World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇస్తానా నూరుల్ ఇమాన్..
నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం.
నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు..
ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్..
అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్..
ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు.
ఇదీ చదవండి: అకౌంట్‌లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు
ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్‌రూమ్‌లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment