Piyush Goyal
-
రైతు నేతలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు
చండీగఢ్: రైతు సంఘాల నేతలతో సుహృద్భావ వాతవరణంలో చర్చలు జరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ చెప్పారు. తదుపరి సమావేశం మార్చి 19న జరగబోతోందని అన్నారు. రైతాంగం సమస్యలపై రైతుల సంఘాల నాయకులు, కేంద్ర బృందం మధ్య శనివారం చండీగఢ్‌లో చర్చలు జరిగాయి. కేంద్ర బృందానికి చౌహాన్ నేతృత్వం వహించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్ సైతం పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. రైతుల తరఫున జగ్జీత్ సింగ్ దలేవాల్, సర్వాన్‌సింగ్ హాజరయ్యారు. -
జపాన్ ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్‌కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. గతేడాది(2023–24)లో జపాన్‌కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్‌లో ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
యూఎస్‌తో డీల్‌పై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ నిర్వహించే వాణిజ్య సంప్రదింపుల పట్ల దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. వివిధ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా చర్చలకు సన్నద్ధం అవుతున్నామని, త్వరలోనే ఇవి మొదలవుతాయని చెప్పారు. ఇరు దేశాలూ పరస్పర రాయితీలతోపాటు, సుంకాల తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.దీంతో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరంగా మారతాయన్నారు. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా.. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలని (500 బిలియన్ డాలర్లు), పరస్పర ప్రయోజనాలతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత ముందుగా ఈ ఏడాది కుదుర్చుకోవాలని నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఒప్పందం దేశీ పరిశ్రమలకు వ్యాపార అవకాశాలను విస్తృతం చేస్తుందని మంత్రి గోయల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌ను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి దీన్నొక గొప్ప అవకాశంగా చూస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులతో ముందుకు రండి. భారత్, అమెరికాకు పరస్పర ప్రయోజనం కల్పించే, ఆకర్షణీయమైన వాణిజ్య షరతులను గమనించండి’’అని గోయల్ పేర్కొన్నారు. టారిఫ్‌లు మనం కూడా వేస్తాం.. ప్రతీకార సుంకాలపై మంత్రి గోయల్ మాట్లాడుతూ.. దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు మన దగ్గరా సుంకాలు ఉన్నట్టు గుర్తు చేశారు. ‘‘ఈ అంశాలను పరిష్కరించుకునేందుకు, పరస్పన ప్రయోజనాలపై చర్చల్లో భాగంగా దృష్టి పెడతాం. ఈ విషయంలో దేశీ సంస్థలకు ఆందోళన అక్కర్లేదు. ఇదొక సువర్ణావకాశం. కొత్త వ్యాపార అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు ఆందోళన చెందుతున్న వారు రేపు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది’’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
పదేళ్లలో పది లక్షలకు స్టార్టప్‌లు: పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 10 లక్షలకు చేరగలదని భారత్–ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.140 కోట్ల జనాభా గల భారత మార్కెట్లో గణనీయంగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నీర్ ఎం బర్కత్ సారథ్యంలో వ్యాపార దిగ్గజాల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఆర్థిక, సాంకేతికాంశాల్లో పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు. 2016లో 450గా ఉన్న రిజిస్టర్డ్ స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం 1.57 లక్షలకు చేరింది. కొత్త ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద గుర్తింపు పొందిన యూనిట్లకు పన్నులు, పన్నులయేతర ప్రోత్సాహకాలకు అర్హత లభిస్తుంది. ఇదీ చదవండి: ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్ఫ్లాగ్షిప్ పథకాలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ స్కీము మొదలైన వాటి ద్వారా వివిధ రంగాలు, దశల్లో ఉన్న అర్హత కలిగిన స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం కూడా లభిస్తోంది. -
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమితో డీల్
యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్ 400–500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్‌డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో కేటాయింపులుఎన్ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్టీఏ సభ్య దేశాలకు ఆఫర్ చేయనున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. లేదా బడ్జెట్లో ప్రకటించినట్టు 100 హబ్ అండ్ స్పోక్ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2023–24లో 24 బిలియన్ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు 10.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
ఆవిష్కరణలతోనే ఫార్మాకు భవిష్యత్
న్యూఢిల్లీ: ఆవిష్కరణలతోనే భారత ఫార్మా పరిశ్రమ రాణించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆవిష్కరణలు లేకపోతే ఈ పరిశ్రమే మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఫార్మా రంగం పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కోసం ఎప్పుడూ ప్రభుత్వంపైనే ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేవారు. ‘‘దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రతి దాని కోసం ప్రభుత్వం వైపు చూసే బలహీన మనస్తత్వ ధోరణి నెలకొంది. ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించినప్పుడే పరిశోధన నిర్వహిద్దామని అనుకుంటారు. విజయానికి ఆవిష్కరణలే ఆధారమైన పరిశ్రమ ఇది. ఎవరైతే ఆవిష్కరణకు దూరంగా ఉంటారో వారి కథ ముగిసినట్టే’’అని ముంబైలో ఫార్మా కంపెనీలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి వ్యాఖ్యానించారు. మారుతున్న జీవనశైలి తీరులు, సమాజం, రోగుల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ కూడా మారాలని సూచించారు. ప్రాజెక్టులతో ఫార్మా పరిశ్రమ ముందుకు వచ్చి.. ప్రభుత్వం, విద్యా సంస్థల సహకారంతో పరిశోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక్కడ ఆవిష్కరణలతో పేటెంట్లు సంపాదించుకుని, ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలని పిలుపునిచ్చారు. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఏఎన్ఆర్ఎఫ్) కింద 2023–28 కాలానికి కేంద్రం రూ.50,000 కోట్ల నిధిని ప్రకటించడం గమనార్హం. దీని కింద పరిశోధన, ఆవిష్కరణలకు చేయూతనివ్వనుంది. ఆ దేశాల్లో ఆవిష్కరణలే బలం.. స్విట్జర్లాండ్, యూఎస్, జపాన్ దేశాల్లో తలసరి ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉందని, ఇందుకు అక్కడి కంపెనీల ఆవిష్కరణలే కారణమని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘నాణ్యత, ఆవిష్కరణ అన్న రెండు అంశాలపై మీ మనుగడ ఆధారపడి ఉంది’’అని పేర్కొన్నారు. ప్రజావేగులుగా మారి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న, నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టు బయటపెట్టాలని పులుపునిచ్చారు. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను దత్తత తీసుకుని, ఉత్తమ తయారీ విధానాలను అనుసరించడం ద్వారా అవి వృద్ధి చెందేందుకు సహకారం అందించాలని కోరారు. -
'చరిత్ర సృష్టించబోతున్న భారత్': మొదటిసారి రికార్డ్!
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి, ఇందులో దేశం సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని వెల్లడించారు.2024-25 ఆర్ధిక సంవత్సరంలో.. భారతదేశ ఎగుమతులు మొదటిసారి రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. గత నాలుగేళ్లుగా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఎగుమతులు గణనీయంగా ఉంటాయని గోయల్ అన్నారు. జూన్ 2025తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఉల్లి, టమోటా, బంగాళాదుంప ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.మన ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారి 800 బిలియన్ డాలర్లను దాటుతుందని పియూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా నెలలుగా 600 బిలియన్ డాలర్ల వద్దనే స్థిరంగా ఉన్నాయి.ఎగుమతులు మాత్రమే కాకుండా.. దిగుమతుల అవసరం కూడా చాలా ఉంది. అయితే దిగుమతులు అనేవి కొరత, డిమాండ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, పప్పుధాన్యాలు, నూనెలు వంటివి ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి, అందులో ఉత్పత్తులను ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు దిగుమతులు పెరుగుతాయి. ఒక ప్రాంతంలో దిగుమతులు పెరిగితే.. పరిశ్రమల చూపుకూడా అటువైపు పడుతుంది. దీంతో అక్కడ కంపెనీలు ఏర్పడతాయి. ఇది ఎంతోమంది ఉపాధి కల్పిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. మొత్తం మీద దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. -
భారత్‌లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్‌కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్‌లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
స్టార్టప్స్‌కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులు
స్టార్టప్(Startup)లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు వెల్లువెత్తుతున్నాయన్నారు.‘ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు స్టార్టప్‌ల్లోకి వస్తున్నాయి. గరిష్టంగా ఇది 22–25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్‌లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది’ అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.ఇదీ చదవండి: అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు దేశీయంగా మెషీన్ల తయారీఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొ న్నారు. భవిష్యత్‌లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్‌తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. -
పసుపు రైతు కల సాకారం
నిజామాబాద్ సిటీ: దేశంలోని పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ బోర్డును ఎంపీ అర్వింద్‌తో కలిసి ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. పసుపు బోర్డు తొలి చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని నియమించారు. బోర్డును ఏర్పాటు చేసినందుకు పీయూష్ గోయల్‌కు ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపి, పసుపు కొమ్ముల దండను బహూకరించారు. నిజామాబాద్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో జిల్లాకు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. పసుపు ఉత్పత్తులు పెరుగుతాయి: గోయల్సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి పసుపును ప్రత్యేక బోర్డుగా ఏర్పాటు చేయడంతో పసుపు, పసుపు ఉత్పత్తులు బాగా పెరుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బోర్డును నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్ ప్రధాని మోదీని సైతం ఒప్పించారని అభినందించారు. ప్రధాని మాట ఇస్తే నెరవేరుస్తారు: బండి సంజయ్ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ అర్వింద్ కొన్నేళ్లుగా శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు. ఆయన కరీంనగర్ నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.ప్రజలు రుణపడి ఉంటారు: ఎంపీ అర్వింద్ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల దశాబ్దాల కల అని ఎంపీ అర్వింద్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చానని తెలిపారు. తెలంగాణ రైతులు ప్రధాని మోదీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్‌గా నియమించడం తన అదృష్టమని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. నిజామాబాద్‌లో వర్చువల్ కార్యక్ర మంలో పల్లె గంగారెడ్డితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి: పసుపు బోర్డు ఏర్పాటు తో నిజామాబాద్ జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. గుంటూరులో పొగాకు బోర్డు, కేరళలోని కొచ్చిలో స్పైసెస్ బోర్డు ఉంది. ఇప్పుడు పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చే శారు. ప్రపంచంలో పండించే మొత్తం పసుపులో మన దేశంలో నే 62% పండుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత నిజా మాబాద్లోనే అత్యధికంగా నాణ్యమైన పసుపు పండిస్తున్నారు. -
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్, సాక్షి: రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది. .. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. ఇక.. ఇటు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారీగా హాజరైన పసుపు రైతులు.. ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే.. నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది.మన పసుపు మార్కెట్ ఇదిప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 202223 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 202223లో 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62 శాతం. తొలి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిపల్లె గంగారెడ్డి అంకాపూర్లోని రైతు కుటుంబంలో పుట్టారు. డిగ్రీ చదివారు. తొలుత ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు అంకాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు తొలి ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ.. కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. -
కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు
వచ్చే నాలుగైదేళ్లలో ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘భారతీయ ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిలో నాణ్యత, పౌష్టికాహారం, సుస్థిరతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రయోగశాలలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ విభాగాల నుంచి ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆహారం, పానీయాల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఈ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, మెరుగైన ప్యాకేజింగ్, యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించడం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెబుతున్నారు. -
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
న్యూఢిల్లీ: సేంద్రీయ ఉత్పత్తుల (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించని) ఎగుమతులకు చక్కని అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరుకోవచ్చన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) ఎనిమిదో ఎడిషన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనలపై ఇందులో స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,000–6,000 కోట్లుగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్లను సులభంగా చేరుకుంటాం. ప్రస్తుత స్థాయితో పోల్చితే 3–3.5 రెట్లు’’అని తెలిపారు. అంతర్జాతీయంగా రూ.లక్ష కోట్ల మేర సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రానున్న సంవత్సరాల్లో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇది భారత్‌కు చక్కని అవకాశమని, దీన్ని జారవిడుచుకోరాదన్నారు. సేంద్రీయ సాగును ఎక్కువ మంది రైతులు చేపట్టిన దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగం వృద్ధికి అవసరమైన పరిష్కారాలతో స్టార్టప్‌లు ముందుకు రావాలని పిలపునిచ్చారు. భారత సేంద్రీయ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి 2 బిలియన్ డాలర్ల విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులను చేరుకునే లక్ష్యాలతో ఎనిమిదో ఎడిషన్ ఎన్పీవోపీని విడుదల చేయడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేంద్రీయ ఉత్పత్తులకు విశ్వసనీయత పెంచడం, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడంలోనూ ఎన్‌పీవోపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. -
వేగంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్‌ను పెట్టుబడులకు గొప్ప కేంద్రంగా మధ్య ప్రాచ్యం, జపాన్, ఐరోపా యూనియన్ (ఈయూ), యూఎస్ గుర్తిస్తున్నట్టు చెప్పారు. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలకు దారితీస్తున్నట్టు తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. దేశీ మార్కెట్ బలంగా ఉండడం, నైపుణ్య, మేధో వనరుల లభ్యత, చట్టాలకు కట్టుబడి ఉండడం, స్పష్టమైన నియంత్రణలు సానుకూల వ్యాపార వాతావరణం, వ్యాపార సులభ నిర్వహణకు వీలైన ప్రగతిశీల విధానాలు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఒకానొక పెద్ద ఫండ్ నిర్వహణ సంస్థ సీఈవోతో గత నెలలో యూఎస్‌లో భేటీ అయ్యాను. అదే సంస్థ భారత్‌లోనూ భారీ పెట్టుబడులు కలిగి ఉంది. గడిచిన పదేళ్ల కాలంలో భారత్‌లోని తమ పెట్టుబడులు తమ ఫండ్స్ చేసిన పెట్టుబడుల్లో అత్యుత్తమ పనితీరు చూపించినట్టు నాతో పంచుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి భారత్‌లో ఇన్వెస్టర్లుగా ఉన్నప్పటికీ, 80 శాతం పెట్టుబడులు ఇటీవలి సంవత్సరాల్లోనే పెట్టినట్టు చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టి 20 ఏళ్ల అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారత్‌కు వచ్చి మరో విడత పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించనున్నట్టు ప్రకటించారు’’ అని గోయల్ తను అనుభవాలను వెల్లడించారు. భారత స్టాక్ మార్కెట్ చక్కని పనితీరు భారీగా ఫ్ఐఐ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా రూ.38వేల కోట్లు.. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ ప్రతి నెలా సగటున 4.5 బిలియన్ డాలర్ల (రూ.38,000 కోట్లు) ఎఫ్‌డీఐలు గడిచిన ఏడాది కాలంగా భారత్‌లోకి వస్తుండడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐ 42 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్)నూ ఎఫ్‌డీఐలు 45 శాతం పెరిగి 29.79 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71.28 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని భారత్ ఆకర్షించింది. సేవల రంగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికం, ట్రేడింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు ఎక్కువ ఎఫ్‌డీఐలను రాబడుతున్నాయి. -
ఈవీ సబ్సిడీల నిలిపివేతకు పరిశ్రమ ఓకే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ పెరుగుతుండటంతో ఇకపై రాయితీలు నిలిపివేసినా సమస్య ఉండదని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీ పథకం ముగిసిన తర్వాత రాయితీలను నిలిపివేయొచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కంపెనీలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. బ్యాటరీ చార్జింగ్, స్వాపింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై పరిశ్రమ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఈవీల వినియోగంతో ఖర్చులపరంగా ఒనగూరే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ఆయన తెలిపారు. బ్యాటరీల మారి్పడికి ఉమ్మడిగా వనరులు వినియోగించుకోవడం కావచ్చు లేదా సొంత బ్యాటరీలతోనే వాహనాలను విక్రయించడం కావచ్చు ఎటువంటి వ్యాపార విధానాలనైనా పాటించేందుకు వాహనాల తయారీ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్, భారతీయ ప్రమాణాల బ్యూరో, అంకుర సంస్థలు, టాటా..మెర్సిడెస్ బెంజ్ తదితర వాహనాల కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఫేమ్ ఇండియా, పీఎం ఈ–డ్రైవ్ తదితర స్కీముల ద్వారా విద్యుత్తు వాహనాల విక్రయాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో భారత్‌లో మొత్తం ఈవీల విక్రయాలు 10 లక్షలుగా నమోదయ్యాయి. దేశీయంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటర్స్ అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ ఈవీ దిగ్గజాలను ఆకర్షించేందుకు కేంద్రం గతేడాది మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడితో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు సుంకాలపరంగా కొన్ని మినహాయింపులను ప్రతిపాదించింది. అలాగే ఫేమ్–2 స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 10,763 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
10 నిమిషాల్లో అంబులెన్స్.. ‘జాగ్రత్తగా వ్యవహరించాలి’
బ్లింకిట్ వంటి క్విక్‌కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించాం’ అన్నారు. -
వృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణ వితరణ
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు పొందడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయ రుణ వితరణ నమూనాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పట్టణాల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలు కేటాయిస్తామన్నారు.‘‘బ్యాంకు రుణాల విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పండి. అధిక తనఖాలు కోరుతున్నాయా? ఎగుమతుల రుణ హామీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ఉన్నప్పటికీ, బ్యాంక్‌లు తనఖా ఇవ్వాలని అడుగుతున్నాయా? ఎగుమతి రుణాల్లో వైఫల్యాలు ఎదురైతే 90 శాతం హామీ బాధ్యతను ఈసీజీసీ తీసుకుంటున్న తరుణంలో బ్యాంక్‌లు రుణాలపై ఎంత మేర వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి? అంశాల వారీ మరింత స్పష్టమైన సమాచారం పంచుకుంటే దాన్ని బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లగలం. ఇప్పటికీ బ్యాంక్‌లకు వెళ్లి రుణాలు తీసుకునేందుకుకే అధిక శాతం ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ రుణ నమూనా ఆలోచనల పట్ల అనుకూలంగా ఉన్నాం’’అని గోయల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. స్థలాలు కేటాయిస్తాం.. ఎంఎస్ఎంఈలు లేకుండా పెద్ద పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాణిజ్య మంత్రి గోయల్ పేర్కొన్నారు. కనుక వాటికంటూ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో షెంద్రాబిడ్కిన్ పారిశ్రామిక టౌన్షిప్లో టయోటా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సుమారు 100 ఎంఎస్ఎంఈల అవసరం ఉంటుంది’’అని వివరించారు. -
ఎలాంటి ఉత్పత్తులు వాడాలో చెప్పిన మంత్రి
పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రజలు దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చన్నారు. ఫలితంగా పర్యావరణ సంబంధిత సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గోయల్ మాట్లాడారు.‘ప్రస్తుత జీవన శైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్‌కు ఇది కీలకం. వినియోగ ధోరణలను చక్కదిద్దుకోకపోతే సుస్థిర, పర్యావరణ సవాళ్లకు పరిష్కారం లభించదు. తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే పూర్తిగా పర్యావరణ సవాళ్లు వస్తున్నట్లు భావించకూడదు. వినియోగం కూడా అందుకు కారణం. వినియోగ డిమాండ్‌పైనే తయారీ ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!వినియోగ ధోరణుల్లో మార్పు రావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పర్యావరణ విధ్వంసానికి దక్షిణాది దేశాలు కారణం కాదని..ఇందులో అభివృద్ధి చెందిన దేశాల పాత్రం ప్రధానమని చెప్పారు. అవి చౌక ఇంధనాలను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఇటలీ, భూటాన్, బహ్రెయిన్, అల్జీరియా, నేపాల్, సెనెగల్, దక్షిణాప్రికా, మయన్మార్, ఖతార్, కంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. -
చర్చల దశలోనే టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్‌ను చూస్తుంది. స్టార్‌లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు. నేపథ్యం ఇదీ... ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది. భారత్‌లో టెస్లా తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్ కోసం భారతీయ మార్కెట్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. స్టార్‌లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది. ట్రంప్ ’భారత్ స్నేహితుడే’ సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్‌సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు. ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు భారత్ ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు. 300 చట్టాలు డీక్రిమినలైజ్.. 300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. 32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ఎస్డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
భారత్‌లో ప్లాంట్లు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్ వివరించారు. ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
ఆరేళ్లలో ఎగుమతుల లక్ష్యం 2 ట్రిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ‘‘భారీ’’ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగిస్తూ భారత్ వచ్చే ఆరేళ్ల కాలంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా భాగస్వాములు అవుదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మనం నిజంగా సమిష్టిగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇది యాదృచ్చికంగా జరగదు. నిర్దిష్ట చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.భారత్ మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు జరిగింది. ఆయా అంశాలపై ఇంకా గోయల్ ఏమన్నారంటే.. ఇతర దేశాలలో భారత్ ఉత్పత్తులు ఎదుర్కొంటున్న నాన్–టారిఫ్ అడ్డంకులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలి. తద్వారా అధికారులు వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. త్వరలో దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐఎఫ్‌టీ కొత్త క్యాంపస్ ఎగుమతుల పురోగతికి మరింత చొరవ చూపుతుంది.స్నాతకోత్సవంలో ఎవరేమన్నారంటే... చర్చల కోసం ఒక కేంద్రాన్ని కూడా ఐఐఎఫ్‌టీ త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ తరహా చొరవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్యం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. ఈ కేంద్రం విద్యార్థులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో అనుసరించాల్సిన నైపుణ్యాలను అందించడానికి దోహదపడుతుంది. భారత్ ఎగుమతుల పురోగతి విషయంలో కేస్ స్టడీస్‌ను సిద్ధం చేయడానికి కూడా ఈ కేంద్రం దోహదపడుతుంది. – సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శిపెరిగిన ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్ 2024లో మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎఫ్‌టీ పన్నెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. రిక్రూట్మెంట్ కోసం అనేక పెద్ద సంస్థలు క్యాంపస్‌ను సందర్శిస్తున్నాయి. – రాకేష్ మోహన్ జోషి, ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ -
భారత్–యూఏఈ మధ్య ‘ఫుడ్ కారిడార్’
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే... → రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. → భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. → ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా. → యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. → తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయంభారత్లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
తయారీకి బంగారు భవిష్యత్
న్యూఢిల్లీ/సిడ్నీ: భారత్‌లో తయారీ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు 2014 సెపె్టంబర్ 25న ప్రారంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతోపాటు. తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. వ్యాపార సులభతర నిర్వహణ, అవినీతిని ఉపేక్షించకపోవడం, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాలపై దృష్టి సారించడం ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) విజయవంతం అయ్యేలా చేసినట్టు ప్రకటించారు. ఇది దేశంలో స్థానిక, విదేశీ పెట్టుబడులు ఇతోధికం కావడానికి సాయపడినట్టు చెప్పారు. భారీ పెట్టుబడుల ప్రణాళికలను చూస్తున్నామంటూ.. వీటి రాకతో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ పాత్ర మరింత పెరుగుతుందని సిడ్నీ పర్యటనలో ఉన్న గోయల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితం.. స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల సెంటిమెంట్ బలహీనంగా ఉన్న తరుణంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు చేపట్టినట్టు మంత్రి గోయల్ గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట కొంత క్షీణించింది. బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొనేవారు. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పొందేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. ఒకటే దేశం ఒకటే పన్ను – జీఎస్టీ, ఐబీసీ, పారదర్శకంగా గనుల వేలం తదితర ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసేపేత నిర్ణయాలతో అది సాధ్యపడింది’’అని మంత్రి గోయల్ వివరించారు. స్థిరమైన, స్పష్టమైన విధానాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడేలా చేసినట్టు చెప్పారు. ఈ చర్యలతో వ్యాపార సులభతర నిర్వహణలో భారత్ స్థానం 14 స్థానాలు మెరుగుపడి 190 దేశాల్లో 63కు చేరినట్టు తెలిపారు. 2020లో పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించి, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత నాటి చర్యల ఫలితాలను చూస్తున్నాం. భవిష్యత్‌పై ఉత్సాహంతో ఉన్నాం. మొబైల్స్ తయారీలో ఎంతో పురోగతి సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్స్ తయారీ కేంద్రంగా ఉన్నాం’’అని వివరించారు. టెక్స్టైల్స్, సిరామిక్స్, ఆట»ొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో దేశీ సామర్థ్యాలు నుమడించాయన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా సాయపడినట్టు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్సీ సంక్షోభాల్లోనూ దేశ జీడీపీలో తయారీ రంగం వాటా యాథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్పారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ అంతరిక్షం, బొగ్గు తవ్వకం, ఈ–కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీ ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇందులో 90 శాతం ఆటోమేటిక్ మార్గంలోనే వచి్చందన్నారు.ఆర్బీఐ దృష్టికి రియల్టర్ల నిధుల సమస్యలురియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను ఆర్బీఐ దృష్టికి తీసుకెళతానని మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో (మున్సిపాలిటీలు) మాట్లాడతానని భరోసా ఇచ్చారు. రెరా చట్టం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచి్చనట్టు చెప్పారు. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల పరంగా వాటా.. ఇలా రియల్ ఎస్టేట్ రంగం గొప్ప పాత్ర పోషిస్తోందని మంత్రి మెచ్చుకున్నారు. -
పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్
వికసిత భారత్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' సిడ్నీలో పారిశ్రామిక ప్రముఖులు & ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భారత్.. ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను గురించి ప్రస్తావించారు.భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. ఇరు పక్షాల మధ్య సహకారం, భవిష్యత్ అవకాశాల గురించి చర్చించడం ఆనందంగా ఉందని గోయల్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.గోయల్ తన పర్యటనలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'రాబిన్ ఖుదా'తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో డిజిటలైజేషన్ వృద్ధి గురించి మాత్రమే కాకుండా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య డేటా మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం గణనీయమైన సంభావ్యత గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్భారత్ డిజిటలైజేషన్లో వేగంగా పురోగమిస్తోంది. కాబట్టి డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీతో నడిచే మౌలిక సదుపాయాల వంటి వాటి పెట్టుబడులకు దేశం కేంద్రంగా మారింది. ఇండియా గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మారాలంటే.. టెక్ రంగంలో జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాల సంభావ్యత చాలా అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.Excellent meeting with Australia’s leading Super Funds, where we explored significant investment opportunities within India's dynamic growth sectors.Also, discussed avenues to enhance collaboration, giving further boost to India-Australia trade and investment ties. 🇮🇳🤝🇦🇺 pic.twitter.com/Bq36vWncw1— Piyush Goyal (@PiyushGoyal) September 23, 2024 -
సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా ఆఫీస్: ఫోటోలు
భారతదేశంలోకి ప్రాంతీయ పెట్టుబడులను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' ఆదివారం సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సింగపూర్‌లో ఇటీవలి పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిటీ-స్టేట్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ కార్యాలయం ప్రారంభించారు.సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాల్ ఖాతాలో షేర్ చేశారు. ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, భారత్.. సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది చాలా సహాయపడుతుందని ఆయన అన్నారు.ఇన్వెస్ట్ ఇండియా మొదటి విదేశీ కార్యాలయంగా.. ఇది పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌కు సింగపూర్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. ఇప్పుడు ఇది ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా ఇండియా, సింగపూర్ మధ్య విస్తారమైన పెట్టుబడి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్ఇన్వెస్ట్ ఇండియా అనేది 'నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా'. దీనిని భారత ప్రభుత్వంలోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాభాపేక్ష లేని చొరవగా స్థాపించింది. "మేక్ ఇన్ ఇండియా" ప్రచారంలో భాగంగా, ఇన్వెస్ట్ ఇండియా భారతదేశంలో తమ వ్యాపారాలను ప్రారంభించడం, నిర్వహించడం, విస్తరించడంలో పెట్టుబడిదారులను అనుమతిస్తుంది. Investing in a stronger partnership 🇮🇳 🤝 🇸🇬Proud to inaugurate the @InvestIndia Singapore office today. This marks a pivotal moment in strengthening economic ties and further unlocking vast investment opportunities between India and Singapore. It is a significant step… pic.twitter.com/OATmvrrj1x— Piyush Goyal (@PiyushGoyal) September 22, 2024 -
భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
లావోస్‌లోని వియంటైన్లో జరిగిన 12వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' దక్షిణ కొరియా.. మయన్మార్ దేశాల సహచరులతో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచడానికి పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.కొరియా వాణిజ్య, పరిశ్రమల, ఇంధన మంత్రి 'ఇంక్యో చియోంగ్'తో చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. ఫోటోలను కూడా షేర్ చేశారు. భారత్ - కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు జరిపినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!భారతదేశంలో దక్షిణ కొరియా పెట్టుబడులు ఉపాధి.. పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ కొరియాతో మాత్రమే కాకుండా.. మయన్మార్ విదేశీ ఆర్థిక సంబంధాల మంత్రి డాక్టర్ 'కాన్ జా'తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలను గురించి పీయూష్ గోయల్ చర్చించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగిన చర్చలు దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయని పలువురు భావిస్తున్నారు.Held productive talks with Mr. Inkyo Cheong, Minister of Trade, Industry and Energy, Republic of Korea. 🇮🇳🤝🇰🇷Deliberations were held on achieving more balanced trade, upgrading the India-Korea Comprehensive Economic Partnership Agreement (CEPA), promoting investments linked to… pic.twitter.com/5mgXtK6rSI— Piyush Goyal (@PiyushGoyal) September 21, 2024 -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’
ఆన్లైన్ వ్యాపారానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. ‘యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్’ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.‘దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 కోట్ల చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్ కంపెనీల పోటీకి ఇప్పటికే అమెరికాలో చిన్న వ్యాపారులు కనుమరుగయ్యారు. భారత్‌లోనూ ఈ ప్రమాదం ఉంది. కానీ కేంద్రం స్పందించి చర్యలు తీసుకుంటోంది. 14 కోట్ల మంది భారతీయ రైతులు, వారి కుటుంబాలు, తమ పిల్లల భవిష్యత్తు కోసం, 140 కోట్ల భారతీయుల ఆంకాక్షలు నెరవేర్చడానికి యూఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కీలక ఖనిజాల విషయంలో ఇరు దేశాలకు ఆందోళనలు ఉన్నాయి. ఈ విభాగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నాం’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు..ఆన్లైన్ వ్యాపార ధోరణిపై మంత్రి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థలు పుట్టుకురావడం గొప్ప విషయంగా భావించకూడదన్నారు. ఆ సంస్థలు ధరల విషయంలో పోటీ పడేందుకు విభిన్న మార్గాలు అనుసరిస్తున్నారని చెప్పారు. దాంతో రిటైల్ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారని వివరించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి త్వరలో కొత్త పాలసీ తీసువస్తుందని స్పష్టం చేశారు. -
వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ట్రేడ్ కనెక్ట్ ఈప్లాట్‌ఫామ్ పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనుంది. వెరసి ప్రస్తుత, కొత్త వ్యాపారవేత్తల(ఆంట్రప్రెన్యూర్స్)కు ట్రేడ్ పోర్టల్ సహాయకారిగా నిలవనుంది.ఎంఎస్ఎంఈ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, టీసీఎస్, ఆర్థిక సేవల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సహకారంతో తాజా ట్రేడ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రేడ్ పోర్టల్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. కస్టమ్స్ సుంకాలు, నిబంధనలు, నియంత్రణలు తదితర అన్ని రకాల సమాచారానికి ఒకే సొల్యూషన్‌గా తాజా పోర్టల్ నిలవనున్నట్లు గోయల్ వివరించారు. తద్వారా సమాచార లోపాలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. -
వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించింది. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.కేరళ తర్వాత ఏపీయే టాప్2022 ర్యాంకుల కోసం మొత్తం 25 రంగాల్లో (ఇందులో పరిశ్రమలకు సంబంధించి 15 రంగాలు, పౌరసేవలకు సంబంధించి 10 రంగాలు) మొత్తం 352 సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు అమలు చేసినట్టు 17 రాష్ట్రాలు కేంద్రానికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. అందులో కేరళ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. తెలంగాణ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్‌గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఈవోడీబీ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.కూటమి పార్టీలకు చెంపపెట్టురాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదంటూ ప్రచారం చేసిన కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఇది చెంపపెట్టు లాంటిందని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడమే కాకుండా.. ఇప్పుడు సంస్కరణల అమలు విషయంలో రెండో స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనమంటున్నారు.సులభతర వాణిజ్యం కోసం ‘ఏపీ వన్’ పేరిట సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించారు. దీంతోనే డైకిన్, సెంచురీఫ్లై, ఏటీజీ, దివీస్, అరబిందో వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత ప్రభుత్వ విధానం వల్ల విద్యుత్ రంగంలో బ్రాండ్ ఏపీ విలువ మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతిన్నదని టీడీపీ నిరంతరం ఆరోపించింది. ఇదే నిజమైతే.. అదానీ, గ్రీన్కో, అరేసెలార్ మిట్టల్ వంటి విస్తారమైన పేరున్న కంపెనీలు ఇంధన రంగంలో రూ.7,69,815 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టాయంటూ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. -
భారత్ వృద్ధికి తయారీ రంగం కీలకం: పీయూష్ గోయల్
భారతదేశంలో తయారీ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే దేశాభివృద్ధిని నిర్ణయిస్తుందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ ఫోరమ్‌లో వెల్లడించారు. 2017 నాటికి వికసిత భారత్ సాకారానికి తయారీ రంగం కీలకమని అన్నారు.భారతదేశ జీడీపీ వేగవంతమవుతున్నప్పటికీ.. తయారీ రంగం వృద్ధి సాపేక్షంగా నిలిచిపోయింది. జీడీపీలో దీని వాటా 15 శాతం నుంచి 16 శాతంగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ సంఖ్య స్థిరంగా ఉంది. అంటే జీడీపీ పెరుగుతున్నప్పటికీ తయారీ రంగం ఇందులో చెప్పుకోదగ్గ వృద్దివైపు అడుగులు వేయడం లేదు.కోట్ల జనాభా ఉన్న మన దేశంలో నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి భారత్ ఎంతో అభివృద్ధి చెందగలదని గోయల్ పేర్కొన్నారు. అయితే దేశంలోని కంపెనీలు తమకు కావాల్సిన వస్తువులను లేదా ఉత్పత్తులను మరో దేశీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలి. ఇది తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం సహాయపడుతుందని ఆయన అన్నారు.ఒక భారతీయ కంపెనీ మరొక భారతీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ఒక స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది వ్యాపారాల అంతరాయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం కూడా దేశాభివృద్ధికి చాలా పాటుపడుతోందని అన్నారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
భారత్‌లో చైనా పెట్టుబడులు: పీయూష్ గోయల్ ఏమన్నారంటే?
చైనా పెట్టుబడులకు సంబంధించిన విషయం మీద కేంద్రమంత్రి 'పియూష్ గోయల్' స్పష్టమైన వివరణ ఇచ్చారు. చైనా ఎఫ్‌డీఐకి మద్దతు ఇవ్వడంపై పునరాలోచన లేదని, ఆర్థిక సర్వే దీనికి ఏమాత్రం కట్టుబడి లేదని ఆయన అన్నారు. చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి వెల్లడించారు. చైనా పెట్టుబడుల ద్వారా ఉత్పత్తిని పెంచి.. ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని సర్వే అభిప్రాయపడింది. ఈ కారణంగానే కేంద్ర మంత్రి కూడా చైనా ఎఫ్‌డీఐలను ప్రోత్సహించాలని పేర్కొన్నారని, పియూష్ గోయల్ అన్నారు.జూన్ 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత భారత ప్రభుత్వం మనదేశంలో సుమారు 200 చైనా యాప్‌లను నిషేదించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD నుండి వచ్చిన ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనను కూడా ఇండియా తిరస్కరించింది. -
‘పీఎల్ఐ శాశ్వత సబ్సిడీ కాదు’
డ్రోన్ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వ శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. న్యూదిల్లీలో పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పీఎల్ఐ పథకాన్ని పరిశ్రమలు శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదు. ఆయా రంగాలను ఈ సబ్సిడీపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది వాటి పురోగతికి అందించే ప్రోత్సాహకం మాత్రమే. డ్రోన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతిక పురోగతి రైతులకు అధిక నాణ్యత గల పంటలను అందించాలి. పంటల దిగుబడిని పెంచేలా సహకరించాలి. అందుకు అనువుగా మరిన్ని పరిశోధనలు జరగాలి. గ్రామ స్థాయిలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసి మహిళా సాధికారత కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రధానమంత్రి ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్డీఏ కూటమి మూడో టర్మ్ పరిపాలనలో మూడు రెట్లు వేగంతో పని చేస్తాం. మూడు రెట్ల ఫలితాన్ని అందిస్తాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం‘గ్రామ స్థాయిలో డ్రోన్ల వాడకం వల్ల సహకార రంగం, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లకు ఆదాయం సమకూరుతుంది. వీటికి డ్రోన్లు అందించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పరిశ్రమలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి 2024 ప్రథమార్థంలో 18 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు అనుమతులిచ్చాం. 2023లో 17 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
పియూష్ గోయల్‌కు ఏపీ మంత్రి బొత్స కౌంటర్
విశాఖపట్నం, సాక్షి: మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా?. అసలు విద్యాశాఖ లో అవినీతి జరిగిందని చెప్పగలరా?.. .. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డ్ శాతం ఫలితాలు వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారు. బావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయిరైల్వే జోన్ సంగతి ఏమైంది?పియుష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా(చంద్రబాబును ఉద్దేశిస్తూ..) ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించాం అని మంత్రి బొత్స గుర్తుచేశారు. 2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజిన్ పని చేసిందా? మరో ఇంజిన్ రిపేర్ అయ్యిందా? అని మంత్రి బొత్స ఎద్దేశా చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ లో అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ పని చేస్తుంది. మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తాం. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుంది....మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలి. పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన్ని కోరుతున్నా అని మంత్రి బొత్స అన్నారు. కేంద్రంలో అలాంటి ప్రభుత్వం రావాలికేంద్రంలో మాపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నాం. అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాలు కోసం మాట్లాడవచ్చు. అది మా స్వార్థం. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదు. కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. అందుకే మనపై ఆధారపడే ప్రభుత్వం రావాలి..అందుకే కన్నీళ్లొచ్చాయ్షర్మిల మొన్నటి దాకా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెల్లి. కానీ, నిన్నటి నుంచి ప్రత్యర్థి పార్టీ వ్యక్తి. వారి పార్టీ విధానాలు వారివి. అది వాళ్ల ఇష్టం.చావుకి పుట్టుకకి సంబంధాలు ఉంటాయి. కానీ మిగతా వాటికి ఎందుకు ఉంటాయి?. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ నన్ను తండ్రితో పోల్చినప్పుడు వైఎస్సార్ గుర్తొచ్చారు. సీఎం జగన్ నా పేరు పిలవగానే.. జనం కూడా బాగా స్పందించారు. అందుకే భావోద్వేగానికి గురయ్యా అని బొత్స అన్నారు. -
కూటమిలో కొత్త ట్విస్ట్.. చంద్రబాబుకు షాకిచ్చిన బీజేపీ!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఇక, వీరి సమావేశం అనంతరం విలేకరులు సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేదేలేదని ప్రకటన చేశారు.అయితే, బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ఏపీలో వైఎస్సార్సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్సార్సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. -
భారత్‌లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో తన మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భారత్‌లో టెస్లా ఇకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పియూష్ గోయల్ ప్రకారం..మస్క్ భారత్ ఆటోమొబైల్ రంగం లాభదాయకమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారే నమ్మకం తమకు ఉందన్నారు. తద్వారా అన్ని ప్రధాన కంపెనీలు భారత్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశం సాధించిన పురోగతిని ప్రపంచం గమనించిందని ఉద్ఘాటించారు. -
Lok Sabha elections 2024: రాజ్‌నాథ్ సారథ్యంలో మేనిఫెస్టో కమిటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్ర శేఖర్ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పేర్లు కమిటీలో లేవు. -
'బాల్యం ఇక్కడే గడిపాను'.. లోకల్ ట్రైన్లో పీయూష్ గోయల్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ నేతలు మంగళ్ ప్రభాత్ లోధా, ఆశిష్ షెలార్‌లతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన తర్వాత గురువారం లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గోయల్ సిద్ధివినాయకుని ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ.. నేను తెల్లవారు జామున 3 గంటలకు క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. ముంబై ప్రజలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడానికి సహాయపడతారని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు. #WATCH | Mumbai: Union Minister Piyush Goyal says, "I did 'darshan' in Siddhivinayak temple, which reminds me of my old days when I used to come here and stood in the queue at 3 am...I am fully confident that our Mumbai brothers and sisters are on hell-bent making India 'Viksit… pic.twitter.com/aruHSjOXjY — ANI (@ANI) March 14, 2024 లోకల్ ట్రైన్లో ప్రయాణించే సమయంలో.. ముంబై మహానగరం మీద తనకున్న అభిమానం గురించి వెల్లడించారు. తన బాల్యం ముంబైలో గడిపానని, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్నప్పటికీ తన హృదయంలో ముంబయికి చెందిన స్ఫూర్తి, సంస్కృతి ఉందని అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గోయల్ విద్యుత్, రైల్వేలు, బొగ్గుతో సహా ముఖ్యమైన శాఖలలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో మూడు సార్లు రాజ్యసభలో ఎన్నికైన గోయల్.. ప్రస్తుతం ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. #WATCH | Maharashtra | Union Minister Piyush Goyal travels in a Mumbai local train. pic.twitter.com/W1lTQfNkNL — ANI (@ANI) March 14, 2024 -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్‌లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. పలు గల్ఫ్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. -
ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి
ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కోసం భారత్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని చెప్పారు. చాలా కాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లా సంస్థ.. దిగుమతి సుంకంలో రాయితీ కోరుతోంది. అయితే, ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ‘ఈవీల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటితో కాలుష్యం, చమురు దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం ఏదో ఒక కంపెనీకి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయలేం. యూరప్ సహా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థలతో పలు అంశాల్లో చర్చలు జరుపుతున్నాం. భారత్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే, వాటికనుగుణంగా ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని భావించకూడదు. భవిష్యత్తులో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది’అని మంత్రి గోయల్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 40,000 డాలర్లు (దాదాపు 29.75 లక్షలు) లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న విద్యుత్తు వాహనాలపై ప్రభుత్వం 60 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉంది. అంటే, అమెరికాలో రూ.34 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లన్నీ భారత్‌లో రెట్టింపు ధరకు అందుబాటులో ఉంటాయి. దీన్ని 70 శాతానికి పైగా తగ్గించాలని టెస్లా కోరుతోంది. ఇదీ చదవండి: ‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్ ముందుగా భారత్‌లో కొంతకాలంపాటు కార్లను దిగుమతి చేసి విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. దీనివల్ల మిగతా సంస్థలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం భావిస్తోంది. -
నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్‌లకు సూచించారు. స్టార్టప్ మహాకుంభ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్ దర్పణంగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. -
బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..త్వరలోనే ఆర్బీఐ కీలక నిర్ణయం?!
దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ చెల్లింపు దారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పనుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్ధికంగా బలంగా ఉందని, పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5 శాతం ఉందని చెప్పారు. కాబట్టే త్వరలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్ల తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే సెంట్రల్ బ్యాంక్ .. దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తుంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటుంది. అయితే, ఈ ఇంట్రస్ట్ రేటు ఎక్కువగా ఉంటే.. సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్ పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రస్ట్ రేటు తక్కువగా ఉంటే ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తుంది. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పియూష్ గోయల్ చెప్పినట్లు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం తగ్గనుంది. -
పోటీతత్వంతోనే అంతర్జాతీయంగా రాణింపు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆరంభ మద్దతుగానే పరిశ్రమ చూడాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు, దీని కింద ప్రయోజనం పొందిన సంస్థలు నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచాలన్నది ప్రభుత్వ యోచన అని, ఈ విషయంలో అసలైన సుదీర్ఘ ప్రయాణం ముందున్నట్టు చెప్పారు. పీఎల్ఐ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో వందలాది భాగస్వాములు, అధికారులు పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధంగా మిమ్మల్ని మార్చాలని కోరుకోవడం లేదు. మీ కృషిని ఆరంభించేందుకు ప్రోత్సాహంగానే (కిక్‌స్టార్ట్) దీన్ని చూడాలి. కానీ, అంతిమంగా పోటీయే నిలుస్తుంది. ఒకరితో మరొకరు, ప్రపంచంతోనూ పోటీ పడి రాణించాల్సి ఉంటుంది’’అని గోయల్ చెప్పారు. సౌకర్యమని చెప్పి దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని సూచించారు. భారత్‌ను తయారీ శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం, లబ్దిదారులు (కంపెనీలు) మధ్య సహకారం అవసరమని, ఒకరికొకరి మద్దతు కూడా కీలకమన్నారు. విలువ జోడించాలి.. భారత తయారీలో స్థూల విలువ జోడింపు (జీవీఏ/విడిభాగాలు కూడా ఇక్కడే తయారైనవి) కేవలం 17.4 శాతమే ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు, మరింత మంది ఉపాధి కల్పనకు ఇది చాలదని డీపీఐఐటీ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ మరింత విలువను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు. మొబైల్, వైట్గూడ్స్లో దేశీయంగా ఉత్పత్తుల తయారీకి విలువ తోడవుతున్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, 14పీఎల్ఐ పథకాలకు సంబంధించి రంగాల వారీ ముఖ్య సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. -
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరారు. పలు పెండింగ్ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ‘హైదరాబాద్ వయా మిర్యాలగూడ –విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు మంజూరు చేయాలి. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయి. హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలి. అలాగే యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ఐడీ) మంజూరు అయ్యింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత దానిని విజయవాడకు తరలించారు. కాబట్టి తెలంగాణకు ఎన్ఐడీ మంజూరు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్కు మంజూరు చేసింది. రాష్ట్రంలోని కరీంనగర్, జనగాం జిల్లాల్లో కూడా లెదర్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయి. మెగా లెదర్ పార్కు మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తాం..’అని కేంద్రమంత్రికి రేవంత్ తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్కుకు గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వండి ‘కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్టైల్ పార్కుకు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చింది. కానీ దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాలి. అప్పుడు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయి. ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుంది. టెక్నికల్ టెక్స్టైల్స్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, కన్వేయర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు తదితరాలు) టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్/ టెస్టింగ్ సెంటర్ మంజూరు చేయాలి..’అని కోరారు. జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చేయండి ‘తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐహెచ్‌టీ) మంజూరు చేయండి. రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్లు ఉన్నాయి. ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మీకులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..’అని ముఖ్యమంత్రి కోరారు. సానుకూలంగా స్పందించిన గోయల్ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మెగా లెదర్ పార్కు మంచి ప్రతిపాదన అంటూ.. ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటుకు గోయల్ సానుకూలత వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆయన అభినందనలు తెలిపారు. సమావేశంలో కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి రోహిత్ కన్సల్, రాష్ట్ర జౌళి, చేనేత శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఢిల్లీ తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతా నిబంధనల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా మరిన్ని ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 77వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) ద్వారా తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను తేవడం వల్ల వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు, సర్వీసుల లభ్యత మెరుగుపడిందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 672 ఉత్పత్తులతో 156 క్యూసీవోలు జారీ అయ్యాయని, రాబోయే రోజుల్లో 2,000–2,500 ఉత్పత్తులు క్యూసీవోల పరిధిలోకి చేరతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం .. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్, ఆట»ొమ్మలకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడం మొదలైన చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. భారత్ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు, సంపన్న దేశంగా ఎదిగేందుకు ఉత్పత్తులు, సరీ్వసులపరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలకు బీఐఎస్ ప్రచారకర్తగా మారాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీఐఎస్ దేశీయంగా నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని గోయల్ చెప్పారు. లిఫ్టులు, ఎయిర్ ఫిల్టర్లు, వైద్య పరికరాలు మొదలైన ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
2030 నాటికి టార్గెట్ ఇదే! - పియూష్ గోయల్
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన దేశం నుంచి ఎగుమతయ్యే వాహనాల శాతాన్ని పెంచాలని వాణిజ్య & పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన వాహనాలు 14 శాతమని తెలుస్తోంది. ఇది 2030 నాటికి 50 శాతానికి చేరుకోవాలని మెగా మొబిలిటీ షో 'భారత్ మొబిలిటీ' కోసం లోగో అండ్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో గోయల్ అన్నారు. 2024 ఆటో ఎక్స్పో 2024 గ్లోబల్ ఎక్స్పో వచ్చే నెల ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లోని చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో భవిష్యత్తులో రానున్న వాహనాలు, ఆటోమోటివ్ భాగాలలో అత్యాధునిక సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీలు, అర్బన్ మొబిలిటీ సొల్యూషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అటానమస్ వంటి వినూత్నమైన సాంకేతికతలు దర్శనమివ్వబోతున్నాయి. సుమారు 50కి పైగా దేశాల నుంచి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లతో, ఎక్స్పో అత్యాధునిక సాంకేతికతలతో కనిపించనుంది. 27కంటే కంపెనీలు కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో హైబ్రిడ్, CNG వాహనాలను ప్రదర్శిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే? 2024 ఎక్స్‌పోలో జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాల పెవిలియన్లను ఉంటాయి. అయితే యుఎస్, స్పెయిన్, యుఎఇ, రష్యా, ఇటలీ, టర్కీ, సింగపూర్, బెల్జియం నుంచి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
1.14 లక్షల స్టార్టప్‌లు..
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కలి్పంచినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా, హాంకాంగ్, చైనా వంటి ఎగుమతి దేశాల్లో డిమాండ్ మందగించడం, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటివి రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లుగా మారాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. 2022–23లో రత్నాభరణాల ఎగుమతులు అంతక్రితం ఏడాదిలో నమోదైన 39.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించి 38.11 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వివరించారు. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?
టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. ఈ మోడల్కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ఓవర్ ఎస్యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది. టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్‌మస్క్‌ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
‘జెమ్’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అయిన ‘జెమ్’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో (ఎక్స్) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి. -
సెమీకండక్టర్ల రంగంలో.. భారత్ అవకాశాల గని
శాన్ ఫ్రాన్సిస్కో: దేశీయంగా సెమీకండక్టర్ల రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, ఈ విభాగంలో పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ‘మైక్రాన్‌టెక్ సీఈవో మెహ్రోత్రాతో భేటీ అయ్యాను. భారత్‌లో సెమీకండక్టర్ల రంగం వృద్ధి చెందుతున్న తీరు, కంపెనీకి గల వ్యాపార అవకాశాలు మొదలైన అంశాలను చర్చించాము‘ అని సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అటు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్‌తో కూడా గోయల్ సమావేశమయ్యారు. -
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
భారత్‌లో టెస్లా.. ఎలాన్ మస్క్‌తో పియూష్ గోయల్ భేటీ!, ఎప్పుడంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఇండో-పసిపిక్ ఎకనామిక్స్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్) సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ తరుణంలో పియూష్ గోయల్.. ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీలో భారత్‌లో టెస్లా పెట్టుబడులు, కార్ల తయారీ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం చైనా - అమెరికా దేశాల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. దీంతో డ్రాగన్ దేశంలో వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదేమోనన్న అభిప్రాయానికి వచ్చిన పలు అంతర్జాతీయ సంస్థలు సకల సౌకర్యాలు కలిగిన భారత్ అయితేనే తమకు అన్నీ విధాల ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. మస్క్ సైతం భారత్‌లో అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా టెస్లా కార్ల తయారీ, అమ్మకాలు భారత్‌లో జరుపుకునేలా మస్క్‌ను పియూష్ గోయల్ భారత్‌కు ఆహ్వానించనున్నారు. భారత్‌లో టెస్లా ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఉన్న మోదీతో మస్క్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్ తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. టెస్లా కార్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్‌లింక్ సేవల్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకొస్తామని ఆ సమయంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో భారత్ ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు, పెట్టుబడులను పెంచేందుకు బహుళ జాతి కంపెనీల సీఈవోలు, స్టార్టప్ కమ్యూనిటీ, ఇతర వ్యాపార వేత్తలతో పియూష్ గోయల్ భేటీ కానుండగా.. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. -
రూపాయి-దిర్హామ్ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు
భారత్-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపీ-దిర్హామ్ రూపంలో మరింత విస్తరించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. రెండు దేశాలూ యూఏఈ నుంచి భారత్‌కు తక్కువ వ్యయానికే నిధులు పంపుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. 11వ భారత్–యూఏఈ ఉన్నత స్థాయి టాస్‌్కఫోర్స్ సమావేశం కోసం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం నుంచి యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. ‘‘ఆర్బీఐ, యూ ఏఈ సెంట్రల్ బ్యాంక్‌తో ఇప్పుడే చర్చలు పూర్త య్యాయి. పరిశ్రమ, బ్యాంకర్లతో కలసి రూపీ–దిర్హా మ్ వాణిజ్యాన్ని మరింత వేగంగా, పెద్ద మొత్తంలో అమలు చేయాలని నిర్ణయించాం’’అని మీడియా ప్ర తినిధులకు పీయూష్ గోయల్ చెప్పారు. దేశీ కరెన్సీల రూపంలో వాణిజ్యం నిర్వహించుకోవడం వల్ల మొత్తం వాణిజ్యంపై 5% ఆదా చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఆహార, పారిశ్రామిక పార్క్‌లు భారత్‌లో ఏర్పాటు చేయడంపైనా ఇరువైపులా చర్చలు జరిగినట్టు మంత్రి గోయల్ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు భారత్‌లో ఆర్థిక సేవలు, శుద్ధ ఇంధనాలు, మౌలిక రంగం, విద్య, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. భారత్‌లో విమానయాన రంగం యూఏఈ పెట్టుబడిదారులకు నమ్మకమైనదిగా మారినట్టు చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు భారత్ సర్కారు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రజుల్లో తయారీ, సేవల రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సంబంధాలకు ఇప్పుడు చంద్రుడు కూడా హద్దు కాదని అభివర్ణించారు. ఆవిష్కరణలతో పాటు, పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ రంగాల్లో అప్‌స్ట్రీమ్ (అన్వేషణ, ఉత్పత్తి), డౌన్‌స్ట్రీమ్ (మార్కెటింగ్, విక్రయాలు) పట్ల రెండు దేశాల్లో ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. భారత్-యూఏఈ గతేడాది మేలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయడం గమనార్హం. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య 72.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అది 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏఐ ఎతిహాద్‌తో ఎన్పీసీఐ ఒప్పందం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కు చెందిన అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, గురువారం యూఐఈకి చెందిన ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకుంది. వాణిజ్య మంత్రి గోయల్ సమక్షంలో ఇది కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని వారు తక్కువ వ్యయానికే రియల్ టైమ్ (అప్పటికప్పుడు) సీమాంతర చెల్లింపులు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశీ లావాదేవీలు నిర్వహించుకున్నంత సులభంగా సీమాంతర లావాదేవీలు చేసుకోవచ్చని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. నగదు పంపిస్తున్నప్పుడు రెండు దేశాల కరెన్సీ విలువ, చార్జీల వివరాలు కనిపిస్తాయి. దీంతో పారదర్శకత పెరగనుంది. గ్లోబల్ కార్డ్‌ల అవసరం లేకుండా డొమెస్టిక్ కార్డులను వినియోగించి నగదు పంపించుకోవచ్చు. ఈ ఒప్పందంతో ఎన్పీసీఐ ఉత్పత్తి అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ (ఐపీపీ) మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో యూపీఐ లావాదేవీ మాదిరే సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే, భారత్‌కు చెందిన రూపే స్విచ్, యూఏఈ స్విచ్ మధ్య కూడా అనుసంధాన ఏర్పడుతుంది. దీంతో కార్డుల నుంచి కూడా నగదు పంపుకోవడం సాధ్యపడుతుంది. ఈ ఒప్పందం యూఏఈలో ఉపాధి పొందుతున్న 35 లక్షల భారతీయులకు (ప్రవాసులు) ప్రయోజనం చేకూర్చనుంది. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
ప్రపంచ దేశాల్లో యూపీఐ పేమెంట్స్.. న్యూజిల్యాండ్‌తో భారత్ చర్చలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు కీలకంగా మారిన ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ (యూపీఐ)ను న్యూజిలాండ్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అంశంపై భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి డామియెన్ ఓ కాన్నర్‌తో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చలు నిర్వహించారు. యూపీఐతో రెండు దేశాల మధ్య సులభతర వాణిజ్యం, పర్యాట రంగ ప్రోత్సాహంపైనా ఇరు దేశాల మంత్రులు దృష్టి సారించారు. అలాగే, న్యూజిలాండ్ నుంచి చెక్క దుంగలను దిగుమతి చేసుకునే మార్గాలపైనా చర్చించారు. ‘‘యూపీఐ సిస్టమ్‌కు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ), పేమెంట్ ఎన్జెడ్ మధ్య ప్రాథమిక స్థాయి చర్చలను మంత్రి పీయూష్ గోయల్‌తోపాటు న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి స్వాగతించారు. ఇరువైపులా దీనిపై చర్చలు కొనసాగించాలని మంత్రులు నిర్ణయించారు’’అని కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2022లో ఫ్రాన్స్‌కు చెందిన ఆన్లైన్ చెల్లింపుల వ్యవ్థ ‘లిక్రా’తో ఎన్పీసీఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌కు చెందిన పేనౌతోనూ ఎన్పీసీఐ ఈ ఏడాది ఒప్పందం చేసుకుంది. పౌర విమానయానంలో పరస్పర సహకారం పౌర విమానయాన రంగంలో మరింత సహకారానికి వీలుగా భారత్, న్యూజిలాండ్ అవగాహన ఒప్పందానికి వచ్చాయి. మార్గాల షెడ్యూలింగ్, కోడ్‌షేర్ సేవలు, ట్రాఫిక్ హక్కులు, సామర్థ్య వినియోగంపై సహకరించుకోనున్నాయి. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్‌లోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ నుంచి ఎన్ని సర్వీసులను అయినా నిర్వహించుకోవచ్చు. తాజా ఒప్పందం రెండు దేశాల మధ్య పౌర విమానయానంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. అవగాహన ఒప్పందంపై పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, న్యూజిలాండ్ హైకమిషనర్ డేవిడ్ పైన్ సంతకాలు చేశారు. -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
అత్యధిక రేటుకి ఉల్లిని కొంటాం: కేంద్రం
న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది. -
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్నలు వేసింది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. బాధిత మహిళల తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపూర్‌లో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు. ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బదిలీ చేయవద్దంటున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున కేసును వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు. బాధితుల్లో ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ కుటుంబానికి ఆ మృతదేహాలను అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్. మే 18న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. చదవండి: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట.. -
ITPO complex: ‘భారత మండపం’ రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్ హాలు ఉంది. జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. -
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు. -
గుడ్‌న్యూస్: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి
సాక్షి, అమరావతి/కొరిటెపాడు (గుంటూరు): పొగాకు రైతుకు శుభవార్త. రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి ఫలితంగా పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2022–23 సీజన్లో 81,635 హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ కారణంగా సగానికిపైగా పొగాకు పంటతోపాటు శనగ, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 2021–22లో కిలో పొగాకు గరిష్ఠంగా రూ.210కు పైగా పలికింది. దీంతో పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులతో పాటు ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయం లేక పొగాకు సాగుకు మొగ్గు చూపారు. ఫలితంగా అనుమతికి మించి 85,763.50 హెక్టార్లలో పొగాకు సాగైంది. దీనికితోడు వాతావరణం కాస్త అనుకూలించడంతో హెక్టార్‌కు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. చరిత్రలో ఇదే అత్యధిక దిగుబడి కావడం గమనార్హం. మరోవైపు గతేడాది పొగాకుకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. ప్రస్తుతం సగటున కిలో రూ.245 నుంచి రూ.281 వరకు పలుకుతున్నాయి. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనా ల్టి తో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. గతంలో కూడా ఇలా అనుమతి ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది రెండోసారి విత్తుకోవడం, పంటను కాపాడుకోవడానికి, అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది. అదనపు అ«దీకృత ఉత్పత్తికి పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖమంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు. కర్ణాటకలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట స్థానంలో రెండోసారి విత్తుకున్న సందర్భంలో పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదేరీతిలో రాష్ట్ర రైతులకు కూడా అనుమతినివ్వాలని సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాదేశాలతో పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు బృందం ఢిల్లీ వెళ్లి పలుమార్లు సంప్రదింపులు జరిపింది. పెనాల్టీ లేకుండా అదనపు అ«దీకృత పొగాకు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పొగాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 2022–23 పొగాకు పంట కాలానికి సంబంధించి రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును, రిజిస్టర్ కాని అనధికారిక పొగాకును బోర్డు వేలం కేంద్రాల్లో అపరాధ రుసుం లేకుండా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ గెజిట్ విడుదల చేసిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కలి్పంచాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. మంచి స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. -
చేయూతనివ్వండి: కేంద్ర మంత్రులకు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్ధిక చేయూతనిచ్చి తనవంతు అండగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రహదారులు, మెట్రో రైలు విస్తరణ వంటి రంగాల్లో కేంద్రం సహకారం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదనపు ధాన్యం సేకరణ, హైదరాబాద్‌లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, పారిశుధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలపై వారితో చర్చించారు. అయితే శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేటీఆర్ భేటీ జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఆదివారం ఉదయం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నట్టు తెలిసింది. రోడ్లు, రైల్వే విస్తరణ, పారిశుధ్యానికి నిధులపై హర్దీప్పూరీకి విజ్ఞప్తి ► హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతోపాటు ఆర్థిక సాయం చేయాలి. ► రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేయగా.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే రీతిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు రూ.2,400 కోట్ల మేర ఖర్చవుతుంది. కేంద్రం రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలి. ► హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించాలి. ► రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులు అంటే రూ.450 కోట్లను ఆర్థిక సాయంగా అందించాలి. ► హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లలో.. కేంద్రం కనీసం రూ.744 కోట్లు భరించాలి. ► రాష్ట్రంలో కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రీఫారŠమ్స్ కింద చేపట్టిన బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.750 కోట్లను సాయంగా ఇవ్వాలి. ► గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలి. ► కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ అంశంపై త్వరలో తమ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. అదనపు బియ్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు.. ► ఇటీవలికాలంలో çఅధిక ఉష్ణోగ్రతల కారణంగా ముడిబియ్యాన్ని అందించే పరిస్థితులు లేవు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైతం గత రబీ సీజన్లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి.. ఈ సీజన్లో అధికంగా పండించే ఎంటీయూ 1010 రకంలో 48.20శాతం విరుగుడు ఉందని నివేదిక ఇచ్చింది. ► ప్రస్తుత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల వరిని సేకరించింది. కానీ కేంద్రం 10.20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నది. అంటే 15 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతించింది. మిగతా 51.11 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ముడి బియ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా ఇచ్చేందుకు ప్రతి లక్ష టన్నులకు రూ.42.08 కోట్లు చొప్పున.. 34.24 లక్షల టన్నుల బియ్యానికి రాష్ట్రంపై రూ.1,441 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అందువల్ల ఈ రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవాలని కోరుతున్నాం. -
సంస్కరణలతో భారత్ వృద్ధి వేగం
జైపూర్: కేంద్రం చేపట్టిన సంస్కరణ చర్యలు ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తోందని తెలిపారు. ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను దేశంలోని నలుమూలలా ఎలాంటి తారతమ్యం లేకుండా అమలు చేస్తున్నట్లు వివరించారు. ద్రవ్యోల్బణ రేటు ‘సింగిల్ డిజిట్’కు పరిమితం అయ్యేలా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ‘‘ప్రభుత్వ చర్యలు దేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి, యువతకు ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బలహీనంగా ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే పటిష్టవంతమైన ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది’’అని ఆయన ఇక్కడ విలేకరులతో అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ పెట్టుబడులకు సంబంధించి భారతదేశాన్ని ప్రపంచం ప్రధాన ఆర్థిక గమ్యస్థానంగా చూస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో కూడా సహాయపడుతోంది. ♦ దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. దాదాపు 10 నెలల దిగుమతులకు ఈ నిల్వలు సరిపోతాయి. ♦ కీలకమైన ఖనిజ రంగంలో సహకారాన్ని పెంచుకోవడం కోసం అమెరికా, కెనడా వంటి దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వలు... జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వల గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, గనులు, ఖనిజ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని ధృవీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ క్లిష్టమైన ఖనిజాన్ని వెలికితీసేందుకు భారతదేశానికి సాంకేతికత అవసరమని ఆయన అన్నారు. లిథియం నాన్–ఫెర్రస్ మెటల్. ఎల్రక్టానిక్ వెహికిల్స్ (ఈవీ) బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఇది ఒకటి. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాల కోసం భారతదేశం దిగుమతిపై ఆధారపడి ఉంది. -
భారత్, యూఏఈ మధ్య బంగారం వాణిజ్యం పెంపు
న్యూఢిల్లీ: విలువ ఆధారిత బంగారం ఉత్పత్తుల్లో వాణిజ్యం పెంచుకునే విషయమై భారత్, యూఏఈ దృష్టి సారించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్విట్జర్లాండ్ తర్వాత భారత్‌కు ఎక్కువ బంగారం సరఫరా చేసే దేశం యూఏఈ అని చెప్పారు. యూఈఏతో బంగారం వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై కేంద్రం పలు రాయితీలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ రాయితీలకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటూ, త్వరలోనే అవి పరిష్కామవుతాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఈయూఏతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాదిలో 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై సుంకాల్లో రాయితీలు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. సాధారణంగా అయితే బంగారం దిగుమతులపై సుంకం 15 శాతంగా ఉంది. ఈ పరిమితి మేరకు బంగారాన్ని ఎగుమతి చేయడం ద్వారా యూఏఈ ప్రయోజనం పొందొచ్చని కేంద్రం భావిస్తోంది. భారత జెమ్స్, జ్యుయలరీకి యూఏఈ అతిపెద్ద మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 15 శాతం యూఏఈకే వెళుతుంటాయి. 2022–23లో భారత్ నుంచి జెమ్స్ జ్యుయలరీ మొత్తం ఎగుమతులు 37.5 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం తగ్గాయి. -
ఓఎన్ డీసీతో ఈ–కామర్స్ విప్లవం?
ఈ–కామర్స్ రంగంలో ఈ మధ్యకాలంలో ఓ విషయం హల్చల్ చేస్తోంది. భారత రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉందని చెప్పు కుంటున్న దాని పేరు... ‘ఓఎన్ డీసీ’. వస్తువులు అమ్ముకునే వారికీ, కొనేవారికీ వేదికగా నిలవగల, అందరికీ అందుబాటులో ఉండే నెట్వర్క్ ఇది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగనుంది. ఈ–రిటైలింగ్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా! ‘ఓఎన్ డీసీ’ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. వ్యాపారులు, వినియోగ దారులిద్దరికీ చాలా అనుకూలంగా ఉండే ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొన సాగనుంది. బ్యాంకుల్లాంటి ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలెకని వంటివారు ఈ ఓఎన్ డీసీకి దన్నుగా నిలిచారు. నందన్ నీలెకని ఈ మొత్తం ప్రయత్నానికి సూత్రధారి అని కూడా చెబుతున్నారు. ఈ– కామర్స్ రంగాన్ని ప్రజాస్వామ్య పథం పట్టించే సామర్థ్యమున్న అతి పెద్ద ఆవిష్కరణ ఇదని నందన్ చెబుతున్నారు. ఓఎన్ డీసీకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే వాటిల్లో ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మకాల్లో గరిష్ఠంగా 35 శాతం కమిషన్‌ను ఈ ప్లాట్ఫార్మ్లు పొందుతూంటాయి. ఓఎన్ డీసీలో ఈ అవసరం ఉండదు. వినియోగదారులకూ ఇది వర్తిస్తుంది. చిన్న చిన్న కంపెనీలు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ము కునేందుకు వీలేర్పడుతోంది. ఈ ఉత్పత్తులను వినియోగదారులు మాత్రమే కాకుండా... అమెజాన్ వంటి పెద్ద రిటైయిలర్లూ కొనుగోలు చేయవచ్చు. ఓఎన్ డీసీలో కమిషన్ కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లపై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఓఎన్ డీసీని అప్పుడే యూపీఐతో పోలు స్తున్నారు. దేశంలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు, లేదా యూపీఐలోనే భాగంగా మారేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. యూపీఐ సాయంతో గూగుల్ పే, ఫోన్ పే, జియో, అమెజాన్ వంటి అనేక పేమెంట్ పోర్టళ్ల నుంచి చెల్లింపులు చేయవచ్చునన్నది మనకు తెలిసిన విషయమే. ఓఎన్ డీసీ ఆలోచన చాలా బాగున్నప్పటికీ ప్రస్తుతానికి అది బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్, పేటీఎం, ఫోన్ పే వంటి దిగ్గజ కంపెనీలూ దీంట్లో భాగస్వాములయ్యాయి. ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌ను వినియోగదారులు భిన్నరీతుల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని వివాదాలూ వస్తున్నాయి. ఉదాహరణకు... కొంత మంది ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌పై ఆహారాన్ని ఆర్డర్ చేస్తూండటం. జొమాటో, స్విగ్గీ వంటి అప్లికేషన్ల జోలికి పోకుండా వినియోగదారులు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్ పైనే ఫుడ్ ఆర్డర్లు పెడుతూండటం... కమిషన్లు తక్కువగా ఉన్న కారణంగా ధరలు తక్కువగా ఉండటం రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు తమను నియంత్రిస్తున్నాయన్న భావనలో ఉన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఓఎన్ డీసీ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సమస్యల్లా ఒక్కటే. సరకుల రవాణా బాధ్యత ఏ కంపెనీ తీసుకోవాలి? ఈ నైపుణ్యం డెలివరీ అప్లికేషన్లది! ఒకవేళ ఆర్డర్లు సరైన సమయానికి వినియోగదారులకు చేరకపోతే, అందిన సరుకులు సక్రమంగా లేకపోతే బాధ్యత ఎవరిది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫుడ్ డెలివరీకి మాత్రమే కాదు, ఇతర విక్రయాలకూ ఈ సమస్యల పరిష్కారం అత్యవసరం. రవాణా సమస్యల పరిష్కారానికి ‘లాజిస్టిక్స్’ రంగంలోని స్టార్టప్‌లతో ప్రయత్నాలు మొదలయ్యాయని ఓఎన్ డీసీ చెబుతోంది. డెలివరీ సమస్యలను ఇవి చూసుకుంటాయని అంటోంది. అయితే కొన్ని అంశాలను ఇంకా సరిచేయాల్సిన అవసరముంది. డిస్కౌంట్లు, తక్కువ కమిషన్ వంటివి ఇలాగే ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశాలు తక్కువ. ఓఎన్ డీసీ నిర్వాహకులు కూడా పలు సంద ర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆరంభానికీ, ప్రాచుర్యానికీ ఈ డిస్కౌంట్లు ఉపయోగపడతాయి కానీ... దీర్ఘకాలంలో వీటి రూపురేఖలు మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓఎన్ డీసీలో 36,000 మంది విక్రయదారులున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ సాధించిన పురోగతి ఇది. అలాగే నెట్వర్క్ భాగస్వాముల సంఖ్య 45గా ఉంది. సగటున వారానికి 13 వేల రిటైల్ ఆర్డర్లు వస్తూండగా... గరిష్ఠంగా ఒక్క రోజులో 25 వేల వ్యవహారాలు నడిచాయి. ఈ–రిటైల్ రంగం సామర్థ్యం భారీ ఎత్తున పెరగనుందని కూడా ఓఎన్ డీసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. సుమారు 14 కోట్ల మంది ఆన్లైన్ వినియో గదారులతో చైనా, అమెరికా తరువాత భారత్ మూడో స్థానంలో ఉందని లెక్క. అయితే దేశంలో ఈ–రిటైల్ చొచ్చుకుపోయింది చాలా తక్కువ. చైనాలో 25 శాతం ప్రాంతాలకు విస్తరించగా, కొరియాలో ఇది 26 శాతంగా ఉంది. అలాగే యూకేలో ఈ–రిటైల్ విస్తరణ 23 శాతముంటే, భారత్‌లో కేవలం 4.3 మాత్రమే. దేశంలో ఉండే 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. బెయిన్ అండ్ ఆక్సీల్ సంస్థ లెక్కల ప్రకారం 2027 నాటికి దాదాపు కోటీ యాభై లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆన్లైన్ క్రయ విక్రయాలకు దిగనున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 60 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఓఎన్ డీసీకి ప్రాధాన్యమేర్పడుతోంది. ఈ–రీటెయిలింగ్ దేశం నలుమూలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా. ఓఎన్ డీసీ పుట్టి నెలలు కూడా గడవకముందే దీనిపై కొందరు ఇది పనిచేయదని పెదవి విరిచేస్తున్నారు. పనిభారం ఎక్కువవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు ఓఎన్ డీసీలో భాగం కాకపోతే విజయవంతమయ్యే అవకాశాలు తక్కువన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గూగుల్ ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవుతుందని గత ఏడాది మధ్యలో కొన్ని వదంతులైతే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి సద్దు లేదు. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఓఎన్ డీసీలో చేరలేదు. అయితే వాల్‌మార్ట్‌కే చెందిన ఫోన్ పే ఇప్పటికే ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. ఫోన్ పే... ‘పిన్ కోడ్’ అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌తో ఓఎన్డీసీలో చేరింది. ఓలా, ఊబర్‌లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఇప్పటివరకూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ‘నమ్మ యాత్రి’ అన్న రైడ్ హెయి లింగ్ సంస్థ మాత్రమే ఓఎన్ డీసీలో భాగంగా ఉంది. ఓఎన్ డీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నెట్వర్క్. పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పుడే భాగస్వాములుగా చేరాలనీ, భవిష్యత్తులో చేర్చుకోమనీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం దీని అభివృద్ధికి అంతగా సహకరించేది కాదు. ఓఎన్డీసీ జయాపజయాలు ఆర్థికంగా ఎంతమేరకు అనుకూలం అన్నది భాగస్వాముల చేరిక, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. యూపీఐ, ఆధార్ల మాదిరిగా ఓఎన్డీసీ కూడా విప్లవాత్మకమైన ఆలోచనైతే అది దాని సృజనాత్మక డిజైన్ కారణంగానే అవు తుంది కానీ ప్రభుత్వ మార్గదర్శకత్వాల కారణంగా కాదు. ఈ కొత్త ఈ–కామర్స్ ప్రపంచం ఎలా పరిణమించనుందో తెలుసుకోవాలంటే వేచి చూడటం కంటే వేరు మార్గం లేదు. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్ వేదికల్లో ఫ్లాష్ సేల్స్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్ సేల్స్ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్ ప్లేస్ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్ ఇష్టపడే లేదా ప్రమోట్ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) డిస్కౌంట్లతో మంచి డీల్.. ‘ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్ సేల్స్ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) చిన్నవారిని రక్షించుకుంటాం.. ‘విదేశీ ఈ-కామర్స్ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్‌గా మాదిరిగానే పనిచేయాలి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. -
భారత్ వైపు చూస్తున్న ప్రపంచం
ముంబై: ప్రపంచం భారత్, భారత పరిశ్రమల వైపు చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎగుమతులను పెంచుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్కెటింగ్ విధానాలు, బ్రాండింగ్ ఉత్పత్తులతో దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాలు భారత్ అసలైన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామయన్నారు. 49వ జెమ్ అండ్ జ్యుయలరీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘ఈ నెల 24న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మంత్రులతో (ఐస్లాండ్, లీచెస్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) సమావేశం ఉంది. వారు భారత్‌తో వాణిజ్య చర్చలకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు, రష్యా కూడా భారత్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్నాయి. కనుక దేశ పారిశ్రామికవేత్తలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి’’అని మంత్రి సూచించారు. ప్రభుత్వం వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు నిజాయితీగా కృషి చేస్తోందంటూ, పరిశ్రమ నైతిక విధానాలు అనుసరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం యూఎస్, జీ7 దేశాలతో చర్చించడం ద్వారా ఆంక్షలు లేకుండా చూడాలని ఇదే సమావేశంలో భాగంగా జెమ్, జ్యుయలరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా మంత్రిని కోరారు. -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
ఎగుమతుల లక్ష్యం.. 2 ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఎఫ్టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుండి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం. డైనమిక్ పాలసీ... గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్‌టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీటీఎఫ్‌టీ) సంతోష్ సారంగి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ‘2030 నాటికి 2 ట్రలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనేది మా లక్ష్యం. దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది. అయితే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులను అధిగమించాలని మేము భావించడం లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్లను అధిగమించనున్నాయని డీజీఎఫ్టీ తెలిపారు. 2021–22లో ఈ మొత్తం ఎగుమతుల విలువ 676 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి గ్లోబల్ హోదా... అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలని ఎఫ్టీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, విదేశీ వాణిజ్య లావాదేవీలకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీ కరెన్సీలో సెటిల్మెంట్లకు ఎగుమతి ప్రయోజనాలను కల్పించనున్నారు. ‘కరెన్సీపరమైన సంక్షోభాలు, లేదంటే డాలర్లకు కొరత ఉన్న దేశాలతో రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. కాగా, యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక (ఈపీసీజీ) స్కీమ్ అలాగే ముందస్తు అనుమతులకు ప్రతిగా ఎగుమతి బాధ్యతలను (ఈఓ) నెరవేర్చడంలో విఫలమైన ఎగుమతిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం క్షమాబిక్ష స్కీమ్‌ను కూడా తాజా ఎఫ్టీపీలో పొందుపరిచారు. దీని ప్రకారం ఈఓల విషయంలో డిఫాల్ట్ అయిన పెండింగ్ కేసులన్నింటినీ క్రమబద్దీకరిస్తారు. దీనికోసం మినహాయింపు పొందికస్టమ్స్ సుంకాలను, అలాగే 100% వడ్డీతో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణాత్మక పాలసీ.. ఎఫ్టీపీ 2023ని కార్పొరేట్ వర్గాలు స్వాగతించాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను పెంచేలా ఆచరణాత్మక, సానుకూలమైన పాలసీగా పరిశ్రమ చాంబర్లు, ఎగుమతిదారులు దీన్ని అభివర్ణించారు. 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేలా అనేక వినూత్న చర్యలను పాలసీలో ప్రకటించారని భారతీయ పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటాను భారీగా పెంచేందుకు దోహదం చేస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. పాలసీలో ఇతర చర్యలు... ► జిల్లాలను ఎగుమతి హబ్‌లుగా చేసేందుకు రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో కలిసి పనిచేయడంపై కూడా ఎఫ్టీపీ 2023 దృష్టిపెట్టింది. ► యూఏవీ/డ్రోన్స్, క్రయోజనిక్ ట్యాంక్స్, ప్ర త్యేక రసాయనాల వంటి ద్వంద్వ వినియోగ హై ఎండ్ ఉత్పత్తులు, టెక్నాలజీల ఎగుమతుల కోసం సరళమైన పాలసీలపై దృష్టిసారిస్తారు. ► ఈకామర్స్ ఎగుమతులకు ఎగుమతి ప్రయోజనాలను ప్రత్యేకంగా అందించాలని పాలసీ నిర్దేశించింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని రెంట్టింపు చేస్తూ, ఒక్కో కన్సైన్మెంట్ను రూ.10 లక్షలకు చేర్చనున్నారు. కాగా, ఈకామర్స్ అగ్రిగేటర్లకు స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్‌ల ప్రక్రియను సులభతం చేసేందుకు గిడ్డంగి సదుపాయంతో కూడిన ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి ఈకామర్స్ ఎగుమతులు 200–300 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతాయని అంచనా. ► అన్ని రకాల బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), వర్టికల్ సాగు యంత్రాలు, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్, వర్షపు నీటి ఫిల్లర్లు, గ్రీన్ హైడ్రోజన్‌లను పర్యావరణహిత టెక్నాలజీ ఉత్త్పత్తుల్లోకి చేర్చారు. తద్వారా ఈపీసీజీ స్కీమ్ ప్రకారం వీటిపై ఎగుమతి పరమైన నియంత్రణలు తగ్గుతాయి. -
మోదీ ఫొటో చూసి మురిసిపోయాడు.. ఆనందంలో ముద్దుపెట్టి..
బెంగళూరు: దేశంలో ఎన్నికలు ఏవైనా కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఫుల్ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో చాలా స్థానాల్లో, రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక, తాజాగా కర్నాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో ప్రచారంలో బీజేపీ జోరుపెంచింది. ఇక, కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటకలో ఓ బస్సుపై మోదీ ఫొటో కనిపించడంతో ఓ రైతు.. ప్రధానిపై తనకున్న మమకారాన్ని చూపించుకున్నాడు. ఓ రైతు.. బస్సుపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోకు ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మోదీ ఫొటోను చూస్తూ కాసేపు కబుర్లు కూడా చెప్పాడు. అయితే, ఇటీవల కేఎస్ఆర్టీసీకి చెందిన ఓ ఆర్టీసీ బస్సుపై జీ20 సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించి ఉంది. అటుగా వెళ్తున్న ఓ రైతు.. బస్సు వద్దకు వచ్చి పోస్టర్‌ను చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలో మోదీ ఫొటోకు ముద్దుపెట్టాడు. ఈ సందర్బంగా సదరు రైతు మాట్లాడుతూ.. నాకు వెయ్యి రూపాయలు వచ్చేవి.. ఇప్పుడు నాకు రూ. 500 ఎక్కువ వచ్చేలా చేశావు. మా ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. ప్రపంచాన్నే జయిస్తావు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. कुछ भावनाओं को शब्द बयान नहीं कर सकते! देखिए प्रधानमंत्री @NarendraModi जी और हमारे अन्नदाताओं का अटूट बंधन। pic.twitter.com/bLe1Mbt9d4 — Piyush Goyal (@PiyushGoyal) March 30, 2023