గజరాజుల విధ్వంసం | Elephant Atacks on Crops Vizianagaram | Sakshi
Sakshi News home page

గజరాజుల విధ్వంసం

Published Wed, Feb 13 2019 8:41 AM | Last Updated on Wed, Feb 13 2019 8:41 AM

Elephant Atacks on Crops Vizianagaram - Sakshi

కందివలస పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల గుంపు

విజయనగరం , కొమరాడ: మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ కందివలసలో గజరాజులు సోమవారం అర్థరాత్రి గజరాజులు విధ్వంసం సృష్టించాయి. గ్రామంలోని టమాట, కూరగాయల పంటలను దెబ్బతీశాయి. ఇప్పటికే గ్రామంలో వరి, జొన్న, కూరగాయల పంటలు ధ్వంసం చేసిన ఏనుగులు తాజాగా సోమవారం అర్థరాత్రి మరోసారి కలకలం రేపాయి. కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో తాత్కాలిక ఉపశమన చర్యలు తప్పితే ఎటువంటి శాశ్వత చర్యలు చేపట్టకపోవడం పట్ల అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement