![Railways May Delivers Pizza Delivery Model To boost Freight Revenues - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/19/railway.jpg.webp?itok=UmeCZxUZ)
సాక్షి, న్యూఢిల్లీ: సరుకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు భారత రైల్వే ఓ వినూత్న ఆలోచన చేసింది. గూడ్స్ రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను ఇకపై డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను అవలంబించన్నట్లు తెలుస్తోంది. అంటే జాతీయ రవాణాదారు ఉత్పత్తులతో పాటు, వస్తువులను నిర్థిష్టకాలంలో రవాణా చేయడమే కాకుండా ఆలస్యం జరిగితే తగిన పరిహారం కూడా రైల్యే శాఖ చెల్లించనుంది. ఈ పరిహారం గంటల ప్రాతిపదికన ఉంటుంది. వస్తువుల పంపిణీకి రైల్యే నిర్ణీత కాలపరిమితిని నిర్ణయిస్తుంది. ఆ సయయానికి వస్తువుల పంపిణీ జరగకపోతే ప్రతి గంట చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి న్యూఢిల్లీకి సరుకులు రవాణాకు గరిష్టంగా 3 రోజులు (72 గంటలు) పడుతుంది. ఒకవేళ ఈ 72 గంటలలోపు సరుకులను పంపిణీ చేయకపోతే, నిర్ణీత గడువు ముగిసిన ప్రతి గంట ఆలస్యానికి రైల్వే పరిహారం చెల్లిస్తుంది. (చదవండి: ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి)
అయితే పరిమిత రంగాలపై ఈ పద్దతిని అమలు చేయాలని, 2021 నాటికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తైన తర్వాత క్రమంగా దీనిని అవలంభించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన బృందాన్ని కోరినట్లు సమాచారం. అలాగే ఇది దీర్ఘకాలంలో ఆదాయ ఉత్పత్తి పరంగా జాతీయ రవాణాదారునికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్కు, బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్ కంపెనీల రవాణా దృష్టిని ఆకర్షించేందుకే ఈ రవాణా విధానం ఉద్దేశించబడినట్లు తెలుస్తోంది. సరుకు రవాణా డెలివరీ మోడల్ కోసం ఇ-కామర్స్ కంపెనీలు, ఆటో సెక్టార్‌లతో పాటు ఫార్మా సెక్టార్లను ఆకర్షించే దిశగా కూడా రైల్వే శాఖ ప్రయత్నం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment