ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్ క్లబ్‌లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.
జొమాటో స్టాక్ బీఎస్‌ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్‌లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్‌వర్త్ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్‌కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.
జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్‌గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.
మధ్యతరగతి కుటుంబం నుంచి..
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్‌ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment