billionaire
-
'కృతజ్ఞత' అంటే ఇదే కదా..!
మనం ఎవరి వల్ల అయినా సాయం పొందితే దాన్ని తిరిగి చెల్లించగలిగే స్థాయి చేరుకున్నాక గుర్తుపెట్టుకుని తిరిగి ఇవ్వాలంటారు పెద్దలు. అయితే అందరూ ఇలా గుర్తించుకుని కృజ్ఞతను చాటుకోరు. కొందరూ మాత్రం అంతకు మించి అన్నట్లుగా దాతృత్వ కార్యక్రమాలతో ఆశ్చర్యపరుస్తారు. పొందిన సాయం అణువంతా అయినా ఆకాశంతా స్థాయిలో కృతజ్ఞత చూపి గుండెల్లో నిలిచిపోతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ చైనాకు చెందిన మాజీ సీఈవో.చైనా(China) ఈ-కామర్స్ దిగ్గజం జేడీ డాట్ కామ్(e-commerce giant JD.com) వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో(former CEO ) బిలియనీర్(billionaire ) రిచార్డ్ లియు క్వియాంగ్డాంగ్(Richard Liu Qiangdong) చైనా నూతన ఏడాది ప్రారంభానికి ముందు తన స్వస్థలంలోని నివాసితులకు లక్షల్లో ఖరీదు చేసే బహుమతులను అందించి వార్తల్లో నిలిచారు. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి గ్రామస్తుడికి సుమారు లక్ష రూపాయలకు పైనే విలువ చేసే నగదుని బహుమతిగా అందజేశారు. దీంతోపాటు ప్రతి ఇంటికి ఆహారం, బట్టలు, గృహోపకరణాలను అందజేశారు. అతను ఇలా 2016 నుంచి దాతృత్వ కార్యక్రమాలను చేస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నాడు. ఆ గ్రామమే ఎందుకంటే..గ్వింగ్మింగ్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో జన్మించాడు రిచార్డ్. 1990ల సమయంలో చైనా రెన్మిన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం బీజింగ్ వెళ్లేందుకు తగిన డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు గ్రామస్తులంతా సమావేశమై అతని ట్యూషన్ ఫీజులకు నిధులు సమకూర్చారు. దీంతో అతడు ఉన్నత చదువులను చదువుకోగలిగాడు. ఆ గ్రామస్తులంతా కలిసి క్వియాంగ్డాంగ్కి ఆనాడు ఇచ్చిన మొత్తం సుమారుగా రూ. 5 వేలు. కానీ ఆ చిన్న మొత్తం ఆ రోజు ఇచ్చేందుకు వారంతా ముందుకురాకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదంటాండు మాజీ సీఈవో రిచార్డ్. అది గుర్తించుకునే ఆ గ్రామానికి ఇలా ప్రతి ఏటా విలువైన నగదు, గృహపకరణాల రూపంలో సాయం అందిస్తుంటారు. ఈ దాతృత్వ సేవను కొనసాగించేందుకు తన బృందాన్ని ఆగ్రామంలోకి పంపించి గ్రామస్తుల గృహ రిజిస్ట్రీ, గుర్తింపు పత్రాలను సేకరించి వారు ఆ గ్రామానికి చెందిన వారని నిర్థారించుకుని రిచార్డ్ సాయం అందేలా మార్గం సుగమం చేస్తారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా అతడి దాతృత్వాన్ని మర్చిపోలేమని, మా పట్ల అతడు చూపించే దయ అపారమైందంటూ రిచార్డ్పై ప్రశంసలజల్లు కురిపించారు. అతడు ఈ సేవలను భవిష్యత్తులో కొనసాగించకపోయినా కూడా..అతడు ఇప్పటి వరకు చేసిన సాయాన్ని, కృజ్ఞతను మర్చిపోమని భావోద్వేగంగా చెబుతున్నారు గ్రామస్తులు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
తల్లి బాటలో కూతురు.. వేలకోట్లకు వారసురాలు!
భారతదేశంలో అత్యంత సంపన్నులైన వ్యాపారవేత్తల జాబితాలో 'లీనా తివారీ' ఒకరు. బహుశా ఈ పేరు కొంతమందికి పరిచయమే అయినా.. ఈమె కుమార్తె 'అనీషా గాంధీ తివారీ' (Aneesha Gandhi Tewari) గురించి బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆమె గురించి తెలుసుకుందాం.అనీషా గాంధీ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్డీ(PhD) పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత అనీషా యూఎస్వీ బోర్డ్‌కు డైరెక్టర్లలో ఒకరుగా చేరారు.యూఎస్వీ (USV) అనేది పార్మాస్యుటికల్ కంపెనీ. దీనిని లీనా తివారీ తన తండ్రి 'విఠల్ గాంధీ' 1961లో రెవ్లాన్ సహకారంతో ప్రారంభించారు. ఇది లీనా సారథ్యంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నేడు, ఈ కంపెనీ కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగంలో భారతదేశంలోని మొదటి ఐదు సంస్థలలో ఒకటిగా నిలిచింది.లీనా తివారీముంబై యూనివర్సిటిలో గ్రాడ్యుయేట్, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన 'లీనా తివారీ' USV ఇండియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈమె రూ. 11వేలకోట్ల కంటే ఎక్కువ నికర విలువతో.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈమె అనేక దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇందులో భాగంగానే వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించే విద్యా కార్యక్రమాలపై దృష్టి సారించారు. -
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
ప్రియురాలితో బెజోస్ పెళ్లి.. ఖర్చు అన్ని వేలకొట్లా?
అమెజాన్ ఫౌండర్, ప్రపంచ ధనవంతులలో రెండో వ్యక్తి 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు. ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. కాగా 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం 2019లో నిజమని తెలిసింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 55 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంది. 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య 'మెకంజీ స్కాట్'కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచ కుబేరుడైన ఇలాన్ మస్క్ తరువాత, రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ నికర విలువ 244 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ. -
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్‌లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్‌లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్‌లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
బ్యాంకులో ఉద్యోగం.. రోజూ ఒకటే సూట్: మస్క్ తల్లి ట్వీట్
'ఇలాన్ మస్క్' (Elon Musk).. ఈ పేరుకు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన దిగ్గజ కంపెనీల సారధిగా మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరుడు కూడా. ఇటీవలే మస్క్ 400 బిలియన్ డాలర్లను దాటేసి.. సంపదలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. నేడు లక్షల కోట్ల సంపదకు అధినేత అయిన మస్క్ ఒకప్పుడు కేవలం ఓ సూట్ మాత్రమే కలిగి ఉండేవారని 'మాయే మస్క్' పేర్కొన్నారు.కొడుకు 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన సందర్భంగా మస్క్ తల్లి మాయే మస్క్.. తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఒకప్పుడు తాము ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. 1990లో మస్క్ బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలో రోజూ ఒకే సూట్ ధరించేవాడు. ఎందుకంటే అప్పట్లో నేను రెండో సూట్ కొనే స్తోమతలో లేదని మాయే మస్క్ పేర్కొన్నారు. ఆ సూట్ ధర 99 డాలర్లు. ఆ సూట్లో మస్క్ తీసుకున్న ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.నా పిల్లల చిన్న తనంలో కొత్త బట్టలు కొనివ్వడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, అందుకే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనిచ్చేదాన్ని అని.. మాయే మస్క్ వెల్లడించారు. తినడానికి ఆహారం లేని సమయంలో.. కేవలం బ్రేడ్ మాత్రమే పెట్టాను. దాన్నే వారు ఇష్టంగా తినేవారు. అయితే తన తెలివితో నేడు ప్రపంచ కుబేరుడుగా ఎదిగాడు. మస్క్‌ను ధనవంతుడు అనడం కంటే.. మేధావి అంటే చాలా సంతోషిస్తాను అని ఆమె పేర్కొన్నారు.మాయె మస్క్ తన భర్త ఎర్రోల్ మస్క్ (Errol Musk) నుంచి విడాకులు తీసుకున్న తరువాత ముగ్గురు పిల్లలను చాలా కష్టపడి పెంచినట్లు వెల్లడించారు. ఎన్నో సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటూ.. ముగ్గురు పిల్లలను గొప్పవారిగా తీర్చిదిద్దారు. మస్క్ ఫ్యామిలీ మొదట సౌత్ ఆఫ్రికా నుంచి కెనడాకు వెళ్ళింది. ఆ తరువాత అమెరికాలో స్థిరపడింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!400 బిలియన్ డాలర్లు దాటేసిన మస్క్బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.This photo was taken in our rent-controlled apartment in Toronto, with my mom‘s painting on the wall. The suit cost $99 which included a free shirt, tie and socks. A great bargain! He wore this suit every day to his bank job in Toronto. I couldn’t afford a second suit. We were… https://t.co/jh2SHOXwpe— Maye Musk (@mayemusk) December 12, 2024 -
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్ కారును చాలా తక్కువ మంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జాబితాలో నటుడు రణబీర్ కపూర్ ఉన్నారు. ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఈ కారులోని 6 లీటర్ డబ్ల్యు 12 ఇంజిన్ 650 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ కారులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: జస్ట్ నిద్రపోయాడంతేగా.. ఉద్యోగిని తీసేసిన కంపెనీకి రూ.41 లక్షల ఫైన్దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ కారును కలిగి ఉన్నారు. ఇది కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, పోర్స్చే 911 కారెరా ఎస్, లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటి కార్లు గోయల్ గ్యారేజిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
ఐరన్ మ్యాన్ డ్రెస్‌లో మస్క్: ఫోటో వైరల్
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందులో మస్క్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్నట్లు చూడవచ్చు.ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న మస్క్ ఫోటో షేర్ చేస్తూ.. శత్రువులను ఓడించడానికి అని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఓహ్ మిమ్మల్ని మీరు జోకర్ అని పిలుచుకుంటున్నారా?.. అయితే జోక్ ఎందుకు జోక్ చెప్పడం లేదు.. ఇదెంత హాస్యాస్పదం అని కూడా అన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మస్క్‌ని తదుపరి ఐరన్ మ్యాన్‌గా ఊహించారు. మరికొందరు ఐరనీ మ్యాన్: మీమ్ వార్ త్వరలో థియేటర్లలోకి రానుంది అని కామెంట్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ నువ్వెప్పుడూ ఒక్క జోక్ కూడా చెప్పలేదు అని అన్నారు.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తరువాత.. మస్క్ సంపద భారీగా పెరిగింది. టెస్లా స్టాక్ కూడా ఏకంగా 40 శాతం పెరిగిందని, దీంతో ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం మీద 340 బిలియన్ డాలర్లు దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కూడా మస్క్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.I will use the power of irony to defeat villains!“Oh you call yourself “The Joker”, then why can’t you tell a joke! How ironic …” pic.twitter.com/6HZ1sLkBAj— Elon Musk (@elonmusk) November 24, 2024 -
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్విల్లే జాగ్వార్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుల్హామ్ ఎఫ్‌సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్‌కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్‌కేబ్'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు. -
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్‌గా జుకర్‌బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్‌బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్‌బర్గ్ టేబుల్‌పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్‌ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్‌గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్‌బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్‌పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్మెన్లలో ఒకరైన పెరల్ కపూర్‌కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.మధ్యతరగతి కుటుంబం నుంచి..పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో రాణించిన పెరల్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో సీటు సాధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో ఎంఎస్ఈ చేశారు. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్‌సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్‌ను స్థాపించారు.ఇంటర్న్‌షిప్‌లతో ప్రారంభంపెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్‌లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్‌ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.నిరాడంబర జీవనశైలి పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్‌తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు. -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్‌కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
సల్మాన్ చేతికి ఖరీదైన రూ.42 కోట్ల వాచ్..
-
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
అనుకున్నది సాధించాలనే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. ''సక్సెస్''.. వినటానికి చిన్న పదమే అయినా సాధించాలంటే సంవత్సరాలు పడుతుందని ఎంతోమంది నిజ జీవితంలో నిరూపించి చూపించారు. అయితే విజయం సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'లీ థియామ్ వా' (Lee Thiam Wah). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటనేది ఇక్కడ చూసేద్దాం..మలేసియాకు చెందిన 'లీ థియామ్ వా' 99 స్పీడ్ మార్ట్ వ్యవస్థాపకులు, యజమాని. నిజానికి ఈయనకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి కారణంగా రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటం చేత.. లీను ఆరేళ్ళు మాత్రమే పాఠశాలలో చదివించగలిగారు. ఆ తరువాత లీ చదువుకోలేకపోయారు.చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలానే తపనతో లీ థియామ్ వా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం స్టార్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఓ కిరాణా దుకాణం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బు పొదుపు చేసారు. ఆ తరువాత అనుకున్న విధంగానే కిరాణా దుకాణం మొదలుపెట్టారు. అదే అనతి కాలంలో '99 స్పీడ్ మార్ట్'గా అవతరించింది. ఎంతో శ్రమించి ఈ స్టోర్లను మలేషియా మొత్తం విస్తరించగలిగారు.వైకల్యం కారణంగా నాకు ఎవరూ పని ఇవ్వరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన లీ ప్రయాణం నేడు ధనవంతుణ్ణి చేసింది. విజయం సాధించాలంటే అంగవైకల్యం అడ్డుకాదని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన లీ.. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.60 ఏళ్ల లీకు చెందిన 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ బీహెచ్డీ, కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసింది. ఏడు సంవత్సరాలలో ఇదే ఏకంగా 531 మిలియన్ డాలర్లను సేకరించింది. ఐపీవో స్టాక్ మొదటిరోజే 15 శాతం పెరగడంతో లీ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన మలేషియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా నిలిచారు.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్న మహాకవి శ్రీ శ్రీ మాటలు నిజం చేసి ఎంతోమందికి ఆదర్శనంగా నిలిచిన వ్యక్తులలో మలేసియా కుబేరుడు 'లీ థియామ్ వా' ఒకరు. ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. -
అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. -
ముంబైలో 'యోహాన్ పూనావాలా' కొత్త ఇల్లు: ఎన్ని కోట్లో తెలుసా?
బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా, అతని భార్య మిచెల్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన భవనం విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. ఈ విశాలమైన.. విలాసవంతమైన భవనం ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటి. దీనిని 'పూనావాలా మాన్షన్' అని పేరు పెట్టారు.యోహాన్ పూనావాలా.. పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన తండ్రి జవరాయ్ పూనావల్లా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్. కాబట్టి యోహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. యోహన్ భార్య మిచెల్ పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్.రూ.500 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త భవనం విశాలమైన లేఅవుట్స్, విశాలమైన డాబాలను కలిగి ఉంది. ఇందులో కొంత భాగాన్ని పూనావాలా ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇందులో మిచెల్ ఆయిల్ పెయింటింగ్‌లు, ఇతర విలువైన మొక్కలు ఉంటాయి.ముంబైలో ఆస్తులను కలిగి ఉన్న ప్రముఖులుదక్షిణ ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్లీ 'ఓంకార్ 1973' ప్రాజెక్ట్‌లో 34 కోట్ల విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను, రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ 30 కోట్ల ఆస్తిని & యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ నిర్మాత, డైరెక్టర్ 'దినేష్ విజన్' కూడా ముంబైలోని 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని, అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ముకేశ్ అంబానీ ఫ్రెండ్.. 'ఆనంద్ జైన్' గురించి తెలుసా?
అంబానీ రిలయన్స్ కంపెనీ ఎదగటానికి కారకులైన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోడీ'. ఈయన మాత్రమే కాకుండా సంస్థ ఎదుగుదలకు పాటుపడిన వ్యక్తి, ముకేశ్ అంబానీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనే 'ఆనంద్ జైన్'. ధీరూభాయ్ అంబానీ మూడవ కొడుకుగా పిలువబడే ఆనంద్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.1975లో జన్మించిన ఆనంద్ జైన్.. జై కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఈయనను అందరూ ముద్దుగా ఏజే అని పిలుచుకుంటారు. ఆనంద్ జైన్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో విడదీయరాని అనుబంధం ఉంది. వీరిరువురు చిన్నపాటి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో వీరు కలిసి చదువుకున్నారు.నిజానికి ఆనంద్ జైన్ ఒకప్పటి బిలినీయర్. 2007లో ఈయన 4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 11వ సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2023 మార్చి నాటికి జైన్ ఆదాయం రూ. 600.7 కోట్లు. ఈయన కంపెనీ సుమారు 13 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తోంది.ఇదీ చదవండి: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?జైన్ ముఖేష్ అంబానీకి వ్యూహాత్మక సలహాదారుగా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో, ప్రధాన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతను ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టీల బోర్డులో కూడా పనిచేశారు.ఆనంద్ జైన్ ముంబై యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ఈయన భార్య సుష్మ. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 కో-ఫౌండర్ 'హర్ష్ జైన్'. ఆనంద్ జైన్ మంచి స్నేహితుడిగా, వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ రాణించారు.