెందిన 30 ఏళ్ల అశోక్ భారతి సుందర్ఘడ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక మందియాకుదార్ ప్రాంతంలో రెండు వారాలుగా ఓ ఏనుగు సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని తరిమేందుకు రంగంలోకి దిగారు. విషయం తెలిసిన అశోక్ గ్రాస్తులతోపాటు ఆ ఘటనను చూసేందుకు వెళ్లాడు. ఘటననంతా తన కెమెరాలో బంధించిన అశోక్ చివరకు ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన ఏనుగు అతని వెంటపడి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అతన్ని రూర్కెలా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని కన్జర్వేటర్ సహయ అధికారి జేకే మహంతి తెలిపారు. -
అడవిలో అనూహ్య విషాదం
సెల్ఫీ, ఏనుగు వెంట్రుకల కోసం ప్రయత్నం ! ఏనుగు దాడిలో యువకుని మృతి బెంగళూరు: అక్రమంగా బెంగళూరు బన్నేరుఘట్ట అటవీ ప్రాంతంలోకి చొరబడ్డ యువకుడు ఏనుగు దాడిలో మరణించిన ఘటన మూడురోజులు ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. బెంగళూరు గిరినగర్‌కు చెందిన అభిలాష్ (27) స్నేహితులతో కలసి మంగళవారం బన్నేరుఘట్ట అటవీప్రాంతంలోకి అక్రమంగా బైక్‌పై ప్రవేశించారు. జూకు సెలవు కావడంతో బైకును హక్కిపిక్కి తెగ ప్రజలు నివాసముంటున్న ప్రాంతంలో వదిలేసి కాలినడకన అడవిలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొన్ని పెంపుడు ఏనుగులు ఉండడాన్ని గమనించారు. మావటీలు వెళ్లిపోగానే ఏనుగుల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఏనుగుల గుంపులోని సుందర్ అనే ఏనుగు అభిలాష్, అతడి స్నేహితులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఊహించని పరిణామంతో అభిలాష్ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అభిలాష్ ఏనుగుకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొద్దిసేపటి అనంతరం అక్కడికి చేరుకున్న మావటీలు అభిలాష్ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ముందునుంచీ సెల్ఫీల మోజు మొదటినుంచీ అభిలాష్‌కు సెల్ఫీల మోజు ఎక్కువగా ఉందని, గతంలో కూడా బన్నేరుఘట్టతో పాటు అనేక జూలలో ఏనుగులతో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసిక్తి ప్రదర్శించేవారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఏనుగు వెంట్రుకలను ఉంగరంగా ధరిస్తే అదృష్టం వరిస్తుందని ఎవరో చెప్పడంతో వాటిని ఎలాగైనా సంపాదించాలని స్నేహితులతో చెప్పేవాడు. ఏనుగుల వెంట్రుకల కోసమే అభిలాష్ బన్నేరుఘట్ట అటవీప్రాంతంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో వెంట్రుకల కోసం ఏనుగు తోకను గట్టిగా లాగి ఉంటాడని, దీంతో ఏనుగు కోపంతో అతనిపై దాడి చేసిందని పోలీసులు పేర్కొన్నారు. -
శేషాచలం వీడి..అన్నదాతపై దాడి..
- ఎర్ర స్మగ్లర్ల జోరుతో ఏనుగులకు ఆటంకం - స్వార్థంతో విచ్చలవిడిగా చెట్ల నరికివేత - గజరాజులు ప్రయాణించే దారుల్లో మార్పులు - గత్యంతరం లేక పొలాల్లోకి చొరబాటు - ఆహారం కోసం పంటనష్టం - బెంబేలెత్తుతున్న రైతన్నలు అడవిలోని ఏనుగులు జనారణ్యంలోకి వస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వీటివల్ల నష్టాలను చవిచూస్తున్నారు. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తుండటంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజాగా భాకరాపేట పరిసరాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం సృష్టించాయి. సాక్షి, తిరుపతి: జిల్లాలో ఏనుగుల దాడి పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఇవి తమ ఉనికిని చాటుతూ రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల పరిధిలో 40వేల చ.కిమీ. మేర శేషాచలం విస్తరించి ఉంది. ఎర్రచందనం ఈ దట్టమైన అడవి ప్రత్యేకం. అదే ఇప్పుడు రైతుల పా లిట శాపమైంది. దేశంలో మరెక్క డాలేని విలువైన ఎర్రచందనం సం పద ఈఅడవుల్లో దొరుకుతుంది. కోట్లు విలువచేసే ఎర్రచందనంపై అక్రమార్కుల కన్నుపడింది. 2012 వరకు 4, 5 కి.మీ పరిధిలోనే స్థానికులు కొందరు ఒకటీ అరా ఎర్రచందనం చెట్లను నరికి అమ్మి సొమ్ముచేసుకునే వారు. తరువాత స్మగ్లర్లు చొరబడ్డారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన అనేక మంది దొంగలు శేషాచలం బాట పట్టారు. అడవిలోని ఎర్రచందనాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు. వీరి ప్రవేశంతో శేషాచలంలో ఏనుగులకు దారిలేకుండా చేశారు. అదెలాగంటే.. 1992లో శేషాచలం అడవుల్లో 15 ఏనుగులు ఉండేవి. వీటితో పాటు కేరళ, తమిళనాడు సరిహద్దుల నుంచి మరికొన్ని ప్రవేశించాయి. కౌండిన్య అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి కొరత ఏర్పడటంతో కుప్పం, పలమనేరు పరిధిలో పంటపొలాల్లో ప్రవేశించి దాడులు చేయటం మొదలుపెట్టాయి. మరో మదపుటేనుగు మనుషులపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని అనంతపురం జిల్లా కదిరి అడవుల మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లికి చేరుకున్నాయి. అక్కడ ఉన్న మరో 15 ఏనుగులతో కేరళ, తమిళనాడు నుంచి మరి కొన్ని గజరాజులు గుంపుగా ఏర్పడ్డాయి. ఈ ఏనుగులు శేషాచలం అడవుల్లో స్వేచ్చగా తిరిగేవి. 2012 నుంచి ఎర్రచందనం దొంగలు శేషాచలం అడవిలోకి అడుగుపెట్టారు. వీరి నేతృత్వంలో తమిళనాడుకు చెందిన కూలీలు ఎర్రదుంగలను తరలించడం కోసం అడవుల్లో వెదురు మొక్కలు, ఇతరత్రా వృక్షాలను నరికి వేయటం మొదలుపెట్టారు. తమ ఆహారమైన వెదురు మొక్కలు నరికివేస్తుండటం, దారుల్లో మార్పురావడం ఏనుగులు పసిగట్టాయి. జనారణ్యంలోకి గజరాజులు.. ఎర్రదొంగల చర్యలతో ఏనుగులకు ఇటు ఆహారం కొరత... అటు ప్రాణభయం మొదలైంది. దీంతో జనారణ్యంలోకి ప్రవేశించటం మొదలుపెట్టాయి. కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లి మండలాల పరిధిలోకి చేరుకున్నాయి. రెండునెలల క్రితం వరకు ఏనుగులు బీభత్సం సష్టిం చిన విషయం తెలిసిందే. పలమనేరు అటవీ పరిధిలోని బైరెడ్డిపల్లి, వీకోట పరిసర గ్రామాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. తాజాగా ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం బీభత్సం చేశాయి. వరి, అరటి, మామిడి పంటలను నాశనం చేశాయి. విద్యుత్ మోటార్లను పీకి పడేశాయి. లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. స్మగ్లర్లను అరికట్టకపోవటంతో అటు అడవిలోని ఎర్రచందనం సంపదతో పాటు ఇటు రైతులు కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు కూడా కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏనుగు బీభత్సం.. యువకుడి మృతి
ప్రముఖ పర్యాటక స్థలమైన ఊటీ సమీపంలోని చెరంపాడిలో ఓ ఏనుగు విజృంభించింది. 19 ఏళ్ల యువకుడిని తొక్కి చంపేసింది. బాధితుడి స్నేహితుడు కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షఫీ, షాను అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం రాత్రి సరుకులు కొనుక్కుని తిరిగి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి రూమ్‌కు వెళ్తుండగా ఉన్నట్టుండి వెనకల దట్టమైన పొదల్లోంచి వచ్చిన ఏనుగు వారిపై దాడిచేసింది. సమీపంలోని బస్టాండులో ఉన్న ప్రజలు వాళ్ల అరుపులు విని అక్కడకు వచ్చేసరికి అప్పటికే ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వాళ్లను వెంటనే కోజికోడ్‌లోని వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ షఫీ గాయాలతో మరణించాడు. షానును వైతిరి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అటవీశాఖ అధికారులు ఈ ఏనుగుల బారి నుంచి తమను కాపాడాలని, అవి పదేపదే మనుషుల మీద దాడులు చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ దుకాణదారులు బంద్ నిర్వహించారు. గత 15 రోజులలో ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. -
విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
వ్యక్తిని పరుగులు పెట్టించిన భారీ ఏనుగు
-
ఏనుగు దాడిలో రైతు మృతి
-
ఏనుగు దాడిలో మహిళ మృతి
క్రిష్ణగిరి: ఏనుగు దాడిలో జీనూరుకు చెందిన సరస్వతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన సూళగిరి వద్ద చోటు చేసుకొంది. వడ్డేనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి మేలుమలై వద్ద క్రాస్ చేసి సూళగిరి సమీపంలోని జీనూరు వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం వద్దకు వచ్చిన సరస్వతి (45)పై మందలోని ఓ ఏనుగు దాడి చేసి తొండంతో బలంగా విసిరేసి ఘీంకారం చేసింది. ఏదో జరిగిందని స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే సరస్వతి తీవ్ర గాయాలతో సృ్పహ తప్పింది. ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేంద్రన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అటవీశాఖ అధికార్లు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. వేపనపల్లి వైపు బయల్దేరిన ఏనుగుల మంద జీనూరు వద్ద మహిళపై దాడి జరిగిన తర్వాత ఏనుగుల మంద వేపనపల్లి వైపు తరలిపోయాయని, మందలో ఐదు పెద్ద ఏనుగులు, రెండు గున్న ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చూశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దాడిలో మురళి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. దాంతో ఏనుగులు గ్రామమంతా కలియ దిరుగుతూ హల్చల్ సృష్టించాయి. పాడలి పరిసర ప్రాంతాలలోని పంటపోలాలన్ని పూర్తిగా నాశనమైనాయి. గ్రామస్తులు గ్రామంలోకి వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఏనుగులు గ్రామంలోకి దూసుకువచ్చి దాడి చేయడంతో గ్రామస్తులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.