Indian Railway
-
జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?
భారతీయ రైల్వే జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.ప్రతిపాదిత సవరణలు ఇలా..నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్‌పై రైలు పేరు ప్రింట్ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.మార్పు ఎందుకు అవసరం?రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓప్రయాణికులపై ప్రభావం ఇలా..ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే. -
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోట
ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనున్నట్లు గత ఏడాదే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఐఆర్సీటీసీ 'స్వరైల్' (SwaRail) పేరుతో ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్ వంటి అన్నీ సేవలను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రైల్వే సేవలన్నింటినీ.. ఒకే చోట సులభంగా నావిగేట్ చేయగల ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 31, 2025న "స్వరైల్" సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీనిని ఆపిల్ యాప్ స్టోర్ & గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.స్వరైల్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: 2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..ఐఆర్సీటీసీ స్వరైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఇప్పుడు రైల్వే సేవల కోసం ఉపయోగిస్తున్న అనేక యాప్స్ కనుమరుగవుతాయి. ఇది మొబైల్ స్టోరేజ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా.. ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. -
రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్‌గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందనప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కశ్మీర్‌కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
'బుక్ నౌ.. పే లేటర్' విధానాన్ని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆటో మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ విధానం అమలు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (ఐఆర్సీటీసీ) దీనిని ప్రవేశపెట్టింది. అంటే డబ్బు లేకపోయినా టికెట్ పొందవచ్చు, ఆ తరువాత గడువు లోపల డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన 'ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి' విధానంలో.. బుకింగ్ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయాలి. బుక్ చేసుకున్న తరువాత 14 రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.'బుక్ నౌ.. పే లేటర్'➤ముందుగా IRCTC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤బుక్ నౌ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. ప్రయాణం చేయాల్సిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.➤ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, భీమ్ (BHIM) యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి.➤పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. 'ఈపేలేటర్' ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.➤ముందుగా ఈపేలేటర్ పేజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్స్ పేజీలో 'పే లేటర్' ఆప్షన్ కనిపిస్తుంది.➤ఇలా పే లేటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బు చెల్లించాలి.➤14 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే.. 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: TRAI: రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్.. -
ఈ యాప్‌లలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే.. కన్ఫర్మ్ అవ్వాల్సిందే!
మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే.. భారతీయ రైల్వే అత్యంత చౌకైన.. ఉత్తమ మార్గం. రోజూ లక్షలమంది రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే మనం కొన్ని సార్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది. గతంలో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే.. తప్పకుండా రైల్వే స్టేషన్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంట్లో కూర్చునే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉత్తమైన యాప్స్ గురించి తెలుసుకుందాం.ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect)ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.ఐఆర్సీటీసీ యూటీఎస్ (IRCTC UTS)ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt)ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.ఇక్సిగో (Ixigo)ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిమేక్మైట్రిప్ (Makemytrip)ప్రస్తుతం మేక్మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి. -
రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్‌ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్‌లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..
రైలు వేగంగా వెళ్తోంది.. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు.. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు.. చిన్న పిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు..అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ ‘మంటలు.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చెయిన్ లాగినా ట్రెయిన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి ‘రెడ్ విండో’ గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో ‘రెడ్ విండో’ అవసరం ఏమిటి.. దాన్ని గుర్తించడం ఎలా.. అనే విషయాలు తెలుసుకుందాం.మనుషులు దూరేందుకు వీలుగా..మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్‌ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్‌ల్లో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌గా రూపొందించారు. రైల్లో ఇతర కిటీకీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలుండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు.బోగీ మధ్యలో ఉన్నవారికి అనువుగా..అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగీ మెయిన్ డోర్‌కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగీ మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది.ఇదీ చదవండి: షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.ఇతర సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
ఏబీబీ ఇండియా, ఐఆర్‌ఎప్‌సీ ఫలితాలు
ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..ఐఆర్ఎఫ్సీ లాభం ప్లస్ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్సీటీసీ యాప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్, పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్‌టేబుల్‌ను కూడా చూడవచ్చు. ఈ యాప్‌ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.ప్రస్తుతం ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకానుంది.ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..! -
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్‌ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్‌ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్‌లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్‌ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
రైల్వే ప్రయాణం చేయాలంటే చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేస్తారు. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే ఈ కొత్త నియమం వర్తిస్తుంది.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుతాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అడ్వాన్డ్ బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఐఆర్సీటీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం
టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది.ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
రైల్ టికెట్ ధర తక్కువే.. ఆదాయం రూ.లక్షల కోట్లు.. ఎలా సాధ్యమంటే..
దేశంలో రైల్వే అతిపెద్ద రవాణ వ్యవస్థగా చలామణి అవుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అందులో ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్య జనాలు కూడా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ రైల్వేశాఖ లక్షల కోట్లు ఆర్జిస్తోంది. అయితే దాదాపు 15 లక్షల మంది పనిచేస్తున్న ఈ సంస్థ టికెట్ ఛార్జీలపైనే ఆధారపడి ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను ఎలా నిర్వహిస్తుంది..? అంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి తగినంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం రాకమానదు.. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా చాలా మార్గాల్లో రైల్వేశాఖ డబ్బు సమకూర్చుకుంటోంది. అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ట్రెయిన్లో ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ఐఆర్సీటీసీలో లేదా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో టికెట్లను బుక్ చేస్తుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం దాదాపు అందరూ ఆన్లైన్ ద్వారానే బుక్ చేస్తున్నారు. వేసవి సెలవులు, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే అడ్వాన్స్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఏవైనా మార్పులు ఉంటే రైల్ టికెట్లను రద్దు చేస్తుంటారు. ఒకసారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మనం మందుగా చెల్లించిన మొత్తం తిరిగిరాదు. అందులో క్యాన్సలేషన్ ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీల పేరిట రైల్వేశాఖ అదనపు భారాన్ని విధిస్తోంది. దాంతోపాటు బుక్ చేసుకున్న సమయంలో టికెట్ బుక్ కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి, చివరి సమయం వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఛార్జీలు విధిస్తుంటారు. అలా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వేశాఖకు 2021-24(జనవరి వరకు) మధ్యకాలంలో ఏకంగా రూ.1,229.85 కోట్లు సమకూరినట్లు తెలిసింది. ఖజానాలో ఇలా తేరగా వచ్చిచేరే ఆదాయంతోపాటు రైల్వే వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తోంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. అద్దెలు: రైల్వేశాఖ కొన్ని ప్రముఖ నగరాల్లో వాణిజ్యభవనాలు నిర్మించి, వాటిని ఇతర ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇస్తుంది. దాంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. టోల్లు: క్లిష్టమైన మార్గాల్లో బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం వంటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ అక్కడి ప్రయాణికుల ద్వారా టోల్ ఆదాయాన్ని పొందుతుంది. కేటరింగ్ సేవలు: ఇందులో రెండు మార్గాల ద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది. ఒకటి ఆన్లైన్ కేటరింగ్, రెండోది ఆఫ్‌లైన్ కేటరింగ్. ఆన్లైన్ కేటరింగ్ జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరి సంస్థలతో జతకూడి రైళ్లలోని ప్రయాణికులకు సేవలిందిస్తూ ఆదాయం సమకూర్చుకుంటుంది. ఒకవేళ ప్రయాణికులు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థకు కొంత, రైల్వేశాఖకు కొంతమేర ఛార్జీల రూపంలో డబ్బు వెళ్తుంది. ఇక ఆఫ్‌లైన్‌లో.. నిత్యం రైల్ కాంపార్ట్‌మెంట్‌లో నేరుగా ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, స్నాక్స్, ఫుడ్.. అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. క్లెయిమ్ చేయని వస్తువుల అమ్మకం: కొన్నిసార్లు గూడ్స్ రైళ్లలో రవాణా అయిన వస్తువులు స్టోర్‌రూమ్‌ల్లో చాలాఏళ్లపాటు అలాగే ఉండిపోతాయి. వాటికి సంబంధించిన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుని వేలం వేయడమో లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటారు. తుక్కుగా మార్చి ఆదాయం: రైల్వే విభాగంలో నిత్యం వినియోగిస్తున్న వస్తువులు, కాలం చెల్లిన ఇనుప వస్తువులను తుక్కుగా మార్చి ఇతర కంపెనీలకు బిడ్డింగ్ ద్వారా కట్టబెట్టి ఆదాయం ఆర్జిస్తారు. పెట్టుబడులు: స్టాక్మార్కెట్లో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సీ వంటి ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో డివిడెండ్ల రూపంలో ఆదాయం సంపాదిస్తోంది. రాయితీ మాఫీ: కరోనా వైరస్ విజృంభించడంతో వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ప్రకటనలు: ఇతర కంపెనీలు రైల్వేప్లాట్ఫామ్లు, బోర్డింగ్‌లో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. దానికోసం రైల్వేకు డబ్బు చెల్లిస్తారు. ప్లాట్‌ఫామ్ రెంట్‌కు ఇస్తూ..: కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్‌ఫామ్ స్థలాన్ని రెంట్ ఇచ్చి ఆదాయం సమకూరుస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్‌లు వంటివాటికి కూడా ప్లాట్‌ఫామ్‌ను కిరాయికి ఇస్తారు. పైన తెలిపిన ఆదాయ మార్గాలతోపాటు ప్రధానంగా ప్రయాణ టికెట్లు, సరకు రవాణాతో సాధారణంగా రైల్వే ఖజానా నిండుతోంది. ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరు 2023లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఆ నెలలో ప్రయాణికుల నుంచి రూ.469.40 కోట్లు, 11.57 మిలియన్ టన్నుల వస్తు రవాణా ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చుకుంటే 2022-23లో ఆదాయం రూ.49 వేల కోట్లు ఎక్కువ. దీనిలో భారతీయ రైల్వే గరిష్టంగా 1.62 లక్షల కోట్ల రూపాయలను సరుకు రవాణా ద్వారా ఆర్జించింది. టిక్కెట్ల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలింది ఇతర ఆదాయం రూపంలో వచ్చింది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారతీయ రైల్వే చరిత్ర దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు ప్రయాణించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ. ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి. అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది. -
IRCTC: ట్రైన్ జర్నీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ యాప్‌లో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్లో అయితే ఆహారాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. -
రైళ్లలో ఫుడ్.. ఐఆర్సీటీసీ లేటెస్ట్ అప్డేట్
IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. “సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్ఈ ఫైలింగ్‌లో ఐఆర్టీసీ పేర్కొంది. -
ట్రైన్ టికెట్ ధరలపై రాయితీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్‌లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఇస్తుంది కదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ-కోవిడ్‌కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్‌పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు. రాయితీలపై అదే మాట కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్‌లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు. ఆర్టీఐలో ఏముందంటే? అంతకుముందు, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది. -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్‌లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్‌లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్‌లలో దాదాపు 5,60,000 బుకింగ్‌లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా భారత్‌లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. Bihar govt should now run special trains for their native migrant labors . There are people who paid for AC 2 n 3 tickets but couldn't board cause these chalu ticket climbed overcrowded the train n shut the door. and as usual Indian Railway management was clueless https://t.co/hLuRWQyz3d — Romeo Sierra (@sierraromeo98) November 11, 2023 PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 Why should I pay extra reservation charges if this is how I have to travel after paying extra charge for reservation. I m not demanding Tejas Coach Services, i demand my reserved seat #IndianRailways #resign https://t.co/sOjTgPdo9v — yogita chulet (@YogitaChulet) November 9, 2023 -
వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మరింత వేగవంతమైన ప్రయాణం కోసం గత కొంత కాలంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పుట్టుకొస్తున్నాయి. నేడు చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్‌లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా కొంతమంది ప్యాసింజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రైల్వే శాఖ ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వందే భారత్ ట్రైన్లలో లంచ్ లేదా డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్ కవర్లన్నీ కొందరు కోచ్‌లోనే పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతోందని, ఇది ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్ వంటి వాటిని ఆరు నెలలు పాటు నిషేదించింది. ఫుడ్ కవర్లు కోచ్‌లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. అంతే కాకుండా వ్యర్దాల వల్ల కోచ్‌లో దుర్వాసన కూడా వ్యాపిస్తోంది. ఈ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇకపై బుక్ చేసేటప్పుడు బుకింగ్ సమయంలోనే ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్ క్యాటరింగ్ సర్వీస్ వివరాలు ప్రయాణికులకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇది ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..
ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) వెల్లడించింది. ట్రైన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది. అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే? 2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్డ్ సీటు లేదా కోచ్ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు. -
ఇదే జరిగితే ట్రైన్ జర్నీ మరింత సేఫ్!
AI Technology: గత కొన్ని రోజులకు ముందు ట్రైన్ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అలాంటి ప్రమాదాలను తగ్గించడానికి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (Northeast Frontier Railway) ఒక కొత్త ప్రయోగానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రైన్ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలలో ఒకటి కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు నిద్రపోవడం కూడా. కావున అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి రైల్వే 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI)ను ఉపయోగిస్తోంది. ఇది అమలులోకి వస్తే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నా లేదా కంటిరెప్పలు వాల్చుతున్నా.. డివైజ్ ముందే గుర్తిస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది. కంటిరెప్పలు వాల్చుతున్న పరిస్థిని బట్టి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కొత్త టెక్నాలజీ కావాలని రైల్వే బోర్డు ఇప్పటికే 'ఎన్ఎఫ్ఆర్'ను కోరింది. ఈ కొత్త విధానానికి రైల్వే డ్రైవర్ అసిస్ట్ సిస్టం (RDAS) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా రానున్న రోజుల్లో ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీపై 'ది ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్‌మెన్ ఆర్గనైజేషన్' (IRLRO) సుముఖత చూపకపోవడం గమనార్హం. ఇలాంటి టెక్నాలజీ అవసరం లేదని, ఇప్పటికే వేగంగా ప్రయాణించే రైళ్లలో డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కావలసిన వ్యవస్థలు ఉన్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రతి హై-స్పీడ్ రైలు ఇంజన్ 60 సెకన్లకు ఒకసారి డ్రైవర్ కొట్టాల్సిన ఫుట్-ఆపరేటెడ్ లివర్ (పెడల్)తో వస్తుంది. ఒకవేళ డ్రైవర్ అలా చేయకాపోతే ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేక్‌లు పడతాయి, తద్వారా ట్రైన్ ఆగిపోతుంది. ఈ వ్యవస్థ సరిపోతుందని ఐఆర్ఎల్ఆర్ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ 'సంజయ్ పాంధి' (Sanjay Pandhi) అన్నారు. -
రైల్వే సంస్థ జాక్‌పాట్! రికార్డ్ స్థాయిలో పెరిగిన షేర్ల ధర
భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్‌పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి. ఐఆర్ఎఫ్సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్‌క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్‌పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్‌తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది. ఈ కొత్త ట్రైన్ల కోసం లోకోమోటివ్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)లో, కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి. చదవండి👉 నైట్ షిఫ్ట్‌లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే -
షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
సాక్షి,ఖలీల్‌వాడి(హైదరాబాద్): నవీపేట్ శివారులో సాయినగర్ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్‌లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్ లాగి ఆపిన విషయం తెలిసిందే. అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్‌టాప్‌తో డబ్బులు, ల్యాప్‌టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మర్మమేమిటో..! బాసర రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు. బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్ కోచ్ నుంచి జనరల్ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..! సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్పీఎఫ్ పోలీసులు రైలు లో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం. చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు -
రైల్వే ప్లాట్‌ఫాంపై యువకుడి స్టంట్స్.. వాళ్ల రాకతో సీన్ రివర్స్!
పాట్నా: ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇక నెట్టింట తమ టాలెంట్‌ను ప్రదర్శించి కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఘటనలు బోలెడు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ నుంచి ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. దీంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని చిరాకు తెప్పించేలా ఉంటున్నాయి. ఇంకొంత మంది మరో అడుగు మందుకేసి ప్రమాదకరమైనవి కూడా ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. ఎందుకీ స్టంట్స్... తాజాగా ఓ యువకుడు రైల్వేస్టేషన్లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే,ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటన బిహార్‌లోని మాన్పుర్ జంక్షన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేయడం చేయడం ప్రారంభించాడు. ఈ తరహా ఘటనలో ఇటీవల ఎక్కవ కావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది. అనంతరం అతని వీడియో షేర్ చేసి.. ఈ మేరకు ట్వీట్ చేసింది..‘మాన్పుర్ జంక్షన్లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. యువకుడి అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్పీఎఫ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని కామెంట్లు పెడుతున్నారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry. We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK — RPF INDIA (@RPF_INDIA) July 10, 2023 చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..!
భారతీయ రైల్వే ప్రతీరోజూ సుమారు 8 వేల రైల్వే స్టేషన్ల మీదుగా రైళ్లను నడుపుతుంది. వాటిలో కొన్ని రైళ్లు సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాయి. ఇప్పుడు మనం దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ఐదు రైళ్ల గురించి తెలుసుకుందాం. వివేక్ ఎక్స్‌ప్రెస్(డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి): ఇది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రత్యేక సిరీస్ కలిగినది. ఇది 4 వేర్వేరు రూట్లలో ప్రయాణం సాగిస్తుంది. ఈ రైలు డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ఏకంగా 4,273 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పూర్తి ప్రయాణం 80 గంటల 15 నిముషాలు ఉంటుంది.9 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించే రైలుకు మొత్తం 55 స్టాపులు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్- సిల్చర్ ఎక్స్‌ప్రెస్: ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది గువాహటి వరకూ ప్రయాణం సాగిస్తుంది. దీనిని 2017 నవంబరు 21న సిల్చర్ వరకూ పొడిగించారు. ఇది భారతదేశంలో అత్యంత దూర ప్రయాణం సాగించే రెండవ రైలు. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్(జమ్ము తావి నుంచి కన్యాకుమారి): ఇది వారాంతపు ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కొలువైన జమ్ము వరకూ ప్రయాణిస్తుంది. దేశంలో సుదీర్ఘ ప్రయాణం సాగించే రైళ్లలో ఇది మూడవది. 12 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైలుకు 73 స్టాపులు ఉన్నాయి. టెన్ జమ్ము ఎక్స్‌ప్రెస్(తిరునెల్వేలి జమ్ము): తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సుమారు 3,631 కిలోమీటర్ల దూరం వరకూ ఈ రైలు ప్రయాణం సాగించి జమ్ముకశ్మీర్‌లోని కట్రాకు చేరుకుంటుంది. మొత్తం 523 స్టేషన్లు కలిగిన ఈ మార్గంలో 62 స్టేషనల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.ఈ రైలు 71 గంటల 20 నిముషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. నవయుగ్ ఎక్స్‌ప్రెస్(మంగళూరు నుంచి జమ్ము) ఇది వారాంతపు రైలు. జమ్ము తావి నుంచి మంగళూరు సెంట్రల్ వరకూ నడుస్తుంది. ఈ రైలు 3607 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 61 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు 68 గంటల పాటు తన ప్రయాణాన్ని సాగించి, గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది కూడా చదవండి: ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే.. -
కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే?
ఆన్లైన్ ట్రైన్ బుకింగ్ సంస్థ ట్రైన్‌మ్యాన్ (స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లిమిటెడ్)ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టార్టప్‌ను దక్కించున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న ట్రైన్ మ్యాన్ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లపై ఐఆర్సీటీసీ స్పందించింది. यह भ्रामक कथन है। Trainman IRCTC के 32 अधिकृत बी2सी (बिजनेस टू कस्टमर) भागीदारों में से एक है। हिस्सेदारी बदलने से इसमे कोई अंतर नहीं आयेगा। सभी एकीकरण और संचालन IRCTC के माध्यम से किए जाते रहेंगे। यह केवल IRCTC का पूरक होगा और IRCTC के लिए कोई खतरा या चुनौती नहीं है। https://t.co/7ERSbMj6JR — IRCTC (@IRCTCofficial) June 18, 2023 ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్ టూ కస్టమర్ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్ మ్యాన్ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ల రిజర్వేషన్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్ రైల్వేస్‌లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. Will Adani compete with IRCTC? No. IRCTC is a 100% monopoly in railway ticketing. Whether you book tickets from IRCTC or from aggregators like Paytm, MakeMyTrip or now Adani acquired Trainman, IRCTC makes money. It earned Rs 70 crore via Paytm in FY 2022, @ Rs 12 per ticket. 1/ pic.twitter.com/pwOOzxQ6Ud — ICICIdirect (@ICICI_Direct) June 19, 2023 ప్రస్తుతం, ఐఆర్సీటీసీకి ట్రైన్ మ్యాన్ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్.. ట్రైన్ మ్యాన్‌ను కొనుగోలు చేయడం వల్ల కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్సీటీసీ కొట్టిపారేసింది. చదవండి👉 స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
అది ‘లైఫ్‌లైన్’.. పేదల పాలిట ‘హెల్ప్‌లైన్’
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. ఇటువంటి సందర్భాలలో క్షతగాత్రులను రక్షించేందుకు రైల్వేశాఖ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటే బాగుండునని చాలామంది భావించారు. దీనికి సమాధానం రైల్వేశాఖ వద్ద ఏనాడో ఉంది. ప్రపంచంలోనే తొలి హాస్పిటల్ ట్రైన్ భారత్ ఖాతాలో ఉంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్. దీనిని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వినియోగిస్తుంటుంది. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు భారతీయ రైల్వే ఈ ట్రైన్‌కు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ అనిపేరు పెట్టింది. దీని ద్వారా భారతీయ రైల్వే దేశంలోని సుదూర ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేస్తుంది. ఆసుపత్రులు లేని ప్రాంతాలకు, ఔషధాలు, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ రైలు చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. ఈ రైలును ఆసుపత్రి మాదిరిగా డిజైన్ చేశారు. దీనిలో బాధితుల కోసం బెడ్లు ఉంటాయి. ఆధునిక వైద్య పరికరాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టాప్ ఉంటారు. 12 లక్షలమందికి వైద్య సేవలు ఈ లైఫ్‌లైన్ ట్రైన్‌లోని ప్రతీ కోచ్‌లో పవర్ జనరేటర్, మెడికల్ వార్డు, ప్యాంట్రీకార్ మొదలైన ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలును భారతీయ రైల్వే 1991లో ప్రారంభించింది. ఈ రైలులోని అన్ని బోగీలలో ఏసీ సదుపాయం ఉంది. సులభంగా ఆసుపత్రులకు చేరుకోలేనివారిని దృష్టిలో ఉంచుకుని, వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ రైలులో అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం సహాయం పొందలేనివారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆసుపత్రి రైలు ఇప్పటివరకూ 12 లక్షలమంది బాధితులకు వైద్య సేవలు అందించింది. ఇది కూడా చదవండి: భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..
బాలాసోర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు మనసుని పట్టి కుదిపేస్తున్నాయి. ఎప్పటికైనా తనకి తలకొరివి పెడతాడని అనుకున్న కొడుకు శవాన్నే చేతులతో మోయాల్సి రావడం ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. బీహార్‌లో మధువనికి చెందిన లాల్జీ సాగై చెన్నైలో గార్డుగా పని చేస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు సుందర్, ఇందర్లను కూడా చెన్నైకి తీసుకువెళితే కుటుంబం హాయిగా బతికేయవచ్చునని అనుకున్న ఆ తండ్రి వారిని తీసుకువెళ్లడానికి సొంతూరుకి వచ్చాడు. అక్కడ్నుంచి కోల్‌కతాకి వచ్చి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ప్రమాదంలో తండ్రి లాల్జీ , చిన్న కుమారుడు ఇందర్ ప్రాణాలతో మిగిలితే కొడుకు సుందర్, బావమరిది దిలీప్ మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘‘కళ్ల ముందే నా కొడుకు గాయాలతో పడిపోయాడు. నా చేతుల్తో మోసుకుంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తెచ్చాను. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. విధి మా కుటుంబం మీద పగ పట్టింది’’ అంటూ పుత్ర శోకంతో కన్నీరుమున్నరవుతున్నాడు. మొబైల్ ఫ్లాష్ వెలుగులోనే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కలున్న స్థానికులు అందరికంటే ముందుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిమ్మ చీకట్లో బోగిల్లోకి వెళ్లడానికి వారు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లలోనే సహాయ కార్యక్రమాలు సాగించారు. తమ చేతులతోనే బోగీ అద్దాలు పగులగొట్టి లోపలకి వెళ్లి క్షతగాత్రుల్ని బయటకి తీసినట్టు పూర్ణ చంద్ర మాలిక్ అనే రైతు చెప్పాడు. ‘‘బాధితుల రోదనలు వింటూ ఉంటే మనసు కదిలిపోయింది. వారిని కాపాడడం కోసం నా చేతుల్తో బోగీ అద్దాలు పగుల గొట్టా. లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. కొంతమందికి కాళ్లు, చేతులు తెగిపడి ఉన్నాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాసేపు అందరం షాక్‌కి లోనయ్యాం. వెంటనే తేరుకొని మాకు చేతనైన సాయం చేశాం. 30 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం’’ పూర్ణ చంద్ర మాలిక్ వివరించారు. రైలు స్పీడ్‌ను వీడియో తీస్తుండగా.. కోల్‌కతా నుంచి కటక్ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మాణికల్ తివారీ అనే ఒక వ్యాపారి రైల్లో వీడియో తీస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు ఎంత స్పీడ్‌గా వెళుతోందో తన కుటుంబ సభ్యులకు చూపించాలన్న ఉత్సాహంతో అతను కిటికీ దగ్గర కూర్చొని వీడియో తియ్యడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా బోగి చిమ్మచీకటిగా మారిపోయి పొగతో నిండిపోయింది. ఆయన చేతులు రక్తమోడడం మొదలైంది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. బోగి అంతా పొగతో నిండిపోవడంతో అతను ఎలాగో బయటకి వెళ్లాడు. పట్టాలపై శవాల్ని చూసిన తర్వాత కానీ అతనికి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు. ‘‘అంతా సెకండ్లలో జరిగిపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. నా ఎదురుగా యువజంటలో భర్త మరణించాడు. భార్య మిగిలి ఉంది. ఈ రోజు ఒక బ్లాక్ ఫ్రైడే’’ అని తివారీ చెప్పారు. మందుల కోసం డబ్బులు పంపిస్తానని తిరిగిరాని లోకాలకు.. అనారోగ్యంతో ఉన్న తండ్రికి మందుల ఖర్చులకి డబ్బులు పంపిస్తానని చెప్పి బయల్దేరిన ఆ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బీహార్‌కు చెందిన రాజా పటేల్ (26) అనే యువకుడు ఇతర వలస కూలీలతో కలిసి కేరళ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైలు ప్రమాదంలో కొడుకు మరణించాడని తెలిసిన తండ్రి భోలన్ కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబానికి పటేల్ సంపాదనే జీవవనాధారం. వెన్నుముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తండ్రి భోలన్ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో నెల తిరిగేసరికల్లా కొడుకు పంపే డబ్బుల కోసమే వారు ఎదురు చూస్తుంటారని పొరుగింట్లో ఉన్న అవినాశ్ పాండే చెప్పాడు. నిద్రలోనే మృత్యుఒడిలోకి.. బాలాసోర్: పెను ప్రమాదం పలు సెకన్లలోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యకాలంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అంటే కొద్దిసేపట్లోనే అంతా ముగిసిందని, ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు నిద్ర మత్తులో ఉంటడంతో అసలేం జరుగుతుందో తెల్సుకునేలోపే అంతా జరిగిపోయిందని, తప్పించుకునే అవధికూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు విపత్తు స్పందన దళ సభ్యులు శతథా శ్రమిస్తున్నారు. వీరికి స్థానికులు అండగా నిలిచి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మానవత్వంతో ఎంతో మంది స్థానికులు వయోబేధంతో సంబంధం లేకుండా ఆస్పత్రులకు తరలివచ్చి రక్తదానానికి సిద్ధపడ్డారు. వీరికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేగంపై తప్ప భద్రతపై దృష్టి లేదు ‘రైల్వే వ్యవస్థ విస్తరించే కొద్దీ అవసరమైన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగాలి. కానీ ప్రస్తుతం రైల్వేలో దాదాపు రెండున్నర లక్షల ఖాళీలున్నాయి. రైళ్లను వేగంగా నడిపేలా విదేశాలతో పోటీ పడుతున్న రైల్వే, అక్కడి వ్యవస్థ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగెత్తాలన్నప్పుడు దిగువ సిమెంటు కాంక్రీట్ ట్రాక్ ఉండాలి, కానీ మన వద్ద నేరుగా నేలపైనే కంకర పరిచి ఏర్పాటు చేస్తున్నారు. అంత వేగాన్ని ఇది తట్టుకోలేదు. వేగం కంటే భద్రత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి’ – శంకరరావు, సీనియర్ రైల్వే కార్మిక నేత ఊహాగానాలొద్దు.. ‘‘రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అవి ఎలా జరిగాయనే ఊహాగానాల జోలికి వెళ్లొద్దు. ప్రమాదానికి అసలు కారణాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ తేలుస్తారు. అందుకు తగ్గ అర్హతలున్న వారే ఆ పోస్టులో ఉంటారు. ప్రమాదాలకు అసలు కారణాలు తేలాకగాని కారణాలను విశ్లేషించలేం. ఆ ప్రమాదం నేపథ్యంలో ఆ అధికారి బృందం కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి’’ - స్టాన్లీబాబు, మాజీ జీఎం. ఇది కూడా చదవండి: అదే జరిగితే ప్రమాదం తప్పేదా? -
‘కవచ్’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా వందే భారత్ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు. పదేళ్ల జాప్యం.. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకీ దుస్థితి.. రైల్వే నెట్వర్క్ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం(టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు. కవచ్‌గా మార్చి.. ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.. కవచ్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమిటీ కవచ్? కవచ్ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజెస్లతో అనుసంధానిస్తారు. ఎలా పనిచేస్తుంది? - రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. - దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. - సిగ్నల్ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్–సైడ్ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. - లెవల్–క్రాసింగ్ వద్ద తనంతట తానుగా విజిల్స్ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. - రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది. కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. -
కేరళలో మొట్టమొదటి వందే భారత్ ప్రారంభం
-
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ముక్కు మూసుకోవాల్సిన పని లేదు! రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. -
టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్ బుకింగ్ వెబ్సైట్ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్! ట్రైన్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్ సేవల కోసం ఆన్లైన్లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్సీటీసీ సర్వర్ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టికెట్ బుకింగ్ కోసం యూజర్లు లాగిన్ చేస్తున్న సమయం నుంచి పేమంట్ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్ బుకింగ్ కోసం అమౌంట్ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్ అయినప్పటికీ రైలు టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్, మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. @IRCTCofficial Still trying to Book ticket through #irctc website. Is it going to work today ? It's been an half an hour now for tatkal ticket slot booking, but still website is not working. pic.twitter.com/fYFuXCaHrj — Prashant waghmare (@Prashan95320710) March 4, 2023 #irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv — 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023 When someone says Bhai #Tatkal_tickets kaat de Me : pic.twitter.com/g96AuufaM5 — Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023 -
ట్రైన్లో తోటి ప్రయాణికులపై దాడి చేస్తే మూడేళ్లు జైలు
కొరుక్కుపేట(చెన్నై): రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి వారిపై దాడికి పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని రైల్వే ఏడీజీపీ వనిత హెచ్చరించారు. ఈనెల 16న కదులుతున్న రైలులో ఉత్తరాదికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు సహకారంతో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీజీపీ వనిత మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఉత్తరాది వారి వల్ల తమిళనాడు ప్రజలకు ఉదోగావకాశాలు రావడం లేదని, దీనికి ప్రధాని మోదీయే కారణమంటూ కొందరు దాడులకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ, వ్యక్తిగత ద్వేషపూరిత మాటలతో పలువురిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఇక కొందరు కుల మత భావాలను రెచ్చగొట్టి అశాంతికి కారణం అవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల కోసం 1512 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. చదవండి చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా! -
కూ.. చుక్ చుక్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎందుకీ రైలు ప్రత్యేకమో తెలుసా!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై స్పీడ్ రైలు. ఇది 18 నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలో దీన్ని నిర్మించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంజిన్‌లెస్, స్వీయ చోదక రైలుగా ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకుంది. ఇది 200-210 KMPH గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ట్రయల్స్ సమయంలో ఇది గరిష్టంగా 180 KMPH స్పీడ్‌తో ప్రయాణించింది. అయితే, భారతీయ రైల్వే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దాని ఆపరేషనల్ స్పీడ్‌ను 130KMPHకి పరిమితం చేసింది. ఇందులోని వసతులు గురించి చెప్పాలంటే.. ఈ రైళ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఇంటీరియర్‌తో నిర్మితమైంది. ప్రయాణీకుల కోసం ప్రతి కోచ్‌లో గ్లాస్-బాటమ్ లగేజ్ ర్యాక్‌ను అందుబాటులో ఉంచారు. రైలులో 'ఎగ్జిక్యూటివ్ క్లాస్', 'చైర్ కార్' ఉన్నాయి. ఈ కోచ్‌లు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తాయి. మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించబడింది. ఈ రైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది. మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. 360 డిగ్రీలు తిరిగే సౌకర్యవంతమైన సీట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, వ్యక్తిగత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లు, వ్యక్తిగత మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌లు, అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు, చైన్ పుల్లింగ్ సిస్టమ్ లేదు వీటితో మరెన్నో ఉన్నాయి. చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి! -
రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
రాత్రిపూట రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవలు ఈ సమయంలో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఐఆర్టీసీ (IRCTC) కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చిన్న మార్పులను నిబంధనలను పాటించకపోతే ప్యాసింజర్లు ఇబ్బందుల్లో పడినట్లే. అవేంటో ఓ సారి తెలుసుకుందాం! కొత్త నిబంధనలు ఇవే మీ కంపార్ట్మెంట్ లేదా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, తోటి ప్యాసింజర్లు ఫోన్ కాల్లో గట్టిగా మాట్లాడటం, లేదా పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, లేదా బిగ్గరగా అరవడం లాంటివి చేస్తుంటారు. గతంలో మన రైల్వే ప్రయాణంలో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం కూడా. అయితే ప్యాసింజర్లు ఎదర్కుంటున్న ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రైలులో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రించేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇకపై రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. వాటి ప్రకారం ఆ ప్రయాణంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు. మొత్తానికి తోటి ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకూడదు. ఒక వేళ ఎవరైన ఈ రూల్స్‌ని పాటించకపోతే ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్‌ను బుక్ చేయలేరు. ►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
ఐఆర్సీటీసీలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది. వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి. -
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు!
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు! -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్‌కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
రైల్వే ప్యాసింజర్లకు ఇది తెలుసా.. రిజర్వేషన్ టికెట్ లేకపోయిన ప్రయాణించవచ్చు!
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తు రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న కొందరు అకస్మాత్తుగా ప్రయాణించవలసి రిజర్వేషన్ టికెట్ దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో వారికి రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు రిజర్వేషన్ టికెట్ లేకున్నా ప్యాసింజర్లు వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణం ఎలా.. ప్యాసింజర్ తన వద్ద రిజర్వేషన్ టికెట్ లేదని కంగారుపడాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ (TTE) సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యస్థానాన్ని అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు టిక్కెట్ తీసుకుని ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ రూల్స్ కూడా తెలుసుకోండి.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రైలులో ఒక్కోసారి రద్దీ కారణంగా బెర్త్ మాత్రమే కాదు సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టీటీఈ ప్రయాణికుడికి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు. కానీ, ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. అటువంటి సమయంలో మీరు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజరేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే .. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించాలి. ఆపై టీటీఈ నుంచి సంబంధిత టికెట్ తీసుకోవాలి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ
‘ఆడవాళ్లు ఈ పని చేయలేరు’ అని సమాజంలో కొందరు ఎర్ర జెండా చూప ప్రయత్నిస్తారు. పట్టాలకు అడ్డం పడుకుంటారు. ఆడవాళ్ల ఆత్మస్థయిర్యపు రైలు ముందుకు సాగకుండా విశ్వ ప్రయత్నం చేస్తారు. కాని కొందరు ధీరలు ‘చేయగలం’ అంటారు. తమ జీవితానికి తామే పచ్చజెండా ఊపుకోగలుగుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సల్మా చేసిన పని అదే. భారతదేశపు తొలి రైలుగేట్ ఉమన్‌గా ఆమె నియమితమైనప్పుడు గేటు వేయలేక తీయలేక నాల్రోజుల్లో పారిపోతుందన్నారు. ఇవాళ్టికి పదేళ్లు గడిచాయి. రైళ్లు ఆమె చెప్పినట్టుగా వింటున్నాయి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన సల్మాను చూసి ఆ గేటు మీదుగా వెళ్లే రైళ్లన్నీ శాల్యూట్ చేస్తున్నాయి. ‘బంధువులు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు గట్టిగా నిలబడాలి. నా తల్లిదండ్రులు నిలబడ్డారు. అందుకే ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాను’ అంటుంది సల్మా. ఆమె పూర్తి పేరు మిర్జా సల్మా బేగ్. వయసు 29. భారతదేశపు తొలి మహిళా గేట్ ఉమన్‌గా రైల్వే శాఖలో 2013లో చేరింది సల్మా. ఆమె పని చేసే రైల్వే క్రాసింగ్ లక్నోకు ఆనుకుని ఉన్న మల్హార్ స్టేషన్. ఇప్పుడు ఆ దారిన పోయే రైళ్ల డ్రైవర్లకు, గార్డులకు ఆమె సుపరిచితం అయ్యింది గాని కొత్తగా ఎవరైనా ఆ రైల్వే క్రాస్ గుండా వెళుతుంటే మాత్రం ఆగి సల్మాను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర ఒక స్త్రీ, అందునా హిజాబ్ ధరించిన స్త్రీ, పని చేయడం నేటికీ అరుదు కనుక. ‘మా నాన్న సలీం బేగ్ రైల్వే గేట్ మేన్‌గా పని చేసేవాడు. ఆయన అనారోగ్యం వల్ల చెవుడు వచ్చింది. రైలు గంట వినకపోతే గేట్‌మేన్‌గా పని చేయడం కష్టం. ఆయన వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని నన్ను ఉద్యోగంలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. అమ్మకు పక్షవాతం. నాన్న సంపాదించే స్థితిలో లేడు. గేట్ మేన్ ఉద్యోగం పురుషులకు మాత్రమే అని రైల్వే శాఖ ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆడవాళ్లు ఆ ఉద్యోగం కోసం అప్లై చేయరు. కష్టమైన పని. పైగా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. అయితే ఆ పని నాక్కూడా కష్టమే అని నాకు తెలుసు. కాని రైల్వేలో వేరే ఉద్యోగం ఇమ్మని అడిగితే ఆ ఉద్యోగం నాకు అందడానికి చాలా రోజులే పట్టవచ్చు. అదే మా నాన్న పనే నేను చేస్తానంటే వెంటనే ఇస్తామన్నారు. అలా ఈ ఉద్యోగంలో చేరాను’ అంది సల్మా. ఆమె చేరినప్పుడు ఆమెతో పాటు లక్నోలో 11 మంది పురుష గేట్ మేన్లు ఉండేవారు. వారంతా ‘ఈ అమ్మాయి ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుంది’ అన్నారు. సల్మా పని చేస్తుంటే హేళన చేసేవారు. బంధువులైతే ఇంటికి వచ్చి మరీ సూటి పోటి మాటలు అనేవారు. అమ్మాయి జీవితం నాశనం చేశారని తల్లిదండ్రులను మాటలనేవారు. కాని నాలుగు నెలలు గడిచినా సల్మా బెణకలేదు. బెసకలేదు. తండ్రి సాయంతో అధికారుల సపోర్ట్‌తో పని క్షుణ్ణంగా నేర్చుకుంది. రైలు వచ్చే ముందు గేటు వేసి వెళ్లాక గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుప చక్రం తిప్పాలి. నేర్చుకుంది. సమర్థంగా చేసింది. గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసి విజేతగా నిలిచింది. ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు పత్రికలు తొలి గేట్ ఉమన్‌గా వర్ణిస్తూ పేపర్లలో రాయడంతో బంధువులు చల్లబడి ‘మా అమ్మాయే’ అనడం మొదలెట్టారు. ‘ఆడవాళ్లు చేయలేని పనంటూ ఈ ప్రపంచంలో లేదు. ప్రయత్నించాలి అంతే. నా ఉద్యోగంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇటీవలే మా అమ్మ చనిపోయింది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా నేను మర్చిపోలేను’ అంటుంది సల్మా. గొప్ప గొప్ప విజయాలు ఒక సంకోచంతో నిండిన అడుగు నుంచే మొదలవుతాయి. సంకోచాన్ని ధైర్యంతో దాటాలి. ధైర్యంతోపాటు సంకల్పం తోడు రావాలి. ప్రయత్నం జత పడాలి. ఆ తర్వాత చచ్చినట్టు ‘విజయం’ అనే స్టేషన్ వచ్చి తీరుతుంది. మీరూ ప్రయత్నించండి. (క్లిక్ చేయండి: మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది) -
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
అయ్యో.. రైలు టిక్కెట్ ఉన్నా ఫైన్ కట్టారు!
కొరుక్కుపేట(చెన్నై): రైలు ప్రయాణికులు టిక్కెట్లు తీసుకుని ముందుగానే ప్లాట్ఫారానికి వెళ్లి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే రైలు టిక్కెట్ ఉన్నా ప్లాట్ ఫామ్ మారడంతో రైల్వే అధికారులు జరిమానా విధించిన ఘటన చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగింది. దీంతో ప్రయాణికులు కంగుతిన్నారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5 గంటలకు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఆరుగురితో కూడిన ఒక కుటుంబం రైలు ఎక్కాల్సిన ఫ్లాట్ ఫామ్ బదులుగా వేరే ప్లాట్ ఫారానికి వెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇన్స్పెక్టర్లు, ఎగ్జామినర్లు జరిమానా విధించారు. దీంతో ప్రయాణికులు ఎంత వేడుకున్నా టిక్కెట్ ఇన్‌స్పెక్లర్లు వదల్లేదు. మహిళా ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అరగంట పాటు హడావుడి నెలకొంది. జరిమానా కచ్చితంగా కట్టాలని చెప్పటంతో చివరికి రూ.1040 జరిమానా చెల్లించి ట్రైన్ ఎక్కారు. చదవండి: వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే! -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!
చెన్నై: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని టూ టైర్, త్రీ టైర్ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు. అత్యాధునిక వసతులతో తయారవుతున్న ఒక్కో బోగీలో 83 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో పడుకుని కూడా ప్రయాణించవచ్చు. సీసీ టీవీ, కెమెరాలు అమరుస్తారు. 110–130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చెన్నై పెరంబూరులోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బోగీల్లో ప్రయాణం మరో ఏడాదికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైకి ఆధునిక సిటీ బస్సులు కాలం చెల్లిన సిటీ బస్సుల స్థానంలో అత్యాధునిక బస్సులను తీసుకురానున్నారు. తొలిదశలో 242 బస్సులు చెన్నై రోడ్లలో సందడి చేయనున్నాయి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 3,454 సిటీ బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 10.5 శాతం మంది మహిళలు ఉచిత పథకం కింద ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డెక్కే 3,300 బస్సుల్లో వెయ్యి బస్సులు పాతబడిపోయి మూలపడేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సిటీ బస్సులను 9 ఏళ్లకు మించి వినియోగించరాదనే నిబంధనను దాటి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మన్ నిధుల సహకారంతో ప్రభుత్వం చెన్నైకి 242, మధురై, కోయంబత్తూరుకు చెరో 100 లెక్కన మొత్తం 644 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 242 బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అత్యంత ఆధునికమైన బస్సుల్లో పూర్తిస్థాయి రక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, అత్యవసర ద్వారాలు, రానున్న బస్‌స్టేషన్, చేరుకోబోతున్న ప్రాంతాలను తెలిపే డిజిటల్ బోర్డులను అమరుస్తారు. చదవండి: Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం! -
‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్ -
రూ.20 కోసం 22 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం!
మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ. ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు. ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
రైళ్ళలో రాయితీలను పునరుద్ధరించాలి
కోవిడ్ మహమ్మారి దేశంపై విరుచుకుపడేంతవరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రైళ్ళలో రాయితీ అమలులో ఉంది. కోవిడ్ బూచి చూపించి రైళ్లను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించిన తర్వాత... అనేక వర్గాలకు టిక్కెట్ ధరలను పూర్వ విధానంలోనే ఉంచి, 53 కేటగిరీలుగా ఉన్న రాయితీలను 11 కేటగిరీలకు మాత్రమే పరిమితం చేశారు. రోగులకు, దివ్యాంగులకు, మరికొందరికి మాత్రమే పునరుద్ధరిం చారు. అవకాశం దొరికిందని వృద్ధులకిచ్చే రాయితీ సైతం రద్దుచేశారు. దీంతో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని అందులో తేల్చి చెప్పారు. వృద్ధులకు, సౌకర్యాలు, గౌరవం కల్పించడం భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం. అటువంటిది కేంద్రం వృద్ధులకిచ్చే రైల్వే టికెట్ రాయితీని రద్దు చేయడం ద్వారా మన సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కు తోంది. పెద్దవాళ్లు చేసే తీర్థయాత్రలు, తప్పనిసరి ప్రయాణాలను ప్రభుత్వ నిర్ణయం భారంగా మార్చింది. (క్లిక్: ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?) దేశ వ్యాప్తంగా వెల్లడవుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 70 ఏళ్లు పైబడినవారికి రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. కానీ ఈ కంటి తుడుపు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నట్లే 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింప జేయాలి. (క్లిక్: వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం!
దేశంలో తక్కువ ఖర్చుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాలంటే అది భారతీయ రైల్వేతోనే సాధ్యం. ఇండియన్ రైల్వే ప్రపంచలోనే నాలుగో అతి పెద్ద సంస్థగా పేరు పొందింది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేర్చడంతో పాటు కోట్ల రూపాయల సరుకులు కూడా రవాణ చేస్తుంది మన చుకు చుకు బండి. అంతేనా మిడిల్ క్లాస్ నేల విమానంగా పేరు కూడా ఉంది. ఇటీవల ప్యాసింజర్లకు కొన్ని ఉచిత సేవలని కూడా ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి సౌకర్యాలు ఉచితంగా భారతీయ రైల్వే అందిస్తున్న విషయం కూడా తెలియదు. అవేంటో ఓ లుక్కేద్దాం.. ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్.. అదనపు చార్జ్ ఉండదు టిక్కెట్ల బుకింగ్ సమయంలో, రైల్వే ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది ఇండియన్ రైల్వే. అంటే, స్లీపర్‌లోని ప్రయాణీకుడు థర్డ్ ఏసీని పొందవచ్చు, అది కూడా స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే. దీనికి ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఈ తరహాలోనే థర్డ్ ఏసీ ప్యాసింజర్ సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ప్యాసింజర్ వన్ టైర్ ఏసీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, అందుబాటులో ఉన్న సీట్లను బట్టి, ప్రయాణికుల రైల్వే టిక్కెట్‌ను వారు ఎంచుకున్న ఆఫ్షన్ ప్రకారం అప్‌గ్రేడ్ చేస్తారు. అయితే, ప్రతిసారీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. వికల్ప్ సర్వీస్ ఎంచుకుంటే బెటర్ తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసింజర్లు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి అవసరం లేకుండా రైల్వే శాఖ ‘వికల్ప్ సర్వీసు’ను ప్రారంభించింది. ఇది మరొక మనం బుక్ చేసుకున్న ట్రెన్‌లో సీటు లేకపోతే మన గమ్య స్థానానికి వెళ్లే మరొక రైలులో సీట్ల లభ్యత ఆధారంగా మనకి సీటుని కేటాయిస్తారు. ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలోనే వికల్ప్ సర్వీస్ ‘ఆప్షన్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత రైల్వే ఈ సౌకర్యాన్ని ఉచితంగానే కల్పిస్తుంది. టిక్కెట్ల ట్రాన్స్ఫర్ రైల్వే టిక్కెట్లను బదిలీ (ట్రాన్స్ఫర్) చేయచ్చు. ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేకపోతే, అతను తన కుటుంబంలోని ఎవరికైనా తన టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. అయితే, ప్రయాణ రోజు నుంచి 24 గంటల ముందు టికెట్ బదిలీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం, టిక్కెట్ ప్రింట్ తీసుకొని, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు తన ఐడీ (గుర్తింపు కార్డు) స్టేషన్లో చూపించి ఆ టిక్కెట్‌ని బదిలీ చేయవచ్చు. అయితే, టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. బోర్డింగ్ స్టేషన్ మార్చవచ్చు టికెట్ బదిలీ మాదిరిగానే, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కూడా 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. అంటే, ఒక ప్రయాణీకుడు హైదరాబాద్ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసి, ఆ రైలు మార్గంలో మరేదైనా స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే, అతను తన స్టేషన్‌ను మార్చవచ్చు. బోర్డింగ్ స్టేషన్లో మార్పు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఐఆర్టీసీ(IRCTC) వెబ్సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, బుక్ చేసిన టికెట్ హిస్టరీకి వెళ్లడం ద్వారా మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాలి. అయితే, మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది చదవండి: అదానీ దూకుడు: మూడు లక్షల కోట్లు దాటేసిన నాలుగో కంపెనీ -
ప్రయాణికులకు భారీ షాకిచ్చిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డుర్యాంటో ఎక్స్‌ప్రెస్‌లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఇకపై ప్రీమియం రైళ్లలో.. అల్పాహారం రూ.105 ఉండగా, రూ. 155 చేరింది. భోజనం రూ. 185 ఉండగా, రూ. 235, స్నాక్స్ రూ. 90 ఉండగా, రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టీ లేదా కాఫీ ముందుగా బుక్ చేసుకుంటే రూ. 20, బుక్ చేసుకోకుంటే రూ. 70 వసూలు చేసేవాళ్లు. ప్రస్తుతం బుక్ చేసినా, చేయకపోయినా వాటి ధరను రూ. 20గా నిర్ణయించారు. చదవండి: Google Play Store: యాప్ డెవలపర్లకు గూగుల్ కొత్త రూల్స్.. యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అలా చేయాల్సిందే! -
ఇండియన్ రైల్వేకు వరల్డ్ బ్యాంక్ రుణం!
న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది. ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం. ♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది. ♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది, ♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది. ♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది. -
అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు రైల్వేలో ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. అలాగే కరోనా కారణంగా 2020 మార్చిలో వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని పునరుద్ధరించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు. A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022 ▶️ No such announcement has been made by @RailMinIndia ▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2022 -
రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!
రైల్వేశాఖ తాజాగా జారీ చేసిన ఓ ప్రకటన ప్రయాణికులను ఆయోమయానికి గురి చేసింది. అంతేకాదు అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ప్రకటన రైల్వేపై విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ నష్టనివారణ చర్యలకు దిగింది. ఎక్కువ లగేజీ వద్దు ఇటీవల రైల్వేశాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినూత్న ప్రచారానికి తెర లేపింది. రైలు ప్రయాణంలో అవసరానికి మించి లగేజీ తెచ్చుకోవద్దంటూ సూచించింది. లగేజీ ఎక్కువైతే ప్రయాణంలో ఆనందం ఆవిరవుతుందంటూ వివరించింది. లగేజీ పరిమిత స్థాయికి మించి ఉంటే రైల్వే పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలంటూ కోరింది. अगर सामान होगा ज्यादा, तो सफर का आनंद होगा आधा! अधिक सामान ले कर रेल यात्रा ना करें। सामान अधिक होने पर पार्सल कार्यालय जा कर लगेज बुक कराएं। pic.twitter.com/gUuishbqr5 — Ministry of Railways (@RailMinIndia) May 29, 2022 లగేజీకి ఛార్జ్? కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరణ బాట పట్టడం. రైల్వేలో కూడా ప్రైవేటీకరణ మొదలవడంతో తాజా ప్రచారం అనేక సందేహాలకు తావిచ్చింది. దీనికి తోడు కోవిడ్ సమయంలో రద్దు చేసిన పలు రాయితీలు, ప్యాసింజర్ రైళ్లను ఇప్పటికీ రైల్వేశాఖ పునరుద్ధరించ లేదు. దీంతో విమాన సర్వీసుల తరహాలో లగేజీ ఎక్కువగా ఉంటే అదనపు ఛార్జ్ చేస్తారనే అపోహలు ప్రజల్లో ఏర్పాడ్డాయి. రైల్వే ప్రకటనపై పలు మీడియా సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలు ప్రచురించాయి. పాత పద్దతే రైలు ప్రయాణంలో లగేజీకి కూడా ఛార్జ్ వసూలు చేయాలనే ఆలోచన బాగాలేదంటూ రైల్వేపై విమర్శలు పెరిగాయి. దీంతో తమ ప్రచార యత్నం పట్టాలు తప్పిందని రైల్వేశాఖ గ్రహించింది. వెంటనే తామేమీ కొత్త విధానాలను అమలు చేయడం లేదని. గత పదేళ్ల నుంచి అమల్లోఉన్న పద్దతులనే ప్రజలకు తెలియజేశామంటూ మరో వివరణ ఇచ్చింది. News item covered on some social media/digital news platforms that the luggage policy of railways has recently been changed, is incorrect. It is hereby clarified that no change has been made in the recent past and the existing luggage policy is enforced for more than 10 years. — Ministry of Railways (@RailMinIndia) June 6, 2022 చదవండి: ఎవ్వరినీ వదలం.. రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం -
రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. ► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు.. ► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్ ► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్ ► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్. -
తల్లిబిడ్డల కోసం రైళ్లలో సరికొత్త సౌకర్యం!
చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైలులో ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది. నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఫలితాలు బాగుంటే క్రమంగా ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించే అవకాశం ఉంది. భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తున్నారను. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. Happy Mother's Day. A baby berth has been introduced in Coach no 194129/ B4, berth no 12 & 60 in Lucknow Mail, to facilitate mothers traveling with their baby. Fitted baby seat is foldable about hinge and is secured with a stopper. @AshwiniVaishnaw @RailMinIndia @GM_NRly pic.twitter.com/w5xZFJYoy1 — DRM Lucknow NR (@drm_lko) May 8, 2022 చదవండి: అప్పడు వర్క్ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా... -
విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు
కొరాపుట్(భువనేశ్వర్): ఎద్దు ఈనిందంటే.. తీసుకొచ్చి వాకిట్లో కట్టేయమన్న చందంగా ఉంది ఈస్టుకోస్టు రైల్వే అధికారుల తీరు. ప్రజలు డిమాండ్ చేశారు. అధికారులు మంజూరు చేశారు. కానీ రైలు ఏ మార్గంలో నడపాలో పట్టించుకోక పోవడంతో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నంలో ఉదయం 6.35 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, రాయగడ మీదుగా తొలిసారిగా కొరాపుట్ చేరుకున్న విస్టాడోం కోచ్‌లో ఒక్కరు కూడా ప్రయాణించ లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో రైల్వేశాఖ సిబ్బందే సమాధానం చెప్పాల్సి ఉంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణించే కిరండూల్ రైలు(18551) కొరాపుట్ మీదుగా జగదల్పూర్ వెళ్తుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ మార్గమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రైల్వేశాఖ కిరండూల్ రైలుకు విస్టాడోం కోచ్‌ను గతంలోనే అనుసంధానించారు. దీనిని కొరాపుట్ వరకు నడపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపాదనకు ఆమోదించిన ఈస్టుకోస్టు రైల్వే అధికారులు.. కోచ్‌ను మాత్రం రాయగడ మీదుగా కొరాపుట్ వెళ్లే రైలుకు అనుసంధానించి, చేతులు దులుపుకొన్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు నిడిపే ప్రత్యేక రైలు(08545)లో సాధారణ టిక్కెట్ ధర కేవలం రూ.140లు ఉండగా.. విస్టాడోం కోచ్‌లో రూ.1,300లుగా ఉంది. అరుకు మీదుగా కొరాపుట్ చేరు కిరండూల్ రైలులో సాధారణ టిక్కెట్ రూ.85 మాత్రమే. ఈ లెక్కను అరకు అందాలు చూడకుండా రాయగడ మీదుగా విస్టాడోంలో ప్రయాణించేందుకు అదనంగా రూ.1,160లు చెల్లించేందుకు ప్రయాణికులు ఆసక్తిగా ఉండరని రైల్వేశాఖ గమనించలేదు. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు అరకు వెళ్లదని తెలిసి, పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది. చదవండి: పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ -
రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!
భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త!!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న డిజిటల్ టికెటింగ్ సర్వీస్‌లో రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు తీరిపోనున్నాయి. ఐఆర్సీటీసీ ఇకపై రైల్వే స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్(ఏటీవీఎం)లలో యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యూపీఐ పేమెంట్స్ కోసం ఐఆర్సీటీసీతో జతకట్టినట్లు పేటీఎం ప్రకటించింది. దీంతో దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్లలో క్యాష్‌లెస్ ట్రైన్ టికెట్ తీసుకునే వీలు కలగనుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే ఏటీవీఎంలలో రైల్వే ప్రయాణికులు యూపీఐ పేమెంట్ ద్వారా టిక్కెట్ తీసుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఏటీవీఎంలు టచ్ స్క్రీన్ ఆధారిత టికెటింగ్ కియోస్క్‌లు. ఈ కియోస్క్‌లో రైల్వే ప్రయాణికులు క్యాష్ లేకుండా డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సదుపాయం దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు స్క్రీన్లపై రూపొందించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా స్మార్ట్ కార్డ్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు అన్‌రిజర్వ్ ట్రైన్ టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను కొనుగోలు చేయోచ్చు. వారి సీజనల్ టిక్కెట్లను పునరుద్ధరించుకోవచ్చు. ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ..అన్నీ రైల్వే స్టేషన్లలో యూపీఏ పేమెంట్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కబురు అందించింది. అత్యవసర సమయాల్లో రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, తత్కాల్లో టిక్కెట్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సమయంలో ఎంతో మంది ప్రజలు తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం వల్ల అందరికీ టికెట్ లభించదు. కానీ, రైలు ప్రయాణికుల వెసులుబాటు కోసం ఇప్పుడు ఐఆర్సీటీసీ ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే కన్ఫర్మ్ టికెట్ మొబైల్ యాప్. దీని ద్వారా అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రయాణికులు సులువుగా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వివిధ రైళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, మీరు ప్రయాణించే మార్గంలో అందుబాటులో ఉన్న అన్ని తత్కాల్ టిక్కెట్ల వివరాలను కూడా చూపిస్తుంది. ఈ యాప్‌లో రైళ్ల వివరాలను పొందడం కోసం ప్రయాణీకులు ఇకపై రైలు నెంబర్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, "కన్ఫర్మ్ టికెట్" వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు వినియోగదారులు తమ బుకింగ్‌ను నిర్ధారించే ముందు వారి ప్రయాణ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తుది బుకింగ్‌ను ఎంచుకున్నప్పుడు వివరాలు సేవ్ చేయడం వల్ల సులువుగా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో.. ఊపిరి పీల్చుకో..) -
కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు రైల్వే సేవలు..!
ప్రపంచంలోనే అతి పెద్ధ రైల్వే వ్యవస్థ మన ఇండియాలో ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇంత పెద్ధ రైల్వేశాఖలో ప్రస్తుతం ఎన్నో విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అన్ని రైల్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కింద ప్రతిపాదనలు చేసింది. అయితే, అప్పటి ప్రతిపాదనలు ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ద పడుతుంది. ప్రస్తుతం అన్ని రైల్వే డిపార్ట్మెంట్స్ను కలిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం కేంద్రం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సెర్వీస్(ఐఆర్ఎంఎస్)ను గ్రూప్ 'ఏ' సెంట్రల్ సెర్వీసెస్ కిందకు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యల వల్ల కొత్త అధికారుల నియమించుకోవాల్సి ఉంటుంది. 2019లో రైల్వే అధికారులకు ఒకే కేడర్ ఉండాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అనేక డిపార్ట్మెంట్స్ వీడి విడిగా ఉండటం వల్ల అధికారులు మధ్య బేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో, అతి పెద్ద రైల్వే వ్యవస్థలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం కలుగుతుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు అవసరాలను తీర్చగల స్థాయికి చేరడానికి అన్నీ రైల్వే విభాగాలను కాలపాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. ఈ రైల్వే విభాగాల విలీనం రైల్వే బ్యూరోక్రసీలో అతిపెద్ద సంస్కరణగా అధికారులు పరిగణిస్తున్నారు. ఇంత పెద్ద రైల్వే శాఖలో సంస్కరణలను తీసుకురావడానికి, వేగంగా ఆధునికీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మొదట కేంద్రం 150 మంది అధికారులను నియమించుకోవడం ద్వారా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కొంత మంది అధికారులు తెలిపారు. నియామకాలు చేపట్టడంలో ఆలస్యం చేయడంలేదని, రిటైర్ అవుతున్న సీనియర్లను పరిశీలించి కొత్తగా ఆఫీసర్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ రిక్రూర్‌మెంట్‌కు సంబంధించి కొత్త నియమ నిబంధనలు బయటకు రావాల్సి ఉంది. (చదవండి: క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) -
వాట్ ఆన్ ఐడియా అశ్విన్జీ !
ఆదాయం పెంచుకునే పనిలో భాగంగా రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రద్ధీగా ఉండే స్టేషన్లు, రైల్వే స్థలాల్లో సరికొత్త రెస్టారెంట్లు ప్రారంభించనుంది. దీని కోసం పాత రైలు పెట్టెలను ఉపయోగించాలని నిర్ణయించింది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వందల ఏళ్లుగా రైల్వేశాఖ దేశంలో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రైలు బోగీలు తయారుచేస్తోంది. ఇదే సమయంలో పాత బోగీలు ప్రయాణానికి పనికిరాకుండా పోతున్నాయి. గత కొంత కాలంగా రైల్వేలో ఫిట్నెస్ లేని కోచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. యాభై ఏళ్లు పైబడిన రైలు పెట్టెల్లో చాలా వరకు ఫిట్నెస్తో ఉండటం లేదు. ఇలాంటి పాత పెట్టెలను మేనేజ్ చేయడం సైతం రైల్వేకు భారంగా మారుతోంది. #Repost @RailMinIndia Coach to Restaurant!! Indian Railways is refurbishing its old railway coaches, which are not fit for use in trains, by turning them into beautiful concept restaurants making them an attraction for travellers. pic.twitter.com/q0lnTVOQwM — Ministry of Tourism (@tourismgoi) February 7, 2022 నిరుపయోగంగా మారుతున్న రైలు పెట్టెలతో సరికొత్త వ్యాపారానికి నాంది పలుకుతోంది. ఓల్డ్ రైల్వే కాంపార్ట్మెంట్లను రెస్టారెంట్లుగా మార్చుతోంది. ఫిట్నెస్ లేని రైలు పెట్టెలకు రైల్వే ఆధీనంలోని వర్క్‌షాప్‌లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇలా మార్చిన రైలు పెట్టెలను రద్ధీగా ఉండే రైల్వే స్టేషన్లలో రెస్టారెంట్లుగా మార్చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రారంభించిన రెస్టారెంట్లకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భోపాల్, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఈ తరహా రెస్టారెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్ని ప్రముఖ స్టేషన్లలో అవకాశం ఉన్న చోట ఈ తరహా రెస్టారెంట్ ప్రారంభించే దిశగా రైల్వే కసరత్తు చేస్తోంది. చదవండి: ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్.. -
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
వావ్!! దేశంలో మరో సూపర్ ఫాస్ట్ రైలు, ఎక్కడంటే!
దేశంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశంలో 8 కారిడార్లలలో బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఢిల్లీ - హిస్సార్ ప్రాంతాల మధ్య సూపర్ ఫాస్ట్ ట్రైన్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ - హిస్సార్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ల రైలు మార్గాన్ని నిర్మించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ-హిస్సార్ మధ్య 180 కి.మీ దూరాన్ని సాధారణ రైలులో నాలుగు గంటల్లో పూర్తి చేస్తుండగా..కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో అధిగమించవచ్చు. ప్రధాన కారణం ఢిల్లీ-హిస్సార్ కొత్త రైలు మార్గాన్ని నిర్మించడానికి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువే ప్రధాన కారణం. అక్కడ విమాన ట్రాఫిక్ ఉంటే, కొంత విమాన ట్రాఫిక్‌ను హిసార్ విమానాశ్రయానికి మళ్లించవచ్చు. దీని తరువాత, హిసార్ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇందులో భాగంగా సీఎం మనోహర్ లాల్‌తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు. ఈ సందర్భంగా రోహ్తక్లోని ఎలివేటెడ్ రైల్వే లైన్ కింద పది కొత్త రైల్వే స్టేషన్లతో పాటు రోడ్డు మార్గాల్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం -
రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు భారీగా షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్దం అవుతుంది. ఇక నుంచి కొన్ని రైల్వే స్టేషన్లలో ఎక్కిన, దిగిన మోత తప్పదు. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే ప్రయాణికుల మీద ప్రయాణ తరగతిని బట్టి ₹10 నుండి ₹50 వరకు స్టేషన్ అభివృద్ధి రుసుము విధించాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కిన, దిగిన ఈ స్టేషన్ అభివృద్ధి రుసుమును వసూలు చేయనున్నారు. బుకింగ్ సమయంలోనే రైలు టిక్కెట్లకు రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేయలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. పునర్అభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫీజు విధించనున్నారు. ఈ యూజర్ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. అన్ని ఏసీ క్లాసులకు ₹50, స్లీపర్ క్లాసులకు ₹25, అన్ రిజర్వ్డ్ క్లాసులకు ₹10 వసూలు చేయనున్నరు. రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ స్టేషన్ అభివృద్ధి రుసుము వసూలు చేయరు. ఈ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ల ధరలు కూడా ₹10 పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. "స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్డిఎఫ్) ప్రయాణీకుల నుంచి సేకరించనున్నారు. అభివృద్ధి చెందిన/పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో క్లాస్ వారీగా ఎస్డిఎఫ్ కింద ఛార్జ్ చేస్తారు. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు దిగినట్లయితే ఎస్డిఎఫ్ సూచించిన రేట్లలో 50 శాతం రుసుము ఫీజు ఉంటుంది. ఒకవేళ ఎక్కి, దిగే స్టేషన్స్ రెండు పునర్అభివృద్ధి చెందిన స్టేషన్స్ అయితే ఎస్డిఎఫ్ వర్తించే రేటుకు రుసుము 1.5 రెట్లు" అని సర్క్యులర్ లో పేర్కొంది. ఎస్డిఎఫ్ రుసుము విధించడం వల్ల రైల్వేలకు ఆదాయం పెరుగుతుంది. ఈ చర్య ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ మధ్య రైల్వేకు చెందిన రాణి కమలాపతి స్టేషన్, పశ్చిమ రైల్వేలోని గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రారంభించారు. (చదవండి: Jan Dhan Yojana: జన్ ధన్ యోజన ఖాతాలో భారీగా నగదు జమ..!) -
భారతీయ రైల్వేకు కనక వర్షం కురిపిస్తున్న తత్కాల్ టికెట్లు..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలోనూ.. రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం 1033కోట్లు రైల్వే వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు రాగా, ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయిన, ఈ మేరకు ఆదాయం రావడం గమనార్హం. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే తత్కాల్ టికెట్ల ద్వారా 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ కింద 89 కోట్లు, డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు భారతీయ రైల్వే సంస్థ డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.1,669, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.603 కోట్లు సంపాదించింది. ఈ తత్కాల్ టిక్కెట్లపై విధించే ఛార్జీలు "కొంచెం అన్యాయమైనవి" అని రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించిన ఒక నెల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి డేటా బయటకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రజలు భాదపడుతున్న సమయంలో ప్రయాణీకులపై భారాన్ని మోపడం తగదు అని కమిటీ పేర్కొంది. (చదవండి: వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!)