Startup
-
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్‌పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్‌కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్‌ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్‌ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్‌కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్‌ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్‌స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్‌స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్‌గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ
సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్. ముఖ్యంగా తల్లిపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి, రూ. 120కోట్ల కంపెనీకి అధిపతిగా మారింది. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!రాజస్థాన్‌లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ పట్టా పుంచుకుంది. ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యతను గుర్తించింది. అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది. తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక సీఈవోగా విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య 2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 100కోట్లుగా ఉంది.అహానా గౌతమ్ ఏమంటారంటే.."ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు." అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవడానికి ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్ రెండో వేవ్‌లో కరోనా కారణంగా చనిపోయారు. -
అవి స్టార్టప్‌లు కావు.. ‘అప్‌స్టార్ట్‌లు’
ముంబై: చాలా వరకు స్టార్టప్‌లది ఆరంభ శూరత్వమేనని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్‌ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్‌ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.ఓ టీవీ చానెల్ నిర్వహించిన గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్‌స్టార్ట్‌లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్‌కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్‌షిప్‌ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్‌లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్‌ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్‌లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్ బజాజ్ ఈ విధంగా బదులిచ్చారు. బైక్లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు. -
ఏంజెల్ ఫండ్ పెట్టుబడి పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్‌లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది. -
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్‌ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!) -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
రాత్రిని పగలుగా మార్చేయండిలా..
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్‌ను కూడా బెన్ నోవాక్.. లండన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్ ఫామ్‌లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి, భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌ను కలిగి ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్‌పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇదెలా పనిచేస్తుందంటే..ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 -
వేద + కృత్రిమ మేధ
ఓ సినిమాలో ‘భవిష్యవాణి’ పుస్తకం రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని హీరోకు చెప్పేస్తుంది. దాన్ని బట్టి కథానాయకుడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అచ్చం అలాగే రేపు ఏం జరుగుతుందో చాలా కచ్చితత్వంతో చెప్పేస్తా అంటున్నాడు ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు. వేదాలకు ఏఐ సాంకేతికతను జోడించిదీన్ని సాధించినట్లు శ్రీకుషాల్ యార్లగడ్డ అనే టెకీ చెబుతున్నాడు. మూడేళ్లుగా ఎన్నోపరిశోధనలు చేసి డెస్టినీ.ఏఐ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన అతను.. అదే పేరుతో ఒక యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. తల్లి భవితపై ప్రయోగాలు.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన కృష్ణారావు, కనకదుర్గ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకుషాల్ యార్లగడ్డ. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండే అతను.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం)లో పీజీ చేశాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే చేసే పని నచ్చక 20 రోజులకే మానేసి ఇంటికొచ్చేశాడు. అప్పటి నుంచి వినూత్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆలోచనలను తల్లితో పంచుకొనేవాడు. భవిష్యత్తును కచ్చితంగా ఎలా అంచనా వేయగలమనే అంశంపై దాదాపు మూడేళ్లపాటు పరిశోధనలు చేపట్టాడు. ఇందుకోసం జ్యోతిష శాస్త్రంకన్నా ఎంతో గొప్పదైన ‘ప్రాణ’ (మనిíÙలోని ఆరు చక్రాలు, నాడులు, కుండలిని) ఆధారంగా భవిష్యత్తుపై పరిశోధనలు ముమ్మరం చేశాడు. ఇందుకోసం 400 కోట్ల డేటా సెట్స్‌తో అల్గారిథమ్ రూపొందించాడు. అందులోని వివరాల ఆధారంగా తన తల్లిపైనే ప్రయోగాలు చేసేవాడు. ఫలానా రోజున జ్వరం వస్తుందని తల్లికి చెప్పగా అన్నట్లుగా ఆమె ఆ రోజున జ్వరం బారిన పడ్డారు. అలాగే ఫలానా రోజున ఒంట్లో నలతగా ఉంటుందని చెప్పిన సందర్భంలోనూ అలాగే జరిగింది. ఇలా 6 నెలలు పరిశీలించాక తాను చెబుతున్న విషయాలు కచి్చతత్వంతో జరగడంతో స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చాడు. ఇదే విషయాన్ని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావుకు చెప్పడంతో ఆయన పరిశోధనలు చేసుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రోత్సహించారు. దీంతో డెస్టినీ.ఏఐ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి అదే పేరుతో యాప్ రూపొందించాడు. హోర శాస్త్రం ఆధారంగా.. బృహత్ పరాశరుడు రాసిన హోర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషిలో ఉండే ‘ప్రాణ’ ఆధారంగా ఈ భవిష్యవాణి చెప్పొచ్చని కుషాల్ వివరించాడు. పూర్వ కాలంలో రాజులు, మంత్రులకు మాత్రమే పండితులు ఈ ప్రాణ లెక్కలు వేసి వారి భవిష్యత్తును అంచనా వేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జనాభాకు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లెక్కలు వేయడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కుషాల్ సాంకేతికతను వినియోగించాడు. దీని ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఒక వ్యక్తి భవిష్యత్తును కచ్చితత్వంతో చెప్పొచ్చని కుషాల్ అంటున్నాడు. సాధారణ పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణ విశ్లేషణ చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని కుషాల్ పేర్కొన్నాడు.ఎలా పనిచేస్తుంది? డెస్టినీ.ఏఐ అప్లికేషన్లో మన పుట్టినతేదీ, సమయం, పుట్టిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే మెషీన్ మొత్తం విశ్లేషించి రేపటి రోజున ఏం జరుగుతుందనేది చెప్పేస్తుందని కుషాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్లో ఉందని.. దాదాపు 60 శాతం కచ్చితత్వంతో సమాచారం అందిస్తోందని వివరించాడు. సమీప భవిష్యత్తులో యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వంతో భవిష్యవాణి చెప్పేలా రూపొందిస్తానని కుషాల్ అంటున్నాడు.నిర్ణయాలుతీసుకోవడానికి దోహదం జీవితంలో కీలక నిర్ణయాలుతీసుకొనే విషయంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కుషాల్ అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిస్తే ఆందోళనకు గురికాకుండా అప్లికేషన్లో భవిష్యత్తుతోపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అంశాలను కూడా మెషీన్ పొందుపరుస్తుందని వివరించాడు. -
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ స్నీకర్ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు
దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చదువు పూర్తయిన తర్వాత యువత ఉద్యోగం చేయడం కంటే కొత్త కంపెనీలు స్థాపించడంపైనే మక్కువ చూపుతున్నారు. విభిన్న ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు స్థాపిస్తున్నారు. ప్రాథమిక దశలో మూలధన పెట్టుబడులకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నా, కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ లభించాక ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలా విభిన్న రంగాల్లో కొత్త స్టార్టప్‌లు వెలుస్తున్నాయి. ప్రధానంగా ఏఐ ఆధారిత సంస్థలు భవిష్యత్తులో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో కొన్ని ఏఐ స్టార్టప్‌ల గురించి తెలుసుకుందాం.జీబ్రా మెడికల్ విజన్: వ్యాధుల నిర్ధారణలో రేడియాలజిస్ట్లకు సహాయం చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. మెడికల్ ఇమేజింగ్ అనలిటిక్స్‌లో వైద్యులకు ఈ సంస్థ తోడ్పడుతుంది.నిరామై: మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల క్యాన్సర్ పెరుగుతోంది. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఈ సంస్థ ఏఐ సహాయంతో థర్మల్ ఇమేజింగ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు సహాయపడుతుంది.క్యూర్మెట్రిక్స్: రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేందుకు ఈ సంస్థ ఏఐను తయారు చేస్తోంది. ఎక్స్-రే ఇమేజింగ్ ద్వారా మమోగ్రఫీ విధానాన్ని ఉపయోగించి ఇతర చాతి సంబంధిత వ్యాధులను నిర్ధారిస్తుంది.సిగ్టుపుల్: ప్రాథమికంగా పాథాలజీ, మైక్రోస్కోపీలో వైద్య డేటాను విశ్లేషించి ఆటోమేట్ చేసేందుకు వీలుగా ఏఐను రూపొందించారు.ఫ్రాక్టల్ అనలిటిక్స్: వివిధ పరిశ్రమల్లో సంక్లిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఏఐను తయారు చేశారు.ఇదీ చదవండి: ‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగంఅగ్రకూల్: పంట నిర్వహణపై దృష్టి సారించి వ్యవసాయ రంగానికి ఏఐ ఆధారిత పరిష్కారాలు అందిస్తుంది.వోబోట్: వ్యాపారాల కోసం ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ సేవలందిస్తుంది.అన్కనీ విజన్: భద్రత, నిఘా కెమెరాలు మరింత పటిష్టంగా పనిచేసేందుకు ఏఐ అప్లికేషన్ల ద్వారా కంప్యూటర్ విజన్ టెక్నాలజీని అందిస్తుంది. -
‘అంతా అయిపోయింది’.. మొత్తం ఉద్యోగుల తొలగింపు!
క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ మద్దతు ఉన్న అగ్రిటెక్ స్టార్టప్ రేషామండి కథ ముగిసింది. సంస్థ మొత్తం ఉద్యోగులను తొలగించిందని ఎన్‌ట్రాకర్ నివేదిక తెలిపింది. ఆడిటర్ తప్పుకోవడం, వారం రోజులుగా కంపెనీ వెబ్సైట్ డౌన్ కావడం వంటి పరిణామాలతో సంస్థ స్థితిగతులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.'రేషామండి కథ అయిపోయింది' అని సంబంధిత వర్గాలు తెలిపినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు సహా అప్పులు చెల్లించడానికి, నిర్వహణ ఖర్చులను భరించడానికి కంపెనీ ఇబ్బంది పడుతోందని తెలిపింది. సంస్థలోని మొత్తం 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.రెవెన్యూ ద్రవ్యోల్బణం, మోసపూరిత ఇన్ వాయిస్ లతో సహా పలు కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను కంపెనీ ఎదుర్కొంది. గత నెలలో రాజీనామా చేసిన ఆడిటర్ వాకర్ చందోక్ అండ్ కో ఎల్ఎల్పీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ సమస్యలను తెలియజేసింది. రేషామండి ఆడిటింగ్ సంస్థకు రూ.14.16 లక్షలు బకాయి పడింది. బెంగళూరుకు చెందిన ఈ చింది.కంపెనీ జూలై చివరిలో సురేష్ కపూర్ అండ్ అసోసియేట్స్ అనే కొత్త ఆడిటర్‌ను నియమించుకుంది.దీనికి తోడు రేషామండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) వరుస రాజీనామాలను చవిచూసింది. 2022 మార్చి 2 నుంచి 2023 జనవరి వరకు సీఎఫ్ఓగా పనిచేసిన రితేష్ కుమార్ స్థానంలో 2023 ఏప్రిల్‌లో కేపీఎంజీ మాజీ సీఎఫ్ఓ సమద్రిత చక్రవర్తి గ్రూప్ సీఎఫ్ఓగా నియమితులయ్యారు. తర్వాత ఆయన కూడా అదే ఏడాది అక్టోబర్‌లో కంపెనీని వీడినట్లు ఇంక్ 42 నివేదించింది.రేషామండి ప్రతినిధి ప్రచురణకు ఇచ్చిన ఒక ప్రకటనలో సంస్థ ఆర్థిక ఇబ్బందులను అంగీకరించారు. "రేషామండి కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మార్కెట్ నుంచి పెండింగ్ రిసీవబుల్స్ సేకరించడంపై దృష్టి పెట్టడానికి దాని సిబ్బంది, కార్యకలాపాలు, ప్రక్రియలను క్రమబద్ధీకరించింది. ఈ పరిస్థితి నుంచి బలంగా బయటపడి త్వరలోనే ట్రాక్‌లోకి రాగలమని నమ్ముతున్నాం' అని అన్నారు. -
ఐఐటీ హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ టెక్నాలజీ రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్ లెస్ వాహనాలను ఐఐటీహెచ్‌లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది. ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ‘అటానమస్’ వాహనాల సాంకేతికతను టిహాన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్‌లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. -
శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా..
ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించవచ్చు... అని చెప్పడానికి ఉదాహరణ కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఉదయ్ శంకర్. పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ఔరా అనుకునేలా చేశాడు. ఇప్పటి వరకు 10 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్ ప్రోగ్రామ్స్, 15 రకాల గేమ్స్ డిజైన్ చేశాడు..బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘ యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’తో మరో అడుగు ముందు వేశాడు.కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్ఏఐ సదస్సులో ఉదయ్‌శంకర్ స్టార్టప్ ‘ఉరవ్’కు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్న వయసులోనే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్. అది పాషన్‌గా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. కోవిడ్ కల్లోల సమయంలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్లో పైథాన్ప్రోగామింగ్ నేర్చుకున్నాడు. యాప్ డెవలప్మెంట్పై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు సాధించాడు.ఒకరోజు తన బామ్మకు కాల్ చేశాడు ఉదయ్. ‘కొద్దిసేపటి తరువాత నీకు ఫోన్ చేస్తాను’ అని ఫోన్ పెట్టేసింది బామ్మ. అంతవరకు వేచి చూసే ఓపిక లేని ఉదయ్ బుర్రలో ‘బామ్మ డిజిటల్ అవతార్’ను సృష్టించాలని, ఆ అవతార్‌తో ఏఐ ఉపయోగించి మాట్లాడాలనే ఐడియా తట్టింది. ఆ ఐడియాను సాకారం చేసుకున్నాడు. బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది.ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’ మరో అడుగు ముందు వేశాడు. ఏఐ రిమోట్ టీచర్ మిస్ వాణి, ఏఐ పర్సనలైజ్డ్ మెడికల్ అండ్ క్లినికల్ అసిస్టెంట్ మెడ్ఆల్కా, ఏఐని ఉపయోగించి ఫొటో నుంచి 3డీ ఇమేజెస్ సృష్టించే మల్టీటాక్ అవతార్ ఏఐ సూట్... మొదలైనవి కంపెనీ ్రపాడక్ట్స్. తండ్రి డా.రవి కుమార్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తల్లి శ్రీకుమారి ఉదయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్ శంకర్. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
దేశంలో వివిధ రంగాల్లో అనేక స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయి. విభన్నమైన వ్యూహాలతో విజయ పథంలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విజయవంతమైన పలు స్టార్టప్‌లు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి టెండ్రిల్స్ నేచురల్స్.మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ సూక్ష్మ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పని చేస్తుంది. ప్రారంభంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతుల ద్వారా ఈ మొక్కల నుంచి సేకరించిన నూనె నుంచి సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు.తర్వాత క్రమంగా పలు సేంద్రియ ఉత్పత్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా నెలకు రూ.5 లక్షలకు పైగా విక్రయాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీని వ్యవస్థాపకుడు చెబుతున్నారు. -
బడ్జెట్లో మహిళలు ఏం కోరుతున్నారంటే..
కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్తగా కంపెనీలు స్థాపించిన మహిళలు వారికి సరైన ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం బడ్జెట్లో చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.పబ్లిక్ పాలసీ కన్సల్టింగ్ సంస్థ టీక్యూహెచ్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకురాలు అపరాజిత భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలి. స్టార్టప్ కంపెనీలు కలిగి ఉండడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ 2020 నుంచి 2022 వరకు మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధుల వాటా మొత్తం స్టార్టప్ ఫండింగ్‌లో కేవలం 15 శాతం మాత్రమే. మహిళలకు సరైన నైపుణ్యాలు అందించి కొత్త కంపెనీలు స్థాపించే దిశగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సారథ్యం వహిస్తున్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా క్యాపిటల్ వెంచర్లను ప్రోత్సహించేలా బడ్జెట్‌ను రూపొందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?ఈ సందర్భంగా కినారా క్యాపిటల్ సీఈఓ హార్దికా షా మాట్లాడుతూ..‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలోని శ్రామికశక్తిలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు అందించి ఎంఎస్ఎంఈలో పనిచేసేలా నిర్ణయం తీసుకోవాలి. మహిళా శ్రామిక శక్తి 2021-22లో 32.8 శాతం నుంచి 2022-23లో 37 శాతానికి పెరిగినప్పటికీ దీన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి. సమీప భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. దాన్ని సాధించడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!! -
పాలు లేకుండా వెన్న.. ఇది కదా టెక్నాలజీ అంటే!
వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్‌క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్‌గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు. -
73 సార్లు తిరస్కరించారు : కట్ చేస్తే..రూ. వేలకోట్ల విలువైన కంపెనీలకు సారధి
స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్ పరిశ్రమలో సూపర్‌వుమన్ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం.రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్‌ఫారమ్ ఆఫ్ బిజినెస్‌ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్‌బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.2017లో, కల్రా వారి ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్‌బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.మహిళలకు సందేశం‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’ పెద్ద పెద్ద స్టార్టప్‌లు చేయలేని ఫీట్‌ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు. -
స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
నిధుల లేమి భారతీయ స్టార్టప్ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.ఏకంగా 80 శాతం మంది తొలగింపుపట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.10 వేల మందికి ఉద్వాసనఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్‌లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్‌కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్‌లు సైలెంట్ లేఆఫ్స్ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.మెరుగుపడుతున్న నిధుల సమీకరణ2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం. అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్, అవ్రా క్యాపిటల్‌సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్‌లో ఉంది. -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్‌కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్‌కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్‌హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్‌హస్ట్ సీఎన్‌బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్‌హస్ట్ వివరించారు. -
జనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు ఏడబ్ల్యూఎస్ సాయం!
జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఏడబ్ల్యూఎస్ అంతర్జాతీయంగా జెనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్ఏఐ స్టార్టప్‌కు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్వర్కింగ్ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ సంస్థ నెక్ట్స్వేవ్తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది.భారత్ చెందిన కంపెనీలు ఇవే..ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్ కంపెనీ జియో స్పేషియల్ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సర్వమ్ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్‌అవర్ తయారుచేస్తోంది. క్రాప్ఇన్ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్‌ప్లిక్స్ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మాంగనీజ్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది.