గంగురేగువలస చెరకు తోటల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపు
విజయనగరం, పార్వతీపురం/ కొమరాడ: ఏనుగుల భయం మన్యం ప్రాంత వాసులను వీడడం లేదు. నాలుగు నెలలుగా ఏనుగుల గుంపు కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు ఏనుగులను వెళ్లగొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇటీవల కెమిశిల పంచాయతీ నాయుడువలస గ్రామానికి చెందిన వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందగా మళ్లీ గంగురేగువలస గ్రామ సమీపంలో గురువారం తన పొలంలో పనిచేసుకుంటున్న గుంట్రెడ్డి రమేష్‌పై ఏనుగులు దాడి చేయడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు రమేష్‌ను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల తరలింపునకు అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి వాసులకు కంటిమీద కునుకు కరువైంది. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment