Deepinder Goyal
-
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. -
సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్‌తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్‌లోని ఓ మాల్‌కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్‌కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్‌లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.డెలివరీ ఏజెంట్‌గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్‌తో ఆర్డర్లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలుదీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్‌ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
జొమాటో ఉద్యోగులకు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లు
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది.శుక్రవారం వారంతపు ట్రేడింగ్ సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో జొమాటో షేర్లు రూ.275.20 వద్ద ముగిశాయి. దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ మొత్తం విలువ రూ.330.17 కోట్లుగా మారింది. మొత్తం ఆప్షన్లలో 11,997,652 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2021’ ప్లాన్ కిందకు వస్తాయి. మరో 116 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2014’ కిందకు వస్తాయి. కంపెనీ వాటిని "ఫుడీ బే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్"గా పేర్కొంది.ఈఎస్ఓపీలు అనేవి ఉద్యోగులకు పరిహారంగా ఇచ్చే కంపెనీ స్టాక్ ఆప్షన్లు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి ప్రోత్సాహకంగా కంపెనీలు స్టాక్ ఆప్షన్లను కేటాయిస్తూ ఉంటాయి. వీటిని ఉద్యోగి కావాలంటే ఈక్విటీ షేర్‌గా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
ఉన్నట్టుండి.. తప్పుకొన్న జొమాటో కోఫౌండర్
జొమాటో సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా సంస్థ నుంచి తప్పుకొన్నారు. కంపెనీలో 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పనిచేసిన ఆమె ఉన్నట్టుండి వైదొలిగారు. ఆకృతి చోప్రా రాజీనామా చేసినట్లు జొమాటో సెప్టెంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది."దీపీ (దీపిందర్ గోయల్).. చర్చించినట్లుగా ఈరోజు సెప్టెంబర్ 27 నుండి అధికారికంగా నా రాజీనామాను పంపుతున్నాను. ఇది 13 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం. ప్రతిదానికీ ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను " అని చోప్రా తన ఎగ్జిట్ మెయిల్లో రాసుకొచ్చారు. దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ అప్లోడ్ చేసింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..బ్లింకిట్ సీఈవో అయిన అల్బిందర్ ధిండా సతీమణే ఈ ఆకృతి చోప్రా. జొమాటోలో ఇటీవల అగ్రస్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరుగా సంస్థను వీడుతున్నారు. వీరి సరసన ఇప్పుడు చోప్రా కూడా చేరారు. కోఫౌండర్ మోహిత్ గుప్తా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత 2023 జనవరిలో మాజీ సీటీవో గుంజన్ పాటిదార్ బయటకు వెళ్లిపోయారు.దాదాపు అదే సమయంలో జొమాటో న్యూ ఇనీషియేటివ్స్ హెడ్, ఫుడ్ డెలివరీ మాజీ చీఫ్ రాహుల్ గంజూ, ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ కూడా నిష్క్రమించారు. పాటిదార్, పంకజ్ చద్దా, గౌరవ్ గుప్తా, మోహిత్ గుప్తా తర్వాత సుమారు రెండేళ్లలో కంపెనీ నుండి నిష్క్రమించిన ఐదో కో ఫౌండర్ చోప్రా. వీరిలో చద్దా 2018లో, గౌరవ్ గుప్తా 2021లో సంస్థను విడిచి వెళ్లారు. -
జొమాటో కొత్త ఫీచర్.. దీపిందర్ వీకెండ్ అప్డేట్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఒకే ఫోన్‌ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.ఈ కొత్త ఫీచర్‌ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్‌లను షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.దీపిందర్ గోయల్ వీకెండ్ అప్డేట్ పేరుతో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్‌కు లక్షకు పైగా వ్యూస్, వేలాదిగా లైక్‌లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.Exciting new weekend update: Group Ordering is now on Zomato!⁰You can now share a link with your friends, and everyone can add to the cart seamlessly, making ordering together faster and easier. No more passing the phone around awkwardly to collect everyone's order 😉We’re… pic.twitter.com/W3SrlwVJR0— Deepinder Goyal (@deepigoyal) August 17, 2024 -
ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమెడియన్ స్వాతి సచ్‌దేవా కాసేపు నవ్వులు పూయించారు. ఇటీవల జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచిన నేపథ్యంలో మృదువుగా జోకులు వేశారు. ఈమేరకు విడుదలైన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఇటీవల జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.5 నుంచి రూ.6కు పెంచినట్లు ప్రకటించింది. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. ఇది నేరుగా కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా జరిగిన జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా మాట్లాడేందుకు స్టేజ్‌పైకి వస్తూ ‘జొమాటో వాళ్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో.. దీనికి మాత్రం ఎలాంటి ఫీజు వసూలు చేయరని ఆశిస్తున్నా’నని అనడంతో అందరూ నవ్వుకున్నారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?ఈ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Swati Sachdeva (@swati.sachdeva95) -
కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటోలో కొత్త ఫీచర్
కస్టమర్ సమస్యలను పరిష్కరించే దిశగా జొమాటో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఆర్డర్ హిస్టరీ కనిపించకుండా చేయడానికి ఇప్పుడు 'డిలీట్ ఆర్డర్' అందుబాటులో తెచ్చింది. కంపెనీ ఈ ఫీచర్ తీసుకురావడానికి గల కారణాన్ని ఈ ఇక్కడ తెలుసుకుందాం..డిలీట్ ఆర్డర్ అనే ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో వివరిస్తూ.. కరణ్ సింగ్ అనే వ్యక్తి అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారని, హిస్టరీ మొత్తం అందులో నిక్షిప్తమై ఉండటం వల్ల తన భార్యకు దొరికిపోతున్నట్లు చెప్పాడు. ఇది చాలామంది సమస్య. ఇప్పుడు మీరు ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా వినియోగించని అని పేర్కొన్నారు. కరణ్ సింగ్ అభ్యర్థన మన్నించి డిలీట్ ఆర్డర్ ఫీచర్ యాడ్ చేయడంతో.. సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.For Karan and many others - you can now delete orders from your order history on zomato. Use it responsibly 🙏Sorry, this took us a bit of time to prioritise and build. This touched multiple systems and microservices. We are rolling it out to all customers as we speak. https://t.co/Vwfr6Fs087 pic.twitter.com/0UMUnDuj0j— Deepinder Goyal (@deepigoyal) July 12, 2024 -
బిలియనీర్ అయిపోయిన దీపిందర్ గోయల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్ క్లబ్‌లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.జొమాటో స్టాక్ బీఎస్ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్‌వర్త్ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్‌కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్‌గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.మధ్యతరగతి కుటుంబం నుంచి..మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్‌ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్‌గా మారింది. -
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్‌లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
జొమాటో గిన్నిస్ రికార్డ్.. సీఈఓపై మండిపడ్డ కునాల్ కమ్రా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల 'ఒకే వేదిక వద్ద అతిపెద్ద ఫస్ట్ ఎయిడ్ లెసన్' నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేశారు.దీపిందర్ గోయల్ ట్వీట్ మీద హాస్యనటుడు 'కునాల్ కమ్రా' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జొమాటో సీఈఓ వారి డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం, వారి పని గంటల గురించి ప్రకటించగలరా?. కానీ ఒక రోజులో ఎన్ని కేజీల బిర్యానీ ఆర్డర్ చేశారో చెప్పగలరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డ్జొమాటో కంపెనీ ఇటీవల తన 4300 మంది డెలివరీ భాగస్వాములకు ఒకే వేదిక మీద ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పించారు. జొమాటో డెలివరీ భాగస్వాములు ఇకపైన ప్రధమ చికిత్స సమయంలో కూడా సహాయం చేయగలరు.. భారతదేశంలోని ఈ ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్, పెద్ద థాంక్స్ అంటూ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు.జొమాటో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఇది పలువురు నెటిజన్లను ఎంతగానో ఆకర్శించింది. కొందరు దీపేందర్ గోయల్‌ను ప్రశంసించారు. ఇది అద్భుతమైన అచీవ్మెంట్.. డెలివరీ భాగస్వాములకు హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Can you declare the no of delivery partners you have with their average income & working hours over the last 3 months?No you can’t But you can tell kgs of biryani ordered in one day. You’re such a hack bro… https://t.co/C4zjZP7CVv— Kunal Kamra (@kunalkamra88) June 13, 2024 -
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్ గోయల్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్టార్టప్ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్లో దీపిందర్ గోయల్ స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ గోయల్ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024 -
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.Deepinder Goyal, ZomatoWhen I started Zomato in 2008, my father used to say “tu janta hai tera baap kaun hai” as my dad thought I could never do a start up given our humble background. This government and their initiatives enabled a small town boy like me to build something… pic.twitter.com/vogdM6v8oT— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 20, 2024 -
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్‌పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్‌ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్‌లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లో 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. -
జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
-
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్‌పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్‌పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్‌ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్‌కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్‌ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్‌వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్‌కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్‌లో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
ఇండియాలోనే మొట్టమొదటి ఆ కారు కొన్న జొమాటో సీఈఓ
-
భారత్‌లో మొదటిసారి ప్రవేశించిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా..
కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్‌గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్ కారు అది. ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు ఆస్టన్ మార్టిన్ బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్ ఇంజిన్‌తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్‌పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్‌ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్‌లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లో 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్‌ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్‌కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే.. -
డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో! బైక్‌పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్‌పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ నాలుగు ఏళ్లలో 15 కిలోలు బరువు తగ్గినట్లు ప్రకరించారు. తన ఫిట్నెస్ ప్రయాణం గురించి ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. 2019లో కోవిడ్ మహమ్మారి విజృంభణకు కొన్ని నెలల ముందు నుంచే తాను పనితోపాటు ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినట్లు దీపిందర్ గోయల్ రాసుకొచ్చారు. అంటే మరీ విపరీతంగా అన్నీ చేయడం కాకుండా చిన్న చిన్నగా స్థిరత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. తాను 2019లో ఎలా ఉన్నాడో.. 2023 ఎలా మారాడో ఫొటోలను జత చేశారు. గోయల్ తన శరీరంలోని కొవ్వును 28 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించగలిగారు. 2019లో 87 కిలోల బరువున్న ఆయన ఇప్పుడు 72 కిలోలకు తగ్గారు. అలాగే ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను కూడా గణనీయంగా తగ్గించుకున్నారు. 2019లో 165 mg/dL ఉన్న చెడు కొలెస్ట్రాల్ ప్రస్తుతం 55 mg/dL కు తగ్గింది. అదేవిధంగా గుండె జబ్బుకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ 185 mg/dL నుంచి 86 mg/dLకి తగ్గాయి. ఇక బ్లడ్ షుగర్ కూడా 6.2 నుంచి 4.8కి తగ్గిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ ChatGPT Diet Plan: చాట్‌జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు! కాగా దీపిందర్ గోయల్ చేసిన ఈ పోస్టు అనేక మంది యూజర్లను విశేషంగా ఆకర్షించింది. దీనిపై పలువురు ఫాలోవర్లు తమ నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. దేశం మొత్తం జొమాటో నుంచి ఆర్డర్ చేస్తుంటే దాని సీఈవో మాత్రం ఇంటి ఫుడ్ తింటున్నారని ఓ యూజర్ చమత్కరించారు. ఈ అద్భుతమైన పరివర్తన వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కోరుతూ ఓ ఫాలోవర్ చేసిన కామెంట్‌పై దీపిందర్ గోయల్ ప్రతిస్పందించారు. స్థిరత్వమే రహస్యంమని రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal)