అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్ | Zomato CEO Deepinder Goyal Startup Journey And His Father Words, See Details Inside | Sakshi
Sakshi News home page

అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్

Published Tue, May 21 2024 9:22 PM | Last Updated on Wed, May 22 2024 1:00 PM

Zomato CEO Deepinder Goyal Startup Journey And His Father Words

కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.

దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.

చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్‌ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.

దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement