
న్యూఢిల్లీ: భారత్ కు చెందిన స్టార్టప్ కంపెనీలను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా మద్దతు పలికారు. పీయూష్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తును దుమారం చెలరేగగా, అమన్ గుప్తా మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు. పీయూష్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పు ఏమీ కనిపించలేదంటూ ట్వీట్ చేశారు అమన్ గుప్తా. పీయూష్ చెప్పిన దానికి వక్రార్థాలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ తాను విన్నానని, అందులో తప్పులు వెతకాల్సిన పని లేదన్నారు అమన్ గుప్తా.
‘స్టార్టప్ ఫౌండర్లకు మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలని ప్రతీరోజూ గవర్నమెంట్ చెప్పలేదు. నేను అక్కడ ఉన్నాను. నేను ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. ఆయనేమీ కంపెనీల వ్యవస్థాపలకు వ్యతిరేకం కాదు. మనపై నమ్మకం ఉంది కాబట్టే కొన్ని మంచి విషయాలు చెప్పారు. భారత్ ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే వాటిని సాధించడానికి కృషి చేస్తామనేది ఆయన చెప్పిందాంట్లో నాకు అర్థమైంది’ అంటూ అమన్ గుప్తా పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయి. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్‌క్రీం, చిప్స్ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్ లక్ష్యమా..? అది స్టార్టప్‌ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.
అయితే.. భారత్‌లో స్టార్టప్‌లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే భారత్ లోని పలు స్టార్టప్ కంపెనీలు కూడా పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో బోట్ సహ వ్యవస్థాపకుడు పీయూష్ కు మద్దతుగా నిలవడం విశేషం.
It’s not every day that the government asks founders to dream bigger.
But at Startup Mahakumbh, that’s exactly what happened. I was there. I heard the full speech. Hon. Minister @PiyushGoyal Ji isn’t against founders. He believes in us.His point was simple: India has come far,… pic.twitter.com/bA4ontAz1M— Aman Gupta (@amangupta0303) April 6, 2025