Sultan
-
బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్ తన నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మోదీకి అందించిన లంచ్ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్ సూప్ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పీస్ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్ చేశారు. Quiche, Truffle at the Istana Nurual Iman 🙏🌸🙏 pic.twitter.com/noCRlMJKCn— India in Brunei (@HCIBrunei) September 4, 2024అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్ కలర్, గోల్డ్ డిజైన్‌తో ఉన్న ప్లేట్లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.Official Luncheon by His Majesty in honour of Prime Minister Shri Narendra Modi Ji in Brunei Darussalam 🇮🇳 🇧🇳 🙏@narendramodi @PMOIndia @borneo_bulletin @MediaPermata pic.twitter.com/A0o6UwX5zf— India in Brunei (@HCIBrunei) September 4, 2024 (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
India-Oman Relations: సరికొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత్–ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్‌లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు. పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు. భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్‌ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్‌ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్‌లోని డోర్చెస్టర్ హోటల్లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్‌ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్‌కు ఇచ్చానని పేర్కొన్నాడు. పటౌడీ ప్యాలెస్ కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్‌ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్‌కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్‌లు , డైనింగ్ రూమ్‌లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు. -
వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే!
లక్నో: సాధారణంగా షాపింగ్ మాల్స్‌లు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్ సేల్స్, గిప్ట్ కూపన్స్, వన్ ప్లస్ వన్ ఇలా అనేక మార్గాల్లో కస్టమర్లను తమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో మాల్స్‌ల మధ్య విపరీత పోటీ పెరిగింది. అయితే, కొత్త పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి మాల్స్ నిర్వాహకులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం కస్టమర్లు తమ వైపునకు తిప్పుకోవడమే. తాజాగా, కోల్‌కతాకు చెందిన ‘సుల్తాన్’ అనే ఒక షాపింగ్ మాల్ నిర్వాహకులు కాస్త వెరైటీగా ఆలోచించారు. ఈ షాపింగ్ మాల్ షేర్వాణి, వివాహ వేడుకల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు పెట్టింది పేరు. ఇక్కడ సంప్రదాయ దుస్తులు అనేక వెరైటీల్లో లభిస్తాయి. వీరు స్థానికంగా ఒక పత్రికలో వెరైటీ యాడ్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా తప్పిపోతే బాధితుల తరుపు వారు మిస్సింగ్ (కనబడుట లేదు) అనే ప్రకటన ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా షాప్ నిర్వాహకులు కూడా ‘మజ్ను మిస్సింగ్’ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే.. ‘ మజ్ను.. మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ వివాహం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎంతగానో మెచ్చే ‘సుల్తాన్’ షాపింగ్ మాల్లోనే మీ పెళ్లి వేడుక కోసం షాపింగ్ చేద్దాం. ఎప్పటిలాగే షాపింగ్ మాల్స్‌లో అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్ సదుపాయానికి కూడా ఎలాంటి ఇబ్బందిలేదు. మీకు నచ్చిన షేర్వాణి కొనుక్కుందామంటూ ప్రకటనలో పొందుపర్చారు. అయితే, ప్రకటన పూర్తిగా చదివితేనే ఈ యాడ్ అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా చదవని వారు మాత్రం ఎవరో కనిపించకుండా పోయారని భావిస్తారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. మీ క్రియేటివిటీకి హ్యట్సాఫ్..’, ‘ఎలా వస్తాయ్ బాబు... ఇలాంటి ఐడియాలు..’, ‘ ఇదో రకం మార్కెటింగ్ స్ట్రాటజీ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Such an amazing ad! 😂😂😂 pic.twitter.com/g1fcE0WsJB — meghnad 🔗 (@Memeghnad) December 27, 2021 చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా -
జై సుల్తాన్ అంటున్నారు!
‘‘చాలా రోజుల తర్వాత ‘సుల్తాన్’ వంటి మాస్ సినిమా చేశా. కుటుంబ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మహిళా ప్రేక్షకులు ఫైట్స్ బాగున్నాయని అంటుంటే, పిల్లలు మాత్రం ‘జై సుల్తాన్’ అంటున్నారు. తెలుగులో నా కెరీర్లో ‘సుల్తాన్’ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని హీరో కార్తీ అన్నారు. భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాని తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను ఏప్రిల్ 2న విడుదల చేశారు. హైదారాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్తీ మాట్లాడుతూ– ‘‘వంద మంది రౌడీలను మంచివారిగా మార్చడమే ఈ సినిమా.. వారిని మార్చే క్రమంలో వ్యవసాయం చేస్తే ఎవ్వరి దగ్గరా పని చేయాల్సిన అవసరం లేదనే పాయింట్ ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అయ్యింది. మా అన్నయ్య (సూర్య), వదిన (జ్యోతిక) సినిమా చూసి.. 100 మందిని ఎలా మేనేజ్ చేశారు? అని అడిగారు. ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘సుల్తాన్’ సినిమా వెనక ఎస్ఆర్ ప్రభు, భాగ్యరాజ్, కార్తీ వంటి ముగ్గురు సుల్తాన్లు ఉన్నారు. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు వరంగల్ శ్రీను. ‘‘సుల్తాన్ సినిమాకి మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీ’’ అన్నారు నిర్మాత ఎస్ఆర్ ప్రభు. ‘‘సుల్తాన్’ కి తమిళ్లో, తెలుగులో చాలా మంచి స్పందన వస్తోంది’’ అన్నారు భాగ్యరాజ్ కణ్ణన్. ‘‘ఈ సినిమాలో డైలాగులు స్ట్రయిట్ తెలుగు సినిమాలా ఉన్నాయంటుంటే హ్యాపీ’’ అన్నారు మాటల రచయిత రాకేందు మౌళి. -
రికార్డులు తిరగరాస్తున్న 'టైగర్'.. భారీ వసూళ్లు!
ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మూడోరోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'టైగర్ జిందా హై' ఘనత సొంతం చేసుకుంది. 'బాహుబలి-2' తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్‌కు కొత్త జీవం నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 33 కోట్లు, రెండోరోజు శనివారం రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆదివారం ఏకంగా 45.53 కోట్లు కలెక్ట్ చేసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నేడు క్రిస్మస్ సందర్భంగా సోమవారం కూడా సెలవు కావడంతో ఈ సినిమా ప్రారంభ వసూళ్లు మరింతగా దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దూసుకుపోతున్న 'టైగర్ జిందా హై' సినిమా మూడురోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలుచేసిందని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అసాధారణరీతిలో వసూళ్లు రాబడుతున్న 'టైగర్ జిందా హై'.. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సినిమా 'సుల్తాన్' రికార్డులను తిరగరాసింది. సుల్తాన్ మూడురోజుల్లో రూ. 104 కోట్లు వసూలుచేయగా.. టైగర్ అంతకుమించి రాబట్టడం గమనార్హం. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్. -
స్టార్ కోచ్
-
ఆమిర్... నువ్వంటే ద్వేషం!
సల్మాన్! నీ ‘ద్వేషం’లో నేను ‘ప్రేమ’నే చూశా. నిన్ను ద్వేషిస్తున్నంతగానే... ప్రేమిస్తున్నాను – ఆమిర్ యాభై ఏళ్ల వయసులో బాడీ మేకోవర్ అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో కృషి, తపన ఉంటేగానీ సాధ్యం కాదు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ యాభైఏళ్లలోనూ బాడీ మేకోవర్ చేసి అందర్నీ ఔరా! అనిపించారు. సల్మాన్, ఆమిర్ మల్లయోధులుగా చిత్రాలు ప్రకటించినప్పటి నుంచే వాళ్ల ఫిజిక్, పెర్ఫార్మెన్స్పై అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ‘సుల్తాన్’ విడుదలై ఘనవిజయం సాధించి మాంచి వసూళ్లు రాబట్టింది. ‘సల్మాన్ సూపర్’ అని అందరూ అన్నారు. ఇప్పుడు విడుదలైన ఆమిర్ ‘దంగల్’ చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆమిర్ మేకోవర్కి ప్రశంసలు లభిస్తున్నాయి. అభినందించిన వాళ్లల్లో సల్మాన్ కూడా ఉన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ‘దంగల్’ చూశా. ‘సుల్తాన్’ కన్నా ఇదే బాగుందన్నారు. ఆమిర్.. వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టం. అయితే వృత్తిపరంగా మాత్రం ద్వేషం’’ అని సల్మాన్ సరదాగా చమత్కరించారు. సల్మాన్ చేసిన ఫన్నీ ట్వీట్‌కి అంతే ఫన్నీగా ఆమిర్ కూడా ట్విట్టర్ ద్వారా పై విధంగా సమాధానం ఇచ్చారు. -
నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా!
రెజ్లింగ్ నేపథ్యంతో సినిమాలు తీసున్నామని, అవి 2016లో విడుదల చేస్తామని ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రకటించినప్పుడు ఒకింత ఆసక్తితోపాటు ఆశ్చర్యపరిచింది. సల్మాన్ ’సుల్తాన్’, ఆమిర్ ’దంగల్’ చిత్రాల్లో ఎవరి సినిమా విజేతగా నిలుస్తుందన్న చర్చ జరిగింది. సల్మాన్ ’సుల్తాన్’ మొదట విడుదలైంది. భారీ కలెక్షన్లతో ఊహించినట్టుగానే ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సుల్తాన్ అలీఖాన్ అనే వ్యక్తి ఉత్థానపతనాలు ఇతివృతంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ’దంగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ఫూర్తిదాయకంగా మలిచిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రివ్యూలు రావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ ఏడాది వచ్చిన సుల్తాన్, దంగల్ సినిమాల్లో ఏది అత్యుత్తమ సినిమా అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఈ చర్చపై ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. తన సుల్తాన్ సినిమా కన్నా దంగల్ ఎంతో బాగుందని కితాబిచ్చాడు. ఆమిర్ వ్యక్తిగతం ప్రేమించినా.. వృత్తిపరంగా ఆయనను ద్వేషిస్తానంటూ ట్విస్టు ఇచ్చాడు. ’మా కుటుంబం ఈ రోజు దంగల్ సినిమా చూసింది. ఇది సుల్తాన్ కన్నా ఎంతో బాగుంది. ఆమిర్, నిన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నా.. కానీ వృత్తిపరంగా ద్వేషిస్తున్నా’ అంటూ సల్మాన్ చేసిన ట్వీట్ నెటిజన్లను అలరిస్తోంది. My Family saw #Dangal today evening and thought it was a much better film than #Sultan. Love u personally Aamir but hate u professionally ! pic.twitter.com/sJlDG7u95c — Salman Khan (@BeingSalmanKhan) 22 December 2016 -
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
-
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్ ఇండియా ట్రెండింగ్ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్ హవా సాగింది. కబాలి, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఉడ్తా పంజాబ్, పాకిస్తాన్ నటులు ఉన్నారని విడుదలను ఆపేయాలన్న మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’, రుస్తుమ్, సైరత్, మొహంజోదారో మూవీలకు సంబంధించిన వీడియోలు, వార్తలు గూగుల్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో రజనీకాంత్ మూవీ కబాలి నిలిచింది. హీరోల్లో సుశాంత్ రాజ్‌పుత్.. హీరోయిన్లలో దిశా పటానీ ధోనీ జీవిత కథాంశంతో వచ్చిన మూవీలో తెరపై ధోనీ పాత్రలో మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మోస్ట్ బాలీవుడ్ ట్రెండింగ్ మేల్ ఆర్టిస్టుగా నిలిచాడు. కబీర్ బేడి, హర్షవర్ధన కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సూరజ్ పంచోలీ, అనుపమ్ ఖేర్ టాప్-10 సెర్చింగ్ బాలీవుడ్ నటుల జాబితాలో ఉన్నారు. దిశా పటానీ టాప్ ట్రెండింగ్ హీరోయిన్గా నిలిచింది. పుజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా, ఉర్మిలా మండోద్కర్, మందన కరిమి, వాణీ కపూర్, సయామీ ఖేర్, నిమ్రత్ కౌర్ టాప్ 10 ఫీమెల్ ఆర్టిస్టులలో చోటు దక్కించుకున్నారు. -
ఆడికారు ధర కంటే ఈ గుర్రమే ఎక్కువ
బైకులు, కార్లు, విమానాలు వచ్చాక నేటి ఆధునిక సాంకేతికయుగంలో గుర్రాల వాడకం క్రమంగా తగ్గిపోయి ఉండొచ్చు కానీ హరియాణలోని ఓ స్వచ్ఛమైన మేలి జాతి గుర్రం ‘సుల్తాన్’ ఆడి కారు కంటే అధిక ధర పలికింది. ఈ గుర్రం కోసం కొందరు ఏకంగా 51 లక్షల రూపాయలు ఇస్తామని యజమాని గుర్వీందర్ సింగ్‌కు ఆఫర్ చేశారు. సుల్తాన్‌ను సొంత కొడుకులా భావించే యజమాని ఈ ఆఫర్‌ను తిరస్కరించాడు. 41 లక్షల రూపాయలు పెడితే ఆడి ఏ 4 కారు వస్తుంది. అయితే ఆడి కారు కంటే గుర్రమే తనకు ప్రాణమని గుర్వీందర్ చెబుతున్నాడు. హరియాణాలోని కర్నల్ జిల్లాలో డబ్రీ అనే గ్రామంలో నుక్రా జాతికి చెందిన ఈ తెల్లటి గుర్రం అందర్నీ ఆకర్షిస్తోంది. పానిపట్‌లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీల్లో ఈ గుర్రం విజేతగా నిలిచింది. 2012లో కూడా జాతీయ చాంపియన్‌గా నిలిచింది. కర్నల్ జిల్లా సహా ఎక్కడ గుర్రపు పందేలు జరిగినా సుల్తాన్‌దే విజయం. 15 చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచింది. సుల్తాన్ చూసి డబ్రీ గ్రామస్తులు గర్వంగా భావిస్తున్నారు. ఈ గుర్రం సంరక్షణ బాధ్యతలు చూడటానికి గుర్వీందర్ ఓ వ్యక్తిని నియమించాడు.ఈ గుర్రం కోసం ప్రతి నెలా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సుల్తాన్ సాధారణ ఆహారంతో పాటు రోజుకు ఐదు లీటర్ల ఆవు పాలు, 100 గ్రాముల నెయి తీసుకుంటుంది. అంతర్జాతీయ పోటీల్లో సుల్తాన్ పాల్గొనేందుకు గుర్వీందర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. -
టేబుల్ టెన్నిస్‌కు పూర్వవైభవం
విజయవాడ స్పోర్ట్స్ : నవ్యాంధ్రలో టేబుల్ టెన్నిస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ తెలిపారు. వరుసగా రెండుసార్లు టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నీల్లో సబ్‌జూనియర్, జూనియర్, యూత్, ఉమెన్ కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచిన 14ఏళ్ల కాజోల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ సోమవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో అభినందించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మెడిసిన్ వంటి చదువుల్లో స్పోర్ట్స్ కోటాలో సీట్లు సంపాదిస్తున్నారన్నారు. చదువు కూడా ముఖ్యం కావడంతో సీనియర్ విభాగంలో చాలావరకు క్రీడాకారులు కొరత ఉంటోందన్నారు. ఇటీవల రాజమహేంద్రవరం, అనంతపురంలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ టోర్నీల్లో కాజోల్ వరుసగా నాలుగు ఈవెంట్లలో గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో కాజోల్ సబ్ జూనియర్ విభాగంలో ఏడోస్థానంలో, మన రాష్ట్రంలో మొదటి ర్యాంకులో నిలిచిందని చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కాజోల్.. తొలుత కేబీఎన్ కళాశాలలోని టీటీ కోచ్ పాండు వద్ద శిక్షణ పొందారని, ప్రస్తుతం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బి.శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. నగరం నుంచి శైలూ నూర్‌బాషా ప్రస్తుతం ఇండోర్‌లో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్, జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటోందన్నారు. పదేళ్లుగా శాప్ నుంచి టేబుల్ టెన్నిస్ కోచ్‌ల రిక్రూట్మెంట్ లేనప్పటికీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కోచ్‌లతోనే నెట్టుకొస్తున్నామన్నారు. అక్టోబరు 20 నుంచి 25వ తేదీ వరకూ విశాఖపట్నంలోని పోర్టు ఇండోర్ స్టేడియంలో నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎస్ఎం సుల్తాన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కరణం బలరామ్, కోచ్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నేనెందుకు పాపులర్ అయ్యానంటే..?
మూడు దశాబ్దాల కెరీర్... అసాధారణమైన విజయాలు.. ఎవరు అందుకోలేని స్టార్డమ్.. కొన్ని వివాదాలు.. ఇవన్నీ కలిస్తే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. భారీ విజయాలతో, కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ కండలవీరుడు.. తనకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందనే విషయమై కొంత ఆసక్తిగా స్పందించాడు. 50 ఏళ్ల సల్మాన్ తాజాగా 'ఓపెన్' మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందనే దానిపై ఎప్పుడైన ఆలోచించారా? ప్రశ్నించగా.. 'అవన్నీ ఎవరు ఆలోచిస్తారు గురూ! నడుస్తోంది కదా నడవనివ్వండి. నేనెందుకు పాపులర్ అవ్వడానికి కారణం.. నాకు అన్ని కొంచెం కొంచెం తెలిసి ఉండటం కావొచ్చు. నాకు కొంచెం డ్యాన్స్, కొంచెం యాక్టింగ్, కొంచెం యాక్షన్ వచ్చు' అని సల్మాన్ బదులిచ్చాడు. తాను సినిమాల్లో పోషించే పాత్ర మంచిదై ఉండాలని, బ్రూస్లీలా మంచికి పాటుపడే పాత్ర, ప్రజలు చూసేందుకు ఇష్టపడే పాత్రను నేను తాను చేయాలనుకుంటానని సల్మాన్ చెప్పాడు. -
మాజీ ప్రధానికి జాబ్ ఆఫర్.. 314 కోట్ల శాలరీ!
సాధారణంగా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వారు ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలో చేసుకుంటారు. లేదా రిటైరయి కాలక్షేపం చేస్తారు. కానీ బ్రెగ్జిట్ దెబ్బకు బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయిన డేవిడ్ కామెరాన్ ఒక్కసారిగా ఖాళీగా మారిపోయారు. ఎంపీగా కొనసాగాలని, వచ్చే ఏడాది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నప్పటికీ.. ఆయనకు మాత్రం ఇతర జాప్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఒకింత వికృతమైన, విస్మయం కలిగించే ఆఫర్ ఆయనకు వచ్చింది. తమ దేశ 'సుల్తాన్'గా ఉండాలని, అందుకు ఏడాదికి 32మిలియన్ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) జీతం ఇస్తామని కజికిస్థాన్ ఆఫర్ చేసింది. అయితే, ఈ పదవికి అర్హుడిగా మారాలంటే ముస్లింల మాదిరిగా 'సుంతి' చేయించుకోవాలని సూచించింది. ఈమేరకు నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్‌ను పంపించడం గమనార్హం. ముస్లిం యూనియన్ అయిన కజకిస్తాన్ ఇలాంటి వ్యంగ్య ప్రహసనాలతో గతంలోనూ వార్తల్లో నిలిచింది. కజకిస్తాన్ నియంత పాలకుడు మురాత్ తెలిబెకోవ్ గతంలోనూ ఇలాంటి వ్యంగ్యోక్తులతో మీడియా దృష్టిని ఆకర్షించారు. దేశాధ్యక్షుడి వయస్సు 80 ఏళ్లు దాటితే ఉరితీయాలని, లంచాన్ని చట్టబద్ధం చేయాలంటూ 76 ఏళ్ల తెలిబెకోవ్ గతంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఎంపీగా కామెరాన్ అందుకుంటున్న వేతనం 74వేల పౌండ్లు మాత్రమే కాబట్టి ఆయన ఈ జాబ్ చేపడితే బాగుంటుందని ఆయన ప్రత్యర్థులు ఛలోక్తులు విసురుతున్నారు. -
సుల్తాన్ మోసపోయాడా ?
-
'సుల్తాన్' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి!
జూలై 6న విడుదలైన సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా వస్తూనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. తొలిరోజే రూ. 36 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ సినిమా.. తొలి వీకెండ్లో రూ.100 కోట్లను తన ఖాతాలో వేసుకొంది. రెండోవారంలోనూ వసూళ్ల ప్రభంజనం కొనసాగడంతో కొన్నిరోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులోనూ 'సుల్తాన్' చేరిపోయింది. సల్మాన్‌ఖాన్, అనుష్క శర్మ జంటగా ఓ మల్లయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతుందని పరిశీలకులు భావించారు. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయ్‌జాన్' తర్వాత దేశంలో రూ. 300 కోట్లు వసూలుచేసిన మరో సినిమాగా 'సుల్తాన్' నిలుస్తుందని ఆశించారు. కానీ, రానురాను 'సుల్తాన్' వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించినప్పటికీ 'సుల్తాన్' రూ. 300 కోట్ల క్లబ్బులోకి ప్రవేశించలేదు. నాలుగో వారం ముగిసేసరికి ఈ సినిమా రూ. 297.56 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అభిమానుల అనుమానం! 'సుల్తాన్' కలెక్షన్ల విషయంలో సల్మాన్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'సుల్తాన్' నిర్మాత అయిన యష్‌రాజ్ ఫిలిమ్స్ (వైఎఆర్ఎఫ్) సంస్థ కావాలనే సినిమా వసూళ్లను తక్కువచేసి చూపిస్తున్నదని మండిపడుతున్నారు. 'సుల్తాన్' సినిమా దేశీయంగా రూ.300 కోట్ల క్లబ్బులో చేరితే.. లాభాల్లో తనకు గణనీయమైన వాటా ఇవ్వాలని సల్మాన్ నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడట. సాధారణంగా బాలీవుడ్ ఖాన్ త్రయం తమ సినిమా లాభాల విషయంలో నిర్మాతతో ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. అదేవిధంగా నిర్మాతతో సల్మాన్ కూడా ఒప్పందం చేసుకున్నాడని, దీంతో 'సుల్తాన్' రూ. 300 కోట్ల క్లబ్బులో చేరకుండా తక్కువ వసూళ్లను నిర్మాత చూపిస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. 'సుల్తాన్ వసూళ్లను తక్కువ చేసి చూపడం మానండి' అంటూ (#YRFStopReducingSULTANFigures) ట్విట్టర్లో సల్మాన్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ట్రేండ్ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్ ఏమంటుందో చూడాలి? -
కబాలి వర్సెస్ సుల్తాన్.. గెలిచిందెవరు?
ఈ సీజన్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు రెండు. అవి సల్మాన్ ఖాన్ సుల్తాన్.. రజనీకాంత్ కబాలి. 'కబాలి' విడుదలయ్యే వరకు సుల్తాన్ బాక్సాఫీసును దున్నేశాడు. రికార్డు వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు. కానీ, కబాలి ఎంట్రీతో సుల్తాన్ సైడ్ అయ్యాడు. కబాలి తన జోరు ఏంటో చూపాడు. రజనీ మానియాలో దేశం ఊగిపోయింది. బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలయ్యాయి. దీంతో సహజంగానే దేశంలో ఎవరు అతిపెద్ద సూపర్ స్టార్ అని చర్చ అభిమానుల్లో మొదలైంది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ అందనంత స్థాయిలో రజనీ హల్చల్ చేశాడు. దేశంలో బిగ్గెస్ట్ స్టార్ సల్మానా? రజనీకాంతా? అన్న చర్చ అభిమానుల మొదలైంది... విడుదలకు ముందే కబాలి సినిమా కనీవినీ ఎరుగని క్రేజ్ సంపాదించుకుంది. దేశం మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అంచనాలు ఆకాశాన్నంటాయి. దీంతో చెన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు విడుదల రోజున సెలవు ప్రకటించాయి. జపాన్ అభిమానులు ఏకంగా విమానంలో చెన్నైకి వచ్చి తొలిరోజు సినిమా చూశారు. విడుదల రోజున ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు షోలు హౌస్‌ఫుల్ నడిచాయి. అభిమానులైతే 'కబాలి' రిలీజ్ నాడు జనజాతర చేశారు. రజనీ కటౌట్లను పాలాభిషేకాలతో ముంచెత్తారు. తొలిరోజు 90శాతం ఆక్యూపెన్సీతో రజనీ తన స్టామినా ఏంటో చూపించాడు. రిలీజ్ మానియా విషయంలో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తేలిపోయింది. రజనీ సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ క్రేజ్.. దేశంలో మరే స్టా్ర్ హీరో సినిమాకూ ఇప్పటివరకు రాలేదు. బాక్సాఫీసు వసూళ్ల విషయానికొస్తే కబాలి అన్ని రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక్క బాహుబలి సినిమా రికార్డును మాత్రం కబాలి చిత్రం అందుకోలేకపోయింది. తొలిరోజు సుల్తాన్ సినిమా రూ. 36.5 కోట్లు వసూలు చేస్తే.. కబాలి ఏకంగా రూ. 48 కోట్లు కొల్లగొట్టింది. చాలా మల్టిప్లెక్స్ థియేటర్లలో తొలిరోజు సుల్తాన్ సినిమా టికెట్లను రూ. 300-350 వరకు అమ్మారు. అదే కబాలి విషయానికొస్తే మల్టిప్లెక్స్ హాల్స్‌లోనూ టికెట్ ధర రూ. 120కి మించలేదు. అయినా సుల్తాన్ రికార్డును కబాలి దాటాడు. ఓవర్సీస్ వసూళ్లు: అంతర్జాతీయ కలెక్షన్ల విషయంలోనూ కబాలి విజేతగా నిలిచాడు. అమెరికా బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా రికార్డులన్నింటినీ కబాలి కొల్లగొట్టింది. ఓవర్సీస్లోనూ సుల్తాన్ రికార్డులను కబాలి అవలీలగా దాటాడు. ప్రమోషన్స్: 'రేప్' వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా ప్రమోషన్లో పెద్దగా పాల్గొనలేదు. ఈ వివాదం వల్ల విలేకరులతోనూ మాట్లాడలేదు. ఇక రజనీకాంత్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నారు. 'కబాలి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన మచ్చుకైనా కనిపించలేదు. సినిమా విడుదలకు నెల ముందే అమెరికాకు వెళ్లిపోయారు. విడుదలయ్యాక వచ్చారు. అయినా రజనీ మానియా దేశాన్ని చుట్టుకుంది. విమానాలపై పోస్టర్ల నుంచి కార్లపై ఫొటోలు, కటౌట్లు, ఆన్లైన్ అమ్మకాలు ఇలా సర్వత్రా రజనీ మ్యాజిక్ అంటే ప్రపంచానికి చూపింది. ఇంతకంటే ప్రూఫ్ కావాలా రజనీ దేశంలో ఎంతపెద్ద స్టారో చెప్పడానికి అంటున్నారు ఫ్యాన్స్.. -
'సుల్తాన్' షేప్ కోసం పూజలు
కాన్పూర్: జస్ట్ చొక్కా విప్పి కండలు చూపెడితేనే సల్మాన్ ఖాన్ సినిమాలు రికార్డులు బద్దలవుతాయి. అలాంటిది ఈ సారి ప్యాంటు కూడా తీసేసి 'సుల్తాన్'గా లంగోటాతో బరిలోకి దిగి, బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆ సినిమా కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరువయ్యాయి. లేటు వయసులోనూ చక్కటి శరీర సౌష్టవంతో ఫ్యాన్స్ ను అలరిస్తున్న సల్మాన్ ఖాన్.. ఫిట్ నెస్ విషయంలో ఎందరికో స్పూర్తి. ఇక ఉత్తరప్రదేశ్ లోనైతే కొందరు పహిల్వాన్లు 'సుల్తాన్' షేప్ కోసం కసరత్తులతోపాటు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు. కాన్పూర్ (యూపీ)లోని చందు అఖడ్ (వ్యాయామశాల)కు చెందిన పహిల్వాన్లు ఇటీవలే 'సుల్తాన్' సినిమా చూశారట. తర్వాతి రోజునుంచే.. ఫిట్ నెస్ కోసం సల్మాన్ సినిమాలో ఏమేం చేశాడో అన్ని ఫీట్లూ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్లు. ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రాక్టీస్ వరకు సరేగానీ సల్మాన్ కు పుజల విషయంలోనే వీరిపై విమర్శలు చెలరేగాయి. -
మూడ్రోజుల్లో 'కబాలి' కలెక్షన్ ఎంతో తెలుసా?
‘కబాలి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి రజనీకాంత్ రుజువు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాను తలదన్నేరీతిలో ‘కబాలి’ తొలి మూడురోజుల్లో వసూళ్లు రాబట్టింది. ‘సుల్తాన్’ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేయగా.. ‘కబాలి’ కూడా తొలి మూడురోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా తొలి మూడురోజుల వసూళ్లు ఎంత అనేది వివరాలు తెలియకపోయినా.. మొదటి మూడురోజుల్లో ‘కబాలి’ వందకోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు. భారీ అంచనాలతో, రజనీ మేనియాతో విడుదలైన ‘కబాలి’ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. మొదటిరోజే రూ. 48 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును దాటేసింది. ‘సుల్తాన్’ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును అధిగమించినప్పటికీ ‘బాహుబలి’ (రూ.50 కోట్లు) రికార్డును ‘కబాలి’ దాటలేకపోయింది. ఇక, రెండో, మూడోరోజున కూడా ‘కబాలి’ సినిమా భారీగా రికార్డు కొల్లగొట్టిందని, నెగిటివ్ టాక్ ఈ సినిమా ప్రారంభ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సినీ పండితులు చెప్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నారని చెప్పారు. సాధారణంగా దక్షిణ భారతంలోనే రజనీ ఫ్యాన్స్ కు ఎక్కువ. ఉత్తర భారతంలో పెద్దగా ఆయన చిత్రాలు ఆడవు. అయితే, ఈ అపప్రథను తాజాగా ‘కబాలి’ దూరం చేసింది. ఉత్తర భారతంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఉత్తర భారతంలో తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 11.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజున తమిళనాడులో రూ. 21.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 13.5 కోట్లు వసూలు చేసింది. -
సల్మాన్ స్పీడు పెంచాడు
గత ఏడాది భజరంగీ బాయిజాన్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఆ రికార్డ్‌కు ఏడాదిలో కాలం చెల్లిపోయింది. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్లుభాయ్ తన రికార్డ్‌ను తానే తిరగరాస్తున్నాడు. ఇప్పటికీ భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే అభిమానులు రికార్డుల లెక్కలేస్తుంటే.., సల్మాన్ మాత్రం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కబీర్ ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ సినిమాకు ఓకె చెప్పేశాడు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ఏక్తా టైగర్, భజరంగీ బాయిజాన్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ట్యూబ్ లైట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో సల్మాన్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన దబాంగ్ సీరీస్‌లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మరోసారి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్వకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను సీక్వల్గా కాకుండా చుల్ బుల్ పాండే పోలీస్ ఎలా అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో ప్రీక్వల్గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటించనుంది. -
ఆన్ లైన్ లో లీక్.. ఆ సిన్మా కొంపముంచింది!
అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'మస్తీ', 'గ్రాండ్ మస్తీ' సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. 'గ్రాండ్ మస్తీ' సినిమా అయితే ఏకంగా వందకోట్లు వసూలు చేసి.. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో వెల్లువెత్తడానికి గేట్లు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో'మస్తీ' సిరీస్ లో వస్తున్న 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమా కూడా బాగా కాసుల వర్షం కురిపిస్తుందని చిత్రయూనిట్ భావించింది. అయితే; 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తన కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నాడు. 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'ని చిత్తుచేస్తూ 'సుల్తాన్' రెండోవారంలోనూ భారీగా వసూళ్లు రాబడుతున్నాడు. రెండో వీకెండ్ మొదటి రోజైన శుక్రవారం ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 7.43 కోట్లు వసూలు చేసింది. దీంతో జూలై 6న విడుదలైన ఈ సినిమా మొత్తంగా దేశంలో రూ. 236.59 కోట్లు వసూలు చేసి.. కలెక్షన్ల పరంగా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. -
నా బయోపిక్ ఎవరూ తీయరు : సల్మాన్ ఖాన్
సుల్తాన్ సినిమాతో ఈద్ బాద్షాగా మరోసారి ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్ భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌కు కొత్త టార్గెట్లు సెట్ చేస్తున్నాడు. వరుస వంద కోట్ల సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగిన సల్లూ భాయ్, సుల్తాన్ ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్ నడుస్తుండటంతో ఓ మీడియా ప్రతినిధి మీ జీవిత కథతో సినిమా చేసే ఆలోచన ఉందా అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా 'నాది చాలా బోరింగ్ లైఫ్. ఇలాంటి బోరింగ్ లైఫ్ మీద సినిమా చేయాలని ఎవరూ అనుకోరు' అంటూ కామెంట్ చేశాడు. ఇతర దర్శక నిర్మాతలు అలాంటి ఆలోచనలో మీమ్మల్ని సంప్రదిస్తే అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'నా జీవితంపై సినిమా తీస్తా అని ఎవరు ముందుకు వచ్చినా నేను అంగకీరించను.. ఎందుకంటే నా కథను రాయాలంటే నేనే రాయాలి. లేదా.. నా తమ్ములు, చెల్లెలు రాయాలి. అన్ని విషయాలు తెలియని వారు కథ తయారుచేయటం సాధ్యం కాద'న్నారు. అంతేకాదు వెండితెర మీద సల్మాన్ పాత్రలో నటించేందుకు ప్రస్తుతం ఉన్న నటులెవ్వరు సూటవ్వరని తెలిపాడు. -
బాహుబలిని దాటేసిన సుల్తాన్
ఒకప్పుడు సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడిందన్న అన్నలెక్కలతో చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా సక్సెస్ ను ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఈ లెక్కలు కీలకంగా మారాయి. ముఖ్యంగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల నుంచి అభిమానులు అదే స్థాయి కలెక్షన్లు ఆశిస్తున్నారు. అభిమానుల ఆశలకు తగ్గట్టు బాలీవుడ్ కండల వీరుడు వరసగా రికార్డ్ లు బ్రేక్ చేస్తున్నాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ వస్తున్న సల్మాన్. హిట్ సినిమా అయితే సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ టాప్ స్టార్ కు టార్గెట్ సెట్ చేస్తున్నాడు. తాజాగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ ను సుల్తాన్ సినిమాతో సల్మాన్ బద్దలు కొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలి వారంలో 185 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. ఇన్నాళ్లు తొలి వారం కలెక్షన్ల విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలి సుల్తాన్ దెబ్బకి రెండో స్ధానానికి పడిపోయింది. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తున్న సుల్తాన్ ముందు మరిన్ని రికార్డులు సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!
-
సుల్తాన్ టీంపై చీటింగ్ కేసు
స్టార్ హీరోల సినిమాలకు వివాదాలు తప్పటం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ వివాదాలు కామన్ అయిపోయాయి. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ సుల్తాన్‌పై వివాదం రేగుతోంది. తన జీవితం ఆధారంగానే సుల్తాన్ సినిమాను తెరకెక్కించారంటూ ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన మొహ్మద్ సాబిర్ అన్సారి అలియాస్ సాబిర్ బాబా, 2010లో తన ఆత్మకథను సల్మాన్‌కు వినిపించాడట. అయితే ఆ సమయంలో ఇదే కథతో సినిమాను రూపొందిస్తే తనకు 20 కోట్ల రూపాయల రాయల్టీ ఇస్తానని సల్మాన్ మాట ఇచ్చాడని, ఇప్పుడు సుల్తాన్ సినిమాను అదే కథతో తెరకెక్కించినా, తనకు ఎలాంటి రాయల్టీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు సాబిర్. అందుకే తనను మోసం చేసిన సల్మాన్ ఖాన్‌తో పాటు ఆ చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్లపై చీటింగ్ కేసు వేశాడు. ఈ నెల 8న ఈ వివాదానికి సంబందించి ముజఫర్‌నగర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సాబిర్ తరుపు న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా కేసు ఫైల్ చేశారు. -
సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!
... హిస్టరీ రిపీట్స్ రంజాన్ పండగకు హీరో సల్మాన్ ఖాన్ సినిమా రిలీజయ్యిందంటే హిట్ గ్యారంటీ. అందుకే ఈ కండలవీరుడు నటించే సినిమాలు ఈ పండుగకే విడుదల కావాలని అభిమానులు కోరుకుంటారు. సల్మాన్‌కి కూడా ఇలా ఈద్ సందర్భంగా సినిమా విడుదల చేయడం ఇష్టమే. మరి... ఈ పండుగకు విడుదలైన ప్రతి సినిమా హిట్టే కాబట్టి, ఆ మాత్రం ఇష్టం ఉండటం కరెక్టే. గతంలో ‘వాంటెడ్’, ‘దబంగ్’, ‘బాడీగార్డ్’, ‘ఏక్ థా టైగర్’, ‘బజరంగీ భాయిజాన్’ చిత్రాలు రంజాన్ కానుకలుగా విడుదలై, బంపర్ హిట్ సాధించాయి. ఈసారి ఈద్‌కి హిస్టరీ రిపీట్ చేసిన చిత్రం - ‘సుల్తాన్’. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలైంది. ఈద్ పండుగకు రెండు రోజుల ముందే ‘సుల్తాన్’ తెరపైకి దూసుకొచ్చి, విజయ విహారం చేస్తున్నాడు. ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడో సంచలనం. అయిదురోజులకే వచ్చేసిన ఖర్చు!..: విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 180 కోట్ల రూపాయలు వసూలు చేయడం గురించి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం దాదాపు 90 కోట్ల రూపాయలని భోగట్టా. కాబట్టి, రిలీజైన బుధవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలోనే బడ్జెట్‌కు రెండింతలు వసూలు చేసిందని హిందీ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వసూళ్లలో దాదాపు 50 శాతం పంపిణీదారులకు, థియేటర్ యజమానులకూ పోతే, మిగతా 50 శాతం నిర్మాతకు దక్కుతుందని ఉజ్జాయింపు లెక్క. అంటే, రిలీజైన వీకెండ్కల్లా సినిమాకు పెట్టిన ఖర్చు వచ్చే సిందనుకోవచ్చు. సోమవారం నుంచి వస్తున్నదంతా లాభాలే. రిలీజైన ఐదు రోజుల్లోనే సినిమా లాభాల బాట పట్టడంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన నిర్మాత ఆదిత్యా చోప్రా ఆనందపడ తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ మల్ల యోధుడిగా కనిపించిన విషయం తెలిసే ఉంటుంది. దీని కోసం బరువు పెరిగి, తగ్గి.. ఇలా రెండు రకాలుగా సల్మాన్ కనిపించి, ఆకట్టుకున్నారు. ఆ శ్రమకు తగ్గ ఫలితమే దక్కింది. వారం లోపే 200 కోట్ల క్లబ్లో...: ఇక.. ఈ సినిమాకి రిలీజ్ వ్యూహం కూడా కలిసొచ్చింది. మామూలుగా వీకెండ్ వసూళ్లు రాబట్టుకోవడానికి శుక్రవారం సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఒక్కోసారి అటూ ఇటూ అవుతుంది. అలాగే, పవిత్ర ఉపవాస దినాలన్నీ అయిపోతాయి కాబట్టి, సర్వసాధారణంగా రంజాన్ పండగ రోజునే సినిమా రిలీజ్ కూడా జరిగేలా చూస్తారు. కానీ, సల్మాన్ ‘సుల్తాన్’ రెండు రోజుల ముందే వచ్చింది. రంజాన్‌ను టార్గెట్ చేసి, 6న రిలీజ్ చేశారు. ఈసారి రంజాన్ ఒక రోజు ఆలస్యమై, 8న రావడం కూడా సినిమాకు బాగా ఉపయోగప డింది. ఆ తర్వాత వారాంతం. దాంతో మంచి వసూళ్లు రాబట్ట గలిగింది. సల్మాన్ గత చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ (2015) శుక్రవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలో రూ. 102 కోట్ల వసూలు చేస్తే, ‘సుల్తాన్’ ఆ మూడు రోజులకీ రూ. 107 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సల్మాన్‌ఖాన్ ‘బజ్రంగీ భాయిజాన్’, ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘పీకే’ ఏడు రోజుల్లో వసులు చేసిన మొత్తాలను (వరుసగా రూ. 182 కోట్లు, రూ. 179 కోట్లు) అయిదు రోజులకే ‘సుల్తాన్’ దాటేయడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 4,350 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి నుంచీ రోజూ సగటున దాదాపు రూ. 36 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులూ ఆ స్థాయి కలెక్షన్సే రాబట్టింది. వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గినా, థియేటర్లలో ‘సుల్తాన్’ పట్టు సడలలేదని సినీ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా రిలీజై, వారం కూడా పూర్తి కాకముందే ‘సుల్తాన్’ 200 కోట్ల క్లబ్లో చేరి, సుల్తాన్ బాక్సాఫీస్ భాయిజాన్ అనిపించుకున్నాడు. అంతర్జాతీయంగా..: విదేశాల్లో కూడా ‘సుల్తాన్’ హవా సాగుతోంది. విదేశాల్లో దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 14 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 96 కోట్లు) వసూలు చేసింది. మన సోదర దేశమైన పాకిస్తాన్లో సైతం ‘ఈద్’ పండుగ ‘సుల్తాన్’కు బాగా కలిసొచ్చింది. ఆ దేశంలో కూడా రూ. 15 కోట్ల పైగా వసూళ్ళు వచ్చినట్లు భోగట్టా. రానున్న రోజుల్లో వచ్చే తదుపరి వసూళ్లను బట్టి ఇది ఏ రేంజ్ చిత్రం అవుతుందో తెలుస్తుంది. ఏమైనా, ఈ ఏటి టాప్ 3 హిందీ చిత్రాల్లో ‘సుల్తాన్’ ఒకటి అవుతుందని బాక్సాఫీస్ పండితులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. -
తెలుగు 'సుల్తాన్' రానా..?
హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రానా. హీరో, విలన్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.., ఓ పాత్ర మీద మనసు పారేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు చేసిన మల్లయోధుల తరహా పాత్రను తాను కూడా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో అమీర్ హీరోగా తెరకెక్కిన దంగల్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు. దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు. కుస్తీ పోటిల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించాడు రానా. రానానే స్వయంగా చేస్తానంటే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్ లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ- సుల్తాన్
-
బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా
-
బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా
సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరికెక్కిన సినిమా సుల్తాన్. సల్మాన్ మల్లయోధుడిగా కనిపించిన ఈ సినిమా మరోసారి సల్మాన్ స్టామినాను ప్రూవ్ చేస్తూ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కండల వీరుడు ఈ సినిమాతో మరోసారి ఈద్ బరిలో తనకు తిరగులేదని నిరూపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తున్న సుల్తాన్, సల్మాన్ కెరీర్లోనే నెంబర్ వన్‌గా నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే 105 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సుల్తాన్, ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి 150 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంగ్ వీకెండ్‌తో పాటు మరో స్టార్ హీరో బరిలో లేకపోవటం కూడా సల్మాన్‌కు కలిసొచ్చింది. సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది. -
షారూఖ్ సినిమాకు మరో హీరో అడ్డు
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ రిలీజ్‌పై డైలామా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సినిమాను రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో సల్మాన్ సుల్తాన్ రిలీజ్ ఉండటంతో షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రాయిస్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్ కూడా షారూఖ్‌కు వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అదే రోజు అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న బాద్షాహోతో పాటు హృతిక్ లీడ్ రోల్లో రూపొందుతున్న కాబిల్ చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అజయ్ దేవగన్‌తో మాట్లాడిన రాయిస్ నిర్మాతలు పోటీనుంచి బాద్షాహోను తప్పించారు. కానీ కాబిల్ నిర్మాతలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన రాయిస్‌ను మరోసారి వాయిదా వేయడానికి షారూఖ్ టీం కూడా సిద్ధంగా లేదు. దీంతో మరోసారి షారూఖ్ స్వయంగా కాబిల్ టీంతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నాడట. సల్మాన్ కోసం డేట్ త్యాగం చేసిన షారూఖ్‌కి హృతిక్ సాయం చేస్తాడో.. లేదో..? -
సుల్తాన్ సూపర్ హిట్ : బాలీవుడ్ ప్రముఖులు
సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోపిక్ సుల్తాన్. హరియాణాకు చెందిన ఓ రెజ్లర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా నేడు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు సల్మాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింతగా హైప్ క్రియేట్ చేసుకున్న సుల్తాన్.., భారీ ఓపెనింగ్స్‌తో సత్తా చాటుతోంది. సుల్తాన్ సినిమాను వీక్షించిన బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కరణ్ జోహార్, అనుపమ్ ఖేర్, సుభాష్ ఘాయ్ లాంటి సెలబ్రిటీలు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ ప్రకటించేశారు. మంగళవారం బాలీవుడ్ ప్రముఖుల కోసం యష్ రాజ్ స్టూడియోస్‌లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు. డైసీషా, నిఖిల్ ద్వివేది, డేవిడ్ ధావన్, సిద్దార్ధ్ రాయ్ కపూర్, సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ లులియాలతో పాటు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీ వచ్చారు. Saw #Sultan ...it's going to be the HUGEST BLOCKBUSTER till date...no question about it....an unbelievable mainstream experience!!!!!!! — Karan Johar (@karanjohar) 5 July 2016 SULTAN is TERRIFIC. In every department. Another heartfelt & superb performance by @BeingSalmanKhan. @AnushkaSharma rocks. BLOCKBUSTER.:) — Anupam Kher (@AnupamPkher) 6 July 2016 Watched sultan last night@BeingSalmanKhan@aliabbaszafar will Break all time records-a super mainstream cinema with grt performances n story — Subhash Ghai (@SubhashGhai1) 6 July 2016 Loved Loved Sultan- a @BeingSalmanKhan show all the way. He is phenomenal and so is @AnushkaSharma. Congrats @aliabbaszafar & team @yrf — Riteish Deshmukh (@Riteishd) 5 July 2016 -
సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!
బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో లీకైపోతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ఇటీవల బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉడ్తా పంజాబ్ రిలీజ్‌కు ముందే నెట్లో దర్శనమిచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోకముందే, వివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ కూడా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో వచ్చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్లలో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్ సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ సినిమాను డౌన్ లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. -
సల్మాన్‌ని సవాల్ చేస్తున్న మేనల్లుడు
చాలా రోజులుగా సుల్తాన్ సినిమా భారీ షెడ్యూల్స్‌తో బిజీగా గడిపేసిన బాలీవుడ్ కండలవీరుడు ఇప్పుడు ఫ్యామిలీకి టైం ఇచ్చాడు. ముఖ్యంగా తన చెల్లెలు అర్పిత కొడుకు అహిల్‌తో కలిసి సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ మామ అల్లుళ్ల ఆటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తన తాజా చిత్రం సుల్తాన్ లో మల్లయోధుడిగా కనిపిస్తున్న సల్మాన్ తన మేనల్లుడితో బాక్సింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చిన్నారి అహిల్ కూడా మామను సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుండటంతో అభిమానులు మామకు తగ్గ అల్లుడంటూ తెగ పొగిడేస్తున్నారు. సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించిన సుల్తాన్ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమించిన సల్మాన్ తరువాత చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సల్మాన్, ఫ్యామిలీ కలిసి ఆనందంగా సమయం గడిపేస్తున్నాడు. Awwwdorable! Watch baby Ahil bonding with his Mamu #SalmanKhan and learning #Sultan moves! pic.twitter.com/9V6GSnTbuI — Salman Khan Fan Club (@BSKFanClub) 4 July 2016 -
'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు?
ముంబై: 'సుల్తాన్' గత రికార్డులను బ్రేక్ చేయనున్నాడా. బాక్సాఫీస్ లో కొత్త రికార్డు నెలకొల్పనున్నాడా. బుధవారం ఒక్కరోజే 150 కోట్లు కలెక్షన్లు సాధించనున్నాడా. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్' బుధవారం విడుదలవుతున్న నేపథ్యంలో ట్రేడ్ ఎనలిస్టులు బాక్సాఫీస్ కలెక్షన్లు అంచనా వేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. రంజాన్ కానుకగా రేపు విడుదలవుతున్న 'సుల్తాన్' మొదటి వారం కలెక్షన్లు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రూ. 160 కోట్లు ఉంటాయని ట్రేడ్ ఎక్స్‌ఫర్ట్ అముల్ మోహన్ అంచనా వేశారు. సల్మాన్ ఖాన్, యశ్ రాజ్ ఫిలిమ్స్, రంజాన్ రోజున విడుదల ఈ మూడు సమీకరణాల నేపథ్యంలో 'సుల్తాన్'కు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశముందని మరో ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు రెట్టింపవుతూ వచ్చాయని గుర్తు చేశారు. దీంతో 'సుల్తాన్'పై అంచనాలు భారీగా ఉన్నాయని వివరించారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. 'సుల్తాన్'కు జోడిగా అనుష్క శర్మ నటించింది. -
'రేప్' వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇచ్చినా..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్త కాదు. బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ సూపర్ స్టార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రేప్ గురైన మహిళగా తనను తాను పోల్చుకుంటూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బజరంగీ భాయ్ జాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ తండ్రి సలీంఖాన్ కొడుకు తరఫున క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నాలుక కరుచుకున్నారు. ఆలి అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో మల్లయుద్ధం క్రీడ నేపథ్యంతో సల్మాన్ 'సుల్తాన్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తన ఒళ్లు హూనం అయ్యేదని, షూటింగ్ ముగిసేసరికి తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా మారేదని సల్మాన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పేర్కొన్నాడు. 'దాదాపు ఆరు గంటలపాటు కొనసాగే షూటింగ్ సందర్భంగా మైదానంలో ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ప్రత్యర్థి నటుడిని ఎత్తి కిందపడేయాల్సి వచ్చేది. ఒక వ్యక్తిని ఎత్తాల్సి ఉంటే.. పదికోణాల్లో చూపించేందుకు అతన్ని పదిసార్లు ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇదెంతో కష్టంగా అనిపించేది. ఎన్నోసార్లు మైదానం నుంచి నన్ను ఎత్తి బయటకు పడేశారు. నిజమైన రింగ్ లో ఇలా రిపీటెడ్ యాక్షన్స్ ఉండవు. షూటింగ్ అయిపోయాక రింగ్ నుంచి బయటకు వస్తుంటే నా పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉండేది. కనీసం నిటారుగా నడవటానికి కూడా వీలుపడేది కాదు' అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై విలేకరులు గట్టిగా అడగటంతో సల్మాన్ వెంటనే నాలుక కరుచుకున్నాడు. తాను అలాంటి పోలిక చేయాల్సింది కాదని అదే విలేకరుల సమావేశంలో సల్మాన్ వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన వివరణ అంతగా ఫోకస్ కాలేదు. సల్మాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ లలితా కుమారమంగళం డిమాండ్ చేశారు. -
సుల్తాన్‌గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి
సరైనోడు సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తున్న అల్లు అర్జున్, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా అంగీకరించని బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే కశ్మీర్ ట్రిప్ ముగించుకొని టర్కీ చేరిన బన్నీ దంపతులు అక్కడి పర్యాటక ప్రదేశాల్లో సందడి చేస్తున్నారు. ఈ ట్రిప్‌లో భాగంగా ప్రసిద్ధ బ్లూ మాస్క్యూను సందర్శించిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అక్కడి రాజ కుటుంబీకుల దుస్తులు ధరించి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్నేహ సుల్తాన్, సుల్తానా అంటూ కామెంట్ చేసింది. ఆసక్తికరంగా కనిపిస్తున్న బన్నీ లుక్ ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిక్‌గా మారింది. -
పూర్తయిన 'సుల్తాన్' షూటింగ్
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అవుతున్న సుల్తాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలిసారిగా సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో, ఈ ఇద్దరు హరియాణాకు చెందిన రెజలర్లుగా నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగా, తాజాగా బుడాపెస్ట్‌లో తీసిన షూటింగ్ పార్ట్‌తో సినిమా పూర్తయ్యింది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ అనుష్క శర్మ యూనిట్ సభ్యులతో కలిసి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముందు నుంచి చెపుతున్నట్టుగా 2016 ఈద్‌కు సుల్తాన్ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. And this my friends is a FILM WRAP on #Sultan !! To everyone on this film .. Thank you for the memories and the growth -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సుల్తాన్ : అఫీషియల్ ట్రైలర్ నిడివి : 3 ని. 18 సె. హిట్స్ : 1,01,98,529 నాలుగు రోజుల క్రితమే సుల్తాన్ కొత్త ట్రైలర్ విడుదలైంది. పాత ట్రైలర్లో సల్మాన్ కుస్తీ ఒకటే కనిపిస్తుంది. ఈ ట్రైలర్లో అనుష్క కుస్తీ స్పెషల్ ఎట్రాక్షన్. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న సుల్తాన్.. ఒక స్పోర్ట్స్ డ్రామా. కొంత రొమాన్స్ కూడా ఉంది. సల్మాన్‌ఖాన్, అనుష్క ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం విడుదల జూలై 6. అర్తూర్ జురావ్స్కీ సినిమాటోగ్రఫీతో కనువిందు చేయనున్న సుల్తాన్ కథ ఒక వస్తాదు జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆ జీవితంలో గెలుపు ఓటములతో పాటు వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు ఉంటాయి. వాటి నుంచి ప్రేక్షకులు తేరుకోడానికి చక్కటి లవ్‌స్టోరీ సమాంతరంగా నడుస్తుంటుంది. ఇందులోని ప్రణయ సన్నివేశాలు ఇంతవరకు ఏ సినిమాలోనూ లేనివిధంగా భిన్నంగా, ఉద్వేగభ రితంగా ఉంటాయని నిర్మాత ఆదిత్య చోప్రా ప్రకటించారు. స్టుపిడ్ హ్యూమన్ గమ్ ట్రిక్ నిడివి : 1.53 హిట్స్ : 18,94,063 డేవిడ్ లెటర్‌మ్యాన్ అమెరికన్ టెలివిజన్ వ్యాఖ్యాత. రేడియో హోస్ట్, కమెడియన్, రచయిత, నిర్మాత, నటుడు. ఆయన లేట్‌నైట్ షోలు, లేట్ షోలు ప్రపంచ ప్రసిద్ధి. ఇరవై ఏళ్ల క్రితం ‘50 గ్రేటెస్ట్ టీవీస్టార్ ఆఫ్ ఆల్‌టైమ్’లో లెటర్‌మ్యాన్ 45 ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడాయన వయసు 69 ఏళ్లు. షోలు చాలా అరుదుగా మాత్రమే చేస్తున్నారు. లేటెస్టుగా ఓ అమ్మాయి తన చూయింగ్ గమ్ చాతుర్యంతో ఆయన్ని ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. ఆ వీడియో రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్లోడ్ అయింది. స్టేజి మీద లెటర్‌మ్యాన్, ఆ అమ్మాయి ఉంటారు. ఆమె చూయింగ్ గమ్ నమిలి బయటి కి ఊస్తుంది. ఆలా ఊసి, వెంటనే దానిని నోట్లోకి తెప్పించుకుంటుంది! చూడ్డానికి ఎంతో వింతగా ఉన్న ఈ విద్యను ఆమె ఎలా అభ్యసించింది? ఈ ప్రశ్నకు ఆమె నవ్వే సమాధానం. వీడియో చూడండి. క్లోజప్‌లో చూడండి. ట్రిక్ తెలుస్తుందేమో ట్రై చెయ్యండి. ఆమె తల వెంట్రుకల్లోకి కంటికి కనిపించని దారం లాంటిదేదో ఎటాచ్ అయి ఉందని, దాంతో ఆమె ఆ చూయింగ్ గమ్‌ను మళ్లీ వెనక్కి లాగగలుగుతున్నారని ఓ లాజిక్. -
యూట్యూబ్‌లో సుల్తాన్ సెన్సేషన్
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా సుల్తాన్. హరియాణాకు చెందిన ప్రముఖ రెజ్లర్ సుల్తాన్ అలీఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనుష్క శర్మ సుల్తాన్ ప్రేయసి ఆర్ఫా పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె కూడా రెజ్లర్‌గా కనిపించేందుకు ఎంతో కష్టపడి మల్లయుద్ధం నేర్చుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుల్తాన్ అఫీషియల్ టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. యష్ రాజ్ ఫిలింస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్, రిలీజ్ అయిన గంటల వ్యవథిలో 14 లక్షలకు పైగా వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. ప్రేమ్ రతన్ ధన్ పాయో తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క!
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్లాస్టిక్ సర్జరీ విషయంపై మరోసారి సీరియస్ అయింది. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని, ఇక ఈ విషయంపై వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని అందరికీ వార్నింగ్ ఇచ్చింది. తాను అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా బయటకు చెప్పే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సుల్తాన్ మూవీ షూటింగ్ తో ఆమె బిజీబిజీగా ఉంటోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. అయితే 'బాంబే వెల్వేట్' మూవీ సమయంలో తలెత్తిన వివాదం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఫ్యాన్స్ కు నిజాన్ని చెప్పాలని భావించానని అందుకే ఈ విషయంపై మాట్లాడుతున్నట్లు పేర్కొంది. 'అందరిలాగే నేను మనిషినే. నాలో కొన్ని లోపాలుంటాయి. ఎప్పుడూ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నా పెదవులపై కత్తికి పని పెట్టించ లేదు' అంటూ వివరణ అనుష్క అంటోంది. బాంబే వెల్వేట్ మూవీ కోసం పెదవులకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారైందని కథనాలు వచ్చాయి. అయితే మొదట్లో తనకు మేకప్ గురించి అంతగా అవగాహన లేదని, ఆ తర్వాత తాను ఈ విషయంలో ఎంతో మెరుగయ్యానని చెప్పింది. ఆ మూవీ సమయంలో తాను వాడే మేకప్ కిట్ తో పాటు అందంగా కనిపించడం కోసం ఎన్నో కిటుకులు నేర్చుకున్నానని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై అంతగా స్పష్టతలేని వాళ్లు, అనవసరంగా లేనిపోని వార్తలు ప్రచారం చేశారని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. -
చల్నేదో గాడి!
అవుట్డోర్ షూటింగ్స్‌లో పాల్గొనే కథానాయికలు షాట్ షాట్‌కి మధ్య ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఎండ, ఉక్కపోతకు తట్టుకోలేక కార్వాన్ ఎక్కేసి విశ్రాంతి తీసుకుంటుంటారు. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ మాత్రం నో రెస్ట్ అంటారు. షాట్ గ్యాప్‌లో ఏదో ఒకటి చేస్తుంటారు. ఇటీవల ఏకంగా ట్రాక్టర్ నడిపేశారు. ఆ విషయంలోకి వస్తే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మల్ల యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ పంజాబ్‌లో జరుగుతోంది. ఈ లొకేషన్లోనే అనుష్క ట్రాక్టర్ నడిపారు. ఈవిడగారు ఎంతో నైపుణ్యంగా ట్రాక్టర్ నడిపిన విధానం చూసి, చిత్రబృందం ఆశ్చర్యపోయారు. ఇంతకీ లొకేషన్లోకి ట్రాక్టర్ ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా? ఈ సినిమాలో అనుష్క ట్రాక్టర్ నడిపే సీన్ ఒకటుంది. సీన్ తీస్తున్నప్పుడు ట్రాక్టర్ నడిపిన అనుష్కకు ఈ రైడ్ చాలా నచ్చిందట. అందుకే షాట్ గ్యాప్‌లో కూడా స్టీరింగ్ తిప్పారు. -
'సుల్తాన్'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్!
బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. అదే ఆ ఇద్దరు సూపర్స్టార్లు ఒకేసారి తమ సినిమాల్ని విడుదల చేస్తే.. ఆ పోటీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. అభిమానుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. అలాంటి అతిపెద్ద పోరు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ఏడాది దీపావళి పండుగ సమయంలో షారుఖ్ 'రాయిస్', సల్మాన్ 'సుల్తాన్' ఒకేసారి వస్తాయని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఖరారు చేశారు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని భావించిన ఓ పోటాపోటీ నుంచి షారుఖ్ అనూహ్యంగా తప్పుకున్నాడు. షారుఖ్ 'రాయిస్'ను వచ్చే ఏడాది విడుదల చేస్తామని తాజా చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఎందుకిలా.. కారణమేమిటి? భారీ అంచనాలు రేకెత్తిన బాక్సాఫీసు మహాపోరు నుంచి షారుఖ్ ఎందుకు తప్పుకున్నాడంటే.. అందుకే ఆయన తాజా చిత్రం 'ఫ్యాన్' ఘోర పరాభవమే కారణమని వినిపిస్తోంది. నిజానికి బాక్సాఫీసు పోరు నుంచి ఆయన గతంలో ఎప్పుడు తప్పుకొని పారిపోలేదు. 2009లో ఓం శాంతి ఓ వర్సెస్ సావరియా, 2012లో జబ్ తక్ హై జాన్ వర్సెస్ సన్ ఆఫ్ సర్దార్, 2015లో బాజీరావు మస్తానీ వర్సెస్ దిల్వాలే వంటి హోరాహోరీ పోరులోనూ షారుఖ్ విజేతగా నిలిచాడు. నిజానికి 2015 ఆగస్టులో ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయని తెలిసినప్పుడు షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పండుగ సందర్భంగా ఎవరి సినిమాలు వారు విడుదల చేస్తారని, ఇందులో భయపడాల్సిందేమీ లేదని, నిజానికి తమ సినిమా పండుగ సందర్భంలో విడుదల చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ తో పోటీకి భయపడే ప్రసక్తే లేదని పరోక్షంగా కుండబద్దలు కొట్టాడు. కానీ 'ఫ్యాన్' ఘోర పరాభవం 'రాయిస్' సినిమా విషయంలో షారుఖ్ బిగ్ యూటర్న్ తీసుకున్నాడు. భారీ అంచనాలతో విడుదలై, మంచి రివ్యూలు తెచ్చుకున్నా.. 'ఫ్యాన్' సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరలేకపోయింది. 'ఫ్యాన్' చేదు ఫలితం ప్రభావమే 'రాయిస్' చిత్ర తేదీని మార్చేలా షారుఖ్‌ను, చిత్ర నిర్మాతలను పూరికొల్పి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను పండుగ రేసు నుంచి తప్పించి 2017 జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించామని 'రాయిస్' నిర్మాతలు రితేశ్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్, హీరో షారుఖ్ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. -
సెట్లో కుప్పకూలిన ప్రముఖ హీరో!
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ కథనాయకుడు రణదీప్ హుడా 'సుల్తాన్' షూటింగ్ సెట్లో కుప్పకూలాడు. ఆదివారం 'సుల్తాన్' సినిమా షూటింగ్ జరుగుతుండగా అతనికి ఒక్కసారిగా తీవ్రమైన అపెండిసిటిస్ అటాక్ వచ్చింది. దీంతో బాధతో విలవిలలాడుతూ అతను పడిపోయాడు. రణ్‌దీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో సోమవారం ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రెజ్లింగ్ ఇతివృత్తంతో సల్మాన్ ఖాన్ హీరోగా 'సుల్తాన్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'రణ్‌దీప్‌కు తీవ్రమైన నొప్పి వచ్చింది. అయినా వృత్తి నిబద్ధత కలిగిన ఆయన షూటింగ్‌ను పూర్తయ్యేవరకు నొప్పి తట్టుకోగలిగారు. సెట్లో బాధతో పడిపోయిన ఆయనకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు' అని ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ముగిసిన తర్వాత మంగళవారం రణ్‌దీప్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముంది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న రణ్‌దీప్ హుడా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'సుల్తాన్' సినిమాతోపాటు 'సరబ్జిత్', 'లాల్ రంగ్' చిత్రాల్లో ప్రస్తుతం అతను నటిస్తున్నాడు. -
స్టార్ హీరోల సినీ సంగ్రామం!
పెద్ద హీరోల సినిమాలు వస్తుంటే, చిన్న సినిమాలన్నీ పక్కకు తొలగి, దారి ఇవ్వడం రెగ్యులర్‌గా చూసే విషయమే. అలాగే, ఒక పెద్ద హీరో సినిమాకూ, మరో పెద్ద హీరో సినిమాకూ మధ్య కనీసం రెండు వారాలైనా గ్యాప్ ఉండేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటూ ఉంటారు. తద్వారా రెండు సినిమాలకూ కలెక్షన్లలో ఇబ్బంది తగలకుండా జాగ్రత్తపడతారు. కానీ, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజైతే? అదీ హిందీ చిత్రసీమలో... పైగా రంజాన్ పండుగ సీజన్లో అయితే? పరిస్థితి చూస్తుంటే, ఇప్పుడు అదే జరిగేలా ఉంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సుల్తాన్’, షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘రాయీస్’ చిత్రాలు రెండూ ఈ ఏడాది రంజాన్ పండుగ వేళ రిలీజయ్యేందుకు పోటీపడుతున్నాయి. నిజానికి, ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల దగ్గరా పలువురు ప్రస్తావించారు. ఈ పోరాటాన్ని నివారించేందుకు ఏదో ఒక దోవ చూస్తామని ఇద్దరూ అన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ దోవ ఏదో తెలిసినట్లు కనిపించడం లేదు. తాజాగా ‘ఫ్యాన్’ చిత్ర ప్రచారంలో ఉన్న షారుఖ్ దగ్గర మళ్ళీ ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ప్రస్తావన వచ్చింది. ‘‘ఇది పరమ వికారమైన విషయం. ఒక సినిమా వ్యాపారాన్ని మరొక సినిమా తినేసేలా ఒకే రోజు రిలీజ్ చేసే కన్నా, సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మంచిది. రంజాన్‌కు ఇంకా రెండు, మూడు నెలల టైమ్ ఉంది కదా! మేము కూర్చొని, మాట్లాడుకొని, నిర్ణయించుకొని, ఏదో ఒక పరిష్కారం చూస్తాం’’ అని షారుఖ్ అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో రంజాన్ వచ్చిందంటే, సల్మాన్‌ఖాన్ సినిమా ఉండాల్సిందే. గత ఏడాది వచ్చిన ‘బజ్రంగీ భాయీజాన్’ ఎంత హిట్టో తెలిసిందే. కాబట్టి, రంజాన్ సీజన్ సల్మాన్‌దే అని ఫిక్స్ అయితే ఏం చేస్తామన్నారు షారుఖ్. ‘‘నేను ఫలానా ఈ స్టార్ కన్నా ఫలానా ఆ స్టార్ పెద్దవాడని నేను అనడం లేదు. కానీ, ‘సుల్తాన్’ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా సహా ఇతరులూ నా ఫ్రెండ్సే. కాబట్టి, అందరితో మాట్లాడి, సమస్య పరిష్కరించాలనుకుంటున్నా’’ అన్నారు. మొత్తానికి, షారుఖ్ జోక్యంతో ఈ బాలీవుడ్ బాక్సాఫీస్ సంగ్రామం ఆగుతుందని ఆశించవచ్చా? -
ఇండో-చైనీస్ సినిమాలో...
సల్మాన్‌ఖాన్ వచ్చే రంజాన్‌కు ‘సుల్తాన్’ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘సుల్తాన్’ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. అది ఇండో-చైనీస్ చిత్రం కావడం విశేషం. రిలీజ్ డేట్‌తో పక్కాగా ఈ సినిమా గురించి ప్రకటించేశారు కూడా. ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకున్న ‘బజ్రంగీ భాయీజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెర కెక్కించనున్నారు. భారత్ నుంచి చైనా ప్రయాణంలో ఓ యువకునికి ఎదురైన అనుభవాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందనుందట. ఇందులో దీపికా పదుకొనేతో పాటు ఓ చైనీస్ బ్యూటీతో కలసి సల్మాన్‌ఖాన్ రొమాన్స్ చేయనున్నారని సమాచారం. సల్మాన్‌ఖాన్, కబీర్‌ఖాన్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చే యనున్నారు. -
ఖాన్ల మధ్య పోటీ లేనట్టే
బాలీవుడ్ ఇండస్ట్రీలో రంజాన్ సీజన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్లో తలపడినట్టుగా బాలీవుడ్లో రంజాన్ సీజన్లో స్టార్ హీరోలు పోటీ పడతారు. అదే బాటలో ఈ సారి కూడా రసవత్తరమైన పోటీ తప్పదని భావించాయి సినీ వర్గాలు. అయితే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు షారుక్. తన పాత మిత్రుడు సల్మాన్ ఖాన్‌తో ఈ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాడటంతో పోటీ వద్దని పక్కకు తప్పుకున్నాడు. ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమా తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా సుల్తాన్. గత సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో సుల్తాన్ సినిమాను ఎలాగైన హిట్ చేయాలన్న కసితో సినిమా చేస్తున్నాడు కండలవీరుడు. ఇక షారూక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దిల్ వాలే సినిమాతో అభిమానులను నిరాశపరిచిన షారుక్, రాయిస్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. దీంతో తాజా చిత్రాలు ఇద్దరు ఖాన్లకు కీలకం కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రారంభమైన సమయంలో ఈద్‌కే రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించేశారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే బాజీరావ్ మస్తానీతో పోటీ పడి నష్టపోయిన షారుక్ ఖాన్ మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడు. అందుకే తానే ఓ అడుగు వెనక్కు వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న సమయానికన్నా రెండు వారాలు ఆలస్యంగా రాయిస్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. -
ఆందోళన చెందుతున్న స్టార్ హీరో!
ముంబై: దేశంలో సినిమా థియేటర్ల పరిస్థితిపై బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఆందోళన చెందుతున్నాడు. భారత్ లో సినిమా థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయని వీటి సంఖ్యలో భారీ మార్పులు రావాలని అభిప్రాయపడ్డాడు సల్మాన్. నగర శివార్లలో మరిన్ని సినిమా హాల్స్ ఉంటే బాగుంటుందని, 10 వేల థియేటర్లు కావాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీ అబ్బాస్ జహీర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సుల్తాన్' మూవీ షూటింగ్ తో సల్లూబాయ్ బిజీబిజీగా ఉంటున్నాడు. నగరాల మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటి అంశాల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక శివారు ప్రాంతాల్లో వీటి నిర్మాణం చేపట్టడం మంచిదంటూ సలహా ఇచ్చాడు. చాలా నగరాలలో చిన్న చిన్న ప్రాంతాలలో హాల్స్ లేవని తెలిపాడు. టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'క్షణం'. ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుని సల్మాన్ ను ఇందులో హీరోగా తీసుకోవాలని ఓ నిర్మాత భావిస్తున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. -
ఆరు వారాలు... అద్భుతమైన ట్రైనింగ్!
‘‘పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. నటిగా నేను సిగ్గుపడకూడదు. అందుకే సవాల్ అనిపించే పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు’’ అని అనుష్కా శర్మ అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఓ శక్తిమంతమైన పాత్రకు పచ్చజెండా ఊపేశారు. అది అలాంటి, ఇలాంటి పాత్ర కాదు. మల్లయుద్ధం చేయడానికి వెనకాడని పాత్ర. ‘సుల్తాన్’ చిత్రం కోసమే అనుష్కా శర్మ ఈ యుద్ధం చేయనున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మల్లయుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ కొన్ని నెలల పాటు మల్లయుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్నారు. అనుష్కా శర్మ కూడా సినిమాలో మల్లయుద్ధం చేస్తారు కాబట్టి, శిక్షణ తీసుకున్నారు. ఆరు వారాల పాటు పలువురు ట్రైనర్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. ‘‘మల్లయుద్ధం నేర్పించిన నా గురువులందరికీ ధన్యవాదాలు. గొప్ప గురువులు దొరకడం నా అదృష్టం’’ అంటూ తనకు రెజ్లింగ్ నేర్పించిన టీచర్స్‌తో కలిసి ఫొటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు అనుష్కా శర్మ. ఈ బ్యూటీ శిక్షణ తీసుకుంటున్న సమయంలో చూసినవాళ్లు, భేష్ అంటున్నారు. కఠినంగా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేర్చుకున్నారట. మరి.. అనుష్కా? మజాకానా? -
రెజ్లింగ్ ట్రైనింగ్ లో టాప్ హీరోయిన్
ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్, మిల్కీ గర్ల్ అనుష్క శర్మ తొలిసారి జతకట్టిన మూవీ 'సుల్తాన్'. ఎంతో హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత ఆఖరికి సల్మాన్ పక్కన కథానాయికగా ముద్దుగుమ్మ అనుష్క ఎంపికైంది. అయితే ఈ మూవీలో హీరో,హీరోయిన్ రెజ్లర్లుగా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఆరు వారాల పాటు రెజ్లింగ్ గురించి కోచింగ్ తీసుకోనుంది. హాయిగా ఏసీ రూముల్లో ఉండే ఈ భామ సినిమా కష్టాలు నిజంగానే అనుభవించనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న 'సుల్తాన్' మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో తనపాత్రకు మరింత న్యాయం చేయాలని ఈ భామ తపిస్తున్నందుకు దర్శకుడు చాలా ఇంప్రెస్ అయిపోయారట. నిజమైన రెజ్లర్ గా కనిపించేందుకు శరీరాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుంటున్నందుకు ఆశ్చర్యానికి లోనైనట్లు జాఫర్ వివరించారు. ప్రేమికులరోజు సందర్భంగా సల్మాన్, అనుష్కలు జంటగా ఉన్న సుల్తాన్ 'ఫస్ట్ లుక్'ను యూనిట్ విడుదల చేసింది. ప్రజల చేత 'హర్యానా కా షేర్' అనిపించుకునే సుల్తాన్.. 'హర్యానా కీ షాన్'గా గుర్తింపు ఉన్న ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రొఫెషనల్ క్రీడాకారుల మధ్య జరిగే ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందంటూ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఈ మూవీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. గతంలో ప్రియాంక చోప్రా 'మేరీకోమ్' మూవీ కోసం ఎంతగానో శ్రమించింది, గాయాలపాలైంది. ఆ మూవీ సక్సెస్ అందుకుంది. -
'సుల్తాన్ జోడీ' చూడు గురూ..
సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు తొలిసారి జతకట్టనున్న సినిమా 'సుల్తాన్'. చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత సల్మాన్ పక్కన కథానాయికగా అనుష్క ఎంపికైన విషయం తెలిసిందే. అప్పటినుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. ప్రేమికులరోజు సందర్భంగా సల్మాన్, అనుష్కలు జంటగా ఉన్న సుల్తాన్ 'ఫస్ట్ లుక్'ను యూనిట్ విడుదల చేసింది. సరికొత్త జోడీగా సల్మాన్, అనుష్కలు హల్ చల్ చేస్తున్నారు. క్రీడా నేపథ్యంతోపాటు ఈ సినిమాలో ఓ అందమైన ప్రేమకథ కూడా ప్రేక్షకులను అలరించనుంది. ప్రజల చేత 'హర్యానా కా షేర్' అనిపించుకునే సుల్తాన్.. 'హర్యానా కీ షాన్'గా వెలిగిపోయే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రొఫెషనల్ క్రీడాకారుల మధ్య జరిగే ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు సినిమా యూనిట్. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం 2016లో భారీ ప్రాజెక్టుల లిస్ట్‌లో చేరడం ఖాయం అంటున్నారు. -
ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం...
‘‘ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం ఇంతలా బిల్డప్ ఇవ్వాలా? అతనికి కూడా హోమ్ బేనర్ ఉంది కదా? మరి, నిర్మాతల కష్టం తెలియదా?’’ అని సల్మాన్ ఖాన్ గురించి నిర్మాత ఆదిత్యా చోప్రా, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తమ సన్నిహితుల దగ్గర చెప్పి, వాపోతున్నారట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకీ సల్మాన్ విషయంలో దర్శక-నిర్మాతలు ఎందుకు ఫీలవుతున్నారనే విషయానికి వస్తే... చెప్పిన సమయానికి షూటింగ్‌కి హాజరు కావడంలేదట. ఒక రోజైతే చిత్రీకరణకు అంతా సిద్ధం చేసుకుని, ఇక సల్మాన్ రాగానే మొదలుపెడదామని అందరూ ఎదురు చూస్తుండగా, ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘ఈరోజు నేను షూటింగ్‌కి రావడం లేదు. క్యాన్సిల్ చేసేయండి’ అని అవతలివైపు నుంచి సల్మాన్ నిర్మొహమాటంగా చెప్పారట. అప్పుడెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రం విషయంలో సల్మాన్ ఏమాత్రం సహకరించడంలేదని టాక్. స్టార్ హీరో కాబట్టి, ఏమీ అనలేక దర్శక-నిర్మాతలు లోలోపల మదనపడిపోతున్నారట. -
సుల్తాన్‌బజార్‌లో కార్డాన్ సెర్చ్
-
బంపర్ ఆఫర్!
బాలీవుడ్ కథానాయిక అనుష్కా శర్మ ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రస్తుతం కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న అనుష్క ఓ క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్నారు. ‘రబ్ నే బనాదే జోడీ’తో యశ్‌రాజ్ సంస్థ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ అందాల తార మళ్లీ ఇదే సంస్థ నిర్మిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు జోడీగా నటించే చాన్స్ దక్కించుకున్నారు. ఈ చిత్ర కథాంశం ఓ రెజ్లర్ చుట్టూ సాగుతుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. మొదట్లో దీపికా పదుకొనే, కంగనా రనౌత్, కృతీసనన్, పరిణీతి చోప్రా లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరికు అనుష్కా శర్మ వైపు మొగ్గు చూపారు దర్శక-నిర్మాతలు. ‘రబ్ నే బనాదే జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే’ చిత్రాల్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌లతో ఆన్ స్క్రీన్‌లో మంచి కెమిస్ట్రీ పండించిన అనుష్క, మరి సల్మాన్‌కి కూడా సరిజోడీ అనిపించుకుంటారా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. -
'సల్మాన్ తో నటించడం లేదు'
ముంబై: తనపై వచ్చిన పుకార్లను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొట్టిపారేసింది. అలీ అబ్బాస్ జాఫార్ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సుల్తాన్'లో సల్మాన్‌ఖాన్‌కు జోడీగా పరిణీతి జతకట్టినట్లు వదంతులు వినిపించాయి. అయితే, తాను ఆ మూవీలో నటించడంలేదని ఆదివారం తన ట్విట్టర్ లో పరిణీతి పోస్ట్ చేసి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టేసింది. తన నెక్స్ట్ మూవీ వివరాలను త్వరలో వెల్లడిస్తానంటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. 'లేడీ వర్సెస్ రికీ బహల్’ తో 2011లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతీ చోప్రా ‘ఇష్క్‌జాదే’ , ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ మొదలైన సినిమాలలో హీరోయిన్గా తన ప్రతిభ చాటుకున్నారు. ఈ అమ్మడు చివరగా గతేడాది విడుదలైన 'కిల్ దిల్'లో తెరపై కనిపించింది. కండల వీరుడు సల్మాన్ 'సుల్తాన్' మూవీలో మల్లయోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ ఈ మూవీకి హీరోయిన్ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. Guys, I am not doing Sultan, please put all rumours and speculations to rest and let me announce my next film when the time is right. — Parineeti Chopra (@ParineetiChopra) December 6, 2015 -
'ఈ గౌరవం పొందటానికి చాలా ఏళ్లు పట్టింది'
ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సల్లూభాయ్, ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించేస్తున్నాడు. తాజాగా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సల్మాన్, తన హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడాడు. 'హాలీవుడ్లో నటులు చాలా కష్టపడి సినిమా చేస్తారు. మన దగ్గర సక్సెస్ అవ్వడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి, అక్కడ ఈ స్థాయి గౌరవం పొందడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంత సక్సెస్, మర్యాద ఉన్నప్పుడు హాలీవుడ్‌కు వెళ్లాల్సిన పని ఏంటి..? ఇక్కడ ఈ స్థాయిని సాధించడానికి చాలా ఏళ్లు కష్టపడ్డాం.. మళ్లీ అక్కడ కూడా కష్టపడటం ఎందుకు..?' అంటూ తనకు హాలీవుడ్ వెళ్లే ఉద్దేశం లేదని తేల్చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ కొత్త సినిమా తొలి వారంలోనే 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం సుల్తాన్ సినిమాలో నటిస్తున్న కండల వీరుడు, ఆ సినిమాలో మరింత భారీ ఖాయంతో కనిపించటం కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసినిమాను 2016 రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
కఠినమైన కసరత్తులు దేనికోసం?
పాత్రల కోసం శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడని హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అవసరమైతే సన్నబడతారు.. బరువు పెరుగుతారు. ప్రస్తుతం మాత్రం సల్మాన్ పెరిగే పని మీద ఉన్నారు. ‘సుల్తాన్’లో చేయనున్న మల్లయోధుడి పాత్ర కోసమే ఇలా చేస్తున్నారు. దాదాపు పదిహేను కిలోలు పెరిగితే బాగుంటుందని చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అన్నారట. ‘‘అదెంత పని’’ అంటూ సల్మాన్ కసరత్తులు మొదలుపెట్టేశారు. మామూలుగా బరువు పెరగాలంటే ఇష్టం వచ్చినట్లు తింటే సరిపోతుంది. కానీ, సల్మాన్‌కు అలా పెరగడం ఇష్టం లేదు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుందని భావించిన ఆయన బాడీని పెంచే వర్కవుట్స్ మొదలుపెట్టారు. ప్రతి రోజూ సుమారు నాలుగు గంటల పాటు పర్సనల్ ట్రైనర్ రాకేశ్ ఆధ్వర్యంలో సల్మాన్ కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. దాంతో పాటు ప్రొటీన్ డైట్ తీసుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ‘దంగల్’లో మల్లయోధుడిగా నటిస్తున్న ఆమిర్‌ఖాన్ కూడా రాకేశ్ సహాయంతోనే బరువు పెరిగారు. మరి.. ఈ ఇద్దరు మల్లయోధుల్లో ఎవరు ‘బెస్ట్’ అనిపించుకుంటారో తెలియాలంటే ‘దంగల్’, ‘సుల్తాన్’ విడుదల వరకూ ఆగాల్సిందే. -
సల్మాన్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవల బజరంగీ బాయ్‌జాన్ సినిమాతో సత్తా చాటిన సల్మాన్ త్వరలో ఓ యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు. సుల్తాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచొప్రా నిర్మిస్తున్నాడు. సల్మాన్ రెజలర్ గా నటిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టొవల్ ఫైట్ సీక్వన్స్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ పూర్తి చేసిన సల్మాన్, ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. విశాల్ - శేఖర్లు సాంగ్స్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 2016 ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్న యూనిట్ పక్కాప్లానింగ్‌తో సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంత వరకు హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ఈద్ బరిలో తన సినిమాను కూడా ప్లాన్ చేస్తున్న షారూఖ్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు సల్మాన్. -
వాళ్లడిగితే నేను కాదంటానా?
‘‘మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందంటారు. నేను దీన్నే కొంచెం రివర్స్ చేసి చెబుతా. ఒక సినిమా ఎవరికి దక్కాలని రాసి పెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుంది’’ అని కృతీ సనన్ అంటున్నారు. ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతీ సనన్ ‘హీరో పంతి’తో బాలీవుడ్లో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు, మూడు సినిమాలు చేస్తూ కృతి బిజీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ సరసన ‘సుల్తాన్’లో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించిందనే వార్త హల్చల్ చేస్తోంది. కథానాయిక అయిన ఏడాదికే సల్మాన్‌తో అవకాశం కొట్టేసిందని కొంతమంది తారలు అసూయపడుతున్నారట. కానీ, ఏమీ లేని విషయానికి అనవసరంగా అసూయపడుతున్నారని కృతి అంటున్నారు. అసలు ‘సుల్తాన్’ చిత్రానికి ఆమెను అడగలేదట. ఒకవేళ అడిగితే నేనెందుకు కాదంటాను? అంటున్నారామె. సల్మాన్‌తో సినిమా కాబట్టి, వెంటనే ఒప్పేసుకుంటా అని పేర్కొన్నారు కృతీ సనన్. -
మా స్నేహానికిఢోకా లేదు!
కొన్నేళ్ల వరకూ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేది. కానీ కాలం మారింది. వారిద్దరి మధ్య ఉన్న వైరం కాస్త స్నేహంగా గుబాళించింది. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం వీరిద్దరినీ ఏ మాత్రం వదలట్లేదు . ఏదొక విషయంలో వీరిద్దరినీ వార్తల్లోకి లాగుతున్నారు. అసలు విషయం ఏంటంటే...సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘సుల్తాన్’ ను వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే షారుక్ ఖాన్ ఇప్పుడు నటిస్తున్న ‘రాయీస్’ కూడా ఇదే రోజున విడుదల కానుంది. దీని గురించి మీడియాలో పలు వార్తా కథనాలు వచ్చాయి. ‘సుల్తాన్ వెర్సస్ రాయీస్’ అని, ఇద్దరూ ఒకే రోజున ఢీకొంటున్నారని ప్రచారం చేసింది మీడియా. ఈ కథనాలతో విసిగిపోయిన షారుక్ ఇక లాభం లేదనుకుని తనదైన శైలిలో వీటికి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ-‘‘ ఏడాదికి 365 రోజలుంటాయి. ఆ రోజుల్లో ఎవరైనా ఎప్పుడైనా తమ సినిమాలు విడుదల చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లది. ఒక్కో సారి రెండు సినిమాలు ఒకే రోజు అంటే శుక్రవారం వస్తాయి. దాంట్లో నష్టం ఏముంది? ‘రాయీస్’, ‘సుల్తాన్’ ఒకే రోజు అంటే 2016 రంజాన్‌కు విడుదల అవుతున్నాయని, మా రెండు సినిమాలకు క్లాష్ వస్తుందని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎవరి బిజినెస్ వాళ్లది.ఒక వేళ మా రిలీజ్ డేట్లు ఒకటైనా మా ఇద్దరి మధ్య స్నేహానికి ఎటువంటి ఢోకా ఉండదు’’ అని చెప్పుకొచ్చారాయన. -
ఆమె రంగూన్ వెళ్లడం వల్లే...
సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వచ్చింది అనేదానిపై రోజుకో పేరు వినిపించింది. దీపిక పడుకొనె, కంగనా రనౌత్‌ల పేర్లు కాస్త గట్టిగానే వినిపించాయి. డేట్ ఇష్యూ వల్ల తాను ‘సుల్తాన్’లో నటించడం లేదని కంగానా తేల్చేసింది. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’లో కంగనా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యత ‘సుల్తాన్’కు ఇవ్వకపోవడం, పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే దర్శక,నిర్మాతలు వేరే హీరోయిన్ను ఎంచుకోవాల్సి వచ్చిందట. గమనించాల్సిన విషయం ఏమిటంటే, సల్మాన్‌ఖాన్ ‘బజ్రంగి బైజాన్’ సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం వచ్చినా... ఏవో కారణాల వల్ల ఆ సినిమా చేయనంది కంగనా. ‘సుల్తాన్’ సినిమాలో కంగనా కాదు... దీపిక పడుకొనె హీరోయిన్ అనుకునేలోపు ఇప్పుడు కొత్తగా పరిణితి చోప్రా పేరు వినిపిస్తోంది. పెద్దగా హిట్లు లేని చోప్రాకు సల్మాన్ సరసన నటించే అవకాశం రావడం వింతే అంటున్నారు. ‘సుల్తాన్’ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ నుంచే బాలీవుడ్‌లోకి ప్రవేశించింది పరిణితి. పెద్ద ప్రాజెక్ట్‌ల్లో... రేపు షూటింగ్ అనగా కూడా పేర్లు మారుతుంటాయి. చూద్దాం మరి... చోప్రాకు ఎంత అదృష్టం ఉందో! -
సల్మాన్‌కి దీపూ నో చెప్పిందా?!
గాసిప్ సల్మాన్‌తో సినిమా అంటే దాని రేంజే వేరుగా ఉంటుంది. బడ్జెట్ కోట్లలో ఉంటుంది. బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశమూ మెండుగా ఉంటుంది. అందుకే హీరోయిన్లు సల్లూ పక్కన చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటిది దీపికా పదుకొనె సల్మాన్ పక్కన చేయడానికి నో చెప్పిందంటే ఆశ్చర్యం వేయదూ? అలాగే ఆశ్చర్యపోయారంతా. సుల్తాన్, శుద్ధి చిత్రాల్లో సల్మాన్ సరసన దీపిక నటిస్తోందన్న వార్తలు మొదట గుప్పుమన్నాయి. తర్వాత ఆమె నో చెప్పిందన్న వార్తలూ భగ్గుమన్నాయి. నిజానికి ఆ రెండు వార్తలూ తప్పేనట. అసలు దీపిక ఆ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నదీ లేదట. నో చెప్పిందీ లేదట. ప్రపోజల్స్ అయితే వచ్చాయి కానీ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉండటంతో కుదరలేదు, అంతమాత్రాన దీన్ని ఇష్యూ చేయాల్సిన పని లేదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది దీపూ. మరి ఈ రూమర్లు ఎలా పుట్టాయనేగా? ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి స్టేజ్‌మీద డ్యాన్స్ చేశారు. అది చూసిన కొందరు ఈ పుకార్లు పుట్టించారన్నమాట! -
తారస్థాయికి ‘తమ్ముళ్ల’ పంచాయతీ!
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో తెలుగు తమ్ముళ్ల పంచాయతీ తారస్థాయికి చేరింది. టీడీపీలో రెండు వ ర్గాల ఆధిపత్య పోరు వీధిన పడింది. నగరపంచాయతీ చైర్మన్ కంభాలపల్లి భరత్‌కుమార్, వైస్ చైర్మన్ సుల్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో.. ఏకంగా చైర్మన్ కార్యాలయానికే తాళం వేసే వరకు వెళ్లింది. ప్రజా ప్రయోజనాలు కాకుండా.. కేవలం వ్యక్తిగత ప్రయోనాలు, ప్రతిష్టల కోసమే ఇదంతా జరుగుతోందని ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్ల సాక్షిగా.. తమ్ముళ్ల పంచాయతీ వెనక అసలు కథాకమామిషు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదీ జరిగింది.. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయంలోని చైర్మన్ భరత్‌కుమార్ చాంబర్లో ఆయనతో బుధవారం వైఎస్ చైర్మన్ సుల్తాన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శంకర్‌నాయక్‌కు సంబంధించి రూ.15 వేల బిల్లు డ్రా అయిన విషయం చర్చకు వచ్చింది. ఎక్కడా పోయని మట్టికి బిల్లు ఎలా మంజూరు చేస్తారంటూ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా కౌన్సిలర్లు వివరణ కోరారు. ఈ క్రమంలో చైర్మన్ భరత్‌కుమార్ ఓ వైపు, వైస్ చైర్మన్ సుల్తాన్, కొంతమంది కౌన్సిలర్లు మరో వైపు వాదోపవాదాలు, మాటల పంరంపర కొనసాగింది. నగర పంచాయతీలో జరిగే ప్రతీ విషయం కౌన్సిలర్లకు చెప్పాల్సిన పని లేదంటూ చైర్మన్ భరత్‌కుమార్ విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయారు. వెళుతూ..వెళుతూ అక్కడే ఉన్న కుర్చీలను తన్నుకుంటూ వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన వైస్ చైర్మన్ సుల్తాన్.. కౌన్సిలర్ల సమక్షంలోనే చైర్మన్ భరత్‌కుమార్ కార్యాలయానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత రాజేసినట్లయిందని సొంత పార్టీవాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు: భరత్‌కుమార్, నగర పంచాయతీ చైర్మన్ చేయని పనులకు బిల్లులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వైస్ చైర్మన్ సుల్తాన్ బ్లాక్‌మెయిల్‌కు భయపడి అవినీతికి పాల్పడను. నేను దళితుడి అయినందుకే అవమానించే విధంగా నా కార్యాలయానికి తాళం వేశారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడలేదు: సుల్తాన్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం లే కుండా, నగరపంచాయతీ తీర్మానం లేకుండా డ్రా అయిన బిల్లుల విషయంలో మాత్రమే చైర్మన్ భరత్‌కుమార్‌ను ప్రశ్నించాను. ఇదంతా తోటి కౌన్సిలర్ల సమక్షంలోనే జరిగింది. చైర్మన్ గదికి తాళం వేసేందుకు దారితీసిన పరిస్థితిపై విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.