
ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.
తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.
కొత్త టైమింగ్
ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
IRCTC వెబ్‌సైట్ & మొబైల్ యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్‌గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..
➤ IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి
➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)
➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి
➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయండి
➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండి
కొత్త మార్పులు
➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.
➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.
➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.
➤ యాప్ లేదా వెబ్‌సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్
➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.
➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.
గమనిక: కొన్ని ఆంగ్ల మీడియా కథనాల ఆదరణ ఈ వార్త ప్రచురించడం జరిగింది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని IRCTC అధికారికంగా వెల్లడించింది. పాఠకులు గమనించగలరు.